వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమించారు.
ధిల్లాన్ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘‘భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా కార్మికులపై వివక్ష, అందుకు అనుగుణంగా చట్టాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించిన పలు కార్పొరేషన్‌లపై న్యాయం పోరాటం చేశారు. మన రాజ్యాంగ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. కీలక బాధ్యతలు చేపట్టనున్న దిల్లాన్ పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను అమలు చేస్తారని ఆశిస్తున్నానని’ పేర్కొన్నారు.
ప్రతిస్పందనగా, ట్రంప్ అప్పగించిన బాధ్యతలు ‘అత్యంత గౌరవం’గా భావిస్తా. మన దేశానికి సేవ చేయడం నా కల, ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని ఆమె ఎక్స్‌వేదిగా ట్వీట్ చేశారు.
కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) వివేక్ రామస్వామి (డోజ్) కశ్యప్ పటేల్ (ఎఫ్‌బీఐ డైరెక్టర్) నియమించగా.. తాజాగా భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment