ట్రంప్‌ సంసారంలో పోర్న్‌స్టార్‌ నిప్పులు పోసిందా? | Melania ditches White House for hotel over shame | Sakshi
Sakshi News home page

పోర్న్‌స్టార్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌పై కోపంతో హోటల్‌కు భార్య

Jan 27 2018 6:15 PM | Updated on Aug 25 2018 7:52 PM

Melania ditches White House for hotel over shame - Sakshi

మెలానియా ట్రంప్‌ (ట్రంప్‌ భార్య), స్టార్మీ డానియెల్‌ (పోర్న్‌ స్టార్‌), డోనాల్డ్‌ ట్రంప్‌ (అమెరికా అధ్యక్షుడు)

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ అలకబూనారా? లేదా ఆయనను అసహ్యించుకుంటున్నారా? లేక ట్రంప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారా? ఇప్పుడు అమెరికాలోని సోషల్‌ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ట్రంప్‌ ఎటు వెళ్లినా పక్కనే వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆమె ఇటీవల ట్రంప్‌కు దూరంగా ఉంటున్నారు. ఎంత అంటే ఈ మధ్యకాలంలోనే వైట్‌ హౌస్‌లోకి షిప్ట్‌ అయిన ఆమె తిరిగి వెళ్లిపోయారట. వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో ఆమె ఉంటున్నారని సమాచారం. అందుకు ప్రధాన కారణం ట్రంప్‌కు ఉన్న అక్రమ సంబంధం అది కూడా ఓ పోర్న్‌స్టార్‌తో అని తెలియడంతో తనకు ఇబ్బందిగా అనిపించి ట్రంప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని మెలానియా హోటల్‌లోనే ఉంటున్నారని తెలుస్తోంది.

ఇటీవల స్టార్మీ డానియెల్‌ అనే ఓ పోర్న్‌స్టార్‌తో ట్రంప్‌కు అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం ఆమె ఎక్కడా ప్రస్తావించకుండా ఉండేందుకు ట్రంప్‌ తరుపు న్యాయవాది ఒకరు ఆమెకు దాదాపు లక్షా 30వేల డాలర్లు ఇచ్చారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి ట్రంప్‌పై మెలానియాకు మరింత ఆగ్రహం వేసినట్లు సమాచారం. అందుకే, ఇటీవల ట్రంప్‌ ఎక్కడకు వెళుతున్నా పక్కన వెళ్లకుండా ఆఖరికి దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు కూడా ఆమె ట్రంప్‌తో రాకుండా దూరంగా ఉండిపోయారు. ఈ విషయం కూడా ట్రంప్‌పై మెలానియా ఆగ్రహంతో ఉన్నారనే వార్తను ధ్రువీకరిస్తున్నాయని నెటిజెన్లు అనుకుంటున్నారు. మరోపక్క, మెలానియా అధికారిక ప్రతినిధి మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు. ట్విటర్‌ ద్వారా మాత్రం అవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement