మహిళల పట్ల లైంగిక వేధింపులు నిజమేనంటున్నారు నటి కాజోల్. అంతేకాక ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమతం కాలేదని అన్ని చోట్ల జరుగుతున్నాయని తెలిపారు. తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంపై స్పందిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. కానీ దీని గురించి విన్నాను. వేధించిన వారు ఎవరైనా సరే బయటకు వచ్చి ‘హే మేం ఇలాంటి పని చేశాం అని చెప్పుకోరు కదా’’ అన్నారు.
అంతేకాక ఇలాంటి సంఘటనలు ‘నా కళ్ల ముందు జరిగితే చూస్తూ ఉండేదాన్ని కాదు. ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ అలాంటి సంఘటనలు నా ముందేం జరగలేదు. లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.. అన్ని చోట్ల ఉన్నాయన్నా’రు. విదేశాల్లో వచ్చిన ‘మీటూ’ లాంటి ఉద్యమం మన దేశంలో కూడా రావాలన్నారు. మన కోసం మనమే నిలబడాలి, మనమే పోరాటం చేయాలని వ్యాఖ్యానించారు. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment