హైదరాబాద్: గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్ 8ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఎన్జీవోలు ఆందోళన బాట పట్టారు. బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారు. సెక్షన్ 8 ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఖమ్మం, వరంగల్‌లో జెడ్పీ కార్యాలయాల ముందు, నల్లగొండ కలెక్టరేట్ ముందు కూడా టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు.