నానా వేధింపులు | Nana Patekar has a history of assaulting women | Sakshi
Sakshi News home page

నానా వేధింపులు

Published Thu, Sep 27 2018 12:18 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Nana Patekar has a history of assaulting women - Sakshi

తనుశ్రీ దత్తా

లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్‌) ‘‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రీకరణ టైమ్‌లో ఓ నటుడు నన్ను లైంగికంగా వేధించాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నటుడెవరో కాదు.. నానాపటేకర్‌ అంటూ పేరు బయటపెట్టడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. ‘‘నానా పటేకర్‌ గొప్ప నటుడే. కానీ, మహిళల పట్ల అతని ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది.

నటీమణులను తిడతాడు, కొడతాడు. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్‌ కూడా చేయరు. అక్షయ్‌ కుమార్‌ ఎనిమిదేళ్లుగా నానాతో నటిస్తూనే ఉన్నాడు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇటీవల అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లే నానా లాంటి క్రిమినల్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్ని ‘మీ టూ’ ఉద్యమాలు వచ్చినా ఉపయోగం ఉండదు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement