Clothing showroom
-
ఆ షాపులపై రంగు పడింది
భూదాన్ పోచంపల్లి: పేటెంట్ హక్కు కలిగి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి విక్రయిస్తున్న పలు వస్త్ర దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 8న సాక్షి దినపత్రికలో ‘ఇక్కత్‌కు ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 12 చేనేత వస్త్రాల షోరూంలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అక్కడి షాపుల్లో విక్రయిస్తున్న ఇక్కత్ ప్రింటెడ్, పవర్‌లూమ్‌లపై తయారైన వస్త్రాలను సీజ్ చేసి సంబంధిత షాపు యజమానులకు నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. దినపత్రికలలో వచ్చిన కథనానికి స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోచంపల్లిలో సీజ్ చేసిన వస్త్రాలను చెన్త్నెలోని ల్యాబ్టెస్టింగ్కు పంపిస్తామని, ప్రింటెడ్ వస్త్రాలు అని తేలితే నిందితులు స్థానికులైతే కేసు నమోదు చేస్తామని, లేదా ఇతర రాష్ట్రాలలో తయారైనవిగా తేలితే అక్కడి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. హ్యాండ్లూమ్ మార్కు తప్పనిసరి స్వచ్ఛతకు నిదర్శనమైన హ్యాండ్లూమ్ మార్కు, సిల్క్మార్క్తో పాటు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ట్యాగ్ చేసిన చేనేత వస్త్రాలను మాత్రమే పోచంపల్లి వస్త్ర వ్యాపారులు అమ్మాలని వెంకటేశం కోరారు. దాడుల్లో జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్, డీఓలు ప్రసాద్, సంధ్యారాణి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: లాజ్పత్నగర్లోని సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్లాత్ షోరూంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 16 ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి! పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు !
-
ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు !
విఠల్ షోరూం నిర్వాహకుల అరెస్ట్ గదిలో దుస్తులు మార్చుకుంటుండగా వైర్‌ను గుర్తించిన యువతి బాధితుల సమాచారంతో వెలుగులోకి బెంగళూరు : బట్టల షోరూంలోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు అమర్చి మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డు చేసిన ముగ్గురు కామాంధులను ఇక్కడి బసవనగుడి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ బీఎస్. లోకేష్ సోమవారం తెలిపిన సమాచారం మేరకు.. సోదరులు సందీప్, సురేష్ అస్తేకర్, సునీల్ అస్తేకర్ గాంధీబజార్‌లోని డీవీజీ రోడ్డులో విఠల్ డ్రస్సెస్ పేరుతో షోరూంను నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాష అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఓ మహిళ ఆ షాపునకు వెళ్లింది. ట్రయర్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమెకు ఓ చిన్న వైర్ కన్పించింది. పరిశీలించగా ఆ రూంలో కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించి.. విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. అక్కడ ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని వారు షాపు యజమానులను ప్రశ్నించగా.. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాపు నుంచి పంపించారు. శనివారం ఆ దంపతులు వారి బంధువులను పిలుచుకుని వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బట్టల షోరూం యజమానులు రెచ్చిపోయి ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అని దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్, సురేష్ అస్తేకర్, బాషను అరెస్ట్ చేశారు. సునీల్ అస్తేకర్ పరారీలో ఉన్నాడు. ఆ ముగ్గురిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, బెయిల్ మీద బయటకు వచ్చారని పోలీసులు సోమవారం తెలిపారు.