
ఎప్పుడూ నవ్వుల వెలుగులు చిమ్మే ఆ ఇంటిలో చీకట్లు అలముకున్నాయి. బిడ్డే ప్రాణంగా బతికిన తల్లిదండ్రులు ఆ పసిబిడ్డ ప్రాణం కోసం పోరాడుతుంటే నిస్సహాయులుగా కన్నీరు కారుస్తున్నారు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 21 నెలల ఆచిన్నారి వీర్ సవార్కర్ సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.
నేను ఎప్పుడు టీవీలో పాటలు పెట్టిన మా అబ్బాయి వీర్ ఎంతో ఆనందంతో ఎగురుతూ గంతులు వేసేవాడు. అతని నవ్వులు మా చిన్న ఇంటిలో నవ్వులు నింపాయి. నేను నా భర్త పరాగ్ తన అల్లరిని చూస్తూ మురిసిపోయే వాళ్లం. తను అప్పుడప్పుడే తన తీయని గొంతుతో అమ్మ, నాన్న అని పిలవడం మొదలు పెట్టాడు. కానీ కొన్ని రోజుల తరువాత ఏమైందో తెలియదు కానీ తను పాటలు పెట్టిన డాన్స్ చేయడం, ఆనందంతో చప్పట్లు కొట్టడం ఆపేశాడు. ఇంతకు ముందులా చురుకుగా ఉండటం లేదు. ఏం తినడానికి ఇష్టపడటం లేదు. బొమ్మలతో ఆడుకుంటాడేమో అని ప్రయత్నాలు చేసినా తను మాత్రం వాటి విషయంలో కూడా స్పందించలేదు. నేను బలవంతంగా తనకి తినిపించడానికి ప్రయత్నిస్తే ఏడ్చేవాడు.
తను అలా ఎందుకు చేస్తున్నాడో తన పరిస్థితి ఏంటే మాకు అర్థం అయ్యేది కాదు. మేం తనని దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లాం. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లే స్థోమత మాకు లేదు. అన్ని చెక్ అప్‌లు చేసిన తరువాత ఆ డాక్టర్ పిల్లలు కొన్నిసార్లు ఏ ప్రాబ్లెమ్ లేకుండానే అలా ప్రవర్తిస్తారని దాంట్లో ఆందోళన చెందాల్సిన పని ఏం లేదని చెప్పారు. ఆ మాటలు విన్నతరువాత మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం.
ఇది ఇలా ఉండగా గత నెల మా బాబుకు చాలా జ్వరం వచ్చింది. ఒక వారం పాటు తనని హాస్పటల్‌లో చేర్పించాము. కానీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. అప్పడు బాబుకు కొన్ని పరీక్షలు చేయాలని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు రిపోర్టులు వచ్చాయని చెప్పాగనే నా గుండెల్లో కంగారు మొదలైంది. డాక్టర్ విచారకరమైన ముఖం నన్ను మరింత భయపెట్టింది. (కెటో) వీర్ ప్రమాదకరమైన యక్యూట్ బీ లింపోబ్లాస్టిక్ లుకేమియా (ఒక రకమైన బ్లడ్, బోన్ మ్యారో కాన్సర్) తో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్పారు. అప్పుడు క్యాన్సర్ అనే పదం నా చెవుల్లో మారుమ్రోగింది. తను మొదటిసారి జబ్బు పడినప్పుడే నేను ఎక్కువ జాగ్రత్లు తీసుకొని ఉండల్సిందని నన్ను నేను చాలా నిందించుకున్నాను. పరాగ్ నన్ను ఓదార్చాడు. మన బాబుకు ఏం కాదు అంటూ నాలో ధైర్యాన్ని నింపాడు. వెంటనే వీర్‌కు ట్రీట్‌మెంట్ మొదలు పెట్టమని డాక్టర్‌ను కోరాడు.
వీర్‌ను హాస్పటల్‌లో చేర్పించాం. తనకు ట్రీట్‌మెంట్ మొదలు పెట్టారు. ఆనందంతో చప్పట్లు కొట్టే తన చేతులు ఇంజక్షన్‌తో కదలకుండా ఉండిపోయాయి. తన కేరింతలు ఏడుపుగా మారిపోయాయి. (కెటో) తమ పిల్లలు ఇలా బాధపడటం చూడటం కంటే తల్లిదండ్రులకు మరో నరకం ఉండదు. తను అమ్మ అని పిలిచి చాలా రోజులు అయిపోయింది. నేను పాటలు పెట్టి తన దృష్టిని మరల్చాలి అనుకున్న అవి తన ఏడుపును ఆపలేకపోయాయి.
వీర్‌కు మూడు సంవత్సరాల పాటు ట్రీట్‌మెంట్‌తో పాటు కీమోథెరపీ, బ్లడ్ ట్రాన్స్‌ఫూజన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దీని కోసం 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగలేదు. పరాగ్ మొదటిసారి ఏడవడం నేను చూశాను. ఇన్ని రోజులు ఎంతో ధైర్యంగా ఉన్న తను వీర్ ఆరోగ్య పరిస్థితి దిగజారడం చూసి తనని తాను నిందించుకోవడం మొదలుపెట్టాడు. (కెటో)
పరాగ్ ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తన సంపాదన మా అవసరాలకు మాత్రమే సరిపోతుంది. మేం దాచిపెట్టుకున్న కొంత మొత్తం కూడా వీర్ ట్రీట్‌మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. వీర్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి వీర్‌ను కాపాడండి.
కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే.
Fundraising for cancer is a way to support medical treatment cost. Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments.