harsha sai
-
ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి..
యువతిని మోసం చేశాడంటూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి సోమవారం నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. గత కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటున్న ఆయన తనపై కేసు నమోదైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశాడు. అది నా సినిమాకొందరు కావాలనే తనపై అసత్యప్రచారం చేశారని పేర్కొన్నాడు. తాను సొంతగా కథ రాసుకున్న 'మెగా' సినిమాకు వాళ్లు కాపీరైట్స్ అడగడమేంటని ప్రశ్నించాడు. రూ.2 కోట్లు ఇవ్వమని అడిగారు. నేను జనాలకు ఇస్తానే తప్ప బ్లాక్మెయిల్ చేసేవారికి అసలే ఇవ్వను అన్నాడు. నిజాలు బయటకు వచ్చాయి కాబట్టే తనకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నాడు.అసలేం జరిగింది?పెళ్లిపేరుతో హర్షసాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి సెప్టెంబర్‌లో పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అప్పటినుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియాలో మాత్రం తాను తప్పు చేయలేదని, న్యాయం కోసం పోరాడతానని పోస్టు పెట్టాడు. అజ్ఞాతంలో ఉండే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా మెగా సినిమా కాపీరైట్స్ విషయంలోనే హర్షసాయికి, ఆ మూవీలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న యువతికి విభేదాలు వచ్చాయి. -
హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్‌కు భారీ ఊరట!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.లైంగికంగా వేధించాడని కేసుహర్షసాయి తన దగ్గర రూ. 2 కోట్లు తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెప్టెబర్ 24న హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు.తను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయంగా పోరాడడానికి తాను సిద్ధమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ తర్వాత హర్ష సాయి ఎక్కడా కనిపించలేదు. పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉండే..ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు.‘మెగా’ విషయంలో విభేదాలుగుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన హీరోగా ‘మెగా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కాపీరైట్స్ విషయంలోనే విభేదాలు రావడంతో సదరు నటి హర్షసాయిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ‘మెగా’ కాపీరైట్స్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. . దీంతో అప్పటి నుంచే వారిద్దరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా.. ఇన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది. -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.హర్షసాయి హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం కాపీరైట్స్ విషయంలో విభేదాలు రావడంతో ఆ యువతిని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచించి నగ్న చిత్రాలు తీశాడని ఆమె తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. నేడు తన పిటీషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది. -
అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా
ప్రస్తుత బిగ్‌బాస్ 8లో పాల్గొని రెండో వారానికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శేఖర్ భాషా. తాజాగా ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, విచారిస్తున్నారని న్యూస్ ఒకటి వైరల్ అయింది. హర్ష సాయిపై అత్యాచారం కేసులో భాగంగా ఇతడిని అదుపులోకి తీసుకున్నారని కామెంట్స్ వినిపించాయి. కానీ అలాంటిదేం లేదని, తనని అసలు అరెస్ట్ చేయలేదని శేఖర్ భాషా ఇప్పుడు వీడియో రిలీజ్ చేశాడు.కొన్నిరోజుల క్రితం యూట్యూబర్ హర్షసాయిపై ఓ నటి, నిర్మాత కేసు పెట్టింది. తనని లైంగికంగా వేధించి, రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంలో పోలీసులు హర్షసాయి కోసం వెతుకుతున్నారు. మరోవైపు తనపై పలు ఇంటర్వ్యూల్లో శేఖర్ భాషా అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శేఖర్ భాషాని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్లు న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)అలాంటిదేం లేదని తాను ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లానని, తన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడం వల్ల తాను అందుబాటులోకి రాలేకపోయానని చెప్పాడు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్స్ అని అన్నాడు. మరి నిజంగానే శేఖర్ భాషాని అరెస్ట్ చేశారా? లేదంటే ఈ పుకార్లు ఎందుకొచ్చాయనేది తెలియాల్సి ఉంది.శేఖర్ భాషా ఓ రేడియో జాకీ. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు గానీ పెద్ద గుర్తింపు అయితే రాలేదు. రాజ్ తరుణ్-లావణ్య వివాదం జరుగుతుంటే మధ్యలో దూరి కాస్త ఫేమస్ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్ వచ్చాడు. రెండు వారాలు ఉన్నాడో లేదో ఎలిమినేట్ అయిపోయాడు. వైరల్ కావడం ఏ వివాదం జరుగుతుంటే అందులో దూరిపోతున్నాడా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?) View this post on Instagram A post shared by RJ Shekar Basha (@shekarbasharj) -
యూట్యూబర్ హర్షసాయి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని కొద్దిరోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో గత కొద్దిరోజులుగా హర్షసాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.యువతి ఫిర్యాదుతో హర్షసాయిని అరెస్ట్ చేసేందుకు నార్సింగ్ పోలీసులు పలుచోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి నటిస్తున్న 'మెగా' సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్షసాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది. -
దేశం వదిలి వెళ్లిపోతాడు.. పోలీసులతో హర్షసాయిపై బాధితురాలు
తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. అయితే, తాజాగా ఆమె మరో విషయంపై హర్షసాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ తెలిపింది.యువతి ఫిర్యాదుతో పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు రెండు రోజులుగా వెతుకుతున్నారు. అయితే, ఆయన దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆ యువతి పోలీసులకు తాజాగా చెప్పింది. ఆయన ఫోన్ కూడా ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో హర్షసాయి పోలీసుల వద్ద లొంగిపోకుంటే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. సోషల్‌మీడియాలో తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం.సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన ఒక యువతి కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక ప్రైవేటు పార్టీలో ఆమెకు హర్షసాయి పరిచయం కావడం.. ఆపై వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అయితే, స్నేహంగా ఉంటూనే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ క్రమంలో తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. -
హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్..
-
యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ ?
-
అజ్ఞాతంలో హర్షసాయి.. స్పెషల్ టీమ్‌లు రంగంలోకి
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.గుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష, ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. హర్షసాయి డెబ్యూ మూవీ ‘మెగా’ కాపీరైట్సే్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్షసాయి ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆయన తరఫు లాయర్ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా, హర్షసాయిపై ఆరోపణలకుగానూ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. జానీ మాస్టర్ ఉదంతం వార్తల్లో ఉండగానే.. మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి తనను లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో.. 328, 376(2)(n)354(ఆ)(ఇ) సెక్షన్ల కింద పోలీసులు హర్షపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. -
హర్ష సాయి సంచలన ఆడియో లీక్
-
యువతిని మోసం చేసిన కేసు.. స్పందించిన హర్షసాయి
యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలతో తనని బెదిరిస్తున్నాడని ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇది జరిగినప్పటి నుంచి హర్షసాయి అందుబాటులో లేడు. ఇతడితో పాటు తండ్రి రాధాకృష్ణ గురించి పోలీసులు వెతుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై హర్షసాయి స్పందించాడు. ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయి. మా లాయర్ తానికొండ చిరంజీవి ఈ విషయమై త్వరలో మీ ముందుకు వస్తారు' అని ఇన్ స్టా స్టోరీలో హర్షసాయి రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)వైజాగ్‌కి హర్షసాయి.. పేదోళ్లకు డబ్బులు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అయితే ఈ కుర్రాడికి ఇన్నేసి లక్షల రూపాయలు ఎక్కడనుంచి వస్తున్నాయనేది పెద్ క్వశ్చన్ మార్క్. ఇది కాదన్నట్లు బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే ఈ విషయమై విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనబెడితే సొంతంగా కథ రాసుకుని 'మెగా' అనే సినిమాని గతేడాది లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న అమ్మాయే.. ఇప్పుడు హర్షసాయిపై కేసు పెట్టింది. తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ) -
యూట్యూబర్ హర్షసాయి కేస్ లో బిగ్ ట్విస్ట్
-
యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. అలానే కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇతడి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేరు.చాలామంది డబ్బులు, వస్తువులు పంచుతూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టే హర్షసాయికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడిని అభిమానించే వాళ్లు బోలెడు మంది. అలాంటిది ఇతడిపై ఇప్పుడు ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన ఈమె సినిమా అవకాశాల కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో హర్షసాయి కలిశారు. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా నమ్మబలికి అత్యాచారం కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందే వీళ్లిద్దరి హీరోహీరోయిన్లుగా గతేడాది సెప్టెంబరులో ఓ సినిమా మొదలైంది. ఆ తర్వాత ఏకంగా రూ.2 కోట్లు వరకు ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈమెని మోసం చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులని ఆశ్రయించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్షసాయి, అతడి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మరో ట్విస్ట్అయితే ఈ కేసులో కీలక ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. తనని హీరోగా పెట్టి తీసే 'మెగా' సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి ఇంతలా తెగించాడట. ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలని సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది. -
ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. హర్షసాయి కాళ్లపై పడ్డ ఫ్యాన్!
యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా హర్ష సాయి అందరికీ సుపరిచితమే. కష్టాల్లో ఉన్న చాలామందికి సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇప్పటివరకు సామాజిక సేవ కోసం టైం వెచ్చించిన మనోడు.. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తానే హీరోగా, స్వీయ దర్శకత్వంలో మెగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. (ఇది చదవండి: హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా వేదికపై ఓ సంఘటన చోటు చేసుకుంది. మామూలుగా అయితే ఇలాంటి సన్నివేశాలు స్టార్ హీరోల ఈవెంట్స్‌లో చూస్తుంటాం. కానీ మొదటిసారి సినిమా చేస్తున్న హర్ష సాయి టీజర్ రిలీజ్ ఈవెంట్లో జరగడంతో నెటిజన్స్ షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే చూద్దా పదండి. గతంలో స్టార్ హీరోల మూవీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అభిమాన హీరోతో ఒక్క సెల్ఫీ ఫోటో అయినా దిగాలని ఉత్సాహంగా ఉంటారు. అదే అదునుగా ఈవెంట్ జరుగుతున్న సమయంలో వేదికపైకి దూసుకురావడం చూస్తుంటాం. ఇటీవలే విశ్వక్సేన్ మూవీ ఫంక్షన్‌కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్‌ను ఓ అభిమాని ఒక్కసారిగా వేదికపైకి దూసుకెళ్లాడు. తన ఫేవరేట్ హీరోతో సెల్ఫీ అంత సాహసం చేశాడు. అయినా జూనియర్ ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఆయన అభిమానులు ఆ మాత్రం రచ్చ ఉండాల్సిందే. కానీ.. ఎవరూ ఊహించని విధంగా హర్షసాయి సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తూ హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించాడు. అయితే విశ్వక్ సేన్ ఈవెంట్లో జరిగిన సీన్ ఇక్కడ రిపీట్ అవ్వడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ అభిమాని ఏకంగా హర్ష సాయి కాళ్లపై పడడంతో నెట్టింట చర్చ మొదలైంది. అక్కడున్న సిబ్బంది అతనికి పక్కకు తీసుకెళ్లారు. ( ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!) అంతా బాగానే ఉంది.. కానీ హర్షసాయి ఈవెంట్లో ఈ సంఘటన జరగడంతో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వీన్ని తగులుకున్నారేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే హర్షసాయికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఇంతకీ ఎవర్రా మీరంతా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అరే ఏంటయ్యా మీ అభిమానం? ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీజర్‌కే ఇంతా హడావుడి చేస్తే.. సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్లో ట్రోల్స్ వస్తాయో వేచి చూడాల్సిందే. -
అతని తెలివితేటలు అపారం!
హర్ష సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెగా’. మిత్ర ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్నే కుదిపేసే రాజైన మనిషిది’, ‘అతని తెలివితేటలు అపారం’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. హర్ష సాయి మాట్లాడుతూ– ‘‘మంచి కథలు చెప్పడానికి ప్రస్తుతం ఉన్న పెద్ద మాధ్యమం సినిమా. నేను చిత్రాలను ఎంచుకోవడానకి ఇదే తొలి కారణం. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించాలనుకోవడం మరో కారణం’’ అన్నారు. హీరోయిన్ , నిర్మాత మిత్ర మాట్లాడుతూ– ‘‘చిన్న ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్ చాలా భారీ స్థాయికి వెళ్లింది. 2024లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిసా, కెమెరా: కార్తీక్ పళని, సమర్పణ: కల్వకుంట్ల వంశీధర్‌రావు, సహ నిర్మాత: పడవల బాలచంద్ర. -
హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది
హర్షసాయి.. ఈ పేరుకే చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకుబండి లాగిస్తున్నవారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తానికి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న హర్షసాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్ ఇండియా సినిమాతో! తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి మెగా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 17న) ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ప్రారంభంలో ఏంటి డాక్టర్? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి అని వైద్యుడు చెప్తున్న డైలాగ్‌తో వీడియో కొనసాగింది. టీజర్ చూస్తుంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది.. కానీ డైలాగులకు సీన్లకు పొంతన కుదరకుండా పోయింది. కొన్ని డైలాగులు పవర్‌ఫుల్‌గా కనిపించాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ మిత్ర శర్మ తన సొంత బ్యానర్ శ్రీ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేయనుందో చూడాలి! చదవండి: ఓటీటీలోనూ భోళా శంకర్ డిజాస్టర్.. దూసుకుపోతున్న రామబాణం -
సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ
'అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు'.. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం, తల దాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్, పేద పిల్లాడి స్కూల్ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్‌కు షాప్ కట్టించడం.. ఇలా ఎన్నో మంచిపనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. దీంతో ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండటం విశేషం. అయితే తాజాగా హర్ష సాయి సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈ నెల 17వ తేదీన జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసి ప్రేక్షకుల మనుసుదోచిన మిత్ర శర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె సొంత బ్యానర్ అయిన శ్రీ పిక్చర్స్ మీద ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. హర్షసాయి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నట్లు సమచారం. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్లు మిత్ర శర్మ తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్య్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఆడుకున్నాడు.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!) Our Next PAN INDIA PROJECT Further Details Very Soon #ShreePictures #HarshaSai pic.twitter.com/iCOWp0VISX — Mitraaw (@Mitraaw_sharma) September 13, 2023 -
టాలీవుడ్ లోకి ఎంట్రీ
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి? నిర్మాత ఎవరో తెలుసా?
యూట్యూబ్ స్టార్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవసరంలో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చదవండి: 'పుష్ప-2'లో రష్మిక చనిపోతుందా? వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత? తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు..దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మరి యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాల్సి ఉంది. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ -
బిగ్‌బాస్ ఆరో సీజన్లోకి హర్ష సాయి?
'అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు'.. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం, తల దాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్, పేద పిల్లాడి స్కూల్ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్‌కు షాప్ కట్టించడం.. ఇలా ఎన్నో మంచిపనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలతో హర్ష సాయి రియల్ లైఫ్ శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండటం విశేషం. అవసరాన్ని బట్టి లక్షలు సైతం దానం చేస్తూ దానకర్ణుడిగా పేరు గడించాడు. త్వరలో 10 లక్షల రూపాయలను దానం చేసేందుకు రెడీ అవుతున్నాడు హర్షసాయి. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్‌బాస్ 6 తెలుగు లోగో లాంచ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజవగా ఆ వీడియో కింద హర్షసాయి గురించే కామెంట్లు పెట్టారు. అన్న బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు, వచ్చి పేరు చెడగొట్టుకోవద్దని మరికొందరు కామెంట్లతో మోత మోగించారు. దీంతో బిగ్‌బాస్ ఎంట్రీపై తాజాగా హర్షసాయి స్పందించాడు. బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని నొక్కి చెప్పాడు. అందుకే యూట్యూబ్ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్లోడ్ చేయాలని నియమం పెట్టుకోకుండా నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డ మహిమ చౌదరి, ప్రకటించిన నటుడు -
విజేత హర్షసాయి
సాక్షి, హైదరాబాద్: ఎం.పి.ప్రకాశ్ స్మారక ఏఐటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో నగరానికి చెందిన చల్లా హర్షసాయి విజేతగా నిలిచింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల ఫైనల్లో ఎనిమిదో సీడ్ హర్షసాయి 2-6, 6-2, 6-3 తేడాతో ఆరో సీడ్ మెహక్ జైన్(మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించి తొలి సెట్‌ను గెలుచుకున్న మెహక్‌పై తరువాతి రెండు సెట్లలోనూ హర్షసాయి పైచేయి సాధించింది. రెండో సెట్లో తొలిగేమ్‌ను కోల్పోయినా.. ఆ తరువాత వరుసగా నాలుగు గేమ్‌లను హర్షసాయి సొంతం చేసుకుంది. తిరిగి ఎనిమిదో గేమ్‌తోపాటు సెట్‌నూ గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో సెట్లోనూ హర్షసాయిదే పైచేయి అయింది.