Do You Know The History Of This Girl Who Appears On Youtube Noopur Chhabra - Sakshi
Sakshi News home page

Youtube Noopur Chhabra: ఒక్క యాడ్‌తో హీరోయిన్‌ లాంటి పాపులారిటీ.. ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

Published Sat, Aug 12 2023 3:05 PM | Last Updated on Sat, Aug 12 2023 4:14 PM

Do You Know The History Of This Girl Who Appears On Youtube Noopur Chhabra - Sakshi

కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్‌డమ్‌ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్‌ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 


చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్‌ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్‌ చాబ్రా.

అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్‌ ఓపెన్‌ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్‌ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్‌ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్‌ అమ్మాయి పేరు నుపుర్‌ చాబ్రా.

ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది.  శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్‌ బ్యాచలర్‌ డిగ్రీని అందుకున్న నుపుర్‌ ఫేస్‌బుక్‌ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది.

ఆరేళ్ల క్రితమే నుపుర్‌ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన సాహిల్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్‌ హాంగిన్‌ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement