presidential race
-
కమలా హారిస్ క్లియర్ విన్నర్ కాదా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.కమలా హారిస్ ఛీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డిబేట్‌ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.ఈ చర్చలో కమలా హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్సైట్ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.Kamala Harris wasn’t wearing Nova H1 earring headphones. Quit lying to yourselves. She’s wearing Tiffany Hardwear pearl earrings. See how the Nova earrings only have one stalk coming off of them? See how Kamala’s has two? They’re not even the same thing. pic.twitter.com/zfTXRjEfDr— Daulton (@DaultonVenglar) September 11, 2024‘‘డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో కమలా హారిస్ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్రింగ్ మాదిరిగా ఉండే ఇయర్ఫోన్కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్‌గా ధరించే ఇయర్రింగ్స్ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఇక.. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో విన్నర్‌గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్లో ట్రంప్, హారిస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్ న్యూస్కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్ చేయకుండా ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు: ఏబీసీ మీడియాఈ డిబేట్లో కమలా హారిస్‌దే భారీ విజయం: పొలిటికోడిబేట్లో ట్రంప్ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. ఒక ప్రాసిక్యూటర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్ టైమ్స్కమలా హారిస్ ప్రసంగంతో ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్‌కు వచ్చారు: సీఎన్ఎన్డిబేట్లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్‌దే పైచేయిగా సాగిందని, ట్రంప్ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్ స్టేట్స్‌లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి. మొత్తంగా హారిస్ ఈ డిబేట్లో క్లియర్ విన్నర్ అని తేల్చేశాయి.ఇదీ చదవండి: ట్రంప్ ఏమాత్రం మారలేదు -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌దే పైచేయి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌దే పైచేయిగా ఉందని తాజాగా వెల్లడైంది. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ– ది హిల్ కూర్చిన పోల్ ఆఫ్ ది పోల్స్‌లో దేశవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ కంటే హారిస్ 4.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. 45 పోల్స్‌ను క్రోడీకరించి ఫలితాలను వెల్లడించారు. కమలా హారిస్ ఏకంగా 4.2 శాతం ఆధిక్యంలో ఉండగా, మే తర్వాత ఆమె ఏకంగా పది శాతం పుంజుకోవడం విశేషం. హోరాహోరీ పోరు నెలకొన్న ఏడు రాష్ట్రాల్లో ఆరింటిలో ట్రంప్‌పై హారిస్ ఒకశాతం ఆధిక్యంలో ఉన్నారని బెనెన్సన్ స్ట్రాటజీ గ్రూపు– జీఎస్ స్ట్రాటజీ గ్రూపు సర్వే వెల్లడించింది. హోరాహోరీ రాష్ట్రాలైన జార్జియా, మిషిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనాల్లో హారిస్‌కు ఒక శాతం ఆధిక్యం ఉంది. నెవెడాలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నారు. నెవెడాలోనూ హారిస్ క్రమేపీ పుంజుకుంటున్నారు. మే నుంచి తీసుకుంటే ట్రంప్‌తో వ్యత్యాసాన్ని ఆరు పాయింట్ల మేరకు తగ్గించారు. ట్రంప్‌తో పోలిస్తే కమలా హారిస్ నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకురాలని అమెరికన్లు భావిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్– ఎన్ఓఆర్సీ సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, వలసల అంశాల్లో ట్రంప్ మెరుగని భావిస్తున్నారు. అధ్యక్ష రేసులోకి లేటుగా వచ్చినా హారిస్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ట్రంప్‌తో ఆమె డిబేట్ పోటాపోటీగా ఉంటుందని భావిస్తున్నారు. అందరి దృష్టీ దానిపైనే నెలకొంది. -
USA Presidential Elections 2024: ఆ రికార్డుపై కమలా హారిస్ కన్ను
వారం పది రోజుల కిందటి దాకా ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును కమలా హారిస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యరి్థగా అధ్యక్షుడు బైడెన్ ఉన్నంతకాలం ఆయనపై అన్ని విషయాల్లోనూ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడామె ముచ్చెమటలే పట్టిస్తున్నారు! బైడెన్ తప్పుకున్నాక తాజా సర్వేలన్నింటిలోనూ హారిస్ దూసుకుపోతున్నారు. కొన్నింటిలోనైతే ట్రంప్‌ను దాటేశారు కూడా. ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యరి్థత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్ 1836లో ఉపాధ్యక్షుడు మారి్టన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బరాక్ ఒబా మా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు! కానీ 2016లో ఒబామా తర్వాత డెమొక్రాట్ల తరఫున బైడెన్‌కు కాకుండా హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్ష అభ్యరి్థత్వం దక్కింది. అయితే ఆమె ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు. 2020లో ట్రంప్‌ను హోరాహోరీ పోరులో బైడెన్ ఓడించడం, అధ్యక్షుడు కావ డం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు.నేరుగా పదోన్నతి నలుగురికే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 49 మంది ఉపాధ్యక్షులుగా పని చేశారు. వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులు కూడా అయ్యారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులు అయింది మాత్రం కేవలం నలుగురే. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన 1789 నుంచి1796 దాకా దేశ తొలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 1796లో ఆ పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన థామస్ జెఫర్సన్ అప్పటి నియమాల ప్రకారం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఎందుకంటే అప్పట్లో ఉపాధ్యక్ష అభ్యర్థి అంటూ విడిగా ఉండేవారు కాదు. అధ్యక్ష రేసులో రెండో స్థానంలో నిలిచిన నేతే ఉపాధ్యక్షుడు అయ్యేవారు. తర్వాత నాలుగేళ్లకు జెఫర్సన్ ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఓడించింది ఎవరినో తెలుసా? నాటి అధ్యక్షుడు ఆడమ్స్‌నే! ఒక్కోపార్టీ నుంచి ఆ రెండు పదవులకూ విడిగా అభ్యర్థులు నిలబడటం పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. → అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మారి్టన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్లు్య.బు‹Ù. → ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. → గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. → ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. ళీ హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! → థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. → జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: బైడెన్ కంటే కమల బెటర్
వాషింగ్టన్: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఆఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్‌లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్‌తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్‌ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. బైడెన్‌తో ఫోన్లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్ కొనసాగితే వైట్‌హౌస్‌ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ డెమొక్రాటిక్ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వైదొలగడం లేదు: ప్రచార సారథి జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్‌కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. -
అధ్యక్ష రేసులో కొనసాగుతా.. ట్రంప్‌ను ఓడించే వ్యక్తిని నేనే: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా తాను ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోబోనని మరోసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రెసిడెంట్ జో బైడెన్ తేల్చిచెప్పారు. అయితే జూన్ 27న జరిగిన అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్లో డిమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. ఆయన వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారని దేశాన్ని ట్రంప్ నుంచి కాపాడాలంటే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంతపార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖానించటం గమనార్హం. అయితే తాజగా ఆయన మరోసారి స్పందిస్తూ ప్రెసిడెంట్ రేసు నుంచి వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ‘‘నేను 2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడించే సమర్థమైన వ్యక్తిని. నేను ప్రెసిడెంట్ రేసులోనే ఉంటాను. ప్రత్యర్థి రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడతాను’’అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన డెమోక్రాట్లకు ఓ లేఖ విడుదల చేశారు.జూన్ 27 నాటి తొలి డిబేట్లో జోబైడెన్ తూలటం, మాట్లాడుతూ తడబడటం, వృద్దాప్యంతో ఆలోచన సరళీ అదుపుతప్పటం స్పష్టంగా కనిపించింది. ఇక.. అప్పటి నుంచి ఆయన అధ్యక్ష రేసు నుంచి దూరంగా ఉంటే బాగుంటుందని పలువురు సూచించారు. కాగా, బైడెన్ తప్పుకుంటే ఉపాధ్యక్షురాల కమలా హారిస్ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు.. జో బైడెన్ గత పదిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు, డెమోక్రటిక్ నేతల మద్దతూ కూడగట్టుకుంటున్నారు. -
దేవుడు తప్ప నన్నెవరూ... తప్పించలేరు: బైడెన్
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) కొట్టిపారేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని దేవుడు తప్ప తననెవరూ ఒప్పించలేరని ఏబీసీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. గత వారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో బైడెన్ పదేపదే తడబటడం, ఆగి ఆగి మాట్లాడటంతో ఆయన మానసిక సంతులతపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బైడెన్ వైదొలగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు కూడా బైడెన్ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా బైడెన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ప్రపంచాన్ని నడుపుతున్నానని, అధ్యక్షుడిగా ఉండటానికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు. మెదడు పనితీరుపై పరీక్ష చేయించుకొని ఫలితాలను ప్రజల ముందు పెడతారా అని ప్రశ్నించగా తాను రోజూ పరీక్ష ఎదుర్కొంటున్నానని బదులిచ్చారు.మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్‌తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు. -
USA Presidential Elections 2024: బైడెన్‌ను.. మార్చొచ్చా?
డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్‌ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్‌పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్‌పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్‌లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్‌కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్‌లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్‌లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్‌కు ఛాన్స్ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్‌లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్‌కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్‌ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్‌లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు. మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్‌లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు. జూలైలో మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి. ఎవరికి ఓటేస్తారు?: బైడెన్ మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్‌ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు జో బైడెన్ 2,099 ఇతరులు 20 జేసన్ పామర్ 3 రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు ట్రంప్ 1,228 నిక్కీ హేలీ 91 రాన్ డీశాంటిస్ 9 వివేక్ రామస్వామి 3 -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
అధ్యక్ష రేసులో ట్రంప్ తొలి విజయం
వాషింగ్టన్: అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ రెండో అభ్యర్థి స్థానం కోసం నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌ల మధ్య పోటీ నెలకొంది. తొలి పోలింగ్‌లోనే ట్రంప్ ఘన విజయంతో.. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్.. రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది ఎన్నిక. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది. అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
అధ్యక్ష రేసులో ఆయన.. ట్విటర్ అతలాకుతలం
శాన్ ఫ్రాన్సిస్కో: ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష రేసుపై ఆసక్తి ప్రకటించాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకు ఆయన ఎంచుకున్న వేదిక.. అవతలి నుంచి సంభాషణ జరిపిన వ్యక్తి.. తదితర కారణాలతో సోషల్ మీడియా అతలాకుతలం అయ్యింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం ప్రారంభించారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం ప్రకటించారాయన. అయితే.. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను సమర్పించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా.. రాన్ సైతం బిడ్‌లో నిలిచినట్లయ్యింది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌తో కలిసి లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్ పదే పదే క్రాష్ అయ్యింది. I’m running for president to lead our Great American Comeback. pic.twitter.com/YmkWkLaVDg — Ron DeSantis (@RonDeSantis) May 24, 2023 గతేడాది అక్టోబర్‌లో ఎలన్ మస్క్.. ట్విటర్‌ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమందిని తొలగించాడు. వాళ్లలో బగ్స్‌ను ఫిక్స్ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం. ఒకేసారి ట్విటర్‌పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. Ron DeSantis fought against President Donald Trump's America First agenda while in Washington. pic.twitter.com/YytIGaSjyX — MAGA War Room (@MAGAIncWarRoom) May 24, 2023 అయితే.. ఈ ప్రభావం ట్విటర్‌ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్ విషయంలో ట్రెండ్ అవుతుండడం గమనార్హం. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి భారతీయ సంతతి పార్లమెంటు సభ్యురాలు కమలా హ్యారిస్ తప్పుకున్నారు. 2020లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కాలిఫోర్నియా నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమలా మంగళవారం ఓ కార్యకర్తకు ఫోన్ చేసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో ముగిస్తున్నానని, ఇందుకు చింతిస్తున్నానని 55 ఏళ్ల కమలా హ్యారిస్ మంగళవారం ఓ ట్వీట్ కూడా చేశారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్లో పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యంపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి అన్నారు. హిందువుననే విమర్శలు తులసీ గబార్డ్ హిందువునైనందునే తనపై విమర్శలు చేస్తూ తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో నిలిచిన మహిళ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ ప్రధాని మోదీతో నా భేటీని రుజువుగా చూపి నేను హిందూ జాతీయవాదినంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీతో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీసహా ఎందరో భేటీ అయ్యారు. వారినెవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వాళ్లు హిందువులు కారు. ఇలా చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే. మత దురభిమానాన్ని ప్రదర్శించడమే’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో తులసీ వ్యాఖ్యానించారు. -
'నాకు ఆ శ్రమ వద్దు.. నేను దిగను'
న్యూయార్క్: తాను 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం లేదని, ప్రచారంలో కూడా పాల్గొనడం లేదని న్యూయార్క్ సిటీ మేయర్ మైఖెల్ బ్లూమ్‌బర్గ్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగితే అది రిపబ్లికన్ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్‌కుగానీ టెడ్ క్రూజ్‌కు గానీ లాభం చేకూర్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తనకు ఈసారి ఆ ఉద్దేశం లేదని అన్నారు. బ్లూమ్ బర్గ్ న్యూయర్క్ సిటీ మేయర్‌గా 2002 నుంచి 2013 మధ్య కాలంలో విశేష సేవలను అందించారు. ఆయనకు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో 'ఆ శ్రమను నేను తీసుకోవడం లేదు' అనే పేరిట ఒక ప్రకటన చేశారు. అందులో 'ఎవరైతే మన ఐకమత్యాన్ని దెబ్బతీస్తారో, భవిష్యత్తును అంధకారంగా మారుస్తారో అలాంటి వారిని ఎన్నుకునే విషయంలో నేను సమర్థమంతమైన పాత్రను పోషిస్తాను. ఎందుకంటే నేను మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాను' అని ఆయన అన్నారు. -
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో నషీద్ ముందంజ
మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తొలి రౌండ్లో ముందంజలో కొనసాగారు. అయితే, ఆయనకు కీలకమైన 50 శాతం మెజారిటీ లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో దేశంలోని మొత్తం 2.30 లక్షల ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 470 బ్యాలట్ బాక్సుల్లో 315 బాక్సుల్లోని ఓట్లను లెక్కించారు. ప్రారంభంలో నషీద్ గణనీయంగా ముందంజలోనే ఉన్నా, తర్వాత స్వల్పంగా వెనుకబడ్డారు. ఇప్పటిదాకా నషీద్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. నిబంధనల ప్రకారం అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు లభించనట్లయితే, తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల నడుమ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.