attorney general
-
ట్రంప్ 2.0లో భారత సంతతి హర్మీత్‌కు చోటు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమించారు.ధిల్లాన్ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘‘భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా కార్మికులపై వివక్ష, అందుకు అనుగుణంగా చట్టాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించిన పలు కార్పొరేషన్లపై న్యాయం పోరాటం చేశారు. మన రాజ్యాంగ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. కీలక బాధ్యతలు చేపట్టనున్న దిల్లాన్ పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను అమలు చేస్తారని ఆశిస్తున్నానని’ పేర్కొన్నారు. ప్రతిస్పందనగా, ట్రంప్ అప్పగించిన బాధ్యతలు ‘అత్యంత గౌరవం’గా భావిస్తా. మన దేశానికి సేవ చేయడం నా కల, ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని ఆమె ఎక్స్వేదిగా ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) వివేక్ రామస్వామి (డోజ్) కశ్యప్ పటేల్ (ఎఫ్‌బీఐ డైరెక్టర్) నియమించగా.. తాజాగా భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ నియమించారు.👉చదవండి : సిరియా నియంత కొంపముంచిన నాటి 14ఏళ్ల బాలుడు -
అమెరికా ఏజీగా బోండీ
వాషింగ్టన్: మాట్ గేట్జ్ స్థానంలో అమెరికా అటార్నీ జనరల్‌గా పమేలా జో బోండీని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఆ పదవికి ఇటీవలే నామినేట్ చేసిన మాట్ గేట్జ్ తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గేట్స్‌పై లైంగిక వైధింపులు, 17 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారం, మాదకద్రవ్యాల వాడడం తదితర ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన నియామకంపై ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. తనపై ఆరోపణలను గేట్జ్ ఖండించినా ఈ వివాదం ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ఏజీగా బాధ్యతలు చేపట్టబోనని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఏజీగా బోండీని ఎంపిక చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఫ్లోరిడాకు తొలి మహిళా అటార్నీ జనరల్‌గా నేరాలపై కఠినంగా ఆమె వ్యవహరించారని ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలి హయాంలో ఓపియాయిడ్ అండ్ మాదకద్రవ్యాల దుర్వినియోగ కమిషన్‌లో బోండీ పని చేశారు. ట్రంప్‌తో బోండీకి చాలా ఏళ్లుగా స్నేహముంది. 2020లో సెనేట్ అభిశంసన విచారణలో ట్రంప్ తరఫున డిఫెన్స్ లాయర్‌గా ఆమె వ్యవహరించారు. మనీ లాండరింగ్ విచారణ సందర్భంగా ట్రంప్‌కు బహిరంగంగానే మద్దతిచ్చారు. 2018లో కూడా జెఫ్ సెషన్స్ స్థానంలో బోండీని ఏజీగా ట్రంప్ నియమిస్తారని వార్తలొచ్చాయి.నాలుగో మహిళా ఏజీఅమెరికా అటార్నీ జనరల్ పదవి చేపట్టబోతున్న నాలుగో మహిళ బోండీ. దేశ తొలి మహిళా ఏజీగా జానెట్ రెనో నిలిచారు. 1993–2001 మధ్య కాలంలో క్లింటన్ హయాంలో ఆ పదవి చేపట్టారు. తర్వాత 2015–2017 మధ్య ఒబామా హయాంలో లోరెట్టా లించ్ ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ. ఆమె రాజీనామా అనంతరం సాలీ యేట్స్ 10 రోజుల పాటు తాత్కాలిక ఏజీగా వ్యవహరించారు. -
అటార్నీ జనరల్‌గా ప్రమాణం చేయబోను
వాషింగ్టన్: అమెరికా తదుపరి అటార్నీ జనరల్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎంపికచేసిన రిపబ్లికన్ నేత మ్యాట్ గెయిట్జ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2017–2020కాలంలో పలు డ్రగ్స్–సెక్స్ పార్టీలు నిర్వహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల మ్యాట్ అత్యంత కీలకమైన పదవికి అనర్హుడంటూ ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనే స్వయంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపికచేయగా పదవి చేపట్టకముందే గెయిట్జ్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.‘‘ట్రంప్ రెండోదఫా సుపరిపాలనకు నా నియామకం పెద్ద అవరోధంగా మారకూడదు. ట్రంప్ ప్రభుత్వం కొలువుతీరిన మొదటి రోజు నుంచే అద్భుతంగా పాలించాలి. అందుకే నేను ఉపసంహరణకే మొగ్గుచూపా’అని గెయిట్జ్ గురువారం ప్రకటించారు. సెనేట్‌లోని సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులే గెయిట్జ్కు మద్దతు పలకలేదని తెలుస్తోంది. తీరా సెనేట్‌లో ఓటింగ్వేళ మెజారిటీ ఓట్లు పడకపోతే అవమానభారంతో వెనుతిరిగేబదులు ముందే తప్పుకుంటే మంచిదని గెయిట్జ్ భావించారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికా పార్లమెంట్ దిగువసభలో సభ్యుడైన గెయిట్జ్ ఇటీవల అటార్నీ జనరల్‌గా నామినేషనల్ సాధించడంతో గత వారమే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. గెయిట్జ్పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించి నివేదిక సిద్ధంచేసింది. గతంలో డ్రగ్స్–సెక్స్ పారీ్టలో 17 ఏళ్ల టీనేజీ బాలికతో శృంగారం జరిపాడని గెయిట్జ్పై ఆరోపణలున్నాయి. వీటిని ఆయన కొట్టిపారేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో నూతన అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎవరిని ఎంపికచేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మెరుపువేగంతో నూతన నియామకాలు చేపట్టేబదులు ట్రంప్ సంయమనంతో స్రత్పవర్తన గల నేతలనే కీలక పదవులకు ఎంపిక చేస్తే మంచిదని సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యుడు సింథియా లూమిస్ అన్నారు. -
అమెరికా అటార్నీ జనరల్‌గా మ్యాట్ గేజ్ ఎంపిక
వాషింగ్టన్: తనకు అత్యంత విధేయుడిగా పేరొందిన అమెరికా పార్లమెంట్ సభ్యుడు మ్యాట్ గేజ్‌ను తదుపరి అమెరికా అటార్నీ జనరల్‌గా ఎంపికచేశారు. ‘‘ ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న మ్యాట్ గేజ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం గౌరవంగా భావి స్తున్నా. విపక్ష నేతలపైకి న్యా య వ్యవస్థను ఆ యుధంగా వాడే పెడపోకడకు గేజ్ ముగింపు పలు కు తారని భావి స్తున్నా. సరిహద్దులను కాపాడుతూ, నేరముఠాల పనిపట్టి, న్యాయ వ్యవస్థపై అమెరికన్లలో సన్నగిల్లిన నమ్మకాన్ని గేజ్ మళ్లీ పెంచుతారని ఆశిస్తున్నా. జస్టిస్ డిపార్ట్మెంట్లోని వ్యవస్థాగత అవినీతిని గేజ్ అంతమొందిస్తారు’’ అని ట్రంప్ గురువారం ప్రకటించారు. విలియం అండ్ మేరీ కాలేజ్ ఆఫ్ లాలో పట్టభద్రుడైన గేజ్ అమెరికా న్యాయవ్యవస్థలో సంస్కరణ కోరుకునే వ్యక్తిగా పేరొందారు. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ
-
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్‌లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్‌లో బయటపడ్డాయి. ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్‌పై దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది. నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్ లాష్చ్ జూనియర్‌కు గార్లండ్ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్‌పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఏం జరిగింది? బైడెన్ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్‌హౌస్ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్లో ఉన్న బైడెన్ ప్రైవేట్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు. ఆ పత్రాల్లో ఏముంది? బైడెన్ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది. కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా? రహస్య పత్రాలు ప్రైవేట్ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్‌కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే. రాజకీయ వేడి బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్ ఎస్టేట్ మాదిరిగా బైడెన్ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్‌హౌస్‌లో కూడా ఎఫ్‌బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్‌సైట్ కమిటీ సారథి అయిన రిపబ్లికన్ సభ్యుడు జేమ్స్ కోమర్ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్ ఆర్కైవ్స్‌కు, వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి లేఖలు రాశారు. ట్రంప్ పత్రాల గొడవ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్‌హౌస్ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్‌కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్‌హౌస్ నుంచి తరలించినట్టు టంప్ర్పై అభియోగాలు నమోదయ్యాయి. నాకు తెలియదు: బైడెన్ వాషింగ్టన్: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది. -
ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్ డీఎంహెచ్–11) మార్కెట్లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్–11 ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్∙అభివృద్ధి చేసింది. -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్‌లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంలో విచారణ
-
అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఈసీ, ఈసీ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై.. సుప్రీం కోర్టులో విచారణ గురువారం కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టింది బెంచ్. తాజా ఎన్నికల కమిషనర్ నియామకంపై ఎందుకు అంత తొందర పడ్డారని ప్రశ్నించింది ధర్మాసనం. ‘‘మా అభ్యంతరం అంతా ఎంపిక ప్రక్రియపైనే’’ అని ధర్మాసనం.. కేంద్రం తరుపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘‘మే 15వ తేదీ నుంచి ఎన్నికల కమిషనర్ స్థానం ఖాళీగానే ఉంది. అప్పటి నుంచి నవంబర్ 18వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేసింది. అంతేకాదు ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి పిటిషన్లు విచారణలో ఉండగా ఆయన్ని ఎలా నియమించార’’ని అభ్యంతరం వ్యక్తం చేసింది. నవంబర్ 18న అంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?. నవంబర్ 18వ తేదీనే ఫైల్ మూవ్ చేసి.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు అని కేంద్రాన్ని సూటిగా నిలదీసింది రాజ్యాంగ ధర్మాసనం. ‘‘న్యాయ మంత్రిత్వ శాఖ నాలుగు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఆ ఫైల్ నవంబర్ 18వ తేదీన ముందుకు కదిలింది. అదేరోజు ప్రధాని కూడా పేరును రికమండ్ చేశారు. ఈ విషయంలో మాకు మీతో ఎలాంటి సంఘర్షణ అక్కర్లేదు. కానీ, ఎందుకు అంత తొందర అనే విషయాన్ని మాత్రమే మాకు తెలియజేయండి’’ అని కేంద్ర తరపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్ వెంకటరమణిని ప్రశ్నించింది. ఎన్నికల సంఘంలో నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థ అవసరమంటూ దాఖలైన పిటిషన్లపై.. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధఱ్మాసనం వరుసగా మూడు రోజులపాటు విచారణ చేపట్టింది. గురువారం నాటికి వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘంలో సభ్యులకు ఆరేళ్లపాటు పదవిలో ఉండడం లేదంటే 65 ఏళ్ల వయసు పదవీవిరమణ నడుస్తోంది. కానీ, ఈ రెండింటిలో ఏ ఒక్క దానికి సరిపడా అభ్యర్థుల జాబితాను న్యాయశాఖ సిద్ధం చేయలేకపోతోందని అసహనం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు.. రాజకీయాలకు దూరంగా, స్వతంత్రంగా ఉండే ఎన్నికల కమిషనర్లు.. దేశానికి ఇప్పుడు అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రధాని తప్పు చేసినా చర్యలు తీసుకునేంత పారదర్శకత ఉన్న ఈసీలు దేశానికి కావాలంటూ వ్యాఖ్యానించింది కూడా. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నవంబర్ 21వ తేదీన బాధ్యతలు స్వీకరించారు అరుణ్ గోయల్. 1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్‌ను ఇంతకు ముందు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పని చేశారు. ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన్ని.. ఆ వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది కేంద్రం. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో ఎన్నికల కమిషనర్ ఏసీ పాండేతో పాటు అరుణ్ గోయాల్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు. దయచేసి.. నోరు మూస్తారా! కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల పిటిషన్ గురువారం విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఒకవైపు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాత్రం సహనం కోల్పోయి.. కాస్త దురుసుగా వాదిస్తూ పోయారు. నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయవద్దంటూ బెంచ్‌ను ఆయన గట్టిగా కోరారు. మరోవైపు వాదనల సమయంలో ఏజీ వాదిస్తుండగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా.. ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి మీరు కాసేపు నోరు మూయండి’ అంటూ ప్రశాంత్ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాసేపటికి రాజ్యాంగ ధర్మాసనంలోకి జస్టిస్ అజయ్ రాస్తోగి కలుగుజేసుకుని.. మీరు(ఏజీని ఉద్దేశిస్తూ..) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీ ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఏజీ స్పందిస్తూ.. కోర్టుకు సమాధానాలు ఇవ్వడంపై కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఏం చెప్పిందంటే.. ఎన్నికల సంఘం కోసం ముందుగా సీనియర్ బ్యూరోక్రట్స్తో కూడిన ఓ జాబితాను సిద్ధం చస్తుంది. ఆపై న్యాయశాఖ పరిశీలనకు ఆ జాబితాను పంపుతుంది. అక్కడి నుంచి అది ప్రధాని దగ్గరకు వెళ్తుంది. ఇలా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సజావుగానే ఉంది. ఇందులోన్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అటార్నీ జనరల్ బృందం వాదించింది. అయితే కోర్టు మాత్రం వ్యవస్థ తీరు సక్రమంగా లేదని.. పారదర్శకతతో కూడిన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 - ఎన్నికల కమీషనర్ల నియామకం - ప్రక్రియను ఎలా నిర్దేశించలేదని కోర్టు కేంద్రంపై ధ్వజమెత్తింది. ఈ ఆర్టికల్ ఎన్నికల సంఘం నియామక ప్రక్రియను నిర్వచించడానికి పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని ఉంచింది. కానీ అది గత 72 ఏళ్లలో జరగలేదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా. -
ఏజీ పోస్ట్ నాకొద్దు: రొహత్గీ
న్యూఢిల్లీ: అటార్నీ జనరల్ పదవిని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రొహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రొహత్గీని కేంద్రం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్ కూడా ఆరోగ్యో కరాణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు. ముకల్ రొహత్గీ కేంద్రం ఆఫర్‌ను తిరస్కరించాడని ప్రత్యేక కారణాలేమీ లేవని చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రొహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు. చదవండి: సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ.. -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ కరోనాతో మృతి
-
మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ కరోనాతో మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్‌తో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. దేశంలోనే సీనియర్ న్యాయవాది మాత్రమే కాక అత్యుత్తమ న్యాయవాదులలో సోలి సొరాబ్జీ ఒకరు. ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2002లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇటీవల సొరాబ్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. ఆయన పూర్తి పేరు సోలి జెహంగీర్ సొరాబ్జీ. 1930 ముంబైలో జన్మించారు. 1953 లో ముంబై హైకోర్టులో తన న్యాయవాద ప్రాక్టీసును ప్రారంభించారు. 1971 లో ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సొరాబ్జీ మొదట సారిగా 1989 లో భారతదేశానికి అటార్నీ జనరల్ నియమితులయ్యారు. ఆ తరువాత రెండో సారి 1998 నుంచి 2004 వరకు సేవలు అందించారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన న్యాయవాది సొరాబ్జీ. హక్కుల రక్షణకై యూఎన్ ఉప కమిషన్‌లో ఆయన పని చేశారు. 1998 నుంచి 2004 వరకు దానికి ఛైర్మన్‌గా ఉన్నారు. వివక్ష, మైనారిటీల రక్షణపై యూఎన్‌లో ఉప కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 2002 లో, సొరాబ్జీ భారత రాజ్యాంగం సమీక్షించే కమీషన్లో సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన 1997 లో నైజీరియాలో యూఎన్ ప్రత్యేక రిపోర్టర్‌గా పని చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొరాబ్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సొరాబ్జీ వాదనలు మానవ హక్కుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ( చదవండి: నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి ) -
ఇది కోర్టు ధిక్కరణే...!
-
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్ డీకే జైశ్వాల్ నివేదించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ( చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్! ) -
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా(46) అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవిని అధిరోహించనున్నారు. వనితా గుప్తాను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేస్తూ అమెరికా సెసేట్ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జనరల్‌గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్ కూడా వనితనే కావడం గమనార్హం. ఎంపిక విషయంలో సెనేట్‌లో బుధవారం జరిగిన ఓటింగ్‌లో వనితకు మద్దతుగా రిపబ్లికన్ మహిళా సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ ఓటు వేశారు. దీంతో 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. ఒకవేళ ఓటింగ్ ‘టై’ అయితే తన ఓటును వినియోగించుకునేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్‌కు వచ్చారు. సెనేట్ రెండు పార్టీలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. -
102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఎన్ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. -
లాయర్ వనిత: అగ్రరాజ్య అటార్నీ
అమెరికాలో ఈ ఏడాది జనవరి 20 భారతీయులకు పెద్దపండగ. అక్కడ ఉన్న ఎన్నారైలకే కాదు, ఇక్కడున్న మనక్కూడా. ఆ రోజు జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు చేపడతారు. కమల భారత సంతతి మహిళ కనుక అది మనకు గర్వకారణం. అయితే ఈ గర్వకారణం ఇప్పుడు కమల ఒక్కరి వల్లే కాదు, వనితాగుప్త వల్ల కూడా. గురువారం జో బైడన్ అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్ వనితాగుప్తను నామినేట్ చేశారు. అగ్రరాజ్యానికి శ్వేతసౌధం, జస్టిస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైనవి. ఈ కీలకమైన విభాగాలు రెండిటిలోనూ కమల, వనిత ఉన్నారు! దీనర్థం వచ్చే నాలుగేళ్ల అమెరికా పరిపాలనలో భారతీయుల సగ భాగస్వామ్యం కూడా ఉండబోతున్నదని. శ్వేతసౌధంలో కమల ఎలాగో, జస్టిస్ డిపార్ట్మెంట్లో వనిత అలాగ. జో బైడన్.. వనితను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చెయ్యగానే ఆ అగ్రరాజ్యపు ప్రధాన న్యాయ వ్యవస్థకు కొండంత బలం చేకూరినట్లయింది. ఇదేమీ అతిశయోక్తితో కూడిన మాట కాదని వనిత ‘ప్రొఫైల్’ చూస్తే అర్థమౌతుంది. అసలు 45 ఏళ్ల వయసుకే వనిత ఆ అత్యున్నత స్థానాన్ని చేపట్టబోతున్నారు. ఆమె నియామకానికి సెనెట్ ఆమోదం తెలుపవలసి ఉన్నప్పటికీ అదేమీ విషమ పరీక్ష కాదు. పాలనా పరమైన ఒక సోపానం మాత్రమే. అటార్నీ జనరల్ జస్టిస్ మెరిక్ గార్లండ్ తర్వాతి స్థానం వనిత దే. ఆమె తర్వాత లీసా మొనాకో డిప్యూటి అటార్నీ జనరల్‌గా ఉంటారు. లీసా తర్వాత క్రిస్టెన్ క్లార్క్ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా ఉంటారు. ఈ టీమ్ అంతా కూడా న్యాయ వ్యవస్థలోని పౌర హక్కుల విభాగానికి పని చేస్తుంది. వనితను ఈ విభాగంలోకి తీసుకోడానికి ప్రధానం కారణం కూడా అదే. పౌర హక్కుల న్యాయవాదిగా ఆమెకు అమెరికా అంతటా మంచి పేరుంది. బైడన్ తనను నామినేట్ చేయగానే ‘‘బాధ్యత ఉన్న స్థానంలోకి నేను ఎంపికవడం నాకు లభించిన గౌరవం’’అని వనిత ట్వీట్ చేశారు. ‘‘రాజకీయ జోక్యాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తాను’’ అని కూడా అమెరికన్ ప్రజలకు ఆమె మాట ఇచ్చారు. గురువారం సరిగ్గా అమెరికన్ పాలనా భవనంలో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే వనిత నియామకం జరిగింది. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టగానే బహుశా ఆమె టేబుల్ మీదకు వచ్చే మొదటి కేసు ఆ ఘటనకు కారకులైన వారికి సంబంధించినదే అయివుండే అవకాశాలున్నాయి. బైడెన్ ప్రతి విభాగంలోని తన టీమ్‌ని ఎన్నో ఎంపికల తర్వాత మాత్రమే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరీ ఖరారు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే అనితకు వచ్చిన అవకాశమే ఇది. వాస్తవానికి ఇది అమెరికన్ పౌరులకు వచ్చిన అవకాశం అనుకోవాలి. వనిత తల్లిదండ్రులు రాజీవ్, కమల, అక్కాచెల్లెళ్లు అనిత, అమిత అనితాగుప్తా యేల్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. ఆ వెంటనే న్యూయార్క్‌లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్.డి.ఎఫ్. (లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఫండ్’ లో చేరారు. ఆ సంస్థ తరఫున ఆమె చేపట్టిన కేసులన్నీ.. ‘అందరూ తెల్లవాళ్లే జడ్జిలు గా ఉండే’ కోర్టులు టెక్సాస్‌లోని ఆఫ్రో అమెరికన్లపై దోషులుగా ఇచ్చిన తీర్పులు సవాలు చేసి, నిందితులను జైళ్ల నుంచి విడిపించడం. వారి పౌర హక్కులను పరిరక్షించడం. అరేళ్లు అక్కడ పనిచేశాక 2007లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో న్యాయవాది (స్టాఫ్ అటార్నీ) అయ్యారు. పౌర హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్న అమెరికన్ వలస చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేశారు. పెళ్లయ్యాక మహిళల లక్ష్యాలకు ఆటంకాలు ఏర్పడి ఇల్లే ఆమె గమ్యం అవుతుందని అంటారు. అయితే గత పదిహేడేళ్లుగా వనిత వాదిస్తున్న కేసులలో, సాధిస్తున్న విజయాలలో ఆమె భర్త ఛిన్ క్యు లె సహకారం కూడా ఉంది. 2003లో వారి వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు. ఛిన్ కూడా న్యాయ రంగంలోనే ఉన్నారు. కొలంబియా డిస్ట్రిక్ట్ ‘లీగల్ ఎయిడ్’ సంస్థకు ప్రస్తుతం ఆయన లీగల్ డైరెక్టర్. వనితకు అమిత అనే చెల్లి ఉన్నారు. ఆమె మాత్రం వైద్య రంగాన్ని ఎంచుకుని హెచ్.ఐ.వి., టీబీలపై అమెరికాలోనే వైద్య పరిశోధనలు చేస్తున్నారు. అమ్మ నాన్న చెల్లి వనిత తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్. తండ్రి రాజీవ్ గుప్త. తల్లి కమల వర్షిణి. రాజీవ్ బిజినెస్‌మ్యాన్. ఎం.బి.ఎ. చదివింది అమెరికాలోనే అవడంతో ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. ఇండియాలో ఉన్నప్పుడే 1968 లో వాళ్ల పెళ్లి జరిగింది. 1974లో ఫిలడెల్ఫియాలో వనిత పుట్టింది. తర్వాత అమిత. కమల గోల్ఫ్ ప్లేయర్. టేబుల్ టెన్నిస్ కూడా ఆడతారు. తోట పని అంటే ఇష్టం. రోజులో ఎక్కువ భాగం పూలతోనే గడుపుతుంటారు. రాజీవ్, కమల మూడేళ్ల క్రితం ఇండియా వచ్చి తమ 50 వ పెళ్లి రోజును జరుపుకుని వెళ్లారు. ‘‘కుటుంబం కోసం కమల తన జీవితాన్ని త్యాగం చేసింది’’ అని ఆ సందర్భంగా రాజీవ్ అన్నారు. -
సోషల్ మీడియాపై అణచివేతలొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు ఓకే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి 10వ తేదీన పునాది రాయి వేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సర్కారు హామీ ఇవ్వడంతో శంకుస్థాపన విషయంలో సానుకూలంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన సముదాయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిల్లు చేశారు. వీటిపై తాజాగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ం హామీని పరిగణనలోకి తీసుకుని శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది. -
కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ
న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రా సుప్రీంకోర్టుని విమర్శిస్తూ చేసిన ట్వీట్లు కోర్టుని అవహేళన చేయడమేనని, అతనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ తెలిపారు. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్ అన్నారు.సుప్రీంకోర్టుని కాషాయరంగుతో, దానిపై త్రివర్ణపతాకం జెండా స్థానంలో బీజేపీ జెండాని చూపిస్తూ కమ్రా ట్వీట్ చేశారని, ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు. అర్నబ్‌కి సుప్రీం బెయిలు మంజూరు చేయడంపై కమ్రా ఈ ట్వీట్ చేశారు. -
నటి స్వర భాస్కర్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కించపర్చే వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. ఆమెపై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఆదివారం తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ముంబై కలెక్టివ్’ నిర్వహించిన ప్యానెల్ చర్చలో స్వర భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సంస్థపైదాడిగా పేర్కొంటూ ఆమెపై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ న్యాయవాదులు మహేక్ మహేశ్వరి, అనుజ్ సక్సేనా, ప్రకాష్ శర్మలతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ ప్రతికూలంగా స్పందించారు. కాగా ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరం. -
న్యాయవాదిపై ట్రంప్ ఆగ్రహం!
వాషింగ్టన్: ప్రభుత్వ కార్యకలాపాలపై నిఘా పెట్టి, అధికారులపై అభియోగాలు మోపుతున్న న్యూయార్క్ జిల్లా న్యాయవాది జాఫ్రీ బెర్మన్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని యుఎస్ అటార్నీ జనరల్ విలియం బార్ తెలిపారు. జాఫ్రీ బెర్మన్ తొలగింపునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడని వెల్లడించారు. అయితే, బెర్మన్ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారని బార్ పేర్కొన్నారు. అతను రాసిన ఓ లేఖలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయని జిన్హువా వార్తా సంస్థ ప్రచురించింది. బెర్మన్ స్థానంలో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఛైర్మన్ జే క్లేటన్ ను నామినేట్ చేయాలనే ఉద్దేశ్యాన్ని ట్రంప్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారని తెలిపింది. (చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..) కాగా, బెర్మన్ విచారణతోనే ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్‌ను జైలు జీవితం గడుపుతున్నాడు. దాంతోపాటు ట్రంప్ ప్రస్తుత వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిని కూడా బెర్మన్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకనే అతని తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే, సెనేట్ ధృవీకరణతోనే తాను పదవికి రాజీనామా చేస్తానని బెర్మన్ కుండబద్దలు కొట్టారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. అప్పటి వరకు, తమ దర్యాప్తులు ఆలస్యం లేదా అంతరాయం లేకుండా ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేసినట్టు పేర్కొంది. (చదవండి: ఇరు దేశాలతో చర్చిస్తున్నాం: ట్రంప్) -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
ఇద్దరూ పిల్లుల్లా కొట్లాడుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో దేశ ప్రజల ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నవ్వులపాలయిందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కీచులాటతో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సీబీఐపై చెదిరిన ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కేంద్రప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. తనను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలోక్ వర్మ, అస్తానాల గొడవతో సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొందనీ, ఇద్దరు పిల్లుల్లా కొట్లాడుకోవడంతో కేంద్రం జోక్యం చేసుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేకపోయిందని ఈ సందర్భంగా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము కల్పించుకోకుంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసన్నారు. చట్టానికి లోబడే ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సీబీఐలో పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న అలోక్ వర్మ, అస్తానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టు తీరుపై అటార్నీ జనరల్ నిరసన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వ్యవహారశైలిపై అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. చాలా పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించకుండానే కొట్టివేస్తోందని నిరసన తెలిపారు. రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పన్ను చెల్లింపులకు సంబంధించి ఓ కేసులో వాదించేందుకు వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషన్ విచారణకు కోర్టు సుముఖంగా లేకపోవడంపై స్పందిస్తూ..‘ప్రజలు వేలాది కిలోమీటర్ల దూరం నుంచి న్యాయస్థానానికి వస్తున్నారు. కానీ మీరు మాత్రం కనీసం వారి వాదనలు వినకుండానే పిటిషన్లను కొట్టివేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. కనీసం పిటిషనర్ల వాదనలైనా కోర్టు వినాలి. ఇది ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన కేసు. కానీ సీజేఐ మాత్రం ప్రతివాదికి నోటీసు జారీచేసేందుకు ఆలోచిస్తున్నారు’ అని తెలిపారు. వెంటనే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం స్పందిస్తూ..‘సరే మిస్టర్ వేణుగోపాల్.. మీ వ్యాఖ్యలను సానుకూల దృష్టితో పరిగణనలోకి తీసుకుంటున్నాం. వాదనలు వినిపించండి. మేం పిటిషన్‌ను పరిశీలించలేదని భావించకండి. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ కచ్చితంగా పరిశీలిస్తాం’ అని వ్యాఖ్యానించింది. -
అమెరికా ఏజీ జెఫ్ సెషన్స్‌కు ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్(ఏజీ) జెఫ్ సెషన్స్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో తన మద్దతుదారైన మేథ్యూ వైట్కర్ను తాత్కాలిక ఏజీగా నియమించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణను పర్యవేక్షించేందుకు జెఫ్ సెషన్స్ నిరాకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం విచారణ ప్రక్రియ ట్రంప్ చేతుల్లోకి వచ్చేసినట్లైంది. కాగా, ఇన్నాళ్లూ జెఫ్ అందించిన సేవలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకే తాను ఏజీ పదవికి రాజీనామా చేసినట్లు జెఫ్ ప్రకటించారు. -
కోటి విరాళమిచ్చిన ఏజీ
న్యూఢిల్లీ: కేరళలో సహాయ కార్యక్రమాల కోసం కేంద్ర అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోటి రూపాయలు విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. వేణుగోపాల్ కొడుకు, సీనియర్ న్యాయవాది క్రిష్ణన్ కూడా మరో రూ.15 లక్షలను కేరళకు విరాళమిచ్చారు. న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు చెప్పుకోదగ్గ డబ్బును విరాళంగా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులంతా కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. -
పిల్ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు: సుప్రీంకు కేంద్రం హితవు
న్యూఢిల్లీ: ప్రజాహిత వాజ్యాల (పిల్)ను విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం హితవు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని స్పష్టం చేసింది. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. దేశంలోని 1,382 జైళ్లలో ఖైదీల పరిస్థితి అమానవీయంగా ఉందంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా, అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్, జడ్జీల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఏజీ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు. కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. లక్షన్నర కోట్లతో ఏమైనా చేయొచ్చుగా.. ఏజీ వ్యాఖ్యలకు న్యాయమూర్తులు స్పందిస్తూ ‘ మా తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు. మా తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా? నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 30 వేల కోట్ల రూపాయలతో మీరు వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా, జైలు సంస్కరణలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జైళ్లలో పెరుగుతున్న ఖైదీల రద్దీ సహా ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది. -
డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ‘క్రీమీలేయర్‌పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది. -
‘సోషల్ హబ్’పై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిఘా కోసం తీసుకురావాలనుకున్న ‘సోషల్ మీడియా హబ్’పై కేంద్రం వెనక్కు తగ్గింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటుకు తాము జారీచేసిన నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ హబ్‌కు సంబంధించిన పాలసీని సమీక్షిస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు సంబంధిత పిటిషన్‌ను కొట్టివేసేందుకు అంగీకరించింది. సోషల్ మీడియా, ఈ–మెయిల్స్‌లోని సమస్త సమాచారంపై నిఘా పెట్టేందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మొయిత్రా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా ‘దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా?’ అని కేంద్రంపై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ► రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను కోర్టులు విచారించేటప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ లేదా రికార్డింగ్ చేసే విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. ► శారదా చిట్‌ఫంట్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య, న్యాయవాది నళినిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల్ని కోర్టు ఆదేశించింది. శారదా కంపెనీ లా బోర్డు సమావేశాలకు హాజరైన నళిని ఫీజుగా రూ.కోటి అందుకున్నారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీచేయడం తెల్సిందే. ► దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు చేపట్టడంపై మార్గదర్శకాలు జారీచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిల్‌ను న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడంగా అభివర్ణించిన కోర్టు.. పిటిషనర్‌కు రూ.25,000 జరిమానా విధించింది. దీన్ని నాలుగు వారాల్లోగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
‘దేశం భగ్గుమంటోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై తన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో అత్యవసర తరహా పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తీర్పుపై పునరాలోచన చేయాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. దళిత సంఘాల ఆందోళనతో దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాటి భారత్ బంద్ సందర్భంగా పలువురు మరణించారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని వేణుగోపాల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రభుత్వ బాధ్యత అని అమికస్ క్యూరీ అమరేంద్ర శరణ్ అటార్నీ జనరల్ వాదనతో విభేదించారు.దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు క్షీణించాయనే పేరుతో సుప్రీం కోర్టు తన ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సరికాదని శరణ్ వాదించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ దళితుల హక్కులతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడిఉందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రజ్వరిల్లచేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సమూలంగా మార్చాలన్న సుప్రీం కోర్టు తీర్పుతో కేంద్రం విభేదిస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన వివరణ హేతుబద్ధతతో తాము ఏకీభవించబోమని అన్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దళిత సంఘాల రిట్ పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజాయితీతో కూడిన ప్రభుత్వ అధికారులను ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు మోపి బ్లాక్ మెయిల్‌కు గురిచేయడాన్ని నిరోధిస్తూ చట్ట నిబంధనలను మార్చాలని మార్చి 20న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. దీనిపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసి బహిరంగ విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరింది. -
‘సుప్రీం’ సంక్షోభం ముగిసింది
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తాత్కాలిక తెరపడింది. సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సోమవారం లోపు సమస్యను పరిష్కరిస్తామని ఇది వరకే ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇక అధికారికంగా ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా ఎదుట ప్రకటించనుంది. న్యాయ నిపుణులు, బార్ అసోషియేషన్ సభ్యులు విడివిడిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, అసంతృప్త న్యాయమూర్తులతో దఫాలుగా భేటీ అయ్యారు. చివరకి వారి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని ముగించేందుకు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులంతా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ వ్యాఖ్యానిస్తూ... న్యాయమూర్తుల మధ్య సఖ్యత ఏర్పడిందని, దీన్ని మరింత పొడిగించాలని వారు కూడా అనుకోవడం లేదు. ఇప్పుడంతా ఓకే అని పేర్కొన్నారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రా పనితీరుపై సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో పాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదని, వాటిని సరిదిద్దేలా సీజేఐని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. -
రేపటిలోగా పరిష్కారం : అటార్నీ జనరల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు గళమెత్తిన వ్యవహారంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. సర్వోన్నత న్యాయస్ధానం పనితీరుపై న్యాయమూర్తుల ఆక్రోశం నేపథ్యంలో తలెత్తిన సంక్షోభానికి శనివారం తెరపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరూ అపార అనుభవం, ప్రతిభా పాటవాలు కలిగిన విజ్ఞులు..నాకు తెలిసి రేపటితో (శనివారం) మొత్తం వ్యవహారం సమసిపోతుంద’ని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో పరిస్థితి సజావుగా లేదని జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు సీజేఐ దీపక్ మిశ్రాపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు బాహాటంగా సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. -
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్!
- దాదాపుగా ఖరారైన పేరు.. త్వరలో నోటిఫికేషన్ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి(అటార్నీ జనరల్)గా సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతిత్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. పదవీ కాలాన్ని పొడిగించినా ఏజీగా కొనసాగేందుకు ముకుల్ రోహత్గీ నిరాకరించడంతో ఆయన వారసుడి ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు వెళ్లడానికి ముందే వేణుగోపాల్‌ను పిలిపించుకుని మాట్లాడారని జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 86ఏళ్ల వేణుగోపాల్ స్వస్థలం కేరళ. దేశంలో హై-ప్రొఫైల్ కేసులు వాదించే లాయర్లలో అగ్రగణ్యుడిగా పేరుపొందిన ఆయన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ నాయకుల తరుఫున, 2జీ స్పెక్ట్రం కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఆయన బలమైన వాదనలు వినిపించారు. కాగా, ఏజీగా పేరు ఖరారైందన్న వార్తలపై వేణుగోపాల్ ఆచితూచి స్పందించారు. ‘నియామకపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడతా’నని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయరంగంలో చేసిన కృషికిగానూ 2015లో వేణుగోపాల్‌కు రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మ విభూషణ్’ను అందించారు. ఇక తప్పుకుంటా: ముకుల్ రోహత్గీ -
ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు
వాషింగ్టన్: ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రానీయకుండా జారీచేసిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిషేధాజ్ఞల విషయంలో ప్రభుత్వానికి సహకరించడం లేదన్న కారణంతో తాత్కాలిక అటార్నీ జనరల్ (న్యాయ శాఖ అధిపతి) సలే యాట్స్ను పదవి నుంచి తొలగించారు. ‘అమెరికన్ల ప్రయోజనం కోసం జారీ అయిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సమర్థించకుండా ఆమె(సలే యాట్స్) విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. అందుకే ఆమెను పదవిననుంచి తొలిగించాం’అని వైట్‌హౌస్ అధికారులు సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వర్జీనియా అటార్నీగా పనిచేస్తోన్న డనా బౌంటేను నూతన (తాత్కాలిక )అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ప్రమాణం చేశారు. ముస్లిం దేశాలపై ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను ఫెడరల్ కోర్టులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయశాఖ వాదనలు వినిపించాల్సిఉంది. అయితే సలే యాట్స్ మాత్రం ట్రంప్ నిషేధ నిర్ణయానికి అనుకూలంగా వాదించబోనని మొండిపట్టుదల ప్రదర్శించారు. ట్రంప్‌ను సమర్థించవద్దంటూ సహచర లాయర్లకు లేఖలు కూడా రాశారు. అటార్నీ జనరల్ పదవిలోఉండి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సలేను పదవినుంచి తొలిగించిన కొద్దిసేపటికే ఈ వ్యవహారంపై ట్రంప్ ట్వీట చేశారు. ‘ఒబామాచేత నియమితురాలైన అధికారులు మా పనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు’అని సలే యాట్స్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90 రోజులపాటు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పలు ఫెడరల్ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. నాలుగు కోర్టులైతే ఏకంగా ఉత్తర్వులనే నిలుపుదలచేస్తూ తీర్పులిచ్చాయి. అటార్నీ జనరల్ నేతృత్వంలోని లాయర్లు.. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వాదలను వినిపించాల్సిఉంటుంది. ఆపని చేయని కారణంగా సలే యాట్స్పై వేటుపడింది. (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) -
కొందరి చేతికే ఎలా?
కొత్తనోట్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ► రూ.24వేల విత్‌డ్రాయల్‌పై నోటిఫికేషన్ కు కట్టుబడి ఉండాలని సూచన ► డీసీసీబీలపై రెండ్రోజుల్లో నిర్ణయమన్న అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్తనోట్లు పట్టుబడటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో నోట్లు లేక ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కడుతుంటే.. దేశవ్యాప్తంగా సోదాలు, దాడుల్లో వందల కోట్ల విలువైన కొత్తనోట్లు బయటపడటంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కొత్త కరెన్సీ కొందరికి మాత్రమే పెద్ద సంఖ్యలో దొరుకుతోంది. ఎలా కొందరు ఇంత పెద్దమొత్తాన్ని సంపాదిస్తున్నారు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సీజేఐ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ‘కొందరు బ్యాంకు ఉద్యోగులు మోసపూరితంగా డబ్బులను బయటకు తరలించినట్లు తెలియటంతో వారిని అరెస్టు చేశారు. లెక్క తేలని ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి’అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కాగా, వారానికి రూ. 24వేల విత్‌డ్రాయల్ పరిమితికి కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘పాతనోట్లను డిపాజిట్ చేస్తున్న వారికి మీరు డబ్బులివ్వాలి. కానీ అది జరగటం లేదు. మీ దగ్గర డబ్బులేదనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఎప్పటిలోగా ప్రజలు చేసుకున్న డిపాజిట్లకు సరైన మొత్తాన్ని చెల్లిస్తారో చెప్పండి. మీకూ కొన్ని నిబంధనలుండాలి కదా’అని ధర్మాసనం.. రోహత్గీని ప్రశ్నించింది. నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు నోట్లరద్దు తర్వాత మూడు రోజుల పాటు రూ.8వేల కోట్లు సేకరించినా.. తర్వాత ఈ బ్యాంకుల ద్వారా డబ్బులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వలేద’ని వాదించారు. దీనికి రోహత్గీ స్పందిస్తూ.. ‘సహకార బ్యాంకుల ద్వారా కొత్త నోట్ల పంపిణీపై రెండ్రోజుల్లో తాజా నోటిఫికేషన్ ఇస్తాం’అని తెలిపారు. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రానందునే సహకార బ్యాంకులకు కొత్తనోట్ల పంపిణీ అవకాశం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కొత్త కరెన్సీలో రూ.5లక్షల కోట్ల వరకు చెలామణిలోకి వచ్చిందని.. దీంతోపాటు రూ. 2.5లక్షల కోట్ల కరెన్సీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో మార్కెట్లో ఉందని కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో వేస్తున్న పిటిషన్లను విచారించవద్దని రోహత్గీ కోరగా.. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఆదేశాలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. గడ్డం క్రమశిక్షణకు అడ్డమే! వాయుసేన ఉద్యోగి పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు న్యూఢిల్లీ: వాయుసేనలో పనిచేసే వ్యక్తులు మత సంబంధ కారణాలతో క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వాయుసేన (ఐఏఎఫ్) ఉద్యోగి అన్సారీ పొడవైన గడ్డంతో విధులకు హాజరవుతుండటాన్ని తప్పుపడుతూ ఐఏఎఫ్ 2003లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై అన్సారీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిక్కులు తలపాగా ధరిస్తారని, వారిలాగే తనకూ మతపరమైన సమానత్వం కల్పించాలని కోరారు. సాయుధ దళాల నిబంధనలు క్రమశిక్షణను, ఏకరూపతను పాటించేలా చేయడానికి ఉద్దేశించినవంటూ ఐఏఎఫ్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. -
తొలి మహిళా అటార్నీ జనరల్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా తొలి మహిళా అటార్నీ జనరల్ జానెట్ రెనో (78) కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధి తో బాధపడుతున్న ఆమె మియామి లోని ఇంట్లో తది శ్వాస విడిచారని అమెరికా సంయుక్త మీడియా వెల్లడించింది. బిల్ క్లింటన్ క్యాబినెట్ లో ఆమె అత్యంత విశ్వసనీయ కేబినెట్ సభ్యులు ఒకరుగా ఉన్నారు 1993 -2001మధ్య కాలంలో బిల్ క్లింటన్ అధ్యక్షుడి గా ఉన్నపుడు పలు రాజకీయ సంక్షోభాలకు కేంద్రంగా మారారు. క్లింటన్ నాయకత్వంలో సుదీర్ఘకాల నమ్మకంగా పనిచేసిన మహిళగా పేరొందారు. అయితే వాకో పాశవిక దాడి ఆమె రాజకీయ చరిత్రలో మాయనిమచ్చ. పదవి చేపట్టిన వెంటనే వాకో, టెక్సాస్ లో ఘోరమైన దాడితో పలు విమర్శలకు ఎదుర్కొన్నారు. ఈ దాడిలో తెగ నాయకుడు డేవిడ్ కోరేష్ , అతని 80మంది అనుచరులను మట్టు బెట్టడం వివాదం రేపింది. రెనో 20 వ శతాబ్దపు దీర్ఘకాలం పనిచేసిన ప్రధానన్యాయసలహాదారుగా నిలిచారు. 1995 లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ రెండు చేతులు వణుకుతూ ఇబ్బంది పడుతున్నా పదవిలో కొనసాగారు. -
జడ్జీల నియామకంలో జాప్యంపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: కొలీజియం ఖరారు చేసిన హైకోర్టు జడ్జీల నియామకం, బదిలీల సిఫారసులు అమలుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం అసహనం వ్యక్తం చేసింది. కొలీజియం ఖరారు చేసిన 75 మంది హైకోర్టు జడ్జీల నియామకంపై ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. 1971 యుద్ధ సమయంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేసిన అనిల్ కబోత్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో దాదాపు 43 శాతం జడ్జీల కొరత ఉందని, హైకోర్టుల్లో మొత్తం 40 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీనివల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోందని ఠాకూర్ అన్నారు. -
'మాల్యా రావాలి.. పాస్ పోర్టు ఇవ్వాలి'
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావాల్సిందేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అన్నారు. వచ్చి పాస్ పోర్టు అధికారులకు అప్పగించాలని చెప్పారు. 'సుప్రీంకోర్టు అయితే అతడిని ఇండియాకు రావాలని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదు. కానీ, సుప్రీంకోర్టు సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటుందో అప్పుడు ఆ వ్యక్తిగతంగాగానీ, లాయర్ ద్వారాగాగానీ హాజరుకావచ్చు. అయితే, మాల్యానే రావాలనేం లేదు.. న్యాయవాది ద్వారా కూడా రావొచ్చు. అయితే, మాల్యా ఎప్పటికైనా రావాల్సిందే.. తన పాస్ పోర్ట్ ఇవ్వాల్సిందే' అని రోహత్గీ అన్నారు. -
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
-
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి * రాజ్యసభ ఎంపీల లాటరీపై ఓ అవగాహనకు.. * ఆ గ్రామాలను తెలంగాణలో ఉంచాలనడం సబబే * పలు సమస్యలపై వెంకయ్యతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపుపై అటార్నీ జనరల్‌కు నివేదించనున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని న్యాయ శాఖకు తెలియజేస్తారని, దాని ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై తదుపరి నిర్ణయముంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్ గురువారమిక్కడ వెంకయ్యతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచుకోడానికి విభజన చట్టంలో వీలున్నప్పటికీ స్పష్టత లేదు. పాత జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఎంత వరకు చట్టబద్ధత ఉంటుందనే దానిపై చర్చించాం. అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రానికి అభ్యంతరం లేదు. ఇతర రాష్ట్రాలు ప్రశ్నించకుండా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం’ అని వెంకయ్య చెప్పారు. విభజన సమయంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులను ఏపీకి, ఏపీకి చెందిన వారిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించడం వల్ల వచ్చిన సమస్యపై ఓ అవగాహనకు వచ్చినట్లు వెంకయ్య తెలిపారు. రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలతో మాట్లాడి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశాలను వివరిస్తానన్నారు. అలాగే పోలవరం ముంపు దృష్ట్యా ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరడం సహేతుకంగానే అనిపిస్తోందని వెంకయ్య చెప్పారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారానికి వస్తే న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. తెలుగుభాషను పరిరక్షించుకోవాలి మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌ను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు భాష తెరమరుగవడానికి చేస్తున్న చర్యలు సరికాదన్నారు. 17న సంక్రాంతి సంబరాల విందు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, లహరి, నజీర్‌జాన్, రామ్ గణేష్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కమలంలో కలవరం
ఇరకాటంలో జల్లికట్టు వ్యవహారం అనుమతి ఇస్తే కోర్టు ధిక్కారమే అటార్నీ జనరల్ హెచ్చరికతో మల్లగుల్లాలు సర్వత్రా మద్దతుకు పీఆర్ విజ్ఞప్తితో సందిగ్ధం తిరువణ్ణామలైలో నిషేధం ఉల్లంఘన జల్లికట్టుకు అనుమతి వ్యవహారం రాష్ట్రంలోని కమలనాథుల్ని కలవరంలో పడేస్తోంది. అనుమతి దక్కని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని చవిచూసినట్టే అన్న ఆందోళన వారిలో బయలు దేరింది. అడ్డంకులను అధిగమించి ఒక వేళ అనుమతి ఇస్తే, కోర్టు ధిక్కారం తప్పదన్న హెచ్చరికను అటార్నీ జనరల్ స్పష్టం చేసి ఉండడంతో అనుమతిపై ఉత్కంఠ పెరిగింది. ఈ సమయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా మద్దతు ఇవ్వాలని పొన్ రాధాకృష్ణన్ విజ్ఞప్తి చేయడం సందిగ్ధతకు దారి తీసింది. సాక్షి, చెన్నై: తమిళుల వీరత్వాన్ని చాటే సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు విధించిన నిషేధం ఎత్తి వేయాలన్న నినాదంతో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. ప్రత్యేక చట్టంతో అనుమతి ఇవ్వాలని కేంద్రంపై సీఎం జయలలిత ఒత్తిడి పెంచారు. దీంతో జల్లికట్టు అనుమతి వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి శిరోభారంగా మారిందని చెప్పవచ్చు. తొలుత జల్లికట్టుకు అనుమతి తప్పకుండా వస్తుందని, సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టు తథ్యం అంటూ రాష్ట్రంలో జబ్బలు చరిచిన కమలనాథులకు తాజా పరిస్థితులు కలవరాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడ తమకు డిపాజిట్లను అసెంబ్లీ ఎన్నికల్లో గల్లంతు చేస్తాయోనన్న ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించాలన్న కాంక్షతో కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. తమతో కలసి రావాలంటూ పలు పార్టీలకు పిలుపు నివ్వడంతో పాటుగా మంతనాల్లో బిజీబిజీగానే ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకుంటూ తమ ద్వారానే రాష్ట్రానికి గానీ, తమిళులకు గానీ అన్ని విధాలుగా న్యాయం జరుగుతాయన్న హామీలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో జల్లికట్టుకు అనుమతి దక్కేనా..? దక్కదా..? అన్న ఉత్కంఠ కమలం వర్గాల్లో బయలు దేరి ఉండడం గమనార్హం. ఇందుకు కారణం జల్లికట్టు నిర్వహణ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు అటార్నీ జనరల్‌తో జరిపిన సంప్రదింపుల్లో ఎదురైన పరిణామాలే. జంతు సంరక్షణ సంస్థ అనుమతి నిరాకరించి ఉండడం, సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో స్పష్టమైన తీర్పును ఇచ్చి ఉన్న దృష్ట్యా, దాన్ని అధిగమించి ఏదేని ఉత్తర్వులు, అనుమతి ఇచ్చినా అది కోర్టు ధిక్కారం కింద వస్తుందన్న విషయాన్ని కేంద్రానికి అటార్నీ జనరల్ స్పష్టం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో జల్లికట్టుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కోర్టు ధిక్కారానికి గురి కావాడమా..? లేదా, ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టడమా..? అన్న అంశంపై అటవీ , పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నేతృత్వంలోని అధికార వర్గాలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నట్టుగా తెలిసింది. ఒక వేళ అనుమతి ఇవ్వని పక్షంలో తమిళనాట పార్టీకి తీవ్ర దెబ్బ తగులుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఢిల్లీలోని కమలం పెద్దలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో జల్లికట్టు తమను కలవరంలో పడేస్తుండడంతో, ఇన్నాళ్లుగా ప్రజలకు ఇస్తూ వచ్చిన హామీ, భరోసాకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా శనివారం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించడం చర్చకు దారి తీసింది. జల్లికట్టు వ్యవహారంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కేంద్రం చేపట్టే చర్యలకు సర్వత్రా మద్దతు ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుమానాల్ని పెంచుతున్నాయి. జల్లికట్టు నిర్వాహకులు, క్రీడకారులు తీవ్ర అయోమయంలో పడక తప్పడం లేదు. జల్లికట్టుకు అనుమతి రావాలనే తాము కోరుకంటున్నామని, వస్తుందన్న నమ్మం ఉందని, అయితే, కేంద్రం చివరి క్షణంలో తీసుకునే ఏదేని నిర్ణయానికి కట్టుబడే విధంగా మద్దతు ఇవ్వాలంటూ మంత్రి వ్యాఖ్యలు చేసి ఉన్నారేగానీ, ఇందులో అనుమానించాల్సి విషయం లేదని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా కొత్త సంవత్సరం వేళ ఎద్దులను వదిలి పట్టుకునే వేడుకను తిరువణ్ణామలై సమీపంలోని కలశపాక్కంలో జరిపి ఉండడం గమనార్హం. -
తేల్చేద్దాం
కండ్లకోయ సమస్యపై దృష్టి పరిష్కారం దిశగా చర్యలు రంగంలోకి అటార్నీ జనరల్ తుది తీర్పు కోసం హెచ్ఎండీఏ నిరీక్షణ సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డులోని పటాన్చెరు-శామీర్‌పేట మధ్య కండ్లకోయ జంక్షన్ వివాదం పరిష్కారానికి హెచ్ఎండీఏ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు... గడచిన రెండు నెలలుగా సుప్రీం కోర్టులో తరచూ వాయిదా పడుతోంది. దీన్ని గుర్తించిన హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తమ వాదనలు గట్టిగా వినిపించేందుకు అటార్నీ జనరల్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఔటర్ మొత్తం పూర్తి కావస్తున్నా... కోర్టు కేసుతో కండ్లకోయ జంక్షన్ నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని... దీనికి ఆర్థిక సాయం అందిస్తున్న ‘జైకా’ నిర్దేశించిన గడువు దగ్గరపడుతున్న అంశాన్ని అందులో వివరించారు. కండ్లకోయ భూ వివాదంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో 2 ఎస్ఎల్పీలు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో హెచ్ఎండీఏ నుంచి దాఖలైన పిటిషన్‌పై సీనియర్ అడ్వొకేట్ హరీష్‌సాల్వే వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన మరో పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు అటార్నీ జనరల్‌ను రంగంలోకి దించాలని హెచ్ఎండీఏ కోరుతోంది. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని హెచ్ఎండీఏను గట్టెక్కించాలని ప్రభుత్వ పెద్దలకు కమిషనర్ విన్నవించారు. నిజానికి ఔటర్ నిర్మాణానికి రుణాన్ని తీసుకునేందుకు ‘జైకా’ నిర్దేశించిన గడువు (లాస్ట్ డేట్ ఆఫ్ డిస్పర్స్‌మెంట్) 2016 మార్చితో ముగియనుంది. ఈలోగా కండ్లకోయ కేసు పరిష్కారం కాకపోతే ఆ తర్వాత జంక్షన్ నిర్మాణానికయ్యే రూ.150- 200 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇది మరింత భారమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో ఎలాగైనా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. ప్రత్యామ్నాయమే దిక్కు అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలైన్మెంట్ మార్చివేసి తమకు నష్టం కలిగించారంటూ కండ్లకోయ వద్ద 50 ఎకరాలకు సంబంధించి వాటి యజమానులు కిర్లోస్కర్, మరో 9 మంది ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. దీంతో కండ్లకోయ జంక్షన్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం పటాన్చెరు-శామీర్‌పేట మార్గం 35 కి.మీ. అందుబాటులోకి వచ్చినా... కండ్లకోయ జంక్షన్లో నిర్మాణం చేపట్టని కారణంగా సుమారు 3.5 కి.మీ. దూరం ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. నేరుగా లింకు లేకపోవడంతో ఔటర్ పూర్తయినా ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితి ఎదురైంది. ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక భారం కండ్లకోయ జంక్షన్ భూ వివాదం తేలని కారణంగా హెచ్ఎండీఏకు ఆర్థిక భారం పెరగనుంది. జైకా ఫేజ్-1లో భాగంగా చేపట్టిన ఈ రీచ్ నిర్మాణానికి అగ్రిమెంట్ వ్యవధి (2012) ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పనులు చేపడితే నిబంధనల ప్రకారం ఎస్కలేషన్ 30-35 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ టెండర్లు పిలవాలనుకొంటే కొత్త రేట్ల ప్రకారం అంచనాలు రూపొందించాలి. ఎస్కలేషన్ ఇచ్చి పాత కాంట్రాక్టర్‌తో పనిచేయించినా... లేదా కొత్తగా టెండర్లు పిలిచినా నిర్మాణ వ్యయం రెండింతలు పెరగడం ఖాయం. మొదట్లో ఈ నిర్మాణానికి రూ.60 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పుడు దీనికి సుమారు రూ.100 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జాప్యం కారణంగా రూ.40 కోట్లమేర హెచ్ఎండీఏపై అదనపు భారం పడింది. ఈ కే సులో సుప్రీం తీర్పు అనుకూలంగా వచ్చినా కండ్లకోయ జంక్షన్లో వివిధ నిర్మాణాలు పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదోవిధంగా సమస్యకు పరిష్కారం కనుగొని నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణం ప్రారంభించాలని వారు ప్రయత్నిస్తున్నారు. -
'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడం పట్ల సమాజంలోగానీ, పార్లమెంటులోగానీ భారీ స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గత వారం మొత్తం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత రాగా కొంతమేరకు నిషేధం ఎత్తివేశారు. అయితే, పోర్న్ సైట్లను నిషేధించడం పట్ల కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపధ్యంలో ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. -
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
-
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. సెక్షన్ - 8పై గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కోరితే మాత్రం తాము సలహా ఇస్తామన్నారు. కాగా సెక్షన్ - 8పై కేంద్ర హోం శాఖ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాగే సదరు సెక్షన్‌పై గవర్నర్‌కు తను నుంచి కానీ... తమ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సెక్షన్ -8పై ఇప్పటి వరకు న్యాయశాఖ ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదని సదానందగౌడ తెలిపారు. -
మార్చి నాటికి నల్లకుబేరులందరి వివరాలు!
ప్రస్తుతానికి కేవలం ఫ్రాన్స్‌లో ఉన్న హెచ్ఎస్బీసీ ఖాతాలను మాత్రమే సమర్పించిన కేంద్రం.. మొత్తం అన్ని దేశాల్లో ఉన్న నల్లఖాతాల వివరాలను వచ్చే సంవత్సరం మార్చి నాటికి సమర్పిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ఆదాయపన్ను చట్టం కింద ఈ కేసు దర్యాప్తు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సి ఉందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్లో తాము సమర్పించిన జాబితాను నేరుగా బుధవారమే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు పంపుతామని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే.. వివిధ దేశాలతో తమకు ఉన్న ఒప్పందాల వివరాలను, వాటివల్ల తలెత్తే సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం సిట్‌కు వివరిస్తుంది. అవన్నీ తెలుసుకున్న తర్వాతే నవంబర్ 30లోగా సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదిక సమర్పించాల్సిందిగా తాము సిట్‌ను కోరుతామని రోహత్గీ చెప్పారు. కేంద్రం ఇప్పటికే సమర్పించిన జాబితాలోని ఖాతాల మీద దర్యాప్తు కూడా 2015 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ జాబితాలోని పేర్లను వెల్లడిస్తే తలెత్తే ఇబ్బందుల గురించి ఏజీ వివరించడంతో.. తాము కూడా సీల్డ్ కవర్‌ను తెరవబోమని, నేరుగా సిట్‌కు ఇస్తామని సుప్రీం తెలిపింది. ఇది చూసిన తర్వాత ఏం చేయాలో, దర్యాప్తులో ఎలా ముందుకెళ్లాలో 13 మందితో కూడిన సిట్ నిర్ణయిస్తుందని రోహత్గీ చెప్పారు. వాస్తవానికి ఇదే జాబితాను తాము సిట్‌కు ఈ సంవత్సరం జూన్‌లో కూడా సమర్పించామన్నారు. -
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత
-
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత
ముంబై: మాజీ అటార్నీ జనరల్ గులాం ఎస్సాజీ వాహనవతి (65) మంగళవారం గుండెపోటుతో ముంబైలో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జీఈ వాహనవతి ఇటీవలే ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. 2009లో యూపీఏ కూటమి కేంద్రంలో రెండవసారి గెలిచిన అనంతరం.. 13వ అటార్నీ జనరల్‌గా వాహనవతి మూడేళ్ల పదవీకాలానికి నియమితులయ్యారు. 2012లో ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించారు. తర్వాత, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత మే నెల 27వతేదీన వాహనవతి అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేశారు. గతంలో వాహనవతి, 2004 నుంచి 2009 వరకూ సొలిసిటర్ జనరల్‌గా, అంతకు ముందు మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. వాహనవతి మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతితో దేశం ఒక న్యాయకోవిదుడిని, అంకితభావంతో కూడిన ప్రభుత్వ అధికారిని కోల్పోయిందని మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కొలీజియం’ వ్యవస్థ విఫలం!
ప్రఖ్యాత న్యాయకోవిదుల అభిప్రాయం సమూల మార్పులు అవసరం ప్రభుత్వంతో భేటీలో స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం సహా.. న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలకు తెరతీసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం ప్రఖ్యాత రాజ్యాంగ, న్యాయ కోవిదులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే ‘కొలీజియం’ వ్యవస్థ విఫలమైందని, జడ్జీలను జడ్జీలే నియమించే ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని భేటీలో పాల్గొన్న న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారని భేటీ అనంతరం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ‘కొలీజియం వ్యవస్థ ఉండాలా? వద్దా? అనే అంశంపై వారు తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇంకా చర్చ ముగియలేదు. ఎలాంటి మార్పులు అవసరం? న్యాయమూర్తుల నియామక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉండాలి?.. అనే విషయాలపై చర్చ కొనసాగించాల్సి ఉంది’ అన్నారు. ‘ఈ వ్యవస్థను మెరుగుపర్చాలనే విషయంలో, జడ్జీల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ‘కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందా?’ అన్న ప్రశ్నకు.. ఆ విషయాన్ని బహిరంగపరచడం సరికాదని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ వీఎన్ ఖరే.. లా కమిషన్ చైర్మన్ ఏపీ షా, మాజీ అటార్నీ జనరల్ కే పరాశరన్, ప్రఖ్యాత న్యాయవాదులు సొలీ సొరాబ్జీ, ఫాలీ నారిమన్, కేటీఎస్ తులసి, కేకే వేణుగోపాల్, ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు.. మూడున్నర గంటలపాటు జరిగిన సమాలోచనల్లో పాలు పంచుకున్నారు. న్యాయవ్యవస్థదే పై చేయి ఉండాలి సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ ఉండకూడదని దాదాపు భేటీలో పాల్గొన్న న్యాయ నిపుణులంతా తేల్చిచెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(జేఏసీ)లోనూ న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండాలని, ప్రభుత్వ ప్రతినిధిగా న్యాయ మంత్రి ఉంటే సరిపోతుందన్నారు. అలాగే, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో మార్పు ఉండకూడదని ఫాలి నారిమన్, సొలి సొరాబ్జీ హెచ్చరించారు. ‘న్యాయప్రమాణాలు, జవాబుదారీతనం బిల్లు’ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ ఎక్కువ సమయం కొలీజియంపైనే చర్చ జరిగింది. ‘కొలీజియం’ స్థానంలో జేఏసీ’ను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తామని ఇటీవలే రవిశంకర్ ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
రాజకీయ పెద్దల మెప్పు పొందేందుకే..
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత(ఎల్వోపీ) హోదా సాధించేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదంటూ అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. తన రాజకీయ పెద్దల మెప్పు పొందేందుకే ఏజీ ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏజీ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏజీ అభిప్రాయానికి ఆయన రాసిన కాగితం పాటి విలువ కూడా ఉండబోదన్నారు. రాజకీయ పెద్దల మెప్పు పొందేందుకు ఏజీ ఈ విధమైన అభిప్రాయాన్ని తెలిపారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చట్టం, శాసనాల గురించి ఎంతో అవగాహన ఉండే ఏజీ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయరాదని, ఇది తన పదవిని అవమానపరిచేలా ఉందని ఆనంద్‌శర్మ వ్యాఖ్యానించారు. ఎల్వోపీ విషయంలో స్పీకర్‌పైనా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించకుంటే.. కోర్టుల తలుపు తట్టే అవకాశం లేకపోలేదని చెప్పారు. ‘‘ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. స్పీకర్‌పైన ఒత్తిడి తెచ్చేందుకు సైతం వారు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏజీ అభిప్రాయాన్ని స్పీకర్ మహాజన్ తిరస్కరిస్తారని తాము భావిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా స్పీకర్‌కు, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష అని పేర్కొన్నారు. -
కొత్త ఏజీగా ముకుల్ రోహత్గీ
న్యాయశాఖ నోటిఫికేషన్ న్యూఢిల్లీ: నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గురువారం నియమితులయ్యూరు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎన్డీయే ప్రభుత్వ అత్యున్నత న్యాయూధికారిగా రోహత్గీని నియమిస్తూ న్యాయశాఖ లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జి.ఇ.వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాహనవతి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం మారినప్పుడు న్యాయూధికారులు తమ పదవుల నుంచి వైదొలగడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో భారత సొలిసిటర్ జనరల్‌గా ర ంజిత్ కుమార్‌ను కేంద్రం ఇప్పటికే నియమించింది. ఆరుగురు అదనపు సొలిసిటర్ జనరల్స్ కూడా నియమితులయ్యూరు. రోహత్గీ గత ఎన్డీయే ప్రభుత్వ హయూంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గానే సేవలందించారు. సుప్రీంకోర్టులోని పిటిషన్లను ఓ గాడిన పెట్టడమే తన తొలి ప్రాధాన్యతగా రోహత్గీ ఇటీవల చెప్పారు. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ ముంబై విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసు సహా పలు కేసులను గుజరాత్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. ఢిల్లీలో నివసించే ఈయనకు కార్పొరేట్ లాయర్‌గా కూడా పేరుంది. -
371డీని తొలగించాల్సిందే..
-
371డీని తొలగించాల్సిందే..
కేంద్రానికి అటార్నీ జనరల్ స్పష్టీకరణ టీ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలి ఏ రాష్ట్రానికీ లేని ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 371డీ ఏపీకి కల్పిస్తోంది రాజ్యాంగంలోని 3, 4 అధికరణల కింద కేంద్రం అధికారాలను వినియోగించాలంటే.. ముందుగా ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలి 371డీ ఉండగా ఆ ఆర్టికల్స్ ప్రకారం నేరుగా విభజన చేయటం కుదరదు ఏపీని విభజిస్తే.. రెండు రాష్ట్రాలకూ ఇక ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు కేంద్ర హోంశాఖకు నోట్లో అటార్నీ జనరల్ వాహనవతి నివేదన వాహనవతి నోట్లోని అంశాలతో జీవోఎంకు హోంశాఖ నివేదిక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటులోమూడింట రెండొంతుల మెజారిటీ కావాలి ప్రతిపక్ష బీజేపీ మద్దతు ఉంటేనే సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం సాధ్యం.. బీజేపీ స్వరం మారిన పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యేనా? సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే.. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేనివిధంగా ఈ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 371డీని ముందుగా తొలగించాల్సిందేనని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖకు తాజాగా నోట్ సమర్పించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ (ఆర్టికల్ 3) కింద రాష్ట్రాన్ని విభజించే అధికారాలను కేంద్రం వినియోగించుకోవాలంటే.. దానికి ముందుగా ఆర్టికల్ 371డీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలని ఆ నోట్లో నివేదించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పెట్టటానికి ముందుగా ఆర్టికల్ 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి తీరాలని అటార్నీ జనరల్ విస్పష్టంగా పేర్కొన్నారు. వాహనవతి నోట్లో పేర్కొన్న అంశాలతో కేంద్ర హోంశాఖ అంతర్గత నివేదికను రూపొందించి కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించింది. అటార్నీ జనరల్ చెప్పిన ప్రకారం ఆర్టికల్ 371డీని తొలగించాలంటే.. అందుకోసం రాజ్యాంగాన్ని సవరిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటు ఉభయసభల్లో మూ డింట రెండొంతుల మెజారిటీ అవసరం. అయితే.. ఇప్పటికే మైనారిటీలో ఉంటూ బయటి నుంచి మద్దతిస్తున్న పలు పార్టీలపై ఆధారపడి యూపీఏ సర్కారు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు తప్పనిసరిగా అవసరమవుతుంది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన బీజేపీ ఇటీవలి కాలంలో స్వరం మార్చటం తెలిసిందే. రెండు ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, ముందు తెలంగాణ బిల్లును చూస్తే కానీ.. దానికి బేషరతు మద్దతు ఇస్తామో లేదో చెప్పబోమని గళం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకన్నా ముందు రాజ్యాంగ సవరణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందా? పార్లమెంటులో రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371డీని తొలగించటం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు రాజకీయ మార్గాల అన్వేషణ ప్రారంభించింది. అలాగే.. అటార్నీ జనరల్ నోట్‌తో పూర్తిగా సంతృప్తి చెందని జీవోఎం.. మరోసారి ఆయన నుంచి వివరణాత్మక నోట్‌ను కోరే దిశగా ఆలోచిస్తోందని సమాచారం. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రివర్గం విభజన ప్రక్రియపై నిర్దిష్ట విధివిధానాలతో మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటుచేసింది. ఈ మంత్రుల బృందం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో, రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీలతో, అలాగే కేంద్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో వరుస భేటీలు నిర్వహించి విభజనతో ముడిపడిన పలు అంశాలపై చర్చించి, వారి అభిప్రాయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ చర్చల ప్రక్రియను సాగిస్తూనే కేంద్ర హోంశాఖ ఆర్టికల్ 371డీ విషయమై అటార్నీ జనరల్ (ఏజీ) వాహనవతి అభిప్రాయాన్ని కోరింది. విభజనతో ముడిపడ్డ వివిధ అంశాలు, ప్రత్యేకించి విద్య, ఉద్యోగాలకు సంబంధించిన రక్షణ కవచమైన ఆర్టికల్ 371డీని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 సహా పలు ఆర్టికళ్లను నిశితంగా పరిశీలించి, సహ న్యాయనిపుణులతో చర్చించిన మీదట వాహనవతి తన అభిప్రాయాన్ని హోంశాఖకు నివేదించారని సమాచారం. ఆయన సమర్పించిన నోట్ ఆధారంగా హోంశాఖ రూపొందించిన అంతర్గత నివేదనలోని అంశాలు మంగళవారం ఢిల్లీలో వెలుగుచూశాయి. జీవోఎంకు తాజాగా హోంశాఖ అందజేసిన ఈ నివేదికలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని, సూచనలను అత్యంత ప్రముఖంగా ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులోని అంశాలు ఇలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నమైనది... ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన బిల్లును ఆమోదించటానికన్నా ముందుగానే ఆర్టికల్ 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేయటం తప్పనిసరని అటార్నీ జనరల్ కేంద్ర హోంశాఖకు సమర్పించిన నోట్లో స్పష్టంచేశారు. అలా చేయని పక్షంలో రాజ్యాంగపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని రాష్ట్ర విభజనకు సిద్ధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న వాహనవతి.. రాజ్యాంగంలోని ఇతర ఆర్టికళ్లలో ఉన్న నిబంధనలు ఏమిటన్నది వివరించారు. ఆయా ఆర్టికళ్లలోని అంశాలు ఆర్టికల్ 3 కింద ఉన్న అధికారాల వినియోగానికి అడ్డంకి కానప్పటికీ.. ఆర్టికల్ 371డీ కారణంగా ఇక్కడ పరిస్థితి భిన్నంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం చూస్తే.. ఓ రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఏ చట్టాన్ని చేయడమైనా సరే రాజ్యాంగాన్ని సవరించటం కిందికి రాదు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను సదరు చట్టం సవరిస్తున్నదైనప్పటికీ దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించటానికి వీలుండదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ విషయం ఇక్కడ పూర్తి భిన్నమైనది. ఈ రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆర్టికల్ 371డీ’’ అని ఆయన వివరించారు. అది ఏ రాష్ట్రానికీ లేని ప్రత్యేక ప్రతిపత్తి... 371డీ రాజ్యాంగంలో ఏ సందర్భంలో వచ్చి చేరిందీ అటార్నీ జనరల్ తన నోట్లో వివరించారు. 1969, 72 ఉద్యమాల తర్వాత పార్లమెంట్లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా ఆర్టికల్ 371డీని రాజ్యాంగంలో చేర్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారికి విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్.. సమయానుసారం ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఈ ఆర్టికల్ ప్రకారమే విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం వివిధ ప్రాంతాల వారికి సమాన వాటా లభిస్తోంది. ఈ ఆర్టికల్ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానం అమల్లోకొచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రానికీ ఇలాంటి ప్రత్యేక ప్రతిపత్తి లేదని వాహనవతి పేర్కొన్నారు. ఇది ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి 3, 4 అధికరణల ప్రకారం దక్కిన అధికారాలను కేంద్రం నేరుగా వినియోగించజాలదన్నారు. తొలుత 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాకే విభజనకు సంబంధించి రాజ్యాంగంలోని ఇతర అధికారాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. విభజన ప్రక్రియ పూర్తికి నియమించిన జీవోఎం ఈ అంశాన్ని గుర్తించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టటం చాలా ముఖ్యమని వాహనవతి సూచించారు. విభజిస్తే ప్రత్యేక ప్రతిపత్తి వర్తించదు... అంతేకాదు.. ‘‘రాష్ట్రమంతటా సమాన అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆర్టికల్ 371డీని రాజ్యాంగంలో చేర్చినందున, రాష్ట్రాన్ని విభజించిన పక్షంలో, విభజన తర్వాత మిగిలిన భాగానికి ఈ ఆర్టికల్‌ని వర్తింపచేయడం సబబు కాదు’’ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. అలా వర్తింపచేసినట్టయితే అది అసలు ఆర్టికల్ 371డీ వెనుక ఉన్న ప్రధానోద్దేశానికి, సంకల్పించిన ప్రయోజనానికి పూర్తి విరుద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు ముందుగా రాజ్యాంగ సవరణను ఆమోదించటం తప్పనిసరి. అలా చేస్తేనేఆర్టికల్ 371డీ కింద ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని.. కొత్తగా ఉనికిలోకి వచ్చే రెండు రాష్ట్రాలూ కోల్పోతాయని అటార్నీ జనరల్ వాహనవతి జీవోఎంకు తెలియజేశారు’’ అని హోంశాఖ తన అంతర్గత నివేదనలో పేర్కొంది. ‘‘ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడమంటూ జరిగితే, ఆర్టికల్ 371డీ కింద ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి.. విభజన తర్వాత రాష్ట్రంలో మిగిలిన భాగానికి వర్తించదు’’ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ 371డీ ప్రస్తావన... రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించిన సమయంలోనూ రాజ్యాంగ నిపుణులైన సీనియర్ న్యాయవాదులు ఆర్టికల్ 371డీ సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ సంగతిని తేల్చాకే విభజనపై కేంద్రం ముందుకు వెళ్లాలని వారు వాదించారు. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ నుంచి జీవోఎంకు అందిన నోట్లోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ ఆర్టికల్ 371డీ... 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు.. తెలంగాణ హక్కుల పరిరక్షణకు ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి వాటికి రాజ్యాంగ రక్షణ లేకపోవడంతో.. విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 371డీ అధికరణను చేర్చారు. ఈ అధికరణను అనుసరించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు జోన్లు ఉన్నాయి. ఈ అధికరణ కింద 85 శాతం ఉద్యోగాలను ఆయా జోన్లలోని స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. 371డీ లోని 1, 3, 9 సెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంది. రాష్ట్రాన్ని విభజించటానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 3 లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఆర్టికల్ 2, 4 ప్రకారం.. ఆర్టికల్ 371డీని సవరించడం వీలు కాదని పలువురు రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. 371డీలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా రాష్ట్ర విభజన సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. అయితే.. ఈ 371డీ ఆర్టికల్‌ను రాజ్యాంగ సవరణతో తొలగిస్తేనే రాష్ట్ర విభజన బిల్లును తీసుకురావటం సాధ్యమవుతుందని తాజాగా అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి కేంద్రానికి నివేదించటం విశేషం. -
సుప్రీం కోర్టుకు అటార్నీ జనరల్ క్షమాపణ
సుప్రీం కోర్టులో బొగ్గు కుంభకోణం కేసు వాదనల సందర్భంగా సహనం కోల్పోయిన భారత అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి క్షమాపణలు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. వాదనల సందర్భంగా వాహనవతి సహనం కోల్పోయి వ్యవహరించారు. ఈ సంఘటన గురించి సుప్రీం కోర్టులో బుధవారం వాహనవతి ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. ధర్మాసనాన్ని అగౌరవ పరచాలన్నది తన ఉద్దేశంకాదని వివరించారు. ఏదేమైనా తాను అలా వ్యవహరించడం సరికాదని, క్షమించాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్ లోధాకు విన్నవించారు. -
అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్!
న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ అటార్నీజనరల్ జీఈ వాహనవతికి ఓ గుర్తుతెలియన మహిళ ఫోన్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంమత్రి సుశీల్‌కుమార్ షిండే సోమవారం తెలిపారు. అటార్నీ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ ఫోన్‌కాల్‌పై ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారన్నారు. ‘సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ గుర్తుతెలియని మహిళ సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫైల్ల విషయమై అటార్నీ జనరల్‌తో మాట్లాడారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనిపై అటార్నీ జనరల్ ఫిర్యాదు చేశారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సమయంలోనే ఆమె పేరుతో ఫోన్ చేసిన మహిళ.. తాను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నానని వాహనవతికి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ ఫోన్ కాల్ ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే మహిళ చేసిందని, కార్యాలయం నుంచే ఏడుసార్లు అటార్నీ జనరల్‌కు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు