Indian descent
-
ట్రంప్ బృందంలో పాల్ కపూర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లూ స్థానంలో పాల్కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు. కపూర్ ప్రస్తుతం నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2020 నుంచి 2021 వరకు స్టేట్ డిపార్ట్మెంట్ పాలసీ ప్లానింగ్ సిబ్బందిగా పనిచేశారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండో–పసిఫిక్ , అమెరికా–ఇండియా సంబంధాలకు సంబంధించిన సమస్యలపై పనిచేశారు. అంతకుముందు కపూర్ క్లేర్మోంట్ మెకెనా కళాశాలలో బోధించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన ‘జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ: ఇస్లామిక్ మిలిటెన్సీ’, ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ది పాకిస్తానీ స్టేట్’, ‘దక్షిణాసియాలో సంఘర్షణ’తదితర పుస్తకాలు రచించారు. ‘ఇండియా, పాకిస్తాన్ అండ్ ది బాంబ్: డిబేటింగ్ న్యూక్లియర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’అనే పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. ‘ది ఛాలెంజెస్ ఆఫ్ న్యూక్లియర్ సెక్యూరిటీ: యూఎస్ అండ్ ఇండియన్ పర్సె్పక్టివ్స్’కు సహ సంపాదకత్వం వహించారు. -
యూకేలో భారత సంతతి మహిళకు అవమానం
లండన్‌లో భారత మహిళకు (Indian Woman) అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్ (London) నుంచి మాంచెస్టర్ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల గాబ్రియెల్ ఫోర్సిత్ రైలులో ఇంటికి వెళ్తూ తోటి ప్రయాణికుడితో పలు అంశాలపై చర్చిస్తున్నారు. వలసదారులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలో పని చేశానని ఫోర్సిత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో అదే బోగీలో మద్యం సేవిస్తున్న ఓ బ్రిటిషర్ ఆమె మాటలకు అడ్డుతగి లారు. తోటి రైలు ప్రయాణికులను ‘వలసదారులు’గా అభివర్ణిస్తూ నీచమైన దూషణలకు దిగాడు. ఫోర్సిత్ను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ (England) చారిత్రక విజయాల గురించి గొప్పగా చెప్పాడు. ‘‘నువ్వు ఇంగ్లాండులో ఉన్నావు. కానీ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఆంగ్లేయులు ప్రపంచాన్ని జయించారు. భారత్‌ను కూడా జయించాం. కానీ మాకు వద్దంటూ తిరిగి ఇచ్చేశాం. ఇలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. మీది సార్వభౌ మాధికారమా’’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్య లు చేశారు. వీడియో చివర్లో ఆ వ్యక్తి ఫోర్సిత్తో ‘‘నేను నిన్ను కొట్టబోవడం లేదు’’ అని అన్నాడు. అంతేకాదు.. ఆ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. అతని జాత్యహంకార దూషణను ఫోర్సిత్ కూడా చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘అతని నోటి నుంచి వచ్చిన వలస అనే పదం, బాడీ లాంగ్వేజ్, కోపం, దూకుడు చూస్తే చాలా బాధేసింది. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నేను శ్వేతజాతీయేతరురాలిని. ఇదే నా గుర్తింపు. అందుకు నేను గర్విస్తున్నా. జాత్యహంకార వీడియోను పోస్ట్చేసినందుకు శ్వేతజాతీయులు ఎందరో నన్ను ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వేధింపులు ఎదుర్కొన్నా. నాకు తెలియని బూతులు తిట్టారు. బ్రిటన్‌లో శ్వేతజాతీయేతర వ్యక్తుల హక్కులపైనే నా ఆందోళన అంతా’’అని ఫోర్సిత్ తెలిపారు.చదవండి: ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్తఈ ఘటనపై బ్రిటన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘వలస వచ్చిన భారతీయుడి కూతురిగా బతకడం, నా దేశ మూలాలంటే నాకెంతో ఇష్టం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా కోసం, శ్వేతజాతీయేతర ప్రజల పక్షాన నిలబడి పోరాడతా. నాకు శ్వేతజాతీయేతర వర్గాల నుంచి ఇప్పుడు పూర్తి మద్దతు లభిస్తోంది’’అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట అవంతి వెస్ట్ కోస్ట్ రైలులో ఓ శ్వేతజాతి మహిళ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపొండి’ అని ఒక భారతీయ దంత వైద్యుడిని దూషించడం చర్చనీయంశమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా ప్రధాని రేసులో...రూబీ దల్లా!
కెనడా ప్రధాని పదవి కోసం మరో భారతీయ నేత తలపడనున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటుండటం తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నేత పదవికి భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు రూబీ దల్లా పోటీ పడనున్నారు. రూబీ దల్లా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లారు. ఆమె కెనడాలో మనిటోబాలోని విన్నిపెగ్‌లో జన్మించారు. బయో కెమిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణలో డిగ్రీ చేశారు. కొంతకాలం ఆరోగ్య సంరక్షకురాలు (చిరోప్రాక్టర్)గా పని చేశారు. తర్వాత అందాల పోటీల్లో, సినిమాల్లోనూ రాణించారు. 1993లో మిస్ ఇండియా–కెనడా పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం పారిశ్రామికవేత్తగా రాణించారు. దల్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా ఉన్నారు. కెనడా పార్లమెంటుకు మూడుసార్లు వరుసగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అదే ఊపులో ఆ దేశ ప్రధాని పదవి చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా కూడా రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2008లో జరిగిన ఓ సర్వేలో కెనడా పార్లమెంటులో సెక్సీయెస్ట్ ఎంపీల్లో రూబీ మూడో స్థానంలో నిలిచారు. అదే ఏడాది మాక్సిమ్ మేగజైన్ ఆమెకు ప్రపంచంలోని హాటెస్ట్ రాజకీయవేత్తల్లో మూడో ర్యాంకు ఇచ్చింది. తాను ప్రధాని అయితే అక్రమ వలసదారులందరినీ కెనడా నుంచి పంపించేస్తానని ప్రకటించడం ద్వారా రూబీ ఇటీవలే వార్తల్లో నిలిచారు. అందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ సారథ్యం, ప్రధాని పదవి విషయంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. లిబరల్ పార్టీ తదుపరి నేత ఎవరన్నది మార్చి 9న తేలే అవకాశముంది. పదేళ్ల వయసులోనే ఇందిరకు లేఖ పదేళ్ల వయసులోనే నాటి భారత ప్రధాని ఇందిరాగాం«దీకి లేఖ రాసి రూబీ ఔరా అనిపించారు. పంజాబ్‌లో అస్థిరత, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై చేపట్టిన బ్లూస్టార్ సైనిక చర్యలపై తన అభిప్రాయాలను లేఖలో సూటిగా వెల్లడించారు. ‘‘పంజాబ్ హింసాకాండను టీవీలో చూసి వికలమైన మనసులో మీకు లేఖ రాస్తున్నా. అమాయక సిక్కుల ఊచకోతను, స్వర్ణ దేవాలయంపై దాడులను దయచేసి అడ్డుకోండి. సమస్యను ఇరు వర్గాలూ చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ఈ విషయంలో నేను చేయగల సాయమేమైనా ఉంటే దయచేసి చెప్పండి’’ అంటూ రాశారు. ఆ లేఖకు ఇందిర బదులివ్వడమే గాక ఈ విషయాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు! చిన్నారి రూబీని భారత్‌కు ఆహ్వానించారు. కానీ ఆలోపే ఇందిర హత్యకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్‌లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారత్‌తో బంధం... మరో దేశానికి ప్రాతినిధ్యం
ప్రతి క్రీడాకారుడి జీవితాశయం ఒలింపిక్స్‌లో పోటీపడటం, దేశానికి పతకం సాధించడం. అయితే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. చాలా మందికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కదు. ఫలితంగా సత్తా ఉన్న వాళ్లు వేరే దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి మరో మార్గంలో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తమ కలను నిజం చేసుకుంటారు. మరికొందరేమో తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఒలింపిక్స్ స్థాయికి వెళతారు. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌తో బంధం ఉన్నా వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. వారి వివరాలు క్లుప్తంగా...రాజీవ్ రామ్ (టెన్నిస్; అమెరికా): రాజీవ్ రామ్ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. రాజీవ్ అమెరికాలోని డెన్వర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 40 ఏళ్ల రాజీవ్ ఐదు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించాడు. వీనస్ విలియమ్స్‌తో కలిసి రాజీవ్ రామ్ 2016 రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం అందించాడు. పారిస్‌లో రాజీవ్ పురుషుల డబుల్స్‌లో పోటీపడనున్నాడు. ప్రీతిక పవాడే (టేబుల్ టెన్నిస్; ఫ్రాన్స్): ప్రీతిక తల్లిదండ్రులు విజయన్, సుగుణ పుదుచ్చేరిలో జన్మించారు. 2003లో విజయన్ ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2004లో ప్రీతిక పారిస్‌లో జని్మంచింది. 16 ఏళ్లకే ప్రీతిక ఫ్రాన్స్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడింది. స్వదేశంలో జరగనున్న ఒలింపిక్స్‌లో 19 ఏళ్ల ప్రీతిక మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్‌గా బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్‌తోపాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. శాంతి పెరీరా (అథ్లెటిక్స్; సింగపూర్): సింగపూర్ ‘స్ప్రింట్ క్వీన్’గా పేరొందిన వెరోనికా శాంతి పెరీరా పూర్వీకులది కేరళ. సింగపూర్‌లో వాళ్ల తాతకు ఉద్యోగం రావడంతో తిరువంతనపురం నుంచి సింగపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో శాంతి 100 మీటర్ల విభాగంలో రజత పతకం గెలిచి 49 ఏళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సింగపూర్‌కు తొలి పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింగపూర్ బృందానికి శాంతి పతాకధారిగా వ్యవహరించనుంది. కనక్ ఝా (టేబుల్ టెన్నిస్; అమెరికా): ఇప్పటికే రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న కనక్ ఝా నాలుగుసార్లు టేబుల్ టెన్నిస్‌లో అమెరికా జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కనక్ తల్లి సుగుణ స్వస్థలం ముంబైకాగా.. తండ్రి అరుణ్ కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్‌లలో పెరిగారు. వీరిద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లి కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 24 ఏళ్ల కనక్ 2018 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. అమర్ ధేసి (రెజ్లింగ్; కెనడా): అమర్‌వీర్ తండ్రి బల్బీర్ జాతీయ గ్రీకో రోమన్ చాంపియన్. పంజాబ్ పోలీసులో కొంతకాలం పనిచేశాక బల్బీర్ 1979లో కెనడాకు వచ్చి స్థిరపడ్డారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కెనడాకు ప్రాతినిధ్యం వహించిన అమర్ 125 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో 13వ స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టాడు. 28 ఏళ్ల అమర్ 2021 పాన్ అమెరికన్ చాంపియన్íÙప్లో పసిడి పతకం సాధించాడు. అనంతరం 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయ పరిమళం
లండన్: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విదేశంలోనూ తమ సత్తా చాటారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 28 మంది భారతీయసంతతి నేతలు విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ ఓడినా మాజీ ప్రధాని, భారతీయ మూలాలున్న రిషిసునాక్ తన రిచ్మండ్ నార్త్ అలెర్టాన్ నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి అన్ని పార్టీల తరఫున 107 మంది బ్రిటిష్ ఇండియన్లు బరిలో దిగగా 28 మంది గెలిచారు! ఇవి రెండూ రికార్డులే. కేరళ నుంచి పంజాబ్దాకా పలు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీచేశారు. విజేతల్లో ఎక్కువ మంది లేబర్ పార్టీ అభ్యర్థులు కావడం విశేషం!గెలిచిన మహిళా మంత్రులుకన్జర్వేటివ్ పార్టీ నేతలు, మాజీ హోం శాఖ మహిళా మంత్రులు సుయెల్లా బ్రేవర్‌మ్యాన్, ప్రీతిపటేల్ గెలిచారు. ఎసెక్స్ పరిధిలోని వీథెమ్ నియోజకవర్గంలో ప్రీతి, ఫేర్‌హామ్ వాటరలూవిల్లే నియోజకవర్గంలో బ్రేవర్‌మ్యాన్ విజయం సాధించారు. లీసిస్టర్లో పుట్టిపెరిగిన శివానీ రాజా కన్జర్వేటివ్ అభ్యర్థినిగా లీసిస్టర్ ఈస్ట్ స్థానంలో గెలిచారు. పంజాబ్ నుంచి వలసవచ్చిన గగన్ మోహేంద్ర కన్జర్వేటివ్ నేతగా మరోసారి హార్ట్ఫోర్డ్షైర్ నుంచి జయకేతనం ఎగరేశారు. ఈయన తాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. గోవా నుంచి వలసవచ్చిన క్లెయిర్ కాటిన్హో కన్జర్వేటివ్ నాయకురాలిగా ఈస్ట్ సర్రే నుంచి విజయం సాధించారు. 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వలసవచ్చిన కనిష్క నారాయణ్ లేబర్ పార్టీ నేతగా బరిలో దిగి వేల్స్ స్థానంలో గెలిచారు. ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా డేవిడ్ కామెరూన్, లిజ్ ట్రస్ ప్రభుత్వాల్లో పనిచేశారు. 13 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న లేబర్ పార్టీ నాయకురాలు సీమా మల్హోత్రా ఫెల్తామ్ హీస్టన్ నుంచి గెలిచారు. గోవా మూలాలున్న లేబర్ నేత వలేరీ వజ్ మరోసారి వాల్సేల్ బ్లాక్స్విచ్ నుంచి విజయం సాధించారు. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన నాదియా ఎడిత్ విట్టోమే లేబర్ పార్టీ తరఫున నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి గెలుపొందారు. 2019లో 23 ఏళ్లవయసులోనే ఎంపీగా గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ నెలకొల్పారు. సిక్కు నాయకురాలు, లేబర్ పార్టీ నేత అయిన ప్రీతి కౌర్ గిల్ మరోసారి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి గెలిచారు. పార్లమెంట్లో తొలి సిక్కు మహిళా ఎంపీగా నాడు చరిత్ర సృష్టించారు. బ్యాగీ శంకర్ (డర్బీ సౌత్), హర్‌ప్రీత్ ఉప్పల్ (హడర్స్‌ఫీల్డ్), సోనియా కుమార్ (డడ్లే) తదితరులూ విజయం సాధించారు. -
ఐఎస్ఎస్లోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్మోర్తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్మోర్కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
అమెరికా స్పెల్ బీ విజేత బృహత్ సోమ
వాషింగ్టన్: అమెరికా స్పెల్లింగ్ పోటీలో తెలుగు సంతతి విద్యార్థి గెలుపొందారు. ఏడో గ్రేడ్ చదువుతున్న 12 ఏళ్ల బృహత్ సోమ.. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ–2024లో విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో 29 పదాలకు సరైన సమాధానం ఇచ్చి బహుమతిగా 50వేల డాలర్లు అంటే దాదాపు రూ.41.64లక్షలు గెలుచుకున్నాడు. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు జాతీయ స్పెల్‌బీ చాంపియన్íÙప్ పోటీలు జరిగాయి. 50 రాష్ట్రాల నుంచి 245 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. 14 రౌండ్ల తర్వాత గురువారం జరిగిన ఫైనల్‌కు 8 మంది చేరుకున్నారు. ఫైనల్లో మొదట 30 పదాలకు 29కి సరైన సమాధానం చెప్పిన బృహత్ టై బ్రేకర్‌గా నిలిచాడు. 25 పదాల్లో 21 పదాలకు సరైన సమాధానం ఇచి్చన ఫైజన్ జాకీ మిగిలిన ఆరుగురిని అధిగమించాడు. లైటెనింగ్ రౌండ్లో బృహత్తో పోటీ పడలేకపోయాడు. 90 సెకన్లలో 30 పదాల్లో 29 పదాలకు స్పెల్లింగ్‌ను కరెక్టుగా చెప్పి బృహత్ రికార్డు నెలకొల్పాడు. అబ్సీల్ అనే పదం బృహత్‌కు చాంపియన్‌షిప్‌ను అందించింది. 90 సెకన్లలో 20 పదాలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చిన ఫైజన్ రెండో స్థానంలో నిలిచాడు. 25వేల డాలర్లను గెలుచుకున్నాడు. ఇక కాలిఫోరి్నయాకు చెందిన శ్రేయ్ ఫారిఖ్, నార్త్ కరోలినాలోని అపెక్స్‌కు చెందిన అనన్య ప్రసన్న మూడో స్థానంలో నిలిచారు. చెరో 12,500 డాలర్లను బహుమతిగా అందుకున్నారు. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఐదుగురు భారతీయ సంతతికి చెందినవారు. కాలిఫోరి్నయాకు చెందిన 14 ఏళ్ల రిషబ్ సాహా, కొలరాడోకు చెందిన 13 ఏళ్ల అదితి ముత్తుకుమార్ కూడా ఫైనల్‌కు చేరినవారిలో ఉన్నారు. అమోఘమైన జ్ఞాపకశక్తి.. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. బృహత్‌కు జ్ఞాపకశక్తి ఎక్కువని, భగవద్గీతలో 80 శాతం కంఠతా వస్తుందని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘‘గెలిచానని ప్రకటించగానే కొన్ని క్షణాలపాటు నమ్మలేకపోయాను. నా గుండె వేగం పెరిగింది. ఆ తరువాత గొప్ప అనుభూతినిచి్చంది’’ అని బృహత్ వెల్లడించాడు. కేవలం 12 ఏళ్ల వయసులో బృహత్ తన ప్రశాంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని స్క్రిప్స్ నిర్వాహకులు తెలిపారు. బృహత్‌కు గొప్ప జ్ఞాపకశక్తి ఉందని, అన్ని రౌండ్లలో ఏ ఒక్క పదాన్ని కోల్పోకుండా సమాధానం చెప్పి పదాలను శాసించాడని కొనియాడారు. గతంలోనూ స్పెల్ బీలో పాల్గొన్న బృహత్ 2023లో 74వ స్థానంలో, 2022లో 163 స్థానంలో నిలిచారు. వివిధ అంశాల్లో ఆసక్తి, అభిరుచి ఉన్న బృహత్ అంతకుముందు వర్డ్స్ ఆఫ్ విస్డమ్ బీ, స్పెల్ పండిట్ బీలను కూడా గెలుచుకున్నాడు. భారత సంతతి విద్యార్థుల హవా...కాగా, స్పెల్ బీలో భారత సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. గత ఏడాది స్పెల్ బీని సైతం భారత సంతతికి చెందిన విద్యార్థి దేవ్ షా గెలుచుకున్నాడు. 2022లో హరిణి లోగాన్ ఛాంపియన్íÙప్ను గెలుచుకుంది. దేశంలోనే అతిపెద్ద, ఎక్కువ రోజులు జరిగే కార్యక్రమం అయిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీని 1925లో ప్రారంభించారు. 1999 నుంచి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మంది భారతీయ సంతతికి చెందిన విద్యార్థులే చాంపియన్లుగా నిలిచారు. -
ఎలాన్ మస్క్ ఔదార్యం
టొరంటో: కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్(ట్విట్టర్) వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లు(రూ.2.50 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడానలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్రుగాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. స్పెషలిస్టు డాక్టర్‌గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తుంటారు. 2020లో కెనడాలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. లాక్డౌన్, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్(ఇప్పుడు ఎక్స్) ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ అంటారియో విచారణ ప్రారంభించింది. క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, దురదృష్టం వెక్కిరించింది. 1.2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కోర్డు ఆమెను ఆదేశించింది. పలు విన్నపాల తర్వాత జరిమానాను 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. మొత్తం 3 లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఆయనకు కుల్విందర్ కౌర్ గిల్ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. కుల్విందర్ కౌర్ గిల్ ఎలాన్ మస్క్ -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా. నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు. -
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్‌పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్‌హాట్‌గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం
సింగపూర్: భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తద్వారా సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్‌గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి. -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు
సింగపూర్: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 66 ఏళ్ల వయసున్న షణ్ముగరత్నం చైనా సంతతికి చెందిన కాక్ సాంగ్, తన్ కిన్ లియాన్‌తో పోటీ పడతారు. మొత్తం ఆరుగురు నుంచి దరఖాస్తులు రాగా వీరు ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అర్హత సాధించారని ఎన్నికల కమిటీ ప్రకటించింది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారు. సెప్టెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
భారత సంతతి ప్రొఫెసర్‌పై అమెరికాలో జాతి వివక్ష!
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్ ప్రొఫెసర్ మసాచుసెట్స్‌లో తాను పని చేస్తున్న బాబ్సన్ కాలేజీపై జాతి, లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజీపై కేసు కూడా పెట్టారు. అంతేగాక ఆర్థిక నష్టానికి, మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాలేజీ ఎంట్రప్రెన్యూర్షిప్ డివిజన్‌కు సారథ్యం వహించిన ప్రొఫె సర్ ఆండ్రూ కార్బెట్ ఇందుకు ప్రధాన బాద్యుడు. దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విచారించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. బాబ్సన్ కాలేజీ శ్వేత జాతీయులకు, అందులోనూ పురుషులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది. వారికే ప్రివిలేజీలన్నీ కల్పిస్తుంది’’ అని ఆరోపించారు. ఆమె 2012 నుంచి కాలేజీలో పని చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని కాలేజీ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిపై విచారణ జరిపి తప్పిదాలను సరిదిద్దేందుకు పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పుకొచ్చింది. -
భారత్ పార్లమెంట్లో మైకుల మూగనోము
లండన్: భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిటిష్ ఎంపీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ప్రజలను కూడగట్టడానికి ఇదొక రాజకీయ కార్యాచరణగా ఉపయోగపడిందని అన్నారు. భారత లోక్‌సభలో మైకులు పని చేస్తుంటాయి గానీ తరచుగా మొరాయిస్తుంటాయని వ్యా ఖ్యానించారు. మాట్లాడేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంటాయని, తనకు చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చైనా సైన్యంలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దానిపైనా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్లో గతంలో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంవాదాలు ఇప్పుడు లేకుండాపోయాయని ఆక్షేపించారు. -
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్ ప్రైమ్‌టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా?
బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై.. ఆ పదవి చేపడుతున్న మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునాక్ అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునాక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు తెలుసుకుందాం.. ► ప్రవింద్ జుగ్నాథ్.. భారత సంతతికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ 2017లో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవింద్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ► పృథ్విరాజ్ సింగ్ రూపున్.. 2019లో మారిషస్ ఏడవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పృథ్విరాజ్ సింగ్ రూపున్. ఆయన భారత మూలలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. ► ఆంటోనియా కోస్టా.. భారత మూలలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం. ► ఛాన్ సంటోఖి.. చంద్రికాపెర్సాద్ ఛాన్ సంటోఖి.. సురినామిస్ దేశంలో కీలక రాజకీయ నేత. మాజీ పోలీసు అధికారి. 2020లో సురినామిస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇండో-సురినామిస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంటోఖి. ► మొహమెద్ ఇర్ఫాన్ అలీ.. గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా 2020, ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు మొహమెద్ ఇర్ఫాన్ అలీ. లియోనోరాలోని ఇండో-గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ అలీ. ► హలిమా యాకోబ్.. భారత మూలలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2017 నుంచి 8వ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు. ► వేవల్ రామ్‌కలవాన్.. సీషెల్లోస్ రాజకీయ నాయకుడు, 2020, అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1961, మార్చి 15న మహేలో జన్మించారు. 1993-2011, 2016-2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారే. ► కమలా హారీస్.. భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. విజయవంతం కాలేకపోయారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్‌కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్‌షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది... దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. ‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు. పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి. ప్రస్తుత విషయానికి వస్తే... ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు. -
ప్రతిభ..: జయం మనదే!
అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది... ఒక పదం స్పెల్లింగ్ పలకడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాలని ఈసారి కొత్త నిబంధన చేర్చారు. ఈ ప్రభావంతో చాలామంది ఫైనల్ వరకు చేరుకోలేకపోయారు. విక్రమ్‌రాజు, సహన శ్రీకాంత్, అభిలాష పటేల్, శివకుమార్... మొదలైన వారితోపాటు ఫైనల్లో పోటీ పడింది హరిణి. ఒక పదానికి హరిణి ఇచ్చిన నిర్వచనం తప్పేమీ కాదని న్యాయనిర్ణేతలు ప్రకటించడం ద్వారా ‘ఎలిమినేట్’ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. 90 సెకండ్ల లైటినింగ్ రౌండ్ గతంలో లేనిది. ఈ రౌండ్లో 90 సెకన్లలో హరిణి 26 పదాలకు 21 పదాల స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్‌లో విజయం సాధించింది. విక్టరీ ట్రోఫీని అందుకొని 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ‘కల నిజం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ముందుకు వెళ్లడానికి శక్తిని ఇచ్చింది’ అంటుంది టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోకు చెందిన హరిణి. అయితే ఆమె సంతోషం వెనుక ఎంతో కష్టం ఉంది. ‘స్పెల్లింగ్ బీ’ బరిలోకి దిగే క్రమంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిదిగంటల పాటు కష్టపడేది. ‘పోటీ సంగతి ఎలా ఉన్నా, ప్రిపేర్ అవుతున్న క్రమంలో రకరకాల కొత్త పదాలు, వాటిద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను’ అంటుంది హరిణి. గత విజేతల విజయాలు హరిణిలో స్ఫూర్తి నింపాయి. ‘ఈసారి విన్నర్ ట్రోఫీని నేను అందుకోవాల్సిందే’ అనే పట్టుదల పెంచాయి. పోటీదారుల ఒత్తిడి ఎలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను చూసినంత ఉత్కంఠగా స్పెల్లింగ్ బీ పోటీని చూశారు. కోవిడ్ పుణ్యమా అని గత రెండు సంవత్సరాలు ఈ ఉత్సాహం మిస్ అయింది. ‘తాను ఎంతో కష్టపడింది అని ఆమె విజయం చెప్పకనే చెప్పింది’ అంటూ హరిణిని ప్రశంసిస్తున్నారు ‘వర్డ్ బై వర్డ్: ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ డిక్షనరీస్’ రచయిత కొరి స్టాంపర్. హరిణికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకం రాసే ప్రయత్నం చేసింది. విజయం కోసం తాను పడిన కష్టాన్నే అక్షరీకరిస్తే ఎంతోమందికి అది స్ఫూర్తి ఇచ్చే పుస్తకం అవుతుంది కదా! -
కామ్రేడ్ బాలా కన్నుమూత
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్ బాలాకృష్ణన్ అలియాస్ కామ్రేడ్ బాలా(81) మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని హెచ్ఎంపీ డార్ట్మూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం మరణించినట్లు యూకే ప్రిజన్ సర్వీసు అధికారి ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో యూకే కోర్టు 2016 జనవరిలో కామ్రేడ్ బాలాకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అసభ్య ప్రవర్తన కింద ఆరు కేసులు, అత్యాచారం కింద నాలుగు కేసులు, చిత్రహింసల కింద రెండు కేసుల్లో 23 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. అప్పటి నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌లో రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అరవింద్ బాలకృష్ణన్‌ను అనుచరులు కామ్రేడ్ బాలా అని పిలుచుకునేవారు. కామ్రేడ్ బాలా భారత్‌లోని కేరళ రాష్ట్రంలో ఓ గ్రామంలో జన్మించారు. సింగపూర్, మలేషియాలో పెరిగారు. అక్కడే కమ్యూనిస్టు నాయకుడిగా చెలామణి అయ్యారు. సింగపూర్ పౌరసత్వం పొందారు. 1963లో యూకేకు చేరుకున్నారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడే టాంజానియాకు చెందిన చందా పాట్నీని కలిశారు. 1969లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సొంత కుమార్తెను 30 ఏళ్లపాటు బంధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నేరం రుజువయ్యింది. సేవా కార్యక్రమాల ముసుగులో ఎంతోమంది మహిళలపై బాలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారిని క్రూరంగా హింసించాడని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. -
హుర్రే... మన గొంతుకి గ్రామీ
‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ అని మన తల్లులు పాడుతారు పిల్లలతో. ‘చిట్టి కన్నయ్యా... లోకం చూస్తావా’ అని పాడింది ఫాల్గుణి షా తన కొడుకుతో. పిల్లలు ఒక్కోసారి ప్రశ్నలను సంధిస్తారు. వాటికి సమాధారాలు ఇదిగో ఇలా అవార్డులను కూడా తెచ్చి పెడతాయి. ‘అమ్మా.. నా క్లాస్‌లో అందరూ ఒకేలా ఎందుకు లేరు’ అని ఫాల్గుణి షా చిన్నారి కొడుకు అడిగాడు. దానికి జవాబుగా ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమే చేసింది. గ్రామీ గెలుచుకుంది. ఇది ఒక కొడుకు తల్లికి గెలిచి ఇచ్చిన అవార్డు. ఒక తల్లి తన కొడుకు కోసం గెలుచుకున్న అవార్డు. అమెరికాలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల నిషాద్ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి వాళ్ల అమ్మను ‘అమ్మా... స్కూల్లో ఎందుకు అందరూ ఒకేలా ఎందుకు లేరు? రంగూ రూపం, అలవాట్లు వేరే వేరేగా ఎందుకున్నాయి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు తల్లి...‘వేరే వేరేగా ఉండి కలిసి ఉండటమే ప్రపంచమంటే. ఇప్పుడు నీ దగ్గర చాలా రకాల పెన్సిల్స్ ఉన్నాయి. కాని అవన్నీ ఒక పెన్సిల్ బాక్స్‌లో ఇముడుతాయి కదా. అలాగే మనుషులు కూడా కలిసి కట్టుగా ఉంటారు’ అని జవాబు చెప్పింది. కాని సంతృప్తి కలగలేదు. ఇలాంటి ప్రశ్నను ఎందరో పసివాళ్లు తమ తల్లులను అడుగుతూ ఉండొచ్చు. వారికి అందరు తల్లులూ జవాబు చెప్పకపోవచ్చు. వారిని తాను చేరాలి. పాట రూపంలో చేరాలి అనుకుంది. వెంటనే ‘ఏ కలర్‌ఫుల్ వరల్డ్’ పేరుతో ఆల్బమ్ చేసి విడుదల చేసింది. ఇది గ్రామీ మెచ్చడంతో ఏకంగా గ్రామీ అవార్డు వరించింది ఆ తల్లిని. ఆ తల్లి మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన ఫాల్గుణి షా. ముంబై గాయని ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఫాల్గుణి షా... ముంబైలోని జుహులో ఓ సంగీత కుటుంబంలో పుట్టింది. ఇంట్లో సంగీత వాతావరణం ఉండడం, ఫాల్గుణి తల్లి ఆల్ ఇండియా రేడియోలో సంగీత విద్వాంసురాలిగా పనిచేస్తుండంతో చిన్న వయసు నుంచే ఫాల్గుణికి సంగీతం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. రేడియోలో వస్తోన్న పాటలను ఎంతో ఇష్టంగా వినేది. ఈ ఇష్టమే సంగీతం నేర్చుకునేలా చేసింది. ప్రముఖ గుజరాతీ గాయకులు కౌముది మున్షి, ఉదయ్ మజుందార్‌ల దగ్గర గుజరాతీ జానపద సంగీతం, గజల్స్‌తోపాటు టుమ్రి కూడా నేర్చుకుంది ఫాల్గుణి. తరువాత సారంగీ మ్యాస్ట్రో సుల్తాన్ ఖాన్ వద్ద హిందుస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. సంప్రదాయ గాయకుడు కిశోరి అమేన్ కర్ వద్ద జైపూర్ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. రెండుసార్లు గ్రామీకెళ్లిన ఫాలు సంగీతం నేర్చుకుంటూ పెరిగిన ఫాల్గుణి కరిష్మా బ్యాండ్ నడుపుతోన్న గౌరవ్ షాను పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లింది. అక్కడ కరిష్మా బ్యాండ్‌లో గాయకురాలుగా చేరింది. ‘ఫాలు’ అనే స్టేజ్ పేరుతో పాటలు పాడుతూ 2007లో ఫాల్గుణి తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. తరువాత 2013లో ‘ఫోరస్ రోడ్’ పేరిట మరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఈ ఆల్బమ్ తొలిసారి గ్రామీకి షార్ట్ లిస్ట్ అయినప్పటికీ నామినేషన్ కు ఎంపిక కాలేదు. తరువాత 2019లో ‘ఫాలూస్ బజార్’ పేరిట విడుదలైన ఆల్బమ్ మరోసారి గ్రామీకి నామినేట్ అయ్యింది. రెండుసార్లు బెస్ట్ చిల్డ్రన్ ్స మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఫాల్గుణి నిలిచింది. గ్రామీ అవార్డు రానప్పటికీ ఫాల్గుణి సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతోనే గత కొన్నేళ్లుగా అమెరికన్ కంపోజర్ ఫిలిఫ్ గ్లాస్, అమెరికన్ మ్యుజీషియన్ సెల్లిస్ట్ యోయో మా, ఏఆర్ రెహ్మాన్ లతో కలిసి పని చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్‌ను తెచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకు రెహ్మాన్ తో కలసి ఫాల్గుణి పని చేసింది. ఏ కలర్‌ఫుల్ వరల్డ్ పాటల రచయిత, గాయనిగా రాణిస్తోన్న ఫాల్గుణి ఆల్బమ్స్‌లో ఎక్కువగా భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్ జోడించి సమకాలిన అంశాల పాటలు ఉంటాయి. ఫాల్గుణి తొమ్మిదేళ్ల కొడుకు నిషాద్ న్యూయార్క్ సిటీలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రోజూ వాళ్లను దగ్గర నుంచి చూస్తోన్న నిషాద్ ఒకరోజు....‘‘అమ్మా మా స్కూల్లో కొంతమంది నల్లగా, మరికొంతమంది తెల్లగా, ఇంకొంత మంది చామనఛాయగా ఉన్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఇష్టాలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అంతా ఒక దగ్గరే ఎలా చదువుతున్నారు?’’ అని ఫాల్గుణిని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా...‘‘ బొమ్మలకు రంగులు నింపే రంగురంగుల కలర్ పెన్సిళ్లు, క్రేయాన్ ్స .. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నప్పటికీ అన్నీ ఒకే బాక్సులోనే ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, రూపురేఖలు, నలుపు, తెలుపు, ఎరుపు, చామనఛాయ రంగులు, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం లో అంతా శాంతియుతంగా జీవించడం అనేది కూడా క్రేయాన్ ్స బాక్స్లాంటిదే ’’ అని వివరించింది. ఈ వివరణ ఫాల్గునికి నచ్చడంతో ఈ థీమ్‌తో భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘కలర్‌ఫుల్ వరల్డ్ పేరిట (క్రెయాన్ ్స ఆర్ వండర్ ఫుల్)’ ఆల్బమ్? రూపొందించింది. ప్రస్తుతం ఈ ఆల్బమే ఫాల్గుణికి గ్రామీ అవార్డు తెచ్పిపెట్టింది. ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసిపారేయకుండా కాస్త విభిన్నంగా, లోతుగా ఆలోచిస్తే ప్రపంచం మెచ్చేలా కనెక్ట్ కావచ్చుననడానికి ఫాల్గుణి జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. -
షైనింగ్ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్–2021 కాంపిటీషన్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. పంజాబ్‌కు చెందిన సంజయ్ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్లో గ్యాస్ స్టేషన్ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు. ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్ అమర్చిన తరువాత డ్యాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్అప్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసేది. ముఖం కాలిపోయినా.. చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్ అంటే సూపర్ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యాలే స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మోడలింగ్ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తరువాత 2020లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్, ఏ పర్పస్ నేషనల్ అంబాసిడర్, పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్, టాలెంట్ ఆడియెన్స్ చాయిస్ నేషనల్ అవార్డు, బ్యూటీ విత్ పర్పస్ విన్నర్ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని టాప్–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది. మోటివేషనల్ స్పీకర్‌గానూ.. పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్ అమెరికన్ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ. -
డబ్ల్యూహెచ్ఎంఓ డైరెక్టర్ పదవికి మజు రాజీనామా
వాషింగ్టన్: వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజ వర్గీస్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని ఆయన శనివారం ట్వీట్ చేశారు. పదవీ కాలంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మజు అద్భుతమైన పనితీరు కనపరిచారని వైట్‌హౌస్ అధికారులు ప్రశంసించారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజు పనిచేశారు. ఈ పదవిలో ఎవరిని నియమించేది ఇంకా వైట్‌హౌస్ నిర్ణయించలేదు. తదుపరి కార్యాచరణను మజు వెల్లడించలేదు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ. -
బ్రిటన్ తదుపరి ప్రధాని మనోడేనా ?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభిస్తుందా? బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ ప్రధాని రేసులో ముందున్నారా ? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి చరిత్ర సృష్టిస్తారా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బ్రిటన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు 2020 మేలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మందు పార్టీ వివాదం ముదురుతోంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్ జాన్సన్ ఇచ్చిన పార్టీ వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో విపక్ష లేబర్ పార్టీలో, సొంత పార్టీ కన్జర్వేటివ్‌లలో వ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరిగిన గత ఏడాది ఏప్రిల్ 17 ముందు రోజు రాత్రంతా డౌనింగ్ స్ట్రీట్‌లో 30 మంది మందులు, చిందులతో కాలం గడిపారన్న ఆరోపణలు తాజాగా వస్తున్నాయి. ఫిలిప్ భౌతిక కాయం ఉన్న సమయంలో అలాంటి పార్టీలు జరుపుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ‘పార్టీ గేట్’ వివాదంపై బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బోరిస్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ చెప్పే సమయంలో రిషి సభలో లేకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఆర్థిక మంత్రి అయినప్పట్నుంచే రిషి ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నారని, అందుకే ‘పార్టీగేట్’ వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సభకు హాజరుకాలేదని బోరిస్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన రిషి తన శాఖకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్లే సభకు హాజరు కాలేదంటూ ట్వీట్ చేశారు. కోవిడ్ విలయంతో తరచూ లాక్డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు. -
ఫస్ట్ ఉమన్: అమెరికా యూనివర్శిటీకి మన మహిళే ప్రెసిడెంట్
ఎల్లలు దాటి ఏ దేశమేగినా మన సాధనే తొలి అడుగు గా ఉంటే విజయం దానంతట అది మనల్ని వరించక తప్పదనే విషయాన్ని తన విజయం ద్వారా రుజువు చేసి చూపుతున్నారు నీలి బెండపూడి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన ఒక మహిళ ఎన్నిక కావడం గర్వించదగినదిగా సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు నీలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నీలి బెండపూడి ఉన్నత చదువుల కోసం ముప్పై ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆమె విజయ సోపానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం అమెరికాలోని లూయిస్విల్లేలో ఉంటున్న నీలి బెండపూడి విశాఖపట్నం వాసి. ఆంధ్రాయూనివర్శిటీలో ఎంబీఎ చేసిన ఆమె. పీహెచ్‌డి కోసం అమెరికాలో కాన్సస్ యూనివర్శిటీకి వెళ్లారు. అలా 1986లో పై చదువుల రీత్యా విశాఖపట్నం నుంచి వెళ్లిన నీలి బెండపూడి 30 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదిగారు. నాలుగేళ్లుగా యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లేకు 18వ ప్రెసిడెంట్‌గా విధులను నిర్వరిస్తున్నారు. దీనిలో భాగంగా యూనివర్శిటీ పరిధిలోని పన్నెండు విద్యా కళాశాలలు, విద్యా ఆరోగ్య వ్యవస్థలో భాగంగా ఐదు ఆసుపత్రులు, ఒక అథ్లెటిక్ ప్రోగ్రామ్, 200 మంది వైద్యులు, నాలుగు వైద్య కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆమె తన విధుల్లో కొనసాగుతారు. గత అనుభవాలే గురువులు విధి నిర్వహణలో సమర్థత, కార్యదక్షతలో భాగంగా ఆమె ప్రతియేటా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛాన్సలర్‌గా, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ వంటి అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వహించడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేశారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు’ అంటూ నడిచొచ్చిన మెట్ల గురించి సవినయంగా వివరిస్తారు నీలి బెండపూడి. ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్ రాబోయే నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (పీఎస్‌యు) కి 19వ ప్రెసిడెంట్‌గా నీలి బెండపూడి బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్శిటీ అధ్యాపకులు, సిబ్బంది, సభ్యులు, విద్యార్థులు, ట్రస్టీ ప్రతినిధులతో కూడిన 18 మంది సభ్యుల బృందం నీలి బెండపూడిని ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. యూనివర్శిటీకి ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత పీఎస్యూలోని ట్రæస్టీకి ధన్యవాదాలు తెలిపిన బెండపూడి ఈ అవకాశాన్ని అందుకోవడానికి తాను పనిచేసిన ప్రతి చోటూ తన ఉన్నతికి సహాయపడిందని గుర్తు చేసుకుంటున్నారు. అమెరికన్ అడకమిక్ అడ్మినిస్ట్రేటర్ గా, పీఎస్‌యు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రెసిడెంట్ ఎరిక్ జె బారన్ తర్వాత ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు. నీలి బెండపూడి -
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
‘గ్యాప్’ పెరుగుతోందా? వైట్‌హౌస్‌లో ఏదో తేడా కొడుతోంది!
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షరాలిగా చరిత్రకెక్కిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు ‘వైట్‌హౌస్’లో ప్రాధాన్యత తగ్గుతోందా? బాధ్యతల నిర్వహణలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. కమలా హ్యారిస్‌తో అధ్యక్షుడు జో బైడెన్ కీలక బృందంలోని సభ్యులకు పొసగడం లేదని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో ఆమె పాత్ర క్రమేపీ తగ్గుతోందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. కమల కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి. ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న సైమోన్ సాండర్స్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నారు. హ్యారిస్ జట్టులో వీరిద్దరూ అత్యంత ముఖ్యులు. ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్ ఇమేజ్ను పెంచడంలో, ఆమె ప్రతిభను, నాయకత్వ పటిమను విజయవంతంగా అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. అత్యంత ముఖ్యులు, సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో కమలా హ్యారిస్‌కు దూరమవ్వడం... యాదృచ్చికంగా కాదని ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థ అభిప్రాయపడింది. వైట్‌హౌస్‌లో అంతా సవ్యవంగా లేదని, ఏదో తేడా కొడుతోందని పేర్కొంది. ‘ముద్ర’పడిపోతుందనే భయమా? కమలా హ్యారిస్‌కు అత్యంత సన్నిహితురాలైన సైమోన్ సాండర్స్ వైదొలుగుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ ‘ఆమె ఎప్పటికీ బైడెన్– హ్యారిస్ కుటుంబం (సన్నిహిత బృందం)లో సభ్యురాలే. రెండు మూడేళ్లు ఒక పదవిలో పనిచేశాక కొత్త బాధ్యతలు సిద్ధం కావడం సహజమే. తొలి ఏడాది వైట్‌హౌస్‌లో పనిచేయడం ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అదే సమయంలో కఠోరమైన శ్రమకు, తీవ్ర అలసటకు గురిచేస్తుంది’ అని అన్నారు. ‘సైమోన్‌ను నేనెంతో అభిమానిస్తాను. తదుపరి ఆమె ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. బాధ్యతల నిర్వహణలో భాగంగా దాదాపు మూడేళ్లుగా విరామం ఎరుగకుండా దేశాన్ని చుట్టేసింది’ అని హ్యారిస్ స్పందించారు. కమలకు అత్యంత సన్నిహితులుగా శాశ్వత ముద్రపడితే... బైడెన్ హయాంతో పాటు భవిష్యత్తులోనూ తమకు మంచి అవకాశాలు లభించకపోవచ్చనే భయమూ ఆష్లే, సాండర్స్లకు ఉండి ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. పరిమిత పాత్రపై అసంతృప్తి! జెన్ సాకీ వివరణ ఆమోదయోగ్యంగా లేదని... ఆష్లే, సాండర్స్ ఇద్దరూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే (జవనరి 20) బాధ్యతల నుంచి తప్పుకోవడం అసాధారణమైన పరిణామమేనని సీఎన్ఎన్ పేర్కొంది. విధి నిర్వహణకు ఉపాధ్యక్షురాలు సరైన రీతిలో సన్నద్ధం కాలేదని, పైగా ఆమెకు అంతగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదని కమలా హ్యారిస్ కార్యాలయంలో, జట్టులో పనిచేస్తున్న సన్నిహితుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయంగా చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నానని హ్యారిస్ సన్నిహితుల వద్ద బాధపడినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఆమె టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడాక సీఎన్ఎన్ ఈ అభిప్రాయానికి వచ్చింది. లీగల్ రెసిడెంట్లు, ఇతర మైనారిటీలకు ఓటు హక్కు విషయంలో గట్టిగా కృషి చేసే బాధ్యతను బైడెన్ జనవరిలోనే హ్యారిస్‌కు అప్పగించారు. చట్టసభల్లో ఈ అంశంలో బిల్లు పాసయ్యే అవకాశాలు బహుస్వల్పం. అలాగే మెక్సికో గుండా అక్రమ వలసలను నిరోధించి, దీనికో పరిష్కారం కనుగొనే బాధ్యతనూ ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అక్రమ వలసలు, శరణార్థుల విషయంలో కఠిన వైఖరిని అవలంభించారు. అప్పుడు ఎన్నో వేల మంది పిల్లలను తల్లిదండ్రులకు అమెరికా యంత్రాంగం దూరం చేసిందనే అపవాదు ఉంది. అక్రమవలసలను అడ్డుకొనే విషయంలో బైడెన్‌కు ముందు పనిచేసిన చాలామంది అధ్యక్షులూ విఫలమయ్యారు. ఇలాంటి కఠినతరమైన, సున్నిత అంశాలను కమలా హ్యారిస్‌కు అప్పగించారు. వయసు, ఆరోగ్యరీత్యా బైడెన్ (79 ఏళ్లు) రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడకపోవచ్చని, భవిష్యత్తులో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి కావొచ్చని, అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్యన బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్ (57 ఏళ్లు) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమనేది మెజారిటీ మీడియా అంటోంది. రుణ పరిమితిని పెంచుకోవడం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సంక్షేమ పథకాలపై భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సంబంధించిన ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందడానికి జో బైడన్ ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలితో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నాలపై సత్వరం దృష్టి సారించేంత సమయం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కమల ‘అధ్యక్ష’ బాధ్యతలు భేష్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గంట 25 నిమిషాలపాటు అగ్రరాజ్యం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించడం అమెరికా దేశ చరిత్రలో ఒక అధ్యాయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. అధ్యక్ష హోదాలో విధుల్లో ఉన్నది కాసేపే అయినప్పటికీ కమలా తన బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ‘అమెరికా చరిత్రలో ఇది మరో అధ్యాయంగా చెప్పాలి. కొద్దిసేపైనా సరే ఒక మహిళ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని జెన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే భావనతోనే ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్‌ను బైడెన్ ఎన్నిక చేసుకున్నట్టుగా సాకీ వివరించారు. అధ్యక్షుడు బైడెన్‌కి కొలనోస్కోపీ పరీక్షలు నిర్వహించే సమయంలో మత్తుమందు ఇవ్వడం వల్ల కమలకు తన అధికారాలను బైడెన్ బదలాయించిన విషయం తెలిసిందే. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. -
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్‌హౌస్ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
Anisha Dixit: ఎంబీయే అని చెప్పి సీక్రెట్‌గా యాక్టింగ్.. అనుమానం రాకుండా
ఏదైనా కావాలంటే అది ఇచ్చేవరకు మారాం చేస్తూనే ఉంటారు చిన్నారులు. కొందరు మాత్రం... తల్లిదండ్రుల కోపానికి భయపడి, కోరికను మనసులోనే దాచుకుని తమలో తామే బాధపడుతుంటారు. అనిశా దీక్షిత్ది ఇటువంటి మనస్తత్వమే. ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. కానీ తన తండ్రి ‘‘నటనా గిటనా ఏం వద్దు’’ అని గట్టిగా చెప్పడంతో భయపడి మరోసారి నటన ఊసెత్తలేదు. కానీ అనిశాతోపాటు పెరిగి పెద్దదైన నటనాసక్తి.. డిగ్రీ చదువుతున్నానని చెప్పి యాక్టింగ్ కోర్సు చేసేలా చేసింది. తొలిప్రయత్నంలోనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి అనిశా దీక్షిత్ ఉదాహరణగా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన అనిశ్, దివ్యాదీక్షిత్ దంపతులకు జర్మనీలో పుట్టింది అనిశా దీక్షిత్. విదేశంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో అనిశా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పెరిగింది. తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం వీధిన పడినంత పని అయ్యింది. దీంతో బంధువుల ఇంటిలో తల దాచుకున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం, వీధుల్లో చిన్నపాటి వస్తువులను విక్రయించి పొట్ట పోసుకునేవారు. ఇంతటి పేదరికంలోనూ అనిశా మంచి నటిగా ఎదగాలనుకునేది. తన ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ‘‘నువ్వు నటివి కావాల్సిన అవసరం లేదు’’ అంటూ యాక్టింగ్ కోర్సు చేస్తానంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎంబీఏ అనిచెప్పి.. డిగ్రీ పూర్తయిన తరువాత స్విట్జర్లాండ్‌లో ఎమ్బీఏ చేస్తానని ఇంట్లో చెప్పి.. అక్కడ ఎంబీఏలో చేరకుండా సీక్రెట్‌గా యాక్టింగ్, మోడలింగ్ కోర్సు చేసింది. వీకెండ్స్‌లో ఇంటికి వచ్చిన ప్రతిసారి అనిశా తండ్రి బిజినెస్‌కు సంబంధించిన విషయాలను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు తన స్నేహితురాలితో మాట్లాడి సరైన సమాధానాలు చెబుతూ తండ్రికి అనుమానం రాకుండా చూసుకునేది. స్విట్జర్లాండ్‌లో కోర్సు పూర్తయ్యాక, వెంటనే ఇండియా వచ్చిన అనిశా ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో చేరింది. ఈ స్కూలు ద్వారానే 2013లో బాలీవుడ్ సినిమా ‘పంజాబ్ బోల్దా’లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ సినిమా విడుదల అవకముందే తన తండ్రి మరణించారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో అనిశా సినిమా కెరియర్ ఆదిలోనే ముగిసింది. ఫేస్బుక్ వ్లాగింగ్.. సినిమా అవకాశాలు రాకపోయినా అనిశా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పటి నుంచే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నచిన్న వ్లాగ్ వీడియోలను పోస్ట్ చేస్తుండేది. ఇండియా వచ్చిన తరువాత తన రోజూవారి పనులను వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది. ఇలా క్రమంగా వీడియోలను అప్లోడ్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా ఎదిగింది. సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సమయంలో..ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రిక్షావాలా... ఇండియాలో రవాణాకు వాడే ఆటో రిక్షా(ఆటో)ను తన వీడియోలలో ప్రధాన థీమ్‌గా తీసుకుంది. యూట్యూబ్ చానల్‌కు ‘రిక్షావాలా’ అని పేరు పెట్టుకుంది. ఆటోలో కూర్చోని.. ప్రారంభం లో సినిమా రివ్యూల వీడియోలను పోస్ట్ చేసేది. ‘రామ్‌లీలా’ సినిమా తొలి రివ్యూ వీడియో చేసింది. క్రమంగా లింగ ఆధారిత (జండర్ బేస్డ్) కామెడీ వీడియోలను అప్లోడ్ చేసేది. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. భారత మహిళలు ఎదుర్కొంటున్న అనేక అభద్రతతో కూడిన అంశాలపై వీడియోలు చేయడంతో అనిశా బాగా పాపులర్ అయ్యింది. ఆ వీడియోల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకోవడంతో అనిశా సెలబ్రిటిగా మారడమేగాక, సోషల్ మీడియా స్టార్‌గా మారింది. రిక్షావాలి డాట్ కమ్ వెబ్సైట్ ప్రారంభించి, దీనిలో ఇండియా గురించిన ఆర్టికల్స్‌ను కూడా రాసేది. ప్రస్తుతం తన చానల్లో వివిధ కోణాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వీటిలో స్టోరీటైమ్స్, వ్లాగ్స్ నుంచి లఘు చిత్రాల రివ్యూలు చేస్తోంది. సెలబ్రెటీ గుర్తింపు వచ్చాక తన యూట్యూబ్ చానల్ రిక్షావాలా పేరుని మార్చి తన పేరునే చానల్ పేరుగా మార్చింది. ప్రముఖులతో వీడియోలు అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం అనిశా చానల్‌కు ముఫ్పై లక్షల మంది సబ్స్క్రెబర్స్, ఇన్‌స్టాలో ఐదులక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు వ్యక్తి దారుణ హత్య
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృత్యువాత పడ్డారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నారు. 2014 నుంచి అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్ జాన్(27)గా గుర్తించారు. చదవండి: (మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పార్క్స్ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న రీడ్ జాన్ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో వెంటాడాడు. శ్రీరంగను అనుసరిస్తూ ఇంటిదాకా వచ్చాడు. ఇంట్లోకి రాగానే అతడిపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడికక్కడే కన్నుమూశారు. రీడ్ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా!
ఒకప్పుడు ఎవరి ఫోన్ నంబర్ అయినా తడుముకోకుండా టకటకా చెప్పేవాళ్లం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంట్లో వాళ్ల నంబర్లు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో.. ప్రపంచ దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడ వినియోగించే కరెన్సీ పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతోంది పదేళ్ల సారా ఛిపా. భారతసంతతికి చెందిన సారా ఇటీవల జరిగిన వరల్డ్ రికార్డ్స్ పోటీలో పాల్గొని.. 196 దేశాల పేర్లు, రాజధానులు, ఆయా దేశాల్లో వాడే కరెన్సీ పేర్లను అవలీలగా చెప్పి వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఈ రికార్డు సాధించిన వారంతా దేశాల పేర్లు వాటి రాజధానుల పేర్లు మాత్రమే చెప్పగా.. సారా వీరందరికంటే ఒక అడుగు ముందుకేసి ఆయా దేశాల కరెన్సీల పేర్లు కూడా చెప్పడం విశేషం. గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎమ్‌జీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో పాల్గొన్న సారా అన్ని దేశాల కరెన్సీ, రాజధానుల పేర్లు కరెక్టుగా చెప్పి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంది. కాగా ఈవెంట్‌ను యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ మాధ్యమాలలో లైవ్ టెలికాస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని భిల్వారా.. సారా స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ వృత్తిరీత్యా గత తొమ్మిదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. సారాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. జెమ్స్ మోడరన్ అకాడమీలో ఆరోతరగతి చదువుతోన్న సారా 1500 గంటలకు పైగా సాధన చేసి ఈ కేటగిరీలో గెలిచిన తొలి భారతసంతతి వ్యక్తిగా నిలిచింది. అనుకోకుండా.. సారా వరల్డ్ రికార్డులో పాల్గొనాలని మెమరీ టెక్నిక్స్ నేర్చుకోలేదు. లాక్డౌన్ సమయంలో జ్ఞాపకశక్తి, సృజనాత్మకు పదును పెట్టేందుకు ముంబైకు చెందిన ‘బ్రెయిన్ రైమ్ కాగ్నిటివ్ సొల్యూషన్’ వ్యవస్థాపకులు సుశాంత్ మీసోర్కర్ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కొన్ని సెషన్ల తరువాత సారాలో చురుకుదనం గమనించిన సుశాంత్ ఆమెకు మరింత ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు పోటీలో పాల్గొనేందుకు ప్రేరేపించారు. ప్రారంభంలో 585 పేర్లను గుర్తు పెట్టుకోవడానికి సారాకు గంటన్నర పట్టేది. సాధన చేస్తూ చేస్తూ కేవలం 15 నిమిషాల్లోనే పేర్లను చెప్పగలిగేది. మూడు నెలల పాటు ఎంతో కష్టపడి క్రియేటివ్ లెర్నింగ్, మెమరీ టెక్నిక్‌ల ద్వారా దేశాల రాజధానులు, కరెన్సీ పేర్లను గుర్తుపెట్టుకుంది. షైన్ విత్ సారా సారా జ్ఞాపకశక్తిపరంగా చురుకైన అమ్మాయే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా. వివిధ కార్యక్రమాల్లో స్టేజిపై నాట్యప్రదర్శనలు ఇచ్చింది. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగా, బ్రీతింగ్ టెక్నిక్లను సాధన చేస్తోంది. ఇంకా ‘షైన్ విత్ సారా’ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతూ..‘‘ఇన్క్రెడిబుల్ ఇండియా’’ పేరుతో వీక్లి సిరీస్‌లను అందిస్తోంది. ‘‘నేను ఈ రికార్డును నెలకొల్పడానికి నా గురువు సుశాంత్, తల్లిదండ్రులే నాకు ప్రేరణ. నా మీద నమ్మకముంచి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు వరల్డ్ రికార్డును సాధించగలిగాను’’ అని సారా చెప్పింది. ‘‘ప్రపంచ రికార్డు హోల్డర్‌కు తండ్రినైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. యూఏఈలో ఉంటున్నప్పటికీ నేను భారతీయుడినైనందుకు ఎంతో గర్వంగా ఉంది. సారా జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సారా తండ్రి సునీల్ చెప్పారు. -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
భారత సంతతి సాధికారతకు శుభరూపం
యూఎస్‌లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదవి చేపట్టనున్నారు. రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు. రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్‌గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్‌మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్‌లో పదేళ్లు సేవలు అందించారు. వాల్‌మార్ట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా, పేపాల్‌లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్‌గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
బైడెన్ టీమ్ మనవాళ్లే మరో ఇద్దరు
ట్రంప్ తన నాలుగేళ్ల పదవీ కాలంలో లోకంతో అనేక తగాదాలు పెట్టుకున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితినీ, ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ఆయన వదల్లేదు! ‘మా డబ్బు తీసుకుంటూ మాకు శత్రువులు అయినవారికి అనుకూలంగా ఉంటారేంటి!’ అని ఆయన ఘర్షణ. ‘శత్రు దేశాలు ఉంటాయి కానీ.. సమితులకు, సంస్థలకు అన్నీ స్నేహదేశాలే’ అని వారి సమాధానం. ఇప్పుడీ దెబ్బతిన్న సంబంధాలన్నిటినీ కొత్త అధ్యక్షుడు బైడెన్ చక్కబెట్టుకుంటూ రావాలి. అందుకే ఆయన ఆచితూచి రాయబార సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. ఆ వరుసలో తాజాగా అపాయింట్ అయినవారే సోహినీ చటర్జీ, అదితీ గొరూర్. ఇద్దరూ భారత సంతతి అమెరికన్లు. ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సోహినీ చటర్జీ వెళుతున్నారు. ఆమెతోపాటు పాలసీ అడ్వైజర్‌గా ఆమెకన్నా వయసులో చిన్నవారైన అదితీ గొరూర్. అమెరికా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కీలకమైన స్థానాలకు ఎంపికైనవారు. ఈ ఇద్దరినే బైడెన్ తీసుకోడానికి తగిన కారణాలే ఉన్నాయి. సోహినీ ఇటీవలి వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలోని ‘అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల విద్యాసంస్థ’ లో సహాయ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అర్థిక పరిస్థితులు, జాతుల అణచివేతలు, ఘర్షణల మూలాలు సోహినీ మునివేళ్లపై ఉంటాయి. ఏ వేలితో ఏ మీటను నొక్కితే సమస్యకు పరిష్కారం క్రియాశీలం అవుతుందో ఆమెకు తెలుసు. యు.ఎస్.ఎ.ఐ.డి. (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లో కూడా సోహినా కొన్నాళ్లు పని చేశారు. అక్కడి పాలసీ, ప్లానింగ్, లెర్నింగ్ బ్యూరోలో ఆమె పని. ఒబామా హయాంలో బైడన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సోíß నీ సీనియర్ పాలజీ అడ్వైజర్‌గా పని చేశారు. ఆ అనుభవం చూసే బైడెన్ ఇప్పుడు ఆమెను ఎంపిక చేసుకున్నారు. లాయర్ గా కూడా సోహినీ ప్రసిద్ధురాలు. ∙∙ అదితి గొరూర్ ఇంతకుముందే యు.ఎన్.తో కలిసి పనిచేశారు. సమితి శాంతి పరిరక్షక విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. ప్రపంచాన్ని మెరుగుపరిచే వినూత్న ఆవిష్కణల కోసం కృషి చేస్తుండే ప్రఖ్యాత స్టిమ్సన్ సెంటర్ (వాషింగ్టన్) లో అదితి కాన్ఫ్లిక్ట్స్ ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా పని చేశారు. జాతుల ఘర్షణల నుంచి పౌరులను కాపాడటం ఆ కార్యక్రమ లక్ష్యం. స్టిమ్సన్‌లో చేరకముందు అదితి బెంగళూరు లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’లో, వాషింగ్టన్ డీసీలోని ‘ఏషియన్ ఫౌండేషన్ అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ ఇన్ ది మిడిల్ ఈస్ట్’ సంస్థలో, మెల్బోర్న్ లోని ‘యూనివర్సిటీ లా స్కూల్’లో మానవ హక్కుల పరిరక్షణపై అధ్యయనం జరిపారు. ఆమె చదివింది కూడా అదే చదువు. జార్జిటౌన్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ’లో ఎం.ఎం చేశారు. మెల్బోర్న్ యూనివర్సిటీలో ఆనర్స్‌తో ‘లా’ చదివారు. అదితి నైజీరియాలోని లాగోస్ లో పుట్టారు. ఇండియా, ఓమన్, ఆస్ట్రేలియాల్లో పెరిగారు. యు.ఎస్.లో స్థిరపడ్డారు. -
అమ్మ మాట బంగారు బాట
వాషింగ్టన్: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన వేళ భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ మరోసారి తన తల్లిని తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తన పట్ల ఉంచిన నమ్మకమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. భారత్‌కు చెందిన శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూనే పౌర హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా హ్యారిస్‌పై తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ. ఇండియన్ అమెరికన్ న్యాయ, రాజకీయ యాక్షన్ కమిటీ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షురాలు కమల మరోసారి తన తల్లి చెప్పిన మాటల్ని అందరితోనూ పంచుకున్నారు. ‘ఎంతో మంది అమెరికన్ల కథే నా కథ కూడా. నా తల్లి శ్యామలా గోపాలన్ భారత్ నుంచి వచ్చారు. నన్ను నా చెల్లి మాయని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు. మనమే మొదటి వాళ్లం కావొచ్చు. కానీ మనం ఎప్పటికీ ఆఖరి వాళ్లం కాదని మా అమ్మ తరచూ చెబుతూ ఉండేవారు’’ అని కమల గుర్తు చేసుకున్నారు. మహిళా శక్తికి వందనం కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారానికి ముందు ట్విట్టర్లో ఉంచిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. తనకంటే ముందు ఈ గడ్డపై అడుగుపెట్టిన వారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో చేశారు. ‘నా కంటే మా అమ్మ మొదట ఇక్కడికి వచ్చింది. మా అమ్మ శ్యామలా గోపాలన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా నా హృదయంలో శాశ్వతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా అమ్మ అమెరికాకి వచ్చినప్పుడు తన కుమార్తె ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించి ఉండదు. కానీ అమెరికాలో మహిళకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమెకు గట్టి నమ్మకం. ఆ నమ్మకమనే బాటలోనే నడిచి నేను ఇంతవరకు వచ్చాను. అందుకే అమ్మ మాటల్ని ప్రతీ క్షణం తలచుకుంటూనే ఉంటాను’’ అని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం పోరాటాలు, త్యాగాలు చేసే మహిళల్ని చాలాసార్లు ఈ దేశం గుర్తించకపోవచ్చు. కానీ కొన్నిసార్లు వారే ఈ దేశానికి వెన్నెముకగా ఉంటారని రుజువు అవుతూనే ఉందని కమల వ్యాఖ్యానించారు. -
బైడెన్‌కు కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్‌ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటమి ఒప్పుకున్న ట్రంప్ బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్‌పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్ చేస్తుండటంతో ట్రంప్ అకౌంట్లను ఫేస్బుక్ 24 గంటల పాటు, ట్విటర్ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్‌ను బ్లాక్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ట్రంప్ ఫేస్‌బుక్‌ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అన్నారు. ట్రంప్ అకౌంట్‌ను 2వారాలు బ్లాక్ చేస్తున్నామని స్పష్టం చేశారు. -
సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం
మెల్బోర్న్: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు. శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పార్టీ నామినేట్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో బుధవారం ఆమె అ«భ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ వైఫల్యాల కారణంగా అమెరికా ప్రజలు తమ జీవితాల్నే పణంగా పెట్టారన్నారు. తాను భారత్, జమైకా వలసదారుల బిడ్డగా చెప్పుకున్నారు. అమ్మ పై నుంచి చూస్తూ ఉంటుంది తల్లి శ్యామలా గోపాలన్ చెప్పిన మాటల్నే ఆమె మళ్లీ తలచుకున్నారు. ‘‘ఇతరులకు సేవ చేస్తే మన జీవితానికి పరమార్థం వచ్చినట్టవుతుంది. ఇప్పుడు నాకు ఆ సేవ చేసే అవకాశం దక్కబోతోంది. ఇలాంటి సమయంలో అమ్మ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. కానీ పై నుంచి అమ్మ అంతా చూస్తూ ఉంటుందని నాకు తెలుసు’’అని అన్నారు. ‘‘అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా మీరు చేసిన నామినేషన్‌ను నేను ఆమోదిస్తున్నాను. బహుశా నేను ఈ స్థాయికి ఎదుగుతానని మా అమ్మ ఊహించి ఉండదు’’అని చెప్పారు. ‘‘నల్లజాతి మూలాలు, భారతీయ వారసత్వం కలిగినందుకు గర్వపడేలా అమ్మ పెంచారు ’’అని కమల చెప్పారు. -
కమలా హ్యారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్
వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అర్హతను ప్రశ్నించడమే కాక.. జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏంటంటే ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు. వైట్‌హౌస్ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు’ అంటూ జాత్యంకార వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అర్హత లేదన్నారు. ట్రంప్ తన వ్యాఖ్యలతో ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌కు ఆజ్యం పోసినట్లయ్యింది అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే ట్రంప్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శిస్తున్నారు. (బైడెన్ తెలివైన నిర్ణయం) అయితే ట్రంప్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు నెటిజనులు. ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. ఆమె వివరాలను పరిశీలించిన న్యాయవాదులు కూడా దీని గురించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా లెవిన్సన్ ‘చాలు ఆపండి, ముగించండి. అది ఏదైనా సరే.. నిజాయతీగా ఉండండి. ఇక్కడ రంగు, తల్లిదండ్రులు గురించిన వ్యాఖ్యలు అనవసరం. పైగా ఇవి పూర్తిగా జాత్యంహకార వ్యాఖ్యలు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జో బిడెన్ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ తన అక్కసును వెల్లగక్కడం గమనార్హం. (ట్రంప్ అధ్యక్ష పదవికి తగడు) గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి అర్హత లేదని ట్రంప్ ఆరోపించారు. దాంతో ఒబామా తాను హవాయిలో జన్మించినట్లు చూపిస్తూ తన జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా ట్రంప్ అది ఫేక్ సర్టిఫికెట్ అంటూ రాద్దాంతం చేశారు. ఆ తర్వాత 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దీని గురించి ట్రంప్‌ను ప్రశ్నిస్తే.. అది ఎప్పుడో అయిపోయిందని.. ఒబామా ఇక్కడే జన్మించాడని వ్యాఖ్యనించడం విశేషం. తాజాగా కమలా హ్యారిస్ విషయంలో కూడా ట్రంప్ తప్పుడు ప్రచారానికి ప్రయత్నిస్తున్నారు. -
ట్రంప్ అధ్యక్ష పదవికి తగడు
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ తన తొలి ఎన్నికల ప్రసంగంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధ్యక్ష పదవికి ఆయన తగిన వ్యక్తి కాదని విమర్శించారు. ట్రంప్‌లో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో అమెరికా వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో కలిసి కమల బుధవారం విల్లింగ్టన్లో తొలి ఎన్నికల ప్రసంగం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సమావేశాన్ని ప్రజల మధ్య నిర్వహించలేదు. బైడెన్, హ్యారిస్‌లు ఇద్దరూ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ విలేకరులతో మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ పాలనా యంత్రాంగం గందరగోళం సృష్టిస్తోందని అధ్యక్షుడు ట్రంప్‌పైనా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీద కచ్చితంగా కేసు వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజల సంక్షేమానికి కొత్త చట్టాలు తెస్తామని, వాతావరణ మార్పులపై పోరాడతామని బైడెన్, హ్యారిస్‌లు కలసికట్టుగా హామీ ఇచ్చారు. ఒకే రోజులో 2.6 కోట్ల డాలర్ల సేకరణ ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే డెమోక్రాట్లలో ఎన్నికల జోరు పెరిగింది. కేవలం 24 గంటల్లోనే జో బైడెన్ 2.6 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల్ని సేకరించారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో నిధులు రావడం ఇప్పటివరకు రికార్డు. డెమోక్రాట్ మద్దతు దారుల నుంచి భారీగా విరాళాలు రావడం ఉత్సాహాన్ని నింపుతోందని బైడెన్ వ్యాఖ్యానించారు. మా అమ్మే స్ఫూర్తి కమలా హ్యారిస్ తన తొలి ఎన్నికల ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్ మాటల్ని మళ్లీ తలచుకున్నారు. తన జీవితంలో ఆమె పాత్ర చాలా గొప్పదని అన్నారు. జమైకా దేశస్తుడైన తండ్రి డొనాల్డ్, భారతీయురాలైన తల్లి శ్యామల ప్రపంచంలోని భిన్న వాతావరణం నుంచి వచ్చారని చెప్పారు. కూర్చొని ఫిర్యాదులు చేయకుండా ఏదో ఒక పని చేయమని చెప్పిన తల్లి మాటలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయన్నారు. ఆమె వల్లనే అమెరికాలో సమాన న్యాయం సాధించడం కోసం లాయర్‌గా 30 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్నానన్నారు. -
అమెరికాలో ‘కమల’ వికాసం
జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది. భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్‌ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్‌లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. భయం లేని పోరాటయోధురాలు: బైడెన్ కమలా హ్యారిస్‌ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్‌ని ఓడించబోతున్నాం. హ్యారిస్‌కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు. ఒబామా సలహా మేరకే ! కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్‌గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్‌ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్‌గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. కమలా ఎంపికకి కారణాలివే ! అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్‌గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి. వారి ఓట్లే కీలకం అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్‌కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి. అమ్మ చెప్పిన మాట ‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్‌గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు. నేను అమెరికన్నే కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్‌గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సెనేట్‌లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్గానే హ్యారిస్ చెప్పుకుంటారు. అధ్యక్షురాలు కావాలని కలలు సెనేటర్‌గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్‌ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల. ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు. తల్లి శ్యామలతో కమల (ఫైల్) -
తొలి అంతరిక్ష హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’
వాషింగ్టన్: అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్ రూపానీ చెప్పారు. -
స్పెల్‌బీలో భారత సంతతి విద్యార్థుల ఘనత
వాషింగ్టన్: ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బహుమతిని పొందిన 8 మంది విద్యార్థుల్లో ఏకంగా ఆరుగురు భారత సంతతి విద్యార్థులే ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ(13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. -
భారత సంతతి ఇళ్లే టార్గెట్
లండన్: బ్రిటన్‌లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది. ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్ పోలీస్ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్ దుగ్గన్ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్ హ్యాండ్ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్ హ్యాండ్ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దసరా, దీపావళి సమయాల్లోనే ఎక్కువ దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది. పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్ బంగారం నగలు అమ్మే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంగా>రం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు. వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్ కుమార్ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్ పోలీసు విభాగంలో డిటెక్టివ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ నగ్గెట్’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు. -
బ్రిటన్‌లో ఇద్దరు భారతీయుల మృతి
లండన్: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొనడంతో భారత సంతతికి చెందిన ఇద్దరు మైనర్లు మృతిచెందిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్ (10), పవన్‌వీర్ సింగ్ (23 నెలలు) మృతిచెందారు. అన్నదమ్ములైన వీరిద్దరూ తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వోల్వర్హామ్టన్ వద్ద వారి కారును ఆడీ ఎస్3 కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ బెంట్లీ కారు డ్రైవర్‌తో రేసింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ రేసింగ్‌లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉండగా.. బెంట్లీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడీ, బెంట్లీ కార్లు మితిమీరిన వేగంతో వెళ్తుండగా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. -
భార్యను చంపేందుకు పోలీసుకే సుపారీ
వాషింగ్టన్: విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి(52) అనే ప్రియురాలు ఉంది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018, జూన్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా ‘నా మాజీ భార్యను చంపాలి. నీకు ఎవరైనా కిరాయి హంత`కుడు తెలుసా?’ అని సహచర ఖైదీని నర్సన్ అడిగాడు. నర్సన్తో సరే అని చెప్పినా, తర్వాత ఆ విషయాన్ని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్‌కవర్ ఏజెంట్ రంగంలోకి దిగాడు. గతేడాది ఆగస్ట్‌లో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్లో నర్సన్, సంధ్య కలిశారు. ‘నా జీవితం నుంచి ఆమె(మాజీ భార్య) శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఇక ఎప్పుడూ తిరిగి రాకూడదు’ అని నర్సన్ అతడితో చెప్పాడు. ఈ సందర్భంగా భార్య పూర్తి వివరాలను అందించాడు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందని నర్సన్ అడగ్గా..‘దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది. ముందే డౌన్‌పేమెంట్ ఇవ్వాలి’అని అధికారి అన్నాడు. దీంతో ముందు వెయ్యి డాలర్లు ఇస్తానని నర్సన్ చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరిద్దరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది. -
అమెరికాలో 400 మందికి కుచ్చుటోపీ
వాషింగ్టన్: అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న లోపాన్ని గుర్తించిన ఓ భారతీయ యువకుడు భారీ మోసానికి తెరలేపాడు. దాదాపు 400 మంది భారత సంతతి వ్యక్తులకు రూ.5.59 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో నిందితుడిని జనవరి 25 అరెస్ట్ చేసిన పోలీసులు కనక్టికట్లోని ఓ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. 2013లో కిశోర్‌బాబు అమ్మిశెట్టి(30) అనే వ్యక్తి అమెరికాకు స్టూడెంట్ వీసాపై వచ్చాడు. ఇక్కడి బ్యాంకులు పాటించే ప్రొవిజినల్ క్రెడిట్ విధానం కిశోర్‌ను ఆకర్షించింది. దీని కింద నగదు చెల్లింపులు జరిగినా రిజిస్టర్ కాకపోతే బ్యాంకులు ఆ మొత్తాన్ని కస్టమర్ల ఖాతాకు జమచేస్తాయి. ఈ నేపథ్యంలో వస్తువుల అమ్మకం, అద్దె ఇళ్లు ప్రకటనలు ఇచ్చే భారత సంతతి వారిని కిశోర్ టార్గెట్ చేసుకున్నాడు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుని.. ఆ బ్యాంకుకు ఫోన్ చేసి కస్టమర్‌గా నటించేవాడు. తన ఖాతాకు డబ్బులు పంపినా ఇంకా రిజిస్టర్ కాలేదని బుకాయించేవాడు. దీంతో బ్యాంకులు ప్రొవిజినల్ క్రెడిట్ కింద ఆ మొత్తాన్ని ఖాతాల్లో డిపాజిట్ చేసేవి. అనంతరం ఆ డిపాజిట్ దారులకు ఫోన్ చేసి పొరపాటున వారి అకౌంట్లలో నగదు జమ చేశానని చెప్పేవాడు. బాధితులు నిజమని నమ్మి భారీగా నగదును సమర్పించుకున్నారు. ఈ ఖాతాలను సమీక్షించిన బ్యాంకులు, ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో డిపాజిట్లను వెనక్కు తీసుకున్నాయి. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. -
ప్రజాస్వామ్యంపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి అన్నారు. హిందువుననే విమర్శలు తులసీ గబార్డ్ హిందువునైనందునే తనపై విమర్శలు చేస్తూ తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో నిలిచిన మహిళ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ ప్రధాని మోదీతో నా భేటీని రుజువుగా చూపి నేను హిందూ జాతీయవాదినంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీతో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీసహా ఎందరో భేటీ అయ్యారు. వారినెవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వాళ్లు హిందువులు కారు. ఇలా చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే. మత దురభిమానాన్ని ప్రదర్శించడమే’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో తులసీ వ్యాఖ్యానించారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువైన, డెమోక్రటిక్ పార్టీ తరఫున నాలుగు సార్లు ప్రతినిధుల సభ ఎన్నికల్లో గెలిచిన తులసీ గబార్డ్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారంలో తాను పోటీ చేస్తున్న విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తానన్నారు. డెమోక్రటిక్ పార్టీకే చెందిన సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న రెండో మహిళ తులసి కానున్నారు. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా. తులసి హవాయ్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున నాలుగుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆమె తాజా నిర్ణయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ మహిళ తులసి కానున్నారు. ఒకవేళ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవికి అత్యంత పిన్న వయసులోనే ఎన్నికైన వ్యక్తిగా, అదే సమయంలో అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పుతారు. అయితే ఆమె గెలుస్తుందనే అంచనాలు తక్కువే. రిపబ్లిక్ పార్టీ తరఫున మళ్లీ పోటీచేయనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెల 3న ఐయోవా ప్రైమరీ ఎన్నికలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. -
అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ఈమెను ఈ పదవికి నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం సహాయ మంత్రి హోదాలో నియమితులవుతారు. ఈ హోదాలో అణు సాంకేతికత పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను రీటా చేపడతారు. ప్రస్తుతం అణు విభాగంలోని గేట్‌వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రీటా.. గతంలో అమెరికా నావికాదళ రియాక్టర్లలో వాడే అణు ఇంధన పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు. రీటా బరన్వాల్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పొందారు. -
వీఎస్ నైపాల్ కన్నుమూత
లండన్: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్, మ్యాన్ బుకర్ బహుమతుల గ్రహీత విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ (వీఎస్) నైపాల్ (85) అనారోగ్యంతో లండన్‌లో కన్నుమూశారు. శనివారం తమ ఇంట్లోనే వీఎస్ నైపాల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. ‘అద్భుత సృజనాత్మకతతో, నిరంతర కృషితో విజయవంతమైన జీవితాన్ని గడిపిన నైపాల్ తనకు ప్రీతిపాత్రమైన మనుషుల మధ్య తనువు చాలించారు’ అంటూ నైపాల్ భార్య నదీరా ఓ ప్రకటన విడుదల చేశారు. 1932 ఆగస్టు 17న ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ ఇంగ్లండ్‌లోనే ఆయన ఎక్కువ కాలం గడిపారు. ఇంగ్లిష్ భాషలో అత్యంత ప్రవీణుడిగా పేరు తెచ్చుకున్న నైపాల్ తన కెరీర్లో ముప్పైకి పైగా పుస్తకాలను రాశారు. మతాన్ని, రాజకీయ నాయకులను, వలసవాదాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన రచనలు అత్యంత ప్రజాదరణ పొందాయి. నైపాల్ తొలి పుస్తకం ‘ద మిస్టిక్ మాస్యూర్’ 1951లో ప్రచురితం కాగా, ఆయన రాసిన వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ విశ్వాస్’ 1961లో మార్కెట్లోకి వచ్చింది. తన తండ్రి శ్రీప్రసాద్ నైపాల్ జీవితం ఆధారంగా తీసుకుని ఈ పుస్తకాన్ని వీఎస్ నైపాల్ రాశారు. 2001లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని నైపాల్ అందుకున్నారు. 1971లోనే ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ పుస్తకానికి ఆయనకు మ్యాన్‌బుకర్ ప్రైజ్ లభించింది. సాహిత్య రంగానికి నైపాల్ చేసిన సేవలను గుర్తిస్తూ 1990లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ –2 ఆయనకు నైట్‌హుడ్‌ను ప్రదానం చేశారు. ఇస్లాం మతవాదంపై ఆయన రాసిన అమాంగ్ ద బిలీవర్స్, బియాండ్ బిలీఫ్ పుస్తకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. గెరిల్లాస్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఎ వే ఇన్ ద వరల్డ్, ద మైమిక్ మెన్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్, హాఫ్ ఎ లైఫ్ తదితర పుస్తకాలు నైపాల్‌కు రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అక్షర ప్రపంచానికి లోటు: కోవింద్ వీఎస్ నైపాల్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల సీఎంలు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కోవింద్ ఓ ట్వీట్ చేస్తూ ‘మానవ స్థితి గతులు, వలస వాదం, మత విశ్వాసాలపై అద్భుతమైన పుస్తకాలు రాసిన వీఎస్ నైపాల్ మృతి బాధాకరం. ఇండో–ఆంగ్లియన్ సాహిత్యానికేగాక, మొత్తం సాహిత్య ప్రపంచానికే ఆయన మరణం తీరని లోటు’ అని పేర్కొన్నారు. మోదీ ట్వీట్ చేస్తూ ‘చరిత్ర, సంస్కృతి, వలసవాదం, రాజకీయాలు, ఇంకా అనేక అంశాలపై అద్భుత రచనలు చేసిన వీఎస్ నైపాల్‌ను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని అన్నారు. నైపాల్ శిష్యుడు, అమెరికాకు చెందిన పర్యాటక పుస్తకాల రచయిత పాల్ థెరాక్స్, మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలిచిన భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ, మరో భారత సంతతి నవలా రచయిత హరి కుంజు తదితరులు కూడా నైపాల్ మృతికి సంతాపం తెలిపారు. పేదరికంలో పుట్టినా ఉన్నత శిఖరాలకు.. వీఎస్ నైపాల్ తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్ గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో బతికిన నైపాల్‌కు 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఉపకార వేతనం లభించింది. అప్పుడు ట్రినిడాడ్ నుంచి లండన్ వచ్చిన ఆయన.. ఇక తన మిగిలిన జీవితంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే ఓ నవల రాయగా అది ప్రచురితమవ్వక పోవడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన ఆయన.. 1996లో ఆమె చనిపోవడంతో వయసులో తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదైన, అప్పటికే పెళ్లయ్యి విడాకులు తీసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్ నదీరాను రెండో పెళ్లి చేసుకున్నారు. -
ఫోర్బ్స్ జాబితాలో భారత మహిళలు
న్యూయార్క్: అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల నాలుగో వార్షిక జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలు చోటు దక్కించుకున్నారు. అరిస్టా నెట్వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్న ఉల్లాల్ రూ.9,250 కోట్ల సంపదతో జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ఐటీ సంస్థ సైన్‌టెల్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న సేథీ రూ.6,844 కోట్ల సంపదతో 21వ స్థానం సాధించారు. అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై సంస్థ చైర్మన్ డయానే హెన్డ్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. మూడేళ్లలో రూ.6,164 కోట్ల విలువైన కాస్మెటిక్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్(20) జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. -
అమెరికా సుప్రీంకు భారత సంతతి జడ్జి!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన న్యాయ నిపుణుడు అమూల్ థాపర్(49) అమెరికా సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 31న జడ్జి జస్టిస్ ఆంథోని కెన్నెడీ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో నియమించేందుకు రూపొందించిన 25 మందితో కూడిన జాబితాలో థాపర్ పేరు ఉంది. ఈ జాబితా నుంచే ఒకరిని కెన్నెడీ స్థానంలో నియమిస్తానని ట్రంప్ ఇది వరకే స్పష్టం చేశారు. కెన్నెడీ స్థానాన్ని భర్తీచేసేందుకు ట్రంప్ మనసులో ఉన్న తుది ఏడుగురిలో థాపర్ ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. గతేడాదే ఆయన కెంటకీ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 1991లో బోస్టన్ కాలేజీ నుంచి బీఎస్ పూర్తిచేసిన థాపర్..కాలిఫోర్నియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. -
యూఎస్ నేవీ స్కాంలో భారత మహిళ
సింగపూర్: అమెరికా నావికాదళ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఓ కుంభకోణంలో భారత సంతతి మహిళ చిక్కుకుంది. ఆమెకు మూడేళ్లకు పైగా జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. సింగపూర్‌లో అమెరికా నేవీ సప్లయి సిస్టమ్స్ కమాండ్ ఫ్లీట్ లాజిస్టిక్ సెంటర్ కోసం ‘లీడ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్’గా పనిచేస్తున్న షరన్ రఛేల్ గురుశరణ్ కౌర్‌కు రూ.238 కోట్ల (3.5 కోట్ల అమెరికన్ డాలర్ల) విలువైన ‘ఫాట్ లియోనార్డ్’ కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కౌర్‌కు రూ.65 లక్షలకు పైగా ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. -
భేటీ వెనుక ఆ ఇద్దరు...!
డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్–ఉన్ శిఖరాగ్ర సమావేశం విజయం సాధించడం వెనక భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తుల కృషి దాగి ఉంది. వారే సింగపూర్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, న్యాయ, హోం వ్యవహారాల శాఖ మంత్రి కె. షణ్ముగం. వీరద్దరూ కూడా అధికార ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ’కి చెందినవారు. సింగపూర్‌లో ఈ భేటీ నిర్వహణకు నిర్ణయించింది మొదలు రెండుదేశాల అధినేతలు అక్కడకు చేరుకుని అందులో పాల్గొనే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చారిత్రక సమావేశానికి ఏ రూపంలోనూ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకు బాలకృష్ణన్ ఇటీవలి వాషింగ్టన్, ప్యాంగ్యాంగ్, బీజింగ్‌లలో పర్యటించి మంత్రాంగం నెరిపారు. వైద్యవిద్యను అభ్యసించిన ఆయన నేత్రవైద్యంలో పీజీ చేశారు. శిఖరాగ్ర సమావేశం పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరకొరియా నేత కిమ్‌కు విమానాశ్రయంలో బాలకృష్ణన్ స్వాగతం పలికారు. 70 ఏళ్ల అనుమానాలు, యుద్ధాలు, దౌత్య వైఫల్యాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోందని, అయితే దశాబ్దాల ఉద్రిక్తతలు ఒకే ఒక భేటీతో దూరమయ్యే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దేశాధినేతలు, వారి సిబ్బందిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నపుడు మాత్రం ఈ సమావేశం పట్ల ఎంతో విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నారని వెల్లడించారు. శిఖరాగ్ర సభాస్థలి, పరిసరాలు, దీనితో ముడిపడిన వేదికలు, ప్రాంతాల భద్రతా ఏర్పాట్లకు షణ్ముగం బాధ్యత వహించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై, న్యాయవాదిగానూ పనిచేసిన ఈయన ఇరువురు దేశాధినేతలు, వారి సిబ్బంది భద్రత, రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ భేటీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు తమ అధికారులు అహోరాత్రులు శ్రమించినట్టు షణ్ముగం తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఐదువేల మంది హోంటీమ్ ఆఫీసర్లు వివిధ రూపాల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అటు అమెరికాతో, ఇటు ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు కలిగిన కొన్ని దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి కావడం వల్లే ఆ దేశ మంత్రులుగా వీరిద్దరూ కీలక భూమికను నిర్వహించగలిగారని నిపుణులు చెబుతున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ కొరియాతో శాంతి చర్చలు ఏ ఫెయిల్యూర్ స్టోరీ -
భారత విద్యార్థికి 66 లక్షల బహుమతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన క్విజ్ పోటీలో లక్ష డాలర్ల (దాదాపు రూ. 66 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. బ్రౌన్ యూనివర్సిటీలో ప్రజారోగ్యం, ఆర్థిక శాస్త్రం కోర్సు తొలి ఏడాది చదువుతున్న ధ్రువ్ గౌర్ అనే యువకుడు జియోపార్డీ కాలేజ్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన ఈ పోటీలో బహుమతి గెలుపొందాడు. మరో 14 మందితో కలిసి పోటీలో పాల్గొన్న అతను శుక్రవారం విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతను ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ అనే మరో క్విజ్ పోటీలో పాల్గొనేందుకూ అర్హత సాధించాడు. జార్జియా రాష్ట్రానికి చెందిన ధ్రువ్ గతంలోనూ అనేక పోటీలు, ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చాటాడు. అత్యంత తెలివైన వాళ్లయిన 14 మందిని ఓడించి తాను ఈ పోటీలో గెలుస్తానని తొలుత అస్సలు అనుకోలేదంటూ ధ్రువ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. -
ఆ చిన్నారులకు జాతీయత చిక్కు!
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌లోని భారత సంతతి చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు స్వదేశానికి వచ్చేందుకు కువైట్‌లోని రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు పొందినా ఆ చిన్నారులకు మాత్రం సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రులలో ప్రసవిస్తే ఆ ఖర్చు భరించే శక్తి లేక ఎంతో మంది కువైట్‌లో హోం డెలివరీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే చిన్నారులకు ఏ జాతీయత వర్తించకపోవడంతో వారిని స్టేట్లెస్ చిల్డ్రన్‌గా పరిగణిస్తున్నారు. దాదాపు 150 మంది చిన్నారులు మన దేశ సంతతివారు ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి రాలేక, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డిబాలు దుర్గయ్య, లక్ష్మీదేవి దంపతులు మొదట కంపెనీ వీసాలపైనే కువైట్ వెళ్లారు. వీరికి ఏడేళ్ల కూతురు భాగ్యశ్రీ (7), కుమారుడు బాలు(5) ఉన్నారు. క్షమాభిక్ష వల్ల వీరికి మనదేశ రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు జారీ అయ్యాయి. వీరి పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. క్షమాభిక్షకు గడువు మరో ఐదు రోజులే ఉంది. వీరిద్దరు స్వదేశానికి వస్తే చిన్నారుల పరిస్థితి ఏమిటనే సందేహం వ్యక్తమవుతోంది. పిల్లల కోసం అక్కడే ఉంటే జైలు శిక్షను అనుభవించాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది. దీంతో చిన్నారులను వదిలి రావాలా లేక కువైట్‌లోనే ఉండాలా అని వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టంగుటూరి లక్ష్మీనర్సమ్మ పిల్లలు శిశుకుమార్(6), ధనలక్ష్మిలకు ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఔట్‌పాస్‌లను జారీ చేయాలంటూ మన విదేశాంగ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మా మనుమలు, మనమరాండ్లే గుర్తుకు వస్తున్నారు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఔట్‌పాస్‌ల కోసం తమ తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారులను చూసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా చలించిపోయారు. ఆ చిన్నారులను చూస్తే మా మనుమళ్లు, మనుమరాండ్లు గుర్తుకు వస్తున్నారని ‘సాక్షి’కి ఫోన్లో వెల్లడించారు. ఏ జాతీయత లేక పోయినా వారు భారత సంతతి వారిగానే గుర్తించి మన దేశం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. –రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి విదేశాంగ శాఖ కువైట్‌లోని చిన్నారులకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి. కువైట్ ప్రభుత్వం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందువల్ల మన విదేశాంగ శాఖ స్పందించి సర్టిఫికెట్లను వీలైనంత తొందరగా జారీ చేసి స్వదేశానికి చిన్నారులను చేర్చాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, మాజీ దౌత్యవేత్త, టీపీసీసీ ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్ కువైట్ ప్రభుత్వంతో చర్చించాలి కువైట్‌లో ఉన్న చిన్నారుల విషయంలో భారత ప్రభుత్వం కువైట్ ప్రభుత్వంతో చర్చించి స్వదేశానికి రప్పించాలి. అలాగే ఇక్కడకు చిన్నారులు వచ్చిన తరువాత వారికి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కువైట్‌లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2011లో ఆమ్నెస్టీ సమయంలో వేగంగా చర్యలు తీసుకున్నారు. – నంగి దేవేందర్‌రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ -
కొత్త జిహాదీ జాన్.. సిద్ధార్థ ధర్
వాషింగ్టన్/లండన్: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి ఉగ్రవాది, ఐఎస్ సీనియర్ కమాండర్ సిద్ధార్థ ధర్ అలియాస్ అబూ రుమైసా(33)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్‌లో బందీల గొంతుల్ని కిరాతకంగా కోసి హతమార్చే ‘జిహాదీ జాన్’ మొహమ్మద్ ఎజావీ మరణానంతరం అతని స్థానంలో ధర్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బ్రిటన్‌లో ఉన్నప్పుడే ఇస్లాం స్వీకరించిన ధర్.. ఓ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అనంతరం 2014లో భార్యాపిల్లలతో కలిసి సిరియాకు వెళ్లి ఐఎస్‌లో చేరాడు. అమెరికాతో పాటు బ్రిటన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 2016లో పలువురిని ముసుగు ధరించి కాల్చిచంపింది ధరేనని నిఘా వర్గాలు తెలిపాయి. ఇతనితో పాటు బెల్జియన్–మొరాకో పౌరుడు అబ్దుల్లతిఫ్ గైనీని కూడా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినట్లు వెల్లడించాయి. దేశంలో వీరిద్దరి ఆస్తులుంటే స్తంభింపజేస్తామనీ, పౌరులెవరూ వీరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకో వద్దని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఎవరీ కొత్త జిహాదీ జాన్?: లండన్‌లోని ఓ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన సిద్ధార్థ ధర్ అక్కడే పెరిగాడు. టీనేజీలోనే ఇస్లాం లోకి మారి సైఫుల్ ఇస్లామ్‌గా పేరు మార్చుకున్నాడు. గతంలో బ్రిటిష్ తీవ్రవాద సంస్థ అల్–ముహజిరౌన్లో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ఐఎస్‌లో చేరడానికి ముందు లండన్‌లో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఒకచేతిలో ఏకే 47 తుపాకీ, మరో చేతిలో తన నాలుగో సంతానాన్ని పట్టుకున్న ఫొటోను ఆన్లైన్లో పోస్ట్ చేసి సిరియాలో తన ఉనికిని చాటుకున్నాడు. -
భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనావర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. రాజ్ షా(32)ను అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార డైరెక్టర్‌గా హోప్ హిక్స్ను నియమించినట్లు పేర్కొంది. రిపబ్లికన్ నేషనల్ కమిటీలో పరిశోధన విభాగానికి నేతృత్వం వహించిన షా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. -
అమెరికా స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారతీయుడు
న్యూయార్క్: అమెరికాలోని స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారత సంతతికి చెందిన స్టాక్ బ్రోకర్ పై ఫెడరల్ అధికారులు తీవ్ర మైన ఆర్థిక నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఒక సంస్థకు చెందిన షేర్ల అమ్మకాల లావాదేవీల్లో ఉద్దేశపూర్వకంగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రణవ్ పటేల్ (35)ను ఆరెస్టు చేశారు. ఫ్లోరిడా స్టాక్ బ్రోకర్ పటేల్ స్టాక్ తారుమారు పథకంలో భాగస్వామి అయ్కాడని ఎఫ్‌బీఐ అధికారులు బుధవారం ప్రకటించారు. సుమారు 871 కోట్ల, 54 లక్షల రూపాయల (131 మిలియన్ డాలర్ల) కుంభకోణానికి పాల్పడినట్టు అరోపించారు. అమెరికాలోని ఫోర్ట్ లాడర్డల్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన అధికారులు అనంతరం పటేల్ ను న్యాయ విచారణ కోసం బ్రూక్లిన్ కు తరలించారు. ఎల్ ఈడీ లైటింగ్ ఉత్పత్తుల ప్రపంచ వ్యాప్త పంపిణీదారుగా చెప్పుకుంటున్న ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ కంపెనీతో కుమ్మక్కయ్యి భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎఫ్‌బీఐ అభియోగాలను నమోదు చేసింది. పటేల్ సహా మరో తొమ్మిది మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ బృందం అమెరికా స్టాక్ మార్కెట్ నాస్ డాక్ లోని ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ షేర్ల ధరను అక్రమంగా పెంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫెడరల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ ఎల్. కాపెర్స్ బ్రూక్లిన్ లో చెప్పారు. ఫోర్స్ ఫీల్డ్స్ సంస్థ, మిచెల్, ప్రణవ్ పటేల్ తదితర స్టాక్ బ్రోకర్ల వ్యాపార భాగస్వామ్యంతో ఈ కుంభకోణానికి పాల్పడిందని ఎఫ్‌బీఐ ప్రకటించింది. పటేల్, మరో నలుగురు స్టాక్ బ్రోకర్లకు 2014 లో విదేశీ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి ముడుపులు చెల్లించారన్నారు. ముఖ్యంగా స్టాక్ బ్రోకర్ నవీద్ ఖాన్ నేతృత్వంలో ఈ పథక రచన జరిగిందన్నారు. తక్కువ పెట్టుబడితో పాటు, వ్యాపార కార్యక్రమాలను లేకుండానే... వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా మార్కెట్ ను, ఇతర పెట్టుబడిదారులను నమ్మించారన్నారు. దీంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు 871 కోట్ల రూపాయలను నష్టపోయినట్టు ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో రోడ్రిగ్యూజ్ తెలిపారు. ఆర్థిక నేరాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యుద్ధంలో భాగంగా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ దీనిపై దర్యాప్తు చేసింది. సెక్యూరిటీల మోసం, కుట్ర, వైర్ ఫ్రాడ్ , అక్రమ నగదు బదిలీ, తప్పుడు ప్రకటన తదితర అభియోగాలపై చర్యలు తీసుకోనుంది.