Indian american
-
బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!
ఇంతవరకు ఎన్నో వెయిట్‌లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్‌గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్‌లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్‌పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అమెరికాలోని సీటెల్‌లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్‌రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని. తన ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్‌ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్‌గా మారి.. యూఎస్ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ. (చదవండి: హాట్‌టాపిక్‌గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..) -
భారత సంతతి యెగా గురువు హఠాన్మరణం..శిష్యులుగా హాలివుడ్ స్టార్స్, ప్రముఖులు..
ప్రఖ్యాత యోగా గురువు శరత్ జోయిస్ అమెరికాలో మరణించారు. ఆయన హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలకు యోగా పాఠాలు చెప్పిన ప్రఖ్యాత గురువు. 53 ఏళ్ల వయసులో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అష్టాంగ యోగ వ్యవస్థాపకుడు కృష్ణ పట్టాభి జోయిస్ మనవడు. తన తాత కనుగొన్న యోగా శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అష్టాంగ యోగా గురువు శరత్. ఆయన సెప్టెంబర్ 29, 1971న మైసూర్లో జన్మించారు. శరత్ కుటుంబం అష్టాంగ యోగా అభ్యాసం, సంరక్షణ భోధనకు అంకితమయ్యింది. 2009లో తన తాత మరణంతో ఆయన వారసత్వాన్ని శరత్ కొనసాగించారు. అలా అనతి కాలంలో ప్రభావవంతమైన యోగా గురువుల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వర్జీనియా యూనివర్సిటీలోని కాంటెంప్లేటివ్ సైన్సెస్ సెంటర్లో శరత్ బోధిస్తున్నారు. ఆయన యోగా సెంటర్ ప్రకారం.. కొత్త బ్యాచ్ క్లాస్‌లను స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో తన స్వగ్రామానికి రావాల్సి ఉండగా..అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల, శిష్యులు, తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.షార్లెట్స్విల్లేలోని వర్జీనియా విశ్వవిద్యాలయం సమీపంలో హైకింగ్ చేస్తున్నప్పుడు(సరదాగా కాసేపు ప్రకృతిలో గడిపేందుకు చేసే సుదీర్ఘ నడక) శరత్‌కు గుండెపోటు రావడంతో మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు తల్లి సరస్వతి జోయిస్, తండ్రి రంగస్వామి, భార్య శృతి జోయిస్, కుమారుడు సంభవ్ జోయిస్, కుమార్తె శ్రద్ధా జోయిస్ ఉన్నారు. శరత్ హాలీవుడ్ స్టార్స్ మడోన్నా, గ్వినేత్ పాల్ట్రోతో (Gwyneth Paltrow)సహా ఎంతో మంది సెలబ్రిటీలకు యోగాను బోధించారు. అంతేగాదు హిల్లరీ క్లింటన్ కూడా ఒకనొక సందర్భంలో తాను మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆ సమయంలో యోగా గురువు శరత్ నాసికా శ్వాస, నాడి శోధన ప్రాణాయామం అనే టెక్నిక్ తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమే స్వయంగా తెలిపారు. View this post on Instagram A post shared by 𝙎𝙝𝙖𝙧𝙖𝙩𝙝 𝙅𝙤𝙞𝙨, 𝙋𝘼𝙍𝘼𝙈𝘼𝙂𝙐𝙍𝙐 (@sharathjoisr) (చదవండి: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు) -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!
మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందంటే..దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..మొదటిది..శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. రెండొవది ..ఆహారంలో మార్పులు..జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. మూడొవది..క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్‌మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్‌గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్‌నే సీరియస్‌గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్‌గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్‌ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్‌ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్‌గా మారినా డిజైనింగ్‌ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్‌ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్‌ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్‌ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్‌గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్‌లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్‌ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
నేను అమెరికా నుంచి వచ్చా బొగత జలపాతాల అందాలకు ఫిదా
-
బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్‌కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్‌ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్‌కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్‌కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
హెల్త్‌కేర్ మోసాలకు పాల్పడ్డ భారత సంతతి ఫిజిషియన్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్ర్ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్‌మెంట్‌లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్‌లను సమర్పించారని కోర్టు పేర్కొంది.ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్మెంట్లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత) -
యువకుడి దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్‌కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్ల్లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్‌ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్‌తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్‌కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్‌లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్‌కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్‌లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్‌లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్‌తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కమిషనర్‌గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్‌హౌస్‌లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్‌గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్‌హైస్‌లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్‌కి చాట్‌జిపిటి గురించి వివరించడంతోనే వెట్‌హౌస్‌లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్‌ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
టెక్సాస్‌లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్‌ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్‌లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్‌కేర్‌కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్‌లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్‌తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్‌తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్‌ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్‌ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్‌గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్‌గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్‌లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్‌పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్ -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
22 నెలలకుపైగా న్యాయ పోరాటం.. భారతీయ అమెరికన్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్ ఊపిరి పీల్చుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్‌లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్ అమెరికన్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్‌కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది. నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు. బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. "ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్‌తో బాబీ చావ్లా అన్నారు. తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. -
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అమిత్ పటేల్ ఆ టీమ్‌కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్‌తో కలసి విహార యాత్రలు చేసేవాడు. ఇక ఈ విషయం బయటకు రావడంతో జాక్సన్విల్లే యాజమాన్యం అమిత్‌ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!
టెక్నాలజీలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటోంది. భారతీయులు కూడా జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. 2015లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎంపిక కావడంతో దాదాపు 25 పెద్ద సంస్థలు భారతీయ సంతతికి చెందిన వారి నేతృత్వంలోకి చేరాయి. ఇది గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు చాలా కంపెనీలు భారతీయ సీఈఓల నిర్వహణలోనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా వసంత్ నరసింహన్, మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓగా గణేష్ మూర్తి, ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణన్, నెట్ యాప్ సీఈఓగా జార్జ్ కురియన్, మార్నింగ్ స్టార్ సీఈఓగా కునాల్ కపూర్, మైక్రా టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వహిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. THE COMPLETE INDIAN TAKEOVER. With Neal Mohan becoming the CEO of YouTube, these are the 25 big firms led by Indian Americans with a total market value of 5 trillion dollars, more than the current Indian GDP. A very proud moment for all Indians.🇮🇳 pic.twitter.com/BPmKsQ6Wus — Aviator Anil Chopra (@Chopsyturvey) November 16, 2023 -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం.