Molestation
-
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్‌చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్‌చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
ఆరు నెలల అరాచకం
రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. ఏమిటిదంతా అనుకుంటున్నారా!.. ఆరు నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. స్వయంగా చంద్రబాబు, లోకేశ్ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది.ఇక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూఅదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి.అరాచకాలే బ్రాండ్.. అదే బాబు పాలన ట్రెండ్ చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో యథేచ్ఛగా దాడుల చేయాలని ఆదేశించింది. అందుకు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది. పచ్చ మూకల కీచకపర్వం ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఒకప్పటి చంబల్ లోయలోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు.6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం పడుతోంది. వారిలో 12 మందిపై అత్యాచారం జరిపి హత్య చేయడం రౌడీ మూకల బరితెగింపునకు నిదర్శనం. ఇవన్నీ అధికారికంగా కేసులు నమోదైన ఘటనలే. కూటమి పెద్దలు, గూండాలకు భయపడి బాధితులు ఫిర్యాదులు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తిస్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హత్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కారు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం పోలీస్ శాఖ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్ అధికారులు పీఏఎస్‌ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి తదితరులతోపాటు వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
కొల్లూరు: ఓ బాలికను మభ్యపెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొల్లూరులోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 26న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం వేచి ఉండగా, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్‌కుమార్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఎక్కించుకున్నాడు.కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో బెజ్జం శ్యామ్‌కుమార్‌తో పాటు మరో యువకుడు అక్కడకు వచ్చారు. శ్యామ్‌కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని మభ్యపెట్టి వేరే ఇటుక బట్టీలోకి తీసుకువెళ్లి అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువకుడు వెంటనే వెళ్లిపోయాడు.అనంతరం బాలికను ఇటుక బట్టీలలోనే వదిలి వెళ్లడంతో రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన తండ్రి తమ బంధువులకు చెప్పడంతో విషయం బయటపడింది. అనంతరం తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నిందితులు విప్పర్ల ప్రేమ్‌కుమార్, బెజ్జం శ్యామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జి. ఏడుకొండలు పరిశీలించారు. -
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్‌నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్‌పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్‌టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
లా విద్యార్థినిపై దారుణం.. పోలీస్ కస్టడీకి నిందితులు?
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది. -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.ఆగని అత్యాచారకాండకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.పోలీసుల అస్త్ర సన్యాసంబాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. -
బాధిత బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిళ్లు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలానికి చెందిన మైనర్ దళిత బాలికపై జరిగిన దాడి ఘటనను నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలైనట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధ బాధిత బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు మంతనాలు జరపడం.. ఆమెను అనుమతించిన పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలను మాత్రం అడ్డుకోవడం.. బాలిక తండ్రి ఒక్క రోజులోనే మాట మార్చేలా ఒత్తిడి తేవడం.. ఆద్యంతం ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తుండటం దీన్ని బలపరుస్తున్నాయి. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. బాలిక చెప్పిన వివరాల మేరకు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి దాడి చేసిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పోలీసులు అర్ధరాత్రి తొలుత పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు.బాధిత కుటుంబంతో పులివర్తి సుధ మంతనాలుచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు బాధిత కుటుంబంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సాయంత్రం 3.04 గంటలు దాటాక వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తిరిగి మరోసారి లోపలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.09 గంటల ప్రాంతంలో సుధ ఆసుపత్రి లోపల ఉన్న సమయంలో బాలిక తండ్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బాలికపై దాడి జరిగింది వాస్తవమేనని, అయితే లైంగిక దాడి జరగలేదని చెప్పారు. తన కుమార్తె వారిని ప్రేమించలేదనే కారణంతో దాడి చేశారన్నారు.వైఎస్సార్సీపీ, ఏఐఎస్ఎఫ్ ఆందోళనబాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉదయమే వేర్వేరుగా తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకోగా రోజా మినహా మిగిలిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రం ఆస్పత్రి లోపలకు అనుమతించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. సీపీఐ నాయకులను సైతం అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, భూమన అభినయ్‌ని మాత్రం అనుమతించారు. -
మరో బాలికపై అఘాయిత్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.పొట్టపై తన్ని.. చాకుతో దాడిపాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్ ఓబులేసు, వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయంయర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.ఆ దుండగుల్ని ఉరి తీయాలిబాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డిమైనర్ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు. -
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
తిరుపతి: స్నాప్ చాట్‌లో పరిచయం.. బాలికపై లైంగిక దాడి
సాక్షి, తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు ఆన్లైన్ స్నాప్ షాట్ ద్వారా బాలిక పరిచయమైంది.బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా విషయం బయటపడింది. యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
Mohamed Al Fayed 421 మందిపై లైంగిక వేధింపులు,బాధితుల్లో ప్రముఖుల బిడ్డలు
లైంగిక వేధింపులు ,అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్పై కేసులో షాకింగ్ సంఖ్యలో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 421 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారని న్యాయవాద డీన్ ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు.30 ఏళ్ల కాలంలో అల్ ఫయేద్ అఘాయిత్యాలను సంబంధించిన చిట్టా పెరుగుతూనే ఉందని ఆర్మ్‌స్ట్రాంగ్ లండన్‌లో ఒక మీడియా సమావేశంలో అన్నారు .మరో న్యాయవాది బ్రూస్ డ్రమ్మాండ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా బ్రిటన్‌కు చెందిన మహిళలతోపాటు, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా , ఇతర దేశాల మహిళలు తమ న్యాయవాద బృందాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ ఆరోపణలు తమకు విభ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. ‘వాడొక రాక్షసుడు’ అంటూ బాధితులకు క్షమాపణలు చెప్పారు.బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు. తన లండన్ డిపార్ట్మెంట్ స్టోర్ హారోడ్స్‌లో మహిళా సిబ్బందిపై లైంగికంగా వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. అంతేకాదు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తప్పవని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆరోపణలపై ఇటీవల బీబీసీ అల్ ఫాయిద్ అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూపు" నుంచి చట్టపరమైన చర్యలు మొదలు కావడంతో తాజాగా మరింతమంది బాధితులు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితుల్లో బ్రిటన్‌లోని మాజీ యుఎస్ రాయబారి కుమార్తె , ప్రసిద్ధ సాకర్ క్రీడాకారిణి కుమార్తె కూడా ఉన్నారు. కాగా మహమ్మద్ అల్ ఫాయిద్ 94 ఏళ్ల వయసులో గత ఏడాది మరణించాడు. అల్ ఫయీద్ తన మరణానికి ముందు ఈ ఆరోపణలను ఖండించాడు. -
బెంగాల్లో పేషెంట్‌పై డాక్టర్ అఘాయిత్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్‌లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్‌హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్‌హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. -
Madhya Pradesh: 48 గంటల్లో ఇద్దరు మహిళలపై అఘాయిత్యం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇండోర్, రేవా జిల్లాల్లో రెండు భయంకరమైన అత్యాచార సంఘటనలు వెలుగుచూశాయి. రేవా జిల్లాలోని ఆలయ సమీపంలోని పిక్నిక్ వెళ్లిన జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా దీనిని వీడియో తీశారు. ఈ విషయాన్నిపోలీసులకు చెబితే ఆ వీడియోను ఆన్లైన్లో విడుదల చేస్తానని బెదిరించారు. ఈ ఘటన అక్టోబర్ 21న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.ఇదిలావుండగా, ఇండోర్‌లో దినసరి కూలి చేతిలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో మహిళ అర్ధనగ్నంగా, రక్తస్రావంతో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సోను అనే కార్మికుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు తమ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.రాష్ట్రంలో ఒకేసారి రెండు అత్యాచార ఘటనలు వెలుగుచూడటంతో అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మండిపడ్డారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మంత్రి శివాజీ పటేల్.. రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేశామని, వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్పారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత
చురాచంద్పూర్: మణిపూర్‌లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
అంతులేని అఘాయిత్యాలు
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. కనికరం లేకుండా ఆ చిన్నారి హత్య... ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం.. ఆ వెంటనే వైఎస్సార్ జిల్లాలో యువతిపై లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం.. అంతలోనే గుంటూరు జిల్లాలో యువతిపై అత్యాచారం చేసి తలపై కొట్టడంతో బ్రెయిన్ డెడ్ కావడం... ఇలా అక్క చెల్లెమ్మలపై రోజుకో అఘాయిత్యం! ఈ నాలుగు నెలల్లో ఏకంగా 74 మంది మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు.. వీరిలో ఆరుగురు హత్యకు గురవ్వగా మరో ఐదుగురు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో వీటినిబట్టి తెలుసుకోవచ్చు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక హత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. గత ఐదేళ్ల పాటు రక్షణ కల్పించిన ‘దిశ’ వ్యవస్థను నీరుగార్చేశారు. ఈ ఘటనలన్నీ నమోదైనవి మాత్రమేనని, రికార్డులకెక్కనవి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని సాక్షాత్తు హోం మంత్రి అనిత వ్యాఖ్యానించడం కొసమెరుపు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని’ తలపిస్తోంది. అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి.ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలే తమను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దంపడుతోంది. ఉద్యోగానికి వెళ్లిన మహిళ... కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని... తుదకు వీధిలో ఆడుకుంటున్న బాలికలు ... ఇంట్లో ఉన్న చిన్నారుల భద్రతకు సైతం భరోసా కరువైంది. ఉదయం నిద్రలేచి దినపత్రిక తెరిచినా... టీవీలో న్యూస్ చానల్ పెట్టినా.. అత్యాచారం వార్త కనిపించడం సర్వసాధారణమైంది. సాక్షి, అమరావతి: దసరా పండుగ నాడు తిరుమల బ్రహ్మోత్సవాలు గానీ... విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రసారాలు గానీ.. వస్తాయని టీవీ పెడితే... అనంతపురం జిల్లాలో అత్తా కోడళ్లను వేటకొడవళ్లతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడిన దురాగతం గురించిన వార్తలు చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ ఘటన మరువక ముందే వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇక తాజాగా తెనాలిలో టీడీపీ నాయకుడు, రౌడీషీటర్ ఏకంగా ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆదివారం వచ్చిన వార్త సంచలనం సృష్టింది.ఇవీ.. 4 నెలలుగా రాష్ట్రంలో యథేచ్చగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలకు కొన్ని ఉదాహరణలు. ఒకప్పటి చంబల్ లోయ, బిహార్‌లోని దారుణాలను తలదన్నేలా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అంతటితో ఆగని కొందరు ఆపై దారుణంగా హత్యలు చేసి దర్జాగా జారుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 74మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. వీరిలో ఆరుగురిని హత్య చేయడం వారి బరి తెగింపునకు నిదర్శనం. వేధింపులు భరించలేక ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి అధికారికంగా కేసులు నమోదు చేసిన ఘటనలే. టీడీపీ గూండాలకు భయపడి ఫిర్యాదు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.పెన్షన్.. ఇంటి పట్టా కోసం కోర్కె తీర్చాలని..సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం టీడీపీ పరిశీలకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాయచోటికి చెందిన ఖాదర్‌బాషా తనకు పెన్షన్, ఇంటి పట్టా ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధిత మహిళ వీడియో ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆమెను ఏకంగా కిడ్నాప్ చేయడం రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు తార్కాణం. పట్టించుకోని బాబు, పవన్.. వారి దారిలోనే పోలీసులు..వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొద్దునిద్ర వీడటం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసత్య ప్రచారాలతో హడావుడి చేసిన పవన్‌కళ్యాణ్... ప్రస్తుతం టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంలో రోజూ జరుగుతున్న అత్యాచారాలపై స్పందించడమే లేదు. మరోవైపు తాము అమలు చేసేది రెడ్‌బుక్ రాజ్యాంగమేనని చంద్రబాబు, లోకేశ్ విస్పష్టంగా ప్రకటించాక... ఇక తమకు పనేం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కీచకులు రోడ్లపైకి వచ్చి అత్యాచారాలకు తెగబడుతున్నా సరే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.టీడీపీ సోషల్ మీడియా విశృంఖలత్వంనాలుగు నెలలుగా అధికార టీడీపీ కూటమి సోషల్ మీడియా విభాగాల ఆగడాలు, వేధింపులకు అడ్డే లేకుండాపోతోంది. వేలాది ఫేక్ అకౌంట్ల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బాధితుల్లో సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఉన్నారు. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ కూటమి సోషల్ మీడియా ఆగడాలు మరింతగా పేట్రేగిపోతున్నాయి.వాసంతి జాడ నేటికీ తెలియదు!నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే ఎనిమిదేళ్ల బాలికను జూలై 7వ తేదీ ఉదయం ఆగంతకులు అపహరించుకుపోయారు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు మొద్దు నిద్ర వీడారు. అయినా కేసును సక్రమంగా దర్యాప్తు చేయనే లేదు. పది రోజుల తర్వాత వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి.. అంత్యక్రియలు చేసుకుంటామన్న ఆ పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా చంద్రబాబు ప్రభుత్వం మనసును కరిగించలేకపోయింది. నాలుగు నెలలు గడిచినా ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టి ఆమె కుటుంబానికి అప్పగించలేకపోయింది. విద్యా సంస్థలు.. వసతిగృహాల్లోనూ దుర్మార్గాలు⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్రూముల్లో రహస్య కెమెరాలతో విద్యార్ధినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యార్ధినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. కానీ అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించి శిక్షించకపోవడం గమనార్హం.⇒ ఏలూరులో ఓ ఆశ్రమం నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటున్న తమను వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధిత విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోషూట్ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్ధినులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ⇒ అనంతపురంలో మెడికల్ కాలేజ్ విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్త విభ్రాంతి కలిగించింది.టీడీపీ నేతలు, కార్యకర్తల బరితెగింపు ⇒ టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్ నవీన్ తెనాలిలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని ఆదివారం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో నవీన్ (ఫైల్) గుంటూరులో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులతోపాటు మరెన్నో తీవ్రమైన నేరాల్లో నవీన్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించాడు. ఈ కేసును పక్కదారి పట్టించాలని పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తునట్టు సమాచారం.⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసి అత్యాచారం చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో 8 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు.⇒ అనంతపురం జిల్లాలో టీడీపీ నేత ఉపాధి హామీ పథకం మహిళా కూలీలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళలు ఫిర్యాదు చేసినా సరే టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. లోకేశ్‌తో జాన్ (ఫైల్) ఎమ్మెల్యేలే కీచకులుగా మారితే.. ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురిచేస్తే న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. లేదా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మొర పెట్టుకుంటారు. కానీ తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ఆధారాలను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. తర్వాతి పరిణామాల్లో ఆ బాధిత మహిళ కేసును ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వ్యవహారం మరువకముందే ఆదిమూలం మరో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తుండటం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితోపాటు ఆయన వర్గీయులు ఆందోళన చేయడంతోపాటు టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు! -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ