దుకాణమంతా దోచేయండి | Australian Store Owner Asks Shoppers To Rob It | Sakshi
Sakshi News home page

దుకాణమంతా దోచేయండి

Published Sun, Dec 29 2024 6:38 AM | Last Updated on Sun, Dec 29 2024 6:38 AM

Australian Store Owner Asks Shoppers To Rob It

సరకు మొత్తం ఉచితం 

ఆస్ట్రేలియాలో వింత ఆఫర్‌ 

పెర్త్‌: ఆషాడం సేల్‌. సగం ధరకే పట్టుచీర. బట్టల దుకాణాల్లో తరచూ కనిపించే ప్రకటన ఇది. ఇక జనరిక్‌ మందుల దుకాణాల్లో 70 శాతం, 80 శాతం డిస్కౌంట్‌ బోర్డులను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా 100 శాతం డిస్కౌంట్‌. అంటే ఉచితంగా పట్టుకెళ్లండి అనే షాప్‌ మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి దుస్తుల దుకాణం కొద్దిసేపు తెరచి ఉంచితే మరు నిమిషంలో సరుకంతా మటుమాయమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. 

పెర్త్‌ నగరంలో స్ట్రీట్‌ఎక్స్‌ అనే దుస్తుల షోరూమ్‌ ఉంది. దాని యజమాని డేనియల్‌ బ్రాడ్‌షాకు కొత్త ఆలోచన వచ్చింది. ‘‘టీ–షర్ట్‌లను షాప్‌లో సిద్ధంగా ఉంచుతా. దోచేయండి’’అని యువతకు మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. అంతే ఇక. టీ–షర్ట్‌లను పట్టుకెళ్లేందుకు యువత పోటెత్తింది. గురువారం ఉదయం దుకాణం షట్టర్‌ పైకెత్తగానే యువతీయువకులు పరుగుపరుగున లోపలికి దూరేసి దొరికింది పట్టుకెళ్లారు. ఎగబడి కలబడి టీ–షర్ట్‌లను ఎగరేసుకుపోయారు. 

తొక్కిసలాటలో దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా ఒక యువకుడు హెల్మెట్, మోకాళ్లు, మోచేతులకు ప్యాడ్లు ధరించిమరీ జనంలోకి దూకాడు. తోపులాటలో చిన్నపాటి గీసుకుపోవడం లాంటి దెబ్బలు తప్ప చెప్పుకోదగ్గ, ఆస్పత్రిలో చేరేంత స్థాయి గాయాలు ఎవరికీ కాలేదు. గతంలో సైతం షాప్‌ యజమాని ఒక భారీ ట్రక్కు నిండా దుస్తులు ఇలాగే ఉచితంగా దోచేసే ఆఫర్‌ ఇచ్చాడని అక్కడికొచి్చన ఒకావిడ చెప్పింది. గురువారం దుకాణంలో దాదాపు 400 టీ–షర్ట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement