యలమంచిలి రూరల్: మొబైల్‌లో పోర్న్ వీడియో చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడం, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది.
బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మందలిద్దామని వెళ్లిన బాలిక కుటుంబీకులపైనే బాలుడి తల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో శనివారం రాత్రే యలమంచిలి రూరల్ పోలీసులకు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి తల్లి, బంధువులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆదివారం ఉదయం వరకూ కేసు నమోదు చేయలేదు.
అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలికను విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలాంటి పని ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. తన తల్లి మొబైల్ ఫోన్‌లో ఓ పోర్న్ వీడియో చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాలుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు.
బాలిక కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పరామర్శ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాలిక కుటుంబాన్ని పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.అఘాయిత్యానికి పాల్పడ్డ బాలుడి తల్లి టీడీపీ నాయకురాలు కావడం, బాధితులనే ఆమె బెదిరిస్తోందని తెలుసుకున్న ధర్మశ్రీ.. బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment