white house
-
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే, సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఇరు దేశాధినేతలు. మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో వ్యాఖ్యానించిన ట్రంప్. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోదీ. I've watched Modi for a decade now. No one on the world stage can hold a candle to him. He's respected by all other leaders and loved by Trump. They have a very strong friendship that's going to be mutually beneficial for the coming years. Very exciting. pic.twitter.com/53OrGGYNRl— Patrick Brauckmann 🕉️ (@vonbrauckmann) February 13, 2025 Prime Minister Narendra Modi met US President Donald Trump at White House in Washington, DC on 13th February. This meeting was the first between the two leaders after the inauguration of President Trump as the 47th US President on January 20, 2025. pic.twitter.com/SlKZcYrVxG— ANI (@ANI) February 14, 2025డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..‘భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణం. మోదీ నాకు మంచి మిత్రుడు. రానున్న నాలుగేళ్లు మా స్నేహాన్ని కొనసాగిస్తాం. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. భారత్‌కు ఎఫ్ 35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం. ఈ ఏడాది భారత్‌కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు. అలాగే, భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తాం’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.PM Narendra Modi tweets, "President Trump often talks about MAGA. In India, we are working towards a Viksit Bharat, which in the American context translates into MIGA. And together, the India-USA have a MEGA partnership for prosperity." pic.twitter.com/w0o70KrJWI— ANI (@ANI) February 14, 2025అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు శుభాకాంక్షలు. వైట్‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం ఆనందంగా ఉంది. మరో నాలుగేళ్లు ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషం. ట్రంప్‌లాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. మేం రెట్టింపు వేగంతో పని చేస్తాం. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే మా ఆకాంక్ష. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంది. శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు’ అని తెలిపారు. #WATCH | Washington, DC: PM Modi says, " Our teams will work on completing a trade agreement that will mutually benefit the two countries. We will strengthen oil and gas trade to ensure India's energy security. In the energy infrastructure, investment will increase. In the… pic.twitter.com/TMfLY7q9jJ— ANI (@ANI) February 13, 2025 -
ఎక్స్ బయో మళ్లీ మార్చిన మస్క్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) శాఖకు అధిపతిగా ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మళ్లీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో వివరాలను మార్చారు. ఆయన అకౌంట్ తెరవగానే పేరు కింద కొత్తగా ‘‘వైట్‌హౌస్ టెక్ సపోర్ట్’’అనే పదాన్ని చేర్చారు. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలుచేసి దానికి ‘ఎక్స్’అని పేరు మార్చినప్పటికీ నుంచీ మస్క్ ‘ఎక్స్’లో క్రియాశీలకంగా పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. వైవిధ్యభరితంగా, వివాదాస్పదంగా, నవ్వు తెప్పించేలా పోస్ట్‌లు పెడుతూ సోషల్‌మీడియా వేదికపై ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. అందర్నీ ఎగతాళి చేస్తానని చెప్పుకుంటూ గతంలో తన బయోలో చీఫ్ ట్రోల్ ఆఫీసర్(సీటీఓ) అని రాసుకొచ్చారు. బరాక్ ఒబామా కాలంలో యునైటెడ్ స్టేట్స్ డిజిటల్ సర్విస్(యూఎస్డీఎస్)గా మొదలైన అమెరికా ప్రభుత్వ శాఖకు ట్రంప్ తాను అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)గా పేరు మార్చారు. ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గిస్తూ, కొన్ని శాఖలకు నిధుల అనవసర, అధిక కేటాయింపులను తగ్గిస్తూ, ప్రాధాన్యతగల శాఖలకు కేటాయింపులు పెంచుతూ ఈ డోజ్ నిర్ణయాలు తీసుకుని అధ్యక్షుడికి సలహాలు, సూచనలు, సిఫార్సులు చేస్తుంది. డోజ్‌కు ప్రస్తుతం మస్క్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ‘‘యూఎస్డీఎస్ ఇప్పుడు డోజ్గా మారాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే మార్చాశాం. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థలన్నింటినీ ఆధునీకరిస్తాం’’అని మస్క్ అన్నారు. వైట్‌హౌస్‌పై మస్క్ కన్ను ! ‘‘డోజ్ విభాగం తెగ పనిచేస్తోంది. వారానికి మేం 120 గంటలు పనిచేస్తున్నాం’’అని గత వారం మస్క్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా మేగజైన్ ‘వైర్డ్’సైతం ఇలాగే స్పందించింది. ‘‘వాస్తవానికి మస్క్ అక్కడేం చేయట్లేడు. వాషింగ్టన్ డీసీలోని డోజ్ ప్రధాన కార్యాలయంలో నిద్రపోతున్నాడు’’అని ఒక కథనంలో పేర్కొంది. అసలు పనిపై దృష్టి తగ్గించేసి అమెరికా అధ్యక్ష భవనంలో పాగా వేసేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నాడని వార్తలొచ్చాయి. వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్ అయిన ఓవెల్ ఆఫీస్‌లో తన పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘మస్క్, ఆయన బృందానికి వేరే చోట వేరే ఆఫీస్ సిద్ధంచేస్తాం. ఆ ఆఫీస్ ఓవెల్ ఆఫీస్‌లో భాగంగా ఉండబోదు. ఓవెల్ ఆఫీస్ కేవలం అధ్యక్షుడిగా కార్యనిర్వాహణ ఉత్తర్వులు ఇవ్వడానికే వినియోగిస్తా’’అని ట్రంప్ స్పష్టంచేశారు. -
తెరపైకి ట్రంప్ అభిశంసన.. అంత ఈజీనా?
అధికారం చేపట్టి పట్టుమని రెండు వారాలు కూడా కాలేదు. ఈలోపే ఆయన్ని వైట్‌హౌజ్ పీఠం నుంచి దించేయాలనే డిమాండ్ మొదలైంది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ.. ఆయన తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలు అమెరికాకు శత్రువులను పెంచడంతో పాటు ఆయన పదవీకి ముప్పుగా మారవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. 2.0లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నవన్నీ సంచలన నిర్ణయాలే. బయటి దేశాల నుంచే కాదు.. అమెరికాలోనూ ఆ నిర్ణయాలపై వ్యతిరేకత మేధోవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ని అభిశంసించాలంటూ చేపట్టిన పిటిషన్ లక్ష సంతకాలను దాటేసింది. అదీ కేవలం 11 రోజుల్లోనే!అధికారంలోకి రాకముందే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్నది ఈ పిటిషన్ వెనకాల ఉన్న ప్రధాన అభియోగం. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే తీసుకున్న.. తీసుకుంటున్న నిర్ణయాలను ఈ పిటిషన్ తప్పుబడుతోంది. ముఖ్యంగా కాపిటల్ హిల్స్ నిందితులకు క్షమాభిక్ష పెట్టడం, అమెరికా పౌరసత్వంపై రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయలు ఇతరత్రాలు ఉన్నాయి.వాషింగ్టన్కు చెందిన ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ అనే సంస్థ తన వెబ్సైట్ ద్వారా ఈ క్యాంపెయిన్ నడిపిస్తోంది. అయితే ఈ సంతకాలు లక్ష దాటిన నేపథ్యంతో.. ట్రంప్‌పై ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్(పార్లమెంట్)పరిగణనలోకి తీసుకోవాలని, అభిశంసన ద్వారా ఆయన్ని పదవీచ్యుతుడ్ని చేయాలని కోరుతోంది. అయితే.. ఇలా ఓ సంతకాల పిటిషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడ్ని తొలగించడం సాధ్యమేనా?..సంతకాల సేకరణ ద్వారా ఏ దేశ అధినేతను తొలగించిన దాఖలాలు లేవు. రాజకీయపరమైన కారణాలతోనే.. ఒక దేశ అధినేతను అభిశంసించేందుకు వీలు ఉంటుంది.అయితే ఈ తరహా సంతకాల సేకరణ చర్యతో.. సదరు అంశానికి ప్రజల మద్ధతు ఏమేర ఉందో చూపించొచ్చు. తద్వారా మీడియా, సోషల్ మీడియాను ఆకర్షించొచ్చు. అలా.. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చట్టసభ్యులపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఒత్తిడి మాత్రం చేయొచ్చు. అందుకే వీలైనన్ని ఎక్కువ సంతకాల్ని సేకరించే పనిలో ఉంది ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ గ్రూప్. అలాగే ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ 2017లోనూ ట్రంప్‌పై ఇలాంటి క్యాంపెయిన్ నడిపించినా.. ఆ టైంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన దక్కలేదు.గత హయాంలో ట్రంప్ రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. 2019లో ఓసారి, 2021 కాపిటల్ దాడికి సంబంధించి రెండోసారి ఎదుర్కొన్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన తొలగింపును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమర్థించగా.. సెనేట్ మాత్రం వదిలేసింది. ప్రస్తుతం హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్తో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్ పార్టీ బలంగా ఉంది. సో.. ట్రంప్‌పై ఈ టర్మ్‌లో అభిశంసన పెట్టడం అంత వీజీకాదిప్పుడు. -
కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన కుష్ దేశాయ్‌ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. కుష్ గతంలో, అయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను ,2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ తరఫున కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన సారథ్యం వహించిన ఏడు రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం సాధించడం గమనార్హం. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలను డిప్యూటీ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ టేలర్ బుడోవిక్ చూస్తున్నారు.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్ ఇప్పటికే నియమితులయ్యారు. -
అమెరికాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. భారత్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్నారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నేరస్థులైన అక్రమ వలసదారులను టార్గెట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K— The White House (@WhiteHouse) January 24, 2025ఇక, ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు అని వెల్లడించారు.ఈ నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్’: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ జె.ట్రంప్ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు. ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్‌లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్ కార్టల్స్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. లూథర్‌కింగ్ కలలను నిజం చేస్తా ట్రంప్ తన ప్రసంగంలో బైడెన్ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజెలెస్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్‌కింగ్ జూనియర్ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్ లూథర్ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌కు స్వాగతం: బైడెన్ అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్ తన వారసుడు ట్రంప్‌ను అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్‌తో కలిసి స్వాగతించారు. ‘వైట్‌హౌస్‌కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్ కోసం ఓవల్ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్ దంపతులను లోనికి తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్‌కు హారిస్ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్ దంపతులను హారిస్ దంపతులు వైట్‌హౌస్ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్ తన కుటుంబీకులతో కలిసి వైట్‌హౌస్ సమీపంలోని చారిత్రక సెయింట్ జాన్ ఎపిస్కోపల్ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.ప్రమాణస్వీకారం ఇలా..ట్రంప్ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్‌హౌస్‌లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్ నేత 82 ఏళ్ల జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, ముకేశ్ అంబానీ దంపతులు, రూపర్డ్ మర్డోక్ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్ దంపతులు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్‌తో కలిసి ట్రంప్ ఒకే కారులో క్యాపిటల్ హిల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్‌కు, ఆయన రన్నింగ్‌మేట్ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్‌తో పాటు లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్‌కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. ట్రంప్ రాకతో వైట్‌హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఆశ్చర్యపరిచిన విలేజ్ పీపుల్ ప్రదర్శన వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ముగించారు. 1978 నుంచి హిట్ అయిన ‘విలేజ్ పీపుల్’ట్రాక్ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్ పీపుల్ బ్యాండ్ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్ మీద విలేజ్ పీపుల్ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్ డ్యాన్స్ చేశారు. మార్పుకోసం ఎదురుచూస్తున్నా వాషింగ్టన్: ట్రంప్ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విజయోత్సవ ర్యాలీలో మస్క్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్ అన్నారు. మస్క్... లిటి ల్ ఎక్స్ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు. -
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం(జనవరి 20వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులుచైనా తరపున అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బృందం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిఅర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నట్లు తెలిపారు ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, ఎరిక్ జెమ్మూర్ (ఫ్రాన్స్), మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలు సైతం ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో వ్యాపార దిగ్గజాలు టెస్లా సీఈవో ఇలాన్ మస్క్అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖుల డుమ్మాట్రంప్ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం అందలేదు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గైర్హాజరు కానున్నారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్కు ఆహ్వానం వెళ్లిందా? అనేదానిపై స్పష్టత లేదు. మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ముందస్తు సమాచారం ఇచ్చారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ సమయంలో మాజీ అధ్యక్షులు.. వాళ్ల వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీ వస్తోంది. గడ్డకట్టే చలిలోనూ గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అయితే మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ రోటుండా సముదాయం లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రాజధాని వాషింగ్టన్ అందంగా ముస్తాబైంది. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు సేవలందించారు. అయితే 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు ఆహ్వానం2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతు దారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతు దారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లుట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు. -
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
-
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్‌హౌస్‌లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్‌లోని ప్రెసిడెంట్ రూమ్‌లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్‌హౌస్ దాకా ట్రంప్ పరేడ్‌గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్‌ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్‌ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్‌కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరిచారు. -
వైట్‌హౌస్ కేసు.. సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయివర్షిత్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు డిస్ట్రిక్ కోర్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ శిక్ష ఖరారు చేశారు. అంతేకాదు.. సాయివర్షిత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మరో మూడేళ్లపాటు అతనిపై నిఘా కొనసాగనుందని తెలిపారాయన. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసితుడు కావడంతో కందుల ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్(Whitehouse)పై సాయివర్షిత్ దాడికి యత్నించాడు. అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను చంపడానికి కూడా తాను వెనుకాడలేదని విచారణలో సాయి ఒప్పుకున్నాడు. బైడెన్ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు యూఎస్ అటార్నీ ఇదివరకే ప్రకటించింది. నిజానికి ఈ కేసులో కిందటి ఏడాది ఆగస్టు 23న శిక్ష ఖరారు కావాల్సి ఉండగా.. అది ఆలస్యమైంది. 2023 మే 22న సాయి వర్షిత్ కందుల(Sai Varshith Kandula) అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బీభత్సం సృష్టించాడు. అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ , ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్ అటార్నీ తెలిపింది.కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. దీంతో పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్లాన్‌తో..ఈ దాడి కోసం చాలా కాలం నుంచే ప్లాన్ చేసుకున్నట్లు సాయి వర్షిత్ విచారణలో తెలిపాడు. 2022 ఏప్రిల్‌లో వర్జీనియాలోని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థను సంప్రదించి 25 మంది సాయుధ సిబ్బంది, సాయుధ కాన్వాయ్ కావాలని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించాడు. ఓ పెద్ద కమర్షియల్ ట్రక్కును అద్దెకు తీసుకునేందుకు యత్నించాడు. అవి కుదరకపోవడంతో చివరకు ఓ చిన్నపాటి ట్రక్కును రెంట్‌కు తీసుకుని దాడికి పాల్పడ్డాడు.ఎవరీ కందుల సాయి వర్షిత్?మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం. అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నప్పటికీ.. ప్రాంతం వివరాలపై స్పష్టత లేదు. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది. కాగా.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. -
సంపన్నుల ఆధిపత్యం ఆందోళనకరం
వాషింగ్టన్: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోందని, ఇది నిజంగా ప్రమాదకరమైన పరిణామం అని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ధనవంతులు దేశాన్ని శాసించే పరిస్థితి రావడం సరైంది కాదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే బడాబాబులు పెత్తనం సాగించే అవకాశం ఉండొద్దని చెప్పారు. బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఆయన అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్‌కు అప్పగించబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్వేతసౌధంలో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసు నుంచి జో బైడెన్ ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ శిక్ష నుంచి తప్పించే అవకాశం ప్రస్తుతం ఉందని, ఈ పరిస్థితి కచి్చతంగా మారాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. ట్రంప్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన దోషిగా తేలిన సంగతిని పరోక్షంగా ప్రస్తావించారు. శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం అధ్యక్షుడికి ఇవ్వొద్దని పేర్కొన్నారు. పిడికెడు మంది సంపన్నులు, బలవంతుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం ప్రమాదకరమని వెల్లడించారు. వారు అధికార దురి్వనియోగానికి పాల్పడితే ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే అలాంటివారిని నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావితం చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలి సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం పట్ల బైడెన్ స్పందించారు. సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం అనే ఊబిలో అమెరికా కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా అనేది కనుమరుగు అవుతోందని, ఎడిటర్లు అనేవారు కనిపించడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ అనేది లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. అసత్యాల వెల్లువలో సత్యం మరుగునపడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు స్వార్థపరులు అధికారం, లాభార్జన కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారని బైడెన్ ఆరోపించారు. మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, అధికార దురి్వనియోగం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలని స్పష్టంచేశారు. తగిన నిబంధనలు, రక్షణలు అమల్లో లేకపోతే కృత్రిమ మేధ(ఏఐ) కోరలు మరింతగా విస్తరిస్తాయని, మానవ హక్కులకు, గోప్యతకు భంగం వాలిల్లుతుందని హెచ్చరించారు. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము విత్తనాలు నాటామని, వాటి ఫలితాలు తర్వాత కనిపిస్తాయని జో బైడెన్ తేల్చిచెప్పారు. -
అమెరికన్లకు బైడెన్ హెచ్చరిక.. ఫేర్వెల్ స్పీచ్‌లో సంచలన కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న వేళ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని అన్నారు. అలాగే, కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఉండబోతుంది అంటూ హెచ్చరించారు. దీంతో, ఆయన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయం నుండి తన వీడ్కోలు ప్రసంగం చేశారు బైడెన్. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘నేడు అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన ఒక సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని హెచ్చరించారు. ఇది ఆందోళనకరంగా మారే ఛాన్స్ ఉందన్నారు.ఇదే సమయంలో ఇది అధికార దుర్వినియోగానికి వీలు కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలు భారీగా స్థాయిలో వెలుగు చూస్తాయి. అధికారం కోసం నిజం అణిచివేయబడుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగాన్ని అదుపు చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, ప్రతీ అమెరికా పౌరుడు తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.Biden: "I want to warn the country of some things that give me great concern. That's the dangerous concentration of power in the hands of a very few ultra wealthy people and the dangerous consequences if their abuse of power is left unchecked. Today, an oligarchy is taking shape" pic.twitter.com/3JFO40udS3— Aaron Rupar (@atrupar) January 16, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధినేతలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో, పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
అదానీపై కేసు వ్యవహారంలో స్పందించిన వైట్ హౌస్
-
ట్రంప్ కీలక నిర్ణయం.. కరోలిన్ సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్‌ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024 -
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
వాస్తవాలను నిరాకరిస్తున్నామా?
ట్రంప్ విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా కొన్ని అమెరికా ఉదారవాద పత్రికలు అధ్యక్షుడిగా ఆయన గెలుపును ఒప్పుకోలేకపోయాయి. జార్జియా లాంటి నల్లజాతి ప్రజలున్న ప్రాంతాలు కూడా దాదాపుగా ట్రంప్ వైపు మారాయి. గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నారు. ఆయన దోషే కావొచ్చు, కానీ దేనికీ గట్టిగా నిలబడలేదు కాబట్టే కమలా హ్యారిస్ ఓడిపోయారు. ఇది వాస్తవం. భారతదేశంలోనూ మోదీ విజయం పట్ల ఇదే తరహా స్పందన కనబడింది. ప్రజలు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా? వారి ఆలోచనలు, కోరికలు, ఆత్రుతలను సరిగ్గా పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి రావడం అనేది నేటి అమెరికాలో... నరేంద్ర మోదీ గత దశాబ్దంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ భారతదేశం అనుభవించిన భావోద్వేగ తీవ్రతను రేకెత్తిస్తోంది. ‘లిబరల్ ప్రెస్’ అని పిలవ బడుతున్న మీడియా దీన్ని ఒక అంధకారయుతమైన, వినాశకర దినానికి సంబంధించిన దృష్టాంతంగా చిత్రించడానికి ఆపసోపాలు పడింది. అదే సమయంలో ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ నేతృత్వంలోని ‘సంప్రదాయవాద మీడియా’... కష్టకాలంలో, ప్రమాదకరమైన పరి స్థితి నుంచి అమెరికాను బయటపడేసిన వీరుడిగా ట్రంప్‌ను అభివర్ణించడంలో పోటీపడుతోంది.మోదీకి వ్యతిరేకంగా భారత ప్రజల భావోద్వేగ మిశ్రమాను భూతి... ట్రంప్ పట్ల అమెరికన్ల ప్రతిస్పందనలతో సమానంగా ఉండటం అసాధారణం. 2014, 2019, 2024లో మోదీ గెలిచిన మూడు ఎన్నికలలోనూ ఎన్నికల పారవశ్యం వర్సెస్ తీవ్ర ఆగ్రహం ప్రధాన లక్షణంగా ఉండింది. కచ్చితంగా, అమెరికాలో లాగానే భారత దేశంలోనూ మధ్యస్థులుగా ఉండేవాళ్లు ట్రంప్, మోదీ లాంటి విభజిత వ్యక్తిత్వాల బరువుతో చాలావరకు కనుమరుగయ్యారు. పెద్ద ప్రశ్న ఏమిటంటే, మీడియా కానీ, రెండు దేశాల్లోని పోల్ నిపుణులు కానీ ఎక్కడ పొరబడుతున్నారు? మోదీ, ట్రంప్‌ను ద్వేషించడాన్ని మనం ఎంతగానో ఇష్టపడుతున్నామా? ప్రజల ఆలోచనలు, కోరికలు, ఆత్రు తలను పట్టించుకుంటున్నాం అనుకుంటున్నప్పటికీ, వారు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా?ట్రంప్ ఫ్లోరిడాలో తన విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా, ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి గౌరవప్రదమైన వార్తాపత్రికలు ట్రంప్ గెలిచినట్లు అంగీకరించడానికే నిరాకరించాయి. భారతదేశంలో కూడా, 2014, 2019 ఎన్నికల్లో నమ్మశక్యం కాని విధంగా మన బుద్ధిని కాకుండా మన హృదయం చెప్పిందానికి తలూపాం. భారతీయులు సంపూర్ణ ఆమోదంతో మోదీకి ఓటు వేస్తున్నారని నమ్మలేకపోయాం. 2022లో యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను కైవసం చేసుకున్నారని నమ్మడానికి నిరాకరించాం. కోవిడ్ –19 సమయంలో సంభవించిన వేలాది మంది మరణాలు దేవుడే ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు రుజువు అని చెప్పుకున్నాం. 2024లో, అదే ఉత్తరప్రదేశ్ బీజేపీకి పూర్తిగా ఓట్లను బట్వాడా చేయడానికి నిరాకరించినప్పుడు కూడా మనం సమానంగా షాక్ అయ్యాము.ఈ అన్ని సందర్భాల్లోనూ క్షేత్ర వాస్తవికతను పట్టించుకోకుండానే మనం కథలో చాలా లోతుగా మునిగిపోయాం. ప్రజా తీర్పు మన ముందుకు వచ్చిన తర్వాత కూడా, దాన్ని అంగీకరించడానికి నిరాక రించాం. మోదీ, ట్రంప్‌లలో ఏదో తప్పు ఉందని నొక్కిచెప్పాం. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మరింత అధ్వాన్నంగా, రాహుల్ గాంధీకి లేదా కమలా హ్యారిస్‌కు అదే కఠినమైన ప్రమాణాలను వర్తింప జేయడానికి నిరాకరించాం.కాబట్టి ఈ రోజు వాస్తవాలను ఎదుర్కొందాం. ఏ వైపూ స్థిరంగా నిలబడలేదు కాబట్టే హ్యారిస్ ఓడిపోయారు. ట్రంప్ దోషి, స్త్రీ లోలుడు, ఇంకో ఘోరం వలసలను ఆపి (భారతదేశానికి మంచిది కాదు) అమెరికాకు ఉద్యోగాలు తెస్తానని వాగ్దానం చేశారు. రాహుల్ విషయానికొస్తే, నాలాంటి వ్యక్తులు డిన్నర్ టేబుల్ వద్ద ఆయన అనేక ఆలోచనలతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారు. కానీ ఆయన దేని కోసం గట్టిగా నిలబడతారో అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగానే ఉంటోంది.అమెరికా, భారతదేశం వంటి గజిబిజి ప్రజాస్వామ్యాలు ట్రంప్, మోదీలనే ఎన్నుకుంటాయి. ఎందుకంటే వారు క్షీణతలో లేదా పరి వర్తనలో సమాజాల ద్వారా ఏర్పడే గందరగోళాన్ని సరళీకృతం చేయగలరు. 2021 జనవరి 6న అమెరికన్ క్యాపిటల్‌పై దాడి, 2002 గుజరాత్ అల్లర్లలో చాలామంది మరణించడం లాంటివి ఉన్నప్పటికీ మనం ఎన్నుకున్న నాయకుల జీవితాల్లోని చీకటి కోణాలను విస్మ రిస్తాము. ఎందుకంటే ఈ రోజు మన కష్టతరమైన జీవితాలను మెరుగుపరుస్తారని వారు హామీ ఇచ్చారు. వారి ప్రస్తుత హామీలు మనకు ఓదార్పునిస్తాయి. వారు మనతో సింపుల్‌గా మాట్లాడతారు. మనం వారి ప్రత్యర్థులను నమ్మినదానికంటే, వీరి పట్ల తక్కువ అప నమ్మకం చూపుతాం.డెమోక్రాట్ అనుకూల దక్షిణ యూఎస్ రాష్ట్రం జార్జియాలోని నల్లజాతి ప్రజలున్న జిల్లాలు దాదాపు పూర్తిగా ట్రంప్ వైపు మారాయి. అలాగే ఆయన లాటిన్ అమెరికన్ల ఓటును 14 శాతం మెరుగు పరుచుకున్నారు. ట్రంప్‌కు ఎందుకు ఓటు వేశారని అడిగితే వాళ్లు చెప్పిన ఒక కారణం: ఎటూ వేస్తారని డెమోక్రాట్లు వారి ఓటును తేలిగ్గా తీసుకోవడం. ఇది విన్నట్టు అనిపిస్తోందా? హ్యారిస్‌ను శిక్షించినట్టుగానే హరియాణాలో భూపీందర్ సింగ్ హుడాను ఓటర్లు శిక్షించారు. కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, రావ్ బీరేందర్ సింగ్ వంటి పార్టీలోని తిరుగుబాటుదారులను తన వెంట తీసుకోవడానికి హుడా నిరాకరించారు. హరియాణాలోని ప్రతి నియోజక వర్గంలోనూ జాట్యేతర ఓట్లపై బీజేపీ సూక్ష్మ దృష్టి పెట్టినట్టుగానే, గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నట్లు డేటా చూపిస్తోంది.విచిత్రంగా, యూపీలో బీజేపీ 29 స్థానాలను కోల్పోయినప్పుడు దాని మెజారిటీ తగ్గిందని కాంగ్రెస్ హర్షధ్వానాలు చేయకుండా ఉండ లేకపోయింది. మరో వైపున మోదీకి ఈ ప్రపంచంలో సగం గర్భం రావడం అనేది ఉండదని తెలుసు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటిలాగానే ప్రధానమంత్రిగా తాను చేయాల్సిన పనుల్ని చేయగలరు. పైగా అధి కారాన్ని సంఘటితం చేసుకోవడానికీ, యూపీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికీ రాబోయే శాసనసభ ఎన్నికలలో గెలవడమే మార్గం. హరియాణా. మహారాష్ట్ర. జార్ఖండ్.కాకపోతే మోదీపై తిరగబడి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని బలవంతం చేసిన పంజాబ్‌కు భిన్నమైన నియమాలు వర్తింపజేయబడుతున్నాయి. గత కొన్ని వారాలుగా వరి సేకరణలో ఉన్న అపారమైన కష్టాల గురించి చాలా ప్రశ్నలు రేగు తున్నాయి. పంజాబ్ సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా ఉండి వ్యవ సాయంపై గణనీయంగా ఆధారపడి ఉన్నందున దీనిని నివారించ లేమా? పంజాబ్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వరి తరలింపులో కేంద్రం మరింత అవగాహన చూపలేదా? తడిసిన బియ్యాన్ని అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటకకు పంజాబ్ విక్రయించినట్లు ఈ ఏడాదే ఎఫ్‌సీఐ ఎందుకు గుర్తించింది?బహుశా, వీటిలో కొన్ని వైరల్ అయిన కుట్ర సిద్ధాంతాల్లా అనిపిస్తాయి. ఈ చిక్కుముడి ప్రశ్నలకు సమాధానం కావాలంటే – మోదీ, చెప్పాలంటే ట్రంప్ కూడా అధికార స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆ రాజకీయం కిట్టీ పార్టీ కాదు, ఎన్జీవో కాదు. ఓటర్లు నిర్దిష్ట సంఖ్యకు మించి మీకు ఓటు వేయకపోతే అప్పుడు ఇతర చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు 2024 లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో బీజేపీకి వచ్చినవి 18.3 శాతం ఓట్లు. అప్పుడు విభజించు పాలించు అనే పురాతన నియమం ఉండనే ఉంది.ఇప్పుడు ట్రంప్ అమెరికాను గెలుచుకున్నందున, స్వదేశంపై మనం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మహారాష్ట్రతో పాటు, నవంబర్ 20న మొదలయ్యే పంజాబ్‌లోని నాలుగు నియోజకవర్గాల ఉప ఎన్నికలతో ఆట ప్రారంభిద్దాం.జ్యోతి మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ సంపాదకురాలు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు -
ట్రంప్ పాలనలో మస్క్‌కు కీలక పాత్ర..!
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్ కూడా చేరినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.జెలెన్స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పేషీలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్‌నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.ఇలాన్‌మస్క్ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్‌ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్‌ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్‌తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్‌నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్‌హౌజ్‌ను తలిపించేలా సింక్‌తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
వైట్‌హౌజ్‌కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Cris Comerford: ఆ రుచికి రిటైర్మెంట్
‘విందు భోజనం అంటే సరైన సమయంలో సరైన పదార్థం అందించడమే’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. అన్య జాతులకు ప్రవేశం లేని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వంటశాలలో ప్రవేశం సాధించిన మొదటి మహిళ ఆమె. తొలి శ్వేత జాతీయేతర మహిళ కూడా! 30 ఏళ్లు వైట్‌హౌస్‌లో పని చేశాక తన 61వ ఏట జూలై 31న ఆమె రిటైర్ అయ్యారు. ఎందరో దేశాధినేతలకు తన చేతి వంట తినిపించిన క్రిస్ కమర్‌ఫోర్డ్ పరిచయం.‘అమెరికాకు అనేక మంది రాయబారులు ఉంటారు. కాని క్రిస్ కమర్‌ఫోర్డ్ షెఫ్‌గా ఉండక శాకపాకాల రాయబారి వలే అలాంటి పనే చేశారు. అమెరికా రుచులను ప్రపంచనేతలకు పంచి ఎలా ఉత్సవభరితం చేయవచ్చో చూపించారు’ అని క్రిస్ కమర్‌ఫోర్డ్ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సమకాలిక షెఫ్ ఒకరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్ ‘క్రిస్ కమర్‌ఫోర్డ్ తన టీమ్‌తో కలిసి ప్రేమ, ఆ΄్యాయతలతో కూడిన రుచులతో మా ఆత్మలను నింపారు’ అని వీడ్కోలు సందేశంలో పేర్కొంది. క్రిస్ కమర్‌ఫోర్డ్ విజయగాథ...ఫిలిప్పైన్స్ నుంచిక్రిస్ కమర్ఫోర్డ్ది ఫిలిప్పైన్స్. మనీలాలో బాల్యం గడిచింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫుడ్ టెక్నాలజీలో పి.జి. చేయాలనుకుంది. ‘నాకు సైన్స్ ఇష్టం. ఫుడ్ టెక్నాలజీలో పరిశోధన చేయాలనుకున్నాను. కాని మా నాన్న నువ్వు కలనరీ ఇన్స్టిట్యూట్లో చదివితే ఇంకా రాణిస్తావు అన్నాడు. నేను మా నాన్న సలహాను పాటించడం వల్లే పాకశాస్త్రం తెలుసుకొని వైట్‌హౌస్ దాకా వచ్చాను. కాబట్టి పెద్దల మాట వినండి’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. తన 23వ ఏట అమెరికా వలస వచ్చిన క్రిస్ మొదట షికాగో, తర్వాత న్యూయార్క్ రెస్టరెంట్లలో పని చేసింది. వైట్‌హౌస్‌లో వంటశాలలో మహిళలను తీసుకోక΄ోయినా, శ్వేతజాతీయేతర మహిళలను తీసుకునే అవకాశం అసలు లేక΄ోయినా 1995లో నాటి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వాల్టర్ స్టాన్లీ ఆమెను అసిస్టెంట్ షెఫ్‌గా తీసుకున్నాడు.మన్మోహన్ సింగ్‌తో ప్రమోషన్నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో అమెరికా సందర్శించినప్పుడు వైట్ హౌస్‌లో భారీ విందు జరిగింది. దానికి కావలసిన వంటా వార్పు అంతా క్రిస్ చూసింది. విందుకు హాజరైన వారంతా ఆహా ఓహో అన్నారు. క్రిస్ ప్రతిభ గమనించిన జార్జ్‌బుష్ సతీమణి లారా బుష్ ఆమెకు ఎగ్జిక్యూటివ్ షెఫ్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వైట్‌హౌస్‌లోని సకల వంటా వార్పులకు సర్వోన్నత అధికారి. ఆమె పర్యవేక్షణలోనే దేశాధినేతలు వచ్చినప్పుడు వైట్‌హౌస్‌లో ఇచ్చే గౌరవ విందు, హాలిడే ఫంక్షన్లు, రిసెప్షన్లు, అధికారిక విందులు జరుగుతాయి.ఆహారమే ఆరోగ్యం‘దేశ భవిష్యత్తు నిర్మించడమంటే నేటి బాలలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే’ అంటుంది క్రిస్. ‘పాకశాస్త్రం తెలిసిన వారు ఏది ఉత్తమమైన ఆహారమో ఏది ΄ûష్టికతతో నిండినదో తర్వాతి తరాలకు తెలియ చేయాలి. పిల్లలు మెచ్చుకునే రీతిలో ఆరోగ్యకరమైన వంటలు చేయగలగాలి. వారిని కూరగాయలతో గడపనివ్వాలి. కూరగాయల మడులకు తీసుకెళ్లాలి. వంట పట్ల అభిరుచి, అవగాహన కలిగించాలి’ అంటుందామె. వంట ఒక సవాలువైట్ హౌస్‌లో వంట ఒక సవాలు. జపాన్ దేశాధినేత వచ్చినప్పుడు ఒక మెనూ, కెన్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక మెనూ, భారత ప్రధాని వచ్చినప్పుడు మరో మెనూ తయారు చేయాలి. ఒకోసారి ఆయా దేశాలకు చెందిన వంటవాళ్లను రప్పించి వారితో కలిసి వండాలి. ‘ప్రతి విందుకు నాలుగు రోజుల ముందు నుంచే సిద్ధమవుతాం. సలాడ్లు తాజాగా ఉండేందుకు ఆ రోజున వైట్‌హౌస్‌లోని తోట నుంచి ఆకులు, దుంపలు సేకరిస్తాం. పండిన కూరగాయలు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. వైట్ హౌస్‌లో ఉపయోగానికి రాక΄ోతే అవసరమైనవారికి పంపించేస్తాను’ అంది క్రిస్. -
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు 2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు. కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్ ఔట్) కారణంగా ఆ పిల్లలు తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్ ఆరోపించింది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు. చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు. కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. -
క్వాడ్ సదస్సు కోసం భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. -
బ్రహ్మాండంగా బైడెన్ ఆరోగ్యం.. నిర్ధారించిన వైట్ హౌస్ వైద్యులు
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మతిమరుపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వదంతుల్ని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఖండించారు. అధ్యక్షుడి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి జోబైడెన్ ఆరోగ్యం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై డాక్టర్ కెవిన్‌ను ప్రశ్నించారు.ప్రస్తుతం జోబైడెన్ ఆరోగ్యం ఎలా ఉంది? అధ్యక్ష పదవి ముగిసేలోపు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. లేదు.లేదు. ఆయ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మరి మానసిక పరిస్థితి ఎలా ఉందని అడగ్గా.. అద్భుతంగా ఉందని బదులిచ్చారు. మరోవైపు ఆనారోగ్యం కారణంగా డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది సార్లు వైట్ హౌస్‌లో బైడెన్‌తో భేటీ అయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.In just a few months, the American people will choose the course of America’s future. I made my choice.And I would like to thank our great Vice President—@KamalaHarris.She’s experienced, tough, capable. She has been an incredible partner to me and leader for our country.— Joe Biden (@JoeBiden) July 25, 2024 అధ్యక్ష రేసు నుంచి అవుట్ఇటీవల బైడెన్‌కు తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో ఓటమి భయం మొదలైంది. అందుకే మరోసారి బైడెన్‌ను అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. బాహాటంగా నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.కమలా హారిస్ సమర్థురాలంటూపదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలంటూ... ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న ఆరు నెలల పదవీకాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. -
బైడెన్‌కు కరోనా నెగిటివ్.. వైట్‌హౌస్ వేదికగా భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా టెస్టుల అనంతరం ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. దీంతో, ఆయన మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా బైడెన్ స్పందిస్తూ.. వైట్ హౌస్‌లో మళ్లీ అడుగుపెట్టడం ఓ ఆనందంగా ఉందన్నారు.కాగా, కరోనా పాజిటివ్ కారణంగా జో బైడెన్ ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నెగిటివ్‌గా తేలడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైడెన్‌కు చికిత్స అందించిన డాక్టర్ కెవిన్ ఓ కన్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యం చాలా బాగుంది. బైడెన్లో కరోనా లక్షణాలో లేవు. టెస్టుల్లో నెగిటివ్‌గా తేలింది అంటూ కామెంట్స్ చేశారు. It's great to be back at the White House. pic.twitter.com/f2HLk1Jp3O— President Biden (@POTUS) July 23, 2024 మరోవైపు.. బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా తర్వాత మళ్లీ వైట్ హౌస్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చారు. 🚨 UPDATE: President Biden just boarded Air Force One and is on his way back to the White House. pic.twitter.com/k2wNDleGa3— Chris D. Jackson (@ChrisDJackson) July 23, 2024 ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా చాలా రోజుల నుంచి బైడెన్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ‘వేర్ ఈజ్ జో’ అనే ట్యాగ్ ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లోకి వచ్చింది. బైడెన్ ఎందుకు కనిపించడం లేదంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధ్యక్షుడు బైడెన్ గతవారం కరోనా బారినపడ్డారు. ఐసోలేషన్‌లో ఉన్నారంటూ ‘వైట్‌హౌస్’ ఒక ప్రకటన కూడా చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి.అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, రాత్రి గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొందంటూ సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. కాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మరో సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పించేందుకు బైడెన్‌పై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. -
జో బైడెన్‌కు పార్కిన్సన్స్.? క్లారిటీ ఇచ్చిన డాక్టర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్సన్స్(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు. కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్సన్ లేదని ఆయన ఫిజీషియన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. -
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్‌హౌస్‌లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్‌గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్‌హైస్‌లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్‌కి చాట్‌జిపిటి గురించి వివరించడంతోనే వెట్‌హౌస్‌లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్‌ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
USA: భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలి కాలంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తుల దాడుల్లో భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వరుస దాడులపై అమెరికాలోని వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అలాగే, అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చి చెప్పింది. వివరాల ప్రకారం.. అమెరికాలో భారత సంతతి వారిపై దాడులను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజాగా ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘జాతి, ప్రాంతం, స్త్రీపురుష బేధాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోంది. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. ఈ దాడుల కారణమైన వారికి కఠినంగా శిక్షిస్తాం అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. నిన్న(గురువారం) కూడా మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలబామాలో హోటల్ నడుపుతున్న ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచ్చిన ఓ కస్టమర్ గన్‌తో కాల్చి చంపాడు. మరోవైపు.. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ తెలిపారు. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు. మరణాలు ఇవే.. ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా హత్యకు గురయ్యాడు. సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు. శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు బయటపడింది. -
అమెరికా వైట్‌హౌజ్ గేటుపైకి దూసుకెళ్లిన కారు
వాషింగ్టన్: అమెరికా వైట్‌హౌజ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్వేత సౌధం కాంప్లెక్స్ బాహ్య ద్వారంపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సిక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. #WATCH | Washington, DC: A vehicle crashed into a gate of the White House complex on January 8. A driver was taken into custody as 'the cause and manner' of the incident is being investigated, reports Reuters citing the US Secret Service. (Source: Reuters) pic.twitter.com/WHt5ilnbWc — ANI (@ANI) January 9, 2024 ఇక.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్, జిల్ బైడెన్ క్షేమంగా బయటపడ్డారని యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: India-Maldives Row:మాల్దీవుల వివాదం: ద్వేషాన్ని భారత్ అస్సలు సహించదు -
మరో షాక్.. ట్రంప్‌కు మూసుకుపోతున్న దారులు
అగస్టా: అగ్రరాజ్య అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌కు రెండోసారి చేరుకునే క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో న్యాయస్థానం ప్రకటించిన పట్టుమని పదిరోజుల గడవక ముందే.. మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనే(Maine) స్టేట్ గురువారం ప్రకటించింది. అమెరికా చట్టసభ క్యాపిటల్(US Capitol Hill)పై 2021, జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అయితే ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతీ తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనే స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ అక్కడి ఎన్నికల విభాగం నిర్ణయించింది. దీంతో.. మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్‌పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరారు అని షెన్నా బెల్లోస్ పేర్కొన్నారు. ఇక.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. తాజా పరిణామాలతో (సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప).. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్ జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
వైట్‌హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
సీక్రెట్ వైట్‌హౌస్! ప్రపంచంలోనే అందమైన భవంతి!
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవంతి ఏదంటే అంతా ‘గుయాంగ్ వైట్‌హౌస్’ పేరే చెబుతున్నారు. ఇప్పుడు అది రహస్య భవంతిగా పేరు పొందింది. చైనాలోని హువాగువోయువాన్ వెట్‌ల్యాండ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఈ పన్నెండు అంతస్తుల మేడ.. అమెరికా అధ్యక్ష భవంతి వైట్‌హౌస్‌ను తలపించేలా ఉంటుంది. ముందున్న సరస్సుతో పాటు మొత్తం 18.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుందీ భవనం. విలాసవంతమైన దాని ఇంటీరియర్‌ను రోజ్‌వుడ్‌తో చేసి ఉంటారని ఊహిస్తున్నారు. అయితే భవంతి లోపలి ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించనందున ఆ సమాచారాన్ని ఇంకా ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ భవంతిని డజన్ల కొద్దీ గార్డులు 24 గంటలూ పహారా కాస్తుంటారు. దీన్ని చూడటానికి చైనా నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతుంటారు. కానీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయితే గుయాంగ్ వైట్ హౌస్ ఎవరిదనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇది గుయిజౌ హాంగ్లిచెన్ గ్రూప్ సీఈవో జియావో చున్‌హాంగ్ నివాసమని అంటున్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు. (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఆందోళనలు
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదిలావుండగా పాలస్తీనియన్ మద్దతుదారులు అమెరికాలోని వైట్ హౌస్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాలస్తీనియన్ అనుకూలవాదుల నిరసనలతో వాషింగ్టన్ డీసీ నగరంలోని వీధుల్లో రద్దీ నెలకొంది. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు చేతబట్టిన నిరసనకారులలో ఎక్కువగా యువకులు ఉన్నారు. గాజాలో రక్తపాతానికి సూచికగా నిరసనకారులు వైట్ హౌస్ గేట్‌పై ఎరుపు రంగును చల్లారు. పాలస్తీనా అనుకూల నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు లాఫాయెట్ పార్క్‌లోని జనరల్ మార్క్విస్ డి లఫాయెట్ విగ్రహాన్ని పాలస్తీనా జెండాలతో కప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతి నిర్మూలనకు మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. అక్టోబరు 7న గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య మధ్య భీకర యుద్ధం మొదలైంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. అక్టోబరు 7 నుండి జరుగుతున్న యుద్ధంలో 9,400 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. -
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలి్పస్తూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ) అందజేయాలని వైట్‌హౌస్ కమిషనర్ గురువారం ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. -
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు. -
రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాల పంపిణీ.. అమెరికా ఆందోళన
న్యూయార్క్: రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల ఒప్పందం గురించి అమెరికా ఇప్పటికే పలు నివేదికలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాల రవాణాను సరఫరా చేసినట్లు వైట్ హౌస్ శనివారం ఆరోపించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా విడుదల చేసింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా ఇటీవలి వారాల్లో రష్యాకు 1,000 కంటే ఎక్కువ సైనిక పరికరాలు, ఆయుధాల కంటైనర్లను పంపిణీ చేసినట్లు అమెరికాకు సమాచారం ఉందని చెప్పారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య సైనిక సంబంధాలు ఆందోళన కలిగించే అంశమని అమెరికా ఉన్నతాధికారులు అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 మధ్య ఆయుధాల రవాణా జరిగిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సహకారాన్ని అందిస్తున్న ఉత్తర కొరియా చర్యలను తాము ఖండిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సామగ్రిని సమకూర్చిన దేశాలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం కూడా తెలిసిందే. దక్షిణ కోరియాకు అమెరికా యుద్ధ నౌక రావడంపై వైట్‌హౌజ్‌ను ఉత్తరకొరియా హెచ్చరించిన మరుసటి రోజే ఈ ప్రకటనలు రావడం గమనార్హం. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
బైడెన్ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి వెళ్లగొట్టిన అధికారులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ శునకం 'కమాండర్' వైట్ హౌజ్‌లో సిబ్బందిని తరచూ కరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ అధికారిని కరిచి వార్తల్లోకెక్కింది. అయితే.. ఈ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని ప్రదేశానికి ఆ శునకాన్ని పంపించినట్లు వైట్‌హౌజ్ అధికారులు తెలిపారు. 2021లో కమాండర్‌ను బైడెన్ వైట్‌హౌజ్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కనీసం 11 సార్లు అది సిబ్బందిని కరిచినట్లు వార్తలు వచ్చాయి. బైడెన్ వద్ద అంతకుముందు ఉన్న మేజర్ అనే శునకంపై కూడా ఇదే తరహా కేసులు నమోదు కావడంతో దాన్ని కూడా వైట్ హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే.. ప్రస్తుతం కమాండర్‌ను ఎక్కడికి పంపించారో వివరాలు మాత్రం బయటికి వెళ్లడించలేదు. కమాండర్ రక్షణలో ఎంతో శ్రద్ధ కనబరిచిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రశంసించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
థాంక్యూ జగన్ మామయ్యా
గుమ్మలక్ష్మీపురం/విజయనగరం అర్బన్: అమెరికా వెళ్లడం.. ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు కార్యాలయాల్లో ప్రసంగించడం.. వైట్ హౌస్‌ను సందర్శించడం... రాష్ట్రప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపడం.. మమ్మలను మనసారా ఆశీర్వదించడం.. అంతా ఓ మిరాకిల్. చదువులో రాణించిన తమలాంటి పేదకుటుంబాల విద్యార్థులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఓ సువర్ణావకాశం ఇది.. థాంక్యూ జగన్మామయ్యా అంటూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటీవల అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అల్లం రిషితారెడ్డి, సామల మనస్విని ఆనందబాష్పాలు రాల్చారు. 15 రోజుల పాటు (గతనెల 15 నుంచి 27వ తేదీవరకు) పర్యటన అనంతరం స్వస్థలాలకు వచ్చిన వారు ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. పర్యటన వివరాలు వారి మాటల్లోనే... సంతోషంగా ఉంది మాది కురుపాం మండలంలోని కొండబారిడి గిరిజన గ్రామం. 1 నుంచి 5వ తరగతి వరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీపీ స్కూల్లోను, 6వ తరగతి విద్యను కురుపాం మండలం మొండెంఖల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాను. సింగిల్ పేరెంట్కావడంతో గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 7వ తరగతిలో సీటు లభించింది. ప్రసుత్తం 9వ తరగతి చదుతున్నాను. ఈ ఏడాది జూన్ 28న నాలుగోవిడత ‘జగనన్న అమ్మఒడి పథకం’ నిధుల విడుదలకు కురుపాం నియోజకవర్గ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాను. సీఎం ఆశీర్వదించి అమెరికా పర్యటనకు అవకాశం కల్పించారు. మారుమూల గ్రామానికి చెందిన నేను ఓ సారి విశాఖపట్నం, మరోసారి విజ్ఞానప్రదర్శన కోసం విజయవాడకు వెళ్లాను. అంతే.. విమానం ఎక్కుతానని కలలోకూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి చొరవతో ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాను సందర్శించాను. అక్కడకి వచ్చిన వివిధ దేశాల విద్యార్థులతో మమేకమయ్యాం. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించాను. చదువుకోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి వారంతా ముగ్దులయ్యారు. భవిష్యత్తులో అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, స్థిరపడాలన్నా సంప్రదించాలంటూ అక్కడి అధికారులు ఆహ్వానించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంతటి గుర్తింపును, అనుభవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డినికి ప్రత్యేక కృతజ్ఞతలు. – సామల మనస్విని, గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ విద్యార్థిని ఆశయ సాధనకు భరోసా దొరికింది మాది విజయనగరం శివారు కాలనీ జమ్మునారాయణపురం. తండ్రి రామకృష్టారెడ్డి ప్రైవేటు సంస్థలో మెకానిక్. తల్లి ఉదయలక్ష్మి గృహిణి. అక్క హోహితారెడ్డి నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతోంది. నాకు కూడా ఈ ఏడాది అదే కళాశాలలో సీటు వచ్చింది. వాస్త వంగా మాది నిరుపేద కుటుంబం. చాలీచాలని జీతంతో ఇద్దరమ్మాయిలను ఎలా చదివించగలమంటూ నిత్యం మా తల్లిదండ్రులు మదనపడేవారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ బెంగ తీరింది. పదోతరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాను. ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఐక్యరాజ్య సమితి సందర్శనకు వెళ్లాను. అక్కడ అన్ని దేశాల కల్చర్‌ను తెలుసుకున్నాను. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేశాను. పేదపిల్లల చదువుకు ఆంధ్రా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరించాను. ఐక్యరాజ్య సమితి నిర్వహించే చర్చావేదికల్లో పాల్గొన్నా. ప్రభుత్వం అందిస్తున్న చదువుసాయంతో ఉన్నతంగా రాణిస్తాను. – అల్లం రిషితారెడ్డి, విజయనగరం -
అమెరికా వైట్ హౌస్ లో ఏపీ విద్యార్థుల సందడి
-
AP Students Visits White House: అమెరికా వైట్‌హౌజ్‌లో ఏపీ విద్యార్థులు.. అరుదైన అవకాశం (ఫొటోలు)
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులకు వైట్‌హౌస్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి (యూఎన్వో)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల ప్రతినిధి బృందానికి అమెరికా అధ్యక్ష భవనం సందర్శించాల్సిందిగా ఆహ్వానం అందింది. శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు అమెరికాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్ర మే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించడం విశేషం. యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో 10 మంది విద్యార్థుల బృందం గురువారం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. 26 వరకు సదస్సులు, సమావేశాలు మన రాష్ట్ర బృందంలోని విద్యార్థులు శనివారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యునెస్కో)లో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సదస్సులో పాల్గొంటారు. 17న కొలంబియా యూనివర్సిటీలో జరిగే గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రసంగిస్తారు. 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారు. 22న యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో జరిగే ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు. -
ఇన్ఫ్లేషన్ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు
Kamala Harris Dances To Hip-Hop: యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వైట్ హౌస్‌లో హిప్-హాప్ 50వ వార్షికోత్సవ వేడుకను వైట్ హౌస్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించి హిప్-హాప్ ట్యూన్లకు అడుగులేశారు. దీంతో నెటిజన్లు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం షాక్, విధ్వంసకర మౌయి అగ్నిప్రమాదాల అనంతర పరిణామాలు వంటి తీవ్రమైన సమస్యలతో అమెరికా అతలాకుతమవుతోంటే, ఈమె మాత్రం బాధ్యతా రాహిత్యంతో పార్టీని ఆస్వాదిస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై మండి పడ్డారు. మరికొంతమంది వినియోగదారులు ఆమె డ్యాన్స్ టైమింగ్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యాత ఆంథోనీ బ్రియాన్ లోగాన్ గ్రానీ మూవ్స్ అంటూ షేర్ చేసిన 22-సెకన్ల నిడివి గల వీడియోలో హారిస్ డ్యాన్స్ చేశారు. 1999లో క్యూ-టిప్ హిట్ “వివ్రాంట్ థింగ్” కి హారిస్ డ్యాన్స్ చేయడం చూడవచ్చు. హాట్ పింక్ స్లాక్స్, 90ల నాటి నియాన్ బ్లౌజ్‌ని ధరించి చేసిన ఆమె స్టెప్పులు విమర్శలకు తావిచ్చాయి. కోరస్‌కు మించిన సాహిత్యం ఆమెకు తెలియదంటూ సోషల్ మీడియాలో చాలామంది ఎగతాళి చేసారు. "ప్యూర్ క్రింగ్" అని కొందరు "కాకిల్ షఫుల్"గా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా హారిస్ డాన్స్‌పై విమర్శలు చెలరేగడం ఇదే మమొదటిసారి కాదు. జూన్‌లో, బ్రావో "వాచ్ వాట్ హాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్"లో డ్యాన్స్, ఇబ్బందికరమైన నవ్వుపై నెటిజన్లు వ్యాంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. హారిస్ డ్యాన్స్ మూవ్‌లు ఆన్లైన్లో ఎగతాళికి గురి కావడంపై స్పందించిన కొంతమంది పబ్లిక్ ఫిగర్లు కూడా మనుషులే అని గుర్తుంచు కోవాలి అంటున్నారు. సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం,వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ఆస్వాదించడానికి వారూ అర్హులే అని వ్యాఖ్యానించారు. Kamala Harris with the granny 👵🏼 moves at her 50th Anniversary of Hip-Hop partypic.twitter.com/8Lg5XCxQ3a — Anthony Brian Logan (ABL) 🇺🇸 (@ANTHONYBLOGAN) September 9, 2023 -
డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! -
వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్‌గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్‌హౌస్‌లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వైట్ హౌస్‌లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు. గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం దిశగా.. చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్‌ఫోర్స్‌ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది. పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో టర్మ్ మెంబర్‌గా పనిచేసిన ఆయన గోల్డ్‌మన్ సాక్స్‌లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్‌డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి? -
కేసుల వలయంలో డోనాల్డ్ ట్రంప్.. ఇప్పట్లో బయటపడేనా..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 78 కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు ఈ అభియోగాలు అన్నిటిలోనూ శిక్ష పడి, ఏకకాలంలో శిక్ష అనుభవించినా జీవితకాలం పాటు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 76కు చేరుకుంది. ఒకవేళ అభియోగాలన్నీ నిరూపణ అయ్యి ఆయన దోషిగా తేలితే మాత్రం ఆయా నేరాల శిక్షా సమయాన్ని బట్టి ట్రంప్ జీవితకాలం ఖైదును అనుభవించాల్సిందే. శృంగార తారకు చెల్లింపుల వ్యవహారంతో మొదలైన కేసుల పరంపర వైట్ హౌస్ రహస్య పత్రాల కేసుతో ఆయన మెడకు ఉచ్చు మరింత బిగిసింది. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదై ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు వైట్ హౌస్ అధికారులు వాంగ్మూలం ఇవ్వడంతో ట్రంప్ ఇరుకున పడ్డారు. అసలే వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి అభ్యర్థి రేసులో కూడా డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కేసుల ఊబి నుండి బయట బయట పడతారా? బయటపడినా వైట్ హౌస్ చేరుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
శ్వేతసౌధానికి మన ప్రభుత్వ బడి విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదింటి విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా.. మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పది మంది విద్యార్థులకు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం వచ్చింది. తొలిసారి విద్యార్థులకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించే చాన్స్ లభించింది. సెపె్టంబర్లో అమెరికా వెళ్లనున్న మన విద్యార్థులు ఆనెల 17 నుంచి 27 వరకు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యమితి ప్రధాన కార్యాలయంలో స్థిర అభివృద్ధి అనే అంశంపై జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల్లో విద్యావిధానం, కల్పించిన అవకాశాలపై చర్చించనున్నారు. ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ‘మనబడి నాడు–నేడు’ పథకంతో మారిన పాఠశాలల పరిస్థితులు, వసతులు, ఇంగ్లి‹Ùలో బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫలితంగా వచ్చిన మార్పులపై మన విద్యార్థులు సదస్సులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో జరిగే సదస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రసంగించే అవకాశాన్ని ఆ వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎడ్యుకేషన్) డైరెక్టర్ రాధికా అయ్యంగార్ కల్పించారు. ఈమేరకు గురువారం యూఎన్వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్‌కు అధికారికంగా తెలిపారు. అలాగే వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా మన విద్యార్థులు మాట్లాడే అవకాశం లభించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై వివిధ దేశాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించడంపై స్వయంగా వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సెపె్టంబర్లో జరిగే సదస్సుకు తీసుకెళతామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఇదో అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసి యా అఫైర్స్ విభాగం అవకాశం కల్పించిందన్నారు. త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ నేతృత్వంలో అమెరికా సందర్శించే విద్యార్థులను ఎంపిక చేస్తామని షకిన్ కుమార్ తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. అందుకు అనుగుణంగా టోఫెల్, డిజిటల్ విద్య, స్మార్ట్ బోర్డుల బోధన, భాషా నైపుణ్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే స్వయంగా ప్రపంచ వేదికపై తెలియజేస్తారని ఆయన వివరించారు. -
బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు
అగ్రరాజ్యం అమెరికాలో జరిగే పరిణామాల గురించి తెలుసుకోవాలని ప్రతీదేశానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాగే అధ్యక్షుడు బైడెన్ పనితీరు గురించి తెలుసుకోవాలని కూడా పలువురు అనుకుంటారు. అయితే బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే బైడెన్ లోపల మరో విధంగా ఉంటారని అని సన్నిహితులు చెబుతుంటారు. బైడెన్ వైట్‌హౌస్‌లోని గది తలుపులు మూసివేసి, తన సహాయకులపై కోపాన్ని ప్రదర్శిస్తారని పలువురు చెబుతుంటారు. వైట్ హౌస్ సిబ్బందిని తిట్టడంలో బైడెన్ ముందుంటారని ఒక తాజా నివేదిక తెలియజేస్తోంది. ‘ఎవరూ సురక్షితంగా లేరు’: సీనియర్ అధికారి గతంలోనూ, ప్రస్తుతం బైడెన్‌కు సహాయకులుగా పనిచేస్తున్న ఒక సీనియర్ ‘ఆక్సియోస్’ సంస్థతో మాట్లాడుతూ తనను తరచూ బైడెన్ నిందిస్తుంటారని ఆరోపించారు. ఇక్కడున్న కొంతమంది అధ్యక్షుడి కోపానికి భయపడుతున్నారని, అతని భాషను భరించలేక, తమకు కవచంగా వారు సహోద్యోగులను సమావేశాలకు తీసుకువెళుతుంటారని చెప్పారు. ఇక్కడి ఉద్యోగులు ‘ఎవరూ సురక్షితంగా లేరు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ కోసం టెస్టింగ్ కిట్ రోల్అవుట్ చేసే విషయంలో 2021 చివరిలో బైడెన్ అప్పటి కోవిడ్ నియంత్రణ అధికారి, ప్రస్తుత వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జియంట్స్పై విపరీతమైన కోపం ప్రదర్శించారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా.. బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టెడ్ కౌఫ్మన్ అవుట్లెట్ సంస్థతో మాట్లాడుతూ బైడెన్ తన సిబ్బంది ఇబ్బంది పెట్టడానికి ఇలా చేయరని, సరైన నిర్ణయం తీసుకునే దిశగా అలా ప్రవర్తిస్తారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా మంచి నిర్ణయం తీసుకోవచ్చని బైడెన్ భావిస్తారని తెలిపారు. కాగా బైడెన్‌కు టెంపర్ ఉందనడంలో సందేహం లేదని ‘ది ఫైట్ ఆఫ్ హిజ్ లైఫ్: ఇన్సైడ్ జో బైడెన్స్ వైట్ హౌస్’ రచయిత క్రిస్ విప్ల్ పేర్కొన్నారు. అయితే ఇది బిల్ క్లింటన్ మాదిరిగా అగ్నిపర్వతం కాకపోవచ్చు, కానీ బైడెన్‌కు ఖచ్చితంగా టెంపర్ ఉందన్నారు. బైడెన్ ‘అహంకార నిరంకుశుడు’ కౌఫ్మన్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, బైడెన్ మాజీ ప్రచార సహాయకుడు జెఫ్ కన్నాటన్ మాట్లాడుతూ అధ్యక్షుడిని ‘అహంకార నిరంకుశుడు’గా అభివర్ణించారు. అతను తన 2012 నాటి పుస్తకం ‘ది పేఆఫ్: వై వాల్ స్ట్రీట్ విన్స్’ లో ‘భయంతో తన సిబ్బందిని అదుపులో ఉంచాలని బైడెన్ నిర్ణయించుకున్నాడు’ అని పేర్కొన్నారు. బైడెన్ తన 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సహాయకుడు నిధుల సేకరణ కాల్లు చేయడానికి సమయం ఆసన్నమైందని అనడంతో అతనితో ‘కారు నుండి బయటకు వెళ్లండి’ అని బైడెన్ అరిచారని కన్నాటన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై వైట్‌హౌస్ తక్షణమే స్పందించలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: పేదరికంపై భారత్ విజయం! ‘అది నాయకత్వం చిహ్నమా?’ బైడెన్ తన చివరి దశలో చిత్తవైకల్యంతో బాధపడుతున్నట్లుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ట్విట్టర్లో స్నిప్ చేశారు. బైడెన్ మంచి వ్యక్తి అని పేర్కొనడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ప్రో-రాన్ డిసాంటిస్ సూపర్ పీఏసీ జాతీయ ప్రతినిధి స్టీవ్ కోర్టెస్ పేర్కొన్నారు. బైడెన్ అవినీతిపరుడు. అబద్ధాలకోరు. ప్రెస్‌లోని మూర్ఖులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. ఎవరైనా సరే ఇతరుల తిట్టడం అనేది చాలా చెడ్డ విషయం. అయితే బైడెన్ దీనిని 'నాయకత్వానికి చిహ్నం' అని చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలుసు’ బైడెన్ గత సంవత్సరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఒక పరిచయస్తుడితో తన వయస్సు గురించి చర్చ జరిగినప్పుడు ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. అలాగే బైడెన్ తన కుమారుడి విదేశీ వ్యాపార వ్యవహారాల్లో అతని ప్రమేయం గురించి ప్రశ్నించినప్పుడు అధ్యక్షుడు ది పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. మరోసారి హాట్ మైక్‌లో ఫాక్స్ న్యూస్ వైట్ హౌస్ రిపోర్టర్ పీటర్ డూసీని ‘బిచ్కు పుట్టిన తెలివితక్కువ కొడుకు’ అంటూ అవమానకరంగా సంబోధించారు. ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తన? ప్రజలను ఇబ్బందులకు గురిచేసే తన సిబ్బందిని కాల్చివేస్తానంటూ గతంలో బైడెన్ చేసిన తొలి వాగ్దానంలోని నిజాయితీని ఈ నివేదిక ప్రశ్నించింది. గతంలో బైడెన్ ‘నేను ఈ విషయంలో జోక్ చేయడం లేదు, నాతోపాటు పని చేస్తున్నవారు.. మరొక సహోద్యోగితో అగౌరవంగా ప్రవర్తించడం లేదా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం అనేది నేను విన్నట్లయితే, అందుకు బాధులైనవారిని అక్కడికక్కడే విధుల నుంచి తొలగిస్తాను. అని బైడెన్ తన సిబ్బందితో జనవరి 20, 2021న ప్రమాణం చేస్తున్నప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు తాను చేసిన ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తిస్తున్నారని అతని సన్నిహితులే విమర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే! -
ఇక ఏది దొరికినా తొందరపడి పరీక్షీంచకండి!
ఇక ఏది దొరికినా తొందరపడి పరీక్షీంచకండి! -
అమెరికా అధ్యక్ష భవనంలో కొకైన్.. బైడెన్ కొడుకుపైనే ఆరోపణలు!
అమెరికాలోని శ్వేత సౌధంలో అధికారులు కొకైన్ గుర్తించిన నేపధ్యంలో దీనివెనుక అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ప్రమేయమందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హంటర్ బైడెన్ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ గతంలో బహిరంగంగా దొరికిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తండ్రి జో బైడెన్ హాలిడే వీకెండ్‌కు వెళ్లిన సమయంలో జోహంటర్ ఇక్కడకు వచ్చారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో హంటర్ బైడెన్‌పై పలు మీమ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. #HunterBiden is a disgrace and embarrassment to our nation. He is a degenerate, lowlife criminal who has direct access to American power and state secrets. WHEN will something be done about him? WHEN? pic.twitter.com/ILh1s2xVwu — Giordano Bruno (@GioBruno1600) July 4, 2023 ఈ మాదకద్రవ్యాలను హంటర్ బైడెన్ అక్రమంగా వైట్‌హౌస్‌లోకి తీసుకువచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై అమెరికా న్యాయ విభాగం.. ఫెడరల్ టాక్స్ ఎగవేత, మారణాయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో హంటర్ తాను అక్రమంగా ఆయుధాలు కలిగివున్నానన్న విషయాన్ని అంగీకరించారు. దీనికి తోడు హంటర్ బైడెన్ 2017, 2018లలో 1.5 మిలియన్ డాలర్ల అధిక ఆదాయంపై తన ఆదాయపు పన్నురిటర్న్లను దాఖలు చేయలేదు. DNC 2020: Joe Biden says 'character and decency are on the ballot' #whiteHouse #HunterBiden #BidenCrimeFamilly pic.twitter.com/ozXRlDmNow — Don_Vito 🇺🇸 (@Don_Vito_08) July 4, 2023 అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు చెందిన ల్యాప్‌టాప్ నుంచి 9 వేల ఫొటోలను గతంలో మార్క్పోలో పబ్లిష్ చేసింది. వీటిలో హంటర్ డ్రగ్స్ తీసుకున్నవి, వేశ్యలతో ఉన్నవి, నగ్నంగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. డైలీమెయిల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫొటోలు బీచ్‌లలో హంటర్ ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే హంటర్ స్మోకింగ్చేస్తూ, స్పీడ్ డ్రైవింగ్ చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిష్టాత్మక వైట్ హౌస్‌లో కొకైన్ లభ్యమైన దరిమిలా ట్విట్టర్లో పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైట్ హౌస్‌లో కొకైన్ కనిపించడం వెనుక ప్రధాన కారణం హంటర్ బైడెన్? అని, హంటర్ బైడెన్ దేశానికి చీడపురుగు, నేరగాడు అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. Crack House discovered on Pennsylvania Ave in Washington DC#CocaineFoundInWhiteHouse #HunterBiden 🗻🚬🔥💨🥃🤧 pic.twitter.com/grchpyXjkf — Don_Vito 🇺🇸 (@Don_Vito_08) July 4, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం..అధికారులు అప్రమత్తం -
Cocaine In White House: వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం.. అధికారులు అప్రమత్తం!
అమెరికాలోని వైట్‌హౌస్ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాదకద్రవ్యం)ను గుర్తించారు. ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు. అనంతరం ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. అయితే కొకైన్‌ను గుర్తించిన సమయంలో వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన తన వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్‌ను పలు విధాలుగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది పౌడర్ కొకైన్ అని గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం ఆ తెల్లటి పౌడర్ ప్యాకెట్ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఆ పౌడర్ వైట్‌హౌస్‌లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఓవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్‌లు కూడా అక్కడే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజూ వివిధ ప్రభుత్వ పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా! -
బైడెన్‌కు తీవ్ర నిద్ర సమస్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రకు సంబంధించిన స్లీప్ అప్నియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన కొన్ని రోజులుగా నిద్ర కోసం సీపాప్(కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) అనే యంత్రాన్ని వాడుతున్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. స్లీప్ అప్నియా సమస్య ఆయనకు దశాబ్దకాలంగా ఉందని తెలిపారు. 2008 నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన తన మెడికల్ రిపోర్టుల్లో వెల్లడిస్తున్నారని కూడా పేర్కొన్నారు. స్లీప్ అప్నియా అనేది సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు రాత్రి మొత్తం నిద్రపోయినా పగటి వేళ అలసిపోయినట్లు ఉంటారు. సీపాప్ యంత్రాన్ని అధ్యక్షుడు మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచి్చందని వైట్‌హౌస్ అధికారులు వివరించారు. షికాగోలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. సీపాప్ పరికరాన్ని వాడటం వల్లే ఇలా గీతలు పడ్డాయని తెలిపారు. -
ప్రశ్నల పీక నొక్కకండి!
ప్రశ్నిస్తే... వేధిస్తారా? అవును. సోషల్ మీడియా తెర చాటున నిలబడి దొంగ పేర్లతో బాణాలు వేసే విచ్చలవిడి వీరత్వం పెరుగుతున్న కొద్దీ అదే ఖాయమవుతోంది. గత వారం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానిని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు సాక్షిగా ఇబ్బందికరమైన ప్రశ్న వేయడమే పాకిస్తానీ అమెరికన్ జర్నలిస్ట్ సబ్రినా సిద్దిఖీ చేసిన పాపమైంది. భారత్‌లో మైనారిటీల హక్కుల సంగతి అడిగిన ఆమెపై ట్రోలింగ్ తీరు అచ్చం అలాగే ఉంది. చివరకు వైట్‌హౌస్ ప్రతినిధి ఈ ట్రోలింగ్లు ‘అంగీకారయోగ్యం కాదు’ అని ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని హితవు చెప్పాల్సొచ్చిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అమెరికా దాకా అంతటా జర్నలిస్టులకు ఎదురవుతున్న ట్రోలింగ్భూతంపై పోరు అత్యవసరమని ఇది గుర్తుచేస్తోంది. మోదీని ప్రశ్నించిన సబ్రినా సిద్దిఖీ అనుభవమున్న జర్నలిస్ట్. తల్లితండ్రులు పాకిస్తానీలైనా, ఆమె పుట్టింది అమెరికాలోనే. దీర్ఘకాలంగా అమెరికా అధ్యక్షులు, వైట్‌హౌస్ వ్యవహారాలను నివేదిస్తూ, విలేఖరిగా తనదైన ముద్ర వేశారు. ‘హఫింగ్టన్ పోస్ట్’, ‘బ్లూమ్‌బెర్గ్’, ‘గార్డియన్’ లాంటి ప్రసిద్ధ సంస్థల్లో తన పాళీకి పదునుపెట్టుకున్నారామె. సాధారణంగా ఎన్నడూ అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు జవాబివ్వాల్సిన విలేఖరుల సమావేశంలో పాల్గొనని మోదీ వైట్‌హౌస్ ఒత్తిడి మేరకు బైడెన్‌తో కలసి విలేఖరుల ముందుకు రావాల్సి వచ్చింది. ఇద్దరూ చెరి రెండు ప్రశ్నలకు సమా ధానాలు చెప్పిన ఆ భేటీలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రతినిధిగా సబ్రినా మోదీని వేసింది ఒక ప్రశ్నే. ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మతపరమైన మైనారిటీలపై ప్రభుత్వ దుర్వి చక్షణ సాగుతోందనీ, విమర్శకుల నోరు మూయిస్తున్నారనీ మానవ హక్కుల సంస్థలంటున్నాయి. మైనారిటీల హక్కులకై మీ సర్కారేం చేయనుంది’ అన్నది స్థూలంగా ప్రశ్న. ఇరుకున పెట్టే ప్రశ్న వేసినా, భారత్‌లో అలాంటిదేమీ లేదంటూ ప్రధాని బలంగానే తన వాణి వినిపించారు. అయినా సరే, ఆయనను అలాంటి ప్రశ్న వేయడం వీరభక్తులకు నచ్చలేదు. ఫలితమే – అంతర్జాలంలో సబినాపై అమానుష దాడి. ఆమె పాకిస్తానీ అనీ, ముస్లిమ్ అనీ, డిజిటల్ యుగపు నిరసనల ‘టూల్‌కిట్ గ్యాంగ్’లో భాగమనీ దుర్భాషలాడారు. ఇలాంటి ట్రోలింగ్ ప్రైవేట్ మూకల్నీ, సాంకేతిక జ్ఞానంతో కావాల్సిన సందేశాలు పంపే ఇంటర్నెట్ బాట్ల విధానాన్నీ ఇవాళ పాలక వ్యవస్థలన్నీ పెంచిపోషిస్తున్న మాట నిష్ఠురసత్యం. మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధిస్తున్నది పాలకపక్ష ప్రైవేట్ సైన్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. ధైర్యంగా ప్రశ్నించడంలో జర్నలిస్టుగా ఆమె తన బాధ్యత నిర్వహిస్తే, సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం విస్తుపరుస్తోంది. వెనకెవరూ లేనిదే ఇంతగా వేధింపులకు దిగరనేది తర్కబద్ధమే. ‘ఈ పని మీ ప్రైవేట్ ట్రోల్ సేనలది కాదా? వారిపై చర్యలు తీసుకుంటారా?’ అని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. మీడియా ప్రజాస్వామికీకరణకు సోషల్‌మీడియా ఉపకరించింది ఎంత నిజమో, వేదికలు పెరిగి, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్డుకట్ట లేని అంతర్జాలంలో అడ్డమైన అభిప్రాయాలనూ వదిలి, భావకాలుష్యం పెంచుతున్నదీ అంతే నిజం. దాని విపరిణామమే ఇప్పుడు ప్రపంచమంతటా చూస్తు న్నది. మెజారిటీ ఆలోచనకు భిన్నాభిప్రాయం ఉన్నవారెవరినీ సోకాల్డ్ ప్రజాస్వామ్య వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో ఎక్కడా మననివ్వక పోవడం నిత్యం చూస్తున్నదే. సాధారణ సమూహాల నుంచి పాలక పక్షాల దాకా అందరికీ ఈ ట్రోలింగ్ ఓ ఆనవాయితీ. ప్రత్యర్థి పీకనొక్కే పదునైన ఆయుధం. ఈ వర్తమాన వైపరీత్యానికి బాధితులే – అమెరికాలో సబ్రినా అయినా, హైదరాబాద్‌లో చందు తులసి అయినా! ఇందులో భావప్రకటన స్వేచ్ఛ ఒక్కటే కాదు... బెదిరింపులు, దూషణలతో భయభ్రాంతుల్ని చేసి, మానసికంగా హింసించే మానవ హక్కుల ఉల్లంఘన కోణమూ ఉంది. సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రి సబ్రినా తరహాలో తమ పాలనపై ప్రశ్నలు వేస్తున్న వారందరినీ ఇప్పటికే ‘పాత్రికేయ వేశ్యలు’ (ప్రెస్టిట్యూట్స్) అనడం చూశాం. అది ఏ స్థాయి అసహనమో అర్థం చేసుకున్నాం. పాలకులు సైతం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో పాత్రికే యుల పని ప్రశ్నించడమే! ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తేనే అది నేరమన్నంత అసహనం ఏ పాలన కైనా మంచిది కాదు. వేసిన ప్రశ్నలో, చేసిన విమర్శలో నిజం లేదనుకుంటే, ఆ సంగతి ససా క్ష్యంగా చెప్పవచ్చు. నలుగురికీ తెలిసేలా నిరూపణలు చూపవచ్చు. అంతేకానీ, అభిప్రాయం కలిగివుండ డమే నేరమన్నట్టు ప్రవర్తిస్తే అన్యాయం. కానీ, వాట్సప్ యూనివర్సిటీలు పంచుతున్న, పెంచుతున్న అజ్ఞానాంధకారం సాక్షిగా దేశంలో ఈతరహా వేధింపులు అన్ని స్థాయుల్లో పెరిగిపోవడమే విషాదం. భగవద్గీత సైతం తెలుసుకొనేందుకు ‘పరిప్రశ్న’ వేయమనే చెబుతోంది. కానీ, ప్రశ్నించడమే నేర మనే ధోరణిలోకి మన దిగజారడం కలవరపెడుతోంది. ఈ ట్రోలింగ్ ముఠా తెలిసో తెలియకో... ‘విమర్శకుల నోరు మూయిస్తున్నారట’ అన్న సబ్రినా వాదననే నిజంచేసింది. అలాగే, లింగ వివక్షతో రాజకీయాల్లో మహిళలపై ట్రోలింగ్ మరీ ఎక్కువనీ, న్యూజిలాండ్ ప్రధాని నుంచి మన దేశపు నేతల దాకా అందరూ బాధితులేననీ రెండేళ్ళ పరిశోధనతో ఈ ఫిబ్రవరిలో విడుదలైన అధ్యయనం తేల్చ డం గమనార్హం. అధికార భావజాలాన్ని వ్యతిరేకిస్తే మీపై, పిల్లలపై అత్యాచారం చేస్తామనే ఈ బరి తెగింపు వేధింపుల్ని అరికట్టే కఠినమైన సైబర్ చట్టాలు కావాలి. ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే, గొంతు విప్పడానికే భయపడాల్సిన పరిస్థితిని ఎక్కడ, ఎవరు, ఎందుకు సృష్టించినా అది సమర్థనీయం కాదు. సహించాల్సింది కానే కాదు. అది ప్రజాస్వామ్యం అసలే కాదు! -
‘మోదీకి ప్రశ్న.. సబ్రీనాపై వేధింపులు సరికాదు’
వాష్టింగ్టన్: అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీకి.. భారత్‌లో మైనారిటీల హక్కుల సంరక్షణపై ప్రశ్న గుప్పించిన మహిళా జర్నలిస్ట్ వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయం తమకూ తెలుసున్న అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్.. ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ అయిన సబ్రీనా ‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆన్ లైన్ లో వేధింపులు ఎదుర్కొంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించగా.. వైట్ హౌస్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ స్పందించారు. సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిర్బీ తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు. కిర్బీ ప్రకటన తర్వాత.. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్ పెర్రీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కిర్బీ ప్రకటనతో తానూ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. Prime Minister Modi completely destroyed the motivated question on steps being taken to ‘protect’ rights of Muslims and other minorities. In his response he didn’t mention Muslims or any other denomination, spoke about Constitution, access to Govt resources based on eligibility… pic.twitter.com/mPdXPMZaoI — Amit Malviya (@amitmalviya) June 22, 2023 సబ్రీనా సిద్ధిఖీ పాక్ మూలాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లే అయినా.. తండ్రి మాత్రం భారత్‌లో జన్మించారు. సబ్రీనా మాత్రం అమెరికాలో జన్మించారు. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆమె.. భర్తతో కలిసి వాషింగ్టన్లో ఉంటున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె రిపోర్టింగ్ పనితీరు గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2019 వరకు గార్డియన్ కోసం పని చేసిన ఆమె.. ఆ తర్వాత వాల్ స్ట్రీట్జర్నల్కు పని చేస్తూ వస్తున్నారు. గతంలో హఫ్పింగ్టన్పోస్ట్, బ్లూమ్బర్గ్లోనూ ఆమె పని చేశారు. నాలుగేళ్ల కిందట ముహమ్మద్ అలీ సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. వీళ్లకు సోఫీ అనే పాప ఉంది. As President of SAJA, I want to add that @SabrinaSiddiqui asked a fair question, one PM Modi's team and anyone keeping track of news should have expected. His response and how Indian journalists haven't had the opp to ask him this in 9 years is what we should talk about more. https://t.co/SwTkfq95Sg — Mythili Sampathkumar (@MythiliSk) June 26, 2023 ఇదీ చదవండి: దేశంలో ఏం జరుగుతుందో తెలియాలా? -
వైట్‌హౌస్‌లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్‌లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్‌లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్‌ట్రాక్‌గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
నూతన రంగాల్లోనూ కలిసి పనిచేస్తున్న భారత్, అమెరికా
వాషింగ్టన్: నూతన రంగాల్లోనూ భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాలో పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇచి్చన విందులో పాల్గొన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచి్చన తనకు ఘన స్వాగతం పలికిన అమెరికా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాలు పెంపొందించుకుంటున్నాయని తెలిపారు. భారత్–అమెరికా సంబంధాలనే శ్రావ్యమైన గానాన్ని ఇరుదేశాల పౌరులే స్వరపర్చారని కొనియాడారు. రెండు దేశాల మైత్రి బలపడానికి భారతీయ–అమెరికన్ అయిన కమలా హ్యారిస్ ఎంతగానో కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ విందులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొన్నారు. -
నాటు నాటుకి అమెరికన్ యువత స్టెప్పులు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందు సరదా సంభాషణలతో సందడిగా సాగింది. వైట్‌హౌస్ నార్త్ లాన్లో గురువారం రాత్రి ఈ విందుకు 400 మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహేంద్ర, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తదితరులు ఈ విందుకి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ విందులో అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీతో సరదా సంభాషణలతో నవ్వులు పూయించారు. విందులో టోస్ట్ (ఆరోగ్యం కోసం తీసుకునే ఒక పెగ్గు ఆల్కహాల్) సంప్రదాయం గురించి బైడెన్ మాట్లాడుతూ ‘‘మిస్టర్ పీఎం మీరు ఎవరికైనా టోస్ట్ అందించాలనుకుంటే మీ చేతి గ్లాసులో ఆల్కహాల్ లేకపోతే ఎడమ చేత్తో వారికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మా తాతయ్య చెప్పేవారు’ అని బైడెన్ అంటే మోదీ చిరునవ్వులు చిందించారు. బైడెన్, మోదీ ఇద్దరూ ఆల్కహాల్ తీసుకోరు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు. బైడెన్ ఆతిథ్యానికి అతిథులందరూ ఫిదా అయిపోయి పాటలు పాడాలని అనుకుంటారని మోదీ అన్నారు. 2014లో అమెరికాకు వచ్చినప్పుడు నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఉండడంతో ఏమీ తినలేదని, అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ తనని బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. తాను తినాలన్న బైడెన్ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. అతిధులందరూ ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకోవాలంటూ మోదీ స్వయంగా టోస్ట్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య బంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు. భారత్‌లో పిల్లలు హాలోవిన్ వేడుకల్ని చేసుకుంటూ స్పైడర్ మ్యాన్‌ను చూసి పులకించిపోతూ ఉంటే, అమెరికన్ యువత తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్లో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకి స్టెప్పులేస్తున్నారు’అని ప్రధాని పేర్కొన్నారు. అధికారిక విందులో మెనూ..! ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం, తృణధాన్యాలతో చేసిన వంటలను దగ్గరుండి మరీ జిల్ బైడెన్ వడ్డించారు. మారినేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ మొక్కజొన్న సలాడ్, పుచ్చకాయ జ్యూస్, అవకాడో సాస్, స్టఫ్డ్ మష్రూమ్స్, క్రీమీ రిసొట్టో, లెమన్ డిల్ యోగర్ట్ సాస్ వంటివి ప్రత్యేకంగా వడ్డించారు. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి.. అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందన్నారు. భారత్ అభివృద్ధి చెందితే మొత్తం ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్నారు. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉందన్న సంగతి మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్‌లో గురువారం మోదీ ప్రసంగించారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిధ్వనించిన ‘మోదీ’ నరేంద్ర మోదీ ప్రసంగం సందర్భంగా అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో కోలాహలం నెలకొంది. పార్లమెంట్ సభ్యులు ఆయనకు తొలుత చప్పట్లతో స్వాగతం పలికారు. ‘మోదీ మోదీ’నినాదాలతో సభ పలుమార్లు ప్రతిధ్వనించింది. మోదీ ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది. పార్లమెంట్ సభ్యులతోపాటు గ్యాలరీల్లో ఉన్న భారతీయ–అమెరికన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ మాట్లాడుతుండగా 15 సార్లు స్టాండింగ్ ఓవేషన్లు, 79 సార్లు చప్పట్లతో హర్షామోదాలు లభించడం గమనార్హం. మోదీతో సెల్ఫీలు దిగడానికి సభ్యులు పోటీపడ్డారు. ఆయన నుంచి ఆటోగ్రాఫ్‌లు సైతం తీసుకున్నారు. భారతీయ అమెరికన్లు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. -
State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైట్ హౌస్‌లో పసందైన విందు ఇచ్చారు బైడెన్ దంపతులు. మోదీ శాకాహారీ కావడంతో వైట్ హౌస్ చెఫ్ నీనా కర్టిస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో మోదీ కోసం తొలిసారిగా వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును ఏర్పాటు చేశారు. విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. మోదీ వెజెటేరియన్ కావడంతో ఆయనకు వడ్డించే మెనూపై అందరి దృష్టి పడింది. ఫుడ్ మెనూలో ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మోదీకి ఇచ్చిన డిన్నర్ మెనూలో ప్రత్యేకమైంది మిల్లెట్స్. తృణధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్ మెనూలో చేర్చారు. ఫస్ట్కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్ట్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, టాంగీ అవకాడో సాస్ అందించారు. ఆ తర్వాత మెయిన్ కోర్సులో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డించారు. చివరగా స్ట్రాబెర్రీ కేక్‌తో వైట్ హౌస్‌లో డిన్నర్ విందును ముగించారు. -
వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అభిమానులను ఎపుడూ నిరాశ పర్చరు. బుధవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్ చెక్ లీగ్ గురించి ట్వీట్ చేసిన మహీంద్ర గురువారం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టారు. వైట్‌హౌస్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లోని స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. దీంతో గ్రేట్ సర్ అంటూ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. (వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..) ఈ సందర్భంగా అక్కడ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికిన తీరు, థీమ్ వంటలపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు అంతేకాదు స్టేట్ డిన్నర్లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హోస్ట్ చేసే విందును కడుపారా ఆరగించేందుకు మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేశానంటూ తనదైన శైలిలో చమత్కరించారు. కాగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారి వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును నిర్వహించడం విశేషం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు లాంటివేవీ లేకుండా పూర్తిగి శాఖాహారాన్ని వడ్డించారు..(స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!) 400 మంది వీవీఐపీలు హాజరైన ఈ డిన్నర్‌కు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్,మైక్రోసాఫట్ సత్య నాదెళ్ల,యాపిల్ సీఈవో టిమ్ కుక్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సహా ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ దంపతులు,పెప్సికో మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లాంటి పలువురు ప్రముఖులతో కలిసి స్టేట్ డిన్నర్లో సందడి చేశారు. #WATCH | Indra Nooyi, former Chairperson and CEO of PepsiCo arrives at the White House for the State Dinner pic.twitter.com/oBhvk2KmMX — ANI (@ANI) June 22, 2023 -
PM Modii US Visit: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. అమెరికా వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు అధ్యక్షుడు జో బైడెన్. పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.. ఓ వైపు వర్షం పడుతున్నా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలాపన నిర్వహించారు. మోదీ రాక కోసం వైట్ హౌస్ వద్ద ఎదురు చూస్తోన్న వందలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ- బైడెన్ క్లుప్తంగా ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారిని అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతలపాణి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, కేఎస్ఎన్ రాజు, రామకృష్ణ, పృద్వీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే) -
వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22 గురువారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం జూన్ 23) ప్రధాని నరేంద్ర మోదీకి స్టేట్ డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు హాజరైన వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను రెండు దేశాలకు చారిత్రకమైనదిగా ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ విందుకు దాదాపు 400 మంది అతిథులను బైడెన్ ఆహ్వానించారు. అతిథుల జాబితాలో భారత్‌కు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఇంద్ర నూయి, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, ఆంటోనీ బ్లింకెన్, శాంతను నారాయణ్, ఎరిక్ గార్సెట్టి, కెవిన్ మెక్‌కార్తీ, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, గినా రైమోండో తదితరులు ఉన్నారు. అమెరికాను సందర్శించే దేశాధినేతల గౌరవార్థం వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం ఆనవాయితి. వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. స్టేట్ డిన్నర్ అనేది వైట్ హౌస్ ముఖ్యమైన వ్యవహారాలలో ఒకటి. కాగా బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు మాత్రమే ఇలాంటి విందు ఇచ్చారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వడం ద్వారా భారత్‌కు బైడెన్ ఇస్తున్న ప్రాముఖ్యత వెల్లడైంది. #WATCH | Washington, DC | Mukesh Ambani and Nita Ambani arrive at the White House for the State Dinner pic.twitter.com/qJ1wP3KZym — ANI (@ANI) June 22, 2023 -
భారత్‌లో ముస్లింల హక్కులపై ప్రశ్న.. అది మా డీఎన్ఏలోనే ఉంది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన ఆధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ రోజు బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపానని తెలిపారు. ప్రజాస్వామిక విలువల గురించి తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. గురువారం వైట్‌హౌస్‌లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అరుదైన సంఘటనలో, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో పాత్రికేయుల నుంచి ప్రశ్నలు సంధించారు. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ ‘ప్రజాస్వామ్యం మన సిరల్లో నడుస్తోంది’ అని అన్నారు. దేశం మతం లేదా కుల ప్రాతిపదికన వివక్ష చూపదని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి, బిజెపి యొక్క చాలా నొక్కిచెప్పబడిన నినాదం - సబ్కా సాథ్, సబ్కా వికాస్. భారత్–అమెరికా సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయంచామన్నారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ఫలవంతం చేయడానికి ఇరుదేశాల ప్రభాత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చి, కలిసి పనిచేసేలా అంగీకారానికి వచ్చామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం నేడు మరో కొత్త స్థాయికి చేరిందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై భారత్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. నూతన రంగాల్లో భారత్, అమెరికా కలిసి చేయాలన్నదే తన ఆకాంక్ష అని జో బైడెన్ వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్, అమెరికాకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్ తెలియజేశారు. ప్రతి పౌరుడికీ గౌరవం లభించాలన్నారు. అమెరికా స్ఫూర్తితో సాహసోపేత నిర్ణయాలు రక్షణ, అంతరిక్షం, ఇంధనం, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గురువారం అధికారిక చర్చలు జరిపారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు ఈ ముఖాముఖి సమావేశానికి వేదికగా మారింది. పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి బైడెన్ చేపట్టిన చర్యలను మోదీ ప్రశంసించారు. చదవండి: H-1B Visa: ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ అక్కడే! భారత్–అమెరికా ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధమే ఇరు దేశాల నడుమ సంబంధాలకు అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. నేడు భారత్–అమెరికా సముద్రాల లోతుల నుంచి ఆకాశం అంచుల దాకా, ప్రాచీన సంస్కృతి నుంచి ఆధునిక కృత్రిమ మేధ దాకా భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో అమెరికా చూపుతున్న అంకితభావం తాము సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోవడానికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానిచారు. మోదీ, బైడెన్ శ్వేతసౌధంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు. మోదీకి ప్రత్యేక విందు.. అగ్రరాజ్య పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘనమైన స్వాగతం లభించింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ఆయన సతీమణి జిల్ ఎదురొచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ద్వారం వద్దే సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. తర్వాత శ్వేతసౌధంలోకి తోడ్కొని వెళ్లారు. వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోదీని బైడెన్ దంపతులు ఆహ్వానించిన విషయం విదితమే. వైట్‌హౌజ్‌లో బైడెన్ కుటుంబసభ్యులతో మోదీ కాసేపు మాట్లాడారు. ‘ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం ఇరుదేశాల గాఢమైన స్నేహబంధానికి సంకేతం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌చేసింది. తృణధాన్యాలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, పుట్టగొడుగులు, మిల్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ ఇలా భిన్న పదార్థాలతో వేర్వేరు వంటకాలను మోదీకి వడ్డించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తుచేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సులేవాన్, అజిత్ దోవల్‌లు పాల్గొన్నారు. మరోవైపు మోదీకి దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇవ్వనున్నారు. -
బైడెన్‌కు దశ దానం.. దాని ప్రాముఖ్యత తెలుసా?
అమెరికా పర్యటనలో భాగంగా.. వైట్‌హౌజ్ విందుకు హాజరైన ప్రధాని మోదీ.. సతీసమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు. మోదీ టేస్ట్‌కి తగ్గట్లే కెమెరాలను బైడెన్ ఇవ్వగా.. భారత సంప్రదాయానికి తగ్గట్లు ఉపనిషత్తుల కాపీని, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌కు బహుకరించారు. అదే సయమంలో మోదీ బహుకరించిన గంధపు చెక్కతో కూడిన పెట్టె ఒకటి బైడెన్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పెట్టెను.. అందులో ఉన్న దశ దానం ప్రశస్తిని స్వయంగా మోదీనే బైడెన్‌కు వివరించారు. హిందూ జీవన విధానంలో ‘‘దశ దానం’’ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. హిందూ ఆచారాలకు ప్రతీక కూడా. ► ప్రాచీన భారతీయ గ్రంథం కృష్ణ యజుర్వేదంలో వైఖానస గృహ్య సూత్రం ప్రకారం.. ఒక వ్యక్తి దాదాపు 29,530 రోజులు.. మరోలా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది నెలల వయస్సును పూర్తి చేసినప్పుడు ‘దృష్ట సహస్రచంద్రుడు’ అంటే వెయ్యి పౌర్ణమిలను చూసిన వ్యక్తి అవుతాడు. ► హిందూ జీవన విధానంలో.. ప్రతీ వ్యక్తికి ఇదొక ముఖ్యమైన మైలురాయి లాంటిది. జీవితంలో ఆ దశ పూర్తైన వాళ్లను.. వాళ్ల పరిపూర్ణ అనుభవానికి గుర్తుగా గౌరవించబడతారు. శాస్త్రోక్తంగా.. వినాయక పూజలతో మొదలవుతుంది. పూర్ణహారతి, శతాభిషేకం.. చివరకు సహస్ర చంద్ర దర్శనంతో ముగుస్తుంది. ► సహస్ర పూర్ణ చంద్రోదయం సమయంలో.. దశ దానం చేయడం ఆనవాయితీ. గోదానం, భూదానం, తిలదానం(నువ్వులు) , హిరణ్యదానం(బంగారం), ఆజ్యదానం(నెయ్యిగానీ.. వెన్నగానీ), ధాన్యదానం, వస్త్రదానం, గుడ(బెల్లం) దానం, రౌప్యదానం(వెండి), లవణదానం(ఉప్పు) చేస్తారు. ► బైడెన్ కిందటి ఏడాది నవంబర్‌తోనే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు మోదీ దశ దానం సమర్పించారు. ► జైపూర్(రాజస్థాన్)కు చెందిన ఓ కళాకారుడు ఆ ప్రత్యేకమైన చందనపు పెట్టెను రూపొందించారు. అందుకు కావాల్సిన చెక్కలను మైసూర్ నుంచి తెప్పించారు. తరతరాలుగా ఇలా గంధపు పెట్టెల తయారీ రాజస్థాన్‌లో కుల వృత్తిగా నడుస్తోంది. ► బాక్స్‌లో గణేషుడి ప్రతిమ ఉంది. దీనిని కోల్‌కతాకు చెందిన ఓ స్వర్ణకారుడు తయారు చేశారు. ఆయన కుటుంబం ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తోంది. ► ప్రతిమతో పాటు ప్రమిదను కూడా ఉంచారు. ఇది కూడా కోల్‌కతాకు చెందిన స్వర్ణకారుల కుటుంబమే చేసింది. ► ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించిన రాగి తామ్ర పాత్ర.. దాని మీద శ్లోకం చెక్కి ఉంది. The box gifted by PM Modi to US President Joe Biden contains ten donations- a delicately handcrafted silver coconut by the skilled artisans of West Bengal is offered in place of a Cow for Gaudaan (donation of cow). A fragrant piece of sandalwood sourced from Mysore, Karnataka… pic.twitter.com/I8ujKCoiK1 — ANI (@ANI) June 22, 2023 ఇక అసలైన దశ దానం.. వెండి పెట్టెల్లో ఉంది. ఆవు స్థానంలో బుల్లి వెండి కొబ్బరికాయ ప్రతిమను, భూదానం స్థానంలో మైసూర్ నుంచి తెప్పించిన సువాసనభరితమైన గంధపు చెక్క ముక్కను, తమిళనాడు నుంచి తెప్పించిన నువ్వులను, హిరణ్యదానం కోసం రాజస్థౠన్ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారపు కాయిన్‌ను, పంజాబ్ నుంచి నెయ్యిని, జార్ఖండ్ నుంచి తెప్పించిన గుడ్డ ముక్కను, ధాన్యదానంలో భాగంగా యూపీ నుంచి బియ్యం, మహారాష్ట్ర నుంచి బెల్లం ముక్కను, రాజస్థాన్ నుంచి వెండి నాణేన్ని, అలాగే గుజరాత్ నుంచి తెప్పించిన ఉప్పును లవణ దానంలో భాగంగా.. చిన్న వెండి పెట్టెల్లో ఉంచి బైడెన్‌కు మోదీ దశ దానంలో భాగంగా అందించారు. The box contains the idol of Ganesha, a Hindu deity considered as the destroyer of obstacles and the one who is worshipped first among all gods. The idol has been handcrafted by a family of fifth-generation silversmiths from Kolkata. The box also contains A diya (oil lamp) that… pic.twitter.com/23eV5ZsWfC — ANI (@ANI) June 22, 2023 -
మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్సులో నరేంద్ర మోదీ?
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ. "బిగ్ డీల్" దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. ఇవి కూడా అడగండి.. ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
అమెరికా వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం
-
మోదీకి పాతకాలపు కెమెరా.. బైడెన్‌కు ఉపనిషత్తుల కాపీ
అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్ బైడెన్లు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారాయన. సరదాగా కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి విదితమే. కానుకలు.. ఇక మోదీకి జో-జిల్ బిడెన్లు కానుకలు సమర్పించారు. 20వ శతాబ్ద ప్రారంభపు కాలానికి చెందిన.. పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ఆ దంపతులు కానుకగా ఇచ్చారు. అలాగే బైడెన్ పర్సనల్‌గా మోదీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటుగా జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని బహుమతిగా ఇచ్చారు. భారత్‌లో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత, నోబెల్ విన్నర్ డబ్ల్యూబీ యేట్స్ ‘భారత ఉపనిషత్తుల’ ఆంగ్ల తర్జుమా కాపీ(శ్రీ పురోహిత్ స్వామి సహరచయిత) కాపీని బైడెన్‌కు భారత ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. దీనిని లండన్‌కు చెందిన ఫెబర్ అండ్ ఫెబర్ లిమిటెడ్ వాళ్లు.. యూనివర్సిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించారు. కాళిదాసుడి రచనల ప్రభావం తనపై ఎంతో ఉందని డబ్ల్యూబీ యేట్స్ పలుమార్లు చెప్పుకున్నారు. అంతేకాదు.. రవీంధ్రనాథ్ ఠాగూర్ సమకాలీకుడిగా పేరున్న యేట్స్.. 1923లో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(గ్రీన్ డైమండ్) బహుమతిగా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వజ్రం.. పర్యావరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులను ఉపయోగించి దీనిని రూపొందించారు. #WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/kac0i1u9ZN — ANI (@ANI) June 22, 2023 In 1937, WB Yeats published an English translation of the Indian Upanishads, co-authored with Shri Purohit Swami. The translation and collaboration between the two authors occurred throughout 1930s and it was one of the final works of Yeats. A copy of the first edition print… pic.twitter.com/yIi9QW290r — ANI (@ANI) June 22, 2023 PM Narendra Modi gifts a copy of the first edition print of the book, ‘The Ten Principal Upanishads’ published by Faber and Faber Ltd of London and printed at the University Press Glasgow to President Joe Biden pic.twitter.com/95kKhQS267 — ANI (@ANI) June 22, 2023 I thank @POTUS @JoeBiden and @FLOTUS @DrBiden for hosting me at the White House today. We had a great conversation on several subjects. pic.twitter.com/AUahgV6ebM — Narendra Modi (@narendramodi) June 22, 2023 మేము అనేక విషయాలపై గొప్ప విషయాలపై మాట్లాడుకున్నాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు కూడా. PM Narendra Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden The diamond reflects earth-mined diamonds’ chemical and optical properties. It is also eco-friendly, as eco-diversified resources like solar and wind power were used in its making. pic.twitter.com/5A7EzTcpeL — ANI (@ANI) June 22, 2023 -
నేను అమాయకుడిని.. డోనాల్డ్ ట్రంప్
జార్జియా, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయనపై నేరాభియోగాలు మోపిన తర్వాత పబ్లిక్ మీటింగుకి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శనివారం తన మద్దతుదారులకు ధైర్యం చెబుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బైడెన్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, నాకే పాపం తెలియదని అన్నారు. 20 ఏళ్ళు జైలులోనే... అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగిసిన తర్వాత వైట్ హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ పెంటగాన్, జాతీయ ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్య పత్రాలను తనతో పాటు తీసుకువెళ్లారని ఫెడరల్ న్యాయస్థానంలో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 37 అభియోగాలపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. నేరం రుజువైతే డోనాల్డ్ ట్రంప్ కనీసం 20 ఏళ్లపాటు జైలులోనే గడపాల్సి ఉంటుందని అంటున్నారు ఫెడరల్ న్యాయాధికారులు. ఎన్నికల భయంతోనే.. జార్జియా, నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ తానే నేరం చేయలేదని అన్నారు. జార్జియాలో జరిగిన సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నేనే తప్పు చేయలేదని చెప్పిన ట్రంప్ నార్త్ కరోలినాలో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే ముందున్న నేపథ్యంలో అధికారం చేజారిపోతుందేమోనన్న భయంతో బైడెన్ ప్రభుత్వం ఈ తరహా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. నాపై ఉన్నవన్నీ హాస్యాస్పదమైన, నిరాధారమైన ఆరోపణలే. బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అమెరికా చరిత్రలోనే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మిగిలిపోతాయని అన్నారు. ఇది కూడా చదవండి: కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్ -
సాయివర్షిత్పై తీవ్ర అభియోగాలు! ఏ శిక్ష పడుతుందంటే..
తాను హిట్లర్‌కు అభిమానినని, నాజీయిజం గొప్పదని చెబుతూ.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే లక్ష్యమని, అడ్డొస్తే ఏకంగా అధ్యక్షుడినైనా చంపుతానంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు తెలుగు మూలాలున్న సాయి వర్షిత్. వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో సహా దూసుకెళ్లి బారికేడ్లను ఢీ కొట్టి హల్చల్ చేసిన ఆ టీనేజర్‌పై తీవ్ర అభియోగాలే నమోదు అయ్యాయి. తెలుగు మూలాలు ఉన్న 19 ఏళ్ల సాయివర్షిత్.. సోమవారం(మే22 రాత్రి సమయంలో) ఓ ట్రక్‌తో వైట్‌హౌజ్ వైపు దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి కలకలమే రేపాడు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విస్తూపోయే విషయాలను వెల్లడించాడు. బుధవారం ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. మే 30 దాకా కస్టడీ విధించింది న్యాయస్థానం. ‘‘ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్‌ను చంపుతానని బెదిరించడం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకూ హాని తలపెడతానని ప్రకటించడం, అధ్యక్షుడి కిడ్నాప్‌నకు యత్నం, అధ్యక్షుడికి హాని తలపెట్టే యత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అక్రమ చొరబాటు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలగజేయడం.. లాంటి అభియోగాలను యూఎస్ పార్క్ పోలీసులు సాయి వర్షిత్‌పై నమోదు చేశారు. అంతేకాదు అతనసలు అమెరికా పౌరుడే కాదని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభియోగాల ఆధారంగా.. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల(మన కరెన్సీ ప్రకారం) జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ సాయివర్షిత్‌కు స్పష్టం చేశారు. Here are the court doc’s 👉 compiled by @SecretService in this investigation. 19yo Sai Kandula was held w/out bond by a D.C. Superior Court judge today. He’s expected to appear at the federal courthouse tomorrow. No time announced yet. @fox5dc continues to follow developments https://t.co/qLUZvIIo1A pic.twitter.com/FFneR5bQUb — Stephanie Ramirez (@RamirezReports) May 23, 2023 సోమవారం రాత్రి.. సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్కు సాయివర్షిత్ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాడు. అక్కడ యూ హాల్ బాక్స్ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడని, నేరుగా వైట్ హౌజ్ వైపు దూసుకెళ్లాడని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పోలీసులు వెల్లడించారు. వైట్ హౌజ్‌లోకి చొరబడి.. అధికార కైవసం చేసుకోవాలని అనుకున్నానని, దేశాన్ని పాలించడమే తన ఉద్దేశమని సాయివర్షిత్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అదెలా సాధ్యమని పోలీసులు నిలదీయగా.. అధ్యక్షుడిని చంపడమో లేదంటే అడ్డొచ్చే వాళ్లను గాయపర్చడం ద్వారానో అనుకున్నది సాధించాలని సాయివర్షిత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు హాని తలపెట్టడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు సాయివర్షిత్. ఈ మేరకు ఆరు నెలల నుంచే గ్రీన్ బుక్ పేరిట తాను ఎలా ప్లాన్ చేసుకున్నదంతా సాయి రాసుకున్నట్లు తెలుస్తోంది. Sai Varshith Kandula of Chesterfield, Missouri is the teenager who was driving the U-Haul and carrying a Nazi flag as he crashed into the security barrier near the White House on Lafayette Square. Kandula allegedly wanted to kill or harm President Biden and VP Kamala Harris. If… pic.twitter.com/dWC5OLED9j — Ed Krassenstein (@EdKrassen) May 23, 2023 సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రం చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రుల నేపథ్యం తెలియాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడెన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. గతంలో డేటా అనలిస్ట్‌గా పని చేశానని, ప్రస్తుతం తానొక నిరుద్యోగినని చెప్పాడు. బుధవారం కోర్టు విచారణలోనూ వినయంగా అతను సమాధానాలు ఇవ్వడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు అతని తల్లిదండ్రులు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 14 దేశాలను టచ్ చేసే రోడ్డు ఇదే! -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం..
-
ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అరగంట ఏడ్చాను: మిచెల్ ఒబామా
వాషింగ్టన్: 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వెల్లడించారు. ది లైట్ పాడ్‌కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయలను గుర్తుచేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తాము వైట్‌హౌస్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా అనిపించిందని, ఆ క్షణాల్లో ఆమె పడిన అవేదనను తలుచుకుంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. తెలియన బాధ... అరగంట ఏడ్చాను ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అనేక కారణాల వల్ల ఆ రోజు కన్నీళ్లు కూడా వచ్చినట్లు చెప్పారు. వైట్‌హౌస్‌తో తమకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని, అది తమ పిల్లలకు తెలిసిన ఏకైక ఇల్లుగా పేర్కొన్న మిచెల్.. ఆ ఇంటిని విడిచిపెట్టే రోజు చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. మా పిల్లల స్వస్థలం చికాగో అయినప్పటికీ, వాళ్లు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్‌హౌస్‌లో గడిపారన్నారు. వీటితో పాటు అక్కడ పని చేసే సిబ్బందితో కూడా బంధం ఏర్పడిందని, వారిని వదిలిపెట్టాల్సి రావడం కూడా బాధగా అనిపించిందన్నారు. ఈ విషయంపై ఆమె కొనసాగిస్తూ.. ‘ఆ రోజు ఎందుకో నాలో కన్నీళ్లు, భావోద్వేగం ఉన్నాయి. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై మేము కనిపిస్తున్నాం. ఆ వేదికపై ఎలాంటి వైవిధ్యం, కళ లేదు. అమెరికా విశాల భావానికి ప్రతిబింబం లేదు’ అని భావోద్వేగంతో వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్‌లో ఎక్కిన మరుక్షణం తనలో దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక 30 నిమిషాలు నిర్విరామంగా ఏడ్చానని మాజీ ప్రథమ మహిళ అప్పటి విషయాలును గుర్తుచేసుకున్నారు. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌కు కార్పోరేట్ రంగానికి చెందిన పునీత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. రంజన్ గతంలో డెలాయిట్ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్ గ్లోబల్ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు. ఫెడ్ఎక్స్కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది. -
ఏలియన్స్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌజ్
వాషింగ్టన్: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. వైట్‌హౌజ్ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్‌వోల వాదనను కొట్టిపారేసింది. కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్‌హౌజ్ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది మాత్రం క్లియర్ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్మీట్లో నవ్వులు పూయించారు కూడా. ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్‌స్పేస్‌లో రెండు, కెనడా ఎయిర్‌స్పేస్‌లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్‌కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్‌హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన.