youtube star
-
లిటిల్ చెఫ్ ! అపుడు అన్నం తినడానికి మారాం, ఇపుడు యూట్యూబ్ స్టార్‌గా
చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సాక్షి, హైదరాబాద్లిటిల్ చెఫ్.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.ఇదీ చదవండి: ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!చిన్నప్పటి నుంచే ఆసక్తి.. నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్ సెట్ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు. ఆహారంపై ఆసక్తి పెంచాలి.. శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం. – నవీన్ చారి నారోజు, నిత్య తండ్రి -
అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!
కొంచెం నోటికి ఘాటుగా తగిలితేనే హ్హ..హ్హ అంటూ హాహాకారాలే చేస్తాం. ఎప్పుడైనా సరదాగా స్పైసీ ఫుడ్ తిన్న కూడా అమ్మ బాబోయ్ ఏంటీ ఘాటూ అని గోల చేసేస్తాం. అలాంటిది ఇక్కడొక వ్యక్తి అత్యంత స్పైసీగా ఉండే రెండు సాస్ బాటిల్స్‌ని చక్కగా తినేసి గిన్నిస్ రిక్కార్డుల కెక్కాడు.కెనడాకు చెందిన యూట్యూబర్ మైక్ జాక్ రెండు బాటిళ్ల చిల్లీ సాస్ని జస్ట్ మూడు నిమిషాల్లో హాంఫట్ చేసేశాడు. ఏదో తియ్యటి సూప్ తాగుతున్నట్లుగా తాగేసి ఔరా అనిపించుకున్నాడు. అత్యంత ఘాటుగా ఉండే సాస్ ఇది. కొంచెం టేస్ట్ చేయగానే కళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. అలాంటిది మన మైక్ దాన్ని అమృతం తాగినట్లు తాగిసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పైగా ఈ స్టంట్ పూర్తి అయిన తర్వాత ఎలా తినేయగలిగావు ఈ సాస్ని అని ప్రశ్నిస్తే..తనకు ఫ్లేవర్ ఫెటీగ్ టెక్నీక్ని ఉపయోగించి తినేశానంటూ వివరణ ఇచ్చాడు. అంటే తనకిష్టమైన ఫ్రూట్ ఊహించుకుని ఆ రుచిని ఆశ్వాదిస్తూ తినడమే "ఫ్లేవర్ ఫెటీగ్" టెక్నిక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం అతడు తింటుంటే మా నోటిలోకి నీళ్లు వచ్చేసాయని కామెంట్ చేస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!) -
యూట్యూబ్ ఛానల్‌తో కోటీశ్వరుడు అయ్యాడు, అలాంటి వీడియోలతొ..
‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం. చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్ అయ్యాడు. చిన్నప్పుడు ఫుట్‌బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్‌ప్లే ఫుటేజిని అప్లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్‌ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్‌కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి మాటల్లోనే... ‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్‌లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్‌తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్‌కు వాటి గురించి గుర్తు రావడం అరుదే. ‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్‌కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్‌వర్క్, టాలెంట్‌తో అయిదు యూట్యూబ్ అవార్డ్‌లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్‌గా మారాడు. -
అమ్మ లిప్‌స్టిక్, అమ్మమ్మ చీరలతో యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా..
జీవితంలో ఇది అవ్వాలి! అది అవ్వాలి! అని కలలు కంటుంటాము. కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి. కొంతమంది పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు. హిమాద్రి పటేల్ మాత్రం ఈ కోవకు చెందిన అమ్మాయి కాదు. ఇక ఇంతేలే అని సరిపెట్టుకోకుండా తను అనుకున్నది సాధించేందుకు అందర్ని ఒప్పించి, కష్టపడి.. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన 26 ఏళ్ల హిమాద్రి పటేల్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. మేకప్ అంటే ఎంతో ఆసక్తి. అమ్మ వాడే లిప్‌స్టిక్ రాసుకుని తనని తాను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుండేది. ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు తాపత్రయ పడేది. ఇంటర్మీడియట్లో ఉండగానే జాతీయ, అంతర్జాతీయ మేకప్ ట్యుటోరియల్స్ చూసి మెకప్ మెళుకువలు నేర్చుకుంటుండేది. ఇలా నేర్చుకుంటూ తను కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంది. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈలోపు ఇంటర్మీడియట్ పూర్తయింది. తరువాత ఫ్యాషన్‌ను కెరీర్‌గా మలచుకోవాలనుకుంది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేయమని చె΄్పారు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను నొప్పించలేక కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. బీటెక్ చదువుతున్నప్పటికీ మేకప్ మెళకువలు నేర్చుకుంటూనే ఉంది. ఇన్ఫోసిస్‌ను వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా... బీటెక్ చదువుతున్నప్పటికీ మనసు యూట్యూబ్‌పైనే ఉండడంతో మరోసారి తల్లిదండ్రులను యూట్యూబ్ ఛానల్ పెడతానని అడిగింది. అయినా ఒప్పుకోలేదు. అప్పుడు హిమాద్రి అక్క... ‘‘ఛానల్‌ను పెట్టనివ్వండి. ఆమెకు మూడు నెలలు సమయం ఇద్దాం. ఆలోపు తనని తాను నిరూపించుకుంటే ఒకే. లేదంటే మనం చెప్పినట్టు చేస్తుంది’’ అని తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో హిమాద్రి పటేల్ పేరుతోనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక లిప్‌స్టిక్, ఐలైనర్‌తో ఛానల్లో వీడియోలు పోస్టుచేయడం ప్రారంభించింది. అందంగా కనిపించేందుకు ఎటువంటి హానీ లేని మేకప్‌ను ఎలా వేసుకోవాలో చెబుతూ వీడియోలు పోస్టుచేసేది. ఎక్కువగా నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు చెబుతుండడంతో తన ఛానల్‌కు మంచి ఆదరణ లభించింది. మరోపక్క బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. క్యాంపస్ సెలక్షన్స్‌లోనూ మంచి ప్రతిభచూపి ఇన్ఫోసిస్, క్యాప్జెమినీలలో ఉద్యోగం సంపాదించింది. అయినా హిమాద్రికి పెద్ద సంతోషంగా అనిపించలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటివరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తనకి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇన్ఫోసిస్‌లో చేరమని చెప్పారు. కానీ తను యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతానని చెప్పింది. అప్పటికే హిమాద్రి మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు యూట్యూబర్‌గా కొనసాగడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ వివిధ రకాల సరికొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తూ సంపాదిస్తూ, ఎక్కువమంది ఫాలోవర్స్‌తో.. బ్యూటీ, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయ్యింది. అమ్మమ్మ చీరలుచూసి... హిమాద్రి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కట్టుకునే చీరలను జాగ్రత్తగా గమనించేది. నిమిషంలో కుచ్చిళ్లు పెట్టుకుని అందంగా చీరకట్టుకుని సైకిల్ తొక్కేది అమ్మమ్మ. అంతేగాక చీరలకు తనే స్వయంగా డిజైన్లు కుట్టుకోవడం, ఇంట్లో అందరికి స్టోల్స్ అల్లడాన్ని చూసి పెరిగిన హిమాద్రి అలాంటి బట్టలనే మార్కెట్లో విక్రయించాలనుకుని..‘డ్రై బై హిమాద్రి’ పేరిట క్లాత్ బ్రాండ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తోంది. అలనాటి డిజైన్ చీరలు, డ్రెస్‌లను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా హిమాద్రి దూసుకుపోతోంది. గౌరవంగా... డ్రై (ఈఖఐ) అంటే సంస్కృతంలో గౌరవం అని అర్థం. అమ్మాయిలు, మహిళలు ధరించే చీరలు, డ్రెస్‌లు ఏవైనా గౌరవించేలా వారి కట్టుబొట్టు ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తోంది హిమాద్రి. వ్యాపార రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు. కుటుంబం నుంచి వచ్చిన తొలివ్యాపారి కావడంతో హిమాద్రి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ రకాల చిక్కులను తన అక్క సాయంతో ఎదుర్కొంటూ.. చిన్నచిన్న వేడుకల నుంచి వెడ్డింగ్ డ్రెస్‌ల వరకు అన్ని వస్త్రాలను రూపొందించి డ్రైబ్రాండ్కు గుర్తింపు తెచ్చుకుని యంగ్ ఎంట్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఐదు గంటలకు పడుకునేవాళ్లం అక్కా నేను రాత్రంతా మేలుకుని చేయాల్సిన పనిగురించి పరిశోధించి, వివరంగా తెలుసుకుని పేపర్ వర్క్ పూర్తిచేసేవాళ్లం. లీగల్ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకునేవాళ్లం. అలా అన్నివిధాలా సన్నద్దమయ్యాక అంటే రెండేళ్ల తరువాత డ్రై బ్రాండ్‌ను గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చాం. ఆర్థికంగా ఎవరూ సాయం చేయలేదు. యూట్యూబ్, కంటెంట్ బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో దాచుకున్న డబ్బులనే డ్రై బ్రాండ్‌కు పెట్టుబడిగా పెట్టుకున్నాను. ప్రారంభంలో పెద్దగా ఆర్డర్లు ఏమీ రాలేదు. నెల తరువాత ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆర్డర్లతో పెట్టుబడికి కొంత, మిగతాది వర్కర్లకు జీతాలకు ఇచ్చేదాన్ని. అలా చేస్తూ ఇప్పుడు కాస్త లాభాలు ఆర్జిస్తున్నాను. – హిమాద్రి పటేల్ -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్. -
ఇండియాలోనే పాపులర్ యూట్యూబ్ చానెల్.. పొలిటికల్ లీడర్స్ కూడా
ఎన్నికల సమయం రాబోతూ ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సోషల్ ఇన్‌ఫ్లూయర్స్‌ను సంప్రదించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పొందుతున్నారు. ‘కర్లీ టేల్స్’ యూ ట్యూబ్ చానల్‌తో విశేషంగా ఫాలోయర్స్‌ను సాధించుకున్న కామియా జని ఇటీవల రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరే వంటి నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్న కామియా జని కేవలం ఈ ఇంటర్వ్యూల ద్వారా పేరు, పైకం సంపాదిస్తోంది. కామియా జని ‘సండే బ్రంచ్’ పేరుతో చేసే యూ ట్యూబ్ ఇంటర్వూలు 100వ ఎపిసోడ్‌కు చేరుకున్నప్పుడు గెస్ట్‌గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ‘శివాజీ పార్కులో చిన్నప్పుడు క్రికెట్ ఆడితే చాలా ఆకలేసేది. మూడు నాలుగు వడపావ్‌లు లాగించేసేవాణ్ణి’ అని చెప్పాడు. వెంటనే కామియా జని ‘మీ కోసం జుహూ, అంధేరి, శివాజీ పార్క్ నుంచి మూడు వడపావ్‌లు తెప్పించాను. వాటిలో ఏది శివాజీ పార్క్దో మీరు తిని కనిపెట్టి చెప్పాలి’ అంది. సచిన్ టెండూల్కర్ చిటికెలో కనిపెట్టాడు. ఇలా ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరూ? ‘సండే బ్రంచ్’కు విరాట్ కోహ్లీ ఒక వారం గెస్ట్. ‘అనుష్కతో పెళ్లయ్యాక మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకూడదని హనీమూన్‌కు ఫిన్లాండ్ వెళ్లాం. హాయిగా తిరుగుతున్నాం. ఒక చోట కాఫీ తాగుతూ ఉంటే ఒక సర్దార్జీ మమ్మల్ని గుర్తు పట్టాడు. కోహ్లీ... మా ఇంటి పేరు కూడా కోహ్లీనే అన్నాడు. పెద్దాయనా... ఇప్పుడు హడావిడి చేసి మా గుట్టు బయట పెట్టకు అని బతిమాలుకున్నాం’ అని సరదా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.ఇలాంటి సరదా కబుర్ల కోసం కామియా జని ఇంటర్వ్యూలు చూస్తారు. భారత్‌జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో ఉన్నప్పుడు ‘సండే బ్రంచ్’కు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామియా జనితో ‘నాకు పాతికేళ్ల వయసు వచ్చినప్పుడు లండన్‌లో ఒక కార్పొరెట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ రోజుల్లో మొదటి జీతం 2,500 పౌండ్లు అందుకున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది’ అని గుర్తు చేసుకున్నాడు. కామియా జని యూట్యూబ్ చానల్ ‘కర్లీ టేల్స్’కు 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన వీడియోలకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె చానల్ ఇండియాలో అత్యంత పాపులర్ చానల్‌గా గుర్తింపు పొందింది. అందుకే కొత్త సినిమా రిలీజ్ అయినా, ఈవెంట్ జరుగుతున్నా సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కనుక రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల వ్యూస్ కామియా జనికి భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నాయి. ఒకప్పుడు జర్నలిస్ట్ ముంబైలో ఒక సాధారణ ఆటో డ్రైవర్‌కు జన్మించిన కామియా జని మాస్ మీడియాలో డిగ్రీ చేసింది. తర్వాత ఎల్ఎల్బీ చేసి 2006లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్ ఎడిటర్‌గా పని చేసింది. ఆ తర్వాత సిఎన్‌బిసి తదితర చానల్స్‌లో పని చేసి 2016 నాటికి ఈ రోజువారీ పని బోర్ కొడుతోందని భావించి ఉద్యోగం మానేసింది. ఆమెకు ప్రయాణాలు, ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ, నచ్చింది తింటూ వాటి మీద వీడియోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే విశేషమైన ఆదరణ లభించింది. కామియా జని జట్టు రింగులు రింగులుగా ఉంటుంది కనుక ‘కర్లీ టేల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టింది. ‘సండే బ్రంచ్’ పేరుతో సెలబ్రిటీలను బ్రంచ్‌కు పిలిచి వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తూ పిచ్చాపాటి కబుర్లతో ఇంటర్వ్యూ చేయడం కామియా జని స్టయిల్. విహారం, ఆహారం అంటే అందరికీ ఇష్టం కనుక వ్యూస్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఫోలోయెర్స్ ఉన్నవారే నిర్ణేతలు ఇవాళ ఎక్కువమంది ఫాలోయెర్స్ ఉన్నవారే అభిప్రాయాలను నిర్మిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది కనిపెట్టారు. లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సాయం పొందుతున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ప్రచారం పొందుతున్నారు. ఇటీవల్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే కామియా జనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కామియా జని లాంటి వాళ్లకు ఇంకా డిమాండ్ పెరగనుంది. -
యూట్యూబ్ స్టార్‌గా ఎదగాలనుకుంటున్నారా? సెజల్ సక్సెస్ మంత్ర ఇదే
ఆరోగ్యం నుంచి బాలీవుడ్ వరకు రకరకాల వీడియోలు చేస్తూ డిజిటల్ క్రియేటర్‌గా దూసుకుపోతుంది దిల్లీకి చెందిన సెజల్ కుమార్. ‘ఫ్యాషన్–పాట–డ్యాన్స్’ ఆమె బలం. మన దేశంలోని టాప్ యూట్యూబ్ స్టార్లలో సెజల్ ఒకరు. దిల్లీలోని ‘ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదువుకున్న సెజల్ కుమార్‌కు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. తండ్రి ఆర్మీ మేజర్. దిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. టర్కీకి వెళ్లినప్పుడు ‘సమ్మర్ స్టైల్’ పేరుతో తొలి వీడియో అప్లోడ్ చేసింది. ఆ తరువాత సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది.చానల్ కోసం చేసిన అయిదు వందలకు పైగా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ‘ఇండియన్ గర్ల్ బ్యాక్‌ప్యాకింగ్ ఇన్ యూరప్’ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. సెజల్ తల్లి గైనకాలజిస్ట్. ‘ఒక గైనకాలజిస్ట్‌ను అమ్మాయిలు అడగాలనుకునే సందేహాలపై వీడియోలు చేయవచ్చు కదా’ అని చానల్ ప్రేక్షకులలో ఒకరు అడిగారు. ఆమె కోరిక మేరకు సెజల్ తల్లితో కలిసి చేసిన ‘మామ్ అండ్ మీ’ సిరీస్ బాగా పాపులర్ అయింది. ఎలాంటి ప్రశ్న అయినా స్వేచ్ఛగా, నిస్సంకోచంగా అడిగే వాతావరణాన్ని ‘మామ్ అండ్ మీ’ కల్పించింది. సెజల్‌కు బాగా నచ్చే సబ్జెక్ట్‌లలో ఫ్యాషన్ ఒకటి. స్ట్రీట్ స్టైల్, స్ట్రీట్ వీడియోలపై మంచి పట్టు ఉంది. తన చానల్ 1 మిలియన్ ఫాలోవర్ మార్క్‌ను చేరుకున్నప్పుడు ‘ఓ మై గాడ్’ అనుకుంది ఆనందంగా. ‘ఇదంతా నేను సొంతంగా సాధించాను’ అనే ఆనందం సెజల్‌కు మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. తన గొంతులోని ఛార్మింగ్ క్వాలిటీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబర్‌గా సెజల్ విజయరహస్యం ఏమిటి? ఆమె మాటల్లో...‘మొదటి సూత్రం...గుడ్క్వాలిటీ కంటెంట్. గత వీడియో కంటే తాజా వీడియో ఎంతో కొంత బాగుండాలి. రెండో సూత్రం...ఎప్పుడో ఒకప్పుడు కాకుండా నిరంతరం ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుండాలి. మూడో సూత్రం...ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. వారికి ఎలాంటి వీడియోలు కావాలో తెలుసుకోవాలి’ సెజల్ యూట్యూబ్ చానల్ ప్రేక్షకులలో మహిళలు ఎక్కువ. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఉంటారు. ‘ఒక కాలేజీ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి మీ పేరుతో కనిపించే వీడియో కనిపిస్తే చాలు క్షణం ఆలస్యం చేయకుండా చూస్తాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న తరువాత మరింత కష్టపడాలి అనిపించింది’ అంటుంది సెజల్. ‘కాళీ కాళీ’ మ్యూజిక్ ట్రాక్ సింగర్‌గా ఆమె ప్రతిభకు అద్దం పట్టింది. ఎన్నో వ్యాపారప్రకటనల లో నటించిన సెజల్...‘కలలను నిజం చేసుకునే విషయంలో అధైర్యం వద్దు. మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది. జైపూర్‌లోని మణిపాల్ యూనివర్శిటీలో ‘హౌ టు మేక్ యూట్యూబ్ ఏ కెరీర్?’ అనే అంశంపై సెజల్ చేసిన ప్రసంగం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపించింది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి? నిర్మాత ఎవరో తెలుసా?
యూట్యూబ్ స్టార్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవసరంలో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చదవండి: 'పుష్ప-2'లో రష్మిక చనిపోతుందా? వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత? తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు..దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మరి యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాల్సి ఉంది. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ -
ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముక్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయనతోబ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకొచ్చాక దీప్తి షణ్నూకి గుడ్‌బై చెప్పేసింది. తాము కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసి విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎవరికీ వారే సొంతంగా యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు. కానీ తాజాగా షణ్ను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది చూసిన అతని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'అయ్యయ్యో' అనే పేరుతో సాంగ్ రీలీజ్ చేశాడు షణ్ముక్. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు. ఆ సాంగ్‌లో షణ్ను ముద్దులతో రెచ్చిపోయాడు. (ఇది చదవండి: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?) ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ దీప్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా టూమచ్ బ్రో.. ఇదంతా దీప్తి మీద రివెంజ్ కోసమేనా అని కొందరు కామెంట్స్ చేశారు. 'అరే ఏంట్రా ఇది' అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయగా.. ఇది చూస్తే దీపు చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
షన్నుతో దీప్తి బ్రేకప్.. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ..!
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత ఫేమ్ సంపాదించారు. కానీ ఊహించని రీతిలో షన్ను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ బ్రేకప్ చెప్పేసుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీరి ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఈ జంట విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. తాజాగా ఈ బ్రేకప్ తర్వాత దీప్తి సునయన క్రేజీ కామెంట్స్ చేసింది. షన్నుతో రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే దీప్తి బ్రేకప్ విషయంపై తాజాగా ఓపెన్ అయింది. తన ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశారు. అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో షన్నుతో బ్రేకప్‌పై స్పందించింది . బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటని నెటిజన్ ప్రశ్నించగా.. రోజు రోజుకు రోబోలా తయారవుతున్నా అంటూ సమాధానం చెప్పింది దీప్తి. మరో నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఒక వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించాలంటే అతడిలో ఏం చూస్తారు? ఎంత సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘నన్ను నవ్విస్తే చాలు’ అంటూ సమాధానమిచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. ఆ తర్వాత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సరిచ్చింది దీప్తి సునయన. బ్రేకప్‌కు ఏడాది పూర్తి దీప్తి సునయన-షణ్ముక్ జశ్వంత్ విడిపోయి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇద్దరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ,సంగతి తెలిసిందే. 2022 ప్రారంభంలో షన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక బ్రేకప్ చెప్పేసింది దీప్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి గుడ్ బై చెప్పేసేంది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా తాము విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆమె మరోసారి అభిమానులు ఈ ప్రశ్న అడగడంతో ఈ జంట మళ్లీ కలుస్తారా అని కామెంట్స్ చేసున్నారు. -
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు..చివరికి ఏమైందంటే?
చండీగఢ్: పంజాబ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతం నుంచి అతడి ప్రయాణం మొదలవ్వగా.. మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. తనకు ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు అతని ఇంతటి సాహసానికి పూనుకున్నాడు. అయితే చివరికి బాలుడి కోరిక తీరనే లేదు. ఎంతో అభిమానం, ఆశతో కలవాలనుకున్న యూట్యూబ్ స్టార్ విదేశాలకు వెళ్లాడని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వివరాలు.. పటియాలాకు చెందిన 13ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్ మల్హన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ‘ట్రిగ్గర్డ్ ఇన్సాన్’ యూట్యూబ్ ఛానల్ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. బాలుడు కూడా అతన్ని అతను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్ నిర్వాహకుడు నిష్చాయ్ మల్హాన్‌ను కలవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్న విద్యార్థి తన సైకిల్‌పై అక్టోబర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు. చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం మూడు రోజులు 250 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. అయితే మల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లినట్లు చెప్పడంతో అతను తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక సోషల్ మీడియాను ఉపయోగించి బాలుడి గురించి ప్రచారం చేశారు. చివరికి యూట్యూబర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్‌ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా బాలుడు విషయం యూట్యూబ్ స్టార్ వరకు చేరింది. ముందుగా విద్యార్థి కనిపించకుండా పోయాడని తెలిసి ఆందోళన చెందిన మల్హాన్ పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవాలని పోలీసులను కోరాడు. అనంతరం విద్యార్థి దొరికిన సంగతి తెలిసి..‘హమ్మయ్యా ఎట్టకేలకు బాలుడు తన ఇంటికి చేరాడు. మంచి విషయం’ అంటూ ట్వీట్ చేశాడు. This is serious, if anybody has any information, please contact the police or the undersigned. I'm not in Delhi and travelling in Dubai, without network, will keep posted about this however much I can. https://t.co/BllLoZEubM — Nischay Malhan (@TriggeredInsaan) October 7, 2022 -
ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందిన షణ్ముఖ్.. బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో రన్నరఫ్‌గా నిలిచి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ ముగిశాక దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా షణ్నూ ఈమధ్య తిరిగి యాక్టివ్ అయ్యాడు. రీసెంట్గా 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. తాజాగా షణ్నూ తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. దసరా పండుగ వేళ లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షణ్నూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇదంతా డ్రీమ్‌లా ఉంది. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజీషన్లో చూడాలనుకున్నది మీరే.. నాట్ ఫ్రెండ్స్ ఓన్లీ మీరే. ఐలవ్యూ 3000. ఇది మన కార్. బయట ఎప్పుడు కనిపించినా చెప్పండి. లిఫ్ట్ పక్కా ఇస్తా అంటూ షణ్నూ పోస్ట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షలట. ఇక షణ్నూ పోస్ట్ చూసి అభిమానులు కంగ్రాంట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
అభిమానులకు యూట్యూబ్ స్టార్ కుచ్చుటోపీ.. రూ. 437 కోట్లు ముంచేసి
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే.. (Photo Credits: Nutty Instagram) థాయ్‌లాండ్‌కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది. చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్ (Photo Credits: Nutty Instagram) అంతేగాక బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్‌ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్‌ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్‌లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
22 ఏళ్ల యూట్యూబ్ స్టార్ మృతి.. తండ్రి భావోద్వేగపు పోస్ట్
Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22: ప్రముఖ ఆస్ట్రేలియిన్ ర్యాపర్, యూట్యూబ్ స్టార్ లిల్ బో వీప్ అకాల మరణం చెందింది. 22 ఏళ్ల ఈ గాయని మార్చి 3న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మాథ్క్యూ స్కోఫీల్డ్ సోషల్ మీడియా వేదికైన ఫేస్బుక్లో తెలిపారు. ఈ పోస్ట్‌లో 'డిప్రెషన్, బాధ, పీటీఎస్డీ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మా కుమార్తె కోసం ఈ వారమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆమెను అమెరికా నుంచి ఇక్కడికీ తీసుకువచ్చినప్పటినుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము పక్కనే ఉన్నప్పుడు ఆమె తన రాక్షసులతో తీవ్రంగా పోరాడింది. కానీ మేము ఆమెను కోల్పోయాం. మేము కూడా ఓడిపోయాం' అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె మృతికి గల సరైన కారణాలను ఇంకా వెల్లడించలేదు. గాయని లిల్ బో వీప్ మృతిపట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 'ఐ లవ్ యూ. ఐయామ్ సారీ బేబీ గర్ల్. మరో జీవితం', 'రెస్ట్ ఇన్ పీస్ వినోనా, నా కష్టతరమైన సమయంలో మీ సంగీతం నాకు సాంత్వన కలిగించింది.' అంటూ కామెంట్స్ పెట్టారు. లిల్ అభిమానుల ప్రేమను చూసి ఆమె తండ్రి మళ్లీ 'ఆమె తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. తను నా హీరో, నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్. తనను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. లిల్ బో వీప్ అసలు పేరు 'వినోనా బ్రూక్స్'. 2015సో సౌండ్క్లౌడ్లో తన సంగీతం కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత అనేక మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. 'పీటీఎస్డీ' పేరుతో ఒక నిమిషంన్నర నిడివి గల పాటను ఆమె చివరిగా పోస్ట్ చేసింది. -
Shirley Setia: యూట్యూబ్ సంచలనం.. పుట్టింది డామన్.. పెరిగింది స్విట్జర్లాండ్..
హోమ్మేడ్ ఫిల్మ్స్‌తో ఇంటర్నేషనల్ ఫేమ్ కావచ్చు...అని మరోసారి నిరూపించింది స్వీటువాయిస్ షెర్లీ. డామన్‌లో జన్మించిన షెర్లీ షెటియ స్విట్జర్లాండ్‌లో పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్‌లో చదువుకునే రోజుల్లో పార్ట్–టైమ్ రేడియో జాకీగా పనిచేసింది. తాను పాడిన పాటలను సరదాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. యూఎస్,యూకే, కెనడా, ఇండియాలలో ఉన్న ఎందరో కళాకారులతో ఆన్లైన్ వేదికగా కలిసి పనిచేసింది. ‘యూట్యూబ్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకొంది. ముంబైకి వచ్చేసిన తరువాత... హిందీ యాక్షన్ కామెడి ఫిల్మ్ ‘ఏ జెంటిల్మెన్’లో డిస్కో...డిస్కో, ‘మస్కా’ సినిమాలో ‘ఐవన హ్యాంగ్ విత్ యూ’....మొదలైన పాటలు షెర్లీకి ఎంతో పేరు తెచ్చాయి. ‘బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్’ అనిపించుకుంది. ప్రసిద్ధ టీ–సిరీస్ మిక్స్‌టేప్, ఎలక్ట్రో ఫోక్లకు పాడింది. ‘మన హృదయం చెప్పినట్లు నడుచుకుంటే విజయం మనదే’ అంటుంది షెర్లీ షెటియ. చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి View this post on Instagram A post shared by Shirley (@shirleysetia) -
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న అజయ్.. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు....పాట గురించి గుజరాతీ కుర్రాడు అజయ్‌కి తెలియకపోవచ్చు. కాని అతడికి బాగా తెలుసు... ప్రతి నిమిషం ఇష్టమైన పనిపై దృష్టి పెడితే సక్సెస్‌ను కరెక్ట్‌గా ఊహించవచ్చు అని. అందుకే అజయ్ అలియాస్ అజ్జూభాయ్ విజేత అయ్యాడు. ‘టాప్ 10 ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్–2021’ గేమర్స్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు... అజ్జూభాయ్గా ప్రసిద్ధుడైన అహ్మదాబాద్‌కు చెందిన అజయ్ ఇంటర్మీడియట్ తరువాత ‘ఇక చదువుకోవడం నా వల్ల కాదు’ అనుకున్నాడు. అలా అని ఖాళీగా తింటూ కూర్చోలేదు. బలాదూర్‌గా తిరగలేదు. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాలంటే అతడికి చాలా ఇష్టం. ఆన్లైన్ వేదికగా సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అజయ్ బాల్యం ‘స్కూల్ టు హోమ్....హోమ్ టు స్కూల్’ అన్నట్లుగా ఉండేది. అలాంటి అజయ్ చదువు మధ్యలోనే మానేయడం తల్లిదండ్రులకు నచ్చిందో లేదో కానీ వారు పెద్దగా ఏమీ అనలేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ‘గ్రోత్ హ్యాకర్’గా పనిచేశాడు అజయ్. తనకు గేమింగ్ అంటే చా...లా ఇష్టం. అయితే తన ఫ్రెండ్స్, పరిచయస్తులలో గేమ్స్ గురించి పెద్దగా తెలిసినవాళ్లు, బాగా ఇష్టపడేవాళ్లు లేరు. గేమర్స్ తమదైన గేమింగ్ కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేసుకుంటారు? అనే సందేహం అతనికి ఎప్పుడూ వచ్చేది. ఇక తానే సొంతంగా ఆన్లైన్లో తనలాంటి ఆసక్తి ఉన్నవారిని పరిచయం చేసుకొని గేమ్స్ ఆడేవాడు. మొదటిసారి యూట్యూబ్‌లో ‘ఫ్రీ ఫైర్’ గేమ్స్ చూసినప్పుడు బాగా ఆకర్షితుడయ్యాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. ఒకరోజు తన సోదరుడితో అన్నాడు... ‘యూట్యూబ్ గేమింగ్ చానల్ మొదలుపెడదామనుకుంటున్నాను. ఎలా ఉంటుంది?’ ‘నీకంత సీన్ లేదు’ అని ఆ సోదరుడు వెక్కిరించి ఉంటే ఎలా ఉండేదోగానీ ‘బాగుంటుంది. నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు’ అని ధైర్యం ఇచ్చాడు. అలా మన అజయ్ ‘టోటల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఇది సూపర్ హిట్టు. దీనిలో గేమింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడూ అప్లోడ్ చేస్తుంటారు. ‘టీజీ టోర్నమెంట్స్’ అనే రెండో చానల్ మొదలుపెట్టాడు. అది కూడా సూపర్‌డూపర్ హిట్ అయింది. ఇందులో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటారు. వెరైటీస్ ఆఫ్ గేమింగ్, ఎంటర్టైనింగ్, మోటివేషనల్....మొదలైనవాటితో కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు అజ్జూభాయ్. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!! మన దేశంలో ‘లీడింగ్ గేమర్’గా పేరు తెచ్చుకున్న అజ్జూభాయ్ విజయరహస్యం ఏమిటి? అతని మాటల్లోనే చెప్పాలంటే... ‘క్లీన్ కంటెంట్’ స్మార్ట్టీవిలు మొదలైన తరువాత కుటుంబంతో కలిసి గేమ్స్ ఆడే కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్లీన్ కంటెంట్ ఉండాలని, అభ్యంతరకరం కాని భాష ఉండాలనేది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతడిని విజేతను చేసింది. కర్వ్డ్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ∙40 ప్లస్ డైలీ లైవ్క్లాసెస్. పాప్లర్ మ్యూజిక్. బ్యాలెన్స్డ్ డిజైన్. మాగ్నెటిక్ రెసిస్టెన్స్. డ్యుయల్ బాటిల్ హోల్డర్స్. బ్లూటూత్ రెసిస్టెంట్ కంట్రోల్.సూపర్‌ఫాస్ట్ స్ట్రీమింగ్ స్క్రాచ్. రెసిస్టెన్స్ బరువు: 56కిలోలు చదవండి: ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో! -
ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..
Top 7 Social Media Stars In 2021: కరోనా మహమ్మారి రాకతో లాక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థియేటర్లన్ని మూతపడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నామని డీలా పడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా, ఓటీటీలపై పడ్డారు సినీ ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియా, ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. భారీ సినిమాలు రాకపోవడంతో యూట్యూబ్, ఓటీటీల్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోయింది. అయితే ఈ ఏడాది వెబ్ సిరీస్‌ల హవా కొనసాగింది. దీంతో యూట్యూబ్, ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిసింది. అలాగే కరోనా పుణ్యమా అని వెబ్ సిరీస్ ద్వారా పరిచమయైన చిన్న చిన్న నటులు తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా.. 1. షణ్ముఖ్ జస్వంత్ (సూర్య) సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీ షో 5వ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2. మౌనిక రెడ్డి (సూర్య) సూర్య వెబ్ సిరీస్‌తో అనేక అభిమానులను సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య వెబ్ సిరీస్‌తో అత్యంత పాపులారిటీ సంపాందించుకుంది మౌనిక రెడ్డి. 3. అనన్య (30 వెడ్స్ 21) సోషల్ మీడియాలో అత్యధికంగా క్రేజ్ సంపాదించుకుంది అనన్య. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో అనన్య కుర్రాళ్ల రాకుమారిగా మారిపోయింది. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు 21 ఏళ్ల అమ్మాయికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనేదే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌తో అబ్బాయిలకు క్రష్‌గా మారింది అనన్య. 4. చైతన్య రావు (30 వెడ్స్ 21) 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు. నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు చైతన్య. 5. సిరి హనుమంతు రామ్ లీలా, గంధరగోళం, లాక్డౌన్ లవ్ వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ సిరి హనుమంతు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా రాణిస్తోంది. 6. శ్రీహాన్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్. వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. 7. అనిల్ గీలా (మై విలేజ్ షో) మై విలేజ్ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు అనిల్ గీలా. మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే యూట్యూబ్‌లోని తన సత్తా చాటాడు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానెల్ నిర్వహిస్తున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించాడు అనిల్. -
ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి
youtube Star shreya Muralidhar(27) Last Breath Due To Cardiac Arrest: ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శ్రియా మురళిధర్(27) మృతి చెందారు. సోమవారం(డిసెంబర్ 7) రాత్రి గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. నిన్న అర్థరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానికి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణంచినట్లు వైద్యలు స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా మురళీధర్… యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించేది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ ఇక ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది. ‘వాట్ ద ఫన్’ అనే యూట్యూబ్ ఛానల్లో ఆమె చేసిన వీడియోలు.. నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వెండితెరపై కనిపించాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా చనిపోవడం పలువురి బాధిస్తోంది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. కాగా శ్రీయా మృతి పట్ల యూట్యూబ్ స్టార్ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Shreya Muralidhar Ambala! (@shreyamuralidhar__) -
నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది
గాంధీ అనే యువకుడు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్మోహన్ రావు (రావు గోపాలరావు) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ ఛాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే 'ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ ఛాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి. ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం. సినిమాలోలా ఛాలెంజ్ లు, గట్రా కాకుండా చట్టబద్దంగా డబ్బులు సంపాదించవచ్చా'అంటే అవుననే అంటున్నాడు 27ఏళ్ల యువకుడు. అలా అనడమే కాదు. నిరూపిస్తున్నాడు కూడా. దిగ్గజ సంస్థల సీఈఓలకు వచ్చే వేతనాలకు సరిసమానంగా అర్జిస్తున్నాడు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగంతో పాటు ప్రత్యామ్నాయంగా డబ్బులు సంపాదించడం చాలా అవసరం. అందుకే టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ ద్వారా డబ్బు ఈజీగా సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు. అంతేందుకు తాను నిద్రపోతున్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందని చెబుతున్నాడు. అయితే ఆ బ్యాంక్ లెక్కలతో పాటు ఈ 27 ఏళ్ల యువకుడి యూట్యూబ్ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పదండి..! ట్రెడీషనల్ జాబ్స్‌ను సెలక్ట్ చేసుకోవడం, రిటైర్ అయ్యేదాకా అదే జాబ్‌లో కొనసాగే రోజులు పోయాయి. కంటెంట్ ఉంటే చాలు కటౌట్‌తో పనిలేకుండా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓ'ల కంటే ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు కోట్లాది మంది అభిమానులతో ఆన్లైన్ స్టార్స్‌గా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతాడు 27 అమిత్ భదనా. ఇతనో యూట్యూబ్ క్రియేటర్. ఒక్క వీడియోతో లక్షలు సంపాదిస్తాడు. అతని ఆస్తులు కోట్లలో ఉన్నాయని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. అమిత్ భదానా ఎవరు? అమిత్ భదానా 27 ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి. పాఠశాల విద్యను యమునా బీహార్ పాఠశాలలో, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాడు. అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తున్నాడు. 2017లో ప్రారంభం అమిత్ భదానా తన పేరుతోనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. అక్టోబర్ 24, 2012న ఛానెల్‌ని ప్రారంభించినా 2017వరకు ఎలాంటి వీడియోలు పెట్టలేదు. కానీ 'ఎగ్జామ్ బీ లైక్ బోర్డ్ ప్రిపరేషన్ బీ లైక్' పేరుతో తొలి వీడియోను 2017లో అప్లోడ్ చేశాడు. అలా ప్రారంభమైన ఛానల్‌కు ఇప్పుడు 23.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అమిత్ భదానా సంపాదన మీడియా నివేదికల ప్రకారం, అమిత్ భదానా తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ప్రతి వీడియోకి రూ. 10 లక్షలు సంపాదిస్తాడు. అమిత్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా నికర ఆస్తి ఒక్కో వీడియోకి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న అమిత్ భదానా నికర ఆస్తి కాకుండా, మొత్తం నికర ఆస్తి దాదాపు రూ. 52 కోట్లుగా ఉంది. చదవండి: ఇదేం యాపారం సామి..! జీన్స్ కొంటే ఫోన్ ఫ్రీ..టెక్ దిగ్గజం కొత్త ఐడియా -
Vidya Iyer: వాయిస్ ఆఫ్ విద్య
భారతదేశంలో పుట్టింది. పెరిగిందేమో అమెరికాలో. డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ అనుకోకుండా మంచి సింగర్‌గా మారింది. ఒక దేశంలో పుట్టి మరో దేశంలో పెరిగినప్పటికి.. దేశీయ సంప్రదాయ సంగీతాన్ని వెస్ట్రన్ మ్యూజిక్‌తో కలిపి, వీటికి తన సృజనాత్మకతను జోడించి సరికొత్త మ్యాషప్ సాంగ్స్‌తో ప్రపంచ వ్యాప్త వ్యూవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది విద్యా అయ్యర్. విద్యా అయ్యర్ భారత సంతతికి చెందిన అమెరికన్ పాపులర్ మ్యాషప్సాంగ్స్ సింగర్. చెన్నైలో పుట్టిన విద్య, తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియాకు మకాం మార్చడంతో చిన్నతనంలోనే అక్కడికి వెళ్లింది. అక్కడే పెరిగిన విద్య బీఎస్సీ (సైకాలజీ, బయోమెడికల్ సైన్స్) డిగ్రీ చేసింది. తరువాత మెడిసిన్ చదివేందుకు ఎమ్క్యాట్ (మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్)కు సన్నద్ధ మవుతున్న సమయంలో తన స్నేహితుడు శంకర్ టక్కర్ ఓ యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. విద్య చిన్నప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నట్లు తెలుసుకున్న టక్కర్ తన యూట్యూబ్ చానల్‌కోసం పాటలు పాడమని అడగడంతో వీకెండ్స్‌లో విద్య పాటలు పాడేది. విద్య గొంతు వినసొంపుగా సుమధురంగా ఉండడంతో టక్కర్ నిర్వహించే వివిధ కన్సర్ట్లలో పాల్గొని పాటలు పాడేది. విద్య గాత్రం ఎక్కువ మంది శ్రోతల్ని ఆకట్టుకోవడంతో టక్కర్.. విద్యను ‘‘నువ్వు కూడా ఒక యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించు’’ అని చెప్పడంతో తన గొంతుకు వస్తున్న ఆదరణను చూసిన విద్య సంగీతాన్నే కెరియర్‌గా మలుచుకోవాలనుకుంది. విద్యా వోక్స్... మెడిసిన్ చదివేందుకు ప్రిపేర్ అవుతోన్న విద్య ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకుని మ్యూజిక్‌ను కెరియర్‌గా ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. ‘‘రెండేళ్లు సమయం ఇస్తా. నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే ఒకే, లేదంటే... తిరిగి మెడిసిన్ చదవాలి’’ అని అమ్మ కండిషన్ పెట్టింది. అమ్మమాటను ఒప్పుకుని 2013లో ముంబై వచ్చి సంగీతంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది. రెండేళ్లపాటు ఇక్కడే ఉండి కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్ వాయిస్ పాఠాలను నేర్చుకుని తిరిగి 2015లో ఆమెరికా వచ్చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్‌లో ‘విద్యావోక్స్’ పేరిట యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ‘వోక్స్’ అంటే లాటిన్లో వాయిస్ అని అర్థం. మ్యాషప్ సాంగ్స్... సమకాలీన, సంప్రదాయమైన పాటలకు వెస్ట్రన్ సంగీతాన్ని జోడించి సరికొత్త పాటలను విద్యావోక్స్లో అప్లోడ్ చేసేది. ‘బిగ్ గార్ల్స్ క్రై’, ‘కభీ జో బాదల్ బర్సే’ మ్యాషప్ పాటలను అప్లోడ్ చేసింది. ‘మ్యాడ్ డ్రీమ్స్’ ‘కుథు ఫైర్’ సాంగ్స్ విద్యకు బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. విద్యకు బాగా పేరు వచ్చిన వాటిలో ‘‘లవ్ మీ లైక్ యూ డు, కబీరా–క్లోజర్, లీన్ ఆన్, జింద్ మహి, వుయ్ డోంట్ టాక్ ఎనీమోర్, పానీ ద ర్యాంగ్, కుట్టునందన్ పుంజయితే’’లు ఉన్నాయి. వెస్ట్రన్ పాప్ హిట్ సాంగ్స్‌కు భారతీయ సంగీతానికి జోడించి మ్యూజిక్ వీడియోలను రూపొందిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. విద్య తనే పాటలు రాయడం, స్వయంగా కంపోజ్ చేసి, సొంత బ్యాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష షోలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా ఇండియా, మారిషస్, ట్రినిడాడ్, సురనామ్, దుబాయ్, హాంగ్‌కాంగ్, అమెరికాలలో లైవ్‌షోలు నిర్వహించి శోతల్ని తన సుమధుర గానం, మ్యాషప్ పాటలతో ఆలరించింది. టక్కర్‌తో ప్రారంభించిన తన మ్యూజిక్ జర్నీ ఇప్పటికీ అతని సలహాలు, సూచనలతో కొనసాగడం విశేషం. కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్లలో సాయం చేస్తూ విద్యను ముందుండి నడిపిస్తున్నాడు. విద్య తల్లి, చెల్లి కూడా తనని ప్రోత్సహించడంతో ఆమె చానల్ ప్రస్తుతం 7.41 మిలియన్ల (దాదాపు డెభైఐదు లక్షలు) మంది సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. మనం ఎంచుకున్న రంగం ఏదైనా విభిన్నంగా ఆలోచిస్తూ, కష్టపడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అనడానికి విద్య గొప్ప ఉదాహరణ. ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
ఒక్క చాన్స్.. ఆమెను యూట్యూబ్ స్టార్‌ను చేసింది
‘అవకాశాలు ఊరికే రావు.. వచ్చిన వాటిని వదులుకోకూడదు’ అన్న ఫార్ములాను ఫాలో అయ్యి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది కృతి విజ్. వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఆమె గురించి.. పంజాబీ కుటుంబానికి చెందిన కృతి ఢిల్లీలో పుట్టి, పెరిగింది. లండన్‌లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. తర్వాత ముంబై చేరి ఇంటీరియర్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. తన సృజనాత్మక డిజైన్స్‌తో అనతికాలంలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్స్‌లో ఒకరిగా నిలిచింది. ప్రధాన పత్రికలు ఆమె ఆర్టికల్స్, డిజైన్స్‌ను ప్రచురించాయి కూడా. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం ఆమెను యూట్యూబ్ స్టార్‌ను చేసింది. 2017లో ‘వాట్ ద ఫోక్స్’ యూట్యూబ్ సిరీస్‌లో ఓ చిన్న పాత్ర పోషించింది. చేసింది చిన్న పాత్రే అయినా వచ్చిన గుర్తింపు మాత్రం పెద్దదే. నటనలో ఎటువంటి అనుభవం లేకపోయినా అవకాశాల వెల్లువ ఆమె దరిచేరింది. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి కలిగి ఇంటీరియర్ డిజైనర్ వృత్తిని వదిలేసింది. ‘ఫిల్టర్ కాఫీ టాక్స్’, ‘ఫస్ట్స్ సీజన్ 2’, ‘ ది ఇన్ట్య్రూడర్’, ‘ఇల్లీగల్ జస్టిస్ – అవుట్ ఆఫ్ ఆర్డర్’, ‘ లవ్ ట్రావెల్ రిపీట్’, ‘బేక్డ్’, ‘ది గుడ్ వైబ్స్’ అనే వెబ్ సిరీసుల్లో నటించింది కృతి. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రసారమవుతోన్న ‘భూతియాగిరి’ వెబ్ సిరీస్‌తో అలరిస్తోంది. ఈ మధ్యనే.. సహనటుడు ప్రణయ్ మన్‌చందాను ప్రేమించి,పెళ్లి చేసుకుంది. ప్రయత్నించడం కంటే గొప్ప శిక్షణ ఉండదనుకుంటా. నటనే తెలియని నేను నటిగా మారడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. షోలు, సిరీస్‌లు చేస్తూనే యాక్టింగ్ నేర్చుకున్నా.. నేర్చుకుంటున్నా. నటిగానే స్థిరపడకుండా టెక్నీషియన్‌గానూ మారాలనుకుంటున్నా! – కృతి విజ్ -
శృతి యూట్యూబ్ ఛానల్‌కు కోటిమంది సబ్స్క్రైబర్స్
చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి... ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టుగా బీటెక్ చదివి, తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది శృతి అర్జున్ ఆనంద్. యూఎస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తూ.. ఖాళీ సమయంలో తనకు తెలిసిన ఫ్యాషన్ వీడియోలను సరదాగా తీసి ఓ రోజు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలకు మంచి స్పందన లభించడంతో తన ఐటీ జాబ్‌ను వదిలేసి, తనలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసి పూర్తిగా యూట్యూబ్ వీడియోలపై దృష్టి పెట్టింది. ఫలితం... పాపులర్ యూ ట్యూబర్‌గా ఎదిగింది. క్రియేటివ్ కంటెంట్, ఫన్నీ వీడియోలు, ఫ్యాషన్ బ్లాగర్‌గా వివిధ రకాల ఛానళ్లు నడుపుతూ సక్సెస్‌పుల్ సోషల్ స్టార్ అనిపించుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శృతి. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశం ఝాన్సీలో 1985లో పుట్టిన శృతి తన అన్నయ్య అంకూర్ ఆనంద్‌తో అక్కడే పెరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి, బుందేల్‌ఖండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. తరువాత 2009లో అర్జున్ సాహును వివాహం చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది. వీరికి అనాయ ఆనంద్ అనే పాప ఉంది. అమెరికాలో ఉన్నప్పుడే.. భర్తతో అమెరికా వెళ్లిన శృతి ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచే సేది. అయితే ఉద్యోగం దొరకక ముందు శృతి వర్కింగ్ విసా కోసం కొన్ని రోజులు ఎదురు చూసింది. ఈ సమయంలో ఆమె విభిన్న రకాలు గా తన జుట్టును దువ్వుకునేది. ఈ క్రమంలోనే రకరకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నించి వాటన్నింటి వీడియోలు తీసుకునేది. 2010లో ఒకరోజు సరదాగా తన హెయిర్‌స్టైల్స్ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోకు మంచి స్పందన రావడంతో రకరకాల వీడియోలు అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకుంది. శృతి అర్జున్ ఆనంద్ ఛానల్.. అమెరికాలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పుడు గుర్గావ్లో స్టీరియా ఇండియా లిమిటెడ్‌లో ప్రోగ్రామర్‌గా ఉద్యోగం దొరకడంతో ఇండియా వచ్చి జాబ్‌లో చేరింది. అయితే కుటుంబం మొత్తం నోయిడాలో ఉండడంతో రోజూ అక్కడి నుంచి గుర్గావ్కి వెళ్లాల్సి రావడం, దానికితోడు యూట్యూబ్‌లో వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో.. కొద్దిరోజుల తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని యూట్యూబ్‌కు కేటాయించింది. 2011లో ‘శృతి అర్జున్ ఆనంద్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తొలినాళ్లల్లో శృతికి యూట్యూబ్ ఛానల్ నడపడం కాస్త కష్టంగా ఉండేది. దీంతో తన భర్త అర్జున్ శృతికి సాయం చేసేందుకు ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చాడు. ఒకపక్క శృతికి వీడియోలు తీయడంలో సాయం చేస్తూనే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. ఇలా కుటుంబం మొత్తం యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయారు. చర్మం, జుట్టు సంరక్షణకు వంటింటి చిట్కాలు, మేకప్ మెలకువలు, పట్టణ, గ్రామీణ తల్లులు, కూతుర్ల మధ్య వ్యత్యాసం, పేద, గొప్ప కుటుంబాల కల్చర్‌పై రూపొందించిన ఫన్నీ వీడియోలను శృతి ఎక్కువగా తన ఛానల్లో అప్లోడ్ చేసేది. ఆమె వీడియోలలో ‘మోడ్రన్ మామ్ వర్సెస్ దేశీ మామ్,యూజ్ దీజ్ ట్రిక్స్ టు అప్లై పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్స్ ఆన్ బోత్ ఐస్’ వంటివి బాగా ఆదరణ పొందాయి. ప్రముఖ బ్రాండ్లకు పనిచేయడంతోపాటు, పాపులర్ యూట్యూబర్ ప్రజక్త కోలి వంటి వారితో కలిసి శృతి పనిచేస్తోంది. శృతి అర్జున్ ఆనంద్ డిజిటల్ మీడియా, శృతి మేకప్ అండ్ బ్యూటీ ప్రైవేట్ లిమిటెడ్‌లను సొంతగా నిర్వహిస్తోంది. దీంతో ఆమె 2016లో ఇండియా టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. శృతి ఛానల్‌కు దాదాపు కోటిమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
Viral Video : చీరకట్టులో గుర్రపు స్వారీ
వెబ్‌డెస్క్: ఒడిషాకు చెందిన మోనాలీసా ఇప్పుడు యూట్యూబ్ సంచలనంగా మారింది. యూట్యూబర్‌గా ఆమె చేస్తున్న వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తున్నాయి. వెబ్ దునియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంతగా ఆమె వీడియోలు సంచనలం కావడానికి కారణం, అందులోని ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం.. యూట్యూబర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్లు స్టార్ చేసి వీడియోలు చేస్తున్నారు. అయితే ఇందులో యూనిక్ పాయింట్ ఉన్న ఛానళ్లే నిలదొక్కుకుంటున్నాయి. మోనాలీసా వీడియోల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయం. అవును సంప్రదాయ దుస్తుల్లో ఆల్మెస్ట్ అడ్వెంచరస్ పనులు చేస్తూ.. వాటిని తన యూట్యూబ్‌లో పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒడిషా సంప్రదయా పద్దతిలో చీర కట్టి , బొట్టు పెట్టి సాధారణ మహిళలా కనిపిస్తూ... ఆమె రూపొందిస్తున్న వీడియోల్లోని కొత్తదనం ఆకట్టుకుంటోంది. దీంతో మామూలు గృహిణి స్థాయి నుంచి యూట్యూబ్ స్టార్‌గా ఆమె ఎదిగింది. సంప్రదాయ సాధికారత ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లా జాహర్ మోనాలీసా సొంతూరు. ఆమె భర్త బద్రి నారాయణ్ భద్ర క్రియేటివ్ వర్కర్. భర్త ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్‌ని 2016లో ప్రారంభించింది. సంప్రదాయ చీరకట్టులో గుర్రపుస్వారీ చేస్తూ ఆమె అప్లోడ్ చేసిన వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆమె గుర్రపు స్వారీ వీడియోను మహిళా సాధికారతకు చిహ్నాలైన ? లక్ష్మీబాయి, రాణి రుద్రమ, రజియా సుల్తానాలను గుర్తుకు తెచ్చింది. క్లాసిక్ అడ్వెంచర్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మోనాలీసా. ముఖ్యంగా సంప్రదాయ చీరకట్టులోనే ఆమె చేసిన ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియో, ట్రక్ డ్రైవింగ్, బుల్లెట్ డ్రైవింగ్, వోల్వో బస్ డ్రైవింగ్ వీడియోలు లక్షల కొద్ది వ్యూస్ సాధించాయి. క్లాసిక్ ప్లస్ అడ్వెంచర్ ఫ్యూజన్‌గా నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఛానల్‌కి 22 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండగా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్త్నుట్లు సమాచారం. వివక్ష రూపుమాపాలనే - మోనాలీసా మహిళలపై సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపాలన్నదే నా లక్క్ష్యం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని చెప్పాలనుకున్నాను. సంప్రదాయబద్ధంగా ఉంటూనే గుర్రపుస్వారీ చేయడంతో పాటు వివిధ వాహనాలను డ్రైవ్ చేయోచ్చని నిరూపించాను. నా ప్రయత్నాలకు నా భర్త సహకారం తోడవటంతో యూట్యూబర్‌గా మారాను. -
భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
ముంబై: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య మృతికి అతడే కారణమని ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని బందూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ అమ్మాయిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బాధితురాలి తల్లి, సోదరి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జితేంద్ర, కోమల్ అగర్వాల్ భార్యాభర్తలు. వీరు ముంబైలో నివసిస్తున్నారు. భర్త జితేంద్ర ప్రముఖ యూట్యూబర్. అతడి ఛానల్ పేరు ‘జిత్ జాన్ (Jeetu Jaan)’. అయితే ఇటీవల భార్య కోమల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల్‌ది ఆత్మహత్య కాదు హత్యేనని ఫిర్యాదు చేయడంతో జితేంంద్రను అరెస్ట్ చేశారు. ‘అక్కను మానసికంగా శారీరకంగా జితేంద్ర వేధింపులకు గురి చేసేవాడు. రెండు మూడుసార్లు నన్ను కూడా వేధించాడు. కొంతమంది స్నేహితురాళ్లను కూడా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఒక్క ఇంట్లోంచి బయటకు వచ్చేసింది కూడా. అతడి వేధింపులతోనే అక మరణించింది. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కోమల్ సోదరి ప్రియ తెలిపింది. కేసు దర్యాప్తులతో ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..! ’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన -
Anam Darbar: సెలబ్రిటీ డాటర్ అట్రాక్టివ్ అనమ్!
తల్లిదండ్రుల సెలబ్రెటీ హోదాను వాడుకుని పాపులర్ అయ్యేవారు కొందరైతే.. సెలబ్రిటీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో స్టార్లుగా మెరుస్తున్నవారు మరికొందరు. ఇటువంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది.. ‘అనమ్ దర్బార్’. ముంబైకి చెందిన 23 ఏళ్ల అనమ్ దర్బార్ 22 లక్షలమంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గా దూసుకుపోతోంది. ఎంతో క్యూట్‌గా కనిపించే అనమ్ .. మోడల్, డ్యాన్సర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. 2017లో టిక్‌టాక్‌తో సోషల్ మీడియాకు పరిచయమైన అనమ్... కొత్తగా కంటెంట్‌ను క్రియేట్ చేసేది. ట్రెండింగ్ టాపిక్స్‌పై వీడియోలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేది. అంతేగాకుండా లిప్‌సింక్, కామెడీ వీడియోలను సరికొత్తగా చేసి టిక్‌టాక్ ఫాలోవర్స్‌ను తనవైపు తిప్పుకుంది. దీంతో తన వీడియోలు చూసే ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిది మిలియన్లకు చేరింది. అయితే కొన్ని కారణాలతో ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేయడంతో.. అనమ్ తన సొంత యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రాంక్ వీడియోలు, డ్యాన్సింగ్ వీడియోలు, మేకప్ ట్యూటోరియల్స్, ట్రావెల్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనమ్ వీడియోలు బాగా పాపులర్ అవడంతో తన ఫోటో చాలా మ్యాగజీన్ల కవర్ పేజీలపై కనిపిస్తోంది. ఇవేగాక ప్రింట్ షూట్స్‌లో పనిచేస్తూ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టిపెరిగిన అనమ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయేల్ దర్బార్ గారాల పట్టి. పాపులర్ కొరియోగ్రాఫర్, టిక్ టాక్ స్టార్ అవేజ్ దర్బార్‌కు స్వయానా చెల్లెలు. అవేజ్ దర్బార్, జైద్ దర్బార్లు ఇద్దరూ పాపులర్ కొరియోగ్రాఫర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఎంటర్టెయినర్స్కు అనమ్ ఒకరికి చెల్లి అయితే మరొకరి అక్క. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ‘బి యూ ఇన్’, ‘అత్రంగజ్’ డ్యాన్స్ స్టూడియోలను అవేజ్ నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు డ్యాన్స్ నేర్పించిన ఈ స్టూడియోలలో అనమ్ సభ్యురాలుగా ఉంది. అంతేగాక తన అన్నయ్యలతో కలసి అనేక డ్యాన్స్ వీడియోలు రూపొందించింది. అన్నయ్య ప్రేరణతో.. ముంబైలోనే పెరిగిన అనమ్ కామర్స్ గ్రాడ్యుయేట్. అనమ్ సెలబ్రెటీ కాకముందు కొంచెం లేజీగా ఉండేది. అయితే అవేజ్, అవేజ్ స్నేహితురాలు నగ్మా మిరాజ్కర్ కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తుండడం చూసి.. వారిని ప్రేరణగా తీసుకుని తను కూడా వీడియోలు రూపొందించి టిక్‌టాక్‌లో పోస్టు చేసేది. చూస్తుండగానే బాగా పాపులర్ అయ్యింది. కొద్దికాలంలోనే తన వీడియోలను ఇష్టపడే వారి సంఖ్య లక్షలకు చేరింది. తన వీడియోలతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోన్న అనమ్ ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్‌ను బాగా ఇష్టపడుతుంది. చేతిమీద ఇంగ్లిష్ అక్షరాల్లో ‘పాజిటివిటి’ అని ట్యాటూ వేసుకుని అంతే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఒకపక్క తన వీడియోలతో సోషల్ మీడియా నెటిజన్లను అలరిస్తూనే మరోపక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, యాడ్లలో నటించడం ద్వారా, ఫ్యాషన్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తోంది. తన సంపాదనలో కొంత భాగాన్ని ఎన్జీవోలకు విరాళంగా ఇస్తూ ఎంతోమందికి విద్యాదానం చే స్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.