White House Press Secretary
-
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖకైన డొనాల్డ్ ట్రంప్ తదుపరి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా యువ కరోలిన్ లీవిట్‌ను ప్రకటించారు. ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే జనవరి 20, 2025న 27 ఏళ్ల లీవిట్ కూడా ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారు. కరైన్ జీన్ పియరీ స్థానంలో లీవిట్ కొత్త ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు.ఆమె ట్రంప్ ప్రచారబృందం జాతీయ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో లీవిట్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘ప్రచార పర్వంలో లీవిట్ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తెలివైన వారు. ధృఢచిత్తురాలు. సమర్థురాలిగా రుజువు చేసుకున్నారు’అని ట్రంప్ ఆమె నియామక ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లోనూ ఆమె రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ట్రంప్ కీలక నిర్ణయం.. కరోలిన్ సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్‌ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024 -
White House: జో బైడెన్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లజాతీయులకు కీలక పదవిని బైడెన్ అప్పగించారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా నల్లజాతీయురాలైన కరీన్ జీన్ పియర్(44)ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అత్యున్నత స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా ఆమె రికార్డుల్లో నిలిచారు. ఇదిలా ఉండగా.. కరీన్ జీన్ పియర్ LGBTQ+ వ్యక్తి(LGBTQ+.. లెస్బియన్, గే, bisexual, ట్రాన్స్‌జెండర్) కావడం విశేషం. ఆ పదవిలో LGBTQ+ వ్యక్తి ఉండటం కూడా ఇదే మొదటిసారి. కాగా, జీన్ పియర్ వైట్ హౌస్‌లో చేరడానికి ముందు ఎన్నికల సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ తరఫున ప్రచారం నిర్వహించారు. మరోవైపు.. ప్రస్తుతం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పని చేస్తున్న జెన్ పాకి పదవీకాలం ఈనెల 13వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో జీన్ పియర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, ఉక్రెయిన్‌తో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ జెన్ పాకీ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును డిస్కౌంట్లో ఇండియా కొనడం ఆంక్షల ఉల్లంఘన కాదు అని, కానీ అలాంటి చర్య చేపడితే అప్పుడు చరిత్రలో భారత్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సి వస్తుందని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: క్షమాపణలు చెప్పిన వ్లాదిమిర్ పుతిన్ -
కమల ‘అధ్యక్ష’ బాధ్యతలు భేష్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గంట 25 నిమిషాలపాటు అగ్రరాజ్యం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించడం అమెరికా దేశ చరిత్రలో ఒక అధ్యాయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. అధ్యక్ష హోదాలో విధుల్లో ఉన్నది కాసేపే అయినప్పటికీ కమలా తన బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ‘అమెరికా చరిత్రలో ఇది మరో అధ్యాయంగా చెప్పాలి. కొద్దిసేపైనా సరే ఒక మహిళ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని జెన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే భావనతోనే ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్‌ను బైడెన్ ఎన్నిక చేసుకున్నట్టుగా సాకీ వివరించారు. అధ్యక్షుడు బైడెన్‌కి కొలనోస్కోపీ పరీక్షలు నిర్వహించే సమయంలో మత్తుమందు ఇవ్వడం వల్ల కమలకు తన అధికారాలను బైడెన్ బదలాయించిన విషయం తెలిసిందే. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. -
బైడెన్ టీంలోకి మరో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీంలో భారత సంతతి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కమలా హారిస్, నీరా టాండన్ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్ తాజాగా భారత సంతతికి చెందిన వేదాంత్ పటేల్‌ని అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు. పటేల్ ప్రస్తుతం బైడెన్ ఇనాగ్యురల్ కమిటీ సీనియర్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైట్‌హౌస్ వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం పటేల్ బైడెన్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించారు. అంతేకాక రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇవేకాక బైడెన్ ప్రాధమిక ప్రచారంలో నెవడా, వెస్ట్రన్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక గతంలో, పటేల్ డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ, ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్‌కు, కాంగ్రెస్ సభ్యుడు మైక్ హోండాకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం) ఇక నివేదిక ప్రకారం, పటేల్ భారతదేశంలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. కాలిఫోర్నియా-రివర్సైడ్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పటేల్ తన కుటుంబంతో కలిసి వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నారు. ఇక బైడెన్ శుక్రవాంర వైట్ హౌస్ కమ్యూనికేషన్, ప్రెస్ స్టాఫ్‌కు సంబంధించి 16 మంది పేర్లు ప్రకటించగా.. వారిలో వేదాంత్ పటేల్ కూడా ఉన్నారు. ఇక వైట్‌హౌస్ ప్రెస్ కమ్యునికేషన్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వారిలో వేదాంత్ పటేల్ మూడవ వ్యక్తి. గతంలో ప్రియా సింగ్, రాజ్ షా వైట్ హౌస్ ప్రెస్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. -
ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే
వాషింగ్టన్: ప్రపంచంలో తమ దేశంలో చేసినన్ని కరోనా టెస్టులు మరెక్కడా జరగలేదని అంటున్నారు వైట్ హౌస్ అధికారులు. కరోనా టెస్టుల విషయంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ తమ తర్వాత స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో అమెరికాలో 42మిలియన్ల టెస్టులు చేసి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. 12 మిలియన్ల టెస్టులతో భారత్ రెండవ స్థానంలో ఉంది’ అన్నారు. టెస్టుల విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే.. ఇది ఎంతో మెరుగ్గా ఉందని కైలీ తెలిపారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.5 మిలియన్లుగా ఉండగా 1,38,000 మరణాలు సంభవించాయి. (నేటి నుంచి యూఎస్‌కు విమానాలు) ఇక వ్యాక్సిన్ అభివృద్ధి గురించి కైలీ మాట్లాడుతూ.. మోడరనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మంచి సంకేతాలను చూపిస్తున్నారన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మందిలో సానుకూల, తటస్థ రోగనిరోధక ప్రతిస్పందనను చూపిస్తున్నారని తెలిపారు. కోలుకున్న రోగులతో దీన్ని పోల్చి చూస్తే ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. ‘ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్ ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో.. చివరకు అదే లభిస్తుంది అన్నారు. ముఖ్యంగా మోడరనా వ్యాక్సిన్ జూలై చివరి నాటికి మూడవ దశకు చేరుకుంటుంది’ అని కైలీ తెలిపారు. దీనిలో 30,000 మంది పాల్గొంటారన్నారు. (కరోనాతో గేమ్స్ ) మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కోసం 450 మిలియన్ డాలర్లతో రెజెనెరాన్ కుదరుర్చుకున్న ఒప్పందం చాలా ప్రోత్సాహకరమైనదని అన్నారు కైలీ. ప్రస్తుతం కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న అనేక చికిత్సా విధానాలలో ఇది ఒకటి. దీన్ని రోగనిరోధకత, చికిత్స కోసం ఉపయోగించవచ్చు. వేసవి చివరి నాటికి 70 నుంచి 300 వేల డోసులను సిద్ధం చేస్తామని రెజెనెరాన్ తెలిపిందన్నారు. -
చెక్కు కదా.. చెక్ చేసుకోవాలి: ట్రంప్
వాషింగ్టన్: : జీవితంలోని ఈ అందాలు, ఆనందాలు మనిషి చేసే పొరపాట్ల వల్లనేనేమో! లేదంటే జీవితం టై కట్టుకుని తప్పులు, పొరపాట్లు వెదకడానికి బిగదీసుకు కూర్చున్న పెద్ద ఆఫీసర్లా ఉండిపోయేది కావచ్చు. ట్రంప్‌గారి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకనానీ శుక్రవారం ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ‘ట్రంప్ గారు తమ నాలుగు నెలల జీతాన్ని (లక్ష డాలర్లు) కోవిడ్ పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ‘హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ శాఖకు ఇస్తున్నారు’ అని ప్రకటిస్తూ.. జీతం చెక్కును మీడియా ముందు ప్రదర్శించారు. చెక్కును మాత్రమే చూపెడితే మిస్టేక్ లేకపోయేది. చెక్కుతో పాటు చెక్కుకు కొనసాగింపుగా ఉన్న స్లిప్ మీది ట్రంప్ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కూడా ఆమెకు సమీపంగా ఉన్న రిపోర్టర్ల కంటపడ్డాయి. పెద్ద పొరపాటే. కానీ ట్రంప్‌గారు ఆమెపై సీరియస్ ఏమీ అవలేదు. ‘చెక్కు కదా.. చెక్ చేసుకోవాలి’ అని బ్యాలెన్సింగ్‌గా నవ్వారు. -
ట్రంప్ కోసం పనిచేస్తున్నావా.. వెళ్లిపో!
సాక్షి, వాషింగ్టన్ : వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ సారా హకాబీ సాండర్స్‌కు ఓ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేస్తున్నందుకు ఆమె పట్ల రెస్టారెంట్ యజమాని దురుసుగా ప్రవర్తించారు. ఆమెను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమ్మని గద్దించారు. ఈ విషయాన్ని సారా ట్విట్టర్లో ధ్రువీకరించారు. ట్రంప్ కోసం పనిచేస్తున్నావా? అయితే, వెళ్లిపో అంటూ రెస్టారెంట్ ఓనర్ తనతో పేర్కొన్నట్టు ఆమె తెలిపారు. వర్జీనియా లెక్సింగ్టన్లోని ద రెడ్హెన్ రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన జరిగిందని తెలిపారు. యజమాని వెళ్లిపోమ్మని చెప్పడంతో తాను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చానని ఆమె తెలిపారు. ఈ ఘటన తనను పెద్దగా బాధపెట్టకపోయినప్పటికీ.. రెస్టారెంట్ ఓనర్ స్వభావాన్ని మాత్రం బయటపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ‘ప్రజలతో నేను ఎప్పుడూ సమున్నతంగా నడుచుకుంటాను. నాతో విభేదించే వారిని కూడా గౌరవిస్తాను. నా తీరులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఆమె పేర్కొన్నారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఆమె చేసిన ఈ ట్వీట్‌కు 22వేలకుపైగా రిప్లైస్ వచ్చాయి. సారాకు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా కామెంట్లు చేస్తున్నారు. సారా తండ్రి, అర్కాన్సా మాజీ గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మైక్ హకబీ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. -
రిజైన్ చేశారుగా.. ఇక ఆయన లైఫ్ అదుర్స్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినరోజు నుంచీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన సీన్ స్పైసర్ భవిష్యత్తు ఇక వెలిగిపోతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియాకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పుకున్నందుకే స్పైసర్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ట్రంప్ అనడంపై జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'సీన్ స్పైసర్ అద్బుతమైన వ్యక్తి. కానీ ఫేక్ న్యూస్ మీడియా కారణంగా ఆయన అవమానాల పాలయ్యారు. అలాంటి మీడియా స్పైసర్ను దారుణంగా దూషించిందని వ్యాఖ్యానించిన ట్రంప్' అనంతరం ఈ విషయంపై ట్వీట్ చేశారు. న్యూయార్క్ వ్యాపారవేత్త, రాజకీయ మద్ధతుదారుడైన ఆంథోనీ స్కారముక్కీని వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యల నుంచి తప్పుకుంటూ సీన్ స్పైసర్ రాజీనామా చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన్నప్పటి నుంచీ స్పైసర్ ఆ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వైట్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని భావించిన స్పైసర్కే చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు మీడియాతో ఎప్పుడు హద్దులుదాటి ప్రవర్తించే వ్యక్తిని సమర్థించడంతో పాటు తమను ఫేక్ న్యూస్ మీడియా అంటూ ట్రంప్ సంబోధించడాన్ని మీడియా ప్రతినిధులు తప్పుపడుతున్నారు. రాజీనామా చేసిన స్పైసర్ అద్బుతమైన వ్యక్తి కానేకాదని, అతనికి కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Sean Spicer is a wonderful person who took tremendous abuse from the Fake News Media - but his future is bright! — Donald J. Trump (@realDonaldTrump) 22 July 2017 -
వైట్‌హౌస్‌లో మరో రాజీనామా
న్యూయార్క్: అమెరికా శ్వేతసౌదం మీడియా సెక్రటరీ సియాన్ స్పైసర్ రాజీనామా చేశారు. అతి తక్కువ కాలం మాత్రమే విధులు నిర్వహించిన ఆయన శుక్రవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఇక నుంచి తన మీడియా అధికారిక ప్రతినిధిగా వాల్‌స్ట్రీట్ ఫైనాన్సియర్ అంటోనీ స్క్రాముస్సి ఉండనున్నారని చెప్పిన నేపథ్యంలో స్పైసర్ ఇక రాజీనామా చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే, స్పైసర్ అనూహ్యంగా బాధ్యతల నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ట్రంప్, లీగల్, కమ్యునికేషన్ బృందాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సియాన్ రాజీనామా వారిలో కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన టీంలో సియాన్ కీలక సభ్యుడిగా వ్యవహరించారు. -
తప్పులో కాలేసిన ‘ట్రంప్’ సెక్రటరీ.. సారీ
వాషింగ్టన్: సిరియా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై కెమికల్ దాడులు చేయడాన్ని విమర్శించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, శ్వేతసౌదం మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ నాలుకకరుచుకున్నాడు. కనీసం నాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా విష రసాయనాలను తన సొంత ప్రజలపై ఇలా ప్రయోగించలేదన, ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తాను అన్నమాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సిరియా ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగి దాదాపు 100మంది అమాయకపు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. దాడిని సిరియా ప్రభుత్వమే చేసిందని ఆరోపిస్తూ అమెరికా క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిని సమర్థించుకునే క్రమంలో వైట్ హౌస్ తరపున ప్రకటన చేస్తూ తొలుత ‘సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్లాగా హిట్లర్ కూడా చేయలేదు. సొంత ప్రజలపై ఆయన కూడా ఎన్నడూ విష రసాయనాలు ప్రయోగించలేదు. ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ధుమారం రేగింది. హిట్లర్ విష వాయువులు ప్రయోగించి మిలియన్లమంది యూదులను, ఇతరులను హత్య చేశాడంటూ ఇప్పటికే వాస్తవాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. దీంతో మరోసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సియాన్ ‘నిజం చెప్పాలంటే నేను ఆ మాటలు అనుకోకుండా ఉపయోగించాను. అది నా తప్పే. వాస్తవానికి హిట్లర్‌తో పోలిక లేదు. అలా చెప్పినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. అలా చేయడం నిజంగానా తప్పే’ అని తిరిగి వివరణ ఇచ్చారు. అయితే, బషర్ ఎంత దారుణ చర్యకు పాల్పడ్డాడో చెప్పడమే తన ఉద్దేశం అని, తన మాటలు విన్నవారు కేవలం బషర్ ప్రవర్తను అర్థం చేసుకోవాలని చెప్పారు. -
చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివాదాస్పద ఈ సముద్రంలో తమ ప్రయోజనాలను తాము కాపాడుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను 'ఒక దేశం' స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటామని కూడా తెలిపింది. 'దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను కాపాడుకుంటామని అమెరికా కచ్చితంగా చాటిచెప్పగలదు' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ తన మొదటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 'దక్షిణ చైనా సముద్రంలోని దీవులు అంతర్జాతీయ జలాలోనివే. అవి చైనాకు చెందినవి కావు. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను ఒక దేశం స్వాధీనం చేసుకోకుండా మేం అండగా నిలబడతాం అన్నది చాటుతాం' అని స్పైసర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ దీవుల్లోకి చైనా ప్రవేశాన్ని నిరాకరిస్తామని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రిగా ఎంపికైన టెక్స్ టిల్లర్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు స్పైసర్ ఈ విధంగా బదులిచ్చారు. అమెరికా ఉత్పత్తులకు, సేవలకు ఇప్పటికీ చైనానే అతిపెద్ద మార్కెట్ అని, అదేవిధంగా చైనా వ్యాపారవేత్తలు, వ్యక్తులకు అమెరికాలో స్వేచ్ఛగా తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశముందని చెప్పారు.