
ఎంఎంటీఎస్ కేసులో ఓ పాత నేరస్తుడి ఫొటోలో పోలికలు గుర్తించిన బాధితురాలు
అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా చూశాక అతడు కాదని వెల్లడి
ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడి గుర్తింపు కష్టసాధ్యం
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం కేసులో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మార్గంలోని 12 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెబుతున్న వివరాల్లో స్పష్టత లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యమవుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలికి పలువురు పాతనేరస్తుల ఫొటోలు చూపించారు. ఇందులో ఒక పాత నేరస్తుడి ఫొటోతో నిందితుడికి పోలికలు ఉన్నట్టు చెప్పింది.
అదుపులో అనుమానితుడు: బాధితురాలు చెప్పిన పోలికలు ఉన్న అనుమానితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతనేరస్తుడు అయిన ఏడాది క్రితమే మహేశ్‌ను భార్య వదిలేయడంతో, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసయ్యాడు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ముందుకు మహేశ్‌ను తీసుకెళ్లారు. నేరుగా అనుమానితుడిని చూశాక, నిందితుడు అతను కాదని ఆమె చెప్పినట్టు సమాచారం. అయినా, మహేశ్‌తోపాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
అల్వాల్ స్టేషన్ నుంచి నిందితుడు: అన్ని స్టేషన్లలో పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు...నిందితుడు అల్వా ల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్టు «నిర్ధారించుకున్నారు. కానీ ఎక్కడ దిగిపోయాడన్న విషయంలో స్ప ష్టత రావడం లేదు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీతోపాటు పలు విభాగాలకు చెందిన సిటీ పోలీసులు నిందితుడిని గుర్తించడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మేడ్చల్–గుండ్లపోచంపల్లి వరకు ఉన్న అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎంటీఎస్‌లలో సీసీ కెమెరాలు లేకపోయినా, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.