వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment