
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు.
వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్‌పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి.