వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు.
శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు.
ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు
తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు.
చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment