
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్‌చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment