
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
అరగంటకు పైగా షాపులోనే..
దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా.. ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.
సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..
నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.
నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారు
దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు. ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment