advertisement
-
దుకాణమంతా దోచేయండి
పెర్త్: ఆషాడం సేల్. సగం ధరకే పట్టుచీర. బట్టల దుకాణాల్లో తరచూ కనిపించే ప్రకటన ఇది. ఇక జనరిక్ మందుల దుకాణాల్లో 70 శాతం, 80 శాతం డిస్కౌంట్ బోర్డులను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా 100 శాతం డిస్కౌంట్. అంటే ఉచితంగా పట్టుకెళ్లండి అనే షాప్ మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి దుస్తుల దుకాణం కొద్దిసేపు తెరచి ఉంచితే మరు నిమిషంలో సరుకంతా మటుమాయమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. పెర్త్ నగరంలో స్ట్రీట్‌ఎక్స్ అనే దుస్తుల షోరూమ్ ఉంది. దాని యజమాని డేనియల్ బ్రాడ్షాకు కొత్త ఆలోచన వచ్చింది. ‘‘టీ–షర్ట్‌లను షాప్‌లో సిద్ధంగా ఉంచుతా. దోచేయండి’’అని యువతకు మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. అంతే ఇక. టీ–షర్ట్‌లను పట్టుకెళ్లేందుకు యువత పోటెత్తింది. గురువారం ఉదయం దుకాణం షట్టర్ పైకెత్తగానే యువతీయువకులు పరుగుపరుగున లోపలికి దూరేసి దొరికింది పట్టుకెళ్లారు. ఎగబడి కలబడి టీ–షర్ట్‌లను ఎగరేసుకుపోయారు. తొక్కిసలాటలో దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా ఒక యువకుడు హెల్మెట్, మోకాళ్లు, మోచేతులకు ప్యాడ్లు ధరించిమరీ జనంలోకి దూకాడు. తోపులాటలో చిన్నపాటి గీసుకుపోవడం లాంటి దెబ్బలు తప్ప చెప్పుకోదగ్గ, ఆస్పత్రిలో చేరేంత స్థాయి గాయాలు ఎవరికీ కాలేదు. గతంలో సైతం షాప్ యజమాని ఒక భారీ ట్రక్కు నిండా దుస్తులు ఇలాగే ఉచితంగా దోచేసే ఆఫర్ ఇచ్చాడని అక్కడికొచి్చన ఒకావిడ చెప్పింది. గురువారం దుకాణంలో దాదాపు 400 టీ–షర్ట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. -
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్‌లో కెరీర్‌పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్‌ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్‌లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్‌గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్‌ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్‌ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్‌పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్‌ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్‌లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్‌లో మీ కలల కెరీర్‌కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి -
ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
కొందరు వృద్ధులు ఏజ్‌తో సంబంధం లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . కుర్రాళ్ల మాదిరిగా వారి ఆలోచనలు, వ్యవహార శైలి ఉంటుంది. అది వారి ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారా..! లేక మరేదైనా అనేది తెలియదు. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధుడు లేటు వయసులో పెళ్లి కోసం ఆరాట పడుతూ ఏం చేస్తున్నాడో వింటే కంగుతింటారు.అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గిల్బర్ట్ అనే 70 ఏళ్ల వ్యక్తి తనకు తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. తాను 2015 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన కలల భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, మంచి ఆదాయం కూడా ఉందని తెలిపాడు. అంతేకాదు తనకు తగిన గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ బిల్‌బోర్డులపై భారీగాప్రకటనలు కూడా ఇస్తున్నాడు. అందుకోసం అతడు వారానికి సుమారు రూ. 33 వేలు దాక ఖర్చు పెడుతున్నాడట. తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని, నిజాయితీగా ఉండే మంచి భాగ స్వామి కోసం యూకే వరకు చుట్టోస్తానని మరీ చెబుతున్నాడు. ఈ ప్రకటన కారణంగా అతడికి దాదాపు 400పైగా కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయట. వారంతా తాను ధనవంతుడిగా భావించి పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాళ్లని, అందుకు వారందర్నీ తాను తిరస్కరించానని చెబుతున్నాడు. తనకు నమ్మకమైన భాగస్వామి కావాలని అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకాలమైన ఎదురు చూస్తానని తెగేసి చెబుతున్నాడు. అంతేగాదు అందుకోసం ఎంత డభైనా వెచ్చించి బిల్‌బోర్డ్‌లో ప్రకటచ్చేందుకు వెనుకాడనని అంటున్నాడు గిల్బర్ట్. అంతేగాదు తన ఏజ్ కంటే చాల చిన్న ఏజ్ అయినా ఓకేనట. ఈ ఏజ్‌లో ఒంటరితనం జయించటం కోసం తగిన భాగస్వామిని కావాలనుకోవటం వరకు సరైన విషయమే. కానీ అందుకోసం ఇంతలా డబ్బు వెచ్చిస్తూ..తపన పడటం విడ్డూరంగా ఉంది కదూ.!(చదవండి: -
వరంగల్‌కు అరూరి..
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఆదివారం రాత్రి మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను వరంగల్ నుంచి, తాండ్ర వినోద్‌రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్‌రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చినా, ఆ తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావులలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా జరిగిన పలు పరిణామాలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే అనూహ్యంగా తాండ్ర వినోద్‌రావు అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 17 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వుడ్ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది. ఆయా లోక్‌సభ సెగ్మెంట్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే.... ఆదిలాబాద్: గోడం నగేష్ (ఎస్టీ గోండు) పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ (ఎస్సీ మాదిగ) కరీంనగర్: బండి సంజయ్ కుమార్ (మున్నూరు కాపు) నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ (మున్నూరు కాపు) జహీరాబాద్: బీబీ పాటిల్ (లింగాయత్) మెదక్ : రఘునందన్‌రావు (వెలమ) మల్కాజ్గిరి: ఈటల రాజేందర్ (ముదిరాజ్) సికింద్రాబాద్: జి.కిషన్‌రెడ్డి (రెడ్డి), హైదరాబాద్: మాధవీలత (బ్రాహ్మణ), చేవెళ్ల: విశ్వేశ్వర్ రెడ్డి (రెడ్డి), మహబూబ్‌నగర్: డీకే అరుణ (రెడ్డి), నాగర్‌కర్నూల్: పి.భరత్ (ఎస్సీ మాదిగ), నల్గొండ: సైదిరెడ్డి (రెడ్డి), భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ (గౌడ్), వరంగల్: అరూరి రమేశ్ (ఎస్సీ మాదిగ), మహబూబాబాద్: సీతారాం నాయక్ (ఎస్టీ లంబాడా), ఖమ్మం: తాండ్ర వినోద్ రావు (వెలమ) -
USA: వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్
వాషింగ్టన్: అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్ తన వయసుపై తానే జోకులు వేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున బైడెన్ మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా షూట్ చేసిన ఒక టీవీ ప్రకటనలో బైడెన్ తనపై తానే జోకులు వేసుకున్నారు. ‘చూడండి.. నేను యువకుడిని కాదు. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే అమెరికా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు’ అని కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ బైడెన్ యాడ్‌లో చెప్పడం ఆసక్తిరేపింది. ఆ తర్వాత తాను కరోనాను ఎలా నియంత్రించాను, వృద్ధులకు ఇన్సులిన్ ధరలను ఎలా తగ్గించాను, మౌలిక సదుపాయాల చట్టం, గర్భం ధరించే విషయంలో మహిళలకు స్వేచ్ఛ లాంటి విషయాల్లో తన విజయాలను వీడియోలో బైడెన్ ప్రజలకు వివరించారు. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత యాడ్‌లో వన్ మోర్ టేక్ అనే వాయిస్ వినిపిస్తుంది. దీనికి ‘చూడు. నేను చాలా యంగ్, ఎనర్జిటిక్, అందగాడిని. నేనేం తప్పు చేశాను’ అని ముఖంలో కాస్త కోపంతో బైడెన్ అనడంతో యాడ్ బాగా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో బైడెన్ పలు విషయాలను మర్చిపోయి ప్రవర్తించిన ఉందంతాలు వెలుగు చూశాయి. తాజాగా జార్జియాలో హత్యకు గురైన నర్సింగ్ విద్యార్థిని లేకెన్ రిలే విషయం మాట్లాడుతూ ఆమె పేరును లింకన్ రిలే అని ఉచ్చరించడంతో బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడినట్లయింది. ఇదీ చదవండి.. లెబనాన్‌లో ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు మృతి -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం. -
దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ (ట్విటర్)లో వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు అమెరికన్ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీనిపైన తాజాగా మస్క్ స్పందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. అమెరికన్ కంపెనీలైన యాపిల్, డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్‌కాస్ట్ ఇక మీద ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని గత వారంలో వెల్లడించాయి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. ఈ కారణంగానే దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ప్రకటనలు నిలిపివేస్తామన్న కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా తీసుకుని, బెదిరించాలనుకున్నట్లు, అలాంటి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లాలనుకునే వారి వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై సదరు కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సిన విషయం. -
ఐదేళ్లలో 3,000 ఉద్యోగాలు
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర ఆధునిక విభాగాలలో ప్రత్యేకతలున్న నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్‌ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లు టైటన్ తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా విభిన్న విభాగాలలో ప్రత్యేకత కలిగిన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకునే వ్యూహాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ సొంత సిబ్బందిసహా.. వివిధ విభాగాలలో యువ వృత్తి నిపుణులను జత కలుపుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వృద్ధి, ఆవిష్కరణలతోపాటు పరిశ్రమలో కంపెనీ స్థానాన్ని పటిష్టపరచుకోనున్నట్లు టైటన్ హెచ్ఆర్(కార్పొరేట్, రిటైల్) హెడ్ ప్రియా ఎం.పిళ్లై పేర్కొన్నారు. 60:40 ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60 శాతం మెట్రో నగరాలలో సేవలందిస్తుండగా.. మరో 40 శాతం మంది ద్వితీయస్థాయి నగరాల(టైర్–2, 3)లో పనిచేస్తున్నట్లు టైటన్ వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాల పటిష్టతను కొనసాగిస్తూనే స్థానిక నిపుణులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
లైన్ ‘క్లియర్’ కొందరికే!
సాక్షి, హైదరాబాద్: కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. మొత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించినా.. కీలక నేతలు ఉన్న చాలా సీట్లను వదిలేసింది. తొలి జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతోపాటు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, టి.రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, దొంతి మాధవరెడ్డి వంటి వారికి చోటు దక్కింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన 12, ఎస్టీలకు రిజర్వ్ అయిన 2 స్థానాలు పోగా.. రెడ్డిలకు 17, వెలమలకు 7, బ్రాహ్మణులకు 2, మైనార్టీలకు 3, బీసీలకు 12 స్థానాలు దక్కాయి. అయితే బీసీల్లో ప్రధాన కులాలైన గౌడ, పద్మశాలి కులాల నేతల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు. యాదవ వర్గానికి 4, మున్నూరుకాపులకు 2, ముదిరాజ్, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కు లాలకు ఒక్కొక్కటి దక్కాయి. ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 3 స్థానాలు కేటాయించగా.. ఎస్టీల్లో 2 ఆదివాసీలకే ఇచ్చారు. లంబాడా నేతలకు తొలి జాబితాలో చోటు లభించలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ (3), నిజామాబాద్ (3), కరీంనగర్ (7), మెదక్ (5), రంగారెడ్డి (7), హైదరాబాద్ (10), మహబూబ్‌నగర్ (8), నల్లగొండ (6), వరంగల్ (4), ఖమ్మం (2) స్థానాలకు టికెట్లను ప్రకటించారు. ప్రముఖుల పేర్లు లేకుండానే! కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ పార్టీ ప్రముఖులు కొందరి పేర్లు కనిపించలేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు సురేశ్ షె ట్కార్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, పీఏసీ కన్వినర్ షబ్బీర్‌అలీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండాసురేఖ, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటివారి పేర్లు తొలి జాబి తాలో లేకపోవడం గమనార్హం. కచ్చితంగా తొలి జాబితాలో ఉంటాయని భావించిన కొందరి పేర్లు లేకపోవడం, అనూహ్యంగా మరికొందరి పేర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అను బంధ సంఘాలకు తొలి జాబితాలో ప్రాధాన్యం దక్కలేదు. టికెట్లు ఆశిస్తున్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఫిషర్మెన్, ఎస్సీసెల్, కిసాన్ కాంగ్రెస్, బీసీ సెల్ నేతలు ఆశిస్తున్న టికెట్లు ప్రకటించలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు గోషామహల్ స్థానం ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలకూ తొలి జాబితాలో లభించలేదు. గెలుపు ఆశల్లేని స్థానాలే బీసీలకు? కాంగ్రెస్ తొలి జాబితాపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. బీసీలకు మొత్తంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పినా ఆ ప్రాధాన్యత కనిపించడం లేదని అంటున్నాయి. తొలి జాబితాలో 12 మంది బీసీల పేర్లు ఉన్నా.. సగం వరకు పెద్దగా గెలుపు ఆశలు లేనివేననే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు ఇచ్చిన 12 సీట్లలో.. మేడ్చల్, గద్వాల, ముషీరాబాద్, ఆలేరు స్థానాలను యాదవ సామాజిక వర్గాలకు, సికింద్రాబాద్, వేములవాడ స్థానాలను మున్నూరుకాపులకు, గోషామహల్‌ను ముదిరాజ్ మహిళకు కేటాయించారు. రామగుండం (బొందిలి), షాద్‌నగర్ (రజక)లను ఎంబీసీ కులాలకు ఇచ్చారు. మిగతా మూడు సీట్లను ఎంఐఎం ప్రాబల్యం ఉండే పాతబస్తీలో కేటాయించారు. అందులో చాంద్రాయణగుట్ట (వాల్మికి), యాకుత్‌పుర (మేరు), బహుదూర్‌పుర (వంజర) ఉన్నాయి. పారాచూట్లకు చాన్స్ కాంగ్రెస్ తొలి జాబితాలో పారాచూట్ నేతలకు గణనీయంగానే సీట్లు దక్కాయి. కూచాడి శ్రీహరిరావు (నిర్మల్), వినయ్‌కుమార్‌రెడ్డి (ఆర్మూరు), సునీల్‌రెడ్డి (బాల్కొండ), మైనంపల్లి రోహిత్‌రావు (మెదక్), ఆగం చంద్రశేఖర్ (జహీరాబాద్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజ్గిరి), కోట నీలిమ (సనత్‌నగర్), సరితా తిరుపతయ్య (గద్వాల), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే. తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు అవకాశం లభించింది. ఇందులో డాక్టర్ కోట నీలిమ, మొగిలి సునీత, సరితా తిరపతయ్య, సింగాపురం ఇందిర, సీతక్క, నలమాద పద్మావతి ఉన్నారు. మైనార్టీలకు నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట స్థానాలను కేటాయించారు. గాందీభవన్ వద్ద నిరసన సెగలు తొలి జాబితా విడుదలతోనే కాంగ్రెస్‌లో నిరసనల సెగలు కూడా మొదలయ్యాయి. పలు చోట్ల టికెట్లు ఆశించిన నేతలు, వారి అనుచరులు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. గద్వాల టికెట్‌ను అమ్ముకున్నారంటూ ఆ నియోజకవర్గ నేత కుర్వ విజయ్‌కుమార్ నేతృత్వంలో నిరసన తె లిపారు. మైనార్టీల ప్రాబల్యం ఉండే పాతబస్తీలో ఆ వర్గం నేతలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారంటూ కొందరు మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్, మేడ్చల్ వంటి చోట్ల కూడా టికె ట్లు రాని వారి అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను, దిష్టిబోమ్మలను దహనం చేశారు. -
అసమ్మతిపై హస్తం ముందుచూపు
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు అనంతరం తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నేపథ్యంలో టికెట్లు ప్రకటించిన తర్వాత ఎలాంటి అసమ్మతి ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పార్టీ దిగ్గజాలను రంగంలోకి దించనుంది. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే తదితరులను ఇందుకోసం ఎంపిక చేసిందని, వీరంతా తొలి జాబితా వెలువడడానికి ముందే రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. 8 క్లస్టర్లుగా విభజన.. టికెట్ల ప్రకటన తర్వాత జాగ్రత్తలు తీసుకునేందుకు గాను రాష్ట్రాన్ని ఎనిమిది క్లస్టర్లుగా అధిష్టానం విభజించిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రతి 15 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక డివిజన్ గా గుర్తించి, ఆయా డివిజన్లలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలతో ఏఐసీసీ దూతలు చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తారని సమాచారం. అభ్యర్థుల ఖరారుకు ఎంపిక చేసుకున్న ప్రాతిపదికలు, సామా జిక సమీకరణలను వారికి ముఖ్య నేతలు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తారని తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గ టికెట్ విషయంలో జరిగిన రచ్చను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే అధిష్టానం ఈ ఏర్పా ట్లు చేస్తోందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్. -
మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫుల్ హ్యాపీ. ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడికి పోటీగా కూతురు సితార కూడా వచ్చేసింది. తన అంతా హైట్ పెరిగిపోయిందని ఆశ్చర్యపడేలోపే.. మరో షాక్ ఇచ్చి మహేశ్నే అవాక్కయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా పాన్ వరల్డ్ రేంజులో ఎంట్రీ ఇచ్చింది. సితార గ్రాండ్ ఎంట్రీ! మహేశ్ కూతురు సితారని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మహేశ్, నమ్రత షేర్ చేసే ఫొటోలు, వీడియోల వల్ల సితార ఎలా ఉంది, ఏం చేస్తుందనేది తెలుస్తూనే ఉంది. ఇక సితార డ్యాన్స్ వీడియోలైతే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదంతా కాదన్నట్లు రీసెంట్ గా ఓ జ్యూవెల్లరీ యాడ్ షూట్లో సితార తొలిసారి పాల్గొంది. ఇప్పుడు దాన్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!) పాన్ వరల్డ్ రేంజులో ఓ నెలరోజుల క్రితం జరిగిన ఈ యాడ్ షూట్ లో సితార పాల్గొనడం ఓ విధంగా రికార్డ్. ఎందుకంటే టీనేజ్ లోకి రాకముందే ఇలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిందని తెలియగానే అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఏకంగా దాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్కేర్వ్ లో ప్రదర్శించారనేసరికి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలని వైరల్ చేస్తున్నారు. యాక్టర్ అవుతుందా? డ్యాన్సర్‌గా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న సితార.. ఇప్పుడు యాడ్ షూట్స్ లోకి కూడా వచ్చేసింది. తండ్రి ఇక్కడ యాడ్స్ చేస్తుంటే.. సితార మాత్రం అమెరికా నుంచి మొదలుపెట్టింది. మరి తండ్రి అడుగుజాడల్లోనే నటిగా అరంగేట్రం వస్తుందా లేదంటే కేవలం యాడ్స్, డ్యాన్స్ వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
అమూల్ గర్ల్ ప్రచార రూపకర్త ఇక లేరు
అమూల్ ప్రచారంలో కీలక పాత్ర పోషించేది.. విపరీతంగా ఆకట్టుకునేది ఆ ఉత్పత్తులపై ఉండే అమూల్ గర్ల్. ఒకరకంగా ఆ మస్కట్ వల్లే అమూల్ ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రచారం దక్కింది కూడా. దశాబ్దాలుగా అమూల్ సక్సెస్‌లో తన వంతు పోషిస్తోంది అమూల్ గర్ల్. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్.. ఇక లేదు. అడ్వర్టయిజింగ్ రంగంలో దిగ్గజంగా పేరున్న సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు. అమూల్ గర్ల్ ప్రచార రూపకర్త ఈయనే. 1960 నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్ ఒకరకంగా అమూల్ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది. ఈయన దగ్గర ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన యూస్టేస్ ఫెర్నాండెజ్ అమూల్ గర్ల్ మస్కట్‌ను తీర్చిదిద్దారు. అప్పటి నుంచి అమూల్ గర్ల్‌ను సందర్భోచితంగా(ఎలాంటి పరిణామం అయినా సరే!) తమ ప్రచారానికి అమూల్ వాడుకుంటూ వస్తోంది. సిల్వెస్టర్ డాకున్హా క్రియేటివ్ జీనియస్. ఆకర్షణీయమైన, జనరంజకమైన ఎన్నో యాడ్స్‌ను రూపొందించారాయన. చనిపోయేంతవరకూ డాకున్హా కమ్యూనికేషన్స్ కంపెనీకి చైర్మన్‌గా కొనసాగారు. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్ మెహతా ప్రకటించారు. డాకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ ఇక నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1966లో అమూల్ గర్ల్ ప్రపంచానికి పరిచయం కాగా.. అట్టర్లీ బట్టర్లీ అనే ప్రచార నినాదాన్ని రూపొందించారాయన. అది ఇప్పటికీ కొనసాగుతోంది. సిల్వెస్టర్ డాకున్హా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Very sorry to inform about the sad demise of Shri Sylvester daCunha, Chairman of daCunha Communications last night at Mumbai A doyen of Indian advertising industry who was associated with Amul since 1960s. The Amul family joins in mourning this sad loss @RahuldaCunha ॐ Shanti 🙏 pic.twitter.com/cuac1K6FSo — Jayen Mehta (@Jayen_Mehta) June 21, 2023 The man behind Amul's iconic Utterly Butterly Delicious ad campaign has just passed away. In his memoirs, Dr. V. Kurien had acknowledged the creative genius of Sylvester daCunha who was a legend of Indian advertising. His elder brother Gerson daCunha another legend of the Indian… — Jairam Ramesh (@Jairam_Ramesh) June 21, 2023 1966లో దేశంలోని ప్రతీ ఇంటికి చేరువయ్యేలా అమూల్ ఏదైనా కొత్త ప్రచారంతో ముందుకు రావాలనుకుంది. ఆ టైంలో అమూల్ యాడ్ ఏజెన్సీకి ఎండీగా ఉన్న సిల్వెస్టర్ డాకున్హా.. తన ఆర్ట్ డైరెక్టర్ యూస్టేస్ ఫెర్నాండెజ్ సహకారంతో అమూల్ గర్ల్ మస్కట్‌ను రూపొందించారు. ఆ టైంలో జీసీఎంఎంఎఫ్కు చైర్మన్‌గా ఉన్న డాక్టర్ వర్గీస్ కురియన్(క్షీరవిప్లవ పితామహుడు) వాళ్లకు సలహాలు కూడా ఇచ్చారట. అలా అమూల్ గర్ల్ పుట్టి.. ముంబైలోని రోడ్లపై హోర్డింగ్‌లుగా, బస్సులపైనా ఆ మస్కట్‌గా అమూల్‌కి సరికొత్త ప్రచారం కల్పించి.. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే అమూల్ గర్ల్‌కి 2021లో చిన్నమార్పు చేశారు. మిజోరాంకు చెందిన నాలుగేళ్ల గాయకురాలు ఎస్తర్ నమటేను అమూల్ గర్ల్‌గా గుర్తించారు. ఇదీ: ఫోన్లతో ఎక్కడపడితే అక్కడ స్కాన్ చేస్తాం.. మరి ఆ క్యూఆర్ కోడ్లు ఎలా పని చేస్తాయో తెలుసా? -
సరికొత్త కలెక్షన్‌తో మీ పెదాలకు మరింత అందం
-
ఐపీవోకు క్రేయాన్స్ అడ్వర్టైజింగ్
న్యూఢిల్లీ: ప్రకటనల రంగ కంపెనీ క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 10 ముఖ విలువగల 64.3 లక్షల ఈక్విటీ షేర్లను బుక్బిల్డింగ్ విధా నంలో జారీ చేయనుంది. తద్వారా సమీకరించి న నిధుల్లో రూ. 15.3 కోట్లను మౌలికసదుపాయాలు, విస్తరణకు అవసరమైన ఆధునిక సాంకేతికతకు వినియోగించనుంది. అంతేకాకుండా మరో రూ. 14.5 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ ప్రధానంగా బ్రాండ్ వ్యూహాలు, క్రియేటివ్ సొల్యూషన్లు, ఈవెంట్లు, డిజిటల్, సంప్రదాయ మీడియా ప్లానింగ్ తదితర సర్వీ సులను అందిస్తోంది. ఇటీవలే టాటా సన్స్, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ కాంట్రాక్టులు పొందింది. క్లయింట్ల జాబితాలో ఐవోసీ, టాటా క్రోమా, బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం చేరాయి. -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’?
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్విటర్లో యాడ్స్‌ను నిలిపి వేసింది. ఇదే విషయమంపై మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై యాపిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే యాపిల్ ట్విటర్లో యాడ్స్ నిలిపివేడయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యాపిల్ ట్విటర్లో ప్రకటనల్ని నిలిపి వేసింది. వారు అమెరికాలో వాక్ స్వాతంత్ర్యాన్ని ద్వేషిస్తారా ? టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని ట్వీట్లో ప్రశ్నించారు. యాడ్స్ తగ్గించుకుంది యాడ్ మెజర్మెంట్ సంస్థ పాత్మాటిక్స్ నివేదిక ప్రకారం.. మస్క్ కొనుగులో చేయకముందు యాపిల్ ట్విటర్లో అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 22 వరకు 220,800 డాలర్లు ఖర్చు చేసింది. మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత నవంబర్ 10 నుండి నవంబర్ 16 మధ్య కాలంలో 131,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. జనరల్ మిల్స్ ఇంక్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి సహా అనేక కంపెనీలు మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రకటన ఖర్చుల్ని తగ్గించు కుంటున్నాయి. అయితే జనరల్ మోటార్స్ ట్విటర్లో యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఆదాయం తగ్గుతోంది కొద్ది రోజుల క్రితం మస్క్ మాట్లాడుతూ..ట్విటర్ ఆదాయంలో భారీగా తగ్గుతోందన్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో యాడ్స్ ఇవ్వకుండా ఉండేలా సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. Apple has mostly stopped advertising on Twitter. Do they hate free speech in America? — Elon Musk (@elonmusk) November 28, 2022 What’s going on here @tim_cook? — Elon Musk (@elonmusk) November 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాక్సర్‌గా మారిన రొనాల్డో.. ఇదంతా దాని కోసమా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఫుట్‌బాలర్‌గా వెలుగొందుతున్న రొనాల్డో బాక్సర్‌గా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రత్యర్థితో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఫుట్‌బాలర్ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ వారి ఆనందం కాసేపు మాత్రమే మిగిలింది. ఇదంతా ఒక యాడ్ కోసమని తెలియగానే ఫ్యాన్స్ నాలుక కరుచుకున్నారు. అవునండీ రొనాల్డో.. అండర్వేర్ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో పాల్గొన్నాడు. సీఆర్ 7 బ్రాండ్ కలిగిన అండర్వేర్ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్ చేశాడు. ''బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్నెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఇటీవలే ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫుట్‌బాల్ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ(MMA-మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). ఫుట్‌బాల్ కెరీర్ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడులు పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్నాడు. కాగా తాను ఫుట్‌బాలర్ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందేవాడినని రొనాల్డో ఒక సందర్భంలో తెలిపాడు. View this post on Instagram A post shared by CR7 (@cr7cristianoronaldo) చదవండి: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! -
భర్త మోసాన్ని జీర్ణించుకోలేక... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య
భార్యభర్తల గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అవి ఓ మాదిరిగా ఉన్నంత వరకు ఓకే. గానీ శృతీ మించితే ఇరువురికి ప్రమాదమే. ఐతే ఇక్కడోక జంట కూడా అట్లానే పోట్లాడుకుంటున్నారు. దీంతో సదరు మహిళ ఓపిక నశించపోయి భర్త తీరుని బహిరంగంగా అందరికి తెలియపర్చాలనుకుంది. అందుకోసం ఏం చేసిందో వింటే అమో! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే....ఆస్ట్రేలియాలోని జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్ తనను మోసం చేస్తూ... వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతన్ని ఎలాగైన అవమానించుకోవాలని కంకణం కట్టుకుంది. అందుకోసం అని ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వారపత్రిక (వీక్లీ మ్యాగజీన్) 'మాకే అండ్ విట్ సండే లైఫ్' లో బహిరంగంగా భర్త గురించి ఒక ప్రకటన ఒకటి ఇచ్చింది. అందులో ప్రియమైన స్టీవ్ నువ్వు ఇప్పుడు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో అందరికి తెలిసిపోతుంది అని వారపత్రికలోని ఒక ఫుల్ పేజ్‌లో అతడి గురించి బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఆమె అ్కడితో ఊరుకోకుండా ప్రకటన చివరల్లో ఇంకో షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనను నీ క్రెడిట్ కార్డును ఉపయోగించే ఇచ్చానంటూ.. తన భర్త స్టీవ్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇది చదివిన పాఠకులలో ఉత్సుకతను పెంచి ఆమె ఎవరు ఎందుకలా మోసం చేశాడంటూ ఆత్రుతతో సదరు మ్యాగజీన్ కార్యాలయానికి ప్రత్యుత్తరాలు రాశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఈ విషయమై పలు పోస్టుల రూపంలో ప్రశ్నల వెల్లువెత్తినట్లు ప్రముఖ వీక్లీ మ్యాగజీన్ నిర్వాకులు తెలిపారు. సదరు వారపత్రిక తమకు స్టీవ్ గురించి తెలియదని పాఠకులకు వివరణ ఇచ్చింది. పైగా అతను చెడ్డవాడని మాత్రం చెప్పింది. ఇకపోతే జెన్నీ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. ఏదీఏమైన జెన్నీ బహిరంగ ప్రకటన ఒక పెద్ద తుపాను సృష్టించింది. పలువురు పాఠకులు మాత్రం జెన్నీ మీకు మంచి జరగాలి, అతనికి తగిన శాస్తి చేశారంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు. (చదవండి: చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్) -
ప్లేస్మెంట్ డ్రైవ్-2022లో ఎల్పీయూ ప్రభంజనం: భారీ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్స్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పీయూ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు సృష్టించింది. 2022 ప్లేస్మెంట్లలో రూ. 10- 64 లక్షల వరకూ ప్యాకేజీలతో గత రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త ప్లేస్మెంట్ బెంచ్‌మార్క్‌ని తాకింది. అందుకే విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు టాప్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. విద్యార్థులు రికార్డు సంఖ్యలో సూపర్ డ్రీమ్ ప్యాకేజీలను సాధించారు. 2022 సంవత్సరంలో, అగ్రశ్రేణి కంపెనీలలో కొలువులు సాధించిన వారిలో అత్యధిక సంఖ్యలో ఏకంగా 431 మంది ఎల్పీయూ వారే కావడం విశేషం. వీరిలో గూగుల్ లాంటి దిగ్గజాలు సంవత్సరానికి 10-64 లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపిక చేశాయి. బీటెక్ విద్యార్థి పాసౌట్, హరేకృష్ణ 64 లక్షల వార్షిక వేతనాన్ని సాధించారు. కాగా, 2022 బ్యాచ్‌కు చెందిన విద్యార్థి, అర్జున్ AI/ML డొమైన్లో 63 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఇద్దరూ బెంగుళూరు ఆఫీస్ నుండి పని చేస్తారు. అదేవిధంగా, అమెజాన్ తన విద్యార్థులను 46.4 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేయగా, పలోల్టో వంటి కంపెనీలు 49.4 లక్షల ప్యాకేజీతో విద్యార్థులను నియమించుకున్నాయి. ఈ గణాంకాలతో ఎల్పీయూ సగటు ప్లేస్మెంట్ ప్యాకేజీ దేశంలోనే అత్యధికంగా ఉంది. పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. bit.ly/3O4HouU తమ విద్యార్థుల అద్భుతమైన ప్యాకేజీలు సాధించడంపై ఎల్పీయూ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ మిట్టల్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమ-ఆధారిత విద్యను పాఠ్యాంశాలుగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ, బ్లాక్‌చెయిన్ లేదా IOT లేదా 3D ప్రింటింగ్ లేదా స్థిరమైన నిర్మాణంలో నిర్దిష్ట ల్యాబ్‌లతో నిండి ఉన్న ప్రపంచ అతి కొద్ది విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీల్లో ఎల్పీయూ ఒకటిగా ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. 10 లక్షల వరకు ఉన్న ప్యాకేజీలలో వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. 2021కి, కాగ్నిజెంట్ లాంటి 2022 పెద్ద కంపెనీలు 1410+ మంది విద్యార్థులను రిక్రూట్ చేశాయి. క్యాప్‌జెమినీ 770+ మంది విద్యార్థులను, విప్రో 450+ మంది విద్యార్థులను, L & T టెక్నాలజీ 550+ మంది విద్యార్థులను, DXC టెక్నాలజీ 250+ మంది విద్యార్థులను రిక్రూట్ చేసింది. 10 లక్షల వరకు 250+ మంది విద్యార్థులను నియమించింది. ఇందుకు 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్లు, అత్యాధునిక క్యాంపస్, గొప్ప ప్లేస్మెంట్ రికార్డ్ ద్వారా విద్యార్థులకు హాట్ డెస్టినేషన్‌గా మారిందన్నారు. తమ యూనివర్శిటీలో 28 రాష్ట్రాలు, దాదాపు 50+ దేశాల నుండి విద్యార్థులు ఉన్నారు. భారతదేశంలోనే నిజమైన గ్లోబల్ ఎక్స్పోజర్ పొందే యూనివర్శిటీ అని చెప్పుకొచ్చారు. ఎల్పీయూ భారతదేశంలోని అన్ని ఇతర విశ్వవిద్యాలయాలను అధిగమిస్తోంది. ముఖ్యంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్స్ ద్వారా ర్యాంక్ చేయబడిన కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎల్పీయూ 74వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ఘనత కూడా అగ్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు దక్కలేదని చెప్పింది. ఎల్పీయూ అకడమిక్స్‌పై విద్యార్థులు ఏం చెబుతున్నారో వినండి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022లో, LPU దేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాలలో (ప్రభుత్వం , ప్రైవేట్ రెండూ) 36వ స్థానంలో నిలిచింది. బిజినెస్ & ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో 2వ ర్యాంక్, క్లినికల్ & హెల్త్ సబ్జెక్ట్‌లో 8వ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లో 9, ఇంజినీరింగ్ మరియు లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో 10వ ర్యాంక్‌ను పొందింది. అలాగే 2022 ఎల్పీయూ అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. bit.ly/3O4HouU (అడ్వర్టోరియల్) -
ఈ పండగ సమయంలో వారిని గుండెలకు హత్తుకోవాలి!
ఒక తల్లి కొడుకును వెంటబెట్టుకుని చేతిలో దీపావళి కానుకతో కారులో బయలుదేరుతుంది. ‘ఎక్కడికమ్మా?’ అని కొడుకు అడిగితే ‘నువ్వే చూస్తావుగా’ అంటుంది. ‘మన ఆత్మీయ కుటుంబాన్ని కలవబోతున్నాం’ అంటుంది. కోవిడ్ సమయంలో ఆ కొడుక్కు సీరియస్ అయితే ముక్కూ మొహం తెలియని పెద్దమనిషి బెడ్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ పెద్దమనిషి కుటుంబానికి కానుక ఇవ్వడానికే ఆ తల్లి బయలుదేరుతుంది. ‘అమేజాన్’ చేసిన ఈ యాడ్ భారీ ఆదరణ పొందుతోంది. కోవిడ్ కాలంలో ప్రాణాలు నిలబెట్టిన ఆపద్బాంధవులకు ఈ దీపావళి సమయాన థ్యాంక్స్ చెప్పాల్సిన సంస్కారాన్ని గుర్తు చేస్తోంది. ఈ సంవత్సరమంతా మనం నిజమైన మనుషుల్ని చూశాం. ఆపద్బాంధవులను చూశాం. సమయానికి మనిషిలా వచ్చిన దేవుళ్లను చూశాం. వాళ్లు లేకపోతే ఇవాళ మనకు ఈ దీపావళి లేదు. నిజం. వారంతా మన ప్రాణదాతలు. కోవిడ్ సమయంలో ఏదో మేరకు సాయపడిన కొత్త బంధువులు. వారూ ఇప్పుడు మనకు ఆత్మీయమైన కుటుంబమే. ఆ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పాల్సిన సమయం ఇదని ‘అమేజాన్’ తన యాడ్ ద్వారా చెప్పింది. ఆలోచించి చూడండి... ఎందరు అలాంటి వాళ్లుంటారో. అన్నం పెట్టినవారు కోవిడ్ సమయంలో చాలామంది హోమ్ క్వారంటైన్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. వారిలో చాలామందికి భోజనం వండుకునే వీలు లేకపోయింది. అలాంటి సమయంలో ప్రతి ఊళ్లో ఎందరో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితులు ఉన్నాం అని ఇంటి నుంచి కాల్ చేస్తే భోజనం తెచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్లారు. మరికొన్ని చోట్ల రిస్క్ ఉన్నా ఇరుగిల్లు పొరుగిల్లు వారే ఆకలి తీర్చారు. నిజంగా వారే లేకపోతే ఆ 14 రోజులు ఎలా గడిచేవి? ఈ దీపావళి రోజు వారిని పలకరించాలి కదా. ఒక మిఠాయి డబ్బా ఇచ్చి నమస్కారం తెలుపుకోవాలి కదా. వారు ఇచ్చిన ఆక్సిజన్ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కోసం బాధితులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. మన దగ్గర డబ్బు ఉన్నా సమయానికి ఆక్సిజన్ ఆచూకీ తెలిసేది కాదు. అలాంటి సమయంలో ఫేస్బుక్ పోస్ట్ పెడితేనో, ట్విటర్లో అప్పీల్ చేస్తేనో ఏ మాత్రం పరిచయం లేని ఎందరో ఫలానా చోట ఆక్సిజన్ ఉంది... మా దగ్గర ఎక్స్ట్రా ఉంది అని ఆచూకి తెలియ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఎందరో దాతలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దానం చేసి గొప్ప సహాయం చేశారు. వాళ్లెవరో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. వారి సహాయానికి ఈ దీపావళికి కనీసం మెసేజ్ పెట్టడం అవసరం. వైద్యుడే నారాయణుడు వచ్చింది ప్రాణాంతక వ్యాధి. వైద్యం చేయక తప్పదు. చేస్తే అది సంక్రమించే అవకాశం ఎక్కువ. కాని వేలాది మంది వైద్యులు కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణం పోశారు. రేయింబవళ్లు శ్రమించారు. నర్సులు, అటెండర్లు... వీరంతా హాస్పిటల్లో ఉన్న సమయంలో బాగా గుర్తే. డిశ్చార్జ్ అయ్యే సమయంలో వారికి పెట్టిన నమస్కారం చాలదు. ఈ పండగ సమయంలో వారికి కృతజ్ఞతలు ప్రకటించాలి. చిరు కానుకతోనైనా సత్కరించాలి. ఆఖరు మజిలి కోవిడ్ కాలంలో ఆప్తుల్ని కోల్పోయారు కొందరు. కాని ఆ ఆప్తులకు అంతిమ సంస్కారాలు జరిపే శక్తి, ధైర్యం, వీలు వారికి లేవు. భారతదేశంలో అంతిమ సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి పనికి ఎందరో యువతీ యువకులు రంగంలో దిగి సేవ చేశారు. తమకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మానవులుగా అవతరించారు. ఆత్మీయులను కోల్పోయిన విషాదం ఇంకా వదిలి ఉండకపోవచ్చు. ఈ దీపావళి వారిని మరింత గుర్తు చేయవచ్చు. కాని వారి సగౌరవ వీడ్కోలుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పండగ సమయంలో గుండెలకు హత్తుకోవాలి. ఎందరో అన్సంగ్ హీరోలను ఇచ్చిన కాలం ఇది. ఆ నాయికా నాయకులు లేకపోతే ఈ కాలాన్ని గెలిచేవాళ్లం కాదు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేయాలి. Some people are #specialfamily and this year don't forget to #deliverthelove to them yourself. Here's a heartwarming story from us! Tell us about your #SpecialFamily in the comments section. pic.twitter.com/ZfOExx64p3 — Amazon India (@amazonIN) October 28, 2021 -
మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్టైజింగ్ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్‌ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్ఐకాన్గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాయల్ బెంగాల్ ఇంటిమేట్ ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో యాడ్ క్యాంపెయిన్ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్ షూట్ నిర్వహించారు. హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్‌ని ఉపయోగిస్తూ ఈ షూట్‌ని పూర్తి చేశారు. అనంతరం క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్ చేశారు. ఇందులో రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి. No! This is no lingerie or C0nd0m Ad. This is Sabyasachi Mangalsutra Ad. Ultra Woke #Sabyasachi are so creatively bankrupt that they have to use semi naked models for a Mangalsutra ad.#BoycottSabyasachi #Femina pic.twitter.com/dim9YpJhgF — श्रद्धा | Shraddha 🇮🇳 (@immortalsoulin) October 27, 2021 How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ? Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc. ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी. Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX — Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021 Friend : How does a plump woman standing with an ill fitting bra, with a Jaguar on a sling convey "WHAT WOMAN WANTS"???? Me : IT'S HER CHOICE!! You've no right to make fun of her .What if she doesn't wear any????#Sabyasachi pic.twitter.com/ne74DKuDwC — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) October 29, 2021 ఇదేమైనా లింగరీనా ? బుధవారం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్ యాడ్ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది - ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది - మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి - జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను - జ్యూయల్లరీ రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు - ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్ అనే క్యాప్షన్ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి. - సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ? మంగళసూత్ర అంటే ఇది మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్ , ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. Mangalsutra looks like this #Sabyasachi It's not a random piece of fashion jewellery, it indicates the love and commitment the husband and wife have towards each other. pic.twitter.com/HB3r4Aa4A4 — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 27, 2021 #Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden. It's Long for whole world to see. It's PIOUS It's PRIDE It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp — 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021 -
అసలు ఇతను కపిల్ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..!
Kapil Dev Channels Ranveer Singh In Hilarious Advertisement: క్రికెట్ దిగ్గజం, భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన యోధుడు, లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వెక్కిలి చేష్టలు చేస్తూ, రంగురంగుల దుస్తుల్లో.. భిన్నంగా కనిపించాడు. ఇదంతా చేసింది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' ప్రకటన కోసం కపిల్ ఇలా నటించాడు. ఈ యాడ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరిస్తూ.. కపిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. Heads, I'm fashionable. Tails, I'm still fashionable. pic.twitter.com/vyKIrmLLOD — Kapil Dev (@therealkapildev) October 15, 2021 క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించి, ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేస్తూ.. సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన సహజత్వానికి భిన్నంగా కపిల్ ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వంటి ప్రముఖులు గతంలో ఈ యాడ్‌లో సందడి చేశారు. ఇదిలా ఉంటే, కపిల్ దేవ్ టీమిండియాకు 1983 వన్డే ప్రపంచకప్‌ను అందించిన వైనాన్ని ఆధారంగా చేసుకుని.. రణ్వీర్ సింగ్ హీరోగా 83 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్వీర్ ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు రివర్స్‌గా కపిల్ కూడా రణ్వీర్ను అనుకరించేందుకు ఈ యాడ్‌లో నటించినట్లు సమాచారం. ఈ వీడియోను కపిల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఎంతో ఫ్యాషన్‌గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్‌గా ఉన్నాను' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. చదవండి: రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం.. -
షారుక్ బ్రాండ్ ఇమేజ్‌కి భారీ షాక్
ముంబై: ఐపీఓ బౌండ్ టెక్ దిగ్గజం బైజూస్ సంస్థ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కి సంబంధించిన ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరోసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") అంతేకాదు ఆ అడ్వర్టైస్మెంట్లో స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలో ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు ఏవిధంగా చదువులో సాయం చేయాలి వంటివి వివరించే ప్రకటనలు కావడం విశేషం. ఒక బాధ్యత గల తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోవడం ఏమిటో అంటూ విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఎడ్టెక్ దిగ్గజం బైజు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పై వివరణ ఇవ్వడానికీ కూడా బైజు సంస్థ నిరాకరించింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్లు ఆర్యన్ చిన్నపిల్లవాడు అతనికి బైలు ఇవ్వాల్సిందే అంటూ ... షారుక్ మద్దతు ఇస్తున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల వ్యవహారం మాత్రం షారుక్ సినీ కెరియర్‌కి పెద్ద ఎదురు దెబ్బ. రాజకీయ నాయకులు ఒక్కసారిగా వారి పదవీ ఊడిపోతే వారికి అప్పటివరకు జరుగుతున్న రాజమర్యాదలన్ని ఏవిధంగా కనుమరుగైపోతాయో అలా ఈ సినీ స్టార్ల పరిస్థితి కూడా ఇంతేలా ఉంది. ఒక్క అనూహ్యమైన సంఘటనతో వాళ్ల స్టార్డమ్ కూడా ఏ మాత్రం పనిచేయదు అంటే అతిశయోక్తి కాదేమో. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
కన్యాదానం వద్దన్న అలియా, ఒంటికాలిపై లేచిన కంగనా
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన యాడ్ మీద ఒంటికాలిపై లేచింది కంగనా రనౌత్. హిందూ వివాహాల్లో ప్రధాన ఆచారమైన కన్యాదానాన్ని కన్యామాన్‌గా మార్చుదాం అని పిలుపునివ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో... 'దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడి తండ్రి.. చింతించకండి, నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడిని దేశ రక్షణ కోసం దానం చేస్తాను, అది కన్యాదానం అయినా 'పుత్రదానం' అయినా సరే! అంటూ గొప్పగా మాట్లాడే మాటలను మనం తరచూ టీవీలో చూస్తూనే ఉన్నాం. పరిత్యాగం, దానం అనేది గొప్ప విషయం. కానీ ఎప్పుడైతే ఈ దానాన్ని సమాజం చిన్నచూపు చూస్తుందో అప్పుడు రామరాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని గుర్తించాలి. హిందువులను, హిందూ ఆచారాలను కించపరచడం ఇకనైనా ఆపండి. గ్రంథాల్లో భూదేవి, స్త్రీ ఇద్దరినీ దైవంగానే పూజిస్తారు. వారిని శక్తికి మూలంగా చూడటంలో తప్పు లేదు' అని రాసుకొచ్చింది. కన్యాదానం అనే పదాన్ని మార్చేసిన వాణిజ్య కంపెనీ మాన్యవర్ మీద కూడా మండిపడింది కంగనా. 'కులమతాలను, రాజకీయాలను అడ్డుపెట్టుకుని వస్తువులను అమ్మాలన్న ప్రయత్నాలను మానుకోవాలని అన్ని బ్రాండ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. అమాయకపు వినియోగదారులను మీ తెలివైన ప్రకటనలతో మానిప్యులేట్ చేయడం ఆపేయండి' అని హెచ్చరించింది. ఇక సదరు యాడ్‌లో అలియా భట్... ఫ్యామిలీ తనను ఎంతగానో ప్రేమించిందని చెప్తూనే 'నేనేమైనా వస్తువునా దానం చేయడానికి! కన్యాదానమే ఎందుకు?' అని ప్రశ్నిస్తూ ఇప్పటినుంచి దీన్ని కన్యామాన్(గౌరవంతో పంపించడం)గా మార్చుదాం.. అని చెప్పుకొచ్చింది. దర్శకుడు అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ రిలీజైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) -
1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..
క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్లు అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లలు వరకు ఇష్టపడని వారు ఉండరు. అలాగే ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్మెంట్ ఎంతగా ప్రజల దృష్టిని ఆకర్షించిందో అందరికి తెలిసిందే. 1990లలో తీసిన అడ్వర్టైస్మెంట్ ఇప్పుడు వస్తున్న అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ట్విట్టర్లో ప్రశంసిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే.... (చదవండి: వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’) క్రికెట్ తమ ఆరాధ్య క్రీడగా భావించే మన దేశంలో 1990లో వచ్చిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్ మెంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సమయంలో కేవలం పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. ఈ క్రమంలో కాలనుగుణంగా క్యాడ్బరీ ప్రకటన రూపకర్త ఓగిల్వి మంచి అడ్వర్టైస్మెంట్ రూపొందించారు. ఇందులో ఒక అమ్మాయి పూల డ్రస్ వేసుకుని క్యాడ్బరీ చాకొలెట్ తింటూ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో నృత్యం చేసుకుంటూ సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలోకి వచ్చేస్తుంది. పైగా దీనికి "అస్లీ స్వాద్ జిందగీ కా" (జీవితంతో నిజమైన రుచి) ట్యాగ్‌లైన్ జోడించడంతో ప్రజల దృష్టి క్రికెట్ నుంచి మరల్చకుండా చాలా బాగా ప్రజలకు చేరువైంది. అప్పటి వరకు పిల్లలకు మాత్రమే చాకొలెట్లు అనే దానిని చెరిపేసినట్లుగా చాలా బాగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ప్రకటనను రూపొందించారు. తదనంతరం ప్రస్తుతం మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో చిన్న చిన్న మార్పులతో అదే అడ్వర్టైస్మెంట్ రూపొందించింది. అప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌కోసం నృత్యం చేస్తే ఇప్పుడు అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ నృత్యం చేసినట్లు రూపొందించారు. ఇది కూడా ప్రేక్షకులకు చేరువైంది గానీ కొత్తదనం కోరుకుంటున్నామంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరికొంతమంది లింగఅసమానతకు తావు లేకుండా కాలానుగుణంగా రూపొందిస్తున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. Oh wow!! Take a bow, Cadbury Dairy Milk and Ogilvy :) A simple, obvious twist that was long overdue, and staring right at all of us all this while! pic.twitter.com/Urq8NXtg7W — Karthik 🇮🇳 (@beastoftraal) September 17, 2021 (చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు) -
గుండెల్ని పిండేసే ‘అమెజాన్’ వీడియో
సృష్టిలో మరో అందమైన బంధం అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధం. వారి అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రాఖీ పండుగ. రాఖీ పండుగ సందర్భంగా వివిధ ఆఫర్లు ఇచ్చినా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఓ సరికొత్త వాణిజ్య ప్రకటన (అడ్వరైటజ్మెంట్)ను కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన చూసిన వారందరికీ కళ్ల వెంట నీరొస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో అక్కాతమ్ముడు బంధాన్ని బలోపేతం చేసేలా ఉంది. ఈ వీడియో ప్రజల హృదయాల్ని పిండేస్తోంది. ఆ వాణిజ్య ప్రకటన రాఖీ పండుగ నాడు సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని కళ్లకు కట్టేలా ఉంది. (చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) యాడ్‌లో ఏముందంటే..? తమ్ముడికి రాఖీ కట్టగానే అక్క ‘కాళ్లు మొక్కు’ అని చెప్పగా తమ్ముడు కాళ్లకు నమస్కరిస్తుండగా అక్క వీపుపై సరదాగా మూడుసార్లు కొడుతుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఇంకో దెబ్బ వేయి అని చెప్పగా ‘ఏందీ ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ’ అంటూ తమ్ముడు పైకి లేస్తాడు. ‘ఇదిగో నేను తయారు చేసిన షీర్ ఖుర్మా తిను’ అని గిన్నె ఇస్తుండగా ‘నిజమా!’ అని సందేహం వ్యక్తం చేస్తూ సోదరుడు తింటాడు. ‘చాలా బాగుంది’ అంటూ తింటూ తన అక్క ‘ఒక్క చెంచా ఇవ్వు’ అని అడిగినా ఇవ్వలేదు. ‘నీకోసం పొద్దటి నుంచి ఉపవాసం ఉన్నా’ అని చెప్పినా ఇవ్వకపోవడంతో ‘నువ్వు ఇవ్వకున్నా పర్లేదు నేను తీసుకుంటా’ అని అక్క పెద్ద గిన్నె తీసుకోబోతుండగా అడ్డుకుంటాడు. ‘ఈ మొత్తం నేనే తింటా.. నేనెవరికి ఇవ్వను’ అంటూ తమ్ముడు పెద్ద గిన్నె మొత్తం తీసుకోగా ‘నాక్కొంచెం’ అంటూ వెంటపడుతుంది. సరదాగా గొడవ పడుతుండగా తల్లి వంట గది నుంచి పిలుస్తుంది. వచ్చేంత వరకు మొత్తం తిన్నావో నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తూ వంటగదిలోకి వెళ్లింది. తల్లి ఉప్పు ఎక్కడ అని అడగ్గా ఆ పక్కనే ఉందని డబ్బా చూపించగా ‘ఎక్కడ లేదు. అయిపోయింది’ అని తల్లి చెబుతుంది. లేదమ్మా అక్కడే ఉండాలి’ అని డబ్బా తీసుకుని చూడగా చక్కెర, ఉప్పు డబ్బా ఒకటే తీరున ఉన్నాయి. చక్కెర అనుకుని పొరపాటున ఉప్పు వేసినట్లు గ్రహించి వెంటనే బయటకు రాగా తమ్ముడు ఇంట్లో పాయసం ఎవరికీ ఇవ్వకుండా ఆటపటిస్తుంటాడు. వెంటనే చేతిలోని గిన్నెలాగి రుచి చూడగా ఉప్పుతో కూడిన పాయసం ఉండడంతో తినలేకపోయింది. తాను తప్పు చేసినా సోదరుడు కప్పిపెట్టేసి ‘బాగుంది’ అని చెప్పడంతోపాటు అది తమను తినకుండా చేసిన సోదరుడి మనసును గుర్తించింది. వెంటనే ఆమె హత్తుకుంటుంది. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు అతడి భుజంపై కన్నీళ్లు రాలుస్తుండగా ‘అక్క ఏడవద్దు. ఇగో నీకో గిఫ్ట్ తెచ్చా. చూడు’ అని చెప్పగా ‘నువ్వు ఆల్రెడీ ఇచ్చేశావ్’ అంటూ ప్రకటన ముగుస్తుంది. అక్క తప్పు చేసినా తమ్ముడు కప్పిపుచ్చి ఉంచడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నిజ జీవితానికి దగ్గరగా ఈ ప్రకటన ఉండడంతో రాఖీ పండుగ రోజు ఈ వీడియో కొంత భావోద్వేగాన్ని రగిల్చింది. సోదరసోదరీమణుల మధ్య అనుబంధం ఎలాంటిదో రెండు నిమిషాల్లో అద్భుతంగా చెప్పారు. చివరగా ‘కొన్నిసార్లు బహుమతులు డబ్బాల్లో రావు’ అని చెబుతూనే ‘ఈ రాఖీ పండుగ ప్రేమను పంచండి’ అంటూ అమెజాన్ పేర్కొంది. -
వివాదంలో యాడ్ షూటింగ్! అసలు నిజమేంటంటే..
Emirates Airlines Viral Ad Video: ఫ్లై బెటర్ అంటూ ఎమిరేట్స్ రూపొందించిన తాజా అడ్వర్టైజ్మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది. అత్యంత ఎత్తులో దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఇటీవల కొత్త యాడ్‌ని రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్ హోస్టెస్ నిల్చుని... ఎమిరేట్స్ విమానాల్లో దుబాయ్ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్ అవుట్ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్ హోస్టెస్ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు. Reconnect with your loved ones or take a fabulous vacation. From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo — Emirates Airline (@emirates) August 5, 2021 ఇది నిజం కాదు ఎమిరేట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ని ఆగష్టు 5న విడుదల చేసింది. చూసినవారంతా యాడ్ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. మరికొందరు అంత ఎత్తులో ఎయిర్ హోస్టెస్‌తో షూట్ చేయడం దారుణమని, ఏదైనా జరిగితే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్ విడుదల చేసింది. షూటింగ్ ఇలా ఈ యాడ్ చిత్రీకరించేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది ఎమిరేట్స్. నెలల తరబడి రిహార్సల్ నిర్వహించింది. ముఖ్యంగా ఈ యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్ లుడ్విక్కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్ షూట్ చేశామంటూ ఎమిరేట్స్ వీడియో రిలీజ్ చేసింది. అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్ లుడ్విక్ తెలిపింది. Real or fake? A lot of you have asked this question and we’re here to answer it. Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe — Emirates Airline (@emirates) August 9, 2021 -
పిల్లిని తెచ్చిస్తే.. రూ.30 వేలిస్తా
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఓ జంతు ప్రేమికురాలు కలత చెందారు. ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో పిల్లి ఫొటోతో రోడ్డుపై కరపత్రాలు సైతం పంచారు. అయినప్పటికీ పిల్లి ఆచూకీ దొరకకపోవడంతో ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి జాడ తెలిపిన వారికి నగదు రివార్డు సైతం ప్రకటించారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా 8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి జింజర్ అని పేరు కూడా పెట్టారు. జింజర్‌కు జూబ్లీహిల్స్‌లోని ట్రస్టీ పెట్ క్లినిక్‌లో జూన్ 17న కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించారు. అనంతరం వాపు రావడంతో తిరిగి జూన్ 23న అక్కడికే తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్లినిక్ నుంచి పిల్లి అదృశ్యమైంది. జూన్ 27న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో పిల్లి ఫొటోతో కరపత్రాలు కూడా పంచారు. 20 రోజులుగా తన పిల్లి జాడ దొరకడం లేదని, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని జరీనా వాపోయారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జరీనా, జింజర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేల రివార్డు ఇస్తానని, తను ప్రాణంగా పెంచుకుంటున్న జింజర్‌ను తెచ్చివ్వాలని కోరారు. -
KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతూ ఉంది. వీరిరువురు పబ్‌లు, పార్టీలు, డిన్నర్ డేట్లు అంటూ చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే కలియ తిరిగినా.. తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు, అలాగని ఖండించనూ లేదు. కాగా, రాహుల్, అతియాల ప్రేమాయణం వార్తలకు మరింత బలం చేకూర్చేలా తాజాగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరూ కలిసి తొలిసారి ఓ యాడ్‌లో నటించారు. View this post on Instagram A post shared by NUMI Paris (@numiparis) అందులో వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఇక పెళ్లే తరువాయని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. 'నుమి ప్యారిస్' అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ నటించారు. ఈ యాడ్‌లో ఇరువురు అద్భుతంగా హావభావాలు పలికించారని, సరికొత్త అవతారంలో మతి పోగొట్టారని అతియా తండ్రి సునీల్ శెట్టి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశంసించాడు. దీంతో వీరి పెళ్లికి లైన్‌క్లియర్ అయ్యిందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలపై వారు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ బాటలోనే రాహుల్-అతియా నడుస్తున్నాడని, ఇక పెళ్లి చేసుకోవడమే ఆలసమ్యని కామెంట్లు చేస్తున్నారు. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే ఓ యాడ్‌లో నటించాక ఒక్కటయ్యారు. కాగా, రాహుల్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ నిమిత్తం టీమిండియా ప్రకటించిన 15 మంది సభ్యుల బృందంలో అతనికి చోటు దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగినా.. జట్టు యాజమాన్యం అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. బహుశా ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో అతనికి అవకాశాలు లభించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నా జీవితంలో పెళ్లి తర్వాత చాలా మార్పులొచ్చాయి: బుమ్రా -
యూట్యూబ్ టాప్‌లో ఇక అవి కనిపించవు
న్యూఢిల్లీ: ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 14న యూట్యూబ్ మస్ట్‌హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్ చేసింది. గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్ టాప్, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్ ద్వారా గూగుల్‌కు భారీ ఆదాయం వస్తుంటుంది. అయితే ఇకపై ఆ ప్లేస్‌లో మాగ్జిమమ్ యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్లే ఉండాలని యూట్యూబ్ నిర్ణయించింది. ‘‘యూజర్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాల’’ని అనుకుంటున్నాం యూట్యూబ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వీటితో పాటు యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు సైతం యూట్యూబ్‌లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాదు యాడ్లకు సంబంధించిన వీడియోల(థంబ్‌నెయిల్స్) విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ‘‘అవి మానసికంగా యూజర్‌పై ప్రభావం చూపెడతాయి. కాబట్టి, అలాంటి యాడ్లను ప్రొత్సహించం’’ అని యూట్యూబ్ ప్రతినిథి ఒకరు వెల్లడించారు. చదవండి: యూట్యూబ్ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. నీలం రంగులోకి చిన్నారి శరీరం
అభిమన్యు బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ రోజు అతని శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతుండటంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించగా వారు చెప్పిన నిజం తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు. తీవ్రమైన టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్, పల్మనరీ స్టెనోసిస్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని వైద్యులు నిర్థారించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. సంవత్సరం క్రితమే అభిమన్యు మా జీవితాల్లోకి వచ్చాడు. అతని రాకతోనే ఎన్నో వెలుగులు తెచ్చాడు. ఆ బోసినవ్వులతో ఎంతో చక్కగా సాగిపోతున్న మా జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని ఎంత సంతోషించామో ఇప్పటికీ గుర్తు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. నా బిడ్డ కొన్ని రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణంగా అందరు పిల్లల్లో ఉండేదే అనుకున్నాం. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం, క్రమంగా శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో చాలా భయపడుతూనే హాస్పిటల్‌కి వెళ్లాం. అప్పుడు రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నా చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 10లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబ పోషణే జటిలమైపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. అభిమన్యుకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా అభిమన్యుకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
వైరల్: ‘మోదీజీ లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం’
న్యూఢిల్లీ: దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతాం.. అనుమతి ఇవ్వండి అంటూ పత్రికలో ఓ ప్రకటన వచ్చింది. ఓ కంపెనీ పేరిట వచ్చిన ప్రకటన వైరల్‌గా మారింది. ఏకంగా 37 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు ఏ రంగాల్లోనైనా పెడతామని ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లాండోమస్ లిమిటెడ్ కంపెనీ పేరిట భారత్‌లో 500 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 37 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఆ గ్రూప్ కంపెనీ చైర్మన్ ప్రదీప్‌కుమార్ ఎస్ పేరిట ప్రకటన విడుదలైంది. లాండోమస్ రియాలిటీ వెంచర్స్ కంపెనీ 2015 జూలై 17వ తేదీన బెంగళూరులో రిజిస్టర్ అయ్యింది. ఇది అమెరికాకు చెందిన సంస్థ. ఇంధనం, సామాజిక మౌలిక రంగం, ఉత్పాదన, రవాణా, ఆహార శుద్ధి, వ్యవసాయం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో తాము పెట్టేందుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రపంచ వాణిజ్య గమ్యస్థానంగా భారత్‌ను మార్చాలని భావిస్తున్నట్టు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత పెట్టుబడులు పెట్టే కంపెనీ నేరుగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోకుండా ప్రకటన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రకటన అని, అది నమ్మొద్దని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. -
పెళ్లయిన ఐదేళ్లకి మిథున్ పుట్టాడు..కానీ అంతలోనే..
పిల్లల కోసం ఎంతోకాలం ఆ దంపతులు ఎదురుచూశారు. ఆ బోసినవ్వులు తమ ఇంట్లో ఎప్పుడు వింటామా అని ఆశగా ఆ దేవుడిని వేడుకున్నారు. ఫలితంగా పెళ్లయిన ఐదేళ్లకు వారి కోరిక నెరవేరింది. అయితే ఆ అదృష్టం ఎంతోకాలం నిలవలేదు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం గుండె పగిలే నిజాన్ని వినాల్సి వచ్చింది. చిన్నారి మిథున్‌కి క్యాన్సర్ సోకిందని, వెంటనే వైద్యం అందించకపోతే చనిపోతాడని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను శివానంద్‌ను పెళ్లి చేసుకున్నాక అందరి ఆడపిల్లలానే పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ బోసినవ్వులు మా ఇంట్లో ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూశాను . కానీ దురదృష్టవశాత్తూ నేను అనుకున్నట్లు జరగలేదు. పిల్లల కోసం ఎన్నో దేవుళ్లకి ముడుపు కట్టాను, డాక్టర్లను సైతం సంప్రదించాను. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఇక ఏ దేవుడు కరుణించాడో కానీ నా నిరీక్షణకు తెరపడింది. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న నా కల నెరవేరింది. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసి ఎంతో మురిసిపోయాను. ఇక పుట్టబోయే బిడ్డ కోసం డబ్బు కూడా ఆదా చేయడం ప్రారంభించాను. పెళ్లయిన 5ఏళ్లకు తల్లి మాధుర్యం ఎలా ఉంటుందో అనుభవించాను. ఇక జీవితంలో అన్నీ వెలుగులే అనుకున్న సమయంలో ఊహించని ఉపద్రవం వచ్చింది. నా చిన్నారి మిథున్ పుట్టి ఓ ఏడాది గడిచాక అర్థమయ్యింది మా అనందాలకు అడ్డుపడిందని. బాబుకు శరీరం కింది భాగంలో వాపు ఉందని గమనించాను. అదే తగ్గిపోతుందులే అని కొన్ని రోజులు వేచిచూశాను. అయితే అది తగ్గకపోగా మరింత ఎక్కువైంది. నొప్పితో నా బిడ్డ అల్లాడిపోతుంటే ఎంతకైనా మంచిదని డాక్టర్ని సంప్రదించాం. అయితే నా బిడ్డకు క్యాన్సర్ సోకిందన్న నిజం తెలిసి గుండె పగిలిపోయింది. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 7-8లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. లాక్‌డాన్ కారణంగా నా భర్త శివానంద్ ఉద్యోగం పోయింది. ప్రస్తుతం నేనే ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మేం దాచుకున్న డబ్బులన్నీ మిధున్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా మిథున్‌కు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తోన్న యువ బృందం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో 250 మంది సభ్యులున్న ఓ యువ బృందం మిషన్-ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. అలా సేకరించిన డబ్బులతో దేశ వ్యాపంగా ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి అండగా నిలబడుతున్న 'మిషన్-ఆక్సిజన్' గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేం ఈ మిషన్‌ను ప్రారంభించేనాటికి 100 ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయాలనుకున్నాం. సోషల్ మీడియా ద్వారా వెంటనే దానికి నిధులు సేకరించాం. అయితే మేం ఊహించిన దాని కంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేం ఇది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కొన్నివేల వినతులు వచ్చాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ఇలా సామాజికి మాధ్యమాలను ఉపగయోగించుకొని ఫండింగ్ చేపట్టాం. దాదాపు 3900 సిలిండర్లను తక్షణ సాయం కింద చైనా నుంచి తెప్పిచ్చాం. ఇప్పటికే వివిధ ఆసుపత్రులకు వీటిని పంపిస్తున్నాం. మేం ప్రారంభించిన ఈ మిషన్ 100 శాతం లాభాపేక్షలేని, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఏప్రిల్ 29న ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ఇప్పటికే 15కోట్ల నిధులను సేకరించి వాటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు అందించగలిగాం. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు మా సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం డీజీ, బిఎస్ఎఫ్, మేజర్ జనరల్ (హెచ్‌క్యూ), ఇండియన్ ఆర్మీ, ఛైర్మన్ ఇఎస్ఐసి, డైరెక్టర్లు /మెడికల్ సూపరింటెండెంట్లు సహా వివిధ ప్రభుత్వ అధికారులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. నిజంగా అవసరం ఉన్న చోట ప్రభుత్వ అధికారులతోనూ అందుకు తగ్గ వాస్తవాలు తెలుసుకొని పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరికీ మా మిషన్ ద్వారా మీరు సహాయం చేయగలరా? మీరు అందించే చిన్న సహాయం అయినా ఎంతో మంది ప్రాణాలను నిలబెబుతుంది. గూగుల్ పే లేదా ఏదైనా డిజిటల్ చెల్లింపుల ద్వారా మీరు మాకు ఫండ్స్ పంపొచ్చు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా మా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు నేరుగా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇది పూర్తి పారదర్శకతతో, నిస్వార్థంగా చేస్తోన్న ఓ ఉద్యోమం. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ప్రాణ వాయువు కోసం అల్లాడిపోతున్న ప్రాణాలను మీ వంతు సహాయం చేసి రక్షించగలరా? మీరు ఇవ్వాలనుకునే ఫండింగ్‌ను డైరెక్ట్ క్యూఆర్ స్కాన్ ద్వారా మాకు పంపొచ్చు. -
శ్వేతను బతికించండి
సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది. తన కుమార్తె ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎ. శ్వేత అనే యువతి తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన కూతురి వైద్యానికి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చువవుతాయని, తమ వద్ద అంత డబ్బులేదని శ్వేత తండ్రి రమేశ్ తెలిపారు. దాతలు సహాయం చేస్తే తన కుమార్తె ఆరోగ్యం బాగవుతుందని ఆయన వేడుకుంటున్నారు. ఇంపాక్ట్‌గురు స్వచ్ఛంద సంస్ధ సహాయంతో దాతల నుంచి సాయం అర్ధిస్తున్నారు. కాలేయానికి రక్తం సరఫరా చేసే నాళాల్లో పెద్ద సమస్య ఏర్పడిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని శ్వేతకు వైద్యం అందిస్తున్న డాక్టర్ శివచరణ్ తెలిపారు. ఆపరేషన్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతామయని.. తమ వైద్యులంతా కలిసి కొంత మొత్తం సేకరించామని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు కూడా సహరిస్తున్నాయని చెప్పారు. శ్వేత సంపూర్ణ ఆరోగ్య కోసం సహాయం చేయలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు..
పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 10 ఏళ్ల తర్వాత సవిత-శ్రీనివాస్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు పుట్టడంతో వాళ్ల ఆనందం రెట్టింపయ్యియింది. బాబును చూడగానే పదేళ్లుగా పడుతున్న బాధ, వేదన మర్చిపోయారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బాబుకు 7 ఏళ్ల వయసున్నప్పుడే హేమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ వ్యాధి సోకిందని, వెంటనే అతనికి స్టెమ్ సెల్ మార్పిడితో పాటు కీమోథెరపీ ట్రీట్మెంట్ అందించాలని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. భరత్ మొదట్లో ఎప్పుడు నవ్వుతూ చాలా హుషారుగా ఉండేవాడు. కొన్నాళ్లకు వాడి ముఖంలో చిరునవ్వు అన్నదే లేదు. విపరీతమైన నొప్పితో బాధపడేవాడు. అలాంటి స్థితిలో బాబును చూడటానికి కూడా మాకు ధైర్యం చాలడం లేదు. బాబుకు వెంటనే చికిత్స అందించాలని, ఇందుకు 30 లక్షలు చెల్లించాలని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా భరత్‌ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ప్రసవం తర్వాత బిడ్డను అపురూపంగా హత్తుకొని లాలించాలని ఏ తల్లి మాత్రం అనుకోదు? కానీ ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఒక్కసారి కూడా ఎత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని మురిసిపోయే అదృష్టం లేకుండా పోయింది. చాలా తక్కువ బరువుతో కనీసం ఊపిరి కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహాయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను, నా భర్త అబ్దుల్ ఎన్నో ఆశలతో నా చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. చిన్నారి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. డెలీవరీ తర్వాత ఒక్కసారి కూడా నా బిడ్డను ఎత్తుకోలేదు. బిడ్డ పుట్టిన కొద్ది సేపటికే తనను ఎన్ఐసీయూ (NICU)కు తరలించారు. ఆ సమయానికి కనీసం నేను స్పృహలో కూడా లేను. ప్రసవం తర్వాత చిన్నారిని ఒక్కసారి కూడా ఎత్తుకొని మురిసిపోలేని దౌర్భాగ్యం వచ్చింది. 700 గ్రాముల బరువున్న నా బిడ్డ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. పాపం నా బిడ్డకు ఆ నొప్పి భరించలేక పడుతున్న వేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు, ఇందుకోసం దాదాపు 4.5 లక్షలు అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా చిన్నారిని కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
మూడేళ్ల చిన్నారికి క్యాన్సర్.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ఇనియా బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 3ఏళ్ల చిన్నారి హాస్పిటల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం ఇనియా ఆరోగ్యం చాలా సంక్షిష్టంగా ఉందని, ఆమె అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతుందని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. 'ఇనియా మొదట్లో చాలా హుషారుగా ఉండేది. కొన్నాళ్లకు తను చాలా నీరసంగా, బలహీనంగా మారిపోయింది. ఏమీ తినేది కాదు. ఒకవేళ బలవంతంగా పెట్టినా వెంటనే వాంతి చేసుకునేది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. మొదట్లో అందరి పిల్లల్లాన్నే మారాం చేస్తుందని భావించాం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించగా రక్త క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధితో చిన్నారి బాధపడుతుందని చెప్పారు. ఇనియా వెంటనే చికిత్స చేయాలని,అందుకు 14 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇనియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. తీవ్ర జ్వరం, భరించలేని నొప్పితో ఇనియా బాధపడుటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటికే తనకి జుట్టు బాగా రాలుతోంది. వెంటనే చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. నా భర్త కుమార్ ఓ చిన్న దుకాణంలో పనిచేసేవాడు. ఇనియా ఆరోగ్యం దృష్ట్యా ఉద్యోగాన్ని వదిలేసి ఆమెను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పటికే చిన్నారి హాస్పిటల్ ఖర్చుల కోసం మేం దాచుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా ఇనియాకు ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా చిన్నారిని కాపాడగలవు. దయచేసి మా ఇనియాని కాపాడండి'. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
అది ఎంతటి నరకమో మాటల్లో చెప్పలేను (స్పాన్సర్డ్)
అందరు అమ్మాయిల్లానే ప్రియాంక కూడా పిల్లలపై ఎన్నో ఆశలు పెంచుకుంది. తాను మొదటిసారి గర్భవతి అని తెలియగానే ఎంతో సంతోషించింది. తనకు పుట్టబోయే చిన్నారితో తన జీవితం మరింత అందంగా మారబోతుందని ఊహించుకుంది. కానీ విధి మరొకటి తలచింది. నెలలు నిండకుండానే ఆ శిశువు ప్రపంచాన్ని చూడాల్సి వచ్చింది. కేవలం 674 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారి ఇంక్యుబేటర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం శిశువు ఊపిరితిత్తులు, కాలేయం సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిసారి తల్లిదండ్రులు అయితే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ మా బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి లేదు. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి పాపను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. చర్మం పసుపు రంగులోకి మారి కళ్లు ఎప్పుడూ ఎర్రగానే ఉంటున్నాయి. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో చిన్నారిని నియోనాటర్ ఐసీయూ(NICU)లో దాదాపు రెండు నెలల పాటు ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం పది లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. నా బంగారు ఆభరణాలన్నింటిని తాకట్టు పెట్టాము. ఆ డబ్బు అంతా స్కానింగ్‌లు, చెకప్‌ల కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. ప్రియాంకకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా పాపను కాపాడగలదు’. దయచేసి మా చిన్నారి ప్రియాంకను కాపాడండి తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) -
యూఎస్ఏ, టాప్సైట్లతో వీఎస్‌బీ, ఆల్ఫాబీటాల ఒప్పందం
విఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ (వీఎస్‌బీ), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మరియు TOPXIGHT రీసెర్చ్ ల్యాబ్‌లతో అవగాహన ఒప్పందం (ఎంఒయూ) సంతకం కార్యక్రమం 2021 మార్చి 3న వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలోని విఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో వర్చువల్ విధానంలో జరిగింది. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మరియు TOPXIGHT రీసెర్చ్ ల్యాబ్‌లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటా రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు చెందిన ఆల్ఫాబెటా అనేక బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలకు ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుందని అన్నారు. ఫిన్‌టెక్ ద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిజినెస్ మోడల్స్, ఫైనాన్షియల్ మోడళ్లను మార్పు చెందుతాయని చెప్పారు. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన నిపుణుల కోసం భారీ డిమాండ్ ఉన్న ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతోంది. విఐటి-ఎపి విశ్వవిద్యాలయం ఫిన్టెక్లో స్పెషలైజేషన్‌తో బిబిఎ ప్రోగ్రాం ద్వారా ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఆల్ఫాబెటా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి నూతన టెక్నాలజీ ఉపయోగించుకొని నిజ జీవిత నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. "ఫిన్‌టెక్ ప్రాక్టీస్ 1, 2" అనే రెండు కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి సర్టిఫికెట్ లభిస్తుంది. కోర్సు ముగిసేనాటికి, విద్యార్థులు సమకాలీన సమస్యలపై పరిశోధన చేయగలరు, కొత్త వ్యాపార/ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేయగలరు మరియు పేటెంట్లను సంపాదించగలరు. బీబీఏ ఫిన్‌టెక్ పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చెయిన్ ఎక్స్పర్ట్, బ్లాక్‌చెయిన్ యాప్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్ - ఫైనాన్స్, బిజినెస్ అనలిస్ట్, ప్రాసెస్ అనలిస్ట్, కంప్లైయెన్స్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాల్లో బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి ప్రవేశించవచ్చు. ఫిన్‌టెక్ అర్హత ఉన్న రంగాలు - పర్సనల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, లెండింగ్, బిల్లింగ్ / చెల్లింపులు, రెగ్‌టెక్, బ్లాక్‌చెయిన్ / లెడ్జర్, క్రిప్టోగ్రఫీ. ఫిన్‌టెక్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, నేడు అమెజాన్ ఆన్లైన్ పుస్తక విక్రేత కంటే చాలా ఎక్కువ సేవలను , పేటీఎం మొబైల్ వాలెట్ కంటే చాలా ఎక్కువ సేవలను అందిస్తుంది. ఫిన్‌టెక్ నిపుణులు భవిష్యత్ లో దిశ నిర్దేశకులుగా ఎదుగుతారని అభిప్రాయ పడ్డారు. వీఐటీ-ఏ.పి స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డా. జయవేలు మాట్లాడుతూ వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఫిన్‌టెక్ ప్రత్యేకతలతో కోర్సులను అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కూడా అవగాహనా ఒప్పందాలను కలిగి ఉన్నామని తెలిపారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం, డియర్బోర్న్ మరియు అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఇక్కడ విద్యార్థులు భారతదేశంలో రెండు సంవత్సరాలు మరియు యుఎస్ఎలో రెండు సంవత్సరాలు చదువుకోవచ్చు మరియు యుఎస్ఎ నుండి డిగ్రీ పొందవచ్చు. బికామ్ (ఫైనాన్స్), విద్యార్థులు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టాక్సేషన్ వంటి వివిధ రంగాలలో నైపుణ్యం పొందగలుగుతారు. మా లోతైన విద్య మరియు విద్యా పాఠ్యాంశాలు విద్యార్థులకు వాణిజ్యంలో విస్తృత జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందిస్తాయి. మరియు బ్యాంకింగ్. విద్యార్థులు బికామ్ (ఫైనాన్స్) చదివితే సిఎ, సిఎస్, సిఎంఎ లేదా సిఎఫ్ఎలో చాలా తేలికగా ఉత్తీర్ణత సాధించగలరని తెలిపారు. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యు.ఎస్.ఏ సహా వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శివ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఆల్ఫాబెటా ప్లాట్‌ఫాం ఫిన్‌టెక్ రంగంలో వృద్ధి వ్యయం లేదా కార్మిక మధ్యవర్తిత్వం ద్వారానే కాకుండా, కృత్రిమ మేదస్సు, బ్లాక్‌చెయిన్, 5జీ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆవిష్కరణల చేయటానికి కూడా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సత్యనారాయణన్ పళనియప్పన్ మాట్లాడుతూ ఫిన్‌టెక్ భారతదేశానికి పెద్ద ఆర్థిక వృద్ధి అందించే ఇంజిన్‌గా నిలుస్తుందని ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ కంపెనీలు రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో ఫిన్టెక్లో పెట్టుబడులను పెంచాలని యోచుస్తున్నాయని చెన్నై మరియు వైజాగ్‌లోని హబ్‌లతో, ఇప్పటికే ఫిన్ టెక్ రంగంలో ఆవిష్కరణలకు బహుమతులు ఇస్తున్నారని తెలియజేశారు. ఈ అవగాహనా ఒప్పంద వేడుకలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. సిఎల్వీ శివకుమార్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. -
మా అర్హన్‌ను కాపాడండి (స్పాన్సర్డ్)
చిన్నారి బోసినవ్వులతో వెలుగుతున్న ఆ ఇంట ఇప్పుడు అంతులేని విషాదం నెలకొంది. నెలల వయసున్న చిన్నారి అర్హన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత సంక్లిష్ట దశలో ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది.ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నా బిడ్డను రక్షించుకోగలనా? సమయానికి డబ్బు అందకపోతే నా అర్హన్‌ను ఎత్తుకోవడం ఇదే చివరిసారి కానుందా? హాస్పిటల్ కారిడార్‌లో ఇవే ప్రశ్నలు నన్ను వేధించాయి. మా కొడుకు అర్హన్ పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పగానే కుప్పకూలిపోయాం. అర్హన్‌కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాలని, ఇందుకు దాదాపు 5.5- 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా అర్హన్‌ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81685914నెంబర్‌ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి -
రూ.99కే ‘కాల్కస్ ఇండియా’ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్
ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయాలంటే విడిగా అనేకరకాల సీడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ ఎంట్రెన్స్ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్న పత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాప్‌లో మొత్తం 1324 విభాగాల్లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచామని ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు. 1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లు కాల్కస్ ఇండియా యాప్‌లో అన్ని రకాల పోటీ పరీక్షలను పొందుపరిచారు. ఇందులో సీబీఎస్సీ, ఐసీఎస్సీ, కేవీపీవై,ఎన్సీఓ,ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, రైల్వే, పోలీసు, డిఫెన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, ప్రభుత్వ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టెట్, స్కిల్స్, ఎపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సివిల్స్ ఎంట్రెన్స్ వంటి మరిన్ని1324 రకాల పోటీ పరీక్షలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాసకురాలు వాణి కుమారి తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ల ఆధారంగా పొందుపరిచారు. ఏడాదికి రూ.99 ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదవుతున్నా కేవలం రూ.99తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అన్ని రకాల పశ్న పత్రాలను కొనుక్కోవాలి. కానీ, ఈ యాప్‌లో ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. యాప్ విడుదల సందర్భంగా పరిమిత టెస్ట్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఉచిత ప్రాకీస్టు చేసి ఇంకా కావాలనుకుంటే రూ. 99తో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అందరికీ విద్య- అందుబాటు ధరలో! ‘‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’’ అనే లక్ష్యంతో రూ.99కే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ‘calcusindia’అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించండి లేదా 9133607607కి ఫోన్ చేయవచ్చు. -
మరో ఆరు వారాల పాటు ఐసీయూలోనే చిన్నారి
పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 11 ఏళ్ల తర్వాత జయలక్ష్మీ-ప్రకాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న అనుభూతి కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. వారు తమ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి ఎదురైంది. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో పుట్టగానే ఇంక్యుబేటర్‌కే పరిమితం అయ్యాడు. దీనికి తోడు శ్వాససంబంధిత సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఏడవనెలలో ఉండగానే ఆరోగ్యం క్షీణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు అత్యవసరంగా డెలివరీ చేయాల్సి వచ్చింది. అప్పటికీ బిడ్డ బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే. ప్రీమెచ్యూరిటీతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు అప్పుడే నిర్ధారణ అయింది. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి బాబు చిన్న పెట్టెలో ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. అతని శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూనే ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం దాదాపు 78 లక్షల 40 వేలు అవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ప్రకాష్ ఓ ఆఫీసులో అటెండర్‌గా పనిచేసేవాడు. సంతానోత్పత్తి చికిత్స కోసం చాలా మేం దాచుకున్న డబ్బుల్లో చాలావరకు ఖర్చయ్యాయి. ఇప్పటికే ప్రకాష్ అప్పుల్లో కూరుకుపోయాడు. దీనికి తోడు కొన్ని కారణాల వల్ల ఆయన ఉద్యోగం కూడా పోయింది. 11ఏళ్లు చూసిన ఎదురుచూపులకి మా బిడ్డ ఈ లోకాలనికి వచ్చి మా జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా బిడ్డను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
నా కొడుకు ప్రాణాలు కాపాడండి
డబ్బు ఉన్నవారా, లేనివారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్ క్రౌడ్ ఫండింగ్ సైట్) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి యదార్థ గాథను తెలుసుకుందాం. సందీప్- మాధవీలత దంపతుల ముద్దుల చిన్నారి రియాన్స్. ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం కావడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. పట్టరాని సంతోషంతో అందరూ పులకరించిపోయారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టకతోనే తనకు తనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని డాక్టర్ చెప్పగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సర్జరీకి 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కానీ అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించినా వారు తీసుకురాలేరు. సందీప్ ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేసేవాడు. కానీ కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూలీగా చేస్తున్నాడు. ‘మేం దాచుకున్న డబ్బులన్నీ రియాన్స్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి రియాన్స్ను కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81686400ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి -
వైరల్: కలిసి నటిస్తున్న మహేశ్, రణ్వీర్!
అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే.. వారిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు కూడా మల్టీస్టార్టర్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మధ్య ఒకే ఇండస్ట్రీలోని హీరోలతో సినిమాలు తీయడం కాకుండా వేర్వేరు ఇండస్ట్రీలోని హీరోలను ఒకచోటకు చేర్చి ప్యాన్ ఇండియా లెవల్లో సినిమా తీయడం ట్రెండింగ్‌గా మారింది. అందుకు బాహుబలి హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో తెలుగు హీరో ప్రభాస్ రాముడిగా, హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. (చదవండి: క్షమాపణలు చెప్పిన సైఫ్ అలీఖాన్) ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే తాజాగా టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారేమో అని ఓ క్షణం భ్రమపడ్డారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వీళ్లు నిజంగానే కలిసి నటిస్తున్నారు.. కానీ సినిమా కోసం కాదు కమర్షియల్ యాడ్ కోసం! యాడ్ షూటింగ్లో ఇద్దరు హీరోలు పాల్గొంటున్న ఫొటో ఆన్లైన్లో లీకవగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే రణ్వీర్ ప్రస్తుతం 'సర్కస్' సినిమాలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న '83'లోనూ మెప్పించనున్నారు. ఇక మిల్కీబాయ్ మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళితో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వలో పక్కా మాస్ క్యారెక్టర్‌తో ఓ సినిమా చేస్తారట. (చదవండి: మన ఆత్మలు ఒకటిగా ముడిపడి ఉన్నాయి) #MaheshBabu and #RanveerSingh got talking as they teamed up for an advertisement. pic.twitter.com/rsKAjaE3iJ — Filmfare (@filmfare) December 26, 2020 -
బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలకమైన అడుగులు వేసింది. కొనుగోలుదారుల సహేతుకమైన అంచనాలకు మించి క్లెయిములు చేసే ప్రకటనలు జారీ చేయకూడదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలలో పాలసీని గుర్తించడంలో, నిబంధనలకు సరిపోని ప్రయోజనాలను వివరించడంలో విఫలమవుతాయని ఐఆర్డీఏఐ తెలిపింది. బీమా రంగంలో కొత్త ప్రకటనల నిబంధనలు తీసుకురావాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ మేరకు నవంబర్ 10 లోగా స్టేక్హోల్డర్లు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరింది. ప్రతిపాదిత నిబంధనల ముఖ్య ఉద్దేశం బీమా సంస్థలు, మధ్యవర్తులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు న్యాయమైన, నిజాయితీ, పారదర్శక విధానాలను పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పద్ధతులను నివారించడమేనని తెలిపింది. బీమా ప్రస్తుతం పనితీరుతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని లేని పక్షంలో ఇది కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలుగానే పరిగణించ బడతాయని తెలిపింది. ప్రస్తుతం బీమా ప్రకటనల నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, గత రెండు దశాబ్ధాలుగా ప్రకటనల పరిణామ పోకడలు, మాధ్యమం, సాంకేతిక పరిణామాలు, అభివృద్ధి తదితరాలను సమీక్షించాలని తెలిపింది. అడ్వర్టయిజ్మెంట్ నిర్వచనం, తప్పుదోవ పట్టించే ప్రకటన అనే పదం పరిధిని విస్తరించడం, థర్డ్ పార్టీ బీమాదారులను కూడా బాధ్యులను చేయడం వంటివి ప్రస్తుతం నిబంధనల మార్పులలో కీలకమైనవని తెలిపింది. -
ప్రకటనలు నిలిపివేసిన కోకాకోలా
శాన్ ఫ్రాన్సిస్కో : గ్లోబల్ అడ్వర్టైజింగ్లో ప్రధాన శక్తిగా అవతరించిన కోకాకోలా కంపెనీ సోషల్ మీడియాలో 30 రోజుల వరకు ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోందంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోకాకోలా ప్రకటనల్లో హింసకు తావివ్వకుండా పూర్తి పారదర్శకతతో ప్రజలకు జావాబుదారీతనంతో ఉండే దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రకటన విధానాల్లో ఏదైనా మార్పు అవసరమా అన్న అంశాలపై అంచనావేయడానికి తాత్కాలికంగా ప్రకటనల్ని నిలిపివేస్తున్నాం అని కంపెనీ కంపెనీ చైర్మన్, సీఈవో క్విన్సీ క్లుప్త అన్నారు. ప్రపంచంలోనే జాత్యంహకారానికి చోటు ఉండకూడదని పేర్కొన్నారు. ద్వేషం, జాత్యహంకారం లేదా హింసను ప్రేరేపించే ప్రకటనల్ని నిలిపివేయాలని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (ఎన్‌ఐఏసిపి) సంస్థ ఇప్పటికే పలు కంపెనీలను కోరింది. మెరుగైన సామాజం కోసం మనమందరం పాటుపాడాలని ఫేస్బుక్ వేదికగా కోరింది. అమెరికాలో నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా లిప్టన్ టీ, బెన్ అండ్ జెర్రీ సహా పలు కంపెనీలు 2020 చివరి వరకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు సైతం జత్యాంహకారానికి వ్యతిరేకంగా తమ వంతు కృషి చేస్తున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ.కామ్ కలర్ ఫిల్టర్‌ను తొలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. రంగును బట్టి భాగస్వామిని ఎంచుకునే కలర్ ఫిల్టర్‌ను తొలిగించాలంటూ పిటిషన్ దాఖలైన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్గా సంతకాలు చేశారు. దీంతో వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ షాదీ డాట్ కామ్ (‘వైట్, ఫెయిర్, లైట్ పదాలు తొలగిస్తున్నాం’ ) మెన్నటికి మెన్న తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన క్రమంగా పలు దిగ్గజ కంపెనీ ప్రకటనల్లో పలుమార్పులు రాబోతున్నాయన్నమాట. (ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి జేజే ఔట్! ) -
నవ్వుతూ కళకళలాడే ఆ ఇల్లు చిన్నబోయింది!
ఎప్పుడూ నవ్వుల వెలుగులు చిమ్మే ఆ ఇంటిలో చీకట్లు అలముకున్నాయి. బిడ్డే ప్రాణంగా బతికిన తల్లిదండ్రులు ఆ పసిబిడ్డ ప్రాణం కోసం పోరాడుతుంటే నిస్సహాయులుగా కన్నీరు కారుస్తున్నారు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 21 నెలల ఆచిన్నారి వీర్ సవార్కర్ సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఎప్పుడు టీవీలో పాటలు పెట్టిన మా అబ్బాయి వీర్ ఎంతో ఆనందంతో ఎగురుతూ గంతులు వేసేవాడు. అతని నవ్వులు మా చిన్న ఇంటిలో నవ్వులు నింపాయి. నేను నా భర్త పరాగ్ తన అల్లరిని చూస్తూ మురిసిపోయే వాళ్లం. తను అప్పుడప్పుడే తన తీయని గొంతుతో అమ్మ, నాన్న అని పిలవడం మొదలు పెట్టాడు. కానీ కొన్ని రోజుల తరువాత ఏమైందో తెలియదు కానీ తను పాటలు పెట్టిన డాన్స్ చేయడం, ఆనందంతో చప్పట్లు కొట్టడం ఆపేశాడు. ఇంతకు ముందులా చురుకుగా ఉండటం లేదు. ఏం తినడానికి ఇష్టపడటం లేదు. బొమ్మలతో ఆడుకుంటాడేమో అని ప్రయత్నాలు చేసినా తను మాత్రం వాటి విషయంలో కూడా స్పందించలేదు. నేను బలవంతంగా తనకి తినిపించడానికి ప్రయత్నిస్తే ఏడ్చేవాడు. తను అలా ఎందుకు చేస్తున్నాడో తన పరిస్థితి ఏంటే మాకు అర్థం అయ్యేది కాదు. మేం తనని దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లాం. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లే స్థోమత మాకు లేదు. అన్ని చెక్ అప్లు చేసిన తరువాత ఆ డాక్టర్ పిల్లలు కొన్నిసార్లు ఏ ప్రాబ్లెమ్ లేకుండానే అలా ప్రవర్తిస్తారని దాంట్లో ఆందోళన చెందాల్సిన పని ఏం లేదని చెప్పారు. ఆ మాటలు విన్నతరువాత మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఇది ఇలా ఉండగా గత నెల మా బాబుకు చాలా జ్వరం వచ్చింది. ఒక వారం పాటు తనని హాస్పటల్లో చేర్పించాము. కానీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. అప్పడు బాబుకు కొన్ని పరీక్షలు చేయాలని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు రిపోర్టులు వచ్చాయని చెప్పాగనే నా గుండెల్లో కంగారు మొదలైంది. డాక్టర్ విచారకరమైన ముఖం నన్ను మరింత భయపెట్టింది. (కెటో) వీర్ ప్రమాదకరమైన యక్యూట్ బీ లింపోబ్లాస్టిక్ లుకేమియా (ఒక రకమైన బ్లడ్, బోన్ మ్యారో కాన్సర్) తో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్పారు. అప్పుడు క్యాన్సర్ అనే పదం నా చెవుల్లో మారుమ్రోగింది. తను మొదటిసారి జబ్బు పడినప్పుడే నేను ఎక్కువ జాగ్రత్లు తీసుకొని ఉండల్సిందని నన్ను నేను చాలా నిందించుకున్నాను. పరాగ్ నన్ను ఓదార్చాడు. మన బాబుకు ఏం కాదు అంటూ నాలో ధైర్యాన్ని నింపాడు. వెంటనే వీర్‌కు ట్రీట్మెంట్ మొదలు పెట్టమని డాక్టర్‌ను కోరాడు. వీర్‌ను హాస్పటల్లో చేర్పించాం. తనకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఆనందంతో చప్పట్లు కొట్టే తన చేతులు ఇంజక్షన్‌తో కదలకుండా ఉండిపోయాయి. తన కేరింతలు ఏడుపుగా మారిపోయాయి. (కెటో) తమ పిల్లలు ఇలా బాధపడటం చూడటం కంటే తల్లిదండ్రులకు మరో నరకం ఉండదు. తను అమ్మ అని పిలిచి చాలా రోజులు అయిపోయింది. నేను పాటలు పెట్టి తన దృష్టిని మరల్చాలి అనుకున్న అవి తన ఏడుపును ఆపలేకపోయాయి. వీర్‌కు మూడు సంవత్సరాల పాటు ట్రీట్మెంట్తో పాటు కీమోథెరపీ, బ్లడ్ ట్రాన్స్ఫూజన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దీని కోసం 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగలేదు. పరాగ్ మొదటిసారి ఏడవడం నేను చూశాను. ఇన్ని రోజులు ఎంతో ధైర్యంగా ఉన్న తను వీర్ ఆరోగ్య పరిస్థితి దిగజారడం చూసి తనని తాను నిందించుకోవడం మొదలుపెట్టాడు. (కెటో) పరాగ్ ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తన సంపాదన మా అవసరాలకు మాత్రమే సరిపోతుంది. మేం దాచిపెట్టుకున్న కొంత మొత్తం కూడా వీర్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. వీర్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి వీర్‌ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. Fundraising for cancer is a way to support medical treatment cost. Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments. -
సాయం చేయండి : ప్రాణాలు కాపాడండి!
డబ్బు ఉన్నవారా లేని వారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్ క్రౌడ్ ఫండింగ్ సైట్) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. అసలు రోగం ఒక కుటుంబాన్ని ఎలా కుంగదీస్తుందో ఇప్పుడు ఒకరి యదార్థ గాధను తెలుసుకుందాం. యువాని 8 యేళ్ల చిన్న పాప. టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక పేద తండ్రి గారాల పట్టి . ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం. తను పుట్టడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. 2007 లో ఎన్నో రోజుల తరువాత మాకు ఒక పాప పుట్టింది. తను పుట్టగానే పట్టరాని సంతోషంతో అందరం పులకరించిపోయాం. హాస్సటల్ నుంచి డిచార్జ్ అయ్యే రోజు ఎర్రటి డ్రస్ వేసి యువానిని అందంగా తయారు చేశాం. ఎందుకంటే తను మొదటిసారి తన ఇంటికి రాబోతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి పాపను చెక్ చేశారు. ఏముందిలే మామూలు చెక్ అప్ అనుకున్నాం. కానీ పాపను పరీక్షించిన తరువాత డాక్టర్ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనని ఇంకా చెక్ చేయాలి అని చెప్పారు. టెస్ట్లన్ని చేసిన తరువాత పాపకు గుండెలో రంధ్రం ఉంది అన్న విషయం చెప్పారు. ఒక్కసారిగా మేం కుప్పకూలిపోయాం. అప్పుడు డాక్టర్ అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. ఇది సాధారణంగా చాలా మందిలో ఉంటుంది. పాప పెరిగే కొద్ది రంధ్రం పూడ్చుకుంటుంది అని చెప్పారు. మేం కొంచెం ఊపిరి పీల్చుకొని పాపను ఇంటికి తీసుకువచ్చాం. 8 యేళ్ల వరకు అంత బాగానే ఉంది . కానీ ఒక రోజు యువాని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, ఛాతిలో నొప్పిగా ఉంది అని ఏడ్చుకుంటూ చెప్పింది. మాకు కంగారు వేసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ తన గుండె రంధ్రం పూడలేదని చెప్పారు. ఇప్పుడు మందులు వాడిన ప్రయోజనం లేదని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఉన్న ఆస్తులన్ని అమ్మి తనకు ఆపరేషన్ చేయించాం. రోజు టాక్సీ నడుపుకొని బతికే మాకు పూట గడవడమే కష్టం అలాంటిది ఆపరేషన్ తరవాత తన మందులు, టెస్ట్‌ల ఖర్చులు మాకు భారంగా మారాయి. మొత్తం అంతా ఖర్చు చేసేశాం. ఇప్పుడు మళ్లీ తను తనకు ఛాతిలో నొప్పి వస్తుందని, శ్వాస కష్టంగా ఉందని అంటుంది. డాక్టర్‌కు చూపించాం. ఆపరేషన్ పనిచేయలేదని, ఇప్పుడు గుండె మార్పిడి చేస్తేనే తను బతుకుతుంది అంటున్నారు. దానికి 30 లక్షల ఖర్చు అవుతుంది. నేను ఆ విషయం విని తట్టుకోలేకపోయాను. నేను ఏడుస్తుంటే యువాని నా దగ్గరకు వచ్చి ‘అమ్మ నా వల్లే ఏడుస్తున్నావు కదూ నేను మీకు భారంగా తయారయ్యాను కదా’అని అడిగింది.ఆ మాటలు విన్న తరువాత నేను ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను అనిపించింది. నా కూతురు ప్రాణాలు మీరు చేసే డొనేషన్ మీదే ఆధారపడి ఉన్నాయి. నా కూతురును కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి. 'కెటో' ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. మీరు ఇచ్చే చిన్న మొత్తాలు యువని లాంటి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలవు. కొద్ది మొత్తంలో సాయం చేయండి. ఎంతో మందిని కాపాడండి. (అడ్వర్టోరియల్) Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments. -
హీరో అక్షయ్ కుమార్‌పై కేసు నమోదు
ముంబై : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అక్షయ్ నటించిన యాడ్‌కు సంబంధించి ఆయనపై మరాఠాలు మండిపడ్డారు. ఓ వాషింగ్ పౌడర్ కంపెనీ ప్రచారానికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్ మరాఠా యోధుడిగా కనిపించారు. అయితే ఆ యాడ్‌లో అక్షయ్ పాత్ర తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మరాఠాలు ఆరోపిస్తున్నారు. దీనిపై అక్షయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని వీడియోలను, ఫొటోలను ఆన్లైన్లో నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఫిర్యాదు మేరకు ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్లో అక్షయ్‌పై కేసు నమోదైంది. అయితే ఇందుకు సంబంధించి అక్షయ్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో అక్షయ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆ వాషింగ్ పౌడర్‌ను బాయ్‌కాట్ చేయాలని ట్వీట్లు చేస్తున్నారు. ‘అక్షయ్ ఎప్పుడైనా మరాఠాల చరిత్ర చదివారా?. మీకు తెలియకపోతే.. వారు దేశానికి చేసిన త్యాగాలను ముందుగా తెలుసుకోండి. అంతేకానీ మరాఠా సంస్కృతిని ఎగతాళి చేయకండి’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. Mr. @akshaykumar , have you ever read history of Maratha's ? If No then go and read their sacrifice towards Nation. Else dont mock our Maratha culture !#BoycottNirma pic.twitter.com/cQE8k39GGv — Nikhil Patrikar (@jagruthindu) January 8, 2020 -
‘సచివాలయాల’ ఇంటర్నెట్ టెండర్ల ఆహ్వానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
క్రికెట్ యాడ్‌పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూర్ఖుడా, దద్దమ్మా, హాస్యము తెలియని వెర్రి వెంగలప్ప, అభిరుచి లేనివాడా! భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన గొప్ప దేశం పట్ల గౌరవ లేకుండా క్రికెట్ పేరు మీద తప్పుడు జాతీయవాదాన్ని రుద్దుతున్నావు’ అంటూ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర నిర్మాత సృజిత్ ముఖర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ‘బెంగాలీ సంస్కృతిని, రవీంద్రుడి కవిత్వాన్ని అవమానించడం అంటే అది కచ్చితంగా ఓ జాతి పట్ల విద్వేషం వెదజల్లడమే అవుతుంది’ అంటూ జర్నలిస్ట్ సౌమ్యజిత్ మజుందార్ విమర్శించారు. ‘నేనొక బెంగాలీని, బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాను. మా ఆత్మ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని అవమానించావు, మేము దేవుడికి నైవేద్యంగా పెట్టే తిలర్ నాడును అవమానించావు. ఇందుకు క్షమాపణలు చెప్పాలి’ అని మరొకరు, ‘బెంగాలీలు భారతీయులు కాదా, వేరుగా చూసినందుకు క్షమాణలు చెప్పాలి లేదా కోర్టుకు వెళతాం’ అని ఇంకొకరు, అసలు డాబర్ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న హాష్‌ట్యాగ్‌తో మరికొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. మంగళవారం జరిగిన భారత్–బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా టీవీల్లో ప్రసారమైన డాబర్ కంపెనీ ఇచ్చిన రెడ్పేస్ట్ యాడ్‌పై కొనసాగుతున్న రాద్ధాంతం ఇది. క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని డాబర్ కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. భారత్ ఏ దేశంతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ దేశానికి చిహ్నమైన వంటకాన్ని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని కసాపసా నమిలి మింగేస్తుంటే ‘సబ్కోఛాబాజాయెంగే (అందరిని నమిలేస్తాం)’ అన్న హాష్‌ట్యాగ్‌తో యాడ్ ప్రసారం అవుతోంది. అభిమాని పాత్రలో ప్రముఖ హాస్య నటుడు మనోజ్ పావువా నటించారు. మొన్న పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ప్రసారం చేసిన యాడ్‌లో ‘వాల్నట్స్ (అక్రోట్ కాయలు)’ను మనోజ్ పరా పరా నమలడం కనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘స్టిక్జా టొఫీ (చాక్లెట్ లాంటి స్వీటు),’ వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘కొబ్బరి గరిజలు’ తినడం కనిపించింది. నిన్న బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ జరిగినప్పుడు ‘తిలర్ నాడు (బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు)’ తినడం కనిపించింది. రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన ‘బ్రిస్తీ పోర్ తపుర్, తుపర్ (చిటపట చినుకులు)’ కవితా పంక్తిని కూడా మనోజ్ వినిపించారు. బెంగాళీ హిందువులు దేవుళ్ల వద్ద ప్రసాదంగా ఎక్కువగా ఈ నువ్వుల ఉండలు పెడతారు. బంగ్లాదేశ్‌కు ప్రతీకగా తమ నువ్వుల ఉండలు చూపడమేమిటీ, ఠాగూర్ కవిత్వాన్ని ప్రస్తావించడం ఏమిటన్నది వారి ప్రశ్న. వాస్తవానికి బెంగాల్ సరిహద్దుకు ఆవల ఉన్న బంగ్లాదేశీయులు కూడా నువ్వుల ఉండలను ప్రీతిగా తింటారు. ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నువ్వుల ఉండలను ప్రజలు ఎక్కువగానే తింటారు. ప్రసాదంగా కూడా పెడతారు. ఠాగూర్‌ను బంగ్లా సరిహద్దు గ్రామాల ప్రజలు గౌరవిస్తారు. ఏదేతేనేమీ విమర్శలు వెల్లువెత్తడంతో డాబర్ కంపెనీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ యాడ్‌ను రూపొందించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, యాడ్‌లో అభ్యంతకరమైన భాగాన్ని తొలగిస్తున్నామని, ఎవరి మనుసులనైనా నొప్పించి ఉన్నట్లయితే అందుకు క్షంతవ్యులమంటూ వివరణ ఇచ్చింది. -
అభినందన్ ఫేక్ వీడియో వైరల్
ఇస్లామాబాద్ : ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత అభినందన్‌పై దాడికి సంబంధించి వీడియోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. అందులో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులివ్వడం తెలిసిందే. అభినందన్ టీ తాగుతూ 'టీ చాలా బాగుంది.. థాంక్యూ'అంటూ పాక్ ఆర్మీ అధికారులకు కితాబిస్తారు. మార్ఫ్ చేసిన తాపల్ టీ వాణిజ్య ప్రకటన అయితే కొందరు ఫేక్ రాయుళ్లు తమ క్రీయేటివిటీకి పదునుపెట్టారు. కరాచీకి చెందిన టీ కంపెనీ 'తాపల్' వాణిజ్య ప్రకటనను మార్ఫ్ చేసి అభినందన్ మాటలను జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది నిజమేమోనని భావించి తాపల్ వాణిజ్య ప్రకటనలో అభినందన్ నటించారంటూ.. పాక్, భారత్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రకటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తాపల్ సిబ్బంది చెబుతున్నా, అప్పటికే వీడియో తెగ చక్కర్లు కొట్టడంతో ఇప్పుడా టీ బ్రాండ్ పేరు పాకిస్తాన్, భారత్‌లో మారుమోగిపోతుంది. అసలైన తాపల్ టీ వాణిజ్య ప్రకటన -
అసలైన తాపల్ టీ వాణిజ్య ప్రకటన
-
వైరల్ అవుతున్న అభినందన్ ఫేక్ వీడియో!
-
విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?
ముచ్చటైన జంట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నటించిన మన్యవార్-మాహే ప్రకటన గుర్తుందా..ఈ స్వీట్ అండ్ సెలబ్రిటీ కపుల్ పెళ్లికి ముందు చేసిన ఈ యాడ్‌తో అందరి చూపులనూ కట్టిపడేశారు. అన్యోన్యమైన జంట అంటే ఇలా ఉండాలి అన్నట్టు నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా పెళ్లి తరువాత..వీరి వివాహ వార్షికోత్సవానికి కేవలం కొన్ని వారాల ముందు చేసిన అదే మన్యవర్-మోహే ప్రకటన ఇపుడు హల్చల్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రమాణాలు, పెళ్లి తరువాత ప్రయాణం..ఈ చిలిపి తగాదాలతో చూడముచ్చటగా అద్భుతంగా ఉన్న ఈ యాడ్‌ను చూసి ఆనందించాల్సిందే.. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో లక్షలాది లైక్‌లు, కమెంట్ల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా ఈ యాడ్ చూసిన అభిమానులు ‘బెస్ట్ కపుల్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. అటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, ధడక్ దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా తాజా ప్రకటన చూసి విరాట్-అనుష్క జంటపై ప్రశంసలు కురిపించారు. వ్యాపార ప్రమోషన్లో వాణిజ్య ప్రకటనలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. ఇక సదరు యాడ్లకు సెలబ్రిటీల స్పెషల్ ఎట్రాక్షన్ తోడైతే వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా సులువు. ఆ కోవలోనిదే. ఇండియన్ సల్వార్ సూట్, సాంప్రదాయ, డిజైనర్ వివాహ దుస్తులకు పెట్టింది పేరైన మాన్యవర్-మాహే ప్రకటన కూడా. View this post on Instagram Celebrating love everyday #SaathSaathHamesha ✨🌟 @manyavarmohey @virat.kohli A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Nov 19, 2018 at 8:42pm PST -
నా భర్తకు బదులు వేరొకరి ఫొటో ముద్రించారు!
మధిర రూరల్: తన అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రకటనలో ఫొటోలు ప్రచురించడమే కాకుండా తన భర్త ఫొటోనుకూడా మార్చి వేశారని నాయకుల పద్మ అనే బాధితురాలు వాపోయారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రకటనలో వేరొకరి భార్యగా చూపించి తమ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో పద్మ తన భర్త నాగరాజుతో కలసి విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. తమది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయి అని తెలిపారు. కుటుంబ పోషణ నిమిత్తం పాత బట్టలు కుట్టి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తామన్నారు. యాదగిరి సమీపంలో ఉన్న కొంగవల్లి గ్రామం లో ఉంటున్న సమ యంలో మూడేళ్ల క్రితం కొందరు వచ్చి ప్రభుత్వ అధికారులమని, లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఫొటో లు తీసుకున్నారని తెలి పారు. కొన్ని రోజుల కిందట.. ‘మేము కాపు సారా కాసేవారమని, అది తాగుతామని, ఇప్పుడు సారా కాయడం నిలిపివేసి కుటుంబంతో ఆనం దంగా బతుకుతున్నాం’అని తన భర్తతో ఉన్న ఫొటో తొలిసారిగా పేపర్లో ప్రకటనగా వచ్చిం దన్నారు. అప్పుడు కొందరు చెబితే తాము పట్టించుకోలేదని చెప్పారు. ఆ తర్వాత రైతు బంధు పథకంలోనూ తమ కుటుంబ సభ్యులతో కూడిన ఫొటోలను పెట్టి తమకు పొలం ఉందని, రూ.4వేలు సర్కారు ఇస్తోందని, అందుకు ఆనందంగా ఉన్నామని మరో ప్రకటన ఇచ్చారని తెలిపారు. రైతుబీమా పథకంలో తమ కుటుంబ ఫొటోను ఉపయోగించారన్నారు. తాజాగా కంటి వెలుగులో భాగంగా ఈనెల 14న అన్ని దినపత్రికల్లోని ప్రధాన పేజీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో తన ఫొటో వేశారని, పక్కన తన భర్త ఫొటోకు బదులు మరొక వ్యక్తి ఫొటోను ప్రచురించారని ఆరోపించారు. ఈ ప్రకటనను చూసి ప్రతి ఒక్కరూ గేలిచేసి మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అత్తమామలు, గ్రామస్తుల సూటి పోటి మాటలతో తలెత్తుకు తిరుగలేకపోతున్నానని వాపోయారు. ఆమె భర్త నాగరాజు మాట్లాడుతూ.. తాను అసలు మందే తాగనని, కాపుసారా కాయనని తెలిపారు. తమకు పొలంకూడా లేదని, కేవలం రేషన్, ఆధార్ కార్డులే ఉన్నాయని, సెంటు భూమీ లేకపోయినా రైతుబంధు చెక్కులు అందుకున్నట్లుగా ప్రకటన వేశారన్నారు. తన భార్య పక్కన మరొక వ్యక్తి ఫొటోను ఉంచి కంటి వెలుగు ప్రకటనలో చూపించారని నాగరాజు ఆరోపించారు. పద్మ దంపతులు ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. -
నాగార్జున యాడ్‌ను తొలగించేశారు
న్యూఢిల్లీ : తాజాగా కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన యాడ్ అందరికీ తెలిసే ఉంటుంది. ‘నిజాయితీ ఎక్కడో నమ్మకమూ అక్కడే’ అనే కాన్సెప్ట్‌తో.. ప్రతి రోజూ బుల్లితెరపై ఇది మారుమోగిపోయింది. ఇంత హల్చల్ చేసిన ఈ యాడ్ ఇక నుంచి టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించదట. ఈ యాడ్‌ను అన్ని ప్రసార మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ నిర్వాహకులు ప్రకటించారు. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ఆ యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ తెలిపింది. ఈ యాడ్‌ను తాము కేవలం ప్రచారం కోసమే రూపొందించామని, కానీ ఈ యాడ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కల్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్యాణ్ రామన్ అన్నారు. తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు. అమితాబ్‌తో రూపొందిన హిందీ యాడ్‌ను కూడా సోమవారమే తొలగించిన సంగతి తెలిసిందే. ప్రభూతో రూపొందిన తమిళ యాడ్, మంజు వారియర్‌తో షూట్ చేసిన మలయాళ యాడ్‌ను కూడా కల్యాణ్ జువెలర్స్ తొలగించినట్టు తెలిసింది. కాగ, కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన ఈ యాడ్, బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించేలా ఉందంటూ.. బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ యాడ్‌ను తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కల్యాణ్ జువెలర్స్ యాడ్‌లో ఏముంది.. అక్కినేని నాగార్జున ఓ రిటైర్డు ఉద్యోగి వేషంలో.. తన మనవరాలితో పాటు బ్యాంకుకు వస్తారు. నా పెన్షన్ అని ఓ బ్యాంక్ ఉద్యోగికి పాస్‌పుస్తకం చూపిస్తే, నాలుగు కౌంటర్ వద్దకు వెళ్లడంటూ ఆ బ్యాంక్ ఉద్యోగి విసుక్కోవడం, మరో కౌంటర్ వద్ద ఇది తలనొప్పి కేసు అంటూ మేనేజర్ వద్దకు వెళ్లమనడం బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని చూపించారు. బ్యాంక్ మేనేజర్ వద్ద తన ఖాతాలోకి రెండు సార్లు పెన్షన్ డబ్బు క్రెడిట్ అయిందని చెబితే, అదృష్టం అంటే ఇదే పండుగ చేసుకోండని సూచిస్తారు. తిరిగి ఇవ్వడానికి వచ్చానంటే, ఇది పెద్ద తతంగమండి, గమ్మున వదిలేయండి, ఎవరికి తెలుస్తుందని అని నిర్లక్ష్య పూర్వక సమాధానం చెబుతారు. నాకు తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా.. తప్పు తప్పే అని నాగార్జున అనడం.. నిజాయితీ ఎక్కడో నమ్మకమో అక్కడే.. అదే కల్యాణ్ జువెలర్స్ అనడంతో ఈ యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్ లో బ్యాంకు అధికారులు కస్టమర్లను పట్టించుకునే విధానంతో పాటు.. అనుకోకుండా ఒకరి ఖాతాలోకి రెండు పర్యాయాలు వచ్చిన పెన్షన్ డబ్బును కట్ చేయడానికి చూసిన నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై బ్యాంకింగ్ అధికారులు కన్నెర చేశారు. అటు బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఈ యాడ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. -
మరోసారి కన్నుగీటిన ప్రియా వారియర్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రేటీ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. కుర్రకారు ఇంకా ఆ మైకం నుంచి తేరుకోకమునుపే మరోసారి కన్నుగీటి యూట్యూబ్‌లో రద్దీని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు ముందు ప్రియ కన్నుగీటింది ఒక సినిమా కోసమైతే ప్రస్తుతం మాత్రం కన్నుగీటింది ఒక ప్రకటన కోసం. ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది. మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రియ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే. గత వీడియోతో పోల్చితే ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో తక్కువ వ్యూస్‌నే పొందింది. ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో విడుదల కానుంది. -
ఆన్ లైన్ యాడ్.. సోషల్ మీడియాలో చిచ్చు
వాషింగ్టన్ : ‘‘కూలెస్ట్ మంకీ ఇన్ ది జంగిల్’’ అంటూ ఓ ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. నల్ల జాతీయులను కించపరిచేలా ఉన్న ఆ యాడ్‌పై సదరు కంపెనీ నుంచి క్షమాపణలు డిమాండ్ చేస్తూ నల్లజాతీయుల ఫోరమ్ నిరసన చేపట్టింది. స్వీడిష్ దుస్తుల కంపెనీ ఒకటి బ్రిటన్‌లో తమ అమ్మకాల కోసం ఆన్ లైన్ అమ్మకాల సంస్థ హెచ్ అండ్ ఎమ్తో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఆన్లైన్లో వారు ఓ యాడ్ పోస్టు చేశారు. అందులో ఓ నల్ల జాతికి చెందిన బాలుడి స్వెటర్‌పై మంకీ అంటూ వ్యాఖ్యను పేర్కొంది. పక్కనే శ్వేత జాతికి చెందిన పిల్లాడి ఫోటోను ఉంచి.. అతని స్వెటర్‌పై పులి ఫోటోతో శ్వేత జాతీయులు గొప్పవారు అని అర్థం వచ్చేలా మరో వ్యాఖ్య చేసింది. అంతే సోషల్ మీడియాలో అంతా ఆ కంపెనీ యాడ్‌పై భగ్గుమన్నారు. ఇది జాతి వివక్షతేనన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు, పాత్రికేయులు, ఉద్యమకారులు హెచ్అండ్ఎమ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ యార్క్ టైమ్స్ కాలమిస్ట్ హెచ్ అండ్ ఎమ్ కి మతి పోయిందటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మరికొందరు హెచ్ అండ్ ఎమ్‌కు మద్దతుగా పోస్టులు చేయటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వివాదాలు చోటు చేసుకున్నారు. ఇక నల్ల జాతీయుల ఫోరమ్ వ్యతిరేక ఉద్యమం చేపట్టడంతో ఆ ప్రభావం కారణంగా హెచ్ అండ్ ఎమ్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఎట్టకేలకు సదరు దిగ్గజ సంస్థ దిగొచ్చింది. క్షమించండి.. ‘‘ఈ ఫోటో కారణంగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. ఇందుకు మేం పశ్చాత్తాపం తెలియజేస్తూ క్షమించమని కోరుతున్నాం. మా ఛానెల్స్ నుంచి ఈ ఫోటోను తీసేస్తున్నాం’’ అని హెచ్ అండ్ ఎమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, గతంలో డోవ్ సంస్థ కూడా ఓ యాడ్‌తో జాతి వివక్ష విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు తెలియజేసింది. -
యాడ్ మేకర్స్
-
స్వచ్ఛ భారత్ ప్రచారానికే 530 కోట్లు ఖర్చు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి కేవలం ప్రచారం కల్పించడానికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 530 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ స్కీమ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పత్రికలు, రేడియో, టీవీలకు ఇచ్చిన యాడ్స్‌కే ఈ 530 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు ఓ సామాజికి కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఆ సామాజిక కార్యకర్త తన పేరును బహిర్గతం చేసేందుకు ఇష్టపడలేదు. ఈ మొత్తం 'బేటీ బచావో, బేటీ పాడావో' కార్యక్రమం ప్రచారానికి ఖర్చు పెట్టిన దానికంటే 15 రెట్లు ఎక్కువ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014, అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ స్వచ్ఛ భారత మిషన్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద 2019, అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలో ప్రజలు బహిర్భూమికి వెళ్లే పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా దేశంలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటికి తిరిగి చెత్తా చెదారాన్ని నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో నూటికి నూరు శాతం ప్రజలకు సరైన అవగాహన కల్పించడం, ప్రతి పట్టణంలో ఓ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయడం, చెత్తా చెదారాన్ని నిర్మూలించడంలో మున్సిపల్ సిబ్బందికి ఆధునిక పరికరాలను అందజేయడం, వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి గతేడాది బడ్జెట్ 9,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, ఈ ఏడాది ఏకంగా 16,248 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ ఏడాదిలో అక్టోబర్ నెల వరకు ఈ స్కీమ్‌ను ప్రచారం చేయడానికి యాడ్స్ కోసం 37 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఈ యాడ్స్ కోసం ఖర్చు పెడుతున్న నిధులకు సరైనా లెక్కా పత్రం ఉండడం లేదని కాగ్ గతేడాది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఇక స్కీమ్‌ను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సహకారం, సమన్వయం లోపించిందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్కీమ్‌ను గ్రామ్య స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్న యునిసెఫ్ లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్‌లో కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిందని విమర్శకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 5.3 కోట్ల మరుగు దొడ్లను నిర్మించగా, పట్టణ ప్రాంతాల్లో 34 లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలో ఎక్కువ వరకు మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, కొన్ని మరుగుదొడ్లను అప్పుడే ధ్వంసం చేశారని ఓ ఆంగ్ల మీడియా చేసిన పరిశోధనలో వెల్లడయింది. 2019 సంవత్సరం నాటికి ప్రభుత్వం మరో 8.2 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొంది. అంటే, నెలకు 23 లక్షలు, ప్రతి నిమిషానికి 56 మరుగు దొడ్లు నిర్మించాల్సి ఉంది. మరుగు దొడ్ల లక్ష్యాన్ని అందుకోవడంతోపాటు ప్రజల్లో బహిర్భూమికి వెళ్లే అలవాటును పూర్తిగా మాన్పించాలి. ఈ స్కీమ్‌ను చేపట్టిన ఈ మూడేళ్లలో దేశంలోని 2,72,235 గ్రామాలు లేదా 45 శాతం బహిర్భూమికి వెళ్లడాన్ని నిర్మూలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంకా 73.20 కోట్ల మంది ప్రజలు అపరిశుభ్ర పరిసరాల్లో బహిర్భూమికి వెళుతున్నారని 'వాటర్ ఎయిడ్' అనే ప్రభుత్వేతర సంస్థ 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ టాయ్‌లెట్స్-17' నివేదికలో ఇటీవల వెల్లడించింది. మనుషులు పాకీ పనిచేయడం వల్ల ఒక్క 2016లోనే 1300 మంది మరణించారని 'సఫాయ్ కర్మచారి ఆందోళన్' గణాంకాలు తెలియజేస్తున్నాయి. మనుషులు పాకీపని చేయడాన్ని కేంద్రం ఎప్పుడో నిషేధించినప్పటికీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. -
ముంచేసిన ఆన్లైన్ ప్రకటన.!
పీఎంపాలెం (భీమిలి): ఆన్లైన్లో ప్రకటన చూసి కారు కొనదలచిన వ్యక్తి రూ.లక్షా 86 వేలు పోగొట్టుకున్నాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు... కారు విక్రయించడానికి సిద్ధంగా ఉందంటూ ఓఎల్కే పేరున ఆన్లైన్లో వెలువడిన ప్రకటన చూసి పాత మధురవాడ మెట్ట ప్రాంతానికి చెందిన బి.భాస్కరరావు ఆకర్షితుడయ్యాడు. ఆ ప్రకటనలో సూచించిన నంబరుకు ఫోను చేసి సంప్రదించాడు. ప్రకటనలో పేర్కొన్న విధంగా తమ బ్యాంకు అకౌంట్లో సొమ్ము జమ జేస్తే కారు సొంతం అవుతుందని అవతల వ్యక్తి ఫోనులో తెలియజేశాడు. అతను చెప్పిన విధంగానే ఈ నెల 8వ తేదీన భాస్కరరావు రూ.లక్షా 86 వేలు బ్యాంకు అకౌంట్‌కు జమ చేశాడు. కారు రాలేదు సరిగదా అవతలి వ్యక్తి ఫోను స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అవతల వ్యక్తి ఫోను నంబరును బట్టి ఆ నంబరు ఛత్తీస్గఢ్దని గుర్తించామని సీఐ తెలిపారు. కేసును సైబర్ విభాగానికి అప్పగించామన్నారు. -
డవ్ యాడ్‌పై దుమారం
-
డవ్ యాడ్‌పై దుమారం
షాంపులు, సబ్బుల ఉత్పత్తుల్లో మంచి బ్రాండు ఉన్న డవ్ వివాదంలో చిక్కుకుంది. తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన ఓ యాడ్ మూలాన తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఒక నల్లజాతీయురాలు తన షర్ట్ తీసేస్తే తెల్ల మహిళగా రివీల్ అవుతుందంటూ ఓ బాడీ వాష్ యాడ్‌ను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ఈ ప్రకటన తీవ్ర జాత్యహంకారాన్ని చూపుతుందని సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. దీంతో మూడు సెకన్లతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను డవ్ విడుదల చేసింది. ఈ క్లిప్‌లో నిజమైన అందంపై డవ్ వైవిధ్యాన్ని చూపించడం లేదని, దీనిపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్టు కంపెనీ చెప్పింది. నల్ల జాతీయురాలు, తెల్ల జాతీయురాలుగా మారే విధంగా చూపించే ఈ సబ్బు ప్రకటన జాత్యహంకారాన్ని కలిగి ఉందని సోషల్ మీడియా యూజర్లంటున్నారు. అంటే నల్ల రంగు శరీరం చెత్త అని, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదని ఈ యాడ్ ప్రతిపాదిస్తుందని విమర్శిస్తున్నారు. శుభ్రమైన శరీరమంటే, తెల్ల రంగు శరీరం కాదని, అలా అని నల్ల రంగు శరీరాలన్నీ చెత్త కాదని అట్లాంటకు చెందిన ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. డవ్ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని, కానీ ప్రస్తుతం వీటిని విడిచిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే తొలిసారి కాదని, డవ్ చాలాసార్లు ఇలాంటి జాత్యంహకారం ప్రకటనలను ప్రచురించింది. -
మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..?
-
మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..?
మొబైల్లో తలపెడితే ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారా..? రోడ్డుపై నడిచేటప్పుడు.. డ్రైవింగ్ చేసేటప్పుడు.. మొబైల్లో లీనం అవుతున్నారా..? అయితే ఈ వీడియో చూడండి తప్పకుండా రియలైజ్ అవుతారు.. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం.. రోడ్డుపై నడుస్తూ చాట్ చేయడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కళ్లకు కట్టేలా దక్షిణాఫ్రికా పశ్చిమ కేప్ ప్రభుత్వం 40 సెకన్ల యాడ్‌ను రూపొందించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ‘సేఫ్లీ హోమ్’ కార్యాక్రమంతో ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిలియన్ల వ్యూస్ అందుకున్నఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొబైల్లో లీనమై నడుస్తూ ప్రమాదానికి గురైన సంఘటనలు, డ్రైవింగ్ చేస్తూ టెక్ట్స్ మెసెజ్‌లు పంపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యాలను వీడియోలో పొందుపరిచింది. ఇంకెందుకు ఆలస్యం మీరు వీడియో చూడండి జాగ్రత్తగా ఉండండి. -
నమ్మనివారే ఫూల్స్!
ఏప్రిల్ 1 రోజున బంధువులను, స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటారు. సన్నిహితులను సరదాగా ఆటపట్టించేందుకుగాను సంవత్సరంలో ఒకరోజు కేటాయించారు పెద్దలు. కానీ ఆ రోజు అన్ని సరదా కోసమే చేస్తారనుకోవద్దు, కొన్ని నిజమైనప్పటికీ మనం నమ్మం. నిజంగా ప్రమాదాలు ముచ్చుకొస్తున్న సంగతిని సన్నిహితులు చెప్పినప్పటికి ఇది ఫూల్స్ చేయడానికే అనుకోని ప్రమాదాల బారినపడ్డ సంగతులు కోకొల్లలు. అంతేకాదు బంపర్ ఆఫర్స్ వరించిన వారుకూడా ఫూల్స్ చేస్తున్నారన్న కారణంతో వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కొన్ని సంగతులను ఈ రోజు తెలుసుకుందాం.....! అయితే ఫూల్.. లేకుంటే కారు.... ఏప్రిల్ 1, 2015.. న్యూజిలాండ్... ఉదయం లేచి పేపర్ చూసిన ప్రజలకు బీఎండబ్ల్యూ ప్రకటన కనబడింది. దాంట్లో ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా మీ పాత కారును తీసుకొచ్చి కొత్త బీఎండబ్ల్యూ కారును తీసుకెళ్లండని ప్రకటన వచ్చింది. కానీ అక్కడి ప్రజలు ఈ ప్రకటనను నమ్మి షోరూంకి వెళితే ఫూల్స్ అయిపోతామని ఎవరూ వెళ్లలేదు. టీనా మార్షా మాత్రం ఈ ప్రకటనను నమ్మింది. ప్రయత్నిస్తే వచ్చే నష్టం ఏమిలేదనుకున్న టీనా షోరూంకి వెళ్లింది. అయితే ఫూల్ లేదంటే బీఎండబ్ల్యూ కారుతో తిరిగొస్తానన్న నమ్మకంతో వెళ్లింది. మొదటగా బీఎండబ్ల్యూ బొమ్మకారును ఇస్తారనుకున్న టీనాకు షోరూం సిబ్బంది అశ్చర్యానికి గురిచేస్తూ 33 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును అందించారు. షోరూంకి తన 15 ఏళ్ల పాత నిస్సాన్ కారుతో వెళ్లినా టీనా కొత్త బీఎండబ్ల్యూ కారుతో ఇంటికి తిరిగొచ్చింది. ప్రభుత్వ హెచ్చరికను నమ్మలేదు.... ఏప్రిల్ 1, 1946కు రెండు, మూడు రోజుల ముందు నుంచి ఐస్లాండ్లో సునామీ వస్తుందని ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది ప్రభుత్వం. ఇదంతా మమ్మల్ని ఫూల్స్ చేయడానికే అని భావించారు అక్కడి ప్రజలంతా. ప్రభుత్వాన్నే ఫూల్స్ చేయాలనుకొని ఎవరూ ఇళ్లు ఖాళీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 1 తెల్లవారుజామున భయంకర శబ్ధాలు వినబడడంతో తన అన్న చెప్పింది నిజమనే నమ్మాడు ఓ వ్యక్తి. తెల్లవారుజామున 2 గంటలకు భయంకర సునామీ ప్రజల మీదకు విరుచుకుపడింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రజలందరూ పరుగు లంకించుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడితే మరికొందరు ప్రాణాలు విడిచారు. దీనిలో దాదాపు 1300 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా 159 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టడంతో భారీ ఎత్తున నష్టపోవడంతోపాటు అపార ప్రాణనష్టంకూడా సంభవించింది. ఏప్రిల్ 1న ఫూల్స్ అవుతామన్న భావనతో ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయని కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోతే మరికొందరు గూడులేక రోడ్డున పడ్డారు. మార్విన్ గయే హత్య... ఏప్రిల్ 1, 1984న అమెరికాలోని ప్రముఖ గాయకుడు మార్విన్ గయేను తన తండ్రే హత్య చేశాడన్న వార్త దావనంలా వ్యాపించింది. కానీ దీన్ని అక్కడి ప్రజలేవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ రోజు ఫూల్స్ డే సందర్భంగా కావాలనే ఎవరో ఈ కట్టుకథ అల్లారని అనుకున్నారు. ఒక ఇన్సూరెన్సు పాలసీ డాక్యుమెంట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభమైన గొడవ పెద్దగా తయారైంది. మొదట మార్విన్ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన మార్విన్ తండ్రి తన దగ్గర ఉన్న పిస్తోల్‌తో మార్విన్ చాతీపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడిఉన్న మార్విన్‌ను సన్నిహితులు ఆసుపత్రికి చేర్చేలోపే తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ప్రజలు మొదట నమ్మలేదు. జీమెయిల్ ఒక జోక్ ఇప్పుడు మనం జీమెయిల్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. జీమెయిల్ లేకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇది నేటి పరిస్థితి... ఏప్రిల్ 1, 2004న గూగుల్ జీమెయిల్ లాంచ్ చేస్తున్నప్పుడు అందరూ దాన్నొక జోక్‌గా అనుకున్నారు. దీని యొక్క స్టోరేజ్ కెపాసీటీ 1 గిగాబైట్గా గూగుల్ చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు. కానీ నేడు జీమెయిల్ అవసరం ప్రపంచానికి ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
మార్కెట్లోకి మిచెలిన్ ఎక్స్గార్డ్ రేడియల్ టైర్లు
న్యూఢిల్లీ: భారత్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన రేడియల్ ట్రక్ టైర్లను ‘ఎక్స్ గార్డ్’ పేరుతో మిచెలిన్ కంపెనీ గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీర్ఘకాలం మన్నిక, ఇంధన ఆదా, మరింత దృఢంగా ఈ టైర్లు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తనకున్న పెటెంట్ టెక్నాలజీ ఆధారంగా వీటిని తయారు చేసింది. -
అప్పటివరకూ కంటి మీద కునుకు రాదు!
‘‘ఈ వయసులోనూ ఇంత బిజీ బిజీగా ఎలా సినిమాలు, యాడ్స్ చేయగలుగుతున్నారు సార్?’’... అమితాబ్ బచ్చన్‌ని ఓ వ్యక్తి అడిగారు... దానికి ఈ బిగ్ బి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘సంపాదన కోసం నేను వర్క్ చేస్తున్నాను. బతకడం కోసం అందరూ జాబ్ చేస్తున్నట్లే నేనూ చేస్తున్నా. అందులో గొప్పేం ఉంది? ఈ ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుందని మాత్రం అడగకండి. ఉదయం నిద్ర లేచేటప్పుడు రోజంతా ఎలా గడపాలా? అని ఆలోచించాల్సి వస్తే జీవితం బోర్ కొట్టేస్తుంది. చేతి నిండా పనితో నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం ‘పింక్’ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారాయన. అత్యాచారానికి గురైన అమ్మాయిల కథ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమాకి లభిస్తున్న స్పందన గురించి అమితాబ్ మాట్లాడుతూ -‘‘పింక్ అనేది సినిమా కాదు. ఒక మూమెంట్‌లా అయిపోయింది. ఇలాంటి మంచి సినిమాకి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు. ఈ సినిమాలో చూపించినట్లుగానే జరుగుతోంది. మా ఇంట్లో ఆడవాళ్లు రాత్రిపూట బయటికి వెళితే, వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేవరకూ నాకు కంటి మీద కునుకు రాదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారాయన. తాజాగా ఒక యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఆ యాడ్‌కి సంబంధించినదే. వెరైటీగా బాగుంది కదూ! -
నేను నిరపరాధిని: సీఎం రావత్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. లంచం కేసు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల స్థానిక దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషినని అందులో పేర్కొన్నారు. ప్రజలు తనకు అండగా నిలవాలని కూడా అభ్యర్థించారు. స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఎదుట హాజరు కావడానికి ముందురోజు ఉత్తరాఖండ్ సమాచార శాఖ ఈ ప్రకటన జారీచేసింది. తనను కుట్రపూరితంగా ఇరికించారని ప్రకటనలో రావత్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి ప్రకటన ఇచ్చిన రావత్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. అయితే సీఎం సందేశాన్నే ప్రకటన రూపంలో ఇచ్చామని సమాచార శాఖ డైరెక్టర్ వినోద్ శర్మ తెలిపారు. -
ఈ ప్రకటన పోలే.. అదిరిపోలే!
వ్యాపారరంగంలో ప్రకటనలకు ఉన్న ప్రాధాన్యం సాధారణమైంది కాదు. దీనికి ఎయిర్ టెల్ 4జీ ప్రకటన ఓ ఉదాహరణ. తమ రంగంలో సమీప ప్రత్యర్థులను ఢీకొంటూ లౌక్యంగా ముందుకు సాగడం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇచ్చిన ప్రకటన అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. బీయండబ్ల్యూ 100వ వార్షికోత్సవం సందర్భంగా బెంజ్ విడుదల చేసిన ఒక కూల్ ప్రకటన కంపెనీ మార్కెటింగ్ చతురతకు అద్దం పట్టింది. లగ్జరీ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, బీయండబ్ల్యూ టాప్ పోజిషన్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 100 వార్షికోత్సవం సందర్భంగా బీయండబ్ల్యూను అభినందిస్తూ.. అదే సందర్భంగా తాము 130 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని కూల్ గా చెప్పింది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా.. మరో మాటలో చెప్పాలంటే .. మీకంటే మేం 30 ఏళ్లు సీనియర్ బాసూ.. అని చెప్పకనే చెబుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలంటూ భుజం తట్టినట్టుగా ఉంది. అదీ సంగతి.. పోలే.. అదిరిపోలే.. బీయండబ్ల్యూ ఉద్యోగులను తమ మ్యూజియం సందర్శనకు ఆహ్వానించింది మెర్సిడెస్. మార్చి 8 నుంచి 13 వరకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉద్యోగులు బాగానే ఎంజాయ్ చేయడంతోపాటుగా బెంజ్ ఇచ్చిన నోరూరించే విందును ఆరగించారు. ఆటోమొబైల్ చరిత్రలో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, సమకాలీన వినూత్న పరిణామాల విశేషాలతో కూడిన మ్యూజియాన్ని పదేళ్ల క్రితం ప్రారంభించినట్టు మెర్సిడెస్ బెంజ్ ప్రెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ రాల్ఫ్ గ్లాసర్ చెప్పారు. 100 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీయండబ్ల్యూకు అభినందనలు తెలిపామన్నారు. Happy 100th birthday, @BMW! Here’s to another 100 years of competition.https://t.co/4XE7Emh4lM — Mercedes-Benz (@MercedesBenz) March 7, 2016 -
ఆదిలోనే అపశృతి
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజ్యాంగ దినోత్సవం సంబరాల్లో ఆదిలోనే అపశృతి దొర్లింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం వివిధ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనలో ఘోరమైన తప్పు దొర్లింది. గురువారం ప్రముఖ దినప్రతికల్లో ప్రచురితమైన ఈ ప్రకటన పీఠికలో 'సామ్యవాద, లౌకిక' అనే పదాలను తొలగించడం వివాదం రేపింది. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పింది. ఘోరమైన తప్పు దొర్లిందని, విచారణకు అదేశించామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తక్షణ విచారణకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 26న అధికారులు రాజ్యాంగ పీఠికా ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
కార్పోరేట్ కంపెనీలకు పవన్ కళ్యాణ్ ఝలక్!
అందరిది ఒక దారి అయితే తన దారి సెపరేట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. కొందరు హీరోలు కేరీర్ ఊపులో ఉండగానే.. దీపం ఉండగానే చక్కదిద్దుకుందామనే రీతిలో సినిమాలతోపాటు అదనపు ఆదాయం కోసం వెంపర్లాడుతుంటారు. స్టార్ హోదా ను ఆసరాగా చేసుకుని.. హీరోలు సినిమాలతోపాటు అడ్వర్టైజింగ్ రంగంలో డబ్బులు దండిగా సంపాదించుకోవాలనుకుంటారు. అయితే ఇతర హీరోలకు భిన్నంగా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పవన్ కళ్యాణ్ అడ్వర్జైజింగ్ రంగంలో వచ్చిన విలువైన కాంట్రాక్టులకు నో చెబుతున్నారట. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్పోరేట్ కంపెనీలు గత కొద్దికాలంగా పవర్ స్టార్ ను ప్రస్తన్నం చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాయని తెలిసింది. అత్తారింటికి దారేది చిత్ర విజయంతో పవన్ రేంజ్ ఇంకా పెరిగిపోవడంతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని కంపెనీలు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు గండికొట్టారు. ప్రోడక్ట్ ప్రమోషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ మొత్తంలో డబ్బు ముట్టచెబుతామని చేసిన ఆఫర్ లను పవన్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వరుస రికార్డు విజయాలతో ఊపు మీద ఉన్న పవర్ స్టార్ ను, ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుందానే కార్పోరేట్ కంపెనీల ఆలోచనలకు పవర్ స్టార్ ఝలక్ ఇచ్చారు. విలువలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువ అంటున్నారు సినీ విమర్శకులు. కష్టాల్లో ఉన్న వాళ్లను చేరదీసి ఆదుకుంటారని..ప్రచార ఆర్భాటం లేకుండా తాను చేయాలనుకునే సహాయం చేస్తారని పరిశ్రమలో టాక్. ఇవన్ని క్వాలీటీలు ఉన్నాయి కాబట్టే తెలుగు చలన చిత్రసీమలో పవన్ కు అభిమానులు ఎక్కువ. ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండి.. వినియోగదారులను ఎలాంటి మోసానికి గురి చేయకుండా ఉంటేనే తప్ప తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అని చెప్పడం కంపెనీలకు దిమ్మతిరిగింది. ఫ్యాన్స్ కోసం, ప్రజల కోసం తాను తప్పుడు ప్రకటనలు చేయనని కంపెనీలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. కోట్ల రూపాయలు కాదని విలువలకు కట్టుబడి ఉండేవారు అసలు కనిపించని ఈ రోజుల్లో పవన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను పక్కన పెట్టి హీరోలు యాడ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అనుసరిస్తున్న దారి అందర్ని ఆకట్టుకుంటోంది. -
ఇంటర్నెట్ సేద్యానికి క్రోమ్ సాయం!
ఇంటర్నెట్కు, పీసీకి అనుసంధానమైంది గూగుల్ క్రోమ్. పీసీ నుంచి వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి తాళంచెవి గూగుల్‌క్రోమ్. ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లను చిత్తు చేస్తూ కంప్యూటర్లలో ఐకాన్ రూపంలో కొలువైనది గూగుల్‌క్రోమ్. ఈ గూగుల్ క్రోమ్‌తో చేయగల గమ్మత్తులెన్నో... క్లిక్ చేసి.. కావాల్సిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసుకోవడమేగాక ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను సులభతరం చేసే, సరదాను తెచ్చే సదుపాయాలనెన్నో అందుబాటులో ఉంచింది క్రోమ్. అలాంటి వాటిలో కొన్ని... ఇవన్నీ క్రోమ్స్టోర్లో లభిస్తాయి... యాడ్ ఫ్రీ ఇంటర్నెట్ సర్ఫింగ్‌లో తేలియాడాలనుందా? వెబ్‌పేజ్ ఓపెన్ చేయగానే హాయ్ అంటూ వచ్చే అడ్వర్టైజ్మెంట్లతో విసుగొచ్చిందా? యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో ప్రత్యక్షమయ్యే యాడ్ అవాంతరాలను నిరోధించాలనుందా? అయితే మీ గూగుల్‌క్రోమ్ బ్రౌజర్‌కు ‘యాడ్‌బ్లాక్’ను యాడ్ చేయండి. ఇది మీ నెట్బ్రౌజింగ్లో యాడ్లు లేకుండా చూస్తుంది. క్రోమ్‌లో మోస్ట్‌పాపులర్ ఎక్స్టెన్షన్ ఇది. దాదాపు రెండుకోట్ల మంది పీసీ ఓనర్లు ఈ పొడిగింపు సేవను ఇన్స్టాల్ చేసుకున్నట్టు క్రోమ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా ఉచితం. స్క్రీన్‌షాట్స్ కోసం... స్క్రీన్‌షాట్ తీసుకోవడం అంటే అది అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించే వారికే పరిమితమైన సదుపాయం కాదు. పాతతరం విండోస్ ఓఎస్‌పై గూగుల్క్రోమ్తో కూడా ఈ గమ్మత్తు చేయవచ్చు. అందుకోసం చేయాల్సిందల్లా ‘ఆసమ్ స్క్రీన్‌షాట్స్’ ఎక్స్‌టెన్షన్‌ను జోడించుకోవడమే. వెబ్‌పేజ్‌ను ఇమేజ్ రూపంలోకి మార్చుకోవడానికి ఈ ఎక్స్టెన్షన్ ఉపయోగపడుతుంది. మొత్తం పేజ్ మాత్రమే కాకుండా వృత్త, చతుర స్ర, దీర్ఘ చతురస్రాకారాల్లో కూడా స్క్రీన్షాట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్‌షాట్ ఇమేజ్‌లు పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ అవుతాయి. నాణ్యమైన ఇంగ్లిష్ రాత... ‘గ్రేట్ ఇంగ్లిష్ న్యాచురలీ’ అనే ట్యాగ్‌లైన్‌తో గ్రామర్ చెక్కర్, టెక్ట్స్రీడర్, పర్సనల్ ట్రైనర్, సెంటెన్స్ రిఫ్రెషర్‌గా ఉపయోగపడుతుంది ‘జింజర్’ ఎక్స్టెన్షన్. మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో ఎంత వీక్ అయినా... స్పెల్లింగ్ మిస్టేక్ట్స్లో ఎంత పీక్అయినా... మీతో చక్కటి ఇంగ్లిష్ కంపోజ్ చేయించడం తన బాధ్యతగా తీసుకుంటుంది ఈ ఎక్స్టెన్షన్. పదాలను కాక వాక్యాలనే సజెషన్‌గా ఇస్తుంది. www.gingersoftware.com నుంచి ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్యాబ్‌ల వ్యూ కోసం... కంప్యూటర్ అంటే ఒక మిషన్. దానిమీద ఎంత పనిపెట్టినా అది చేయాల్సిందే..అనే భావనతో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసి బాదే వారు చాలా మందే ఉంటారు. ఇలా బాదే ఉద్దేశమున్న వారు గూగుల్ క్రోమ్నే ఎంచుకుంటారు. ఎందుకంటే ఇది గూగుల్ క్రోమ్‌తో మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. ఒక్క గూగుల్ క్రోమ్విండోపై 20కి పైగా ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని పనిచేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఎక్కువ ట్యాబ్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అవకాశమిస్తున్న క్రోమ్ బ్రౌజరే... వాటి ప్రివ్యూ విషయంలో ‘టూ మెనీట్యాబ్స్’ అనే ఎక్స్‌టెన్షన్‌ను తీసుకొచ్చింది. ఓపెన్‌లో ఉన్న ట్యాబ్స్ విషయంలో విహంగవీక్షణానికి అవకాశమిస్తోంది ఇది. ట్రాన్స్‌లేషన్‌కు కూడా... ఇంటర్నెట్ బ్రౌజింగ్ విషయంలో గూగుల్ ఎన్నో సదుపాయాలను తెచ్చి పెట్టింది. అవి కేవలం సౌకర్యవంతమైనవే కాదు, విశ్వసనీయమైనవి కూడా. అయితే ట్రాన్స్లేషన్ విషయంలోనే గూగుల్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించలేం. వందశాతం కచ్చితమైన అనువాదాన్ని అందించలేకపోతోంది గూగుల్. ఇప్పటికే గూగుల్ హోమ్‌పేజ్‌లో ట్రాన్స్లేషన్ ఉంది. ఇది గాక ‘ఇన్స్టంట్ ట్రాన్స్‌లేట్’ క్రోమ్ ద్వారా లభించే ఎక్స్టెన్షన్. ఇంగ్లిష్ నుంచి ప్రాంతీయ భాషల్లోకి, ప్రాంతీయ భాషల మధ్య అనువాదంలో ఈ ఎక్స్టెన్షన్ కూడా ఫెయిల్యూర్. అయినా.. అంతర్జాతీయ భాషల మధ్య ట్రాన్స్లేషన్ వరకూ దీన్ని నమ్మవచ్చునేమో! ఫొటో ఎడిటింగ్ కోసం... ఇంటర్నెట్ బ్రౌజింగ్, వెబ్ సంబంధిత వ్యవహారాల్లోనే కాదు.. కొన్ని ఆఫ్‌లైన్ సేవలను కూడా అందిస్తోంది గూగుల్ క్రోమ్. ఫొటోగ్రఫీకి సంబంధించి రిచ్ అండ్ ఆర్టిస్టిక్ ఫీల్ తీసుకువచ్చే ‘బీ ఫంకీ’ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులో పెట్టింది. సాధారణ ఫొటోగ్రఫీ ఎడిటింగ్స్ అయిన బ్యాడ్‌లైటింగ్, డిజిటల్ నాయిస్ వంటి వాటిని ఒకే క్లిక్‌తో సవరించుకోవచ్చు. కట్, రొటేట్, అడ్జెస్ట్ మెంట్‌తో పాటు 190 రకాల ఫొటో ఎఫెక్ట్‌లను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సైట్‌లోని సమాచారాన్ని బుక్‌గా మారుస్తుంది... వెబ్ బ్రౌజింగ్ సమయంలో సైట్‌లోని ఇన్ఫర్మేషన్ అంతా చదివే అవకాశం ఉండదు, చదవాలనుకునే సమయంలో ఇంటర్నెట్ ఉండదు.. అంటూ ఫీల్ అయ్యే వారికి ఒక మంచి సదుపాయం డాట్ ఇ పబ్. ఒక వెబ్ పేజ్‌లోని సమాచారాన్ని ఆన్లైన్ కనెక్షన్ ఉన్నప్పుడే కాకుండా, సిస్టమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎక్స్టెన్షన్. వెబ్‌పేజ్‌ను డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకుని, సేవ్ చేసుకుంటే... ఈ అప్లికేషన్ ఆ టెక్ట్స్ డాటాను ఒక ఇ-బుక్‌గా మార్చేస్తుంది. దాచే యొచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు... ఇంటర్నెట్ను సరదాగా ఉపయోగిస్తాం, సీరియస్‌గా ఉపయోగిస్తుంటాం, ‘రహస్యం’గా ఉపయోగిస్తుంటాం.. ప్రొఫెషనల్‌గా కావొచ్చు, పర్సనల్‌గా కావొచ్చు.. కొన్నిసార్లు పక్కవారు మన పీసీ దగ్గరకు వచ్చినప్పుడో, హఠాత్తుగా బ్రౌజర్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ‘ప్యానిక్ బటన్’ ఉపయోగకరం. అనుకోకుండా వచ్చే డిస్ట్రబెన్స్‌తో మొత్తం ట్యాబ్‌లన్నింటినీ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ప్యానిక్ బటన్ మీద క్లిక్ చేస్తే అవన్నీ ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. ట్యాబ్‌లన్నీ ఒక బుక్‌మార్క్‌గా సేవ్ అయ్యుంటాయి. అవసరైమైనప్పుడు తిరిగి వాటన్నింటినీ ఒకేసారి రీస్టోర్ చేసుకోవచ్చు. వీడియోలను కన్వర్ట్ చేయొచ్చు... యూట్యూబ్ నుంచి స్మార్ట్‌ఫోన్, ఐఫోన్లకు తగిన ఫార్మాట్లో వీడియోలను కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ టూల్. ఒకే క్లిక్‌తో వీడియోను ఎమ్పీ3, ఎమ్పీ4, ఏవీ1, డబ్ల్యూఎమ్వీ, త్రీజీపీ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. http://www.freemake.com/free_youtube_converter ద్వారా ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్మెంట్ లుక్ కోసం... కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేయగానే అందులో అనవసరమైన యాడ్స్ లేకుండా.. ఫ్రెష్ అట్మాస్పియర్ కలిగించేలా డేట్, టైమ్, వెదర్ తదితర సమాచారాన్ని ఇచ్చే వెబ్‌పేజ్ డిస్ప్లే అవ్వడానికి ‘కరెంట్లీ’ ఎక్స్టెన్షన్ ఉపయోగపడుతుంది. ఇష్టమైన పేజ్‌ల డిస్ప్లే కోసం... ఇది కూడా కొత్త ట్యాబ్‌ను క్లిక్చేసినప్పుడు డిస్ప్లే అయ్యే రిఫ్రెష్మెంట్పేజ్. మీరు తరచూ క్లిక్ చేసే పేజ్‌లు, ఉపయోగించే అప్లికేషన్లను డిస్ప్లే చేస్తుంది ఈ ఎక్స్టెన్షన్. వాయిస్ కమాండ్స్ హైలెట్... మీరు వేరే పనిలో ఉన్నప్పుడు మీ మెయిల్‌కు వచ్చే మెయిల్స్ సారాంశాలను చదివి వినిపిస్తాయి. గూగుల్ క్రోమ్‌కు ఇటువంటి ఎక్స్టెన్షన్స్ లభిస్తాయి. ఇంకా వాయిస్‌ను రికగ్నైజ్ చేసి టైప్ చేసే ఎక్స్టెన్షన్లున్నాయి. ఇన్స్టలేషన్ చాలా సులభతరం... ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం కష్టమూ కాదు, వాటిని కొనుక్కోవాలనే భయమూ లేదు. వీటిని ఒకే క్లిక్‌తో యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సేద్యాన్ని సులభతరంగా, సౌకర్యవంతంగా చేయొచ్చు! - జీవన్ రెడ్డి.బి