హర్ష సాయి హీరోగా మెగా సినిమా.. టీజర్‌ వచ్చేసింది | Harsha Sai Mega Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

Harsha Sai: హర్ష సాయి హీరోగా మెగా మూవీ.. టీజర్‌ చూశారా? డైలాగులు అదిరిపోయాయి!

Published Sun, Sep 17 2023 3:03 PM | Last Updated on Wed, Sep 20 2023 12:05 PM

Harsha Sai Mega Movie Teaser Out Now - Sakshi

హర్షసాయి.. ఈ పేరుకే చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకుబండి లాగిస్తున్నవారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొత్తానికి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న హర్షసాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్‌ ఇండియా సినిమాతో! తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి మెగా అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆదివారం(సెప్టెంబర్‌ 17న) ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌ ప్రారంభంలో ఏంటి డాక్టర్‌? ఏమీ అర్థం కావడం లేదు అని ఓ వ్యక్తి అడగ్గా.. ప్రపంచానికి తెలియని, ప్రపంచంలోని అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇదీ ఒకటి అని వైద్యుడు చెప్తున్న డైలాగ్‌తో వీడియో కొనసాగింది. టీజర్‌ చూస్తుంటే కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది.. కానీ డైలాగులకు సీన్లకు పొంతన కుదరకుండా పోయింది. కొన్ని డైలాగులు పవర్‌ఫుల్‌గా కనిపించాయి. విజువల్స్‌ కూడా బాగున్నాయి.

ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు సమర్పిస్తున్నారు. బిగ్‌బాస్‌ బ్యూటీ  మిత్ర శర్మ తన సొంత బ్యానర్‌ శ్రీ పిక్చర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి బజ్‌ క్రియేట్‌ చేయనుందో చూడాలి!

చదవండి: ఓటీటీలోనూ భోళా శంకర్‌ డిజాస్టర్‌.. దూసుకుపోతున్న రామబాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement