ఎట్టకేలకు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన తొలిమహిళ!
వాషింగ్టన్:
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ దేశ తొలిమహిళగా హోదా దక్కించుకున్న మెలానియా.. ఇప్పటిదాకా అధ్యక్షుడి అధికార భవనమైన వైట్‌హౌస్‌లో అడుగుపెట్టలేదు. ట్రంప్, మెలానియా మధ్య వివాదాలే ఇందుకు కారణమని ఇప్పటిదాకా అంతా భావించారు. అయితే అసలు కారణం మాత్రం అది కాదని, కొడుకు బారన్ చదువు కోసమే ఇన్నాళ్లు న్యూయార్క్‌లో ఉండాల్సి వచ్చిందట. ఈ ఏడాదికిగాను బారన్ చదువు ముగియడంతో తల్లి, కొడుకు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారట.
ఎయిర్‌ఫోర్స్ వన్‌కు చెందిన విమానం నుంచి దిగిన తల్లికొడుకులపై మీడియా ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో వివాదాస్పద టీషర్ట్ ధరించి.. వార్తల్లోకెక్కిన బారన్, ఈసారి మాత్రం The Expert అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి విమానం దిగాడు. ఇకపై అధ్యక్ష భవనానికి సమీపంలోనే ఉన్న ఆండ్రూస్ ఎపిస్కోపల్ స్కూల్‌లో బారన్ చదువుతాడని, అధ్యక్షుడిగా ఎన్నికైనా.. కుటుంబంతో కలిసి ఉండలేక నానా అవస్థలు పడిన ట్రంప్‌కు ఎట్టకేలకు ఆ లోటు తీరినట్లు స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.