హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
హైదరాబాద్: హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
మంగళవారం టీఎన్జీవో అత్యవసర సమావేశమై సెక్షన్ 8పై చర్చించారు. అనంతరం దేవీ ప్రసాద్ మాట్లాడుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్కు పిలుపు నివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్యోగ సంఘాలు కోరాయి.