Tanushree Dutta
-
అలాంటి డైరెక్టర్‌తో అవకాశం.. వెంటనే తిరస్కరించా: బాలకృష్ణ హీరోయిన్
ఇటీవల మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక కుదిపేసింది. మాలీవుడ్‌లో నటీమణులపై లైంగిక వేధింపులను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దీంతో పలువురు మహిళా నటీమణులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే గతంలోనూ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్ సైతం వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సైతం మీటూ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తనుశ్రీ మీటూ అంశంపై మరోసారి స్పందించింది. 2018లో తనకు ఓ పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే ఆ మూవీ డైరెక్టర్ మీటూ నిందితుడు కావడంతో వెంటనే ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు తనుశ్రీ పేర్కొంది. గతేడాది కూడా కోల్‌కతాకు చెందిన ఓ దర్శకుడి నుంచి తనకు ఆఫర్ వచ్చిందని నటి తెలిపింది. అదే కారణంతో మళ్లీ తిరస్కరించానట్లు వివరించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ దర్శకుడు తనను ఎంపిక చేశారని భావించినట్లు తనుశ్రీ పేర్కొంది.తనుశ్రీ మాట్లాడుతూ..'అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడు? తన సినిమాలో నేను నటిస్తే.. తన ఇమేజ్‌ని మార్చుకోవాలనుకున్నాడు. నేను ఆ సినిమా చేస్తే మీటూ నిందితుడికి సపోర్ట్ చేస్తున్నట్టే. అందుకే సున్నితంగా తిరస్కరించా. ఇందులో ఓ ఏజెన్సీ ప్రమేయం కూడా ఉంది. నేను సినిమాని వదిలేయాలనుకుంటున్నాను అని వారితోనే చెప్పా. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మా నాన్నను కూడా సంప్రదించా. ఒక నిందితుడితో సినిమా చేయడం నైతికంగా సరైనది కాదని నాన్న సలహా ఇచ్చాడని' తెలిపింది. కాగా.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. -
మా మధ్య కెమిస్ట్రీ లేదు.. అందుకే అంత ఇబ్బంది: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆషికి బనాయా ఆప్నే సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. వీరభద్ర సినిమాతో తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇక్కడ తనకు సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయింది. కానీ మీటూ ఆరోపణలు చేసినందుకుగానూ చేతిలో అవకాశాల్లేక వెండితెరకు దూరమై చాలాకాలమైంది. అయితే తనకు మంచి గుర్తింపునిచ్చిన ఆషికి బనాయా ఆప్నే సినిమా గురించి, అందులోని ముద్దు సన్నివేశం గురించి మాట్లాడిందీ బ్యూటీ. మా మధ్య కెమిస్ట్రీ లేదు ఇమ్రాన్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించాను. చాకొలెట్ మూవీలోనూ మా మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్‌లో తీసేశారు. అయితే ఫస్ట్ టైమ్ అలాంటి సీన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిపడ్డాను. రెండోసారి మరీ అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నిజ జీవితంలో మా మధ్య ఎటువంటి కెమిస్ట్రీ లేదు. అయితే అతడికి అప్పటికే కిస్సర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది. అయినా నాకెందుకో అతడితో అటువంటి సీన్లో నటించడం అంత సౌకర్యంగా అనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాల సంగతి.. కాగా తనుశ్రీ దత్తా, ఇమ్రాన్ హష్మీ.. 'ఆషికి బనాయా ఆప్నే', 'చాకొలెట్: డీప్ డార్క్ సీక్రెట్స్', 'గుడ్ బాయ్.. బ్యాడ్ బాయ్' అనే సినిమాలు చేశారు. తనుశ్రీ దత్తా చివరగా 2013లో వచ్చిన హమ్ నే లీ హై శపథ్ సినిమాలో కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీ విషయానికి వస్తే ఇతడు గ్యాంగ్‌స్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, ద డర్టీ పిక్చర్, శాంఘై వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా టైగర్ 3 మూవీలో కనిపించాడు. చదవండి: తుపాన్ బాధితులకు అండగా నిలిచిన కోలీవుడ్ సెలబ్రిటీలు.. -
నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్
తనుశ్రీ దత్తా.. మీటూ ఉద్యమం జోరుగా నడిచిన సమయంలో బాగా వినిపించిన పేరు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ హీరోయిన్. ఆమె గొంతు విప్పిన తర్వాతే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కానీ మీటూ తర్వాత నుంచి తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని పలుమార్లు వాపోయింది తనుశ్రీ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసింది. 'నాకేదైనా అయితే అందుకు నానా పటేకర్, అతడి బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్లందరూ బాలీవుడ్ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వారిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో వారిని వెంబడించండి. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్, బై..మళ్లీ కలుద్దాం' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) చదవండి: నా గురువుకి నేను సాయం చేయడమేంటి? విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే -
మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ నటి, హీరోయిన్ దనుశ్రీ దత్త పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె పేరు వినగానే ముందుగా గుర్తోచ్చేది ‘మీ టూ’ ఉద్యమం. 2018లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన మీటూ ఉద్యామానికి తెరలేపింది ఆమె. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనని శారీరంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తర్వాతా వెంటనే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభావాలను పంచుకున్నారు. దీంతో మీ టూ దేశ్యవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి ఆమె మీ టూపై స్పందించింది. రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రీఫ్ నోట్ షేర్ చేసింది. చదవండి: విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి ఈ సందర్భంగా ఆమె.. లైంగిక వేధింపులపై మాట్లాడినందకు ఇప్పటికీ తనని వేధిస్తున్నారని ఆరోపించింది. ‘మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్రను నాశనం చేయాలని వారు కంకణం కట్టుకున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోను. మళ్లీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను’ అని పేర్కొంది. అలాగే బాలీవుడ్‌పై మహారాష్ట్ర పాత ప్రభుత్వం ప్రభావం ఎలా ఉందో ఈ సందర్భంగా వివరించింది. ‘బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ (ఇప్పటికీ ప్రభావం ఉంది) దుర్మార్గపు జాతీయ-వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలా పనిచేస్తాయి. వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన #metoo నేరస్థులు, NGO వారే ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చదవండి: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్ ఎందుకంటే వారి తప్పు లేనప్పుడు ఇంకా నన్ను ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తారు?? అంతేకాదు చాలా మంది నన్ను బాలీవుడ్లో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్నపిల్లలు, అమ్మాయిలను వేధించి చంపగలిగే ప్రదేశం ఇది ఏమిటి?? ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. దాని బాధితులుగా ఈరోజు నేను.. రేపు నువ్వు కూడా కావచ్చు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఇన్ని సమస్యలు, ఎంతమంది తనని ఇబ్బంది పెట్టాలని చూసిని తాను మాత్రం భయపడనని, ఆత్మహత్య లాంటివి చేసుకోను అంటూ హామి ఇచ్చింది. వీటన్నింటి ఎదురు నిలబడేందుకు నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుంటానని, అందుకోసం ఆధ్యాత్మిక సాధనను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) -
బ్రేకులు ఫెయిల్.. కారు ప్రమాదానికి గురైన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. తనుశ్రీ కాలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. ప్రమాదం గురించి స్వయంగా తనుశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... 'ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్' అంటూ పోస్ట్ చేసింది. ప్రమాదం జరిగినప్పటికీ కుట్లు వేసుకున్న అనంతరం తనుశ్రీ తర్శనం చేసుకుంది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) -
17 కేజీల బరువు తగ్గక ముందు ఇలా ఉన్నాను: తనుశ్రీ దత్తా
నందమూరి బాలకృష్ణ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి తనుశ్రీ దత్తా. ఫేమినా మిస్ ఇండియా యూనివర్స్‌గా 2004లో టైటిల్ కైవసం చేసుకున్న ఆమె ‘ఆశిక్ బనాయా ఆప్నే’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను, దర్శక-నిర్మాతలను ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. 2006లో ‘వీరభద్ర’ అనే సినిమాలో బాలకృష్ణ సరసన ఆడిపాడిన తనుశ్రీ ఆ తర్వాత తెరపై కనుమరుగయ్యింది. అప్పటి నుంచి నటకు బ్రేక్ ఇచ్చిన ఆమె వీపరీతంగా బరువు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆ మధ్య మీటూ ఉద్యమానికి తెరలేపుతూ వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు నానా ఫటేకర్పై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేసింది. ‘హార్న్ ఓకే ఫ్లీజ్’ అనే మూవీ సాంగ్ షూటింగ్లో అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తన గొంతును వినిపించడంతో మిగతా నటీమణులు కూడా ధైర్యంగా ముందుకు వారు ఎదుర్కొన్న లైంగిక ఘటనలపై నోరు విప్పారు. ఆ తర్వాత మీటూ ఉద్యమం ఎంతగా వివాదమైందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె మళ్లీ తెరమరుగయ్యింది. ఈ సమయంలో తనుశ్రీ బోద్దుగా కనిపించన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీకి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 17 కేజీల బరువు తగ్గిందట. అంతేగాక సన్నగా, నాజుగ్గా తయారయ్యాక వరుసగా తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. ఈ క్రమంలో ‘నేను 17కేజీల బరువు తగ్గడానికి ముందు ఇలా ఉన్నాను’ అంటూ గతంలో లావుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా బొద్దుగా ఉన్నందున చాలా సార్లు బాడీ షేమింగ్‌కు గురైనట్లు గతంలో తను ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘చాలా మంది నేను లావుగా ఉన్ననని నా ముందే హేళన చేశారు, మరికొందరూ ముందు నాతో నవ్వుతూ మాట్లాడి, వెనకాల నా బరువు గురించి మాట్లాడుకునే వారు’ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) -
వాళ్లకు మనవల్ల ఇబ్బంది ఉండదు.. కానీ
ముంబై: ‘‘బొద్దుగా ఉన్న కారణంగా గత రెండేళ్లలో ఎన్నోసార్లు బాడీ షేమింగ్ బారిన పడ్డాను. నా శరీరాకృతి గురించి కొన్నిసార్లు నా ముందే మాట్లాడేవాళ్లు కొంతమంది. మరికొంత మంది మాత్రం నా వెనుక గుసగుసలాడేవారు. నిజానికి ‘నువ్వు లావుగా ఉన్నావు’ చెప్పేవాళ్లు చాలా అరుదుగా మనకు తారసపడతారు. అలాంటి వాళ్లతో ఎటువంటి బాధ ఉండదు. కానీ మన ముందు నవ్వుతూ మాట్లాడుతూ, వెనుక మాత్రం మన గురించి చెత్తగా మాట్లాడేవారి ప్రవర్తన వేదనకు గురిచేస్తుంది. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్లకు మనతో ఇబ్బంది ఏమీ ఉండదు. అయినా మనల్ని తక్కువ చేసి చూపేందుకు అలా మాట్లాడతారు. బరువు తగ్గే ప్రయాణంలో ఎన్నెన్నో భావోద్వేగాలను నేను చవిచూశాను’’అంటూ నటి తనుశ్రీ దత్తా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. బరువు పెరిగిన కారణంగా మానసిక వేదనకు గురవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. (చదవండి: సినిమాల కోసం యూఎస్ డిఫెన్స్ జాబ్ వదులుకున్నాను) కాగా భారత్‌లో మీటూ ఉద్యమానికి బాటలు వేసిన తనుశ్రీ దత్తా రీఎంట్రీకి సిద్ధమైనట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 15 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్న ఆమె, సినిమాల ప్రేమతో అమెరికాలో డిఫెన్స్ ఉద్యోగం వదులుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. ఇక బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తా, ప్రస్తుతం తాను దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని.. ఇవే గాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి షూటింగ్‌లు వాయిదా పడ్డాయని, పరిస్థితుల చక్కబడి అంతా సవ్యంగా సాగితే త్వరలోనే ప్రేక్షకులు తనను మరోసారి వెండితెరపై చూస్తారని చెప్పుకొచ్చారు. View this post on Instagram Hey there! 15 kgs later... A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Sep 25, 2020 at 8:47am PDT -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
‘ఆ కొరియోగ్రాఫర్‌ను దూరం పెట్టాలి’
ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా సినీ పరిశ్రమను కోరారు. బాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు గణేష్ ఆచార్యను పూర్తిగా బహిష్కరించాల్సిన సమయం ఇదేనని ఆమె పేర్కొన్నారు. పురుష సూపర్స్టార్లతో పనిచేస్తూ మహిళా డ్యాన్సర్లు, నటులను వేధిస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని అన్నారు. పరిశ్రమలో తన హోదాను అడ్డుపెట్టుకుని వర్థమాన నటీమణులు, కొరియాగ్రాఫర్లను గణేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపుల్లో గణేష్ ఆచార్య పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగించాడని గతంలో తాను చేసిన మీటూ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పేర్కొన్నారు. హార్న్ ఓకే ప్లీజ్ సెట్లో తాను ఎదుర్కొన్న వేధింపులు, భయాందోళన పరిశ్రమను వీడేలా చేశాయని వీటితో తాను ఎదుర్కొన్న మానసిక, ఆర్థిక సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారుపైనా వారు దాడి చేశారని, వారు నా కారును మాత్రమే ధ్వంసం చేయలేదని..నా మానసిక స్థైర్యాన్ని, స్ఫూర్తినీ దెబ్బతీశారని అన్నారు. చదవండి : వేధింపులు చిన్న మాటా! -
కాపాడమని లాయర్ దగ్గరకు వెళ్తే..
బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన తరుఫున వాదించేందుకు నితిన్ సత్పుటే అనే ఓ లాయర్‌ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’) సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్‌పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్.. ప్రత్యర్థి మహిళా లాయర్‌తో కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. తననేదో రక్షిస్తాడని ఓ లాయర్‌ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు పడింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్స్పిరేషన్ #తనూటూ..!) -
వేధింపులు చిన్న మాటా!
కనిపించని నాలుగోసింహాన్ని వదిలేస్తే పోలీస్ పవర్‌కి ప్రతీకగా మూడు సింహాలు కనిపిస్తుంటాయి. అయితే సమాజానికి కాపు కాసే పవర్ పోలీసు వ్యవస్థ ఒక్కటేకాదు. ఇంకొకటి కూడా ఉంది. అదే.. ‘చట్టం–న్యాయం’ అనే వ్యవస్థ. ఇప్పుడీ రెండు వ్యవస్థలకీ కలిపి ‘మాస్టర్ క్లాస్’ ఒకటి ఇవ్వాలని నటి తనుశ్రీ దత్తా ఓ సూచన చేస్తున్నారు! దేని మీద అంటే.. వేధింపుల మీద. మహిళలు.. పురుషుల నుంచి ఎదుర్కొనే వేధింపుల మీద. ‘‘బాధితురాలు కేసు పెడుతుంది. సాక్ష్యాధారాలు ఉంటాయి. అయినప్పటికీ వేధింపును ఈ రెండు వ్యవస్థలూ సీరియస్‌గా తీసుకోవు. ‘అదేం హింస కాదు కదా, అదేం దౌర్జన్యం కాదు కదా, అదేం లైంగిక దాడి కాదు కదా’ అంటాయి తప్ప, ఆ మూడింటితో సహ సంబంధం ఉన్న నేరంగా వేధింపును పరిగణించవు. దాంతో బాధితురాలికి న్యాయం జరగడం కష్టం అవుతుంది. అందుకే వేధింపును కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలి’’ అని తనుశ్రీ అంటున్నారు. రెండు వ్యవస్థల్నీ ఒకచోట కూర్చోబెట్టి ఎవరి తరఫునుంచి వారు కాకుండా, బాధితురాలి వైపునుంచి ‘వేధింపు’ను సాక్ష్యాధారాలతో కలిపి చూసి దాని తీవ్రతను నిర్ణయించేలా సమన్వయం కల్పించాలని తనుశ్రీ కోరుతున్నారు. -
రాత్రులు నిద్రపట్టేది కాదు
‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ‘మొఘల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్ కపూర్ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్’ నుంచి ఆమిర్ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్ కపూర్ కేస్ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ నన్ను సంప్రదించలేదు: గీతికా 2014లో సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు సుభాష్ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు. మీరు (ఆమిర్) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు. గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా -
డ్యాన్స్ రూమ్
సాక్ష్యాధారాలు మరకల్లాంటివి. ఏళ్లు గడిచే కొద్దీ ఆనవాళ్లు లేకుండాపోతాయి. మనసుకు తగిలిన గాయం మచ్చలాంటిది. ఎన్నేళ్లు గడిచినా బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. తనుశ్రీదత్తా నానా పటేకర్‌పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసు తేలిపోయింది. పోలీసులే తేల్చేశారు! కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా కోర్టుకు ‘బి సమ్మరీ’ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బి సమ్మరీ రిపోర్టును ఇవ్వడం అంటే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దొరకలేదని చేతులు ఎత్తేయడం. ఇక కేసును కొట్టేయడమా, కొనసాగించడమా అన్నది కోర్టు పరిధిలోని విషయం. సాక్ష్యాధారాలను ‘సేకరించలేక పోయిన’ పోలీసులు 51 పేజీల బి సమ్మరీలో కొన్ని అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. మిస్అండర్స్టాండింగ్ కారణంగా, మలేషస్ ఇంటెంట్తోనూ తనుశ్రీ నానా పటేకర్ మీద కేసు పెట్టారట. అపార్థం కారణంగా, హాని తలపెట్టే ఉద్దేశంతో అని. నానా పటేకర్‌తో పాటు మరో ముగ్గురిపైన కూడా తనుశ్రీ కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ సమీ సిద్ధిక్, నిర్మాత రాకేశ్ సారంగ్. వీళ్లలో ప్రధాన నిందితుడు నానా పటేకర్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో 2008 మార్చి 23–26 మధ్య.. సీన్‌ని అడ్డుపెట్టుకుని పటేకర్ తనను వేధించాడని, మిగతావాళ్లు అతడికి సహకరించారని తనుశ్రీ దత్తా ఫిర్యాదు. బి సమ్మరీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నిందితులంతా నిర్దోషులుగా విడుదల అవొచ్చు. అంతేకాదు, పోలీసులు తలచుకుంటే (పటేకర్ తలచుకుంటే అనాలి) రివర్స్‌లో తనుశ్రీ మీదే కేసు పెట్టొచ్చు. పటేకర్ గారి ప్రతిష్టకు ఆమె భంగం కలిగించిందని. తనుశ్రీ దత్తా పటేకర్ పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! తనుశ్రీ కేసు ఫైల్ చేసింది గత ఏడాది అక్టోబర్ 6న. ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది అక్టోబర్ 10న అందులో నానా అండ్ టీమ్‌పై ఆమె చేసిన ఆరోపణలు.. పదేళ్ల క్రితం జరిగిందని ఆమె చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించినవి. అప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేయకుండా ఏమీ లేరు. పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఫైల్ చేసిన బి సమ్మరీ ప్రకారం.. తనుశ్రీ మొదటే 2008 మార్చిలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుర్గావ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తను లైంగిక వేధింపుల కేసు పెడితే పోలీసులు దానిని వట్టి వేధింపుల కేసుగా నమోదు చేశారని కూడా అప్పట్లోనే ఆమె ఆరోపించారు. తర్వాత పదేళ్లకు.. గత ఏడాది అక్టోబర్‌లో ఒషివారా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ వివరాలన్నీ బి సమ్మరీలో పొందుపరుస్తూ.. ‘కనీసం పదమూడు మంది సాక్షుల్ని విచారిస్తే వాళ్లలో ఒక్కరు కూడా నానా పటేకర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పోలీసులు. తనుశ్రీ ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం.. నిర్మాత, డైరెక్టర్ ఆమెకు మొదట చెప్పింది.. సోలో ఐటమ్ సాంగ్‌కు మాత్రమే ఆమె చెయ్యాల్సి ఉంటుందని. చేస్తాను కానీ, స్టెప్పులు అశ్లీలంగా ఉంటే తను చెయ్యనని ఆమె అన్నారు. అశ్లీలం మాత్రమే కాదు, తనకు అసౌకర్యంగా ఉండే మూవ్‌మెంట్స్‌ని ఇవ్వలేనని కూడా ముందే స్పష్టంగా చెప్పేశారు. వాళ్లు ఒప్పుకున్నారు. సాంగ్‌లో పటేకర్‌కు మాత్రం సింగిల్ లైన్ ఉంటుందనీ, అది కూడా వేరుగా షూట్ చేసుకుంటామని అన్నారు. అయితే పాట షూటింగ్ జరుగుతున్న నాలుగు రోజులూ నానా పటేకర్ సెట్స్ లోపలికి వచ్చి తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించే నెపంతో ఆమె ఒంటిని టచ్ చేస్తూనే ఉన్నాడు. అది బ్యాడ్ టచ్. అదంతా ఓ స్ట్రాటెజీతో జరుగుతోందని, మిగతావాళ్లు అతడికి సహకరిస్తున్నారని గ్రహించిన వెంటనే సెట్స్లోంచి బయటికి వెళ్లిపోయారు తనుశ్రీదత్తా. అయితే పటేకర్ అసలలా ప్రవర్తించనేలేదని జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన విషయానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు! డైసీ షా స్టేట్మెంట్ను కూడా వాళ్లు తీసుకున్నారు. డైసీ డ్యాన్సర్, మోడల్. తనుశ్రీ వయసే. ‘‘నానా పటేకర్‌కి పెద్దగా డ్యాన్స్ రాదు. స్టెప్పులు ఎలా వేయాలో నేను, నా మేల్ కొరియోగ్రాఫర్స్ ఆయనకు నేర్పిస్తున్నాం. మార్చి 26 ఉదయాన్నే పటేకర్ సెట్స్‌కి వచ్చేశారు. తనుశ్రీ మధ్యాహ్నం వచ్చారు. అందరు డ్యాన్సర్లు సెట్లో ఉన్నారు. పటేకర్ తనుశ్రీ వెనుక ఉన్నారు. హఠాత్తుగా తనుశ్రీ అగ్నిపర్వతమే అయ్యారు. విసురుగా బయటికి వెళ్లిపోయారు. ఏమైందో మాకెవరికీ తెలియదు. నిర్మాత, దర్శకుడు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. తన కారులో తను వెళ్లిపోయారు’’ అని డైసీ చెప్పారు. పటేకర్‌కి అనుకూలంగా ఉన్న ప్రతి పాయింట్నీ పోలీసులు శ్రద్ధగా నోట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే పటేకర్ బయటపడినట్లే. తనుశ్రీ బయటపడుతుందా అన్నది పటేకర్ దయాదాక్షిణ్యాలపై ఉంటుంది! తనుశ్రీ నానా పటేకర్‌పై తప్పుడు కేసు పెట్టారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కనుక పటేకర్ ఆమెను వేధించాలనుకుంటే తిరిగి ఆమె మీదే కేసు పడేలా పోలీసుల్ని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. నానా పటేకర్‌కు క్లీన్ చిట్ వచ్చిందన్న వార్త యు.ఎస్.లో ఉన్న తనుశ్రీకి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇండియాలోని ఆమె ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులు కేసు క్లోజ్ చెయ్యవచ్చు. కోర్టు కేస్ కొట్టేయవచ్చు. తను మాత్రం న్యాయపోరాటం చేస్తాననే అంటున్నారు తనుశ్రీ! దేవుడి నుంచి రావలసిన జడ్జ్మెంట్ ఇంకా మిగిలే ఉంది కదా అని ఆమె ఆశ. ఆమె ఆశ పెట్టుకున్న దేవుడు, ఆమె అప్లికేషన్ పెట్టుకున్న న్యాయదేవత.. ఆ ఇద్దరూ ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతున్నప్పటికీ పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణల్లో మాత్రం అబద్ధం లేదని.. డ్యాన్స్ రాని పటేకర్, డ్యాన్స్ నేర్పించడానికి తనుశ్రీ మీద చెయ్యి వెయ్యడాన్ని బట్టే స్పష్టం అవుతోంది. దీన్ని ఇంకో యాంగిల్లో చూసేవాళ్లూ ఉండొచ్చు. డ్యాన్స్ రాని పటేకర్ తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించడానికి ఎందుకు ట్రై చేస్తాడు, కేసు ఇక్కడే తేలిపోవడం లేదా అని! పళ్లు లేనివాడు కొరకలేడు నిజమే. పళ్లు లేనంత మాత్రాన కొరికే ఉద్దేశం లేకుండా పోతుందా? పాతికేళ్ల అమ్మాయి.. ఉద్దేశాలను గ్రహించలేకపోతుందా?! నానా పటేకర్, తనుశ్రీ దత్తా : సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తనుశ్రీ కేసును క్లోజ్ చేసేశారు. మరకల్లేవని మచ్చ కూడా లేకుండా పోతుందా? పటేకర్‌కి క్లీన్ చిట్ వచ్చిందని తనుశ్రీ పదేళ్ల ఆవేదన వట్టి అబద్ధమైపోతుందా? - మాధవ్ శింగరాజు -
అందుకే నానాకు క్లీన్ చిట్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. దీంతో నానా పటేకర్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్‌కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి. నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్‌కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు. -
నటుడిపై మండిపడ్డ లాయర్
ముంబై: హీరోయిన్ తనుశ్రీ దత్తాను వేధించిన కేసులో విలక్షణ నటుడు నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది నితిన్ సత్పాతే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారన్నది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి బటయపడేందుకు, తప్పుడు పుకార్లు ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు నానాపటేకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటివరకు నమోదు చేయలేదన్నారు. సాక్షులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పోలీస్ స్టేషన్లో మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరామ’ని నితిన్ చెప్పారు. ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నానాపటేకర్ తనను వేధించాడని 2018, సెప్టెంబర్‌లో తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కేసు దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి ఉత్ప్రేరంగా పనిచేసింది. తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది మహిళలు నిర్భయంగా గళం విప్పారు. -
‘మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’
పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని ఈ ఉద్యమం బట్టబయలు చేసింది. కాగా పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం గురించి తనుశ్రీ చెల్లెలు ఇషితా దత్తా మాట్లాడుతూ.. తన అక్కను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. టీవీ నటిగా బిజీగా ఉన్న ఇషితా.. ఏక్తా కపూర్ నిర్మించిన బేపనా ప్యార్ సీరియల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చేదు అనుభవం ఎదురైనప్పటికీ తన అక్క ఇండస్ట్రీకి వెళ్లొద్దంటూ నిరాశ పరచలేదని తనుశ్రీ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది. ‘ వేధింపుల గురించి ధైర్యంగా గళం విప్పిన మా అక్కకు ధన్యవాదాలు. తన కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన నుంచి విముక్తి పొందారు. నిజానికి ఆరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాడు పోలీసులు సరైన సమయానికి రాకపోయి ఉంటే మా అక్క పరిస్థితి ఎలా ఉండేదో. అప్పుడే తను ఫిర్యాదు చేసింది. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో కూడా మార్పు వచ్చింది. మహిళలతో పాటుగా ఎంతో మంది నటులు మా అక్కకు అండగా నిలిచారు. వారందరికి కృతఙ్ఞతలు. ప్రస్తుతం ఇదొక సీరియస్ ఇష్యూగా మారింది. ఈ సమిష్టి ఉద్యమం వల్ల పనిచేసే చోట మహిళలకు వేధింపులు కాస్త తగ్గినా మనం ధన్యులమవుతాం. వేధింపుల గురించి చెబితే మానసిక భారం తప్ప పోయేదేమీ లేదని అందరూ గుర్తించారు. నిజానికి తనకు అలా జరిగినా మా అక్క నన్నెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా అని ధైర్యం చెప్పింది. అయితే తను అన్నట్టుగానే అదృష్టవశాత్తు నాకు మా అక్కలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. కానీ నా స్నేహితుల్లో చాలా మందికి ఇలా జరిగింది. వాటి కారణంగా వారి జీవితాల్లో తీవ్ర అలజడి చెలరేగింది’ అని పేర్కొంది. కాగా 2012లో చాణక్యుడు అనే తెలుగు సినిమా ద్వారా ఇషితా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. -
ఇన్స్పిరేషన్ #తనూటూ..!
‘మీటూ’తో పెద్దపెద్ద హీరోల నిజస్వరూపాలనుబయటపెట్టేందుకు ప్రేరణగా నిలిచిన తనుశ్రీ..అకస్మాత్తుగా కామ్ అయిపోయారెందుకు?ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఇన్స్పిరేషన్గా నిలిచి, ‘ఇన్స్పిరేషన్’ అనే లఘుచిత్రాన్ని కూడా తీసిన తనుశ్రీ దత్తా ఆఖరి నిముషంలో చిత్రంలోని కథను ఎందుకు మార్చేశారు? ‘మీటూ’ పోరాటాన్ని మధ్యలోనే వదిలివెళ్లేలా ఆమెపై ఒత్తిడి తెచ్చినశక్తులే, ఆమె ‘ఇన్స్పిరేషన్’నూ దెబ్బతీశాయా?! తనుశ్రీ దత్తా తీసిన షార్ట్ ఫిల్మ్.. ‘ఇన్స్పిరేషన్’ ఈ నెల 8న మహిళా దినోత్సవానికి విడుదల కావలసి ఉంది. కానీ కాలేదు! మార్చి 19 తనుశ్రీ బర్త్ డే. ఆ రోజు కూడా ‘ఇన్స్పిరేషన్’ విడుదల అవలేదు! విడుదలై ఉంటే ఈసరికి బాలీవుడ్‌లోని పురుష పుంగవులు గగ్గోలు పెడుతూ ఉండేవారు. ‘ఇన్స్పిరేషన్’.. బాలీవుడ్ ‘మీటూ’ చీకటి కథల లఘుచిత్రం. అతుల్ భల్లా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ తనుశ్రీవే. భల్లా మునుపెన్నడూ సినిమాల్ని డైరెక్ట్ చెయ్యలేదు. కానీ స్త్రీపక్షపాతి. జర్నలిస్టు. గత ఏడాది ‘వధాయాన్ జీ వధాయాన్’ (శుభాకాంక్షలండీ శుభాకాంక్షలు) అనే పంజాబీ సినిమాకు మాత్రం డబ్బులు పెట్టాడు. రొమాంటిక్ కామెడీ అది. కామెడీకి డబ్బులు పెట్టిన మనిషిని, ‘సెక్సువల్ హెరాస్మెంట్’ థీమ్‌కి మనసు పెట్టమని అడిగారు తనుశ్రీ. ఓకే అన్నాడు ఆయన. తీశాడు కూడా. కానీ రిలీజ్ కాలేదు!! మాఫియా ఎంటర్ అయిందా?! ‘ఇన్స్పిరేషన్’ని రిలీజ్ చెయ్యొద్దని ఎవరైనా తనుశ్రీని బెదరించారా? బాలీవుడ్ మాఫియా రంగంలోకి దిగిందా? లేకా తనుశ్రీనే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా? తలనొప్పి ఎలా ఉంటుందో తనుశ్రీకి బాగా తెలుసు. ఆరు నెలలు ఇండియాలో ఉండి, ఇటీవలే ఆమె తిరిగి యు.ఎస్.వెళ్లిపోయారు. ఉండడం అక్కడి న్యూజెర్సీలో. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చిపోతున్నారు. ఈ ట్రిప్పులో మాత్రం ఊరికే వెళ్లలేదు తనుశ్రీ. ‘మీటూ’కు ఆజ్యం పోసి వెళ్లారు. ఆజ్యం అనే మాట కరెక్ట్ కాదు. ‘మీటూ’ను రాజేసి వెళ్లారు.అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత గత ఏడాది జూలైలో ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం పెద్ద విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీని విమానాశ్రయంలో కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రం గుర్తుపట్టారు. అంతేతప్ప ఆమె కారణంగా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఊపిరి అందుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె వచ్చేటప్పటికే మన దేశంలో మీటూ గురించి అక్కడో మాట ఇక్కడో మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం.. ఈ మూడు చిత్రపరిశ్రమల నుంచి కొంతమంది నటీమణులు బయటికి వచ్చి.. ‘ఒకవేళ లైంగిక వేధింపులు ఉంటే వాటిని ఖండించవలసిందే’ అన్నంత వరకు మాట్లాడగలిగారు. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, రీమా ఛద్ధా, రాధికా ఆప్టే కూడా.. ‘మీటూ’ అన్నది సపోర్ట్ చేయవలసిన మూవ్మెంట్ అన్నంత వరకే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఒక బాధితురాలిగా తొలిసారి బయటికి వచ్చి మీటూ ఫిర్యాదు చేసింది మాత్రం తనుశ్రీ దత్తానే. ఆమె ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్‌లోని అజ్ఞాత బాధిత మహిళలు, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోని మహిళా నటులు తామెలా లైంగిక వేధింపులకు గురైందీ రివీల్ చేశారు. సాజిద్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, అనూ మాలిక్, కైలాష్ ఖేర్, సుభాష్ కపూర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్.. ఇలా ఆరోపణలు వచ్చినవాళ్లంతా పరువు కోసం పరుగులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. వారిలో నానా పటేకర్ ముఖ్యుడు. మనసుకు సర్దిచెప్పుకోలేకే..! నానా పటేకర్ జెంటిల్మన్. రైతు జన బాంధవుడు. ముంబై చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఒక్కొక్కరికీ లక్ష చొప్పున నగదు చెక్కులను ఇస్తూ కాస్త మంచి పేరును కూడపెట్టుకున్నాడు. తనుశ్రీ వచ్చి ఆ పేరును కూలగొట్టేశారు. పేరును కూలగొట్టడం ఆమె ఉద్దేశం కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగా పదేళ్లుగా ఆమె రగిలిపోతున్నారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో ఒక సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నప్పుడు నానా పటేకర్ ఆమెను వేధించాడు. అప్పటికి ఆయన స్టార్ యాక్టర్. అప్పటికి ఆమె మిస్ ఇండియా. కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. వచ్చీ రాగానే చేదు అనుభవం. ఆ దెబ్బతో ఆమె సినిమాలు వద్దనుకుని వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు. నానా పటేకర్ వయసు అప్పటికి 58 ఏళ్లు. అప్పుడు ఏమీ చేయలేక వెళ్లిపోయిన తనుశ్రీ, తిరిగొచ్చాక అతడి ముసుగు తొలగించారు. అయితే ఇదంతా కూడా తనుశ్రీ కల్పించినదే తప్ప నిజం కాదని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు నానా పటేకర్. కానీ ఆయన కరెక్ట్ మనిషా కదా అనే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. తనుశ్రీని మాత్రం ఇండస్త్రీలోని అమ్మాయిలు, సీనియర్ మహిళా ఆర్టిస్టులు నమ్మారు. ఎక్కడో యు.ఎస్.లో ఉన్న మనిషి, ఇండియా వచ్చి, లేనిపోని తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటుంది అనే అనుకున్నారు. ఆ మాట నిజమే. తనుశ్రీకి మంచి లైఫ్ ఉంది. కానీ ఆ లైఫ్‌ని పశ్చాత్తాపం లేకుండా లీడ్ చెయ్యడానికి పాతవి తుడిచేసుకోవాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది. యు.ఎస్.లో మొదలైన మీటూ ఆమెలోని ఆనాటి నిస్సహాయతకు శక్తినిచ్చి, నిద్రాణంగా ఉన్న నిస్సత్తువను పోగొట్టింది. ‘వెళ్లి ఫైట్ చెయ్యి’ అని ప్రేరేపించింది. కథ ఎందుకు మారింది?! ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చి.. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లో.. ఎందరో బాధితుల్ని బయటికి రప్పించి, మర్యాదస్తుల అసలు రంగును బట్టబయలు చేసిన తనుశ్రీ తిరిగి తన ప్రశాంత జీవనంలోకి.. న్యూజెర్సీకి వెళ్లిపోయారు. అయితే అది నిజమైన ప్రశాంతతేనా?! కాదు అన్నదే సమాధానం. అందుకే ఆమె అర్థంతరంగా ముగించిన వెళ్లిన పోరాటాన్ని షార్ట్ ఫిల్మ్‌తో కొనసాగించాలనుకున్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైందీ సమాచారం సేకరించారు. స్క్రిప్టు రాసుకున్నారు. డైరెక్టర్నీ పెట్టుకున్నారు. ఫిల్మ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ కాలేదు. ఉద్యమంలోంచి వెనక్కు తగ్గినట్లే ఫిల్మ్ లోంచీ వెనక్కు తగ్గారా తనుశ్రీ. బాలీవుడ్ మాఫియా ఆమెను ఏమైనా హెచ్చరించిందా? అందుకే ఫిల్మ్‌ని చెత్తబుట్టలో వేసేశారా? అలాంటిదేమీ లేదంటున్నారు తనుశ్రీ. మొన్న బర్త్‌డే రోజు కూడా ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోందని చెప్పారు. అయితే కథ మాత్రం అది కాదు అన్నారు!! అందులో బాలీవుడ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎపిసోడ్స్ ఏమీ లేవని చెప్పారు. మరి ఏం ఉంటుంది? ఇన్స్పిరేషనల్ టాక్ ఉంటుందట తనది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకే ఉండబోతోంది! అదీ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను ఉద్దేశించి ‘డూస్ అండ్ డోంట్స్’ ఉంటాయట. హార్వర్డ్ కి వెళ్లొచ్చాక ‘బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అతిథి వక్తగా ప్రసంగించడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా ఎక్సయిటెడ్గా ఉన్నాను’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. పోస్ట్‌కి తగిలించిన తన ఫొటోలో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో అచ్చు హార్వర్డ్ స్కూల్ విద్యార్థినిలాగే ఉన్నారు. హార్వర్డ్ స్కూల్లో స్పీచ్ ఇవ్వడం అంటే మామూలు సంగతేం కాదు. ప్రపంచ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల భిన్న రంగాలలోని సుప్రసిద్ధులకు మాత్రమే ఆ ఆహ్వానం దక్కుతుంది. స్పీచ్ ఫిబ్రవరి 16న. వెళ్లొచ్చారు. చక్కగా మాట్లాడారు. తక్కిన వక్తల నుంచి, తన ప్రసంగానికి హాజరైన విద్యార్థుల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. మీడియా, మూవీస్, హ్యూమన్ ట్రెండ్స్.. ఇలా చాలావాటి గురించి తనుశ్రీ మాట్లాడారు. సమాజంలోని ‘మిసాజిని’ (స్త్రీద్వేషం) పైన ఆమె అభిప్రాయాలకు మాత్రం మంచి అటెన్షన్ లభించింది. ప్యానల్ డిస్కషన్లో కూడా తనుశ్రీ కూర్చున్నారు. ఒకరిద్దరు.. ఇండియాలో మీటూ పయనీర్‌గా ఆమెను గుర్తించారు. తనుశ్రీ నవ్వారు. ‘‘ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా పయనీరే’’ అన్నారు. చొరవ, నాయకత్వ గుణం మాత్రమే స్త్రీలను వారు ఎదుర్కొనే ఇబ్బందులనుంచి బయటపడేస్తాయని చెప్పారు. స్త్రీ నుంచి పురుషుడికి లభించే సపోర్ట్ కన్నా, స్త్రీ నుంచి స్త్రీకి లభించే సపోర్టే ఎక్కువగా ఉంటుందనీ, అది మాత్రమే నమ్మకమైనది’’ అని తనుశ్రీ అన్నారు. హార్వర్డ్ స్పీచ్ ఇచ్చి వచ్చాక తనను కలిసిన ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ సుభాష్ కె. ఝాతో మాట్లాడినప్పుడు ఆమెలో అతడికి మునుపటి తనుశ్రీ కన్నా భిన్నమైన వ్యక్తి సాక్షాత్కరించారు. ముఖ్యంగా ఆమె తీస్తున్న ‘ఇన్స్పిరేషన్’ ఫిల్మ్ గురించే ఆయన తరచి తరచి అడిగారు. 20 నిముషాల నిడివి ఉండే ఆ చిత్రం ఇన్‌సైట్‌తో (లోతైన దృష్టి), క్రిస్ప్‌గా (సంక్షిప్తంగా) డైరెక్టుగా (నీళ్లు నమలకుండా) ఉంటుందని ఆమె చెప్పారు. అంటే.. చిత్రం ఎలా ఉంటుందన్నది మాత్రమే తనుశ్రీ చెప్పారు. ఏం ఉండబోతోందన్న చెప్పలేదు. ఇప్పుడు అదీ క్లియర్ చేసేశారు. అదొక ఆసక్తికరమైన హార్వర్డ్ స్పీచ్‌లా మాత్రమే ఉండబోతోంది. -
మీటూపై షార్ట్ ఫిల్మ్
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్ ప్లాన్ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్‌ఫిల్మ్ కథను తయారు చేశారట. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించడమే కాకుండా రైటింగ్ సైడ్ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా. -
ఇక తిరుగు ప్రయాణం
బాలీవుడ్ మీటూ ఉద్యమంలో బాగా వినిపించిన పేరు తనుశ్రీ దత్తా. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా అప్పుడు నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దేశంలో మీటూ ఉద్యమానికి పునాది వేశారామె. ఆ తర్వాత చాలా మంది తారలు మీటూ ఉద్యమంలో తమ గొంతు వినిపించారు. ఈ కారణంగా కొందరు డైరెక్టర్లు తమ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తనుశ్రీ దత్తా తిరిగి న్యూజెర్సీ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ‘‘మీటూ’ గురించిన వార్తలు ప్రతిరోజూ దినపత్రిక మొదటి పేజీలో రావని నాకు అవగాహన ఉంది. కానీ జరిగిన పరిణామాలు భవిష్యత్‌లో కొందరు మహిళలకైనా మేలు చేస్తాయన్న నమ్మకం ఉంది. ఓ నెల రోజులు గడుపుదామని ముంబై వచ్చాను. ఐదు నెలలు గడిచిపోయాయి. ఇక నా ఫ్యూచర్ అక్కడే అనుకుంటున్నా. అందుకే న్యూజెర్సీ తిరుగు ప్రయాణం అవుతున్నా’’ అని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు. -
రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్
-
వైరల్: రాఖీ సావంత్‌ను ఎత్తి పడేసింది
ఎప్పుడూ ఎదో వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచారు. వివాదస్పద సినిమాలతోనో, మాటలతోనో, డ్రెస్స్‌లతోనో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఓ మహిళా రెజ్లర్ సవాల్ విసరగా.. రాఖీ స్వీకరించారు. రింగ్‌లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన రెజ్లర్ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని పంచకులలో ద గ్రేట్ ఖలీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ పోటీల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. (నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, రాఖీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక రాఖీ కూడా అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. (‘నేను లెస్బియన్‌ని కాదు’) -
నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు
మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండగా.. బాలీవుడ్ నటీమణులు తనుశ్రీ దత్తా రాఖీ సావంత్‌ల మధ్య వివాదం రోజురోజుగా రాజుకుంటోంది. ‘తనుశ్రీ దత్తా డ్రగ్స్ బానిస, ఆమె ఒక లెస్బియన్’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాఖీపై తనుశ్రీ ఇప్పటికే రూ.10 కోట్లకు దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరారు. (తనుశ్రీకి పిచ్చి పట్టింది) ‘ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉన్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరింత కష్టాల్లో పడలేను. కానీ, ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న నా పరువూ, మర్యాదలను తనుశ్రీ నాశనం చేయాలని చూస్తోంది. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా వేశాను’ అని రాఖీసావంత్ చెప్పుకొచ్చారు. కాగా, డబ్బు సంపాదన కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందనీ, ఎలాంటి నీచమైన పనులైనా చేస్తుందని తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివాదం మొదలైందిలా.. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమానికి బీజం పడిన సంగతి తెలిసిందే. అయితే, మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటీమణులు కొందరు తనుశ్రీకి మద్దతు తెలపగా నటి రాఖీ సావంత్ మాత్రం తీవ్ర విమర్శలు చేసింది. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించింది. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (‘నేను లెస్బియన్‌ని కాదు’) అంతటితో ఆగకుండా ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తనుశ్రీ వేసిన దావాపై రాఖీ స్పందించకపోతే ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాది నితిన్ మీడియాతో వెల్లడించారు. -
‘నేను లెస్బియన్‌ని కాదు’
నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమానికి బీజం వేశారు తనుశ్రీ దత్తా. ఈ వివాదంలో సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు తనుశ్రీ దత్తాకి మద్దతు తెలపగా.. రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతటితో ఊరకోక ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాఖీ సావంత్ మీద 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన తనుశ్రీ దత్తా ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. తనను లెస్బియన్ అంటూ చేసిన ఆరోపణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. ‘రాఖీ సావంత్ చేసే ఆరోపణలకు నేను భయపడను. నాపై కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. నేను డ్రగ్స్ తీసుకోను. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు. కనీసం స్మోకింగ్ అలవాటు కూడా లేదు. నేను లెస్బియన్‌ని కానే కాదు. మహిళలకు మంచి జరిగే ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాఖీ సావంత్ ఇలాంటి నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తోంది. ఆమె వేసే జోకర్ వేషాలకు.. ఆమె నవ్వుల పాలవ్వడమే కాక చివరకు ఆమె బలవుతుంద’ని మండిపడ్డారు. -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
రాఖీ సావంత్‌కి తనుశ్రీ కౌంటర్
సాక్షి, ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం రేపిన నటి తనుశ్రీ దత్తా మరో కీలక అడుగు వేశారు. తనుశ్రీ -నానా పటేకర్ వివాదంలో నానాకు మద్దతుగా నిలవడంతోపాటు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్‌ను చట్టపరంగా సవాల్ చేసింది. 10 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు తనుశ్రీ న్యాయవాది నితిన్ మీడియాకు తెలిపారు. దీనికి రాఖీ సమాధానం చెప్పకపోతే, ఆమెకు రెండు సంవత్సరాలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. తనుశ్రీ దత్తా ఆరోపణలపై పచ్చి అబద్ధాల కోరు అంటూ బాలీవుడ్ రాఖీ సావంత్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా హారన్ ఓకే ప్లీజ్ మూవీ షూటింగ్ రోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుండడంతోనే తనతో ఆ పాట పూర్తి చేశారంటూ తనుశ్రీపై ఎదురు దాడికి దిగింది. ‘నానా పటేకర్ లాంటి గొప్ప నటుణ్ని తనుశ్రీ అవమానిస్తోంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మహిళలతో చాలా గౌరవంగా ప్రవర్తిస్తార’ని రాఖీ తెలిపింది. అంతేకాదు తనుశ్రీ దత్తా రక్తం నిండా మత్తుమందులే ఉంటాయని తెలిపింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఇలా మాట్లాడుతోందని పేర్కొంది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతోంది కాబట్టి తనుశ్రీ మాటలకు ప్రాధాన్యం లభిస్తోంది. రుజువులు చూపిస్తే తాను ఇండియా వదిలిపోతానని, ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే తన ముందుకు వచ్చి మాట్లాడాలంటూ రాఖీ సవాల్ చేసిన సంగతి విదితమే. దీంతో రాఖీపై రూ. 10 కోట్ల మేరకు తనుశ్రీ పరువునష్టం దావా వేసింది. -
నిర్మాత శ్రేయస్సే ముఖ్యం
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. -
లై డిటెక్టర్ ఉపయోగించండి
లైంగిక వేధింపుల గురించి అటు బాలీవుడ్లో తనుశ్రీదత్తా, తనతో చెప్పుకున్న వాళ్లకు జరిగిన వేధింపుల విషయమై ఇటు సౌత్‌లో గాయని చిన్మయి ఇద్దరూ ‘మీటూ’ ఉద్యమంలో తమ పోరాటం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్ చేయమని కోరుతున్నారు. ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు చిన్మయి. మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్‌కు లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య, నిర్మాత రాకేశ్ సారంగ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. -
మళ్లొకసారి అక్టోబర్ విప్లవం
గుండెకు ముల్లు అడ్డుపడుతుంటే.. గొంతులోకి ముద్ద ఎలా దిగుతుంది? అడ్డుగా ఉన్నదానిని బయటికి తెచ్చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. గుండె మాత్రం ఎంతోకాలం లోపల ఉంచుకోలేదు. తనే శక్తిని కూడదీసుకుని ముల్లును గొంతులోంచి బయటికి తోసేస్తుంది. తనుశ్రీ దత్తాను బాలీవుడ్ నటి అనేందుకు లేదు. బాలీవుడ్‌ను ఈసడించుకుని పదేళ్ల క్రితమే యు.ఎస్. వెళ్లిపోయి, మళ్లీ ఈ మధ్యే ఆమె ఇండియా వచ్చారు. కనుక తనుశ్రీని ఒక యువతి అని మాత్రమే అనాలి. ఒక సాధారణ యువతి అని కూడా అనొచ్చు. ఒకప్పుడు ఆమె సాధించిన ‘మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ కన్నా, ఈ ‘సాధారణ యువతి’ అనే మాట.. మోర్ పవర్ఫుల్ టైటిల్ అనిపిస్తుంది ఆమె విషయంలో. మోర్ గ్లామరస్ అనబోయి మోర్ పవర్ఫుల్ అనడం కాదు. గ్లామర్ ప్రపంచాన్ని గిరాటు వేసి వెళ్లిపోయారు తనుశ్రీ. అందుకు పవర్ఫుల్. వెళ్లేటప్పుడు తనుశ్రీ వయసు 24 ఏళ్లు. ఇప్పుడు 34. ఈ పదేళ్లలో తనుశ్రీలో వచ్చిన మార్పు ఒకటే. అందంగా ఉండేవారు.. ఇంకొంచెం అందంగా అయ్యారు. అందాన్ని తనే పక్కన పెట్టేశారు కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆమె అందం గురించి మాట్లాడ్డం అనుచితమే అవుతుంది. ‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) చిత్రంలో తనుశ్రీదత్తా లేరు. ఉండేవారే. సగంలో వెళ్లిపోయారు. లైంగిక వేధింపులు కారణం! సినిమాలో హీరోగా నటిస్తున్న 57 ఏళ్ల వ్యక్తి సినిమా సెట్స్‌లో తన పాలిట విలన్‌గా మారాడని అప్పుడే చెబితే ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ‘ఇక్కడ ఇదంతా మామూలే’ అన్నట్లు చూశారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ చెబితే ‘నువ్వింకా మర్చిపోలేదా’ అన్నట్లు చూశారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చెబితే.. ‘అవునా!’ అన్నట్లు ముఖాలు పెట్టేశారు. వేధింపులు జరుగుతున్నప్పుడే కంప్లయింట్ చేస్తే పట్టించుకోని ‘సింటా’ (సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్).. పదేళ్ల తర్వాత.. కొద్దిరోజుల క్రితమే తనుశ్రీకి అపాలజీ చెప్పింది! అపాలజీ కోసం తనుశ్రీ దత్తా సినిమాలు మాని ఇన్నేళ్లపాటు పోరాటం చేయలేదు. తనతో తను చేస్తున్న పోరాటంలో ఓడిపోవడం ఇష్టం లేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆనాటి చీడకలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. ‘నేనేం చేయలేకపోయాను’ అని తన మనసుకు తను, తన దేహానికి తను అపాలజీ చెప్పే దుస్థితిని తప్పించుకోవడం కోసం తనుశ్రీ ఫైట్ చేస్తున్నారు. మొదటైతే తన నుంచి తను తప్పించుకోవాలనే ప్రయత్నించారు. ‘హార్న్ ఓకే ప్లీజ్’ను వదిలేసి.. హిమాలయాల వైపు వెళ్లిపోయారు. తక్షణం రెక్యుపరేట్ అవ్వాలి తనప్పుడు. ఒంటిపైన ఏదో పాకింది. దాన్నుంచి రెక్యుపరేషన్. మనసు మోకాళ్లపై ముడుచుకుపోయింది. దాన్నుంచి రెక్యుపరేషన్. కానీ అక్కడేం వైద్యం దొరకలేదు! ఆధ్యాత్మికత ఆమెకు ఏమాత్రం చికిత్స చేయలేకపోయింది. లడఖ్ వెళ్లి కొన్నాళ్లు బౌద్ధారామంలో ఉన్నారు. కొన్నాళ్లు విపస్సన. ఆ ధ్యానం కొంత పని చేసింది. ఆశ్రమాల్లో కూడా గడిపారు కానీ.. ఈ జ్ఞానప్రాప్తి, నిర్వాణం, మోక్షం.. అంతా ఎద్దుపేడ అనిపించింది తనుశ్రీకి. భార్యలొచ్చేవారు. భర్తలు వదిలేశారని ఏడ్చేవారు. తల్లిదండ్రులు వచ్చేవారు. పిల్లలు పట్టించుకోవడం లేదని ఏడ్చేవారు. ఇంకేం స్పిరిచువాలిటీ! గురువులుండేవాళ్లు. ఇంతమంది గురువులున్న దేశంలో ఇన్ని రేప్‌లు ఏంటని మనసులో మరో ముల్లు. తనుశ్రీ మళ్లీ డిస్టర్బ్ అయ్యారు. యు.ఎస్. వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు గ్రీ¯Œ కార్డు ఉంది. అయితే ఇండియాలో తను ‘తీర్చుకోవలసింది’ ఇంకా అలాగే ఉండిపోయింది. అది తనను తిననివ్వడం లేదు. పడుకోనివ్వడం లేదు. దిగులు కూడు. మనసు గోడు. ఇప్పుడు కొంచెం ఆమెకు నెమ్మదిగా ఉండి ఉండాలి. ఆశ్రమాల్లో దొరకని నెమ్మది. అమెరికాలో దొరకని నెమ్మది. పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించిన వ్యక్తిపై కేసు పెట్టారు తనుశ్రీ. ఆమెను చూసి ధైర్యంగా మరికొంత మంది నటీమణులు బయటికి వచ్చారు. కొందరు మగాళ్లు కూడా వీళ్లకు మద్దతు ఇస్తున్నారు కానీ, ఈ మద్దతు ఇచ్చే మగాళ్లపైన కూడా ఏనాటివో కథలు బయటపడితే.. అప్పుడిక అంతా ఒక్కటే. మగవాడి మద్దతు కూడా ఒక లైంగిక వేధింపు కన్నా తక్కువగా ఏమీ పరిగణన పొందదు. నీతులు బోధించే మీడియా సైతం.. ‘దీప్తీ.. కమ్ టు మై క్యాబిన్’ అని ఇంటర్కమ్లో పిలిచి.. ముఖంలోకి ముఖం పెట్టి ‘లక లక లక’ మన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటినిక ఆరోపణలు అనడం మానేయాలి. ఆవేదనలు అనాలి. ఏం జరిగినా నోరెత్తని హిస్టరీ ప్రపంచ మహిళలది. అలాంటి వారు ఏమీ జరక్కుండానే నలుగురి నోళ్లలో నానడానికి ఇల్లొదిలి, ఇంట్లోని మనుషుల్ని వదిలి, బయటికి వచ్చేస్తారా? తనుశ్రీ దత్తా కంటే ముందు బాలీవుడ్లో బాధిత మహిళలు తమ ఒంటిపై గాయాలను విప్పి చూపించారు కానీ ఆ గాయాల్ని ఎవరు చేశారో పైకి చెప్పుకోలేదు. ‘ఇలా జరుగుతోందండీ. ఇది న్యాయమా అండీ..’ అన్నంత వరకే వాళ్లు ఆగిపోయారు. తనుశ్రీ వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టారు. విల్లు సారించారు, శరాన్ని సంధించారు. ఇంతకాలం తన మనసు చాటున తనే దాక్కుండిపోయిన ఒక్కో మహిళా వచ్చి, ఒక్కో శరమై తనుశ్రీ భుజానికి ఉన్న అమ్ములపొదిలో కూర్చుంటోంది. తనను తనే సంధించుకుంటోంది. ప్రేరణ తనుశ్రీ. చేతన ప్రతి స్త్రీ. యు.ఎస్.లో నిరుడు అమెరికన్ స్త్రీలు, ఇండియాలో నేడు భారతీయ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తూ ఒక ఉద్యమంలా, ఒక విప్లవంలా, ఒక తిరుగుబాటులా బయటికి రావడంతో ఇది ‘రెండో అక్టోబర్ విప్లవం’ అన్న అభివర్ణన వినిపిస్తోంది. నూరేళ్ల క్రితం అక్టోబర్‌లో, గతేడాది అక్టోబర్‌లో, ఈ ఏడాది అక్టోబర్‌లో.. రష్యాలో, యు.ఎస్.లో, ఇండియాలో జరిగినవీ, జరుగుతున్నవీ, ప్రపంచం మొత్తానికీ వ్యాప్తిస్తున్నవీ.. అన్నీ సాంస్కృతిక తిరుగుబాట్లే. వీటిని రాజేసినదీ, రాజేస్తున్నదీ నాడూ, నేడు.. కవులు, కళాకారులు, రచయితలు, రంగస్థల నటులు, చిత్రకారులే. వారి అంశ అయిన బాలీవుడ్లో, హాలీవుడ్లో, మిగతా ఉడ్లలో ఇప్పుడు జ్వలిస్తోన్న అక్టోబర్ విప్లవం కూడా సాంస్కృతికమైనదే. స్త్రీని గౌరవించే సంస్కృతిని మనం కోల్పోతున్నా.. సంస్కృతి నుంచి మాత్రం మన పేగుబంధాన్ని ఎప్పటికీ తెంచుకోలేం. ఎందుకంటే.. స్త్రీనే మన సంస్కృతి. స్త్రీనే మన సాంస్కృతిక, సంస్కారాల రిఫ్లెక్షన్. ‘అప్పుడే నేను ఎందుకు చెప్పలేదంటే..’ అని సోషల్ మీడియా ఉద్యమం ఒకటి ఈ ఏడాది సెప్టెంబరులో కొన్నాళ్లు నడిచింది. అది ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమం. ‘అప్పుడే నేను ఎందుకు చెప్పలేదంటే..’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో బాధితులు తమపై ఎప్పుడో జరిగిన లైంగిక వేధింపుల్ని షేర్ చేసుకున్నారు. యు.ఎస్.కి కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి బ్రెట్ కవానా మీద.. జడ్జిగా ఆయన నామినేషన్‌కు ముందు క్రిస్టీన్ బ్లేసీ ఫోర్డ్ అనే అమెరికన్ ప్రొఫెసర్ బయటికొచ్చి, హైస్కూల్లో ఉండగా కవానా తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించారు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివినప్పటి మాట ఇది. ట్రంప్ వెంటనే ‘వై యు డిడెంట్ రిపోర్ట్’ అని అడిగాడు. దానికి సమాధానమే ‘వై ఐ డిడెంట్ రిపోర్ట్’. ‘వీళ్లంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు.. పబ్లిసిటీ కోసం కాకపోతే!’ అని మన దగ్గర కూడా పాయింట్ పైకి తీస్తున్నారు. గుండెకు ముల్లు అడ్డుపడుతుంటే.. గొంతులోకి ముద్ద ఎలా దిగుతుంది? అడ్డుగా ఉన్నదాన్ని బయటికి తెచ్చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. గుండె మాత్రం ఎంతోకాలం లోపల ఉంచుకోలేదు. తనే శక్తిని కూడదీసుకుని తన లోపలి ముల్లును గొంతులోంచి బయటికి తోసేస్తుంది. -
వికాస్‌కు ఓ అవకాశం ఇవ్వండి
ఆరోపణలు ఆగడం లేదు. మేం మద్దతుగా ఉంటున్నాం అని ముందుకొస్తున్న నటీనటులతో ‘మీటూ’ ఉద్యమం సినీ ఇండస్ట్రీల్లో కొనసాగుతూనే ఉంది. తనుశ్రీ దత్తా ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం చాలా మంది బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. దానికి మద్దతు తెలుపుతూ కొందరు యాక్టర్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో నటించబోము అని సినిమాలను ఆపేస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణలను కంగనా రనౌత్ నిజమే అంటూ స్పందించారు. ఇప్పుడు దానికి సమాధానంగా వికాస్ బాల్ మాజీ భార్య రీచా దూబే కంగనా రనౌత్‌పై కామెంట్లు విసిరారు. ‘‘మీతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఇంకా అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు? ఇంకా వాళ్లతోనే నవ్వుతూ తిరుగుతారెందుకు? అతను తన పనిలో మంచి టాలెంట్ ఉందని ఇవన్నీ వదిలేస్తారా? వికాస్ నీతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని నీకనిపించినప్పుడు అప్పుడే చెప్పొచ్చుగా. మొన్నటి వరకూ ఫ్రెండ్లీగా మెసేజ్‌లు చేసుకొని ఇప్పుడు ఒక్క అవకాశంతో అంతా మారిపోయిందా? నీతో మీడియా ఫైట్ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అందులో నువ్వు ఆరితేరిపోయావు. సెలబ్రిటీ పవర్‌ని తప్పుగా ఉపయోగించకు. కంగానాకు ఉన్న ప్రామాణికతేంటి? వికాస్ దగ్గర లేనిది ఏంటి? నేను అతని మాజీ భార్య అయినప్పటికీ ఈ డ్రామా చూడలేకపోతున్నాను. నిజం నిరూపించుకోవడానికి అతనికో అవకాశం ఇవ్వండి. నిజం బయటకు రాకముందే అతనికి అనవసరమైన ట్యాగ్స్ అతికించకండి. నిజం నిరూపితమైనప్పుడు అతనికేం చెబుతాం?’’ అని ఘాటుగా స్పందించారు. అలాగే మరోవైపు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, మలైకా అరోరా, సయేషా ట్వీట్స్ చేశారు. విన్నాక రియాక్ట్ అవుదాం ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. నిజానిజాలు తెలిసే వరకూ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని సాజిద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై సైఫ్ అలీ ఖాన్ కూడా స్పందించారు. ‘‘సాజిద్ ఖాన్‌పై వస్తున్న ఆరోపణలు వింటున్నాను. కానీ సెట్లో అతను అలా ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదు. కానీ రియాక్ట్ అయ్యే ముందు వాళ్లు చెప్పేదంతా విందాం. మాట్లాడనిద్దాం, ఎందుకంటే అలా బయటకు వచ్చి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. మొత్తం విన్నాక దాన్ని బట్టి రియాక్ట్ అవుదాం’’ అని పేర్కొన్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుంచి దర్శకుడు సాజిద్‌ఖాన్ తప్పుకోవడంతో మిగతా పార్ట్‌ను ‘హౌస్‌ఫుల్ 3’ కి దర్శకత్వ బాధ్యతలు వహించిన సాజిద్, ఫర్హాద్లు డైరెక్ట్ చేయనున్నారని లేటెస్ట్ బాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలు కానుందని సమాచారం. నిరుత్సాహపరిచుంటే సారీ చాలా మంది మీ నలభై ఏళ్ల సినీ కెరీర్లో మీరెప్పుడైనా లైంగిక వేధింపులకు గురయ్యారా? అని అడుగుతున్నారు. నేనెప్పుడూ లైంగిక వేధింపులకు గురవలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరిచుంటే క్షమించండి. చిన్నప్పటి నుంచి కూడా విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. అదే చేశాను’’ అని పేర్కొన్నారు. మీటూను దుర్వినియోగం చేయకండి ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమాన్ని కొంత మంది తప్పుగా ఉపయోగుస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పుడు నిందలు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ ఉద్యమాన్ని సరిగ్గా వినియోగిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను’’ – హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ ‘మీటూ’ ద్వారా బయటకు వచ్చి చెబుతున్న స్త్రీలందరి ధైర్యం మెచ్చుకునేది. ఇండస్ట్రీ స్త్రీల సురక్షిత వాతావరణానికి ఏర్పరిచే ప్రయత్నం చేయాలి. దేశంలోని ప్రతి స్త్రీ ఏదోరకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే చాలా బాధగా ఉంది’’ – పూజా హెగ్డే ‘‘ఇన్నేళ్లు తమతో దాచుకున్న ఈ చేదు అనుభవాలు గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ అంటూ ముందుకొచ్చిన అందర్నీ నమ్ముతున్నాను. అలాగే నిజాయతీగా ముందుకు వచ్చిన వాళ్లను సపోర్ట్ చేస్తున్న పురుషులందరీకి నా థ్యాంక్స్’’ – సయేషా ‘‘అసలు జరగకపోవడం కంటే కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే భవిష్యత్తులో ఈ వేధింపులను కంట్రోల్లో ఉంచొచ్చు’’ – మలైకా అరోరాఖాన్ -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్‌లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్‌పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్‌ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్‌పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్‌లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్‌గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్‌ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్‌తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్‌లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్‌ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
థ్యాంక్స్ మీరు వింటున్నారు
అవును. వింటున్నాం. ఇవాళ మనం వినగలుగుతున్నాం. ఏ? ఈ ఘోష ముందు లేదా?ఈ వేధింపులు మునుపు లేవా?ఉన్నాయి. కానైతే.. మహి ఇవాళ చెప్పుకోగలుగుతోంది. ఎందుకు చెప్పుకోగలుగుతోందంటే..వినడానికి మనం ఇన్నాళ్లకు సిద్ధమయ్యాం.ఈ కొత్త సమాజానికి థ్యాంక్స్.ఇవాళ్టి నుంచీ మాట పెరగాలి. ఇవాళ్టి నుంచీ ఘోష తగ్గాలి..! సైలెన్స్ బ్రేక్ అవుతోంది. శుభ పరిణామం! అమ్మాయిల బాధను వినేవాళ్లూ సిద్ధమవుతున్నారు. ఇది అన్నిటికన్నా గొప్ప పరిణామం. ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా.. అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం... ఏ బాధనైనా మునిపంట బిగపట్టాలి.. ఏ కష్టాన్నయినా గుప్పిట్లో దాచిపెట్టాలి.. వంటి మాటలకు.. సలహాలకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే ఆడవాళ్ల ఇబ్బందులను, శారీరక మానసిక హింసనూ విని అర్థం చేసుకునేందుకు సమాజం రెడీ అయింది. ఇన్నాళ్లూ మహిళలు మౌనంగా ఉంది.. తనను వేధించిన వ్యక్తి కుటుంబం నాశనమవుతుందోమోననో.. లేక జరిగిన దానికి లోకం తననే తప్పు పడుతుందేమోననో.. తనింటి పరువు, మర్యాదా బజారున పడతాయేమోననో భయం వల్ల! నిజానికి ఇలాంటి భయానికి కారణం మన వ్యవస్థే. అంటే మనమే. అణచివేసి అణచివేసి గొంతు లేకుండా చేద్దామనుకున్నాం. కాని స్ప్రింగ్‌లాగా పైకి లేస్తుందనే లాజిక్ మరిచిపోయాం. శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి ఆ లాజిక్‌ను గుర్తుచేస్తున్నారు. వాళ్లు మాట్లాడ్డం మొదలుపెడుతున్నారు కాబట్టి కారణమైన మగవాళ్లకు అసహనంగా ఉండిఉండొచ్చు. కాని దుర్బలుల సహనాన్నీ గ్రహించింది సమాజం.. అందుకే వినడం మొదలుపెట్టింది. లేకపోతే అత్యంత పురుష దురహంకారిగా ముద్ర వేసుకున్న అగ్రరాజ్య అగ్రజుడు ట్రంప్ కూడా మహిళ మాట్లాడితే విననైతే విన్నాడు! అమెరికా సుప్రీంకోర్ట్ జడ్జిగా ట్రంప్ నామినేట్ చేసిన బ్రెట్ కవానా తన మీద లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది క్రిస్టీన్ బ్లేసీ అనే మహిళ. 1980ల్లో మేరీల్యాండ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. బ్లేసీ, కవానా ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు.. ఓరోజు తప్పతాగిన బ్రెట్.. బ్లేసీ దుస్తులు విప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని బ్రెట్ సుప్రీంకోర్ట్ జడ్జీగా నామినేట్ అయిన సమయంలో బయటపెట్టింది బ్లేసీ. ఈ ఆరోపణ మీద అమెరికాలోనూ చాలా వాద వివాదాలు జరిగాయి. బ్లేసీ చెప్పింది నిజమే అయుండొచ్చని బ్లేసీని నమ్మిన వాళ్లు 45 శాతం ఉంటే, బ్రెట్‌ను సపోర్ట్ చేసినవాళ్లు 38 శాతం. 45 శాతం అనేది ఇక్కడ గుడ్సైన్. ఇది మీ టూ వల్ల వచ్చిన చైతన్యం కావచ్చు.. ఆ ఉద్యమం కలిగించిన అవగాహన అయ్యుండొచ్చు.. ఏదైనా మంచి పరిణామం. ఆ కదలిక మన దగ్గరా వస్తోంది.. నిజానికి ఇది 1988లోనే రాజుకుంది. పంజాబ్ కేడర్ ఐఏఎస్ రూపన్ డియోల్ బజాజ్ .. ఆ టైమ్‌లో ఫైనాన్స్ మినిస్ట్రీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అప్పుడు కేపీఎస్ గిల్ చండీగఢ్‌కు (అప్పుడు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది) ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) గా ఉన్నారు. ఒక పార్టీలో కేపీఎస్ గిల్ తన పిరుదల మీద తట్టాడు అని కేసు నమోదు చేసింది రూపన్. అప్పుడు అదొక సంచలనం. హై ప్రొఫైల్స్ కలకలం సృష్టించింది. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి హైప్రొఫైల్.. సెన్సేషన్‌కు కేంద్రమైంది. కె. మంగపతిరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ తన కింది అధికారిణిని వేధించినట్టు కేస్ నమోదైంది. ఇవన్నీ కూడా మన దగ్గర ‘మీ టూ’కి ఆరంభ సూచికలే. తర్వాత కొంతమంది తమకు జరిగిన వేధింపుల గురించి నోరు విప్పినా.. మీడియా అత్సుత్సాహం.. వేధించిన వాళ్లకు పైవాళ్ల అండదండలుండటం వంటి కారణాల వల్ల మళ్లీ సైలెన్స్ స్టేట్లోకి వెళ్లిపోయారు బాధిత మహిళలు. అలాంటి సమయంలో దేశాన్నే ఒక్క కుదుపు కుదిపిన సంఘటన.. తెహల్కా మ్యాగజైన్ ఎడిటర్–ఇన్–చీఫ్ తరుణ్ తేజ్పాల్దే. తెహల్కా తరపున తరుణŠ తేజ్‌పాల్ గోవాలో ‘థింక్‌ఫెస్ట్’ ఈవెంట్ నిర్వహించాడు. ఆ రోజు రాత్రి హోటల్ లిఫ్ట్‌లో.. తన దగ్గర ఇంటర్న్‌గా చేరిన ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు ఆమె తీవ్రంగా హర్ట్ అయి ఫిర్యాదు చేసింది. అయితే ఈ అంశంలో తరుణ్ తేజ్‌పాల్ ఎంత అప్రతిష్ట పాలయ్యాడో ఆ అమ్మాయీ అంతే ప్రశ్నలను ఎదుర్కొంది. ధైర్యంగా.. చెప్పాలంటే తొలిసారిగా.. ‘‘మై బాడీ మై రైట్ (నా శరీరం మీద నాదే హక్కు)అని నినదించింది. అప్పుడు మొదలైంది ఆడవాళ్లతో సహా అందరూ ఆలోచించడం. నిజమే కదా.. ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు. చలం ఏనాడో చెప్పిన మాట.. ఇన్నాళ్లూ పెడచెవిన వేసి.. ఇప్పుడిప్పుడు వినడం ప్రారంభించాం. అందుకే మీ టూ అంటూ సైలెన్స్ బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. జర్నలిజం నుంచి సినిమా రంగానికి టర్న్ తీసుకుంది. తెలుగులో శ్రీ రెడ్డి.. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా ఇండస్ట్రీని షేక్ చేశారు. ‘మీ టూ’లో వేధింపుల చిట్టా పెరుగుతూంటే వింటోన్న మనం విస్తుపోతున్నాం. ఆ ప్రకంపనలు మళ్లీ జర్నలిజం వైపూ పాకాయి. ఎమ్జే అక్బర్ లాంటి దిగ్గజాల నుంచి కేఆర్ శ్రీనివాస్, టీఎస్ సుధీర్ వంటి వాళ్ల పేర్లూ లిస్ట్‌లో కనబడుతున్నాయి. ఆ జాబితా కొనసాగుతూనే ఉంది. అయితే.. వింటున్నాం.. కాని జరిగినప్పుడే చెప్పక.. ఇప్పుడెందుకు చెప్తున్నారు అన్న సందేహాన్నీ వెలిబుచ్చుతున్నాం. ఇందాకే అనుకున్నాం.. చెప్పకుండా దాచుకోవడానికి సమాజం మన నెత్తి మీద పరువనే పెద్ద బరువునే పెట్టింది. దాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. కాని దాని గడువు తీరింది. ఎక్స్పైరీ అయిపోయింది. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నట్లు.. అన్వాంటెడ్ టచ్‌ను.. ఇష్టంలేని స్పర్శ కలిగించిన అవమానాన్ని స్త్రీ ఎప్పటికీ మరిచిపోలేదు. జీవితాంతం ఆ వేదనను అనుభవిస్తూనే ఉంటుంది. అందుకే ఆమె ఆ కోపాన్ని, బాధను ఎప్పుడైనా వెలిబుచ్చవచ్చు. కాబట్టే ఆమెను వినాలి. అవును.. వింటున్నాం.. విని ఊరుకోవద్దు.. పరిస్థితులను మార్చాలి.. మనల్ని మనం మార్చుకోవాలి. – సరస్వతి రమ నిందితులు: తరుణ్ తేజ్‌పాల్, ఎం.జె.అక్బర్ నాలుగేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్ ఈ నెల 30న మరోసారి సుప్రీంకోర్టుకు హాజరవుతుండగా.. పూర్వపు జర్నలిస్టు, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ తాజాగా ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించిన తనుశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల కిందట ఓ సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన నటి తనుశ్రీ దత్తా బుధవారం తన ఫిర్యాదుకు మద్దతుగా 40 పేజీల డాక్యుమెంట్లను ముంబై పోలీసులకు సమర్పించారు. తనుశ్రీ దత్తా న్యాయవాది ఒషివరా పోలీస్ స్టేషన్‌తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్‌కూ ఈ పత్రాలను అందచేశారు. 2008లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో తనుశ్రీ తండ్రి తపన్ కుమార్ దత్తా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అప్పటి ఫిర్యాదు వివరాలు సైతం ఈ పత్రాల్లో పొందుపరిచారు. డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ రద్దైన క్రమంలో కొందరు పాత్రికేయులు తమ కార్లపై దాడి చేసి ధ్వంసం చేశారని అప్పట్లో తనుశ్రీ దత్తా తండ్రి ఫిర్యాదు చేసిన ఆధారాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అయితే నానా పటేకర్‌పై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ పత్రాల్లో ప్రస్తావన లేదు. కాగా 2008లో హార్న్ ఓకే ప్లీజ్ మూవీలో డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ నేపథ్యంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. -
నిర్మాత పైశాచికత్వం; ఆ ఫొటోలో ఉన్నది నేనే!
పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తమ చేదు అనుభవాలను బయటపెడుతుండగా.. తాజాగా నటి ఆశా(ఫ్లోరా) షైనీ కూడా ముందుకొచ్చారు. నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆశా షైనీ కెరీర్ తొలి నాళ్లలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టారు. ప్రేమ పేరిట నమ్మించి, తన జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసిన వ్యక్తి గురించి #మీటూ స్టోరీ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన మాజీ ప్రేమికుడు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషి తనను హింసించినందుకు సాక్ష్యంగా గాయాలతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆశా షైనీ..‘ అది నేనే. ఆరోజు 2007 వాలంటైన్స్ డే. అదే రోజు అందరికీ సుపరిచితుడైన, నేనెంతగానో ప్రేమించిన ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషి(దీవార్, ఆంఖే వంటి హిట్ చిత్రాల నిర్మాత) నన్ను చావబాదాడు. నా దవడలు వాచిపోయేలా కొట్టాడు. ఆరోజే చచ్చిపోతానేమో అన్పించింది. కొన్ని రోజుల తర్వాత అతడి గురించి బయటి ప్రపంచానికి నిజాలు చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి(తనను ఉద్దేశించి) మాటలు ఎవరూ నమ్మరని, ముఖ్యంగా తన గురించి ఈ విషయాలు బయటపెడితే నాకే నష్టమని, అవకాశాలు కూడా రావని గౌరంగ్ చెప్పాడు. అన్నట్టుగానే అడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ నన్ను తిరస్కరించేవారు. అలాగే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. ఒకానొక సమయంలో అసలు ఈ విషయం ఎందుకు బయటపెట్టానా అని ఎన్నో సార్లు బాధపడ్డాను. కానీ నాలాగే ఎంతో మంది అమ్మాయిల జీవితాలను అతడు నాశనం చేశాడని తెలుసుకున్న తర్వాత నేను చేసింది కరెక్టే కదా అని నన్ను నేను సముదాయించుకున్నాను. కాకపోతే నాలాగా గౌరంగ్ బాధితులందరు నేటికీ నోరు విప్పకపోవడం కాస్త బాధించే అంశం. అయితే గౌరంగ్ రాక్షసత్వానికి భయపడినందు వల్లే వాళ్లు ముందుకు రావడం లేదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. మంచిని ఆదరించే వాళ్లూ ఉన్నారు. ఎవరూ ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్లు కాదంటూ’ ఆశా షైనీ ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. కాగా కొన్నాళ్లు వెండి తెరకు దూరమైన ఆశా షైనీ.. ఫ్లోరా షైనీగా పేరు మార్చుకున్నారు. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్లోరా షైనీ దెయ్యం పాత్రలో నటించారు. -
మీ టూ కాదు యు టూ!
లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేశాక బాలీవుడ్లో ‘మీటూ’ (నేను కూడా) అంటూ చాలామంది తమకెదురైన చేదు అనుభవాలను బయటకు చెబుతున్నారు. ఈ విషయం గురించి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మాట్లాడుతూ – ‘‘స్త్రీలందరూ తమ మీద జరిగిన లైంగిక వేధింపులను మీటూ (నేను కూడా) అనే హ్యాష్‌ట్యాగ్ మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దానికి బదులుగా ‘యు టూ’ (నువ్వు కూడా) అని ఉపయోగించండి. ఎందుకంటే తప్పు వేధించేవాళ్ల వైపు ఉంది కాబట్టి. ఏ ఇండస్ట్రీలో అయినా ఆడవాళ్లకు పని చేసే వాతావరణం బాగుండాలి. సురక్షితంగా అనిపించాలి. అసలు అదే ముఖ్యమైన కనీస అవసరంగా ఉండాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇన్ని రోజులు బాధపడింది, భయపడింది చాలు, ఇక బయటకు రండి’’ అని వేధింపులకు గురైన ఆడవాళ్లకు ధైర్యం చెప్పారు శిల్పా శెట్టి. -
అందుకే మౌనంగా ఉన్నా
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల గురించి దాదాపు వారం రోజులుగా వాడి వేడి చర్చ జరుగుతోంది. కానీ నానా పటేకర్ మాత్రం ఆ విషయంపై నోరు మెదపలేదు. తన సినిమా షూటింగ్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తనుశ్రీ విషయంపై స్పందిస్తానంటూ సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బాలీవుడ్ మీడియాకు చెప్పి, చివరి నిమిషంలో ఆ ప్రెస్‌మీట్‌ని క్యాన్సిల్ చేశారు నానా. కానీ అక్కడికి వెళ్లిన మీడియాతో తన ఇంటి ముందు కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగ్గా – ‘‘మా లాయర్ నన్ను తనుశ్రీ విషయమై ఏమీ మాట్లాడొద్దన్నారు. అందుకనే ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేదు. నేను పదేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను. ఎందుకంటే పదేళ్లయింది కదా అని నిజం మారిపోదు కదా’’ అని పేర్కొన్నారు. -
తనుశ్రీదత్తా ఆరోపణలపై స్పందించిన నానా
-
‘ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంటాడు కదా’
హాలీవుడ్ సినీ దిగ్గజం హార్వీ వీన్‌స్టీన్ బాగోతం బట్టబయలైన నాటి నుంచి పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ధైర్యంగా గళం విప్పుతున్నారు. సెలబ్రిటీలు మొదలు ప్రతీ ఒక్కరూ ‘మీటూ’ అంటూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ.. ప్రముఖ నటుడు నానా పటేకర్ నుంచి వేధింపుల గురించి నోరు విప్పడంతో భారత్‌లోనూ మీటూ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్లుగానే కొంతమంది తనుశ్రీకి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం అవన్నీ అవాస్తవాలంటూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. అంతటితో ఆగకుండా పదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టడం ఎందుకు, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ నిందిస్తున్నారు కూడా. ఇవన్నీ కొంతమంది అభిప్రాయాలు మాత్రమే. కేవలం నిబంధనల కారణంగానే..! ఇవన్నీ కాసేపు పక్కన పెడితే...‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(సింటా) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. కఠినంగా శిక్షిస్తాం! ఈ క్రమంలో తనుశ్రీకి మద్దతుగా నిలిచిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా మీటూ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో... ఘటన జరిగిన మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాలనే నిబంధన కారణంగా చాలా మందికి ఫిర్యాదు చేసే అవకాశం లభించడం లేదు. ఈ విషయంపై స్పందించిన మేనకా గాంధీ... పని ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు.. ఘటన జరిగిన పది నుంచి పదిహేనేళ్ల తర్వాత కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు సవరించే విధంగా న్యాయశాఖకు లేఖ రాశామని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘మిమ్మల్ని వేధించిన వ్యక్తి ఎవరో జీవితకాలం గుర్తు ఉంటాడు కదా. అందుకే ఫిర్యాదు చేసే విషయంలో నిబంధనలు సరిచేయాలంటూ న్యాయశాఖకు లేఖ రాశాం. వేధింపులు ఎదురైన పదేళ్ల తర్వాత కూడా మీ ఫిర్యాదు స్వీకరిస్తారు. కాలం గడుస్తున్నంత మాత్రాన ఆ చేదు అనుభవాల తాలూకు ఙ్ఞాపకాలు చెరిగిపోవు. అందుకే ఇకపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని’ మేనకా గాంధీ స్పష్టం చేశారు. అలాగే మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, బాధితులు తమ బాధను పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకూడదని పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో ఉద్యమం పట్టు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. కాగా మహిళల సంఖ్యకు అనుగుణంగా ప్రతీ సంస్థలోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అలాగే వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని మూడేళ్ల లోపు సెల్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే 18 ఏళ్ల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిమితిని 30 ఏళ్లకు పెంచాల్సి ఉందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. -
వెనక్కి తగ్గిన నానా పటేకర్? ప్రెస్‌మీట్ రద్దు
సాక్షి,ముంబై: తనూశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి తనూశ్రీ చేసిన లైంగిక ఆరోపణలపై సమాధానం చెపుతానని చెప్పిన నానా పటేకర్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. తనూశ్రీ ఆరోపణలను తోసిన పుచ్చిన నానా పటేకర్ అక్టోబర్ 8న నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. అనూహ్యంగా నేటి ప్రెస్‌మీట్ రద్దు చేసినట్టుగా నానా పటేకర్ కుమారుడు మల్హర్ మీడియాకు సమాచారం అందించారు. దీనిపై తదుపరి సమాచారాన్ని తెలియచేస్తామని తెలిపారు. విలక్షణ నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు నానా పటేకర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. అయితే తనూశ్రీ దత్తా ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా అవన్నీ అబద్ధాలు.. పదేళ్ల క్రితమే దీనికి సమాధానం చెప్పాను కదా అంటూ దాటవేస్తూ వచ్చారునానా పటేకర్. చాలాసార్లు మీడియా ప్రతినిధుల ప్రశ్నల్ని లెక్కచేయకుండా మైకులను పక్కకి తోసుకుంటూ వెళ్లిపోయారు. అయితే అక్టోబర్ 8న ప్రెస్‌మీట్ ద్వారా ఈ ఆరోపణలకు సమాధానం చెబుతానని ప్రకటించారు. దీంతో నానా సమాధానంపై పలువర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకింది. అయితే అనూహ్యంగా ఈ మీట్‌ను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో నానా మీడియాకు ముఖం చాటేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా పదేళ్ల క్రితం 2008లో హార్న్ ఒకే ప్లీజ్ సినిమా సెట్లో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేశాడని తనుశ్రీ దత్తా ఆరోపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మీటూ ఇండియా ఉద్యమం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. -
తనూశ్రీ ఫొటోలు తగులబెట్టిన మహిళలు
తనూశ్రీ- నానా పటేకర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొంత మంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో కూడా మీటూ ఉద్యమం బలపడుతోంది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మహిళా రైతులు, వితంతువులు తనూశ్రీపై మండిపడుతున్నారు. నానా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తూ ఆమె ఫొటోలను తగులబెడుతున్నారు. ‘ నానా మాకు పితృ సమానులు. అప్పుల బాధ తట్టుకోలేక భర్తలు ప్రాణాలు తీసుకుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. కరువుతో అల్లాడుతున్న మా లాంటి ఎంతో మంది వ్యక్తులకు ఆయన చేయూత అందించారు’ అంటూ ఓ మహిళ పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని విదర్భ లాంటి కరువు ప్రాంతాల్లోని రైతులకు అండగా ఉండేందుకు నానా పటేకర్ నామ్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. -
నానా పటేకర్‌పై తనూశ్రీ దత్తా ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు’ అని ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్ తెలిపారు. జోథ్‌పూర్‌లో జరుగుతున్న హౌస్‌ఫుల్–4 సినిమా షూటింగ్ నుంచి ఇక్కడికి చేరుకున్న పటేకర్ ఈ విషయమై స్పందిస్తూ..‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’ అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్ నోటీసు పంపారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. -
నీలాంటి మగాళ్ల వల్లే!
ట్వీటర్లో సోనమ్ కపూర్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా ట్వీటర్ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్. ‘‘నా ట్వీటర్ అకౌంట్‌ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు సోనమ్. ఓ నెటిజన్ చేసిన విమర్శలే సోనమ్ ట్వీటర్‌కి ఫుల్స్టాప్ పెట్టడానికి కారణమని బాలీవుడ్ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ– ‘‘సోనమ్... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్ వార్మింగ్‌కి కారణం అవుతారు. ఫస్ట్ మీ పాపులేషన్‌ని కంట్రోల్ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్ అయ్యారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. -
వెలుగులోకి మరో వేధింపు.. ఇంకా ఎన్నో?
ఫాంథమ్ ఫిల్మ్స్.. బాలీవుడ్లో భారీ ప్రొడక్షన్ హౌస్. బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, వికాస్ బాల్, నిర్మాత మధు మంతెన కలసి స్థాపించిన నిర్మాణ సంస్థ. 2011లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కారణం ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకరైన వికాస్ బాల్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడమే. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసినట్టే బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాల్‌పై కూడా ఓ మహిళ ఆరోపణలు చేశారు. ఇది కూడా పై కేస్లానే ఎప్పటిదో. మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఫీమేల్ ఓరియంటెడ్ సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ని తెరకెక్కించిన దర్శకుడు వికాస్. ఫాంథమ్ ఫిల్మ్స్ తీసిన ‘బాంబే వెల్వెట్’ సినిమాకు కెమెరా వెనక పని చేసిన ఓ మహిళ వేధింపులకు గురయ్యానని ఆరోపించారు. 2015 మేలో ఈ ఘటన జరిగిందట. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు వికాస్ తనతో తప్పుగా ప్రవర్తించాడని పేర్కొన్నారామె. అప్పట్లో అనురాగ్ కశ్యప్‌తో ఈ విషయం చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదం చెలరేగడంతో అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘జరిగింది తప్పే. మేం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాం. వికాస్ బాల్ చేసింది చాలా పొరబాటు’’ అని రెండురోజుల క్రితం బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో పేర్కొన్నారట. ఆ వెంటనే ‘‘ఫాంథమ్ మా కల. కలలు కూడా కొన్ని సార్లు ముగింపుకు చేరుకుంటాయి. మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. గెలిచాం, ఓడాం. ఇందులోని ఎవరి ప్రయాణం వాళ్లు సొంతంగా సాగిద్దాం అనుకుంటున్నాం. మా అందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ ఫాంథమ్ సంస్థను రద్దు చేస్తున్నాం అని అనురాగ్ పేర్కొన్నారు. ‘క్వీన్’లో నటించిన కంగనా ఆ చిత్రదర్శకుడు వికాస్ బాల్ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం ఉండి ఉండొచ్చన్నారు. ‘‘బాల్కి 2014లోనే పెళ్లయింది. కాని రోజుకో కొత్త పార్ట్నర్ కావాలన్నట్లు మాట్లాడేవాడు. సెట్లో క్యాజువల్‌గా గట్టిగా హగ్ చేసుకుని, నీ జుట్టు సువాసన బావుంటుంది అనేవాడు. ఆ కౌగిలి నుంచి తప్పించుకోవడానికి చాలా ధైర్యం కూడదీసుకునేదాన్ని. నేనా అమ్మాయి ఆరోపణలు నమ్ముతున్నా. ఆమెను సపోర్ట్ చేశానని నాకోసం తెచ్చిన స్క్రిప్ట్ గురించి మళ్లీ మాట్లాడటం లేదు’’ అని ఘాటుగా స్పందించారు. -
నా మనస్సాక్షిని చంపుకోలేను!
సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ అంటూ దక్షిణాదిలో నటిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్లో సెటిల్ అయిన నటి తాప్సీ. ఈ మధ్య తనకు సంబంధం లేని విషయాల్లో కూడా నేనున్నానంటూ బయలుదేరుతుంది తాప్సీ. ఈ అమ్మడి వ్యవహారం ఎటుదారి తీస్తుందో తెలియదుగానీ బింకాలు మాత్రం బాగానే పోతోంది. అసలు కథేంటంటే తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర, తమిళంలో విశాల్‌కు జంటగా తీరాద విళైయాట్టు పిళ్లై చిత్రాల్లో హీరోయిన్గా నటించిన తనూశ్రీదత్తా గురించి అప్పట్లో పెద్దగా తెలియని వారుంటారేమోగానీ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ వంటి వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది.ఈ విషయంలో నటి తనూశ్రీదత్తాపై విమర్శించేవారి సంఖ్యతో పాటు మద్దతిచ్చే వారి సంఖ్యంగా బాగానే ఉంది. ఎప్పుడో పదేళ్ల ముందు జరిగిన సంఘటనలను ఇప్పుడు బయట పెట్టడం ఏమిటని విమర్శిస్తున్న వాళ్ల మధ్య తనూశ్రీదత్తా ఆరోపణలకు ఆధారాలున్నాయని ఆమెకు మద్దతుగా నిలిచేనటి తాప్సీ లాంటి వారు ఉన్నారు.అసలు తనూశ్రీ గురించి నటి తాప్సీ ఏమందో చూద్దాం. సంఘటన జరిగినప్పుడే దాని గురించి బహిరంగంగా చెప్పవచ్చుగా అని నేను తనూశ్రీదత్తాను అడగను. ఆమె ఇంతకు ముందే పిర్యాదు చేసింది. అయితే అప్పట్లో ఆమెను గొంతు నొక్కే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. దీంతో తనూశ్రీ ఇప్పుడు వాయిస్ పెంచింది. నాకు ఆమె మీద గానీ, తన ఉద్దేశంపైగానీ ఎలాంటిసందేహాలు లేవు. ఆమె అసభ్య సంఘటనకు గురైంది. అందుకు ఆధారాలు ఉన్నాయి. అందుకే 10 ఏళ్ల తరువాత గానీ, 40 ఏళ్ల తరువాత గానీ ఫిర్యాదు చేయడం పెద్ద విషయం కాదు. ఆ సంఘటనకు సంబంధించిన ప్రశ్నలకు తనూశ్రీ దత్తా చాలా ధైర్యంగా బదులిస్తున్నారు. అందులో ఆమె నిజాయితీ తెలుస్తోంది. తనూశ్రీదత్తాను చూసి ఆమెలా బాధింపునకు గురైనవారు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలన్నది నా భావన. ఆమె విషయంలో నా మనసుకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. నేను నా మనసాక్షిని చంపుకుని జీవించలేను. ఇతరులేమనుకుంటారు అని భయపడుతూ జీవించలేను. నాకు నచ్చిన విధంగానే జీవిస్తాను. నా మససు స్వచ్ఛంగా ఉండబట్టే రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నాను అని తాప్సీ పేర్కొంది. నటుడు నానాటేకర్ నటి తనూశ్రీదత్తాతో అసభ్యంగా ప్రవర్తించలేదని, అసలు అలాంటి సంఘటనే జరగలేదని చెబుతున్నారు. నటి తనూశ్రీ దత్తా వద్ద అధారాలున్నాయని నటి తాప్సీ ఆమెకు వకాల్తా పలుకుతోంది. మరో పక్క నానాపటేకర్ ఈ వ్యవమారంలో నటి తనూశ్రీదత్తాకు నోటీసులు పంపారు. దీంతో ఈ రచ్చ ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది. -
‘అతనో ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు’
తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యింది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ చేసిన ఆరోపణలు మన దేశంలో కూడా ‘మీటూ’ ఉద్యమానికి ఆరంభంగా నిలిచాయంటున్నారు ప్రముఖులు. కానీ ఈ ప్రారంభం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు. కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాల గురించి పెద్ద హీరోలు మాట్లాడకపోవడం. తనుశ్రీ వివాదం గురించి ఇంతవరకూ బాలీవుడ్ స్టార్ హీరోలైనా అమితాబ్ బచ్చన్ కానీ, ఖాన్ హీరోల త్రయం కానీ స్పందించలేదు. అయితే తనుశ్రీ - నానా వివాదంలో స్వరా భాస్కర్, ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌లు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి వరుసలోకి మహేష్ భట్ తనయ పూజా భట్ చేరారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తనుశ్రీ, నానా పటేకర్ తనను లైంగింకంగా వేధించాడని చెప్పినప్పుడు చాలా మంది ‘ఇమె పదేళ్లు నోర్ముసుకుని ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది’ అనడం నేను స్వయంగా విన్నాను. అంతేకాక కొంత మంది ‘నానా చాలా మంచి వ్యక్తి’ అంటూ అతనికి కితాబు ఇస్తున్నారు.. కానీ కొందరు అతన్ని రౌడీ అని పిలవడం కూడా నేను విన్నాను. ఈ విషయంలో తనుశ్రీ ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాను ఈ విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పూజా తన గతాన్ని గుర్త చేసుకుంటూ ‘ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో బంధాన్ని కలిగి ఉండేదాన్ని. అతను చాలా ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు. అతని గురించి నేను మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ‘ఎందుకు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నావ్.. ఇలాంటి చెత్త గురించి బహిరంగాగా చర్చించడం వల్ల లాభం ఏంటి’ అని ప్రశ్నించింది. కానీ హింసను ఎదుర్కొన్నది నేను. మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రాన నాకు తక్కువ బాధ కలగదు కదా’ అంటూ ప్రశ్నించారు. అంతేకాక ‘నన్ను కిందకు లాగిన వారికి.. నా మంచితనాన్ని చెరపేసిన వారికి.. నన్ను నాశనం చేయాలని చూసిన వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే వీటన్నింటి వల్ల నాకు నా బలం ఏంటో తెలిసింది. సమాజం ఎలా ఉంటుందో తెలిసిందో. సమస్యలతో ఎలా పోరాడాలో తెలిసింది. అన్నింటికి మించి నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. నా సమస్యలతో నేనే పోరాటం చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని నేను కూడగట్టుకున్నాను. నేను బాధితురాలిని.. నా సమస్యలతో నేనే పోరాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
తనుశ్రీకి అనుష్క బాసట..
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా- నానా పటేకర్ వివాదంలో తనుశ్రీ దత్తాకు బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌లు బాసటగా నిలిచారు. వారి వాదనను, వారు ఎదుర్కొన్న వేదనను సమాజం ముందుకు తెచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యక్తుల మనోభావాలను మనం అర్థం చేసుకోవాలని అనుష్క శర్మ అన్నారు. సుయిధాగా మూవీ మీడియా మీట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు అనుష్క బదులిస్తూ తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ ధైర్యంగా ముందకొచ్చి మాట్లాడటం నిజంగా సాహసమని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా దీని వెనుక నిజం ఉండి ఉంటుందని చెప్పుకొచ్చారు. తనుశ్రీ వ్యాఖ్యలపై కామెంట్ చేయడం, ఆమె వ్యక్తిత్వంపై భాష్యాలు చెప్పడం కంటే ఆమె చెబుతున్నది వినాలని, అర్ధం చేసుకోవాలని అనుష్క పేర్కొన్నారు. తనుశ్రీకి న్యాయం జరిగే వరకూ తాను ఆమె వెంట ఉంటానని అన్నారు. ఇక వరుణ్ ధావన్ సైతం తనుశ్రీ దత్తాకు మద్దతుగా మాట్లాడారు. తన సినిమా సెట్లో ఇలాంటివి జరిగితే తాను బాధితుల పక్షాన ముందుకొచ్చేవాడినన్నారు. తనుశ్రీ లేవనెత్తిన విషయాలపై విచారణలో వాస్తవాలు నిగ్గుతేలతాయన్నారు. కాగా 2008లో ఓ సినిమా షూటింగ్లో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. -
తనుశ్రీపై కేసు నమోదు
సాక్షి, ముంబై : నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్త సుమంత్ దాస్ ఫిర్యాదుతో బీడ్ జిల్లాలోని కైజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఎంఎన్ఎస్ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రాజ్‌థాకరే, ఎంఎన్ఎస్ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో వద్దు.. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. -
షూటింగ్లో నాకూ అలాగే జరిగింది : నటి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపులపై టీవీ నటి సప్నా పబ్బీ నోరు విప్పారు. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదని ఆమె వాపోయారు. నానా పటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించారు. అనిల్‌కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘24’ సిరీస్‌లో సప్నా నటించారు. 24 చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో తెలుపుతూ సప్నా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. (ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి) వెకిలి నవ్వులు.. పాటకు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక బిగుతైన బికినీ వేసుకోవాల్సి వచ్చిందనీ, అది తనకెంతో అన్‌కంఫర్ట్‌గా అనిపించిందని సప్నా పేర్కొన్నారు. ఆ ఇబ్బందికి పరిష్కారంగా నేనొక చిన్న సలహా ఇస్తే ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. పైగా తన మాటలకు దర్శకుడు, స్టైలిస్ట్ (లేడీ) వెకిలిగా నవ్వి తనను మరింత బాధపెట్టారని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 7 గంటలపాటు ఆ బికినీ ధరించాల్సి రావడంతో.. ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చిందని సప్నా తన పోస్టులో ఆవేదన చెందారు. తనకు తోడుగా నిలవాల్సిందిపోయి.. నా స్టైలిస్ట్ దర్శకుడితో కలిసి జుగుప్సాకరంగా నవ్విందని మండిపడ్డారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ ప్రోగ్రాం నుంచి తనను తొలగిస్తారనే భయంతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపారు. కాగా, నటుడు నానా పటేకర్‌తో పాటు దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై తనుశ్రీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (చదవండి : నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..) -
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి
‘ఏంటి ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను, పోకిరి వేషాలు వేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టించే అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. అసలేం జరిగింది? మనందరికీ ఏమయ్యింది?’ అంటూ నటి స్వరా భాస్కర్ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులను ఉద్దేశించి ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ట్వీట్ చేసి మరోసారి తనుశ్రీ దత్తాకు తన మద్దతు తెలిపారు. కాగా తనుశ్రీ- నానా పటేకర్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించారు. అలాగే ఆ సమయంలో నానాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనుశ్రీ పబ్లిసిటీ కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనూశ్రీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. తనూశ్రీ తన చెల్లెలితో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి వారికి లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన స్వరా భాస్కర్ ఎంఎన్ఎస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేసి తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. IS THIS A JOKE?????? Or are we now just okay with institutionalised hooliganism?????? And who takes pictures with the goons that threaten vandalism????? WHAT IS WRONG WITH US GUYS??!???? https://t.co/dL8gZvlYAR — Swara Bhasker (@ReallySwara) October 4, 2018 -
లైంగిక వేధింపులు నిజమే : కాజోల్
మహిళల పట్ల లైంగిక వేధింపులు నిజమేనంటున్నారు నటి కాజోల్. అంతేకాక ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమతం కాలేదని అన్ని చోట్ల జరుగుతున్నాయని తెలిపారు. తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంపై స్పందిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. కానీ దీని గురించి విన్నాను. వేధించిన వారు ఎవరైనా సరే బయటకు వచ్చి ‘హే మేం ఇలాంటి పని చేశాం అని చెప్పుకోరు కదా’’ అన్నారు. అంతేకాక ఇలాంటి సంఘటనలు ‘నా కళ్ల ముందు జరిగితే చూస్తూ ఉండేదాన్ని కాదు. ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ అలాంటి సంఘటనలు నా ముందేం జరగలేదు. లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.. అన్ని చోట్ల ఉన్నాయన్నా’రు. విదేశాల్లో వచ్చిన ‘మీటూ’ లాంటి ఉద్యమం మన దేశంలో కూడా రావాలన్నారు. మన కోసం మనమే నిలబడాలి, మనమే పోరాటం చేయాలని వ్యాఖ్యానించారు. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..
ముంబై : పదేళ్ల కిందట సినిమా సెట్స్‌లో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి బుధవారం లీగల్ నోటీసులు అందాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా సెట్లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించారని, దీనిపై తాను గొంతెత్తగా తనపై మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన కార్యకర్తలను ఉసిగొల్పారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో దర్శకుడు వివేక్ తన దుస్తులు తొలగించాలని కోరారని ఆమె ఆరోపించారు. తనకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని దేశంలో వేధింపులు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. వారి (నానా పటేకర్, వివేక్) మద్దతుదారులు తనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. తన ఇంట్లోకి చొచ్చుకువచ్చేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానాలకు లాగడం ద్వారా వ్యయప్రయాసలకు లోనుచేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు ఎలాంటి ముగింపు లేకుండా దశాబ్ధాల పాటు సాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తనుశ్రీ దత్తాను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నానా పటేకర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చారు. సెట్‌పై 50 మంది వ్యక్తులున్నారని, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా సహా ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నానా పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోడ్కర్ చెప్పారు. -
‘బిగ్‌బాస్‌లో తనుశ్రీ పాల్గొంటే అలా జరగొచ్చు’
సినిమా చిత్రీకరణలో సహ నటులు, దర్శకుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తనుశ్రీ దత్తా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు. నటుడు నానా పటేకర్, దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, నానాపై ఆరోపణలు మానుకోవాలని వచ్చిన ఒత్తిడులకు తలొగ్గొలేదని ఆమె మంగళవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నానాపై ఆరోపణలు చేయొద్దని రాజ్‌థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. కాగా, తనుశ్రీ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఇంటి చుట్టూ 24 గంటల పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ కేస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తనుశ్రీ విజ్ఞప్తి మేరకు రక్షణ కల్పించామని అన్నారు. ఈ చర్యను నానా పటేకర్‌కు వ్యతిరేకమైందిగా భావించొద్దని అన్నారు. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. (చదవండి : తనుశ్రీకి మద్దతుగా నిలిచిన మేనకాగాంధీ) -
క్షమాపణలు సరిపోవు
నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు హిందీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘హార్న్ ఓకే ప్లీజ్ ’ సినిమా టైమ్‌లో నానా పటేకర్ తనను వేధించిన విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు (సీఐఎన్‌టీఏఏ) ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని తనుశ్రీ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే తనుశ్రీ కారుపై జరిగిన దాడి తాలూకు వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో నిజమా? కాదా? అనే చర్చ జరుగుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సీఐఎన్‌టీఏఏ స్పందించింది. ‘‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులను మా అసోసియేషన్ తేలికగా తీసుకోదు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తనుశ్రీ వివాదం కొలిక్కి రావాలని అందుకోసం ఓ ఎంక్వైరీ టీమ్ ఉండాలని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీఐఎన్‌టీఏఏ ప్రతినిధులు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనుశ్రీకి ఎవరో బెదిరింపు కాల్స్ చేయడంతో ఆమెకు ముంబై పోలీసులు రక్షణ కూడా ఇస్తున్నారన్నది తాజా సమాచారం. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నానా పటేకర్ నుంచి తనకు ఇంకా ఏ నోటీసులు రాలేదని తనుశ్రీ అంటున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే నటి డింపుల్ కపాడియా ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నానా ఎంతో ప్రతిభ ఉన్నవాడని ప్రశంసల వర్షం కురిపించిన డింపుల్ అతనిలో ఉన్న ‘డార్క్ సైడ్’ కూడా తెలుసు అనడం విశేషం. -
తనుశ్రీ వివాదం.. బిగ్‌బాస్‌కు హెచ్చరిక
ముంబై: తనుశ్రీ దత్త, నానా పటేకర్‌ల వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు తనుశ్రీకి మద్దుతుగా నిలువగా మరికొందరు ఈ విషయంపై మాట్లాడానికి ఆసక్తి కనబరచడం లేదు. కాగా, పదేళ్ల కిందట ప్లీజ్ హార్న్ ఓకె చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై వేధింపులకు దిగాడని తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తనుశ్రీకి మద్దుతుగా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో తనుశ్రీ మాట్లాడుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. నానా విషయంలో తనపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎంఎన్ఎస్ తీవ్రంగా ఖండించిది. ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు అమేయ కోప్కర్ మాట్లాడుతూ.. తనుశ్రీ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆమెపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు. తనుశ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. కానీ తాము దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదని తెలిపారు. నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన తరువాత తనుశ్రీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో వివాదాలు కేంద్రంగా నడిచే బిగ్‌బాస్ రియాల్టీ షోలోకి తనుశ్రీని తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఎంఎన్ఎస్పై తప్పడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి నిర్వహకులకు ఓ లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా హిందీ బిగ్‌బాస్ 12వ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
తనుశ్రీ- నానా వివాదం : శక్తికపూర్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందించిన తీరు నవ్వులు పూయిస్తోంది. నానా పటేకర్ 2008లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమె చవకబారు ప్రచారం కోసమే నానాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలపై శక్తికపూర్ స్పందన కోరగా, ఇది పదేళ్ల కిందటి వివాదమని అప్పుడు తాను చిన్న పిల్లవాడినని, దీనిగురించి తనకేమీ తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్లో దిగ్గజాలు సైతం తనుశ్రీకి బాసటగా నిలుస్తున్న నేపథ్యంలో శక్తికపూర్ వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కాగా సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా వంటి పలు నటీనటులు తనూశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి నటులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. -
తనుశ్రీకి మద్దతుగా నిలిచిన మేనకాగాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. మహిళల భద్రతపట్ల కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని వెల్లడించారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ‘షీ బాక్స్’ ఫిర్యాదుల వ్యవస్థ గురించి తెలిపారు. ఇకపై మహిళలు తమపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారం గురించైనా క్షణాల్లో తమ దృష్టికి తీసుకురావొచ్చని అన్నారు. షీ బాక్స్ ఆన్లైన్ వేదిక ద్వారా వేధింపులకు గురైన మహిళలు క్షణాల్లో ఫిర్యాదు చేసి రక్షణ పొందొచ్చని వివరించారు. ఇదిలా ఉండగా.. మన దేశంలో కూడా ‘మీటూ’ వంటి ఉద్యమం మొదలవ్వాలనే మేనకా గాంధీ పిలుపపై తనుశ్రీ స్పందించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పడంతో కెరీర్ అంధకారంలో పడింది. అయినా, దేనికీ వెరవకుండా నా బాధను ప్రపంచానికి తెలియజేశా. కానీ, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ‘పెద్ద మనుషులు’ దర్జాగా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న దేశంలో మీటూ వంటి ఉద్యమాలు పురుడు పోసుకోలేవని అన్నారు. పెరిగిన మద్దతు.. 2008లో ‘హర్న్ ఓకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేసే క్రమంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తీవ్ర విమర్శలు చేయడం సంచలనం రేపింది. నానా వేధింపులపై నోరు విప్పినందుకే తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2010 వచ్చిన ‘జగ్ ముంద్రా అపార్ట్మెంట్’లో తనుశ్రీ చివరగా నటించారు. దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై కూడా తనుశ్రీ ఆరోపణలు చేశారు. కాగా, బాలీవుడ్ ప్రముఖులు ఫరాఖాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, అనురాగ్ కశ్యప్, రేణుక షహానే తను శ్రీకి మద్దతుగా నిలిచారు. -
నానాలో ఉన్న క్రూరత్వాన్ని నేనూ చూశా : సీనియర్ నటి
సీనియర్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీకి మద్దతుగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు గళం విపుతున్నారు. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హాలీవుడ్ మీటూ ఉద్యమం లాగా తనుశ్రీ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ సీనియర్ నటుడు చాలా మంది మహిళా నటీమణులను వేధించినట్టు వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎనిమిదేళ్ల క్రిందట ఎన్డీటీఈ ఇంటర్వ్యూలో నానా పటేకర్ గురించి సీనియర్ నటి డింపుల్ కపాడియా చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని తాను కూడా చూశానని నటి డింపుల్ కపాడియా అప్పట్లో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2010లో ‘తుమ్ మిలో తో నహి’ రిలీజ్ సందర్భంగా డింపుల్ కపాడియా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నేళ్లు నానాతో కలిసి నటించారు కదా..! పటేకర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించాదా? లేదా గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్‌ను సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో కూడా ఓ చీకటి కోణం ఉంది’... మంచి విషయంలోనూ, చెడు విషయంలోనూ రెండింటిలో చెప్పాలంటే.. నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడిలో కూడా చెడు కోణం ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు. డింపుల్ కపాడియా, నానా పటేకర్ పలు ఐకానిక్ సినిమాలు తీశారు. 1991లో ఫైనల్ అటాక్, 1992లో అంగర్ వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఇటీవల నటి రేణుకా షహానే కూడా నానా పటేకర్‌పై పలు ఆరోపణలు చేశారు. పటేకర్ స్థిరత్వం లేని వ్యక్తని, ఆయన స్వభావం వల్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాధపడ్డారని చెప్పారు. Nana Patekar's "dark side" has always been an open secret in Bollywood. Dimple Kapadia said this 8 years ago. pic.twitter.com/9hbd0WmcZo — Od (@odshek) September 28, 2018 -
బిగ్ బీ మాటలు నన్ను బాధించాయి : తనుశ్రీ
అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చిన తనుశ్రీ దత్తా బాలీవుడ్లో చిన్న సైజ్ బాంబ్లాంటిదే పేల్చారు. ఆ మోత ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసింది. అయితే ఈ వేధింపులు జరిగి ఇప్పటికి దశాబ్దం అవుతోంది. ఈ వివాదం జరిగినప్పుడు ఎక్కువగా స్పందించని బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులు తనుశ్రీకి మద్దతు తెలిపారు. అయితే ఇంత జరుగుతున్న స్టార్ హీరోలు కానీ, ఖాన్ల త్రయంతో సహా బిగ్ బీ అమితాబ్ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు అభిమానులు. మిగితా వారి సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో బిగ్ బీ తీరు మాత్రం ఒకింత నిరాశపర్చేవిధంగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకు కారణం తనుశ్రీ వివాదం పట్ల అమితాబ్ స్పందించిన తీరు. తనుశ్రీ - నానా వివాదం గురించి అమితాబ్‌ను ప్రశ్నించగా ఆయన ‘నేను తనుశ్రీని కాదు.. నానా పటేకర్‌ని కాదు.. మరి నేను ఎలా స్పందించాలి’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. అయితే అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ తీవ్రంగా మండిపడుతున్నారు. బిగ్ బీ లాంటి సూపర్ స్టార్ ఇలా మాట్లాడటం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇలాంటి స్టార్లందరూ సినిమాల్లోనే ఆదర్శాలను వల్లిస్తారు తప్ప నిజ జీవితంలో కాదంటూ తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘మీ(బిగ్ బీ) ముందు ఇలాంటి వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు ఎవరో ఒక పక్షాన మాట్లాడటం అవసరం. కానీ మీ సమాధానం నన్ను చాలా బాధపెట్టింది. మహిళలకు జరిగే అన్యాయాల గురించి మాట్లడలేని వారు, ఆడవారికి మద్దతు తెలిపే సినిమాల్లో, ప్రకటనల్లో నటించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నారు. అంతేకాక ఆమె ‘ఈ విషయం గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడను.. టీవీ చానెల్సలో కూడా మాట్లాడను. కానీ జనాల నుంచి కూడా సరైన స్పందన లేదు. ఇది నా ఒక్కర్తి బాధ మాత్రమే కాదు. ఇండస్ట్రీలోని ఎందరిదో. వారంతా ఇలా ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. కానీ నేను అలా కాదు. నా ధర్మాన్ని పూర్తిగా నిర్వహిస్తాను. ఫలితాన్ని భగవంతుడికి వదిలివేస్తాను. ఇక మీదట నేను బాలీవుడ్లో నటించను. అమెరికా వెళ్లి పోతాన’న్నారు. -
నాకెలాంటి నోటీసులు అందలేదు: తనుశ్రీ
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్‌ల వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీ చేసే ఆరోపణలు అసత్యమైనవని, క్షమాపణలు చెప్పాలని ఆమెకు నోటీసులు పంపామని పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ మీడియాకు తెలిపారు. తనుశ్రీ మాత్రం తనకు నానాపటేకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈ నోటీసులు బెదిరింపులు.. తనలాంటి మరింత మంది బాధితులను బయటకు రాకుండా భయపెట్టడానికేనన్నారు. ఎవరికైనా తనలాంటి అనుభవమే ఎదురైతే ధైర్యంగా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటివాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం మొత్తం మద్దతినిస్తుందని తెలిపారు. ఇక తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. చదవండి: తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు -
లైంగిక వేధింపులు : తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఆ అనంతరం తనుశ్రీ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పారు. ప్రస్తుతం తనుశ్రీ చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు అసత్యమైనవని, పూర్తిగా అవి తప్పుడు ఆరోపణలంటూ పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ చెప్పారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు. ఈ నోటీసుల్లో ఆమె చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని ఉన్నట్టు రాజేంద్ర శిరోద్కర్ ధృవీకరించారు. ‘ఇప్పుడు తనుశ్రీ ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. కానీ ఏమో కారణాలు ఉండి ఉంటాయి. నానా ఈ రోజు లేదా రేపు ముంబైకి వస్తారు. వచ్చిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. రేపు కచ్చితంగా నానా ఇక్కడ ఉంటారు’ అని శిరోద్కర్ చెప్పారు. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. మరోవైపు తనుశ్రీపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో సెట్స్‌లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం తనుశ్రీకే మద్దతు ఇస్తున్నారు. డ్యాన్సర్ నుంచి నటిగా మారిన డైసీ షా కూడా తనుశ్రీకే మద్దతు పలికారు. హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో పాటను షూట్ చేస్తున్న సమయంలో తొలి రెండు రోజులు బాగానే ఉందని, కానీ మూడో రోజు మాత్రం ఏదో జరిగిందని తనకు అర్థమైందని తెలిపారు. ఆ సమయంలో తన జాబ్ తనుశ్రీకి, ఆమె టీమ్‌కు స్టెపులు నేర్పడమని, కానీ మూడో రోజు సెట్లలో ఏదో జరగడంతో, తనుశ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆమె కారుపై కూడా దాడి జరిగినట్టు పేర్కొన్నారు. -
తనుశ్రీ - నానా వివాదం : వైరల్ వీడియో
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తనుశ్రీ వెల్లడించారు. 2008 ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. కొన్ని షాట్స్ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్‌లో కూర్చున్నారు. ఆ రోజు సాంగ్ షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ తెలిపారు. అనంతరం నానా పటేకర్‌కు, తనకు మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ వివాదం వల్లే ఆ రోజు తాను షూటింగ్ మధ్య నుంచి వెళ్లి పోయానని తనుశ్రీ పేర్కొన్నారు. తాను కేర్‌వాన్‌లో కూర్చున్న కొద్దిసేపటికి కొందరు రౌడీలు వచ్చి తన కేరవాన్ డోర్ కొట్టి గందరగోళం సృష్టించినట్లు తనుశ్రీ తెలిపారు. ఈలోపు తన తల్లిదండ్రులు షూటింగ్ స్పాట్ వద్దకు రావడంతో తాను వారితో కలిసి వెళ్లడానికి కారులో వచ్చి కూర్చున్నాను అన్నారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తాము వెళ్తున్న కారును అడ్డుకున్నారని.. కారు అద్దాలను బద్దలుకొట్టి నానా రభస చేశారని తెలిపారు. అంతేకాక ఒక వ్యక్తి కార్ మీదకు ఎక్కి గంతులేసాడంటూ తనుశ్రీ ఆ రోజు జరిగిన గొడవ గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. కాసేపటి తరువాత పోలీసులు వచ్చి కార్ మీద దాడి చేసిన వారిపై యాక్షన్ తీసుకున్నారని.. ఆ తరువాతే తాను స్టూడియో నుంచి వెళ్లి పోయానని అన్నారు. ఆ నాటి గొడవకు సంబంధించి న్యూస్ ఎమ్‌వోలో ప్రసారమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఈ వీడియోలో ఉన్నాయి. దాంతో తనుశ్రీ ఆరోపణలు వాస్తవమేనని అంటున్నారు నెటిజన్లు. -
తనుశ్రీ - నానా వివాదం
-
తనుశ్రీ, నానా వివాదంలోకి రాఖీ
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించడంటూ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలుపుతుండగా.. వివాదాస్ప నటి రాఖీ సావంత్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. కేవలం ప్రచారం కోసమే తనుశ్రీ ఇలా చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో ఆమె నానా పటేకర్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నానా పటేకర్ లాంటి గొప్ప నటుడ్ని తనుశ్రీ దత్తా తన వ్యాఖ్యలతో అవమానపరుస్తోంది. తనుశ్రీ ఇంగ్లీష్‌లో మాట్లడటం వల్లే మీడియా ఆమె మాటలకు ఇంత ప్రాముఖ్యతనిస్తుంది. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’ అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమైతే తన ముందుకు వచ్చి మాట్లాడలంటూ రాఖీ సావంత్ సవాల్ విసిరారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో తనుశ్రీ దత్తాకి బదులు రాఖీ సావంత్‌ను తీసుకున్నారు. దాంతో రాఖీ సావంత్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. -
తనుశ్రీ దత్తాని నమ్మాలి
ప్రస్తుతం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకు సంబంధించి తనుశ్రీ దత్తా – నానా పటేకర్‌ల వివాదం హిందీ పరిశ్రమలో ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విషయంపై తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటి వారు గళం విప్పారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ‘36 చైనా టౌన్ (2004), ధోల్ (2007)’ సినిమాల్లో తనుశ్రీతో కలిసి వర్క్ చేసిన పాయల్ రోహత్గీ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఒక మహిళగా తనుశ్రీ చెప్పిన విషయంపై నాకు నమ్మకం ఉంది. ఆమె మాటలను అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనే నాకు 2011లో ఎదురైంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా మంది అతను మంచివాడు అన్నారు. ఏ వ్యక్తి అయినా కేవలం వృత్తిపరంగానే కాదు నిజ జీవితంలోనూ విలువలు పాటించాలి. అనురాగ్ కశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వాళ్లు ఒకప్పుడు నా మానసిక స్థితి బాగోలేదన్నారు. ఇప్పుడు తనుశ్రీకి మద్దతుగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతున్నారు. కాస్త అయోమయంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండియాలో స్త్రీవాదం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదు. దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. కొంతకాలం నేను సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీవీల్లో రియాలిటీ షోలు చేశా. మలయాళం నటుడు దిలీప్‌కుమార్ వివాదం, శ్రీ రెడ్డి వివాదం వంటివి వచ్చినప్పుడు ‘మీ టూ’ లాంటి ఉద్యమాలు ఇండియాలో ఎందుకు ఊపందుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొందరు చేసే ఆరోపణలకు అండగా నిలవడం, కొందరిని తేలికగా తీసుకోవడం.. ఈ వ్యత్యాసం ఎందుకు? అన్ని సంఘటనలను సమానంగానే చూడాలన్నది నా అభిప్రాయం’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచి.. నానా పటేకర్, తనుశ్రీ వివాదం గురించి చెప్పాలంటే... ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కోసం జై సల్మేర్‌లో ఉన్న నానా పటేకర్ ముంబై వచ్చిన వెంటనే ఈ వివాదం గురించి ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన తరఫు న్యాయవాదాలు చెబుతున్నారు. ఈ వివాదం ఎందాకా సాగుతుంది? అనేది చూడాలి. -
తనూశ్రీ దత్తాలు ఇంకా ఎందరో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గ్లామరస్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా తనూశ్రీ దత్తా తన తోటి బాలివుడ్ నటుడు నానా పటేకర్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితమే అంటే, 2008లోనే ఆమె ఈ విషయాన్ని ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు ఫిర్యాదు చేసినట్లు నాటి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే అప్పుడు అలా వేధింపులకు గురిచేసిందీ నానా పటేకర్ అనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని తనశ్రీయే తనంతట తాను బయట పెట్టారు. నాడు ఆమె ఫిర్యాదుపై ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నేడు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తున్న బాలీవుడ్ పరిశ్రమ తీసుకుంటుందన్న నమ్మకాలు లేవు. ‘క్యాస్టింగ్ కౌచ్’గా పిలిచే మహిళా నటిమణుకు లైంగిక వేధింపుల సమస్య ఈ నాటిని కాదు. ఒక్క బాలీవుడ్‌కే పరిమితమైనదీ కాదు. హాలీవుడ్ నుంచి టాలివుడ్ వరకు విస్తరించి ఉంది. దీనికి వ్యతిరేకంగా తెలుగునాట శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొదట సినీ రేప్ దశ్యాలతో మొదలైన ఈ క్యాస్టింగ్ కౌచ్ ప్రక్రియ నిజ జీవితంలోని పడక గదుల్లోకి పాకింది. ఆమె ఆహాభావాల కోసమే అలా చేశారా! ప్రముఖ కళాత్మక చిత్రాల ఇటలీ దర్శకుడు బెర్నార్డో బెర్తోలూచిపైన హీరోయిన్ మారియా స్నైడర్ చేసిన బహిరంగ ఆరోపణలతో మొదటిసారి ఇలాంటి వేధింపుల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ‘ది లాస్ట్ టాంగో ఇన్ పారిస్’ చిత్రంలో రేప్ సీన్ గురించి దర్శకుడు తనకు పూర్తిగా చెప్పకుండా సినిమా తీశారని, ఆ సినిమాలో అర్ధనగ్న దశ్యాల కారణంగా తన పరువు పోయిందని మారియా ఆరోపించారు. ఓ సినీ నటిగా కాకుండా నిజమైన అమ్మాయిగా ఆమె ఆహాభావాలు ఆ సమయంలో ఎలా ఉంటాయో రాబట్టేందుకే రేప్ సన్నివేశం గురించి ఆమెకు పూర్తిగా వివరించలేదని బెర్తోలూచి అందుకు సమాధానం ఇచ్చుకున్నారు. అదీ నిజమే కావచ్చు. కానీ సినీ పరిశ్రమ రేప్ సీన్ల కుసంస్కతి నుంచి పడక గదుల విష సంస్కతి వరకు విస్తరించేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రముఖ హాలివుడ్ సినీ నిర్మాత హార్వే విన్స్టెయిన్కు వ్యతిరేకంగా తమను లైంగికంగా వేధించారంటూ ‘మీ టూ’ ఉద్యమం పేరిట దాదాపు 70 మంది నటీమణులు బయటకు వచ్చారు. వారిలో ఏంజెలినా జోలి మొదలుకొని దాదాపు 20 మంది హీరోయిన్లు ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ ఒక్కొక్కరు బయటకు వస్తూ తమకూ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయిని చెబుతున్నారు. గతంలో హీరోయిన్ రిచా చద్ధా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దర్శకుడు మధుర్ భండార్కర్, ఫాంటమ్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు వికాస్ బహల్‌కు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చాలా వరకు కోర్టుల వరకు వెళ్లక పోవడం వల్లనే తనశ్రీ దత్తాలు ఇంకా పుట్టుకొస్తున్నారు. అమితాబ్ తీరు ఆశ్చర్యకరం.. దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రఫర్లు, హీరోల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న సినీ తారలు ప్రస్తుతం ‘నేమింగ్ అండ్ షేమింగ్’ వరకే పరిమితం అవుతున్నారు. వారు కోర్టు తలుపులు తట్టేవరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకోవడం భ్రమే. బిగ్ బీగా పేరొంది ప్రభుత్వంలోనూ ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అమితాబ్ బచ్చన్ దష్టికి తనశ్రీ అంశాన్ని మీడియా తీసుకెళితే తాను స్పందించేందుకు ‘నేను నానా పటేకర్‌ను కాను, తనూశ్రీని కాను’ అంటూ తప్పించుకున్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉన్న ఆయనే ఆ మాటలనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? 2013 నాటి చట్టం ఓ ఆయుధం పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ‘ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్–2013’ను తీసుకొచ్చింది. పది మంది ఉద్యోగులను మించిన ప్రతి కంపెనీలో, ప్రతి పరిశ్రమలో మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు విధిగా కనీస సభ్యులలో ఓ కమిటీ ఉండాలి. ఆ కమిటీలిచ్చే నివేదికలపై కోర్టులు వేగంగా స్పందిస్తాయి. ఈ చట్టం కింద మూడేళ్ల వరకు జైలు, 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మహిళలు చేసే తప్పుడు ఆరోపణల నుంచి మగవాడికి విముక్తి కలిగించే నిబంధనలు కూడా ఆ చట్టంలో ఉండడం విశేషం. తనూశ్రీలు కోర్టుకెళ్లినప్పుడేగదా వారి మాటల్లోని నిజానిజాలు బయటకొచ్చేవి! దేశంలో ఇప్పటి వరకు 36 శాతం కంపెనీల్లో మాత్రమే ఇలాంటి కమిటీలు ఉన్నాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చొరవ వల్ల బాలీవుడ్‌కు చెందిన ఏడు చలనచిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు ఏర్పాటయ్యాయి. గతేడాది దర్శకుడు వికాస్ బహల్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చినప్పుడు ‘ఫొంటమ్ ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థలో కమిటీని ఏర్పాటు చేశారు. -
థాంక్యూ ట్వింకిల్.. మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ
పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో మొదలైన నానా పటేకర్ వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తనుశ్రీ దత్తా టీమ్ ఆరోపించింది. తనుశ్రీకి మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తులను, మీడియా హౌజ్ ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు పటేకర్ లాయర్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా లీగల్ నోటీసులు ఇచ్చి, తనుశ్రీని కోర్టు కీడుస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కాగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా తదితరులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. (చదవండి : 'నానా'గొడవ) థ్యాంక్యూ ట్వింకిల్.. కానీ ‘పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం’ అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ట్వింకిల్‌కు కృతఙ్ఞతలు చెప్పిన తనుశ్రీ... ‘మీరు నా పక్షాన నిలిచినందుకు సంతోషం. కానీ మీ భర్త అక్షయ్ కుమార్ సంగతేంటి. ఆయన ఎన్నో ఏళ్లుగా నానా పటేకర్‌తో కలిసి నటిస్తున్నారు. అంతెందుకు ప్రస్తుతం హౌజ్‌ఫుల్ 4 సినిమాలో కూడా నానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏమిటంటూ’ ప్రశ్నించారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీరు కూడా తనని బాధించిందని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక స్త్రీగా తను(ఫరాఖాన్) నా బాధ అర్థం చేసుకుంటుంది అనుకున్నా కానీ.. ఈ సమయంలో నానా పటేకర్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ తనుశ్రీ ప్రశ్నించారు. (తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్) Please read this thread before judging or shaming #TanushreeDutta a working environment without harassment and intimidation is a fundamental right and by speaking up this brave woman helps pave the way towards that very goal for all of us! https://t.co/f8Nj9YWRvE — Twinkle Khanna (@mrsfunnybones) September 28, 2018 -
తనుశ్రీ దత్తా వివాదం : అజ్ఞాతంలోకి నటుడు
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన లైంగిక ఆరోపణలకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరు మద్దతు ఇస్తున్నారు. ట్వింకిల్ ఖన్న, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా. అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్‌లు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం హౌజ్‌ఫుల్ 4 లో నటిస్తున్న నానా పటేకర్ షూటింగ్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ హౌజ్‌ఫుల్ 4 సినిమా సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులంతా గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన యూనిట్ సభ్యులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్ మిస్సయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడికి పోయారో తెలియదు, నానా పటేకర్ షూటింగ్ రానట్టు తెలిసింది. కనీసం చిత్ర యూనిట్‌కు కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు చెప్పలేదు. దీంతో పటేకర్ సీన్లను తర్వాత షూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని రిపోర్టులు తెలిపాయి. హౌజ్‌ఫుల్ 4 సినిమా షూటింగ్ సందర్భంగా జైసల్మేర్ బయలుదేరు వెళ్లు సమయంలో, నానా పటేకర్, కృతి సనూన్, పూజే హెగ్డేలతో కలిసి ఉన్న ఓ పిక్చర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత నానా పటేకర్ మిస్సయ్యారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలన్నీ నిరాధారనమైనవని, సెట్లో 50 నుంచి 100 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి లైంగిక ఆరోపణల గురించి ఆమె మాట్లాడుతుంది అంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. కాగా, సాజిద్ ఖాన్ కామెడి సినిమా హౌజ్‌ఫుల్ 4లో నానా పటేకర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
'నానా'గొడవ
అమ్మాయి రంగు పూసుకుంటే.. పవిత్రతను తుడిచేసుకున్నట్టేనా?కెమెరా ముందు నిలబడితే.. మగాడి కంటికి క్యారెక్టర్ లేనట్టు కనబడటమేనా?పాత్రకు న్యాయం చే స్తే.. తనకు తను అన్యాయం చేసుకోవడమేనా?డబ్బు తీసుకుంటే అమ్ముడు పోయినట్టేనా? ఇవేవీ మగాడికి వర్తించవా?సినిమా సమాజాన్ని తరచూ వెక్కిరిస్తున్న ఈ సంఘటనలకు ఎప్పటికైనా ఒక సమాధానం దొరకాలని.. సినిమా కూడా ఒక ప్రొఫెషన్ అని.. మనందరం చేస్తోన్న ఉద్యోగం లాంటిదేనని.. గుర్తించాల్సిన అవసరం లేదా? హార్న్ ఓకే ప్లీజ్... సినిమా బాక్సాఫీస్ దగ్గర మోగలేదు. నిశ్శబ్దంగా తెరపైకి వచ్చి, అంతే నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా పేరు ఇప్పుడు మోత మోగిపోతోంది. ఆ చిత్రంలో తనతో పాటు నటించిన నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు పెద్ద సౌండ్ చేస్తున్నాయి. తనుశ్రీకి అండగా కొన్ని గొంతులు కలిశాయి. ‘ఇలాంటివి జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి ప్లీజ్’ అంటూ చిన్న తారల నుంచి పెద్ద తారల వరకూ గొంతు విప్పారు. అసలేం జరిగిందంటే... అది 2008. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్. పాట చిత్రీకరణకు అంతా రెడీ చేశారు. జూనియర్ డ్యాన్సర్స్ అందరూ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పక్కనే హీరోయిన్ తనుశ్రీ దత్తా అప్సెట్ అయి కూర్చొని ఉన్నారు. షూటింగ్ ఎందుకు ఆగిపోయింది? అని ఎవరో అడిగితే ‘యూనిట్‌ని హీరోయిన్ ఇబ్బంది పెడుతోందట’ అని సమాధానం వినిపించింది. కొద్ది సేపటి తర్వాత షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. కొన్ని షాట్స్ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్‌లో కూర్చున్నారు. కొద్దిసేపటికి కొందరు రౌడీలు వచ్చి తనుశ్రీ కేరవాన్ డోర్ కొడుతున్నారు. సెట్లో అంతా గందరగోళం. ఈలోపు తనుశ్రీ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్లు వెళ్తున్న కారు అద్దాలను బద్దలుకొట్టారు. నానా రభస చేశారు. ఇదంతా బాలీవుడ్ జర్నలిస్ట్ జానిస్ సీక్వెరా ఇప్పుడు బయటపెట్టారు. ఆమె ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేసుకోవడానికి కారణం తనుశ్రీ చేసిన ఆరోపణలే. 2009లో ఇండస్ట్రీని విడిచి వెళ్లిన తనుశ్రీ దత్తా ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల ఆరోపించారు. అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘చాక్లెట్’ సెట్లో ఇబ్బందికర పరిస్థితి తీసుకువచ్చాడని కూడా ఆరోపించారు. ఈ విషయం గురించి తనుశ్రీ మాట్లాడుతూ – ‘‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాలో పాట కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేశాం. షూటింగ్ రోజు సడెన్‌గా కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మూడు రోజులుగా ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ అన్నీ మార్చేశాడు. స్క్రిప్ట్ ప్రకారం ఆ పాటలో నానా పటేకర్ లేడు. కానీ చివరి నిమిషంలో ప్రొడ్యూసర్ని బెదిరించి పాటలో హీరోయిన్‌తో డ్యాన్స్ చేయాలని కోరాడు. అంతేకాదు కొరియోగ్రాఫర్‌తో కొన్ని అసభ్యకర స్టెప్స్‌ని చేర్పించి, తాకరాని చోట తాకడం లాంటివి చేశాడు. నా సహనం దెబ్బతింది. ఇక నా వల్ల కాదని సెట్స్‌లో నుంచి బయటకు వచ్చేశాను. ప్రొడ్యూసర్ కూడా నా ఇబ్బందిని అర్థం చేసుకోకుండా నా మీద అసహనం ప్రదర్శించడం నన్ను షాక్‌కి గురి చేసింది’’ అని ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. ‘చాక్లెట్’.. ఓ చేదు అనుభవం ముందుగా నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన తనుశ్రీ దత్తా ఆ తర్వాత ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘చాక్లెట్’ చిత్రదర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. తనుశ్రీ చెప్పిన ప్రకారం ఆ రోజు షూటింగ్లో తనుశ్రీతో పాటు సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఓ ప్రత్యేక పాట చిత్రీకరిస్తున్నారు. పాట అంటే సహజంగానే కథానాయికలకు కురచ దుస్తులు ఉంటాయి. కెమెరా ముందు ఆ దుస్తులతో నటించినా కెమెరా వెనక మాత్రం లొకేషన్లో టవల్ కప్పుకోవడమో, ఓవర్ కోట్ వేసుకోవడమో చేస్తుంటారు నాయికలు. తనుశ్రీ కూడా అలానే కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగిందనే విషయం గురించి తనుశ్రీ చెబుతూ– ‘‘ఇర్ఫాన్‌తో వివేక్ అగ్నిహోత్రి క్లోజప్ షాట్ తీయడానికి రెడీ అయ్యాడు. ఇర్ఫాన్ తన ఎదురుగా ఏదో ఉన్నట్లుగా చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఆ షాట్‌కి నేను అక్కర్లేదు. అయినప్పటికీ.. వివేక్ అగ్నిహోత్రి ‘వెళ్లు.. బట్టలు (టవల్ లేక కోట్) తీసేసి ఇర్ఫాన్ ముందు డ్యాన్స్ చెయ్. ఇర్ఫాన్‌కి ‘క్యూస్’ (సీన్లో ఆర్టిస్ట్ లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కోసం కెమెరా వెనక ఎవరో ఒకరు ఉండి అతనికి లీడ్ ఇవ్వడం) ఇవ్వు’ అన్నాడు. అసలు అలా అవసరం లేదు. వెంటనే ఇర్ఫాన్ ఖాన్ ‘నాకు యాక్టింగ్ వచ్చు. నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కోసం తను కోట్ తీసేసి, నా ముందు డ్యాన్స్ చేయనవసరంలేదు’ అన్నారు. అలాగే సునీల్ శెట్టి ‘ఇర్ఫాన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే పోనీ నేను ‘క్యూస్’ ఇవ్వనా’ అన్నారు. ఇలా ఇర్ఫాన్, సునీల్ ముందుకు రావడంతో బాలీవుడ్లో ఇలాంటివాళ్లే (వివేక్ అగ్నిహోత్రి) ఉంటారనే నా భ్రమ తొలగిపోయింది. మంచివాళ్లూ ఉంటారు’’ అన్నారు తనుశ్రీ దత్తా. ఎప్పుడో తనకెదురైన చేదు అనుభవాల గురించి తనుశ్రీ దత్తా ఇప్పుడు మాట్లాడటం పై కొందరు ‘అప్పుడు ఎందుకు చెప్పలేదు’ అని విమర్శిస్తున్నారు. అయితే తనుశ్రీ అప్పుడు కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఎవరూ ఖాతరు చేయలేదు. పైగా ఈ పదేళ్లల్లో మీడియా ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంగతలా ఉంచితే... మరి పరిశ్రమలో తనకెదురైన రెండు చేదు అనుభవాల వల్ల తనుశ్రీ విరక్తి చెందారో లేక ఆమెకు అవకాశాలు లేకుండా చేశారో ఏమో... ‘అపార్ట్మెంట్’ (2010లో విడుదల) తర్వాత ఆమె టోటల్‌గా సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారు. అప్పటి నుంచి యూఎస్‌లోనే ఉంటున్నారు. మరి.. నానా పటేకర్ గురించి ఆమె ఎక్కడ మాట్లాడారు అంటే.. ఇటీవల ముంబై వచ్చిన తనుశ్రీ దత్తాను ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో నానా గురించి మాట్లాడారట. ఆ వివాదం చానల్ నుంచి పత్రికలు, సోషల్ మీడియా వరకూ పాకింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఎవరు అడిగినా కాదనకుండా తనుశ్రీ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూల్లోని సారాంశం ఇలా ఉంది.‘‘అప్పటితో పోల్చితే ఇండస్ట్రీలో ఎన్నో మెరుగైన మార్పులు వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తున్నారు. ఇలాంటి సమస్యల గురించి స్త్రీ బహిరంగంగా మాట్లాడితే ‘ఆరోపించడం’ అంటారు. అదే పురుషుడు అయితే తన సమస్యను పంచుకోవడం అంటారు. అప్పుడూ అంతే. ఇప్పుడూ అంతే. ఈ పద్ధతిలో ఏ మార్పూ లేదు. వాస్తవానికి ఇలాంటివి (వేధింపులు) అన్ని చోట్లా జరుగుతున్నాయి. అయితే స్త్రీ చెబితే ఒకలా, పురుషుడు చెబితే మరోలా అనే సమాజంలోని ఈ ద్వంద్వవైఖరి వల్లే ఇంకా ఎన్నో మాటలు వచ్చిన గొంతులు కూడా మౌనంగానే ఉన్నాయి. అంతెందుకు? నేను ఇప్పుడు ఇండస్ట్రీలో భాగం కానందు వల్లే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నానేమో. 2008లో ఇదే విషయం గురించి గొంతు పోయేట్లు మొత్తుకున్నాను. ఏమైంది? ఇండస్ట్రీలో తనుశ్రీ దత్తా అనే పేరు వినిపించకుండా పోయింది. అయినా ఈ ఒక్క సంఘటన వల్లే నేను ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆఫర్స్ వచ్చాయి. చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. కానీ పబ్లిక్‌గా మాట్లాడలేదు. ఇండస్ట్రీ ఇలాంటి పనులను చేసేవాళ్లను నిలదీయదు. అలాగని ఏ హీరోయిన్ అయితే బహిరంగంగా మాట్లాడిందో ఆ హీరోయిన్‌తో కూడా పని చేయడం ఆపదు’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తనుశ్రీ. ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడం లాంటివి ఏదైనా చేస్తారా? అని అడగ్గా – ‘‘ఏం చేయాలో అవన్నీ ఆ రోజుల్లోనే చేసేశా. కంప్లైంట్ చేయడంతో నా మీద, నా కుటుంబం మీద వేధింపులు ఎక్కువయ్యాయి. మన దేశంలో చట్టాలన్నీ నిందితుడికి మద్దతుగా ఉన్నాయి తప్పిస్తే బాధితులకు మద్దతుగా లేవు. అలాగే ఫిర్యాదు స్వీకరించిన తర్వాత తుది తీర్పుకి ఎక్కువ సమయం తీసుకోకూడదు. న్యాయం జరిగే సమయాన్ని తగ్గించకపోతే మళ్లీ బాధితులకు మరో రకమైన వేధింపులు మొదలవుతాయి’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ బాధితులు సౌండ్ చేస్తారు. నిందితులు సైలెంట్‌గా ఉంటారు. విషయాన్ని తేలికపరచడానికి ఓ నవ్వుతో కొట్టిపారేస్తారు కూడా. తనుశ్రీ ఆరోపణలను నానా పటేకర్ అలానే తీసి పారేశారు. ఒకవైపు సోషల్ మీడియా, టీవీల్లో నానా పటేకర్ గురించి సీరియస్ డిస్కషన్లు జరుగుతుంటే ఆయన మాత్రం నవ్వుతూ కొట్టిపారేశారు. ఈ విషయమై ఆయన్ను అడగ్గా – ‘‘లైంగికంగా వేధించడమంటే ఏంటో చెప్పండి? సెట్లో సుమారు 100 నుంచి 150మంది సభ్యులున్నారు. తనతో ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే వాళ్ల కంట్లో పడకుండా ఉండదు కదా? నేను లీగల్‌గా ప్రొసీడ్ అవుతా’’ అని పేర్కొన్నారు. మరోవైపు ‘హార్న్ ఓకే ప్లీజ్’ దర్శకుడు రాకేశ్ సారంగ్, నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య నానాని వెనకేసుకొచ్చారు. ఒక ఘటన జరిగినప్పుడు రెండు పక్షాల వాళ్లూ తమకెదురైన అనుభవాలను పంచుకుంటారు. ఒకరు తప్పని.. ఒకరు ఒప్పు అని అనలేం. అలాంటప్పుడు ఆ ఇష్యూకి సంబంధం లేని మూడో వ్యక్తి చెప్పే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. తనుశ్రీ దత్తా, నానా విషయంలో మూడో వ్యక్తి ఎవరంటే బాలీవుడ్ జర్నలిస్ట్ ‘జానిస్ సీక్వెరా’. తనుశ్రీ వైపే న్యాయం ఉందని జానిస్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్‌ని సమర్థిస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ట్వీట్స్ ఏంటంటే.. పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం. – ట్వింకిల్ ఖన్నా నాతో పాటు నటించిన ఆర్టిస్టులు (మేల్, ఫిమేల్) చాలామంది వేధింపులకు గురయ్యారు. వాటి గురించి చెప్పుకునే హక్కు వాళ్లకు ఉంటుంది. వాళ్లను ఏవేవో ప్రశ్నలు అడిగితే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది? నేను తనుశ్రీ, జానిస్ సీక్వెరాలను నమ్ముతున్నా. జానిస్ నా ఫ్రెండ్. తను అబద్ధం చెప్పదు. – సోనమ్ కపూర్ పదేళ్ల క్రితం తనుశ్రీ దత్తా ఎందుకు మౌనంగా ఉందంటే.. కెరీర్ గురించిన భయం ఉండి ఉంటుంది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి కానీ జరిగిన విషయాన్ని బయటపెట్టాలన్న తన ఉద్దేశాన్ని కాదు. – ఫర్హాన్ అక్తర్ ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రా వంటి తారలు కూడా తనుశ్రీ దత్తాకి మద్దతుగా ట్వీట్ చేశారు. ఆ వాతావరణం వస్తుందా? హాలీవుడ్లో నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ తనను లైంగికంగా వేధించాడని నటి యాష్లే జుడ్ బహిరంగంగా చెప్పాక ‘మీ టూ’ ఉద్యమం మొదలైంది. అతన్ని హాలీవుడ్లో చాలావరకూ పక్కన పెట్టారు. మరి.. తనుశ్రీకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఈ ‘నానా గొడవ’కు ఎలాంటి ముగింపు దొరుకుతుంది? అనేది వేచి చూడాల్సిందే. కొందరు తారలు సినిమా పరిశ్రమలో సమస్య ఉందని అంటున్నారు. మరి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకునే వాతావరణం స్త్రీలకు వస్తుందా? కాలమే చెప్పాలి. కొట్టిపడేయకూడదు ఎవరైనా స్త్రీ లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతుంటే వినండి. మరణానికి దగ్గరగా ఉన్న సమయంలో కూడా ‘50 ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది’ అని చెప్పినా తేలికగా తీసుకోకుండా వినాలి. ఈ విషయమేదో అప్పుడే మాట్లాడొచ్చుగా? అని కొట్టి పారేశారంటే అప్పుడు సమస్య వాళ్లలో ఉన్నట్లు. ఒక అమ్మాయి లైంగికంగా వేధింపుల గురించి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో చర్చలు జరపడం అంటేనే అది వాళ్లకు టార్చర్. కొందరు మూర్ఖులు ‘పబ్లిసిటీ కోసం ఇదంతా’ అని కామెంట్ చేయడం అమానుషం. బాధితులు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనే అనుమానం రావడం సహజం. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొన్నవాళ్లు అమాయకులైతే బయటపడతారు కదా. – నటుడు సిద్ధార్థ్ తనుశ్రీ ఆరోపణలపై ‘హార్న్ ఓకే ప్లీజ్’లో నటించిన రిమ్మీ సేన్ పెదవి విప్పారు. ‘‘కో–స్టార్‌గా నానా పటేకర్ గుడ్. నానా చాలా ఒంటరిగా ఉండేవారు. అందువల్లే కొన్ని సార్లు చిరాకు పడుతుండేవారు. ఆయనకు షార్ట్ టెంపర్ ఉంది. అయితే లైంగికంగా వేధించేవాడు కాదని నా అభిప్రాయం. ఒంటరిగా ఉండేవాడు కాబట్టే స్త్రీ సాన్నిహిత్యం కోరుకునేవాడేమో. నేనైతే ఎటువంటి ఇబ్బంది పడలేదు. కూతురిలా ట్రీట్ చేశారు. అతని వాదన కూడా విని నిర్ణయానికి వస్తే మంచిదేమో. తనుశ్రీ చాలా నిజాయితీ గల అమ్మాయి. అనవసరమైన ఫేమ్ కోరుకోదు. అక్కడ ఏం జరక్కుండా తను ఆరోపించదు. ఆ పాట షూటింగ్ సందర్భంలో నేనక్కడ లేను. ఏం జరిగిందో చెప్పలేను’’ అని అన్నారు. అప్పుడే చెప్పాల్సింది! ‘‘నానా పటేకర్ వల్ల ఇబ్బంది పడ్డానని ఇప్పుడు మాట్లాడటం కన్నా.. అప్పుడే ఆ విషయాన్ని బయటపెడితే అతని బండారం బయటపడేది. ఆ రోజు నుండి అందరూ ఆయనలో ఉన్న ఇంకో కోణం గురించి మాట్లాడుకునేవారు. అలాగే ఈ తొమ్మిదేళ్లలో నానా పటేకర్ వల్ల ఇంకొంతమంది ఇబ్బంది పడి ఉండేవాళ్లు కాదేమో. నేను చాలాసార్లు చెప్పాను.. ఇక్కడ బలవంతంగా ఎవరూ ఏమీ చేయరని. అలా ఎవరైనా వేధించి నప్పుడు స్త్రీలకు అండగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం కూడా స్త్రీని సమర్థిస్తుంది. నేను ఒక విషయం చెబుతాను. మనం వెళ్లే ప్లేస్ కరెక్టేనా, మనం మాట్లాడే మనిషి ఎటువంటి వాడు? అనే స్పృహ ఆడవాళ్లకు ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నువ్వు ఈ పని చేస్తేనే నీకు వేషం ఇస్తా అనేవాళ్లు ఉన్నారు. అలా అన్న రోజే బయటికొచ్చి ఆ విషయాన్ని చెప్పాలి తప్ప అవకాశం కోసం ఆ రోజు అన్నింటికీ సరే అని ఆ పని అయ్యాక ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. చిత్ర పరిశ్రమ నుంచి రోజువారీ పని చేసుకునే స్త్రీల దాకా అందరికీ సమస్యలుంటాయి. వాటినుండి ఎలా తప్పించుకోవాలి అనేది మన తెలివి మీదే ఉంటుంది. – జీవిత – డి.జి. భవాని గౌతమ్ మల్లాది -
మరో బాంబు పేల్చిన తనుశ్రీ
ముంబై: ఆషిక్ బనాయా అప్నేతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ దత్తా పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మరోసారి గళం విప్పారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ బుధవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై కూడ ఆమె అలాంటి ఆరోపణలే చేశారు. ‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ( చదవండి :నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా ) ‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో హీరో ఇర్ఫాన్ఖాన్పై క్లోజప్ షాట్ తీయాల్సి ఉండగా.. అనవసరంగా నన్ను డైరెక్టర్ వివేక్ టార్గెట్ చేశాడని అన్నారు. సీన్లో నా అవసరం లేకున్నా.. ఇర్ఫాన్ ఎదురుగా డ్యాన్స్ చేయాలని అసభ్య పదజాలంతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ మాటలతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. అసభ్యంగా మాట్లాడిన వివేక్‌పై ఇర్ఫాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వెల్లడించారు. ‘నాకు యాక్టింగ్ వచ్చు.. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు’అని ఇర్ఫాన్ తనకు మద్దతుగా నిలిచాడని తనుశ్రీ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటుడు సునీల్ శెట్టి కూడా సెట్లో ఉన్నాడని ఆమె తెలిపారు. తనుశ్రీ తెలుగులో వీరభద్ర సినిమాలో బాలయ్య సరసన నటించారు. ( ‘అది చెప్పినందుకే.. సినిమా అవకాశాలు రాలేదు’ ) -
తప్పు చేసినవాళ్లు అనుభవించాల్సిందే
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) చిత్రానికి చెందిన టైటిల్ సాంగ్ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్ సారంగ్, నిర్మాత సమి సిద్ధిఖీ, నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్యలు లొకేషన్లో ఉన్నప్పటికీ తన ఇబ్బందిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ వివాదంపై సదరు చిత్రబృందం ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ‘‘తనుశ్రీ బాలీవుడ్లో తిరిగి అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడీ వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘నథానీ ఉతారో’ మొదట్లో సోలో సాంగ్ అని, కావాలనే డ్యూయెట్గా మార్చామంటున్న ఆమె మాటల్లో వాస్తవం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ పాట కోసం ఆమె సాధన చేసినప్పుడు మేల్ వాయిస్ కూడా ఉందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. సందేహం ఉంటే అప్పుడే అడగాలి. కానీ అడగలేదు. ఆ పాటను మొదట్నుంచి డ్యూయెట్గానే అనుకున్నాం. నానా పటేకర్ చాలా కాలం తర్వాత ఓ పాటకు రెడీ అయిన టైమ్ అది. ఆ అత్యుత్సాహం ఆమెకు చెడు ప్రవర్తనగా అనిపించి ఉండొచ్చు. నాలుగు వందలమంది చూస్తున్నప్పుడు ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఆ తర్వాత ఈ విషయమై నానా పటేకర్‌కు చెందిన వాళ్లు ఆమె కారును ధ్యంసం చేశారని సినీ ఆర్టిస్టు అండ్ టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ (సిఐఎన్‌టీఏఏ)కు ఫిర్యాదు చేశారు తనుశ్రీ. కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. ఈ సమస్యను సిఐఎన్‌టీఏఏ అప్పట్లోనే పరిష్కరించింది. మళ్లీ ఇప్పుడు తనుశ్రీ ఇలా చేస్తున్నారు. ఈ విషయంపై నానా పటేకర్ చట్టపరంగా ముందుకు వెళ్తారనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు చిత్రదర్శకుడు సారంగ్. ‘‘రిహార్శల్స్ టైమ్‌లోనే ఈ సాంగ్‌లో నానా పటేకర్ కూడా ఉంటారని నేను తనుశ్రీకి చెప్పాను. నానాజీ చాలా మంచి వ్యక్తి. అతను ఎప్పుడు అలా చేయరు’’ అని ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ గణేశ్ పేర్కొన్నారు. ‘‘లొకేషన్లో 50 నుంచి 100 మంది ఉన్న నేపథ్యంలో లైంగికంగా వేధించాననడం విచిత్రంగా ఉంది. మరి.. తనుశ్రీ మాటలకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవుతానో వేచి చూడండి’’ అన్నారు నానా పటేకర్. రాకేశ్ సారంగ్, గణేశ్ ఆచార్యల కామెంట్స్‌పై తనుశ్రీ రెస్పాండ్ అయ్యారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘‘గణేశ్ ఆచార్య అబద్ధం చెబుతున్నాడు. అతనికి రెండు ముఖాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వేధింపులకు సంబంధించిన వారిలో ఇతని పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని అతను ఒప్పుకోడు. ఇలాంటివారిపై నిషేధం విధిస్తే తప్పుచేయాలనుకునేవారికి ఉదాహరణగా ఉంటారు. నా ఫైట్ నానా పటేకర్, గణేశ్ ఆచార్యలపై కాదు. వాళ్లతో నేను వర్క్ చేయాలనుకోవడం లేదు. అయితే వాళ్లు చేసినదానికి అనుభవించాలనుకుంటున్నాను’’ అంటూనే బాలీవుడ్లో మళ్లీ సినిమాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారట తనుశ్రీ. మరి.. ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమా ట్రైలర్ రిలీజ్లో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ల ముందు తనుశ్రీ దత్తా విషయం ఉంచితే.. ‘‘ఈ విషయంపై స్పందించడానికి నేనేం తనుశ్రీని కాదు. నానా పటేకర్‌ని కాను. నేం చెప్పలేను’’ అని అమితాబ్ పేర్కొన్నారు. ‘‘ఒక విషయంపై కచ్చితమైన అవగాహన లేకుండా నా అభిప్రాయాన్ని చెప్పలేను. అయితే ఇలాంటివి జరగకూడదనే కోరుకుంటాను. నిజంగా ఇలాంటి సంఘటనలు బాధాకరం’’ అని ఆమిర్ చెప్పారు. -
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ ఎట్టకేలకు స్పందించాడు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి? నేను అసభ్యంగా ప్రవర్తించానని ఆమె చెబుతున్న సమయంలో అక్కడ నాతో పాటు 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. ఈ ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటాను. చూడండి ఏం జరుగుతుందో. అసలు మీడియాతో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నా. ఇప్పుడు కూడా మీకు మీరే ఏదో ఊహించేసుకుని నచ్చింది రాసేస్తుంటారు’ అంటూ నానా పటేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనుశ్రీ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నానా పటేకర్ సామాజిక సేవ చేస్తున్నట్టుగా మంచి ముసుగు వేసుకుంటాడన్న తనుశ్రీ ఆరోపణలకు సమాధానంగా... ‘ఎవరికి నచ్చిన తీరుగా వారు మాట్లాడుకోవచ్చు. నా పనేంటో నేను చేసుకుంటూ వెళ్తా. కరువుతో అల్లాడుతున్నమహారాష్ట్ర రైతులకు చేతనైన సాయం చేస్తున్నా. నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం ఇది’ అంటూ పటేకర్ వ్యాఖ్యానించాడు. కాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
తనుశ్రీ ఆరోపణలపై బిగ్ బీ కామెంట్
సినీ పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) కూడా తనకు ఎదురైన సమస్యల గురించి గళం విప్పారు. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె ఆరోపించారు. అయితే ఈ విషయంపై స్పందించాల్సిందిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కోరిన ఓ జర్నలిస్టుకు విచిత్రమైన సమాధానం లభించింది. అసలేం జరిగిందంటే.. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కైత్రినా కైఫ్, ఫాతిమా సనా షైక్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సినిమా యూనిట్ చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా తనుశ్రీ ఆరోపణలు, ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరేం చెబుతారంటూ అంకుర్ పాఠక్ అనే జర్నలిస్టు అమితాబ్‌ను ప్రశ్నించారు. ‘నేను తనుశ్రీని కాదు, నానా పటేకర్‌ను అంతకన్నా కాదు. కాబట్టి ఈ విషయంపై నేనెలా కామెంట్ చేయగలను’ అంటూ బిగ్ బీ సమాధానమిచ్చారు. అమితాబ్ నుంచి ఊహించని సమాధానం రావడంతో... ‘ తోటి కళాకారులకు సంఘీభావం తెలిపే విధానం ఇదే. ఈవిధంగా మాట్లాడి భారత సూపర్ స్టార్ మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశారంటూ’ అంకుర్ వ్యంగంగా ట్వీట్ చేశారు. కాగా ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన బిగ్ బీ ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని.. కథువా ఘటన సమయంలోనూ ఆయన ఇలాగే మాట్లాడారని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. At #ThugsOfHindostan presser, when asked about Tanushree Dutta, Amitabh Bachchan said, "Neither am I Tanushree, not am I Nana Patekar, so how can I comment on this?" Wayyy to show solidarity for your colleagues, Bollywood. This country's superstars make us so proud. — Ankur Pathak (@aktalkies) September 27, 2018 -
నానా వేధింపులు
లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) ‘‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ టైమ్‌లో ఓ నటుడు నన్ను లైంగికంగా వేధించాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నటుడెవరో కాదు.. నానాపటేకర్ అంటూ పేరు బయటపెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ‘‘నానా పటేకర్ గొప్ప నటుడే. కానీ, మహిళల పట్ల అతని ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది. నటీమణులను తిడతాడు, కొడతాడు. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు. అక్షయ్ కుమార్ ఎనిమిదేళ్లుగా నానాతో నటిస్తూనే ఉన్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లే నానా లాంటి క్రిమినల్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్ని ‘మీ టూ’ ఉద్యమాలు వచ్చినా ఉపయోగం ఉండదు’’ అన్నారు. -
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన గణేష్ ఆచార్య
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తనుశ్రీ మాట్లాడుతూ.. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఓ సోలో సాంగ్ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ను పక్కకుబెట్టి.. నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. అది సోలో సాంగ్ అయినప్పటికీ.. అందులో అతనితో సన్నిహితంగా నటించాలని నానా పటేకర్ తనను లైంగిక వేధించినట్టు ఆమె ఆరోపించారు. తాను దానికి అంగీకరించలేదని తెలిపారు. ఆ సమయంలో నానా పటేకర్ రాజకీయ పార్టీలకు చెందిన కొందరిని పిలిచి సెట్లో గొడవకు కూడా దిగాడని ఆమె పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని అన్నారు. కాగా, ఆ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన గణేష్ ఆచార్య మాట్లాడుతూ.. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అది చాలా పాత విషయమని.. అందువల్ల ఆ సాంగ్ తనకు అంతగా గుర్తుకు లేదని తెలిపారు. తనకు గుర్తున్నంత వరకు అది సోలో కాదని.. డ్యూయేట్ సాంగ్ అని వెల్లడించారు. ఆ రోజు ఏదో జరగడం వల్ల షూటింగ్ మూడు గంటల పాటు నిలిచిపోయిందని తెలిపారు. అక్కడ అపార్థం చేసుకోవడం వల్ల ఏదో జరిగిందని.. కానీ తనుశ్రీ చెప్పినట్టుగా నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకువచ్చి సెట్లో దాడికి దిగడం కానీ జరగలేదని పేర్కొన్నారు. షూటింగ్లో అలా ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘చిత్ర నిర్మాతలు రిహార్సల్ అప్పుడే నానా పటేకర్ కూడా ఆ సాంగ్‌లో ఉన్నారని నాతో చెప్పారు. ఆ సమయంలో నాకు చిత్ర యూనిట్‌తో ఎలాంటి ఒప్పందం లేదు.. ఎందుకంటే అప్పట్లో నేను మాట మీదే పనిచేశాను. అయినా ఆ పాటలో ఎలాంటి అసభ్యకరమైన దృశ్యాలు లేవు.. అది పూర్తిగా డ్యాన్స్‌తో కూడిన పాట’ అని అన్నారు. ఆ సాంగ్ షూటింగ్ నుంచి తనుశ్రీ వెళ్లిపోవడంతోనే రాఖీ సావంత్ తీసుకువచ్చారనే దానిపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిర్మాతల నిర్ణయమేనని తెలిపారు. అంతేకాకుండా నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తనుశ్రీ ఆరోపించినట్టు ఆయన ఏనాడూ ప్రవర్తించలేదని అన్నారు. నానా పటేకర్ చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు. -
నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా
ఓ బాలీవుడ్ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా ఫైనల్‌గా ఆ నటుడి పేరు వెల్లడించారు. హిందీ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, తమిళ చిత్రాల్లో నటించడమే కాక జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం గురించి తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు’ అంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె అక్షయ్ కుమార్, రజనీకాంత్‌ల పేర్లు ప్రస్తావించారు. ‘అక్షయ్ కుమార్ గత ఎనిమిదేళ్లుగా నానా పటేకర్‌తో కొన్ని సినిమాల్లో నటించారు. సుపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మధ్యే అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండద’ని బాధపడ్డారు. ఆమె మాట్లాడుతూ ‘జనాలందరూ ఈ విషయాల గురించి గుసగుసలాడతారు. కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చేడుగా మాట్లడతారు. ‘ఆమె స్క్రీన్ మీద ఎంత స్కిన్ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. కానీ ఒక్కరు కూడా మేం కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు. మాలో చాలా మంది తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకు, రైతులకు ఇస్తారనే విషయం మీకు తెలియదు. వీటన్నింటి గురించి వదిలేసి కేవలం స్కిన్ షో గురించి మాత్రమే మాట్లడతారు’ అన్నారు. -
స్త్రీలోక సంచారం
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37), ఆమె మూడో భర్త, అమెరికన్ పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్(41)ల ముద్దుల కుమార్తె నార్త్ వెస్ట్(5).. లాజ్ ఏంజిల్ సమీపంలోని పసిఫిక్ పాలిసైడ్లో జరిగిన ఫ్యాషన్ షో ర్యాంప్‌పై మోడల్‌గా అరంగేట్రం చేసింది. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్‌లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్ లెదర్ జాకెట్, మ్యాచింగ్ మినీ స్కర్ట్, జిప్–అప్ బ్లాక్ క్రాప్ టాప్, వైట్ సాక్స్, బ్లాక్ షూజ్, బ్లాక్ పర్స్, రెడ్ లిప్‌స్టిక్ ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్ కర్దేషియాన్ మనసు ఉప్పొంగిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్.లో మొదలైన ‘పింక్ రిబ్బన్ క్యాంపైన్’లో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం 10 ఎడిషన్ క్యాంపైన్ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్ రిబ్బన్ క్యాంపైన్ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సీఈవో, డైరెక్టర్ తమ ప్రసంగంలో తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్, హోమ్శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్ విల్లెన్బ్రింగ్ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్ మర్చంట్‌తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్‌కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్ మర్చెంట్పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్, సెల్ఫ్ హార్మ్, బుల్లీయింగ్లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్ పాప్ సింగర్ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్ 21న మళ్లీ డిప్రెషన్ బారిన పడి, ఓవర్‌డోస్ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టి.ఎం.జడ్. (థర్టీ మైల్ జోన్) వెబ్సైట్ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ మహిళ ఉజ్రా జేయా తన పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. హాలీవుడ్లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అది చెప్పినందుకే.. సినిమా అవకాశాలు రాలేదు’
ముంబై: ఆషిక్ బనాయా అప్నేతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు. 2008లో ఓ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘క్యాస్టింగ్ కౌచ్‌పై హాలీవుడ్లో మీటూ ఉద్యమం రెండేళ్ల క్రితం ప్రారంభమై ఉంటుంది. కానీ భారత్‌లో నేను చాలా ఏళ్ల క్రితమే దానిని ప్రారంభించాను. ఇక్కడ తొలిసారి క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది, లైగింక వేధింపులపై ఉద్యమం చేసింది నేనే. 2008లో హార్న్ ఒకే ప్లీజ్ సినిమా చిత్రీకరణ సమయంలో నాతో ఒక నటుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాంగ్ షూటింగ్లో నా చేతులను తాకుతూ.. కొరియోగ్రాఫర్లను పక్కకు జరగమని చెప్పాడు. నాకు డ్యాన్స్ అతడే నేర్పుతానని అన్నాడు. ఈ విషయాన్ని అప్పుడే మీడియాకు వెల్లడించాను. మూడు రోజుల పాటు నాకు జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చానళ్లలో చూపించారు. కానీ ప్రస్తుతం దాని గురించి ఎవరు మాట్లాడటం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని టీవీల్లో చూసినప్పటికీ బాలీవుడ్‌కు చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదని వాపోయారు. ఆ సమయంలో తనకు ఎదురైన వేధింపుల గురించి మీడియా ముందుకువచ్చినందుకు.. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు రాలేదని తనుశ్రీ తెలిపారు. ఇది ఇప్పటికీ ఓ గాయంగా మిగిలిపోయిందని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఆషిక్ బనాయా అప్నే తర్వాత ఆమె ‘చాకోలేట్’, ‘రఖీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్‌బాయ్ బ్యాడ్‌బాయ్’ వంటి హిందీ చిత్రాల్లో నటిచండమే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన అపార్ట్మెంట్ ఆమె నటించిన చివరి సినిమా. కొంతకాలం పాటు అమెరికాలో ఉన్న ఆమె ఈ ఏడాది జూలైలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఇటీవల రాధిక అప్టే, రిచా చద్డా, స్వర భాస్కర్ వంటి వారు కూడా తమకు ఎదురైన లైంగిక వేధింపులపై స్పందించారు. -
స్త్రీలోక సంచారం
మెరుగైన జీవితం కోసం ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లే యువతులు, మహిళల సంఖ్య గత మూడు దశాబ్దాలలో పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండటంతో పాటు, వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని న్యూఢిల్లీలోని ‘రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్’లో పనిచేస్తున్న ప్రొఫెసర్ అమితాబ్ ఖండు రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. వివాహం అయ్యి, భర్త పని చేస్తున్న చోటికి వెళ్లడం అనేది స్త్రీ జీవితంలో ఎప్పుడూ ఉండేదే అయినప్పటికీ.. సంపాదన కోసం స్వతంత్రంగా.. ఉన్న చోటు నుంచి కదలి వెళ్లడానికి మహిళలు చొరవ చూపడం సామాజికంగా ఎంతో ప్రయోజనకరమైన పరిణామం అని నివేదిక వ్యాఖ్యానించింది ::: త్రిపుల్ తలాక్ ఆచారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ముస్లిం వితంతువు నిదాఖాన్‌ను ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక ముస్లిం మతాధికారి జారీ చేసిన ఫత్వాను దేశంలోనే అత్యున్నతస్థాయి ముస్లిం సంస్థ అయిన ‘ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ తిరస్కరించింది! ‘మతం నుంచి ఒక వ్యక్తిని బహిష్కరించడం ఇస్లాం విలువలకు విరుద్ధమైన చర్య మాత్రమే కాదు, అమానుషం కూడా’ అని బోర్డులోని సీనియర్ సభ్యులు మౌనాలా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు ::: అమెరికాలోని ఆఫ్రికావర్ణ మహిళలు, హిస్పానిక్ (లాటిన్ అమెరికాలో దేశాల్లో స్పానిష్ భాష మాట్లాడే సంతతి) స్త్రీలు సాధించిన నూతన ఆవిష్కరణలకు పేటెంట్లు ఇవ్వడంలో ‘యు.ఎస్. పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్’ తీవ్రమైన వివ„ý పాటిస్తోందని వాషింగ్టన్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ పాలసీ రిసెర్చ్’ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలివుండీ, ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప విషయాలను కనిపెట్టి, అనేక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను సూచించినప్పటికీ తెల్లవారితో సమానంగా ఈ నల్లజాతి, హిస్పానిక్ మహిళలు మేధోహక్కులను పొందలేకపోతున్నారని నివేదికను సమర్పించినవారిలో ఒకరైన జెస్సికా మిల్లీ.. పేటెంట్ ఆఫీస్ ధోరణిని ఎండగట్టారు ::: అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీ విమానాశ్రయంలో సైతం ఏ కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రమే గుర్తుపట్టేలా మారిపోవడం చర్చనీయాంశం అయింది::: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన జీవితకాలంలో ఏనాడూ గర్భిణిగా లేరని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మద్రాసు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అమృత అనే బెంగళూరు యువతి తను జయలలిత కూతురునని కోర్టులో వేసిన పిటిషన్‌పై విజయ్ తన వాదనలు వినిపిస్తూ, 1980లో అమృత తను పుట్టానని చెప్పుకుంటున్న తేదీకి కొద్ది రోజుల ముందు జయ పాల్గొన్న ఒక ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ వీడియోను చూపించి, అందులో ఆమె గర్భిణిగా లేకపోవడాన్ని గమనించాలని న్యాయమూర్తిని కోరారు ::: ఎబోలా వైరస్ మహిళల్లో కూడా ఒక ఏడాది పాటైనా నిక్షిప్తం అయి ఉండి, ఇతరులకు వ్యాపించే గుణం కలిగి ఉంటుందని తొలిసారిగా శాస్త్ర పరిశోధకులు కనుగొన్నారు. ఎబోలా పురుషులలో మాత్రమే దాగి ఉండి, వ్యాపిస్తుందని ఇంతవరకు భావిస్తూ వస్తున్న పరిశోధకులు.. ఎబోలా తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందని లోకం స్థిమిత పడుతున్న తరుణంలో లైబీరియాలోని ఒక మహిళలోఏడాది తర్వాత ఎబోలా వైరస్ బయటపడటాన్ని గమనించి, ఆ వివరాలను ‘లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ పత్రికకు ప్రచురణ కోసం అందించారు ::: -
ఈ ప్రముఖ నటి ఎవరో గుర్తుపట్టగలరా?
ఆదివారం సందడిగా ఉన్న ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి ఫ్లాష్‌బల్బులు అన్ని ఒక్కసారిగా మరింత ప్రకాశవంతంగా వెలిగాయి. అక్కడ ఉన్నట్టుండి ఒక తార కనిపించింది. బ్లూ టాప్, బ్లాక్ జెగ్గింగ్ ధరించిన ఓ అందమైన యువతి అలా నడుచుకుంటూ వస్తోంది. కెమరా కన్ను కూడా ముందు ఆమెను గుర్తుపట్ట లేదు. ఓ నిమిషం తర్వాత అరె..! ఈమె తనా.. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతకు ఎవరామె అని ఆలోచిస్తున్నారా. ఆమె 2005లో ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి. ఇప్పటికైనా గుర్తుకోచ్చారా.. అవును ఆమె తనుశ్రీ దత్తా. రెండేళ్ల తర్వాత అమెరికా నుంచి ముంబై వచ్చారు తనుశ్రీ దత్తా. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో విక్టరి సింబల్‌ను చూసిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 2003లో ‘మిస్ ఇండియా’గా నిలిచిన తనుశ్రీ ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ప్రవేశించి, ఆపై వరుసగా ‘చాకోలేట్’, ‘రఖీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్’ వంటి హింది చిత్రాలోనే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన ‘అపార్ట్మెంట్’ తనుశ్రీకి హిందీలో చివరి సినిమా. రెండేళ్ల క్రితం ఈ నటి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా నుంచి ముంబై వస్తుండగా విమానంలో తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ‘రెండేళ్ల తర్వాత ముంబై వస్తున్నాను. చాలా సంతోషంగా, మరికాస్తా ఆందోళనగా ఉందంటూ’ పోస్టు చేశారు. తనుశ్రీ ముంబై వచ్చిందని తెలిసిన ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మళ్లీ ఆమెను సినిమాల్లో నటించమని కోరుతున్నారు. ‘మీరు నటించిన ఆషిఖ్ బనయా ఆప్నే సీక్వెల్లో నటిస్తే చూడాలని ఉంటంటూ’ ఓ అభిమాని కోరాడు. తనుశ్రీ దత్తా (పాత చిత్రం)