
దివ్యశ్రీ గురుబెల్లి ,ఐశ్వర్యారెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: రాజమండ్రి నుంచి సిటీకి వచ్చిన ఓ అమ్మాయి నేపథ్యంలో జరిగే కథ ‘సాఫ్ట్‌వేర్ సత్యభామ’. లీడ్‌రోల్‌గా దివ్యశ్రీ గురుబెల్లి నటించారు. తమాడా వెబ్‌సిరీస్‌లో రిలీజ్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటంది. వారం రోజుల్లో 3 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. దివ్యశ్రీ పల్లెటూరు నుంచి వచ్చి సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. బాయ్స్‌కి దూరంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే ‘నాకు ఆల్‌రెడీ లవర్ ఉన్నాడంటూ’ తప్పించుకుంటంది. సిగరెట్ తాగే అలవాటున్న తన కొలీగ్ ఒకరోజు కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమెకు దివ్యశ్రీ పంచదార కలిపిన నీళ్లు తాగిస్తుంది. వెంటనే కిందపడిన అమ్మాయి ఫ్రెండ్స్ అంటూ అడుగుంది. దీంతో సత్యభామ స్మోక్ మానేస్తే ఫ్రెండ్‌షిప్ చేస్తా’నంటుంది. ఇలా ఓ మంచి మెసేజ్‌తోరూపొందించిన ‘సాఫ్ట్‌వేర్ సత్యభామ’ యూట్యూబ్‌లో యూత్‌కు బాగా చేరువుతోంది.
‘వరంగల్ వందన’ వైరల్
సోషల్ మీడియా పుణ్యమా అని గల్లీలో ఉండేవారు సైతం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాస్తంత క్రియేటివిటీ ఉంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చేస్తుంది. అందుకు ‘షార్ట్‌ఫిల్మ్స్’ చక్కని వేదికవుతోంది. సినిమా రంగంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ని వీటి ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈకోవలోనే వరంగల్ నేపథ్యంలో వస్తున్న షార్ట్‌ఫిల్మ్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇందులో సిటీకి చెందిన ఐశ్వర్యారెడ్డి ‘వరంగల్ వందన’గా తెగ సందడి చేస్తోంది. ‘టెన్త్ రిజల్ట్స్, వందన వార్డెన్, అప్పగింతలు, ఇంటర్‌పోరి, ఆటోవాలా, హోంసిక్’ వంటి సిరీస్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. శ్రీకాంత్ ఇప్పా డైరెక్టర్ చేస్తున్న ఈ వీడియోస్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. దసరా సందర్భంగా రూపొందించిన ‘ధూం..ధాం దసరా, మన ఊరి బతుకమ్మ’ వంటి వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్, హిట్స్‌తో ట్రెండ్‌ని సృష్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment