![Kajal Aggarwal Shocking Comments On Bollywood And South Industry - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/kajal_650x400.jpg.webp?itok=hNuo9i56)
హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్.. సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడుతూ.. ''హిందీ పరిశ్రమలో క్రమశిక్షణ, నైతిక విలువలు కనిపించవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నేను పుట్టి పెరిగింది ముంబైలో అయినా నా కెరీర్ ప్రారంభమైంది మాత్రం హైదరాబాద్‌లోనే. మాతృభాష హిందీ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. దీంతో హైదరాబాద్, చెన్నై నగరాలను తన నివాసంగా భావిస్తాను.
సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అక్కడ అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులు ఉన్నారు. బాలీవుడ్‌లో కొన్ని మంచి సినిమాల్లో నటించినప్పటికీ దక్కిణాదిలో ఉన్నట్లు ఫ్రొఫెషనలిజం,నైతిన విలువలు లొపించాయి'' అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఇటీవలె ప్రియాంక చోప్రా సైతం బాలీవుడ్‌లో రాజకీయాలు ఎక్కువ అని, వాళ్లతో విసిగిపోయి అమెరికా వెళ్లిపోయానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై నిప్పులు చెరగడంతో బీటౌన్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment