Youtube Star Harsha Sai Making His Entry As Hero In Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Harsha Sai: టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబ్‌ స్టార్‌ హర్షసాయి?

Published Sat, May 20 2023 12:02 PM | Last Updated on Sat, May 20 2023 12:28 PM

Youtube Star Harsha Sai Making His Entry As Hero In Movies - Sakshi

యూట్యూబ్‌ స్టార్‌ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవసరంలో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ యూట్యూబ్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన హర్షసాయికి యూత్‌లో మాంచి క్రేజ్‌ ఉంది. యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్‌ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చదవండి: 'పుష్ప-2'లో రష్మిక చనిపోతుందా? వైరల్‌ అవుతున్న ఫోటోలో నిజమెంత? 

తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు..దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్‌ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్‌ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందట. మరి యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్‌ అవుతాడన్నది చూడాల్సి ఉంది. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్‌ హీరోకు క్రేజీ ఆఫర్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement