కాంగ్రెస్‌ను మహిళ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీ ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్‌పై. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది కాషాయపార్టీ. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, ఇతర నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా దీపేందర్ హుడా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వారి అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారని ఆరోపించారు.
చాలా అవమానకరమైన వీడియో బయటపడింది. కొన్ని దృశ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయి. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని కాగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ధృవీకరించారు. పట్టపగలు, దీపేందర్ హుడా సమక్షంలో వేదికపై ఒక మహిళా నేతకు పార్టీకి చెందిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే.. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎలా భద్రంగా ఉంటారు?.. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. ఈ హుడా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.
Most shocking 😮
A woman congress leader was molested in stage in presence of Deependra Hooda by congress leaders
Confirmed by news reports and even Kumari Selja
If women are not safe in Congress meetings in full public view during the daytime - can they be safe if Congress… pic.twitter.com/yIw46gl91t— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024
మరోవైపు మహిళలు, పేదలు, దళితులను గౌరవించకపోవడం కాంగ్రెస్ సంస్కృతి, డీఎన్‌ఏలో ఉందనంటూ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ సైనీ విమర్శించారు. ఈ విషయంలో మాకు ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టద్దని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా సైతం ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment