దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని అమెరికా రాయబార కార్యలయ ముట్టడికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పిలుపు నిచ్చాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ.. సోమవారం బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట భారీగా భద్రతా దళాలు మోహరించాయి.
అమెరికాకు చెందిన ‘‘సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ’’(సీఐఏ) ప్రతి సంవత్సరం ‘‘వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ’’ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్‌లను మిలిటెంట్లుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తుడులకు పాల‍్పడే సంస్థలుగానూ, ఆర్‌ఎస్‌ఎస్‌ను జాతీయ సంస్థగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment