బాలీవుడ్ సెలబ్రిటీ మ్యానేజ్‌మెంట్ ఏజెన్సీ ‘క్వాన్’ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు అనిర్భన్ బ్లా మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను తన పదవిలో నుంచి తప్పుకోమన్నారు కంపెనీ ప్రతినిధులు. అయితే ఎవరూ ఊహించని విధంగా అనిర్భన్ ఆత్మహత్యా యత్నం చేశారు. ముంబైలోని వర్షి బ్రిడ్జ్ దగ్గర ఈ చర్యకు పాల్పడుతుండగా పోలీసులు కాపాడారు. ఇది జరగక ముందే తన ఆత్మహత్య నోట్‌ను అనిర్భన్ ఓ పత్రికకు పంపారట.
‘‘నేను చేసిన పనులను సమర్థించుకోవడం కాదు. కానీ నా జీవితం మొత్తం మంచి వ్యక్తిగా ఉండే ప్రయత్నం చేశాను. అయితే నా బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల రాక్షసుడిగా మారానేమో. ద్వంద్వ వైఖరితో ప్రవర్తించి ఉండొచ్చు. అందరితో మంచిగా ప్రవర్తించాలని నిరంతరం ప్రయత్నిస్తున్నా నాలోని రాక్షసుడు కొన్నిసార్లు బయటకు వస్తూనే ఉన్నాడు. అతడిని సమాధి చేయాలనే అనుకున్నాను. కానీ కుదర్లేదు. నన్ను తప్ప ఇంకెవర్నీ నిందించలేను. ఆ రాక్షసుడూ నాలోని భాగమే. నేను హర్ట్ చేసినవాళ్లందరికీ ఐయామ్ సారీ. ఇది ప్రతీకార (ఆత్మహత్య) చర్య కాదు. ఇది న్యాయం’’ అన్నది ఆ నోట్ సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment