section 8
-
RTI Act: సామాన్యుడి వజ్రాయుధం
ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?) మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి. 8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19 (3), సెక్షన్ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు. – డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్ (అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు) -
చంద్రబాబుది చిలిపి చర్య: కేటీఆర్
♦ ఏపీలో విపక్షానికి బదులు చెప్పలేకే సెక్షన్ 8 అంటున్నారని విమర్శ ♦ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ రాజకీయంగా ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేక ‘సెక్షన్ 8’ అంటూ చిలిపి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇది ఏపీలో ప్రతిపక్షానికి రాజకీయంగా సమాధానం చెప్పే సత్తా లేక, అక్కడి ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు బాబు చేస్తున్న చిలిపి ప్రయత్నమే తప్ప మరోటి కాదు. దానివల్ల అయ్యేదీ లేదు, పోయేదీ లేదు. ఈ విషయం లో వారు ఎంత తక్కువమాట్లాడితే అంత మంచిది’’ అన్నారు. తన పర్యటనలో భాగంగా ఐటీమంత్రి రవిశంకర్ ప్రసాద్, పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలను కలసినట్టు కేటీఆర్ వివరించారు. ‘‘రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను వారికి వివరించాను. టీ హబ్‌కు సాయం చేయాలని రవిశంకర్‌ను అడిగాను. మొదటి దశ విజయవంతమైంది. రెండో దశకు రూ.100 కోట్లడిగాను. దాని ప్రారంభానికి ఆహ్వానించాం. ఐటీఐఆర్‌కు రూ.3వేల కోట్లడిగాను. ఐటీఐఆర్‌లో మార్పుచేర్పుల గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు రూ.50 కోట్లు సాయం చేయాలని కోరాం. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని వెంకయ్యను కోరాను. డబుల్ బెడ్రూం, ఇంటింటికి నల్లా పథకాలకు సాయం కోరాం. అమృత్, స్మార్ట్ సిటీ పథకాలను ఆయన వివరించారు. వెంకయ్యను మరోసారి వచ్చి కలుస్తా. అసెంబ్లీ స్థానాలను పెంచాలని, విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సవరణ చేయాలని రాజ్‌నాథ్‌ను కోరాను. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు జైకా రుణం తీసుకున్నాం. కాల పరిమితి పూర్తయినందున దానికి సంబంధించి మిగిలిన రూ.833 కోట్లను వాడుకునేందుకు కేంద్రం అనుమతి లేఖ ఇవ్వాలని జైట్లీని కోరగా అంగీకరించారు’ అని కేటీఆర్ చెప్పారు. -
'కుట్రపూరితంగానే సెక్షన్-8 ప్రస్తావన'
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగానే సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో అప్పుడు చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావించగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆయన తెలిపారు. దొంగలు దొంగలు ఒకటైనట్టుగా కాంగ్రెస్, టీడీపీలు కలిశాయని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
సెక్షన్ -8 అమలు చేయండి
గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతల వినతి మజ్లిస్ ఆగడాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం జాతీయస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయం ఎంపీ అసదుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ 3 డివిజన్లలో రీ పోలింగ్ జరిపించాలని ఈసీకి విజ్ఞప్తి టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను విమర్శించిన చింతల గులాబీ చొక్కా వేసుకోవాలని ఎద్దేవా.. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై అభాండాలొద్దన్న ఎంపీ వీహెచ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, మజ్లిస్ ఆగడాలను ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో మూడు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందని, ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని స్పష్టంచేసింది. బుధవారం శాసనసభ ఆవరణలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఎంఐఎం ఆగడాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి కారకుడైన ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8ని అమలు చేయాలని, దాడులకు పాల్పడ్డ ఎంఐఎం నేతలను అరెస్ట్ చేయాలని కోరారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్‌రెడ్డి(టీడీపీ), కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వి.హనుమంతరావు, రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) పాల్గొన్నారు. పాతబస్తీ తమ సొత్తు అన్నట్టుగా ఎంఐఎం నేతలు వ్యవహరించడాన్ని ఈ సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతలను అడ్డుకోవడం ద్వారా ఎంఐఎం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని విరుచుకుపడ్డారు. ఎంఐఎం ఆగడాల కారణంగా పోలింగ్ నిలిచిపోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. దాడికి ప్రభుత్వానిదే బాధ్యత: జానా ఎంఐఎం దాడి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని, ఈ దాడికి సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అరాచకాలు అత్యంత హేయమైనవని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డ వారిని, వారిని రెచ్చగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైతే పెట్టుబడులు రాకుండా పోతాయని, సామాన్య ప్రజల్లోనూ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం సడలిపోతుందని హెచ్చరించారు. సెక్షన్ 8 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. గవర్నర్ తగిన రీతిలో స్పందించకపోతే జాతీయస్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలిసి ఎంఐఎం ఆగడాలు, అరాచకాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: కె.లక్ష్మణ్ పాతబస్తీలో ఎన్నికల ప్రకియ అంతా మజ్లిస్ కనుసన్నల్లోనే నడిచిందని, ఆ పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే అధికారులు, పోలీసులు పనిచేశారని బీజేపీ శాసనసభా పక్షం నేత లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిస్ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందని, అవసరమైతే సెక్షన్ 8 ఇచ్చిన అధికారాలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోనివ్వకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, ఇతర పార్టీలపై దాడులకు దిగి భయభ్రాంతులను చేసి రిగ్గింగ్ చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. అభినవ నిజాం: ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అభినవ నిజాంలా నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం దాడులు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం, ప్రశ్నించిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిపై సభల్లోనే దాడులకు దిగడం, గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో భౌతికదాడులు చేయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు సీఎం దిగుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు ఉండొద్దన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆగడాలను అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై దాడి: కె.శివకుమార్ ఉత్తమ్, షబ్బీర్‌పై మజ్లిస్ దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాడులకు పాల్పడిన మజ్లిస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ జరపాలి: ఈసీకి వినతి ఎన్నికల్లో అక్రమాలు జరిగిన మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి అఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించారు. పురానాపూల్, మన్సూరాబాద్, జంగంమెట్ డివిజన్లలో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఈ మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు కోరారు. సమగ్ర విచారణ జరపాలి : గవర్నర్‌కు విన్నపం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, గౌస్‌ఖాన్(కాంగ్రెస్), ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), ఎన్.రామచందర్‌రావు, చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) తదితరులు బుధవారం సాయంత్రం గవర్నర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని వివరించారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, పాషా ఖాద్రీ, బలాలా, వారి అనుచరులు దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అన్ని ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. జంగంమెట్‌లో ఎస్సీకి చెందిన మహేందర్ అనే అభ్యర్థిని దూషిస్తూ, దాడికి దిగినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతల వర్సెస్ వీహెచ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డిని అఖిలపక్ష నేతలు కలిసిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశావు.. గులాబీ చొక్కా వేసుకో..’ అని కమిషనర్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగిరెడ్డి నొచ్చుకున్నారు. ‘మీరలా మాట్లాడితే నేను చేయగలిగిందేం లేదు..’ అని బదులిచ్చారు. ఈ దశలో కాంగ్రె స్ ఎంపీ వి.హనుమంతరావు జోక్యం చేసుకుని రాజ్యాంగ పదవిలో ఉన్నవారి పట్ల అనుచితంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. దీంతో చింతలకు, వీహెచ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఖిలపక్ష నేతలు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. -
'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణం గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ తెలిపారు. -
ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిల్
హైదరాబాద్ : ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం... పిటిషన్ విచారణ అర్హతను ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లోగా రూ.లక్ష డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
కోర్టు విలువైన సమయం వృధా చేస్తారా...
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలంటూ దాఖలపై పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. అంతేకాకుండా పిటిషన్లో విచారణకు అర్హమైన అంశాలు లేవంటూ పిటిషనర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్షన్ 8 అమలు చేయాలంటూ సీమాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణ జరపాలంటే నగదు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. దాంతో కేసు వెనక్కి తీసుకుంటానని పిటిషనర్ న్యాయస్థానానికి తెలపడంతో... విలువైన సమయం వృధా చేశారంటూ పిటిషనర్‌పై కోర్టు సీరియస్ అయింది. -
సెక్షన్ 8పై పిల్ సరికాదు
రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు: హైకోర్టు హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టాలని పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ చట్ట నిబంధన చట్టబద్ధతను పిల్ రూపంలో సవాలు చేయడానికి వీల్లేదని, అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని స్పష్టం చేసింది. సెక్షన్ 8పై పిల్ కాకుండా, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తేల్చి చెప్పింది. దీంతో పిటిషనర్లు తమ పిల్‌ను ఉపసంహరించుకుని, రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన రైతు సాంబరాజు పద్మనాభరావు, శ్రీరామగిరి స్పిన్సింగ్ మిల్స్ డెరైక్టర్ (ఫైనాన్స్) అల్లం భిక్షం, న్యాయవాదులు మరిశెట్టి తాతాజీ, కె.మోహన్‌రాజులు సంయుక్తంగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'
సత్యవేడు: హైదరాబాద్‌లో రూ. లక్ష కోట్ల విలువజేసే 1,000 ఎకరాల భూమిని దోచుకున్న భూ రాబందుల బాగోతం టీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుతుందన్న భయంతోనే సెక్షన్ 8 అమలును టీడీపీ కోరుతోందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పనులను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఆ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే నీరు -చెట్టు పేరుతో వెచ్చిస్తోందన్నారు. ఉపాధి పథకం టీడీపీ నాయకుల ఆర్ధికాభివృద్ధి పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాజకీయ సంక్షోభం తప్పదని ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని, చంద్రబాబు స్థానంలో నారా లోకేష్‌బాబు సీఎంగా రావవచ్చని జోస్యం చెప్పారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఈ హాస్పిటల్‌ను విజయవాడకు తరలించేందుకు సదరు మంత్రి ప్రయత్నిస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే.. కాంగ్రెస్ ఊరుకోబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఓ అధికారి రూ. 15 లక్షలు ఓ పెద్ద నేతకు సమర్పించి సత్యవేడుకు వచ్చారన్నారు. -
'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి'
కర్నూలు: సెక్షన్ 8ను తెలంగాణ లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఉంటూ చంద్రబాబు నాయుడు రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షి అంశంలో న్యాయం చేయకపోగా టీడీపీ ఎమ్మెల్యే పక్షాన నిలబడటం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. అధికారులు, ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం తన పని తాను చేయకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. -
'కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8'
-
హత్య చేయడం తప్పుకాదట.. వీడియో తీయడం తప్పా!
హత్య చేయడం తప్పు కాదు గానీ, ఆ హత్య చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడితే, దాన్ని వీడియో తీయడం తప్పని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమేనని, కానీ తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబుకు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వెళ్తూ మార్గం మధ్యలో నక్కపల్లి వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగారు. పాయకరావుపేట నియోజవకర్గ సమస్యలపై పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు ఇచ్చిన వినతిపత్రాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాదే రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు రాష్ట్రాన్ని విభజించాలని పార్లమెంటులో ఆయన ఎంపీలందరూ సంతోషంగా చేతులు ఊపారు చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో మేం ఏ పార్టీకి మద్దతిస్తే నీకేంటి? పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ చట్టంలోని సెక్షన్ -8పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు లంచాలు తీసుకున్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారు కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే -
మాటల గారడీతో మోసం చేయొద్దు: బొత్స
-
మాటల గారడీతో మోసం చేయొద్దు: బొత్స
హైదరాబాద్: విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్ దేనని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అంశంపై రాష్ట్రపతితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రపతితో చంద్రబాబు మాట్లాడినట్టు లేదని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నందున ఆయనతో చర్చలు జరపాలని సూచించారు. మాటల గారడీతో జనాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు. బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు. -
'కేసీఆర్ మొదటి దోషి'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి దోషి అని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ రెండో దోషి అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం వీరిద్దరిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పదేళ్ల వరకు పెత్తనం లేదని సెక్షన్ 8 చెబుతోందన్నారు. గవర్నర్ కే అధికారాలుంటాయని చెప్పారు. ఏదైనా చర్య తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో తమ పోలీస్ స్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
దోపిడీ చరిత్రను తిరగ రాసే కుట్ర!
'సెక్షన్ 8' విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకే తెరపైకి తెచ్చారు రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి 2014 వరకు కొనసాగిన నిధులు, నియామకాలు, వనరుల దోపిడీ చరిత్రను తిరగరాసేందుకే ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగనప్పటికీ వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకు 'సెక్షన్ 8' ను అనైతికంగా తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ నగరశాఖ ఆధ్వర్యంలో 'సెక్షన్ 8 పేరిట హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వం కుట్రలను ఓడిద్దాం' అనే అంశంపై బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సెక్షన్ 8 అనే అంశం రాజ్యాంగబద్ధంగా లేదని, రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ దేశ సమైక్యతకు విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ప్రజాప్రతినిధి కాదని, రాజ్యాంగంలోని విధులు, బాధ్యతలు మాత్రమే ఆయన అధికారాలని వివరించారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి సెక్షన్ 6ను రూపొందించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సెక్షన్ 6 ఎందుకు అమలు కావట్లేదని సీమాంధ్ర ప్రజలు, అక్కడి మేధావులు ప్రశ్నించాలని ఆయన సూచిం చారు. హైదరాబాద్‌లో ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న విషయాన్ని పాలకవర్గాలు గమనించాలన్నారు. రెచ్చగొట్టేందుకే రాజకీయ నేతలు రకరకాల కుట్రలు చేస్తున్నారని... ప్రజల్లో చిచ్చురేపే ఆలోచనలను మానుకోవాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సెక్షన్ 8ను తొలి నుంచీ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారన్నారు. ఏపీ పాలకులు చేసే కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిం చేందుకు త్వరలోనే ఒక పుస్తకం తెస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ అంశాలు ఏపీ మంత్రులకెందుకు?: జేపీ
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 8ను హైదరాబాద్‌లో అమలు చేయాలని అడగాల్సింది ఇక్కడి ప్రజలు గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్మమో, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలో కాదని, తమ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడుకోకుండా పొరుగు రాష్ట్రంలోని సమస్యలు ఏపీ మంత్రులకు ఎందుకని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రజలు తమది ఆంధ్రానా.. తెలంగాణనా అన్న భేదాభిప్రాయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో పాలకులు సెక్షన్ 8 అంశాన్ని వివాదాస్పదం చేసి ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అన్నది కేవలం హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజల శాంతిభద్రతలకు సంబంధించినది మాత్రమేనన్నారు. ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ అన్ని వ్యవహారాలలో తలదూర్చితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గవర్నర్ వ్యవస్థ క్రమంగా లేకుండా పోవాలన్నది తన కోరికగా జయప్రకాష్ నారాయణ చెప్పారు. -
'సెక్షన్-8 అమలు' పిల్‌ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను కట్టబెడుతున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి, ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున దీన్ని ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకా రం సెక్షన్-8 అమలు బాధ్యత గవర్నర్‌దని, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెబుతూ, వ్యాజ్యాన్ని కొట్టేస్త్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
'శత్రుదేశం కన్నా దారుణంగా టీ సర్కారు తీరు'
-
'కేసు నుంచి బయటపడటానికే సెక్షన్ - 8'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికే సెక్షన్ - 8 తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గ సహాచరులు సెక్షన్ -8 అంశం తెరపైకి తీసుకురావడంపై వీహెచ్ ఆదివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కొంత మంది కావాలనే హైదరాబాద్‌లో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. అలాగే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేదన్నారు. తాజా రాజకీయాలపై స్పందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వీహెచ్ డిమాండ్ చేశారు. -
గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు * ఉమ్మడి రాజధాని, సెక్షన్-8పై గవర్నర్దే అధికారం * కానీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు * పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది * ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు * పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది * టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాలపై గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది? పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. ఉద్యోగుల భద్రత, ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామని, చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల గైర్హాజరు... బాబు అసంతృప్తి విస్తృతస్థాయి సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. జర్నలిస్టులకు పెద్ద ఆసరా: సీఎం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలు ఉండే హెల్త్‌కార్డు జర్నలిస్టులకు పెద్ద ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. 14వేలమంది జర్నలిస్టుల్లో 8,321మందికి హెల్త్‌కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. మినీ సెక్రటేరియట్‌కు రూ.3 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకుంటున్న భవనంలోనే ఓ భాగంలో (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది. మంత్రివర్గ సమావేశం 3కి వాయిదా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 3కు వాయిదా పడింది. తొలుత ఈ సమావేశా న్ని జూలై 2న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా సాక్షి, విజయవాడ బ్యూరో: రంజాన్ సం దర్బంగా రాష్ట్రంలోని ముస్లింలకు చం ద్ర న్న రంజాన్ తోఫా ( కానుక)ను ఇస్తున్న ట్టు చంద్రబాబు ప్రకటిచారు. శనివా రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కార్యక్రమం లో సీఎం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కానుకలో రెండు కిలోల పంచదార, కిలో సేమియా, ఐదు కిలోల ఆటా (గోధుమ పిండి) పంపిణీ చేస్తామన్నారు. -
'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'
ఆదిలాబాద్ : ఓటుకు కోట్లు’ వ్యవహరంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం పెద్దల శరణుజోచ్చాడని, ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైదరాబాద్‌లో సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా కూడా సెక్షన్ 8పై లేనిపోని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. ఈ కేసులో ఏసీబీ పకడ్బందీగా విచారణ చేపట్టిందని అన్నారు. తప్పించుకునేందుకు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కుల చేసిన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కేసును కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ధర్మపురిలో కేసీఆర్ పుష్కరస్నానం ఈ పుష్కరాల్లో సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లు మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశాలున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 106 ఘాట్ల నిర్మాణం చేపట్టామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ పనుల్లో నాణ్యత లోపిస్తే విజిలెన్స్, క్యూసీ వంటి సంస్థలతో విచారణ చేపడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పుష్కర స్నానం ఆచరించేందుకు భద్రాచలానికి నాగసాదువులు వచ్చే అవకాశాలున్నాయని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాల్లో రెండు హెలిక్యాప్టర్లను కూడా వినియోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడపాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తారని ప్రకటించారు. అలాగే ఈ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు బెడ్రూంల గృహ ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకోస్తున్నాయని ఐ.కె.రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రెండు లక్షల గృహాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మున్సిపాలిటీల్లో జీ ప్లస్ 1, జీ ప్లస్ 2తో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. -
'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు'
-
'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ డ్రామాల మాస్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతల సమస్య లేనప్పుడు.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం గవర్నర్ నరసింహన్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి కాపురం చేస్తున్నప్పుడు వాళ్లచేతే సెక్షన్ 8 అమలు చేయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసం డ్రామాలెందుకని ఈ సందర్భంగా చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే.. ఆయన వాయిస్ కరెక్టేనని బీజేపీ నమ్మిందని చెవిరెడ్డి పేర్కాన్నారు. ఆ కారణంతో బీజేపీ కార్యకర్త కూడా కనీసం మద్దతివ్వడం లేదన్నారు. పరిపాలన చేసేటప్పుడు హుందాగా ఉందాలని, 'ఓటుకు కోట్లు' కేసులో తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పాలి.. లేదంటే శిక్షకు సిద్ధపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టపగలు దొరికిన దొంగ అని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 'సెక్షన్ - 8' అంశంపై శనివారం మాట్లాడుతూ... దొరికిన దొంగలకు నీతులు చెప్పే హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 పై ఏపీ మంత్రులు అవగాహనతో మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు, ఆయన మంత్రుల్లాంటి వారు దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. -
'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు'
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందంటూ ఆయన విమర్శించారు. సెక్షన్ -8 పై అధికారాలన్నీ గవర్నర్ వేనని, హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పెత్తనమెంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. మా ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగితే రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. -
బాబు అనైతిక పనికి, సెక్షన్ 8కు సంబంధమేంటి?
వైఎస్సార్సీపీ నేత బొత్స సూటిప్రశ్న * ప్రజలదృష్టి మళ్లించేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారు సాక్షి, హైదరాబాద్: సెక్షన్-8తోసహా రాష్ట్ర విభజన చట్టంలో ఏమేమి అంశాలున్నాయో వాటన్నింటినీ కచ్చితంగా అమలుచేసి తీరాలని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చట్టంలోని సెక్షన్-8, సెక్షన్ 95 అమలుతోపాటుగా రాష్ట్రానికిస్తామన్న ప్రత్యేకహోదానూ ప్రకటించాలన్నారు. సీఎం చంద్రబాబు తాను అనైతికమైన పనిలో ఇరుక్కున్నాకనే ప్రజల దృష్టి మళ్లించేందుకు సెక్షన్-8 పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని, ఇంతకాలం ఆయనకీ విషయం గుర్తుకెందుకు రాలేదని బొత్స ధ్వజమెత్తారు. పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. టీడీపీయే ఎప్పుడూ అధికారంలో ఉంటుందనుకోవద్దని, అనైతిక పనులకు మద్దతు నివ్వవద్దని అధికారులకు ఆయన సూచించారు. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపండి.. జగన్మోహన్రెడ్డి ఒక స్టార్ హోటల్లో టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయకుండా టీడీపీ నేతలవద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. తానుచేసిన అనైతిక పనులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సెక్షన్-8 అమలుపై జగన్ ఎందుకు మాట్లాడ్డం లేదని టీడీపీ నేతలడగడం అసమంజసంగా ఉందన్నారు. పార్టీ తరపున ఈ అంశంపై తాము విస్పష్టంగా అనేకసార్లు మాట్లాడామని గుర్తుచేశారు. గత పదిరోజులుగా జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిసి కూడా టీడీపీ నేతలు ఇలా మాట్లాడ్డం చూస్తే ‘తామే తెలివైనవాళ్లం’ అన్నట్లుగా ఎదుటివారిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. -
'తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు'
-
'తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు'
అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదాని, నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే.. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని, రేపు అధికారం చేతులు మారితే.. ఇప్పుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అధికారులు కూడా వ్యవస్థలోనే ఉంటారని, వ్యవస్థ గాడి తప్పితే దాన్ని మళ్లీ గాడిలో పెట్టడం సాధ్యమయ్యే పని కాదని బొత్స చెప్పారు. చట్టప్రకారం మీ కార్యక్రమాలు చేస్తే మాకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించకూడదని అన్నారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఓట్లను కోట్లతో ఎలా కొనుగోలు చేస్తోందో, ఏపీలో కూడా అలాగే చేస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే, చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకోవాలో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారో అర్థమవుతుంది. వ్యవస్థ దారితప్పిదే దాన్ని సక్రమ మార్గంలో పెట్టడం చాలా కష్టం. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం సరికాదనే బలం లేనిచోట పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు వీళ్లు కొత్తగా ఓ డ్రామా తీసుకొచ్చారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో వైఎస్ జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. నిజంగా సాక్ష్యాలుంటే ఏం జరిగిందో చెప్పాలి. అదేమీ లేకుండా ఎక్కడో ఏవో ఎవరో చెబితే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే, ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికే మీ మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. మళ్లీ అలాంటి మోసపు మాటలు చెప్పకండి. ఇక సెక్షన్ 8 గుంచి చూస్తే.. రాష్ట్రవిభజన జరిగిన నేపథ్యంలో పార్లమెంటులో చట్టం అయినప్పుడు, అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టం తు.చ. తప్పకుండా అమలు కావాలనే మేం ముందునుంచి చెబుతున్నాం. అందులో సెక్షన్ 8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందే. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయి. అంతేతప్ప ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోడానికి ఇప్పుడు సెక్షన్-8 అమలు చేయాలనడం తప్పు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని నగరం. ఏడాది పాటు అన్నీ గాలికి వదిలేసి, ఇప్పుడు కేసు వచ్చింది కదాని ఈ సెక్షన్ గురించి మాట్లాడటం సరికాదు''. -
మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు
హైదరాబాద్: సెక్షన్ -8 ఉండాలి... కాని ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో కాట్రగడ్డ ప్రసూన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ విలువ పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను కాట్రగడ్డ ప్రసూన ఖండించారు. తెలంగాణ సచివాలయంలో సెటిలర్స్ కోసం ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయాలని కాట్రగడ్డ ప్రసూన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
-
'గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. సెక్షన్ - 8పై గవర్నర్‌కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కోరితే మాత్రం తాము సలహా ఇస్తామన్నారు. కాగా సెక్షన్ - 8పై కేంద్ర హోం శాఖ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాగే సదరు సెక్షన్‌పై గవర్నర్‌కు తను నుంచి కానీ... తమ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సెక్షన్ -8పై ఇప్పటి వరకు న్యాయశాఖ ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదని సదానందగౌడ తెలిపారు. -
ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8
* ఇప్పుడు కొత్తగా అమలు చేయాలని మంత్రులే కోరడమేమిటి? * ‘ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించడం కోసమే హంగామా * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారమే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం కూడా జరిగిపోయాక, అమలులో ఉన్న చట్టాన్ని కొత్తగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రులు కోరడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు ఇరుక్కున్న తరువాత ఆ విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు సర్కార్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తెలిసినంతవరకు గత ఏడాది జూన్ 2 వ తేదీ నుంచే విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్టేనని చెప్పారు. ఈ సెక్షన్ అమలులోకి రాబట్టే గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం జరిగిందని తెలిపారు. ఏడాది గడిచాక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పట్టుబడిన తర్వాత సెక్షన్ -8 అమలు గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఏపీ సీఎంగా కాకుండా టీడీపీ అధ్యక్ష హోదాలోనో లేదంటే వ్యక్తిగా బాబుకు ఇబ్బందులు ఎదురుకాగానే టీడీపీ నేతలు దీనిని గురించి గగ్గోలు పెడితే జాతీయ స్థాయిలో రాష్ట్రం గురించి ఏమనుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. సెక్షన్-8తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణంతదితర అంశాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశమని రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. -
సెక్షన్-8 సభ రసాభాస
చంద్రబాబును రక్షించేందుకే సెక్షన్ 8ను లేవనెత్తారు మంత్రులను నిలదీసిన విశాఖ న్యాయవాదులు సాక్షి, విశాఖపట్నం: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలనే డిమాండ్‌తో విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సదస్సు రసాభాసగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం తెరవెనుక ఉండి నిర్వహించిన ఈ సదస్సు ఎదురుతిరిగింది. న్యాయవాదులు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంతో నిర్వాహకులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో సదస్సు గందరగోళంగా మారింది. రాష్ట్ర విభజన బిల్లులోని సెక్షన్-8 అమలు, సవరణపై విశాఖపట్నంలో ఓ హోటల్లో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌బాబు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఏపీ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు తదితరులంతా వేదికపై కూర్చొన్నారు. ముందుగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించడాన్ని సీనియర్ న్యాయవాది పలకా శ్రీరామ్మూర్తి వ్యతిరేకించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని అడగాలే గానీ సెక్షన్-8 ఒక్కటే అమలు చేయండని డిమాండ్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘‘ఓటుకు కోట్లు కేసు వచ్చినప్పటినుంచి సెక్షన్-8 గుర్తుకు వచ్చింది. రేవంత్‌రెడ్డి కేసు నుంచి అందరినీ మభ్యపెట్టేందుకే తప్ప ప్రజల కష్టాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు’’అని ఆయన నిలదీశారు. పదవులేమో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. కానీ వారు అవినీతిచేసి దొరికిపోతే బయటపడేందుకు మొత్తం ఐదుకోట్ల ప్రజలను అడ్డుపెట్టుకుంటారా?అని నిలదీశారు. దాంతో నిర్వాహకుల మద్దతుదారులు పెద్దగా అరుస్తూ శ్రీరామ్మూర్తిపై చెయ్యి చేసుకుంటూ సదస్సు ప్రాంగణం నుంచి బయటకు గెంటివేశారు. ఈ ఘర్షణలో శ్రీరామ్మూర్తికి స్వల్ప గాయాలయ్యాయి. న్యాయవాది గాయపరచడమే కాకుండా గెంటివేయడంపై సదస్సుకు హాజరైన రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు, విశాఖపట్నం బార్ అసోషియేషన్ అధ్యక్షుడు జె.పృథ్వీరాజ్ తీవ్రంగా స్పందించారు. సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. దాంతో నిర్వాహకులు ఆయనకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. -
సెక్షన్-8 ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
టీజీవో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్-8ని ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అమలు చేయాలని కోరడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడులు సృష్టించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గెజిటెడ్ భవన్లో బుధవారం టీజీవో ఆధ్వర్యంలో సెక్షన్-8 అంశంపై టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హరగోపాల్ ముఖ్యఅతిథి హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అలజడులులేని సమయంలో సెక్షన్-8 అమలేమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్షన్-8 అమలు జరిగితే శాంతియుతంగా ఉద్యమించాలని సూచించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా సెక్షన్-8ను ప్రయోగిస్తే దీటుగా ఎదుర్కొంటామన్నారు. అవసరమైతే ఢిల్లీని ముట్టడించి కేంద్రాన్ని నిలదీస్తామని, బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో సంఘం గౌరవ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకోవడానికి సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలసి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, ఇంజనీర్స్ జేఏసీ నేత వెంకటేశం, పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత భూమన్న, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, హెచ్ఏఎల్ ఉద్యోగుల సంఘం నేత సి.రాందాస్, వీఆర్వోల సంఘం నేత గోల్కొండ సతీష్, టీఆర్టీయూ నేత సర్వోత్తమరెడ్డి, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం నేత దానకర్ణచారి, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, తెలంగాణ నర్సుల అసోసియేషన్ నాయకురాలు సరళ, టీజీవోలు సలీముద్దీన్, డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబువి నీతిమాలిన రాజకీయాలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకులతో మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయినా కూడా చంద్రబాబుకు సిగ్గురాలేదన్నారు. తాజాగా ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి తగినంత బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటికి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్ 8పై ఢిల్లీలో ఆందోళన చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 28న విజయవాడలో 10 వామపక్ష పార్టీలతో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. -
'ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమిలేదు'
-
'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి'
హైదరాబాద్: సెక్షన్ 8 ఎందుకు అమలు చేయాలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి లబ్ధిపొందేందుకు చంద్రబాబు టీమ్ రాద్ధాంతం చేస్తోందన్నారు. సెక్షన్ 8 అవసరం లేదనడానికి హైదరాబాద్ పరిస్థితులే నిదర్శనమని డీఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తే ప్రజలు సహించరని చెప్పారు. విభజన ప్రక్రియ ప్రశాంతగా జరిగిందని, విఘాతం కలిగించాలని బాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్షన్ 8 అమలు చేస్తే ఆమరణ దీక్ష చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం సరికాదన్నారు. సెక్షన్ 8 అవసరం రాదని మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆనాడే చెప్పామని డీఎస్ తెలిపారు. -
సెక్షన్ 8 రద్దు చేయాలి: టీఎన్జీవోలు
హైదరాబాద్: గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్ 8ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఎన్జీవోలు ఆందోళన బాట పట్టారు. బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారు. సెక్షన్ 8 ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఖమ్మం, వరంగల్‌లో జెడ్పీ కార్యాలయాల ముందు, నల్లగొండ కలెక్టరేట్ ముందు కూడా టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. -
ప్రజలా..? మాస్టర్ మైండా...?
హైదరాబాద్: అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 'ఓటు కోట్లు' వ్యవహారంపై ట్విటర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగబద్దంగా రూపొందించిన ఏ చట్టమైనా, సెక్షనైనా ప్రజలను కేంద్రబిందువుగా చేసుకుని ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం 5 కోట్ల ప్రజల ప్రయోజనాలు కాపాడుతుందా లేదా రూ. 5 కోట్లతో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మాస్టర్ మైండ్ ను కాపాడుతుందా అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా అత్యంత ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో సెక్షన్ 8 పెట్టాలని ఏపీ సర్కారుకు ఇప్పుడు గుర్తుకురావడం శోచనీయమన్నారు. విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సెక్షన్ 8 చెల్లదని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ పై వివాదాలు చేయడం మానుకుని, ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. Whose interest is paramount to Govt of AP:that of 5 crore people of AP or the criminal mastermind in the Rs. 5 crore cash for vote scam? 2/5 — KTR (@KTRTRS) June 24, 2015 -
'అప్రజాస్వామిక విధానాలలో చంద్రబాబు దిట్ట'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలు అవలంభించడంలో చంద్రబాబు దిట్ట అని హరగోపాల్ మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. -
'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'
-
మరో ఆత్మగౌరవ పోరు చేపడతాం
-
అటార్నీ జనరల్ సూచనల్ని అమలు చేయలేను
-
పోరుకు సిద్ధం
‘సెక్షన్-8’పై గవర్నర్‌కు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రతిఘటించేందుకు వెనుకాడం.. మరో ఆత్మగౌరవ పోరు చేపడతాం ఇతర రాష్ట్రాలతో కలసి కేంద్రాన్ని నిలదీస్తాం తప్పించుకునేందుకు చంద్రబాబు,ఏపీ సర్కారు కుట్రలు.. తప్పుదోవ పట్టించేందుకే తెరపైకి సెక్షన్-8 ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతోంది.. ప్రభుత్వ ప్రమేయం లేదు కావాలనే తెలంగాణ సర్కారుపై దుష్ర్పచారం చేస్తున్నారని వ్యాఖ్య ఢిల్లీలో ఆమరణ దీక్షకైనా సిద్ధమన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రతిఘటించేందుకు వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారు సమావేశమయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తనకున్న అధికారాల ప్రకారం గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత పరిణామాలు, జరుగుతున్న కుట్రలను సీఎం ఈ సందర్భంగా గవర్నర్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఏపీ సర్కారు చేస్తున్న కుట్రలు, లోపాయకారీగా జరుగుతున్న దుష్ర్పచారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్‌ను ఏసీబీ అరెస్టు చేసింది మొదలు బేరసారాల కుట్రలో స్వయంగా చంద్రబాబు పాల్గొన్న విషయాలను ఎప్పటికప్పుడు నివేదించామని.. అవన్నీ మీకు తెలియనవి కావని గవర్నర్‌కు కేసీఆర్ మరోసారి గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు, వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ దురుద్దేశంతోనే సెక్షన్-8కు పట్టుపడుతున్నారని వివరించారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని గవర్నర్‌కు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ తన పని తాను చేసుకుంటోందని, ప్రభుత్వ ప్రమేయం ఉండబోదని మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది కాలంలో హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు జరగలేదని, ప్రాంతీయ విద్వేషాలు, ఘర్షణలకు సంబంధించిన కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. శాంతిభద్రతల సమస్య లేనప్పుడు సెక్షన్-8 ప్రస్తావన తీసుకురావడం కుట్రలో భాగమేనని ఫిర్యాదు చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి హైదరాబాద్‌లో అకారణంగా సెక్షన్-8ను అమలు చేయాలని కేంద్రం తలపిస్తే తిప్పికొట్టడానికి వెనుకాడబోమని పేర్కొన్నారు. నిరుడే కేంద్రానికి లేఖ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలోనే హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలనే కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై గత ఏడాది ఆగస్టు 9న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. గవర్నర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్న సూచనలను అమలుచేసే ప్రసక్తే లేదని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సూచనల ప్రకారమే గవర్నర్ విధులు నిర్వహించాలని సెక్షన్-8(3)లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ లేఖ ప్రతిని మంగళవారం నాటి భేటీలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ అందించినట్లు సమాచారం. ఆమరణ దీక్ష చేస్తాం.. సెక్షన్-8ను అమలు చేస్తే ఢిల్లీకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి వెనుకాడేది లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, పార్టీ సన్నిహితులతో జరిగిన సమావేశాల్లో సీఎం ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సమాచారం. కుట్రలను తిప్పికొట్టేందుకు, సెక్షన్-8ను ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. అవసరమైతే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు సమీకరించి కేంద్రంపై ఉద్యమించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పలువురు నేతలు సీఎంకు ఫోన్లు చేసి ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడితే తాము కలిసి వస్తామని తెలిపినట్లు సమాచారం. -
సెక్షన్-8 సెగలు
సెక్షన్-8పై చట్టబద్ధంగా పోరాడతాం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సాక్షి, హైదరాబాద్: సెక్షన్-8 విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాము రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడతామని వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఏసీబీ ఇచ్చే నోటీసులు తీసుకోనని చంద్రబాబు మొండికేస్తే, మెడపట్టి లోపలేస్తరన్నారు. సచివాలయంలో మంగళవారం తలసాని విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తిందా అని ప్రశ్నించారు. ‘నైజీరియా దేశస్తుడు హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కితే మీరెవరు అరెస్టు చేయడానికి అని అడుగుతారా? తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నారు. పుకార్లు పుట్టిస్తున్నరు: కేకే సెక్షన్-8 పై కొన్నివర్గాలు అనవసర పుకార్లు ప్రచారం చేశారని, గవర్నర్‌కు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఒక దొంగ దొరికాడు. దొంగ వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసుకునే పనిలో ఏసీబీ ఉంది’ అని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ... ఏసీబీ చట్టం ప్రకారమే నడుచుకుంటుందని పేర్కొన్నారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని, టేపుల్లో ఉన్న గొంతు తనదో కాదో ఆయన చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని వివరించిన కేకే .. తెలంగాణ తమ అబ్బ జాగీరేనని, బద్మాష్ పనులు చేయమని చట్టం చెప్పదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దొంగలు, నేరస్తులకు ఏపీ అడ్డా: జీవన్‌రెడ్డి దొంగలు, నేరస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డాగా మారుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో దొంగలకు దుబాయ్ అడ్డాగా మారిన చందంగా దేశంలో ఏపీ తయారవుతోందని ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ఏపీ చంద్రబాబు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 15 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సెక్షన్-8తో పని లేదన్నారు. అమలు చేస్తే అగ్నిగుండమే: న్యూడెమోక్రసీ హైదరాబాద్‌లో సెక్షన్-8ను ప్రయోగిస్తే తెలంగాణ అగ్గిలా మండుతుందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజధానిలో దీన్ని ప్రయోగించడమంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించడమేనని అన్నారు. చంద్రబాబు, కేంద్రప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, తెలంగాణ ప్రజలు ఈ నిరంకుశ సెక్షన్ అమలును ప్రతిఘటించి తీరుతారన్నారు. మళ్లీ పరువు తీసుకోవద్దు ఏపీ సీఎం బాబుకు మంత్రి తుమ్మల హితవు సెక్షన్-8 ను మళ్లీ తెరపైకి తీసుకురావడం దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే చర్య అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడి మరోసారి పరువు తీసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన హితవుపలికారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకు ఉన్న హక్కులే తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. దొంగతనం చేసిన వ్యక్తి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో అసహ్యమైన పనికి దిగజారుతున్నారని, చంద్రబాబు చర్యల వల్ల టీడీపీ పరువు బజారుకెక్కిందన్నారు. అసత్య ప్రచారం: కిషన్‌రెడ్డి సెక్షన్ 8పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే కుట్రలో భాగంగానే ఈ దుష్ర్పచారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలన్నారు. ‘తప్పు కప్పిపుచ్చుకునేందుకు బాబు తంటాలు’ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు తప్పును కప్పి పుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. దొంగతనం నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్-8 నాటకం ఆడుతున్నారని మండి పడ్డారు. ఈ కేసులో మత్తయ్య ఎక్కడున్నారని నోముల ప్రశ్నించారు. -
అటార్నీ జనరల్ సూచనల్ని అమలు చేయలేను
తనను కలసిన కేసీఆర్, అధికారులతో గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం కేంద్ర హోంశాఖ, కేంద్ర కేబినెట్ ఆదేశాలు వస్తేనే.. ఆలోగా ‘ఓటుకు కోట్లు’ కేసు పర్యవేక్షణ చేయలేను సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివాదాస్పద సెక్షన్-8 ఆధారంగా... భారత అటార్నీ జనరల్ సూచన మేరకు ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తేల్చారు. ఇదే విషయాన్ని మంగళవారం తనను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ స్పష్టం చేసినట్లు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షించవచ్చునని, ‘ఓటుకు కోట్లు’ కేసును ఉభయ రాష్ట్రాల డీజీపీలను పిలిచి పర్యవేక్షించవచ్చునని భారత అటార్నీ జనరల్ శుక్రవారం సూచించారు. అయితే ఈ సలహా అమలు సాధ్యం కాదని గవర్నర్ తనంతటతానే పక్కనపెట్టారు. అయితే అటార్నీ జనరల్ సూచన వ్యవహారం సోమవారం మీడియాకు ఎక్కడంతో మంగళవారం ఆ అంశానికి ప్రాధాన్యమేర్పడింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు సోమవారమే గవర్నర్‌ను కలసి మీడియాలో వస్తున్న వార్తలపై అడిగి తెలుసుకున్నారు. భారత అటార్నీ జనరల్ సలహా ఇచ్చారని, అయితే దానిని పక్కనపెట్టానని గవర్నర్ వారికి స్పష్టం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌తో గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఇచ్చిన సలహా గురించి గవర్నర్ పేర్కొనడంతోపాటు ఆ సలహాను అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంతోపాటు ‘ఓటుకు కోట్లు’ కేసును గవర్నర్ పర్యవేక్షణ చేయాలంటే కేంద్ర హోంశాఖ తొలుత కేంద్ర కేబినెట్‌కు నివేదిక సమర్పించాలని, దాని ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తేతప్ప తాను ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని నరసింహన్ పేర్కొన్నట్లు సమాచారం. ఉభయ రాష్ట్రాల డీజీపీలను పిలిచి ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించాలంటే.. కేంద్ర హోంశాఖ లేదా కేంద్ర కేబినెట్ ఆదేశాలుండాలని, అవి లేకుండా పర్యవేక్షించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనే అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడగానే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రిని కలసి తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఫిర్యాదు చేయడం తెలిసిందే. అనంతరం గవర్నర్ నరసింహన్ కూడా కేంద్రహోంమంత్రి, ప్రధానిని కలసి.. ఈ వ్యవహారంలో టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి అరెస్టు కావడం. అనంతరం సీఎం చంద్రబాబు ఫోనులో మాట్లాడిన అంశాలు మీడియాలో రావడం గురించి తెలియజేయడమూ విదితమే. ఈ నేపథ్యంలోనే ‘ఓటుకు కోట్లు’ కేసు పర్యవేక్షణపై కేంద్రప్రభుత్వం అటార్నీ జనరల్ సలహా కోరింది. అటార్నీ జనరల్ ఇచ్చిన సలహాను గవర్నర్‌కు పంపించారు. -
సెక్షన్-8పై ఓయూ విద్యార్థి నాయకుల ఆగ్రహం
హైదరాబాద్: సెక్షన్-8 అమలుపై ఓయూ విద్యార్థి నాయకుల ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వల్లమల్ల కృష్ణ, మంద సురేష్, శంకర్‌నాయక్, కరాటే రాజు తదితరులు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపై ఎలాంటి దాడులు, ఇతర గటనలు జరగకున్నా సెక్షన్-8 తెరపైకి తెచ్చి గవర్నర్‌కు శాంతి భద్రతల అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పై ఓయూ విద్యార్థి నాయకులు ధ్వజమెత్తారు. సెక్షన్-8 పైన చంద్రబాబునాయుడు కపట నాటకం ఆపకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వేస్తున్న కొత్త ఎత్తుడగా విద్యార్థి నాయకులు అభివర్ణించారు. -
మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సెక్షన్ 8ని తెరపైకి తెచ్చారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి. -
'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టం ఆమోదించినప్పడు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8 అమలు చేయమంటే ఎందుకు విభేదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 8 అమలుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసవరణ కోసం ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టం రూపకల్పనలో భాగస్వాములైన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. -
'తప్పులు కప్పి పుచ్చుకునేందుకే సెక్షన్ -8'
-
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
హైదరాబాద్: దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల కోసం, దొంగల కొరకు రాజ్యాంగ పరమైన సంస్థల జోక్యం ఉంటుందని మేం అనుకోవడంలేదని పేర్కొన్నారు. సెక్షన్-8 పై అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు. సెక్షన్-8 పై గవర్నర్ నరసింహన్ కు ఎలాంటి ఆదేశాలు వచ్చినట్లు ఇప్పటికీ సమాచారం లేదన్నారు. ఒక దొంగను పట్టుకుంటే..అసలు దొంగ పార్టీ అధ్యక్షుడని దొరికిన దొంగే చెప్పాడని వివరించారు. ఓటుకు కోట్లు కేసును సెక్షన్ 8 తో ముడిపెట్టవద్దని కేకే హితవు పలికారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానిదేనని, ఆ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రిమినల్ విచారణలో ఎవరూ జోక్యం చేసుకున్నా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేకే పేర్కొన్నారు. -
రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం టీఎన్జీవో అత్యవసర సమావేశమై సెక్షన్ 8పై చర్చించారు. అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్‌కు పిలుపు నివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాలు కోరాయి. -
’చంద్రబాబు ఒత్తిడితేవడం దుర్మార్గం’
-
'సెక్షన్ - 8 అంటే మరో ఉద్యమమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపైన ఉన్న ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు సెక్షన్ - 8ను తెరపైకి తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 అంటే మరో ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సెక్షన్ -8లో తప్పేముంది ఇదిలా ఉండగా.. సెక్షన్ -8 అమలు చేస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోనే సెక్షన్ - 8 ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో తమకు ఏమాత్రం రక్షణ లేదని, అందువల్ల ఇక్కడ తప్పనిసరిగా విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరూ డిమాండు చేస్తున్నారు. గవర్నరే శాంతిభద్రతలను చూడాలని తొలుత చెప్పినా.. చివరకు తమ రక్షణను తమ పోలీసులే చూసుకుంటారంటూ పూర్తిగా ఆ అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సెక్షన్ -8 అంటే ఏంటి? రేవంత్ అండ్ కో చేసిన తప్పు నుంచి అది ఎవరికైనా ఉపశమనం కల్పిస్తుందా? ఇంతకీ సెక్షన్-8 ఏం చెబుతోందో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేసినదే సెక్షన్-8. రాష్ట్ర ఆవిర్భావ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ పాలన సజావుగా నిర్వహించే క్రమంలో ఇక్కడి ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తుల రక్షణ విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యత కలిగి ఉంటారు. ఇది సెక్షన్-8లోని మొదటి రూల్. రెండోది శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల రక్షణ, అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి విషయాలపై గవర్నర్ తన బాధ్యతలు విస్తరించవచ్చని చెబుతోంది. మూడో రూల్ విధుల నిర్వహణలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన మీదట గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణ మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని చెబుతోంది. నాలుగో రూల్ గవర్నర్‌కు విధుల్లో సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. మొత్తంగా సెక్షన్ 8 చెప్పేది ఒకటే. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయి. అక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడినపుడు గవర్నర్ ఆ బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి తర్వాత తన విచక్షణ మేరకు చర్యలు చేపట్టవచ్చు. ఆ క్రమంలో శాంతి భద్రతల్లాంటి అంశాలకు కూడా ఆయన బాధ్యతలు విస్తరించవచ్చు. ఇందుకోసం కేంద్రం నియమించిన సలహాదారుల సేవలు వినియోగించుకోవచ్చు. ఆయన చర్యలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఇదీ సెక్షన్ 8 చెప్పే మాట. ఇందులో ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని గానీ లేదా సలహా తీసుకోవాలన్న మాట, ప్రస్తావన లేనే లేదు. అంటే ఏపీ ప్రభుత్వానికి సెక్షన్-8తో ఏ ప్రమేయమూ లేదని చట్టం స్పష్టం చేస్తోంది. ఏపీ పోలీసు బలగాలను హైదరాబాద్ రప్పించడం చట్ట విరుద్ధమన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. చంద్రబాబు చెన్నై వెళ్లినా అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందే తప్ప సొంత రక్షణ తీసుకుపోలేరని వారు గుర్తుచేస్తోంది. కేసులో ఇప్పటికే వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చినందున న్యాయస్థానాల్లో చంద్రబాబుకు ఉపశమనం లభించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
సెక్షన్ 8 ఏం చెప్తోంది..?
-
'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని సెక్షన్ - 8లో పేర్కొన్నారని ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్షన్ -8 చెల్లదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. సెక్షన్ 8 చెల్లకుంటే ఏపీ పునర్విభజన చెల్లుతుందా? అని కేసీఆర్‌ను దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని విభజన చట్టంలో చెప్పారని దేవినేని ఉమా వెల్లడించారు.