వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గంట 25 నిమిషాలపాటు అగ్రరాజ్యం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించడం అమెరికా దేశ చరిత్రలో ఒక అధ్యాయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. అధ్యక్ష హోదాలో విధుల్లో ఉన్నది కాసేపే అయినప్పటికీ కమలా తన బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ‘అమెరికా చరిత్రలో ఇది మరో అధ్యాయంగా చెప్పాలి. కొద్దిసేపైనా సరే ఒక మహిళ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని జెన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే భావనతోనే ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్‌ను బైడెన్ ఎన్నిక చేసుకున్నట్టుగా సాకీ వివరించారు. అధ్యక్షుడు బైడెన్‌కి కొలనోస్కోపీ పరీక్షలు నిర్వహించే సమయంలో మత్తుమందు ఇవ్వడం వల్ల కమలకు తన అధికారాలను బైడెన్ బదలాయించిన విషయం తెలిసిందే. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment