Daniel
-
మయామి ఓపెన్ చాంపియన్ కోలిన్స్
ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్ స్టీఫెన్స్ తర్వాత మయామి ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆరో అమెరికన్ ప్లేయర్‌గా కోలిన్స్ గుర్తింపు పొందింది. -
ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన నటుడు
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ చాలామంది పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రమే గుప్తదానాలు చేస్తుంటారు. అలాంటివారిలో నటుడు డేనియల్ ఒకరు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా చేయి చాచి అడిగితే చాలు క్షణం ఆలోచించకుండా సాయం చేసేవారు. తను కూడబెట్టిన డబ్బునంతా ఓ గుడి కట్టేందుకు ఉపయోగించారు. తనకంటూ పెద్దగా ఆస్తులు వెనకేసుకోలేదు. రియల్ హీరో.. సినిమాల్లో విలన్‌గా నటించినా నిజ జీవితంలో మాత్రం హీరోగా బతికారు. ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన వ్యక్తి శుక్రవారం (మార్చి 29) గుండెపోటుతో కన్నుమూశారు. అతడి మరణం తమిళ చిత్రపరిశ్రమను కుదిపేసింది. నటుడి కెరీర్ విషయానికి వస్తే.. చిట్టి అనే సీరియల్‌తో తన నటప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. స్క్రీన్‌పై విలనిజం పండించే ఈయనకు మనసులో ఎప్పుడూ ఓ కోరిక మెదులుతూ ఉండేది. తనకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాడని అంటుంటారు. 2014లో తమిళంలో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ కోరిక తీరకుండానే.. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 'స్క్రిప్ట్ రెడీ అయింది. దీన్ని డైరెక్ట్ చేయడంతోపాటు ఓ ముఖ్య పాత్రలో నేను నటించాలనుకుంటున్నాను. వీలు కుదిరితే తమిళంతోపాటు కన్నడ భాషలోనూ ఒకేసారి రూపొందించాలని చూస్తున్నాను. ఈ మూవీకి నా స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు' అని చెప్పారు. ఎందుకోగానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. డేనియల్.. సాంబ, ఘర్షణ,చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. చదవండి: ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత -
డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో ఆయన మరణిచారు. అనంతరం డేనియల్ నేత్రాలు ఒక ట్రస్ట్‌కు దానం చేశారు. 48 ఏళ్లు పూర్తి అయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాధించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలురకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటంన్నిటిక సమాధానం ఆయన గతంలోనే పలు ఇంటర్వ్యూలలొ పంచుకున్నాడు. కుటుంబ నేపథ్యం డేనియల్ బాలాజీ తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి, ఆయన అమ్మగారు మాత్రం తమిళనాడుకు చెందిని వారు. డేనియల్ తండ్రి చెన్నైలో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అక్కడ హౌల్‌సేల్ క్లాత్ షోరూమ్స్ వారికి ఉన్నాయి. డేనియల్‌కు ఐదుగురు సోదరులతో పాటు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు అలా మెత్తం 11 మంది వారి కుటుంబ సభ్యులు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. తనకు 25 ఎళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పారట.. అందుకు కారణం తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్లు అయ్యాక వారి ఇబ్బందులు చూసి వద్దనుకున్నట్లు ఆయన చెప్పాడు. పెళ్లి తర్వాత, భార్యా, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని ఆయన చెప్పాడు. వారి కోసం డబ్బు కూడబెట్టాలి.. అందుకోసం ఒక్కోసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుంది.. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. సొంత డబ్బుతో గుడి నిర్మాణం చెన్నైలో కొట్టివాక్కం ప్రాంతంలో డేనియల్ ఉంటున్నారు. తన సొంత డబ్బుతో అక్కడ ఒక గుడిని ఆయన నిర్మించారు. ఆ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుందని ఆయన చెప్పారు. జాతర కోసం లక్షల్లో ప్రజలు వస్తారని తెలిపారు. 'సినిమా ద్వారా నేను కొంతమేరకు సంపాధించాను.. ఇప్పటికే తమిళ్,తెలుగు ప్రజల్లో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు మించి ఇంకేమీ వద్దు అనుకున్నాను. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ గుడి మొత్తం 4వేల చదరపు గజాలు ఉంది. ఒక రూమ్ మాదిరిగా ఉన్న ఈ గుడిని ఇప్పడు భారీగా నిర్మించాను. ఈ గుడి అంటే మా అమ్మకు కూడా ఎంతో నమ్మకం ఉంది. అందుకే నేను దీనిని ఎలాగైనా నిర్మించాలని కోరుకున్నాను.' అని గతంలో ఓ ఇంటర్వయూలో ఆయన చెప్పాడు. సినిమాల్లో నటించి వచ్చిన డబ్బంతా కూడా డేనియల్ ఆ గుడి కోసమే ఖర్చు చేశాడు. ఆలయ నిర్మాణ కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి. గుడి కోసం కేజీఎఫ్ యష్ సాయం డేనియల్ బాలాజీ కన్నడలో కూడా పలు సినిమాల్లో మెప్పించాడు. కేజీఎఫ్ యష్‌తో డేనియల్‌కు మంది స్నేహం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో యష్ గురించి డేనియల్ ఇలా అన్నారు. ' కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ ఉంది అందులో నటించాలని యష్ నన్ను కోరాడు. కానీ నేను ఆ సమయంలో అందుబాటులో లేను. దానికి ప్రధాన కారణం గుడి నిర్మాణ పనులే. ఆలయానికి సంబంధించి చాలా కీలకమైన పనులు ఉండటంతో నేను రాలేనని యష్‌కు చెప్పాను. రెండు రోజుల తర్వాత యష్ నాకు కొంత డబ్బు పంపాడు.. ఎందుకు అని నేను కాల్ చేసి మాట్లాడాను. గుడి నిర్మాణం కోసం తన వంతుగా ఇస్తున్నాను అన్నాడు. గుడి నిర్మాణం తర్వాత కూడా యష్ ఇక్కడికి వచ్చాడు. అని ఆయన చెప్పారు. డేనియల్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక్కోక్కటిగా ఇలా బయటకొస్తున్నాయి. డేనియల్ విలన్ కాదు.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. "அங்காள பரமேஸ்வரி அம்மனுக்கு கோயில் கட்டிய நடிகர் டேனியல் பாலாஜி காலமானார்" 😥😢💔#RIPDanielBalaji #DanielBalaji #OmShanthi pic.twitter.com/YN7SVdG1SA — Aadhi Shiva (@aadhi_shiva1718) March 29, 2024 -
డేనియల్ బాలాజీ మంచి మనసు.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’.. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలని తలచాడు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈమేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్ బాలాజీ నేత్రాలను అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు తోడ్పడుతున్నారు. డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేయడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు. తిరువాన్మియూర్లోని ఆయన నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో మందిని బతికేలా చేస్తున్న మంచి హృదయం ఉన్న డేనియల్ బాలాజీ అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. 👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు) View this post on Instagram A post shared by Indiaglitz Tamil (@indiaglitz_tamil) -
ప్రముఖ సైకాలజిస్ట్ డేనియల్ కానమన్ కన్నుమూత
న్యూజెర్సీ: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ (90) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కానమన్ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో కానమన్ జన్మించారు. -
Daniel Jackson: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు డేనియల్ జాక్సన్. ప్రస్తుతం ఇతడి వయసు పంతొమ్మిదేళ్లు. ఆస్ట్రేలియాలో పుట్టి, బ్రిటన్‌లో పెరిగిన డేనియల్ తన పద్నాలుగేళ్ల వయసులోనే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదెలా అని అవాక్కవుతున్నారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాలకు అధ్యక్షుడు కావడం సాధ్యం కాదని తెలిసిన ఈ బాల మేధావి ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఐదేళ్ల కిందట తన ఆరుగురు మిత్రులతో కలసి సెర్బియా–క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఆ రెండు దేశాలకూ చెందని ఖాళీ భూభాగాన్ని గుర్తించి, లేతనీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసుకుని, అక్కడ తన జెండా నాటేశాడు. జెండా నాటడానికి ముందే చాలా పరిశోధన సాగించి, ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికీ చెందనిదని తేల్చుకున్నాడు. ఈ దేశానికి ‘వెర్డిస్’గా నామకరణం చేసి, దానికి తనను తానే అధినేతగా ప్రకటించుకున్నాడు. దీని విస్తీర్ణం 0.2 చదరపు మైళ్లు–అంటే 128 ఎకరాలు మాత్రమే! ఈ లెక్కన వాటికన్ నగరం తర్వాత రెండో అతిచిన్న దేశం ఇదే! ప్రస్తుతం నాలుగువందల మంది ఉంటున్న ఈ చిరుదేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు పదిహేనువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇవి చదవండి: మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా? ఈ చిరుదేశాధినేత డేనియల్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరఫున అధికారికంగా విరాళం పంపడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకుంటున్నామని, దేశాన్ని పౌరులతో కళకళలాడేలా తీర్చిదిద్దాలనేదే తన కోరిక అని డేనియల్ చెబుతున్నాడు. అయితే, పొరుగునే ఉన్న క్రొయేషియాతో ఈ చిరుదేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రొయేషియా భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్డిస్ పౌరులను క్రొయేషియన్ పోలీసులు బందీలుగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, గత అక్టోబర్ 12న వెర్డిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న తమనందరినీ నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెట్టారని, క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగిస్తామని డేనియల్ చెప్పాడు. రానున్న ఐదేళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అన్నాడు. బయటి నుంచి తమ దేశానికి చేరుకోవాలంటే, క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే క్రొయేషియాతో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు. View this post on Instagram A post shared by Daniel Jackson (Данијел Џексон) (@danieljacksonvs) -
బోయిమ్, అవ్వాద్‌లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బరెన్‌బోయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటినాలో జని్మంచిన సంగీత కళాకారుడు బరెన్‌బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు. వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయు«దీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది. -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
ఇండియన్ సినిమాలు... ఫారిన్ విలన్లు!
భారతీయ కథలు ఇప్పుడు దేశీ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విదేశీ ఫైట్ మాస్టర్స్ ఇండియన్ సినిమాలకు ఫైట్స్ కంపో జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ ఆర్టిస్టులు కూడా అరంగేట్రం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించారు. అంతకుముందు అమీ జాక్సన్ వంటి తారలు కూడా వచ్చారు. ఇప్పుడు ఫారిన్ విలన్లు వస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చి న ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కమల్– శంకర్ కాంబోలోనే సెట్స్‌పై ఉన్న ఈ సీక్వెల్లో ముంబై బేస్డ్ బ్రిటిష్ యాక్టర్ బెనెడిక్ట్ గారెట్ ఓ కీ రోల్ చేశారు. ఆల్రెడీ ఆయన క్యారెక్టర్ తాలూకు షూటింగ్ కూడా పూర్తయింది. ‘‘ఇండియన్ 2’లో నా వంతు షూటింగ్‌ను పూర్తి చేశాను. అద్భుతమైన అనుభవం దక్కింది. ఈ సినిమా తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు బెనెడిక్ట్. కాగా ఈ చిత్రంలో బెనెడిక్ట్ది విలన్ రోల్ అనే ప్రచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక కోలీవుడ్‌లో సుమారు ఆరేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లి ఇంకా రిలీజ్‌కు నోచుకోని చిత్రం ‘ధృవనక్షత్రం’. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ఇది. గతంలో ఆగిపో యిన ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవలే మళ్లీ ఆరంభించారు. ‘ఇండియన్ 2’లో నటించిన బెనెడిక్ట్ గారెట్ ఈ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్ యాక్టర్ డేనియల్ కాల్టాగిరోన్ ఓ ప్రధాన పాత్రపో షిస్తున్నారు. ఆయనది ప్రతినాయకుడి పాత్ర అని కోలీవుడ్ టాక్. ఇక ‘తంగలాన్’ విడుదల తేదీపై త్వరలోనే సరైన స్పష్టత రానుంది. ఇలా... రానున్న రోజుల్లో మరికొందరు ఇంగ్లిష్ యాక్టర్స్ ఇండియన్ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. -
లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు. బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది... 1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది. ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్. పెడచెవిన వాస్తవాలు ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం. అధిగమించడం ఎలా..? పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం. తాజా అంశాలపై దృష్టి ‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు. నష్టాలకు కారణం పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు. ఏకపక్ష ధోరణి మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది. నష్టపోకూడదనే తత్వం ‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు. -
బెంగళూరు క్రికెటర్ డానియల్ సామ్స్‌కు పాజిటివ్
చెన్నై: ఐపీఎల్‌ను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్‌రౌండర్ డానియెల్ సామ్స్ పాజిటివ్‌గా తేలాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతను ఈనెల 3న భారత్‌కు వచ్చాడు. అప్పుడు చేసిన పరీక్షలో నెగెటివ్‌గా వచ్చింది. కానీ బుధవారం చేసిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఆర్సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. బుధవారం అతని నమూనాలను పరీక్షించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రేపు చెన్నై వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు తలపడుతుంది. -
ఆనందాన్ని దత్తత తీసుకున్నాం
‘‘సరిగ్గా ఏడాది క్రితం మా లైఫ్‌లోకి మరింత ఆనందాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ ఆనందం పేరే నిషా’’ అంటున్నారు సన్నీ లియోన్. ఆనందాన్ని అడాప్ట్ చేసుకోవడమేంటీ అనుకుంటున్నారా? గతేడాది జూలైలో సన్నీ లియోన్, ఆమె భర్త డానియల్ కలసి నిషా కౌర్‌ను దత్తత తీసుకున్నారు. నిషాని మా ఫ్యామిలీలో భాగం చేసుకొని ఏడాది అయిపోతోందంటూ ట్వీటర్లో తమ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు సన్నీ లియోన్. ‘‘ఒక సంవత్సరం క్రితం నిన్ను (నిషా) మాతో తీసుకురావడంతో మా లైఫ్‌ని మార్చేసుకున్నాం. ఈరోజు నీ ఫస్ట్ యానివర్శరీ. గడిచింది కేవలం ఒక్క సంవత్సరమే అయిందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అప్పుడే నీతో జీవితకాల పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా హార్ట్, సోల్లో నువ్వు భాగం అయిపోయావు. ప్రపంచంలోనే బ్యూటిఫుల్ గర్ల్ నువ్వు’’ అని నిషాని ఉద్దేశించి పేర్కొన్నారు సన్నీ లియోన్. -
ష్.. సైలెన్స్
కిషన్, డానియల్ హీరోలుగా, సుమ హీరోయిన్గా రంజిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ష్.. సైలెన్స్’. నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్‌పై వి. రమణబాబు, డానియల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ క్లాప్ ఇచ్చారు. వి.రమణబాబు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించాం. ఈ నెల ద్వితీయార్ధంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా. ఈ చిత్రం నాకు మంచి పేరు, గుర్తింపు ఇస్తుంది’’ అన్నారు కిషన్. ‘‘చక్కటి కథతో రూపొందుతోన్న చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాను. ఈ చిత్రబృందానికి మంచి పేరు తెస్తుంది’’ అన్నారు డానియల్. విక్కీ, బుల్లెట్ సుధాకర్, బళ్లారి బాబు తదితరులు నటి స్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఏ. విజయ్ కుమార్. -
ట్రంప్ సంసారంలో పోర్న్‌స్టార్ నిప్పులు పోసిందా?
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆయన సతీమణి మెలానియా ట్రంప్ అలకబూనారా? లేదా ఆయనను అసహ్యించుకుంటున్నారా? లేక ట్రంప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారా? ఇప్పుడు అమెరికాలోని సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ట్రంప్ ఎటు వెళ్లినా పక్కనే వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆమె ఇటీవల ట్రంప్‌కు దూరంగా ఉంటున్నారు. ఎంత అంటే ఈ మధ్యకాలంలోనే వైట్ హౌస్‌లోకి షిప్ట్ అయిన ఆమె తిరిగి వెళ్లిపోయారట. వాషింగ్టన్‌లోని ఓ హోటల్లో ఆమె ఉంటున్నారని సమాచారం. అందుకు ప్రధాన కారణం ట్రంప్‌కు ఉన్న అక్రమ సంబంధం అది కూడా ఓ పోర్న్‌స్టార్‌తో అని తెలియడంతో తనకు ఇబ్బందిగా అనిపించి ట్రంప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని మెలానియా హోటల్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల స్టార్మీ డానియెల్ అనే ఓ పోర్న్‌స్టార్‌తో ట్రంప్‌కు అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం ఆమె ఎక్కడా ప్రస్తావించకుండా ఉండేందుకు ట్రంప్ తరుపు న్యాయవాది ఒకరు ఆమెకు దాదాపు లక్షా 30వేల డాలర్లు ఇచ్చారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి ట్రంప్‌పై మెలానియాకు మరింత ఆగ్రహం వేసినట్లు సమాచారం. అందుకే, ఇటీవల ట్రంప్ ఎక్కడకు వెళుతున్నా పక్కన వెళ్లకుండా ఆఖరికి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కూడా ఆమె ట్రంప్‌తో రాకుండా దూరంగా ఉండిపోయారు. ఈ విషయం కూడా ట్రంప్‌పై మెలానియా ఆగ్రహంతో ఉన్నారనే వార్తను ధ్రువీకరిస్తున్నాయని నెటిజెన్లు అనుకుంటున్నారు. మరోపక్క, మెలానియా అధికారిక ప్రతినిధి మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు. ట్విటర్ ద్వారా మాత్రం అవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నారు. -
చిన్నారి ఫ్యాన్ కు స్టార్ హీరో ఫోన్
మన హీరోలు తెర మీదే కాదు.. తెర వెనుక కూడా హీరోలుగా నిరూపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ హీరో తన అభిమాని కోసం స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సీరీస్ గా పేరు తెచ్చుకున్న డెడ్ పూల్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ర్యాన్ రెనాల్డ్స్. అతీంద్రియ శక్తులతో తనను అంతమొందించాలనుకున్న వారి ఆట కట్టించే హీరో కథలో ఈ సినిమా తెరకెక్కింది. డెడ్ పూల్ సినిమా చూసిన ఐదేళ్ల చిన్నారి డేనియల్ డానింగ్.. ర్యాన్ రెనాల్డ్స్ కు వీరాభిమానిగా మారిపోయాడు. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న డేనియల్, మరికొద్ది రోజుల్లో మాత్రమే జీవిస్తాడని తెలియడంతో అతని అభిమాన హీరో స్పందించాడు. తన బుల్లి అభిమాని స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తాను ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను ఆ చిన్నారితో పంచుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని మాట ఇచ్చాడు. తన అభిమాన హీరో కాల్ చేయడానికి ముందు వరకు చాలా నీరసంగా కనిపించిన తన కొడుకు ర్యాన్ ఫోన్ చేసిన తరువాత చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని.. ఆ చిన్నారి తల్లి తెలిపారు. -
తెలుగు రాష్ట్రాలకు ఇజ్రాయెల్ వ్యవ‘సాయం’
⇒ రెండు ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు ⇒ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న ఇజ్రాయెల్ తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో సమావేశం కానున్నట్టు భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ తెలిపారు. బుధవారమిక్కడ ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, నీటిపారుదల, ఔషధాలు, ఆరోగ్యం వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలతో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రానికి 20 ఎకరాల దాకా అవసరం అవుతుందని ఇజ్రాయెల్ ఎంబసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాన్సుల్ కెన్ ఉదయ్ సాగర్ వెల్లడించారు. ‘ఏడాదిలో ఇవి కార్యరూపంలోకి రానున్నాయి. ప్రతి కేంద్రానికి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి కావొచ్చు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, టెక్నాలజీ, సేవల గురించి రైతులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు. భారత్‌లో ఇలాంటి కేంద్రాలు ప్రస్తుతం 14 ఉన్నాయి. 2020 నాటికి మరో 16 నెలకొల్పాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం’ అని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ మాట్లాడారు. -
వీసాల మోసగాళ్లపై హెచ్చార్సీకి ఫిర్యాదు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ హెచ్చార్సీ గడపతొక్కింది. సైనిక్‌పురికి చెందిన తాటిపత్రి డానియల్, షీబారాణి దంపతులు విదేశాల్లో ఉద్యోగం చూపుతామంటూ తన వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇర్ఫానా సుబానీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. గతంలో వీరిపై సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కూడా ఇదే విషయంలో కేసులున్నాయని ఆమె బుధవారం అందజేసిన ఫిర్యాదులో వివరించింది. -
ఆయనడిగితే రెడీ!
‘‘నా భర్త డేనియల్ అడగాలే కానీ ఆయన సినిమాలో ఏ పాత్రయినా చేస్తా’’ అంటున్నారు శృంగార తార సన్నీలియోన్. ఆమె నటించిన ‘కుఛ్ కుఛ్ లోచా హై’, ‘ఏక్ పహేలీ లీలా’ చిత్రాలలో భర్త డేనియల్ వెబర్ కూడా తళుక్కున మెరిశారు. ఇక, ఇప్పుడు ‘డేంజర్ హస్న్’ అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. దీని గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. డేనియల్ కూడా ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఈ ‘సినిమాలో ఏదైనా పాత్రలో మీరు కూడా నటిస్తారా’ అని అడుగుతున్నారు. నాకూ నటించాలనే ఉంది, మా వారు అడిగితే ఏం చేయడానికైనా రెడీ’’ అని చెప్పారు. -
చెట్టు.. కనికట్టు..
గాల్లో వేలాడుతున్నట్లు ఉన్న చెట్టును చూశారా.. ఇది విఠలాచార్య సినిమా కాదు.. మేజిక్ అంతకన్నా కాదు. జర్మనీలోని పాట్స్డామ్కు చెందిన గ్రాఫిక్ డిజైనర్లు డానియెల్, మారియోలు చేసిన కనికట్టు. ఇంతకీ వారిదెలా చేశారంటే.. ముందుగా ఓ చెట్టును ఎంచుకుని.. దానికి మధ్యలో ప్లాస్టిక్ షీట్ ను చుట్టేశారు. తర్వాత అక్కడి బ్యాక్‌గ్రౌండ్‌ను ప్రతిబింబించేలా పెయింట్‌ను స్ప్రే చేశారు. అంతే.. యూట్యూ బ్లో ఈ వీడియోను తెగ చూస్తున్నారట.