తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. సెక్షన్ - 8పై గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కోరితే మాత్రం తాము సలహా ఇస్తామన్నారు. కాగా సెక్షన్ - 8పై కేంద్ర హోం శాఖ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాగే సదరు సెక్షన్పై గవర్నర్కు తను నుంచి కానీ... తమ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సెక్షన్ -8పై ఇప్పటి వరకు న్యాయశాఖ ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదని సదానందగౌడ తెలిపారు.
Published Thu, Jun 25 2015 10:16 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement