
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
గుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష, ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది.
హర్షసాయి డెబ్యూ మూవీ ‘మెగా’ కాపీరైట్సే్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్షసాయి ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆయన తరఫు లాయర్ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా, హర్షసాయిపై ఆరోపణలకుగానూ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
జానీ మాస్టర్ ఉదంతం వార్తల్లో ఉండగానే.. మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి తనను లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో.. 328, 376(2)(n)354(ఆ)(ఇ) సెక్షన్ల కింద పోలీసులు హర్షపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment