వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్‌ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.
తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్‌కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.
Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7
— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024
Comments
Please login to add a commentAdd a comment