Top 7 Social Media Stars In 2021: కరోనా మహమ్మారి రాకతో లాక్‌డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థియేటర్లన‍్ని మూతపడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతున్నామని డీలా పడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా, ఓటీటీలపై పడ్డారు సినీ ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియా, ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. భారీ సినిమాలు రాకపోవడంతో యూట్యూబ్, ఓటీటీల‍్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోయింది. అయితే ఈ ఏడాది వెబ్ సిరీస్‌ల హవా కొనసాగింది. దీంతో యూట్యూబ్, ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిసింది. అలాగే కరోనా పుణ్యమా అని వెబ్ సిరీస్ ద్వారా పరిచమయైన చిన్న చిన్న నటులు తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా..
1. షణ్ముఖ్ జస్వంత్ (సూర్య)
సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీ షో 5వ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు.
2. మౌనిక రెడ్డి (సూర్య)
సూర్య వెబ్ సిరీస్‌తో అనేక అభిమానులను సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య వెబ్ సిరీస్‌తో అత్యంత పాపులారిటీ సంపాందించుకుంది మౌనిక రెడ్డి.
3. అనన్య (30 వెడ్స్ 21)
సోషల్ మీడియాలో అత్యధికంగా క్రేజ్ సంపాదించుకుంది అనన్య. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో అనన్య కుర్రాళ్ల రాకుమారిగా మారిపోయింది. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు 21 ఏళ్ల అమ్మాయికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనేదే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌తో అబ్బాయిలకు క్రష్‌గా మారింది అనన్య.
4. చైతన్య రావు (30 వెడ్స్ 21)
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు. నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు చైతన్య.
5. సిరి హనుమంతు
రామ్ లీలా, గంధరగోళం, లాక్‌డౌన్ లవ్ వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున‍్న ముద్దుగుమ్మ సిరి హనుమంతు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా రాణిస్తోంది.
6. శ్రీహాన్
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్. వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్‌లలో నటించారు.
7. అనిల్ గీలా (మై విలేజ్ షో)
మై విలేజ్ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు అనిల్ గీలా. మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే యూట్యూబ్‌లోని తన సత్తా చాటాడు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానెల్ నిర్వహిస్తున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించాడు అనిల్.
Comments
Please login to add a commentAdd a comment