CIA
-
మాజీ ఎమ్మెల్యే పై నోరు పారేసుకున్న సీఐ
-
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
జైల్లో నా భర్తకు ఏమైనా అయితే.. ఇంటూరి రవికిరణ్ భార్య వార్నింగ్
-
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
అమెరికా నిందలో నిజమెంత?
ఖండాంతరాలు దాటి వెళ్లి శత్రువుగా భావించినవారిని చడీచప్పుడూ లేకుండా అంతం చేయటం అంతర్జాతీయంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న కథే. ఈ విషయంలో తరచుగా ఇజ్రాయెల్, రష్యాల పేర్లు వస్తుంటాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఎక్కువగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పేరు వినబడేది. దాని లక్ష్యాలన్నీ దేశాధినేతలే. అది సాగించిన హత్యలపై ఆ సంస్థనుంచి రిటైరైనవారు ఎన్నో పుస్తకాలు రాశారు. సీఐఏ సాగించిన ఆపరేషన్లు ఇతివృత్తంగా 30కి పైగా చలనచిత్రాలొ చ్చాయి. టీవీ సీరియల్స్ కూడా తక్కువేం కాదు. చిత్రమేమంటే ఈమధ్య కొత్తగా వెలుగులోకొచ్చిన సీఐఏ ఫైళ్ల ఆధారంగా ‘ది లుముంబా ప్లాట్’ అనే పేరుతో అప్పటి కాంగో ప్రధాని పాట్రిస్ లుముంబాను 1961లో హతమార్చిన తీరుపై స్టువార్ట్ ఏ. రీడ్ అనే ఆయన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అలాంటి అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉద్యమకారుణ్ణి హతమార్చటానికి జరిగిన కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం వున్నదని అమెరికా ఆరోపిస్తోంది. మొన్న జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించిన తర్వాత ఈ కుట్ర గురించి మన ప్రభుత్వాన్ని అమెరికా హెచ్చరించిందని నవంబర్ 22న బ్రిటన్‌కు చెందిన ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. బుధవారం న్యూయార్క్ సిటీ కోర్టులో ప్రభుత్వ అటార్నీ విలియన్స్ 15 పేజీల అభియోగపత్రాన్ని కూడా దాఖలు చేశారు. అందులో ఈ కుట్ర లక్ష్యం ఎవరన్న పేరు ప్రస్తావించికపోయినా సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు పత్వంత్‌సింగ్ పన్నూన్ అని అక్కడి మీడియా అంటున్నది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఇటువంటి ఆరోపణే చేశారు. అక్కడ దుండగుల కాల్పుల్లో మరణించిన ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర వున్నదని ఆయన అభియోగం. ఇందుకు సంబంధించి మన దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. నిరాధారమైన ఆరోపణ చేయడాన్ని మన దేశం తప్పుబట్టి ప్రతీకారంగా ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోమని కెనడాను కోరింది. ఆ అంకం ముగియకుండానే తాజాగా అమెరికా సైతం ఆ మాదిరి ఆరోపణే చేయటం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా మిత్ర దేశాలమధ్య ఈ తరహా పొరపొచ్చాలు రావు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో మనం సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా వుండటాన్ని జీర్ణించుకోలేక అమెరికా పాకిస్తాన్‌కు అండదండలందించేది. ప్రపంచీకరణ తర్వాత అంతా మారింది. ఇప్పుడు మనకు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా వున్నాయి.ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు భారత్ సహాయసహకారాలు అవసరమని అమెరికా విశ్వసిస్తోంది. తన ఆరోపణను నిర్ద్వంద్వంగా రుజువుచేసే సాక్ష్యాధారాలు అమెరికా దగ్గరున్నాయా? భారత ప్రభుత్వ అధికారి ఒకరు నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ద్వారా ఒక కిరాయి హంతకుణ్ణి వినియోగించి పన్నూన్‌ను హతమార్చటానికి కుట్ర చేశారని అటార్నీ దాఖలు చేసిన అభియోగపత్రం చెబుతోంది. అయితే నిఖిల్ గుప్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక సంస్థ తాలూకు ఏజెంట్‌ను కిరాయి హంతకుడిగా పొరబడి పన్నూన్ హత్యకు లక్షన్నర డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అడ్వాన్స్‌గా 15,000 డాలర్లు అంద జేశాడని అటార్నీ ఆరోపణ. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అభియోగపత్రానికి జత చేశారు. ఈ హత్య చేయించగలిగితే అతనిపై గుజరాత్లో వున్న క్రిమినల్ కేసును రద్దు చేయిస్తానని భారత అధికారి వాగ్దానం చేశారని ఎఫ్‌బీఐ చెబుతోంది. మాదకద్రవ్యాలు, మారణాయుధాల విక్రయం కేసులో నిందితుడైన నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్కు వెళ్లిన సమయంలో అతన్ని అరెస్టు చేయాలంటూ ఎఫ్‌బీఐ కోరటంతో మొన్న జూన్ 30న అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకుని అమెరికాకు అప్పజెప్పారు. కెనడాలో జరిగిన నిజ్జార్ హత్యలో తమ హస్తమున్నదని గుప్తా ఎఫ్‌బీఐ ఏజెంట్ దగ్గర అంగీకరించాడంటున్నారు. ఖలిస్తాన్‌పై రిఫరెండమ్ జరగాలని పత్వంత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు అమెరికా, కెనడా పౌరసత్వాలున్నాయి. ఖలిస్తాన్ వాదాన్ని మన ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. 80, 90 దశకాల్లో ఖలిస్తాన్ పేరిట పంజాబ్‌లో ఉగ్రవాదులు సాగించిన మారణకాండను కఠినంగా అణి చేసింది. 1985 జూన్ 23న 329మంది ప్రయాణికులతో కెనడానుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబులతో పేల్చివేశారు. ఆ విషయంలో కెనడా ప్రభుత్వం భారత్‌కు ఎలాంటి సహకారమూ అందించలేదు సరిగదా...కీలకమైన సాక్ష్యాధారాలను పోలీసులు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలొచ్చాయి. ఈనాటికీ ఈ కేసు అతీగతీ లేకుండాపోయింది. అమెరికా చేసిన ఆరోపణలపై మన దేశం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. అది అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిఖిల్ గుప్తాతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి నిజంగానే ప్రభుత్వాధికారా? అధికారే అయితే అత్యుత్సాహంతో అతను పరిధి దాటి ప్రవర్తించాడా? వేరే దేశాల్లో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం తమ విధానం కాదని నిజ్జార్ కేసు సందర్భంగా మన దేశం చెప్పింది. పైగా పకడ్బందీ వ్యవస్థలు అమల్లోవున్న అమెరికాలో అలాంటి పనికి ఎవరైనా సాహసిస్తారా అన్నది సందేహాస్పదం. పంజాబ్‌లో కనుమరుగైన ఖలిస్తాన్ ఉద్యమాన్ని మన దేశం ఇంత సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది కూడా అనుమానమే. అమెరికా దగ్గరున్న సాక్ష్యాలు నిజంగా అంత బలంగా వున్నాయా, వుంటే దీన్ని తెగేదాకా లాగుతుందా అన్నది చూడాలి. ఈ కేసు సంగతెలావున్నా మన ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మాదిరి ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. -
‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు
వాషింగ్టన్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతి డేవిడ్ పేట్రాయస్ హెచ్చరించారు. తెరిచి ఉన్న కిటికీల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. గతంలో పుతిన్ ప్రత్యర్థులు చాలామంది ఇలా తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడి మరణించారని పేట్రాయస్ పరోక్షంగా తెలియజేశారు. తిరుగుబాటు చర్య నుంచి వెనక్కి తగ్గడం ద్వారా ప్రిగోజిన్ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ వాగ్నర్ గ్రూప్‌ను పోగొట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార పీఠం పెత్తనాన్ని ప్రశ్నించినవారు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. సోవియట్ కూటమిలోనూ, ఆ తర్వాత రష్యాలోనూ ఇలాంటి మరణాలు సంభవించాయి. కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. తనపై తిరుగుబాటు చేసిన వారిని పుతిన్ అంత సులభంగా వదిలిపెట్టబోరని ఆయన గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కడ సురక్షితంగా ఉంటారా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
లీకుల సుడిగుండంలో అమెరికా
ఈ ప్రపంచంలో మూడింటిని దాచిపెట్టడం అసాధ్యమని బుద్ధుడు చెబుతాడు. అవి–సూర్యుడు, చంద్రుడు, సత్యం! ఏ దేశమైనా అంతర్జాతీయంగా తనవారెవరో, కానివారెవరో తెలుసుకోవటానికి నిత్యం ప్రయత్నిస్తుంటుంది. ఎలాంటి వ్యూహాలు పన్నాలో, ఏ ఎత్తుగడలతో స్వీయప్రయోజనాలు కాపాడుకోవాలో అంచనా వేసుకుంటుంది. అందుకు తన వేగుల్ని ఉపయోగిస్తుంది. పరస్పర దౌత్య మర్యాదలకు భంగం లేకుండా చాపకింద నీరులా ఈ పని సాగిపోతుంటుంది. ఈ విషయంలో అమె రికాది అందె వేసిన చేయి. నిఘా నిజమైనప్పుడు అది ఎన్నాళ్లు దాగుతుంది? తాజాగా బజారున పడిన అత్యంత రహస్యమైన పత్రాలు అమెరికాను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేశాయి. శత్రువులు సరే...దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లాంటి దేశాలు సైతం తమపై అమెరికా నిఘా పెట్టిందన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక దాని ప్రధాన ప్రత్యర్థి రష్యా గురించి చెప్పేదేముంది? ఆ దేశ రక్షణశాఖలోకి అమెరికా నిఘా విభాగం ఎలా చొచ్చుకుపోయిందో ప్రస్తుతం వెల్లడైన రహస్యపత్రాలు తెలియజెబుతున్నాయి. అలా సేకరించిన సమాచారం ఆధారంగా ఉక్రెయి న్కు సలహాలిస్తూ రష్యాపై దాని యుద్ధవ్యూహాలను పదునెక్కిస్తున్న వైనం బయట పడింది. ఉక్రె యిన్ వ్యూహాలపై, అది తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాకు ఎలాంటి అభి ప్రాయాలున్నాయో ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యాకు వరస అపజయాలు ఎదురయ్యాయి. గతంలో స్వాధీనమైన నగరాల నుంచి అది తప్పుకోక తప్పనిస్థితి ఏర్పడింది. వీటన్నిటి వెనుక అమెరికా మార్గదర్శకం ఉన్నదని పత్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ నకిలీ పత్రాలని ఉక్రెయిన్ సైని కాధికారులు దబాయిస్తున్నా పెంటగాన్ మాత్రం ఆ పని చేయలేకపోతోంది. ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతంపై ఏ రోజున ఎన్ని గంటలకు రష్యా సైన్యం దాడి చేయదల్చుకున్నదో అమెరికా నిఘా సంస్థ ఎప్పటికప్పుడు ఆ దేశాన్ని హెచ్చరించిన వైనాన్ని ఈ పత్రాలు బయటపెట్టాయి. అయితే సందట్లో సడేమియాలా లీకైన ఈ పత్రాల్లో ఫొటోషాప్ ద్వారా తనకు అనుకూలమైన మార్పులు చేర్పులూ చేసి ప్రత్యర్థులను గందరగోళపరచడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ఎవరి ప్రయోజనం వారిది! సరిగ్గా పదమూడేళ్లక్రితం జూలియన్ అసాంజ్ వికీలీక్స్ ద్వారా అమెరికాకు సంబంధించిన లక్షలాది కీలకపత్రాలు వెల్లడించాడు. ఆ తర్వాత సైతం ఆ సంస్థ అడపా దడపా రహస్య పత్రాలు వెల్లడిస్తూ అమెరికాకు దడపుట్టిస్తోంది. తాజా లీక్‌లు ఎవరి పుణ్యమో ఇంకా తేలాల్సివుంది. సాధా రణ పరిస్థితుల్లో ఇలాంటి లీక్‌లు పెద్దగా సమస్యలు సృష్టించవు. గతంలో అసాంజ్ బయటపెట్టిన పత్రాలు అంతక్రితం నాలుగైదేళ్లనాటివి. అవి గతించిన కాలానివి కనుక నిఘా బారిన పడిన దేశం చడీచప్పుడూ లేకుండా తన వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసుకుంటుంది. ఆ పత్రాల్లో ప్రస్తావనకొచ్చిన ఉదంతాల తీవ్రత కూడా చల్లబడుతుంది. కానీ ఈ పత్రాలు ఇటీవల కాలానివి. కేవలం 40 రోజులనాటివి. ఉక్రెయిన్ ఇంకా రష్యాతో పోరు సాగిస్తూనే ఉంది. సైన్యం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అది తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలూ, అందుకోసం అనుసరిస్తున్న వ్యూహాలూ ఇంత వెనువెంటనే బట్టబయలు కావటం దాన్ని దెబ్బతీస్తాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా వైమానిక యుద్ధంలో ఉక్రెయిన్ బలహీనంగా ఉన్న వైనం బయటపడటం ఆ దేశానికి ముప్పు కలిగించేదే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ పనితీరు కూడా ఈ పత్రాల ద్వారా బయటపడింది. రష్యా రక్షణ శాఖలోని ముఖ్యవ్యక్తుల ఫోన్ సంభాషణలు ఆ సంస్థ వేగులు వింటున్నారని, వారి మధ్య బట్వాటా అయ్యే సందేశాలు సంగ్రహిస్తున్నారని, వీటి ఆధారంగానే దాని రోజువారీ నివేదికలు రూపొందుతున్నాయని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి. అయితే ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగుతున్న యుద్ధంలో పెద్దగా పైచేయి సాధించలేకపోయిన రష్యాకూ ఈ లీక్‌లు తోడ్పడతాయి. ఉక్రెయిన్ విజయం సాధించటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో, ఇందులో తమ వైపు జరుగుతున్న లోపాలేమిటో తెలి యటం వల్ల రష్యా తన వ్యూహాలను మార్చుకోవటం సులభమవుతుంది. అంతేకాదు...తన రక్షణ వ్యవస్థలోని ఏయే విభాగాల్లో అమెరికా నిఘా నేత్రాలు చొరబడ్డాయో ఈ లీక్లద్వారా గ్రహించి సొంతింటిని చక్కదిద్దుకునేందుకు రష్యాకు అవకాశం దొరికింది. అయితే అదే సమయంలో తల్చుకుంటే ప్రత్యర్థి శిబిరంలోకి అమెరికా ఎంత చురుగ్గా చొచ్చుకు పోగలదో, ఎలాంటి కీలక సమాచారం సేకరించగలదో ఈ వ్యవహారం తేటతెల్లం చేసింది. దాని సంగతెలావున్నా ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహూ తలపెట్టిన న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా పెల్లుబికిన ఉద్యమం వెనుక ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ హస్తమున్నదని అమెరికా అంచనా కొచ్చిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అభిప్రాయం తప్పని ఇజ్రాయెల్ చెబుతున్నా నిజమేమిటో మున్ముందు బయటపడక తప్పదు. కానీ నిఘాలో ఇంతటి చాకచక్యాన్ని ప్రదర్శించే అమెరికాను సైతం బోల్తా కొట్టించగల అరివీర భయంకరులున్నారని తాజా లీకులు చెప్పకనే చెబుతున్నాయి. ఇవి ఎక్కడినుంచో కాదు...సాక్షాత్తూ పెంటగాన్ కార్యాలయం నుంచే బయటికొచ్చాయని పత్రాల్లోని సమాచారం చూస్తే అర్థమవుతుంది. ఇతర దేశాలపై నిఘా మాట అటుంచి స్వగృహ ప్రక్షాళనకు నడుం కట్టకతప్పదని అమెరికాను తాజా లీకులు హెచ్చరిస్తున్నాయి. అభిప్రాయాలు, అంచనాలు ఏవైనా...మస్తిష్కంలో ఉన్నంత వరకే వాటికి రక్షణ. అవి రహస్యపత్రాలుగా అవతారమెత్తిన మరుక్షణం ఎక్కడెక్కడికి ఎగురుకుంటూ పోతాయో చెప్పటం అసాధ్యమని తాజా వ్యవహారం తేటతెల్లం చేస్తోంది. అగ్రరాజ్యం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకతప్పదు. -
హెల్ఫైర్ మిసైల్.. తిరుగులేని మారణాస్త్రం
అల్‌ఖైదా నంబర్ 2గా ఉన్న అహ్మద్ హసన్ అబూ ఖైర్ అల్‌మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి. 2000లో యెమన్‌లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్ అహ్మద్ అల్ బదావీని 2019లో హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తోనే సీఐఏ మట్టుబెట్టింది. ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్ఫైర్తోనే మట్టుబెట్టింది. 2020లో ఇరాన్‌కు చెందిన మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్ఫైర్ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్‌ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్‌ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్‌ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్‌హీడ్ మార్టిన్–నార్త్రోప్ గమ్మన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్‌స్ట్రీట్ జర్నల్ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్ఫైర్కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్9ఎక్స్ రకం. ఇది వార్‌హెడ్ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి. దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్లాన్ బీగా హెల్ఫైర్ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్ఫైర్ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్ విజయవంతంగా పని పూర్తి చేశారు. -
చైనా దారుణాలతోనే శ్రీలంకకు ప్రస్తుత దుస్థితి!
వాషింగ్టన్: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పతనానికి చైనానే కారణమని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్ విలియమ్ బర్న్స్ ఆరోపించారు. చైనా పెట్టుబడులపై కొలంబో 'మూగ పందాలు' వేసిందని, అదే విపత్తు పరిస్థితులకు దారి తీసిందన్నారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్‌లో మాట్లాడారు సీఐఏ చీఫ్. ‘చైనీయులు తమ పెట్టుబడుల కోసం ముందు ఆకర్షనీయమైన చర్యలు చేపడతారు. ఆ తర్వాతే అసలు విషయం బయటకు వస్తుంది. చైనా వద్ద భారీగా అప్పులు చేసిన శ్రీలంక పరిస్థితులను ప్రపంచ దేశాలు ఓసారి చూడాలి. వారు తమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై మూగ పందాలు వేశారు. ఇప్పుడు విపత్తు వంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. దాని ద్వారా ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారి తీసింది.’ అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని దేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు సైతం శ్రీలంక పరిస్థితులు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు సీఐఏ చీఫ్. చైనాతో శ్రీలంక ఏ విధంగా వ్యవహరించిందే ఓసారి పరిశీలించాలని సూచించారు. చైనాతో పాటు చాలా దేశాల నుంచి శ్రీలంక అప్పులు చేసిందని గుర్తు చేశారు. 2017లో 1.4 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఓ పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చిందని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో భౌగోళికంగా అమెరికాకు చైనానే ఏకైక సవాలుగా పేర్కొన్నారు. తాహతకు మించి అప్పులు చేస్తున్న దేశాలు శ్రీలంకను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా గత శనివారం హెచ్చరించారు. ఆయా దేశాలకు ఇదొక హెచ్చరికగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్ హెచ్చరిక చేసిన కొద్ది రోజుల్లోనే సీఐఏ చీఫ్ ఈ వాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 1948, స్వాతంత్య్రం సాధించిన తర్వాత శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరైన ఆహారం, ఔషదాలు, వంట గ్యాస్, చమురు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణం.. గొటబయ రాజపక్స స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రణీల్ విక్రమ సింఘే.. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. బుధవారమే విక్రమ సింఘేను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుంది పార్లమెంట్. సింఘేకు 134 ఓట్లు వచ్చాయి. ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన -
సీఐఏ తొలి సీటీఓగా మూల్‌చందానీ
వాషింగ్టన్: అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ స్కూల్లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్ అన్నారు. సీఐఏలో స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని మూల్‌చందానీ అన్నారు. -
నిర్మాణ సామగ్రి పరిశ్రమలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో నిర్మాణ రంగ యంత్ర సామగ్రి తయారీదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లోనూ నిర్మాణరంగ యంత్రపరికరాల తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వీటి తయారీదారులు ఏటా నిర్వహించే ‘ఎక్స్‌కాన్’వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు. హైస్పీడ్ నెట్వర్క్, నూతన ఎయిర్‌పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి మౌలిక వసతుల ద్వారానే భారత్ అగ్ర దేశాల సరసన చేరుతుందన్నారు. దీనిలో కీలక పాత్ర పోషించే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కరోనా సంక్షోభంలోనూ వలస కార్మికులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది. సిమెంటు ధరల తగ్గింపు దిశగా చర్యలు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో నిర్మాణ రంగం గత ఆరేళ్లుగా అభివృద్ధిపథాన కొనసాగుతోందని, కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు మార్గనిర్దేశంపై చర్చించేందుకు శనివారం ప్రగతిభవన్‌లో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సిమెంట్ ధరల పెరుగుదలపట్ల నిర్మాణరంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయగా, ధరల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. దేశంలోని ఇతర మెట్రోనగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పర్వాలేదని నిర్మాణ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి వారిచ్చిన సూచనల పట్ల మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రస్తుతంæ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలని, సంక్షోభ సమయాల్లో వారికి తొందరగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తామని నిర్మాణ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్ ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వివిధ వస్తువుల పుట్టుపూర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్–జీఐ) గుర్తులు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువుల కు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా విడుదలైన ‘ఈ బుక్’ద్వారా రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సా«ధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ‘ఈ బుక్’ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాం డ్ సాధించి పేరు గడించాలని కేటీఆర్ సూచిం చారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
మాజీ పోలీస్.. 8 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు అస్లుప్.. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్సై. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు దారితప్పి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి వరుస నేరాలు చేస్తూ ఎనిమిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. గత వారం హరియాణాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) ఇతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అస్లుప్ అంగీకరించాడు. దీనిపై తమకు అధికారిక సమాచారం లేదని ఇక్కడి పోలీసులు చెబుతున్నారు. ఎస్సై దొంగగా మారాడిలా.. హరియాణాలోని నుహ్ జిల్లాకు చెందిన అస్లుప్ పదేళ్ల క్రితం ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. జల్సాలకు అలవాటుపడి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పెడదారి పట్టాడు. కొందరు నేరగాళ్లకు సహకరిస్తూ వారితో చోరీలు, దోపిడీలు చేయించేవాడు. చోరీ సొత్తును విక్రయించడానికి సహకరిస్తూ భారీగా కమీషన్లు తీసుకునేవాడు. ఆరేళ్ల క్రితం ఇది గుర్తించిన ఢిల్లీ పోలీసులు అస్లుప్‌ను అరెస్టు చేశారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన అతడు జైలు నుంచి బయటకొచ్చాక నేరాలు చేయడాన్నే వృత్తిగా చేసుకున్నాడు. ఏటీఎంల్లో చోరీలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. పోలీసులకు చిక్కకుండా, తన ఉనికి బయటపడకుండా ఈ నేరాలన్నీ ఒంటరిగానే చేసేవాడు. హైదరాబాద్‌తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో మొత్తం 24 నేరాలు చేసిన ఇతడు మోస్ట్ వాంటెట్‌గా మారాడు. హరియాణా పోలీసులు రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు. హైదరాబాద్‌లోనూ అస్లుప్ నేరాలు? హరియాణాకు చెందిన సీఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అస్లుప్‌పై నిఘా ఉంచింది. గత శుక్రవారం.. ఢిల్లీ–అల్వాల్ హైవేపై ఉన్న కేఎంపీ రోడ్‌లోని రేవాసన్ హోటల్ వద్ద ఇతడిని వలపన్ని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అస్లుప్‌ను కోర్టులో హాజరుపరిచిన సీఐఏ తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుంది. అనంతరం ఇతడికి సంబంధించి కేసులున్న ఇతర నగరాల పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి దీనిపై మాట్లాడుతూ... ‘అస్లుప్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఎక్కడెక్కడ నేరాలు చేశాడనేది ఇప్పుడే చెప్పలేం. హరియాణా పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందితే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఎదురు చూడాల్సిందే’అని చెప్పారు. -
సౌదీ రాజుతో గినా భేటి అందుకేనా?
రియాద్ : సౌదీ అరేబియా రాజు సల్మాన్ అమెరికా గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ) డైరెక్టర్ గినా హాస్పెల్‌తో సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ భేటిలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడేందుకు చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో సౌదీ రాజుతో పాటు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, ఇంటలెజిన్స్ చీఫ్ ఖలీద్ అల్ హమ్దీన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ముగ్గురు సౌదీ పౌరులపై బుధవారం అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు సౌదీ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి(సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌గా ఆరోపణలు ఉన్నాయి) ట్విటర్ ఖాతాతో అమెరికాలో గూఢచర్యం నెరిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ రాజు గినా హాస్పెల్‌తో అత్యవసరంగా సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ టర్కీలో గతేడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్ అదృశ్యం కావడంతో సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న తమ దేశంలో నివసిస్తున్న సౌదీ పౌరులపై దర్యాప్తునకు ఆదేశించింది. అదే విధంగా ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియా రాజే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖషోగ్గీ హత్య కేసును నీరుగార్చేందుకే సౌదీ రాజు గినాతో చర్చలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ భేటీ అనంతరం సౌదీ అధికారి మాట్లాడుతూ... తమ దేశ పౌరులు ఏ దేశంలో నివసిస్తున్నా సరే అక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ విఙ్ఞప్తి చేయడం గమనార్హం. -
యువరాజే చంపమన్నారు!
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్, వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ(సీఐఏ) నిర్ధారణకు వచ్చినట్టు యూఎస్ మీడియా వెల్లడించింది. ఆయన ఆదేశాల మేరకే ఖషోగ్గీని పథకం ప్రకారం అంతమొందించినట్టు తెలిపింది. సౌదీకి చెందిన 15 మంది ఏజెంట్లు ప్రభుత్వ విమానంలో ఇస్తాంబుల్ వెళ్లి, సౌదీ రాయబారా కార్యాలయంలో ఖషోగ్గీని హత్య చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. యువరాజు మహ్మద్ బిన్ సోదరుడు, అమెరికాలోని సౌదీ రాయబారి ఖలీద్ బిన్ సల్మాన్ ద్వారా ఖషోగ్గీని ఇస్తాంబుల్‌కు రప్పించినట్టు సీఐఏ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఇస్తాంబుల్‌లోని తమ కాన్సులేట్‌కు వెళ్లి ఖషోగ్గీకి అవసరమైన పత్రాలు తీసుకోవాలని, ఎటువంటి ముప్పు ఉండబోదని ఆయనతో ఫోన్లో ఖలీద్ బిన్ చెప్పినట్టు సమాచారం. దీన్ని సౌదీ కాన్సులేట్ తోసిపుచ్చింది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. టర్కీకి వెళ్లే విషయం గురించి ఖషోగ్గీతో ఖలీద్ బిన్ మాట్లాడలేదని సౌదీ ఎంబసీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. టర్కీ మహిళను పెళ్లాడేందుకు అవసరమైన పత్రాల కోసం వెళ్లి ఆయనను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు. ఖషోగ్గీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సీఐఏ సంపాదించలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఖషోగ్గీ హత్య చేసిన బృందంలో సభ్యులు ఫోన్లో యువరాజు సన్నిహితులతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ప్రమేయం ఉందన్న అంచనాకు వచ్చిందని వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఖషోగ్గీ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా చెబుతోంది. ఖషోగ్గీ నన్ను పెళ్లాడారు జమాల్ ఖషోగ్గీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను పెళ్లాడారంటూ ఈజిప్టు మహిళ ఒకరు తెరపైకి వచ్చారు. వాషింగ్టన్లో జూన్ నెలలో తాము పెళ్లి చేసుకున్నామని ‘వాషింగ్టన్ పోస్ట్’తో చెప్పారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ‘ముస్లిం భార్యగా గుర్తింపు కోరుకునే పూర్తి హక్కు తనకుంద’ని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఖషోగ్గీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈజిప్టు మహిళను ఖషోగ్గీ పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ఆయనను పెళ్లాడాలనుకున్న టర్కీ మహిళ హార్టిస్ సెంగిజ్ చెప్పారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
అమెరికాపై చైనా ప్రచ్ఛన్నయుద్ధం
ఆస్పెన్: అగ్రరాజ్యంగా అమెరికా స్థానాన్ని ఆక్రమించేందుకు చైనా ప్రచ్ఛన్నయుద్ధం చేస్తోందని అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) వెల్లడించింది. ఇందుకోసం అన్ని వనరులను చైనా వినియోగించుకుంటోందని అమెరికాకు చెందిన సీఐఏ నిపుణుడు (ఆసియా వ్యవహారాల) మైకేల్ కొలిన్స్ తెలిపారు. కొలిన్స్ వ్యాఖ్యలు చైనా ప్రభావం వేగంగా పెరుగుతోందన్న హెచ్చరికలను సూచిస్తోంది. ‘చైనా యుద్ధం చేయాలనుకోవడం లేదు. కానీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం అమెరికా ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తోంది. నేరుగా యుద్ధం చేయలేక ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఆశ్రయిస్తోందని నేను బలంగా చెప్పగలను. ఇది మనం చూసిన అమెరికా–రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధంలా లేదు. కాస్త భిన్నంగా ఉంది’ అని కొలరాడోలో జరిగిన ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సదస్సులో కొలిన్స్ పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు వ్యాపార వివాదాలను దాటి.. ఇరుదేశాలు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరాయన్నారు. ‘అమెరికాలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సాంకేతికత పరిశోధనలకు, వ్యాపార రహస్యాలను చైనా తస్కరిస్తోంది. తన మిలటరీని విస్తరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివిధ ద్వీపాల్లో సైనిక స్థావరాలను ఆధునికీకరిస్తోందని అమెరికా సహా మిగిలిన దేశాలు ఐరాసకు ఫిర్యాదు చేశాయి. ఈ ద్వీపాలన్నీ తూర్పు క్రిమియాలుగా మారిపోతున్నాయి’ అని మైకేల్ కొలిన్స్ వెల్లడించారు. -
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది. హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా ప్రకటించింది. -
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని అమెరికా రాయబార కార్యలయ ముట్టడికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పిలుపు నిచ్చాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ.. సోమవారం బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట భారీగా భద్రతా దళాలు మోహరించాయి. అమెరికాకు చెందిన ‘‘సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ’’(సీఐఏ) ప్రతి సంవత్సరం ‘‘వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ’’ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తుడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా పేర్కొంది. -
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌లకు సీఐఏ షాక్
న్యూయార్క్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్లను మత ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రభుత్వ నిఘా విభాగం సీఐఏ తన వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ తాజా సంచికలో పేర్కొంది. ఈ సంస్థలను రాజకీయ ఒత్తిడి గ్రూపుల విభాగంలో చేర్చింది. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను పెంచే ఈ సంస్థల నేతలు మాత్రం చట్టసభల్లో తలదూర్చరని వీటి స్వభావాన్ని నిర్వచిస్తూ సీఐఏ పేర్కొంది. భారత్‌లో రాజకీయ ప్రెజర్ గ్రూప్స్‌లో ఆరెస్సెస్, హురియత్ కాన్ఫరెన్స్, జమౌతే ఉలేమా ఇ హింద్ తదితర సంస్థలను సీఐఏ పొందుపరిచింది. అయితే ఆరెస్సెస్‌ను జాతీయవాద సంస్థగా నిర్వచించిన సీఐఏ హురియత్ కాన్ఫరేన్స్ను వేర్పాటువాద గ్రూపుగా, జమైతే ఉలేమా ఇ హింద్‌ను మత సంస్థగా పేర్కొంది. సీఐఏ ఏటా వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్‌లో ప్రపంచ దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, సంస్థల వివరాలను ప్రచురిస్తుంది. అమెరికా విధాన రూపకర్తలకు, నిఘావర్గాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం మెరుగైన వనరుగా భావిస్తారు. -
చిచ్చురేపిన గూఢచర్యం
దేశాల మధ్య ఉండే సంబంధాలు చిత్రమైనవి. పరస్పరం కత్తులు నూరుకునే దేశాలు మాత్రమే కాదు... స్నేహంగా ఉంటున్న దేశాలు సైతం అవతలి పక్షం తీరుతెన్నుల గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయిదేళ్ల క్రితం సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా దశాబ్దాలుగా శత్రు దేశాలపైన మాత్రమే కాదు... సన్నిహిత దేశాలపై కూడా ఎలా నిఘా పెట్టిందో బట్టబయలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బ్రిటన్–రష్యాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ అలాంటి గూఢచార కార్యకలాపాల పర్యవసానమే. రష్యా సైనిక ఇంటెలిజెన్స్ కల్నల్‌గా పనిచేసిన సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియా స్క్రిపాల్ బ్రిటన్‌లోని శాలిస్బరీ పట్టణంలో ఒక షాపింగ్ మాల్ వద్ద ఈ నెల 4న అపస్మారకస్థితిలో పడి ఆసుపత్రిపాలైన ఉదంతం బ్రిటన్, రష్యాలమధ్య చిచ్చు రేపింది. వీరిద్దరిపైనా విష రసాయన ప్రయోగం జరిగిందన్నది ఆరోపణ. పర్యవ సానంగా రష్యా రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 23మంది దౌత్యాధికా రులు తక్షణం దేశం విడిచి వెళ్లాలంటూ బ్రిటన్ హుకుం జారీ చేసింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇలా పరస్పరం దౌత్యాధికారులను బహిష్కరించుకున్న చరిత్ర ఉంది. ఆ సంప్రదాయం మళ్లీ మొదలుకావడం ఆందోళన కలిగిస్తుండగా ఈ గొడ వలో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా కూడా తలదూర్చాయి. ఈ ఉదంతంలో రష్యా తక్షణం సంజాయిషీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఉదంతంతో తమకేమాత్రం సంబంధం లేదని రష్యా అంటున్నది. సెర్గీ స్క్రిపాల్ రష్యా పౌరుడు, ఆ దేశ సైనిక ఇంటెలిజెన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేసినవాడు. వేరే దేశాలపై నిఘా ఉంచి సమాచారం రాబట్టాల్సిన స్క్రిపాల్ యూరప్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న గూఢచారులు, వారి చిరునామాలు, వారి మారుపేర్లు వగైరాలను పదేళ్లపాటు బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6కు అందజేశాడు. 2003లో పట్టుబడ్డాడు. ఈ కేసు పర్యవసానంగా అతని ఉద్యోగం పోవడంతోపాటు దేశద్రోహ నేరంకింద జైలు శిక్ష కూడా పడింది. 2010లో బ్రిటన్, రష్యాల మధ్య గూఢచారుల మార్పిడి ఒప్పందం కింద స్క్రిపాల్ విడుదలై బ్రిటన్ వెళ్లి పోయాడు. సాధారణంగా అయితే అక్కడితో ఆ వ్యవహారం ముగిసి పోవాల్సింది. కానీ రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అది గతంలో సైతం ఇలా డబుల్ ఏజెంట్లుగా పని చేసిన ‘ద్రోహుల్ని’ వదల్లేదు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో పనిచేస్తూ అనంతర కాలంలో పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారి బ్రిట న్కు వెళ్లిపోయిన అలెగ్జాండర్ లిత్వినెంకోను ఇదే తరహాలో 2006లో మట్టుబె ట్టారు. రష్యా వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్స్కీని చంపడానికి పుతిన్ ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించి లిత్వినెంకో పుతిన్ ఆగ్రహానికి గురయ్యాడు. లిత్వినెం కోపై గుర్తు తెలియని వ్యక్తులు పొలో నియం–210 అనే అణుధార్మిక పదార్థాన్ని ప్రయోగించారని బ్రిటన్ పోలీసులు నిర్ధా రించారు. తమ భూభాగంలో లిత్వినెం కోపై విషప్రయోగం జరిపిన రష్యా పౌరుణ్ణి బ్రిటన్ గుర్తించి అప్పగించమని కోరినా పుతిన్ ప్రభుత్వం అంగీకరించలేదు. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు విదేశాల్లో పర్యటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్నేహసంబంధాలు నెరపడం సర్వసాధారణం. దీనికి సమాంత రంగా ఆ దేశాల్లోనే గూఢచారులను నియమించుకుని వారిద్వారా సొంతంగా సమా చారం రాబట్టుకోవడం ఇంచుమించు ప్రతి దేశమూ చేసే పని. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అమెరికా ఈ విషయంలో ఆరితేరింది. అది ధూర్త దేశాలుగా పరిగణిస్తున్న ఇరాన్, ఉత్తరకొరియా, సిరియా వంటి దేశాలపై మాత్రమే కాదు... తనకు సన్నిహితంగా మెలగుతున్న బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలపై కూడా గూఢచర్యం సాగించింది. ఎడ్వర్డ్ స్నోడెన్ వీటిని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించి అందరినీ నివ్వెరపరిచాడు. అమెరికా నిఘాకు బలైన దేశాల్లో మన దేశం కూడా ఉంది. శత్రు దేశాల ఎత్తుగడలేమిటో, ఆ దేశాల్లో అంతర్గత పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకోవడంలో వింతేమీ లేదు. శత్రుదేశం కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండ టం సాధారణం. కానీ మిత్ర దేశాలుగా ఉంటూ పరస్పరం సహకరించుకునే దేశాలు సైతం అవతలి దేశం ఏం చేస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రతి దేశమూ తమ సమస్త సమాచారాన్నీ బట్టబయలు చేసుకోదు. ఎంత మిత్రదేశమైనా చెప్పవలసినదేమిటో, చెప్పకూడనిదేమిటో పరిమితులు విధించుకుంటుంది. తమ సమాచారం బయటికిపొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవతలి దేశం గుట్టు లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా ఎవరికి వారు సాగించే నిఘా కార్యకలా పాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగడానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహమేమిటో తమకు కేబినెట్ మంత్రి ద్వారా తెలిసేదని అప్పటి సీఐఏ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్ ప్రకటించాడు. 2009లో లండన్‌లో జరిగిన జీ–20 దేశాల సమావేశాలపై అమెరికా నిఘా పెట్టి వివిధ దేశాల ప్రతినిధి బృందాలు తమలో తాము మాట్లాడుకున్న సంభాషణల్ని రికార్డు చేసిందని స్నోడెన్ అయిదేళ్లక్రితం బయటపెట్టాడు. ఏ దేశం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నదో తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసు కోవడం అమెరికా చర్యలోని ఆంతర్యం. జీ–20లో ఒకటి రెండు మినహా అన్నీ అమెరికా మిత్ర దేశాలే. పైగా ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్ అత్యంత సన్నిహిత దేశం. అయినా అమెరికా తన పోకడ మానుకోలేదు. ఇప్పుడు స్క్రిపాల్, అతని కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వీరిపై ప్రయో గించిన పదార్థం ‘నోవిచోక్’ అయి ఉండొచ్చునంటున్నారు. ఇది నాడుల పనితీరును నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుందని, మనుషుల్ని క్షణాల్లో అశక్తులుగా మారుస్తుందని, ఒకసారి దీని బారిన పడితే కోలుకోవడం అంటూ ఉండదని చెబుతున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఉదంతం రష్యాకూ, యూరప్ దేశాలకూ మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, ఇది ఎటు పోతుందో రాగలరోజుల్లో తెలు స్తుంది. పరస్పర గూఢచర్యం చివరికెలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలి యాలంటే స్క్రిపాల్ ఉదంతమే ఉదాహరణ. -
విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మైక్ పాంపీని నియమించిస్తున్నుట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని వైట్‌హౌజ్ ప్రతినిధులు మంగళవారం తెలియజేశారు. ఇందులో భాగంగానే సెంట్రల్ ఇంటిలెజెన్స్ ఏజెన్సి(సీఐఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పదవికి మైక్ మాత్రమే అర్హులు: ట్రంప్ గత శుక్రవారమే రెక్స్ టిల్లర్సన్ను పదవి నుంచి వైదొలగాలని హెచ్చరించిన ట్రంప్ అన్నంతపని చేశారు. సీఐఏ డైరెక్టర్‌గా అపార అనుభమున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రి పదవి ఎంపిక చేసినందుకు గర్వపడుతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్వర్డ్ లా స్కూల్లో ఆనర్స్ పట్టా పొంది, యూఎస్ ఆర్మీలో పనిచేసిన గొప్ప వ్యక్తి మైక్ అని కొనియాడారు. ఆయన స్థానంలో గినా హాస్పెల్...! సీఐఏ డైరెక్టర్ పదవికి ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ గినా హాస్పెల్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదేగనక నిజమైతే అమెరికా చరిత్రలో గూఢాచార సంస్థకు డైరెక్టర్‌గా ఎన్నికైన తొలి మహిళగా గినా హాస్పెల్ చరిత్ర సృష్టించనున్నారు. ‘ముప్పై ఏళ్ల సర్వీసున్న తనకు త్వరలోనే ప్రమోషన్ రాబోతుందని, అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని గినా హాస్పెల్ అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు. -
జీఈఎస్‌పై అగ్రరాజ్యం డేగకన్ను!
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌పై అమెరికా డేగకన్ను వేసింది. పలు ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాద సంస్థల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా.. ప్రత్యేక భద్రతా విధులన్నీ అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే పర్యవేక్షిస్తోంది. అయితే అమెరికాను టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థల నుంచి ఇవాంకాకు ముప్పు పొంచి ఉంది. ఐసిస్ ఉగ్రవాదులతో పాటు విద్వేషాగ్నితో రగులుతున్న ఉత్తర కొరియా నుంచి కూడా ప్రమాదం ఉంటుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ అధికారులను హెచ్చరించింది. ఇవాంకా హైదరాబాద్‌లో ఉన్నంత సేపూ అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా ఏర్పాట్లు జరిగాయి. హాజ్మత్ వాహనాల మోహరింపు రసాయనిక దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు, తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించే వాహనాలే హాజ్మత్ వాహనాలుగా చెబుతారు. హాజ్మత్ అంటే హాజర్డస్ మెటీరియల్ అని అర్థం. అత్యంత హానికరమైన రసాయన దాడుల సందర్భాల్లో ఈ వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాహనాలు మన దేశంలో అరుదు. హైదరాబాద్‌లో అందుబాటులోనే లేవు. ప్రధాని మోదీ, ఇవాంకాల పర్యటన నేపథ్యంలో హాజ్మత్ వాహనాలను తెప్పించి మోహరించాలని నిర్ణయించారు. ఇక ఇవాంకా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు. మందు పాతరలతో పాటు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా వాటిల్లో ఏర్పాట్లు ఉంటాయి. 2 కిలోమీటర్ల దూరం ఆంక్షలు ఇవాంకా బస చేసే రెండు రోజుల పాటు మాదాపూర్ వెస్టిన్ హోటల్, విందుకు హాజరయ్యే పాతబస్తీ ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. వీటికి రెండు కిలోమీటర్ల పరిధిలోని జనావాసాలు, ఆఫీసులు, ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో ఉన్న వారి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. విదేశీయుల వివరాలపై ఆరా.. కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాంకాకు ఆ దేశం నుంచి ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. దీంతో ఇటీవల భారత్‌లోకి వచ్చిన విదేశీయుల వివరాలను ఆరా తీస్తోంది. ముఖ్యంగా గత 45 రోజుల్లో ప్రధానంగా ఉత్తర కొరియా, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారి సమాచారం సేకరిస్తోంది. మన దేశంలో విదేశీ రాకపోకల రద్దీ ఉండే 12 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఈ వివరాలను సేకరించింది. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ పనిపై వచ్చారు,వారి కదలికలేమిటనే సమాచారం రాబడుతోంది. మరోవైపు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న అనుమానితులపై నిఘా వేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఇవాంకా పర్యటించే ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా తమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాంకా ఉండే పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ఆయుధాలతో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలని.. రసాయనిక దాడులు సైతం జరిగే ఆస్కారం లేకుండా భద్రత ఉండాలని స్పష్టం చేసింది. అసలు ఇవాంకా ఆసియాలో తొలిసారి అడుగు పెడుతుండటంతో సీఐఏ గట్టి జాగ్రత్తలే తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలను వినియోగించనుంది. దాదాపు 60 మందికిపైగా సీఐఏ ఆఫీసర్లు, దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాలకు చెందిన వంద మందికిపైగా ఉద్యోగులు ఇవాంకా రక్షణ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. -
కెన్నడీ హంతకుడితో సీఐఏకు లింకు లేదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని దర్యాప్తు పత్రాల్ని అమెరికా తాజాగా విడుదల చేసింది. అయితే కెన్నడీ హంతకుడు లీ హర్వే ఒస్వాల్డ్కు సీఐఏతో సంబంధాలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈ దర్యాప్తు పత్రాల్లో వెల్లడైంది. ఒస్వాల్డ్ను సీఐఏ పావుగా వాడుకుందా? ఆ నిఘా సంస్థతో అతనికి ఇతర సంబంధాలు ఉన్నా యా? అన్న విషయంపై అమెరికా లోపల, బయట విస్తృతంగా శోధించామని తాజా పత్రాల్లో వెలుగుచూసిన 1975 నాటి సీఐఏ మెమోలో పేర్కొన్నారు. -
లా‘డెన్’లో దాగిన రహస్యం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. పాకిస్తాన్లో అబోటాబాద్‌లోని రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి ఈ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు, లాడెన్ అరబిక్‌లో రాసుకున్న ఓ డైరీ ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. కశ్మీర్ పరిణామాలపై ఆసక్తి... అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్ ఫోన్, ఇంటర్నెట్లను వాడలేదు. అయినా అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడుల కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణకు సంబంధించిన వార్తలను లాడెన్ క్రమం తప్పకుండా చదివేవాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, అల్‌కాయిదా, తాలిబన్ల వార్తలను సేకరించేవాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ప్రచురించిన వార్తల క్లిప్పింగులనూ భద్రపరిచాడు. ఇరాన్‌ను చిక్కుల్లో పెట్టేందుకేనా? లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభ్యమయ్యాయి. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా అందులో ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’, కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలతో పాటు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, అల్కాయిదాలు అవగాహనకు వచ్చినట్లు ఓ ఫైల్లో ఉంది. ఇరాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని చూపేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాసమాచారాన్ని విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – -
బిన్ లాడెన్ డైరీలో ఏముందంటే..!
కశ్మీర్ నుంచి కామిక్స్ దాకా... ఉగ్రభూతం విరుచుకుపడితే ఎలా ఉంటుందో ఎవరికీ ఊహకందని రీతిలో ప్రపంచానికి చూపించిన కరడుగట్టిన తీవ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. లాడెన్‌కు సంబంధించిన 4.7 లక్షల పత్రాలు, ఫోటోలు, వీడియోలను సీఐఏ బహిర్గతం చేసింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని లాడెన్ రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి... ఈ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడి సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ లాడెన్ నివాసం నుంచి ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో జనానికి అందుబాటులోకి తెచ్చింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. లాడెన్ అరబిక్‌లో రాసుకున్న 228 పేజీల డైరీ కూడా ఇందులో ఉంది. 2015 తర్వాత లాడెన్‌కు సంబంధించిన రహస్యంగా ఉంచిన సమాచారాన్ని అమెరికా బహిర్గతం చేయడం ఇది నాలుగోసారి. కశ్మీర్ పరిణామాలను నిశితంగా... ఫోన్, ఇంటర్నెట్ వాడితే దొరికిపోయే అవకాశాలుంటాయి కాబట్టి అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్ వీటిని వాడలేదు. అయినప్పటికీ అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసేవారు. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడులకు కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణను సంబంధించిన వార్తలను కూడా లాడెన్ క్రమం తప్పకుండా చదివాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆల్‌ఖైదా, తాలిబన్ల వార్తలను చదివాడు. హుజీతో డేవిడ్ హెడ్లీ కోడ్ భాషలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త తాలూకు క్లిప్పింగ్ కూడా లాడెన్ కంప్యూటర్లో ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ఇచ్చిన వార్తల క్లిప్పింగులూ ఉన్నాయి. కుమారుడి పెళ్లి వీడియో... లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ పెళ్లి వీడియో కూడా సీఐఏ విడుదల చేసింది. ఇందులో లాడెన్ కనిపించలేదు కాని పలువురు ఆల్‌ఖైదా నాయకులు నిఖాలో పాల్గొన్నట్లు ఉంది. అతిథుల కోసం సిద్ధం చేసిన పళ్లు, స్వీట్లు, కోకకోలా, టీ... తదితరాలు వీడియోలో కనిపించాయి. చిన్న పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఫుటేజీ కూడా ఉంది. నీలిచిత్రాలు... డాక్యుమెంటరీలు లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభించాయి. అమెరికా భద్రతకు సంబంధించిన కీలకమనుకున్న పత్రాలు, వీడియోలను విడుదల చేయలేదని పాంపియో తెలిపారు. అలాగే నీలి చిత్రాలు, కాపీరైట్ ఉన్న డాక్యుమెంటరీలను విడుదల చేయలేదు. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను కూడా లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’ కూడా లాడెన్ సేకరించాడు. కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలు కూడా లాడెన్ కంప్యూటర్లో ఉన్నాయి. యాంట్జ్, కార్స్, చికెన్ లిటిల్, త్రీ మస్కెటీర్స్ లాంటి వాటితో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా లభించాయి. టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. తీవ్రవాద గ్రూపుల మధ్య సైద్దాంతిక విబేధాలు, ట్విన్ టవర్స్‌పై దాడి జరిగి పదేళ్లు అయిన సందర్భాన్ని ఎలా నిర్వహించాలనే చర్చల వివరాలు కూడా దొరికాయి. అలాగే అప్పుడే పుంజుకుంటున్న ఐసిస్‌తో ఆల్‌ఖైదా విబేధాల వివరాలు ఉన్నాయి. వివిధ తీవ్రవాద గ్రూపుల మధ్య సయోధ్యకు లాడెన్ యత్నించాడనే వివరాలు, అరబ్ దేశాల్లో ప్రజా తిరుగుబాట్లపై ఆల్‌ఖైదా ఎలా స్పందించింది, వాటిని ఏ దృష్టితో చూసిందనే వివరాలున్నాయి. మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించి ముస్లింలలో తమ ప్రతిష్టను పెంచుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఆల్‌ఖైదా నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయమూ బయటపడింది. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, ఆల్‌ఖైదాలు అవగాహనకు వచ్చి పనిచేశాయని ఇంతవరకు వెలుగుచూడని ఓ 19 పేజీల ఫైల్లో ఉంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద శిబిరాల్లో ఖైదా మిలిటెంట్లకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఆయుధాలు, డబ్బును ఇరాన్ సమకూర్చినట్లు ఇందులో వివరాలున్నాయి. ఇరాన్‌తో కుదిరిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదులకు ఇరాన్ సహాయం చేస్తోందనేది చూపించడానికి తాజా ఫైల్స్‌ను విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
-
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
వాషింగ్టన్ : ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన అల్‌ఖైదా నాయకుడు. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడి నివాసం ఎలా ఉంటుంది?. సాధారణ జీవితాన్ని వారు గడపగలుగుతారా? అనే సందేహాలు అందరికీ వస్తుంటాయి. 2011లో అమెరికా భద్రతా దళాలు అబోటాబాద్‌లో లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన సీఐఏ(సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లాడెన్ ఇంటిలో దొరికిన కంప్యూటర్ నుంచి లభ్యమైన వివరాలను తాజాగా వెల్లడించింది. లాడెన్ కుటుంబం(భార్య, పిల్లలు, మనవళ్లు)కు చెందిన వీడియోలు ఇందులో ఉన్నాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు సారథ్యం వహిస్తున్న హంజా లాడెన్ చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలుసు. హంజా యుక్త వయసులో ఉన్న ఫొటోను కూడా సీఐఏ బయటపెట్టింది. సీఐఏ విడుదల చేసిన వీడియోల్లో బిన్ లాడెన్.. సాధారణ జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. ఆరుబయట లాడెన్ పిల్లలు, మనవళ్ల ఆటపాటలు, ఇంటి నిండా కోళ్లు, ఆవులు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా పల్లెటూరి వాతావరణంతో బిన్ లాడెన్ ఆనందంగా గడిపినట్లు అర్థం అవుతోంది. ఓ ఫొటోలో తుపాకీతో లాడెన్ మనవళ్లు వాటర్ బెలూన్లను కాల్చుతున్నారు. ‘వేర్ ఇన్ ది వరల్డ్ ఇజ్ ఒసామా’ అనే పేరుతో వచ్చిన సినిమా కూడా లాడెన్ కంప్యూటర్లో ఉనట్లు సీఐఏ తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కంప్యూటర్లో దొరికిన అన్ని ఫైళ్లను విడుదల చేయడం లేదని సీఐఏ తన ప్రకటనలో పేర్కొంది. -
కెనడీ హత్య ఫైల్స్ విడుదల
వాషింగ్టన్ డీసీ : అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది. జాతీయ భద్రతా ఏజెన్సీల సూచనల మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక ఫైళ్లను మాత్రం విడుదల చేయలేదు. మొత్తం 3,191 పైళ్లలో 2,891 ఫైళ్లను అధికారులు విడుదల చేశారు. కెనడీ హత్యకు సంబంధించిన ముఖ్యమైన 300 ఫైళ్లను మాత్రం ట్రంప్ విడుదల చేయలేదు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా జాన్ ఎఫ్ కెనడీని 1963, నవంబర్ 22న హత్య చేశారు. అప్పటినుంచి ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ హత్య ఒక మిస్టరీగా ప్రజలు భావిస్తారు. లీ హర్వీఏ ఓస్వాల్డ్ అనే హంతకుడు అధ్యక్షుడు కెనడీని హత్య చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. కెనడీ హత్య జరిగిన మూడు దశాబ్దాల తరువాత.. రికార్డ్ కలెక్షన్ యాక్ట్ -1992 ప్రకారం.. హత్య సంబంధించిన అన్ని ఫైళ్లను ఒకే చోటకు చేర్చాలని నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించి నేషలన్ ఆర్చీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఏఆర్ఏ)లో భద్రపరిచారు. ఆ సమయంలో ఈ ఫైళ్లను 2017 అక్టోబర్ 26న ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కీలకమైన ఫైళ్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హత్యకు సంబంధించిన కుట్రపై ప్రజలకున్న అనుమానాలు అలాగే మిగిలిపోతాయని చరిత్రకారులు అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్ మెక్సికో పర్యటన కూడా రహస్యంగానే మిగిలిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. -
కిమ్ జాంగ్ ఉన్ సడెన్‌గా అదృశ్యమైతే..
న్యూయార్క్: ఒకవేళ ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ ఒక్కసారిగా అదృశ్యమైపోతే.. దాని గురించి మమ్మల్ని అడగొద్దని అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఏఐ) పేర్కొంది. అయినా, కిమ్ జాంగ్ ఉన్ గొప్ప నటుడని, ఒకవైపు అధికారంలో కొనసాగుతూనే.. మరోవైపు సొంతింట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడని వ్యాఖ్యానించింది. 'ఒకవేళ కిమ్ జాంగ్ ఉన్ కనిపించకపోతే.. దాని గురించి నన్ను అడగొద్దు. సీఐఏ చరిత్ర దృష్ట్యా కిమ్ అదృశ్యం గురించి నేను మాట్లాడబోను' అని సీఐఏ చీఫ్ మైక్ పొంపియో పేర్కొన్నారు. ఒకవేళ కిమ్ అకస్మాత్తగా చనిపోతే ఏమిటి పరిస్థితి అని ప్రశ్నించగా ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు. 'ఇది యాదృశ్చికంగా కొందరు భావిస్తారు. కొందరు ప్రమాదంగా భావిస్తారు. కానీ అది ఫలప్రదం కాదం'టూ ఆయన చేసిన వ్యాఖ్యలతో నవ్వులు పూశాయి. వాషింగ్టన్లో సెక్యూరిటీ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వివిధ దేశాల్లో జోక్యం చేసుకోవడం, అక్కడి దేశాధినేతలను అధికారంలోకి దింపేయడం లేదా రుపుమాపడం వంటి క్రూరమైన చీకటి చరిత్ర సీఐఏకు ఉంది. ఇరాన్, క్యూబా, కాంగో, వియత్నాం, చిలీ వంటిదేశాల్లో అమెరికా సీఏఐ జోక్యం చేసుకొని.. రాజకీయ సంక్షోభాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ను చంపేందుకు దక్షిణ కొరియా నిఘా సంస్థలతో కలిసి అమెరికా సీఐఏ పనిచేస్తోందని ఉత్తర కొరియా ఆరోపించింది. కిమ్ ఏకైక లక్ష్యం అధికారంలో కొనసాగడమే అన్న మైక్.. సీఐఏ రానున్న రోజుల్లో మరింత క్రూరంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. -
పాపం.. లూలు జాబ్ పోయింది!
వాషింగ్టన్ : లూలును సీఐఏ విధుల నుంచి తప్పించింది. లూలు అంటే బాంబు స్క్వాడ్ బృందంలో పనిచేసే ఓ శునకం. లూలును ఎందుకు జాబ్ నుంచి తీసేశారో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు తనిఖీల కోసం కొన్ని ప్రత్యేక జాతి శునకాలకు శిక్షణ ఇస్తాయి. ఇందులో భాగంగానే ఇటీవల లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన లూలును ఎంపిక చేసింది సీఐఏ. బాంబులుగానీ, లేదా ఇతర పేలుడు, అనుమానిత వస్తువులను పసిగట్టేలా అధికారులు లూలుకు శిక్షణ ఇప్పించారు. అయితే గతకొన్ని రోజులుగా లూలు విధులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించారు. ఆ వివరాలను సీఐఏ ఓ బ్లాగులో పేర్కొంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని శునకాలు తమ విధులు సక్రమంగా నిర్వర్తించవు. అందుకు లక్ష కారణాలుండొచ్చు. కొన్నిసార్లు కొన్నిరోజులకే అవి మళ్లీ పూర్తిస్థాయిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. లూలు విషయంలో అలా జరగదని తేలిపోయింది. మళ్లీ శిక్షణ ఇవ్వాలని చూసినప్పటికీ, ఆ శునకం ఆసక్తి చూపించడం లేదట. ఒకవేళ బలవంతంగా లూలుతో పని చేయిస్తే అది బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించకపోతే ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాంతో పాటు లూలు సాధారణ శునకాల్లాగ జీవించాలని చూస్తుందని, అందుకే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలుసుకున్న అధికారులు ఈ స్పెషల్ డాగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఉద్యోగం పోగొట్టుకున్న లూలు ప్రస్తుతం హ్యార్రీ అనే మరో శునకంతో ఫ్రెండ్షిప్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతోందని అధికారులు ఆ బ్లాగ్‌లో వెల్లడించారు. -
అమెరికాకు ‘ఆధార్’ సమాచారం!
-
అమెరికాకు ‘ఆధార్’ సమాచారం!
- ట్వీటర్లో వికీలీక్స్ సంచలన వ్యాఖ్యలు - దుర్వినియోగమయ్యే అవకాశం లేదు: భారత్ వాషింగ్టన్: భారతీయుల ఆధార్ సమాచారం అమెరికాకు అందుబాటులో ఉందంటూ వికీలీక్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన గూఢచారులకు ఆధార్ డేటాబేస్ అందుబాటులో ఉందని ట్వీటర్లో ఆరోపించింది. ఆధార్ డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు సీఐఏ.. అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కంపెనీని వాడుకుంటున్నట్లు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వికీలీక్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత్ ఖండించింది. ‘ఆధార్ డేటా చాలా సురక్షితంగా నిక్షిప్తమై ఉంది. వేరే ఏ ఏజెన్సీ కానీ, సంస్థ కానీ ఆ వివరాలను పొందే అవకాశమే లేదు’అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆధార్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించిన బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసే కంపెనీల్లో క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ ముందువరుసలో ఉంది. వేలిముద్రలు, ఐరిస్ రికార్డు చేసే పరికరాలను సరఫరా చేసేందుకు 2011లో ఈ కంపెనీ అనుమతులు పొందింది. రహస్యంగా డేటాను సేకరించేందుకు ‘ఎక్స్‌ప్రెస్ లేన్’అనే వ్యవస్థను సీఐఏ ఉపయోగించుకుంటోందని ‘గ్రేట్ గేమ్ ఇండియా’వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. సీఐఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్ వద్ద బయోమెట్రిక్ వివరాలను సేకరించే వ్యవస్థ ఉందని, దీని ద్వారా వివరాలను అక్రమంగా సేకరిస్తుందని వివరించింది. పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ జాడ వెతికేందుకు క్రాస్ మ్యాచ్‌కు సంబంధించిన పరికరాలను అమెరికా మిలిటరీ వాడుకుందని 2011లో వార్తలు వచ్చాయి. -
కాంగ్రెస్ రాజీవ్‌తోనే నాశనం!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో జరిగే రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఓ అంచనాతో రహస్య నివేదికలు తయారు చేసుకోవటం పలు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలకు అలవాటైన పనే. భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ అమెరికా ఐబీ వర్గాలు ఇలానే ఓ నివేదికను రూపొందించాయి. ఆ నివేదిక ఇప్పుడు బహిర్గతం కావడంతో సంచలనంగా మారింది. ఇందిరాగాంధీ హత్యకు దాదాపు రెండేళ్ల ముందే 1983 జనవరి 14న ఈ నివేదికను యూఎస్ కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) తయారు చేసింది. ఒకవేళ అనివార్య కారణాలతో ఇందిర మరణిస్తే ఆమె వారసుడిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని అందులో నివేదించింది. ‘రాజీవ్‌గాంధీకి రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ప్రజలను ఆకర్షించటంలోనే కాదు. జూనియర్ కావటంతో పార్టీని సమర్థవంతంగా నడపటంలోనూ విఫలమై తీరతారు.’ అని పేర్కొంది. ఆయనకు ఇందిరాగాంధీలా రాజకీయ చతురత లేదని, ఒకవేళ రాజీవ్ ప్రధాని అయితే మాత్రం ఆ అధికారాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేరని, రాజకీయ అస్థిరత ఏర్పడి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తి పార్టీ ఉనికికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఆర్ వెంకట్రామన్, పీవీ నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీ తివారీలు ఆ హోదాకు రైట్ ఛాయిస్ అంటూ అభిప్రాయపడింది. ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలైన ఓ పిటిషన్‌కు బదులుగా సీఐఏ ఈ 30 పేజీల నివేదికను ఇండియా ఇన్ ది మిడ్-1980, గోల్స్ అండ్ ఛాలెంజ్ పేరిట బహిర్గత పరిచింది. -
కిమ్ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా
సియోల్: తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ను హతమార్చడానికి అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ), దక్షిణ కొరియా నిఘా వర్గాలు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉత్తర కొరియా అంతర్గత భద్రత శాఖ తెలిపింది. జీవరసాయన ఆయుధాలతో కిమ్‌పై దాడి చేయడానికి జరిగిన కుట్రను అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. తమ అధినేత హత్యకు ఉత్తర కొరియాకే చెందిన కిమ్ అనే వ్యక్తిని అమెరికా, దక్షిణ కొరియాలు ఎంపిక చేసినట్లు దేశ అధికార వార్తాసంస్థ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నిందితుడి వద్ద నుంచి 7.40 లక్షల అమెరికన్ డాలర్లు, ఓ శాటిలైట్ ట్రాన్స్‌రిసీవర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, తాతల సమాధులతో పాటు సైనిక పరేడ్‌లో దాడికి ప్రణాళిక రచించారని అంతర్గత భద్రత శాఖ తెలిపింది. తమవద్ద ఉన్న రేడియోధార్మిక విష పదార్థాలు ప్రయోగించిన 6 నుంచి 12 నెలల తర్వాతే ప్రభావం చూపిస్తాయని నిందితుడికి సీఐఏ చెప్పినట్లు వెల్లడించింది. నిందితుడి వద్ద దక్షిణ కొరియాకు చెందిన పలు ఇంటెలిజెన్స్ అధికారుల నెంబర్లు లభించినట్లు తెలిపింది. -
పాక్‌లో మళ్లీ డ్రోన్ దాడులు?
వాషింగ్టన్: ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడులు చేయడానికి కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలిచ్చినట్లు ది వాల్‌స్ట్రీట్ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పాకిస్తాన్‌పై అమెరికా మళ్లీ డ్రోన్ల దాడులను ముమ్మరం చేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం బబామా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉంది. అప్పుడు రక్షణ విభాగం డ్రోన్లతో దాడులు చేపడితే, సీఐఏ నిఘా సమాచార సేకరణకే వాటిని వినియోగించుకునేది. మరోవైపు, ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్కు చెందిన కంపెనీలోకి చైనా బీమా కంపెనీ అన్బాంగ్ నుంచి 4 బిలియన్ డాలర్ల (రూ.26310 కోట్లు) పెట్టుబడులు రానున్నట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. -
వేలాది సీఐఏ పత్రాలను బయటపెట్టిన వికిలీక్స్
పారిస్: అమెరికా కేంద్ర నిఘా విభాగం(సీఐఏ)కు చెందినవిగా చెబుతున్న వేలకొద్దీ పత్రాలను సంచలనాల వికిలీక్స్ మంగళవారం విడుదల చేసింది. వీటిని సీఐఏకు చెందిన సెంటర్ ఫర్ సైబర్ ఇంటెలిజెన్స్ నుంచి సంపాదించామంది. వికిలీక్స్ బయటపెట్టిన పత్రాలు నిజంగా సీఐఏకు చెందినవా కాదా అని నిర్ధారించుకునేందుకు సీఐఏను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. సీఐఏ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఆ పత్రాలు నిజమైనవో కాదో మేం చెప్పం’అని అన్నారు. ప్రభుత్వ రహస్య పత్రాలను చాలా కాలం నుంచి బయటపెడుతున్న రికార్డ్ వికిలీక్స్కు ఉండటం తెలిసిందే. పత్రాలను పరిశీలిస్తున్న నిపుణులు మాట్లాడుతూ అవన్నీ నిజంగా సీఐఏకు చెందిన వాటిలాగే అనిపిస్తున్నాయని చెప్పారు. -
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
-
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
న్యూయార్క్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించిందా? ఆయనపై దాడి జరిగే సూచనలు ఉన్నాయని హత్య జరగడానికి ఐదేళ్ల ముందే ఊహించిందా? అంటే అవునని ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. అయితే, అంతకంటె ముందే రాజీవ్ హత్యకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ 1986లోనే ఓ 23 పేజీల్లో 'ఇండియా ఆఫ్టర్ రాజీవ్..' అనే పేరుతో సీఐఏ రాసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఐఏనే ఇటీవల బయటపెట్టింది. 1986వరకు సీఐఏకు అందిన సమాచారం మేరకు అది రాసిన నివేదికలో తొలి వాక్యంగా 'ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన పదవికాలం ముగిసేనాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్యాప్రయత్నమే' అని మరో వాక్యంలో రాసింది. ఇలా సీఐఏ చెప్పిన సరిగ్గా ఐదేళ్ల తర్వాత 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్యకు గురయితే కచ్చితంగా భారత్‌కు అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం పడుతుందని కూడా సీఐఏ అప్పట్లోనే అంచనా వేసింది. పలు గ్రూపులు రాజీవ్ హత్యకోసం యత్నిస్తున్నాయని, అది ఏ సమయంలోనైనా జరగొచ్చే అవకాశం ఉందని సీఐఏ రిపోర్టు తెలిపింది. అంతేకాదు, రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పీవీ నరసింహరావు, వీపీ సింగ్‌లాంటి ప్రజ్ఞావంతులు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. -
పాక్ అణుకేంద్రంపై దాడికి ఇందిరా గాంధీ గ్రీన్ సిగ్నల్
-
రష్యా సంగతి ట్రంప్ కు తెలియదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ పెద్ద షాకిచ్చారు. ఈ నెల 20 న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ట్రంప్ పై సీఐఏ డైరెక్టర్ పదవి నుంచి త్వరలోనే వైదొలగనున్న జాన్ బ్రెన్నన్ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. రష్యా సామర్థ్యాలేంటో, ఆ దేశ ఆంతర్యమేంటో ట్రంప్ కు ఏమాత్రం తెలియదని మండిపడ్డారు. వేదికలెక్కినప్పుడు సమయస్పూర్తితో మాట్లాడామనుకుంటే సరిపోదని, అలాంటి మాటలతో జాతీయ భద్రతను పరిరక్షించలేరని ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నాలుగు రోజుల కిందట ట్రంప్ తొలిసారిగా మీడియాతో మాట్లాడినప్పుడు పుతిన్ పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రమేయం, తద్వారా ట్రంప్ కు ఉపయోగకరంగా మారిన అంశాలపై ఆ దేశంలో వివాదం చెలరేగిన విషయం కూడా తెలిసిందే. తనను నాజీ జర్మనీ ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో పోల్చడంపై బ్రెన్నన్ మండిపడ్డారు. ఇదేదో ట్రంప్ కు సంబంధించిన వ్యవహారం కానేకాదని, ఇది అమెరికా దేశ భద్రతాపరమైన అంశమన్న విషయం ట్రంప్ మరిచిపోవద్దని బ్రెన్నన్ హెచ్చరించినట్టు స్కై న్యూస్ తెలిపింది. రష్యా ఉద్దేశాలేంటో ట్రంప్ కు అర్థం కాదంటూ ఈసడించుకున్నారు. -
భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
-
భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు. ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్‌తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది. -
నిజంచెప్పిన అమ్మ.. పిల్లలు షాక్
న్యూయార్క్: ఆమె బయటకు చెప్పుకోలేని ఉద్యోగం చేస్తుంది. పని గర్వంతో నిండినదేగానీ.. బయటకు చెప్పితే ప్రమాదం. శత్రువులు వారి కుటుంబంపై దాడి చేస్తారని, పిల్లలను ఎత్తుకెళతారని. భర్తకు మాత్రం తెలుసు. పిల్లలకు ఆ విషయం తెలియదు. తాను ఇలాగే చెప్పకుండా ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని తల్లి మనసు ఒకటే కొట్టుకుంటుంది. ఒక రోజు తన స్నేహితురాలి సలహాను కూడా అడిగింది. దాంతో ఆలస్యం చేస్తే పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందనే, చివరకు అసలు నమ్మకమే కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించింది. దీంతో ఇక ఎలాగైనా ఆరోజు తన పిల్లలకు నిజం చెప్పాలని నిర్ణయించుకుని చెప్పేసింది. దాంతో ఆ పిల్లలు షాక్ అయ్యారు. అప్పటి వరకు ఓ సాధారణ మహిళగానే గుర్తించిన ఆమె గురించి అనూహ్య విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ మురిసి పోయారు. ఇంతకు ఆ పిల్లలు వావ్ అనుకునేలా ఆ తల్లి చేస్తున్న పని ఏమిటో తెలుసా.. స్పై.. గుఢాచారి ఉద్యోగం. అది కూడా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలోని సీఐఏలో. సీఐఏలో ఉద్యోగం అంటే సాధాసీదా ఉద్యోగం కాదు. అది కూడా స్పై ఉద్యోగం అంటే ఇంక చెప్పలేము. ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టుకున్న ఈ నిజాన్ని తన పిల్లలకు చెప్పిన ఆ తల్లి పేరు మార్థా పీటర్సన్. ఆమె సీఐఏలో గుఢాచారిగా ఉద్యోగం చేస్తుంది. అయితే, తన ఉద్యోగం గురించి పిల్లలకు చెబితే వారు అక్కడాఇక్కడ చెప్పి శత్రువుల బారిన పడతారో అనే భయంతో, బెంగతో దాదాపు పదిహేడేళ్లపాటు ఆ నిజం చెప్పకుండా తనలోనే దాచుకుంది. టైలర్ (17), లోరా (15) అనే తన పిల్లలిద్దరిని ఓ గుడ్ ఫ్రైడే రోజున కారులో ఎక్కించుకొని తీసుకెళుతూ సడెన్‌గా తాను ఒక స్పైనని, సీఐఏలో పనిచేస్తుంటానని చెప్పింది. దీంతో ఆ పిల్లలిద్దరు అవాక్కయ్యారు. అంతపెద్ద ఉద్యోగం చేస్తూ ఇన్ని రోజులు తమకు చెప్పకుండా ఉండటానికి గల కారణాలు అర్థం చేసుకున్నారు. ఆమె భయపడినట్లుగా కాకుండా ప్రేమగా తమ తల్లిని హత్తుకున్నారు. దాంతో తల్లి భారం కూడా తీరిపోయింది. స్పైగా తాను నిర్వహించిన సాహసాల గురించి పిల్లలకు చెప్పింది. జార్జియాకు చెందిన మార్థా పీటర్సన్ 1976లో రష్యాలో సీఐఏ నిర్వహించిన ఓ పెద్ద మిషన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. -
‘తీగ’ సీఐఏది.. ‘డొంక’ ఎన్‌ఐఏది!
కీలక ఆధారాలుగా మారిన సోషల్‌మీడియా అకౌంట్స్ ‘ఏయూటీ’ మాడ్యూల్‌ను తొలుత గుర్తించిన అమెరికా కేంద్ర హోం శాఖకు అధికారిక సమాచారం ఇచ్చిన సీఐఏ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఏ ఆన్‌లైన్‌ను వినియోగించుకుని విస్తరిస్తోందో.. దానికి అనుబంధంగా ఏర్పడిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టు ఆ ఆన్లైన్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. భారత్‌లో విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్‌ను తొలుత అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) గుర్తించింది. అక్కడ నుంచి వచ్చిన అధికారిక సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. ఏయూటీ మాడ్యూల్ గుట్టురట్టు చేయడమేకాక ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసింది. శుక్ర-శనివారాల్లో హైదరాబాద్‌లో పట్టుబడిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, అబు అన్స్ ఈ మాడ్యూల్‌కు చెందిన వారే. పారిస్ ఎఫెక్ట్‌తో ప్రత్యేక నిఘా పారిస్ ఉగ్రదాడుల నేపథ్యంలో సీఐఏ సాంకేతిక నిఘాను పెంచి, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు, అనుమానితుల కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు చెందిన ఐపీ అడ్రస్‌లు సేకరించింది. కర్ణాటకలోని భత్కల్ నుంచి వెళ్లి ప్రస్తుతం యూసుఫ్ పేరుతో సిరియా కేంద్రంగా ఐసిస్‌కు అనుబంధంగా పని చేస్తున్న షఫీ ఆర్మర్.. అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడే ముంబైకి చెందిన ముదాబిర్ ముస్తాఖ్ షేక్‌ను ఆన్లైన్ ద్వారా ఉగ్రబాట పట్టించాడు. భారత్‌లో విధ్వంసాల కోసం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. డీకోడ్ చేయడంతో.. మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న షఫీ ఆర్మర్.. ముదాబిర్‌తో సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తున్న విషయం గత ఏడాది గుర్తించిన సీఐఏ లోతుగా ఆరా తీసింది. వీరిద్దరూ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారని గుర్తించిన సీఐఏ అప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వచ్చింది. విధ్వంసాలకు రంగంలోకి దిగుతున్నారని గుర్తించింది. ముదాబిర్‌తో షఫీ వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్‌లో ‘సాత్ కలాష్ రఖ్ దో’ అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కోడ్‌ను డీకోడ్ చేసింది. దేశంలోని ఏడు ప్రాంతాల్లో విధ్వంసాలకు రెక్కీ సహా అన్ని ఏర్పాట్లు చేయాలన్నది దాని అర్థంగా తేల్చింది. డీజీపీల సదస్సు నుంచి ఫీల్డ్ ఆపరేషన్ సీఐఏ సమాచారంతో అప్రమత్తమైన హోంశాఖ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా డిసెంబర్ 9న ఎన్ఐఏకు ఆదేశాలతో(ఆర్డర్ నం.11034/111/2015-ఐఎస్-4) లేఖ రాసింది. స్పందించిన ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయం అదే రోజు కేసు (నం.ఆర్సీ-14/2015/ఎన్ఐఏ/డీఎల్ఐ) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. టై నెట్వర్క్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని గుర్తించిన ఎన్ఐఏ అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర నిఘా వర్గాలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. గుజరాత్లో డిసెంబర్లో మూడు రోజుల పాటు అఖిల భారత డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు జరిగింది. ఇందులోనే విస్తరిస్తున్న విషవృక్షం వ్యవహారాన్ని బయటపెట్టిన హోంశాఖ, ఐబీలు వేట ముమ్మరానికి ఆదేశించడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇది ఫలితాన్నివ్వడంతోనే గత వారం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 14 ప్రాంతాల్లో 13 మంది ముష్కరులు చిక్కడంతో పాటు జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టురట్టయ్యింది. కస్టడీకి ‘జునూద్’ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన 14 మంది ఉగ్రవాదులను తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు అధికారులు మరోసారి నలుగురు ముష్కరుల్ని హైదరాబాద్ తీసుకువచ్చే అవకాశం ఉంది. -
భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు. 1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు. -
సీఐఏ ఈమెయిల్‌పై స్టూడెంట్ ఎటాక్ !
వాషింగ్టన్: ఓ టీనేజీ హ్యాకర్ సీఐఏ గుట్టును దొంగిలించాడు. సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను దొంగిలించడమే కాకుండా అందులోని సున్నితమైన అంశాలకు సంబంధించిన అంశాలను, రక్షణ వ్యవహారాలకు కీలక అంశాలను కూడా దొంగిలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఒక వేళ ఈ విషయాలు నిజమే అని సీఐఏ అధికారికంగా గుర్తించినట్లయితే.. సీఐఏకు గట్టి ఎదురుదెబ్బతగిలినట్లవుతుంది. ఇప్పటికే నాటి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సీఐఏ సూచించిన ఈమెయిల్ కాకుండా ఓ ప్రైవేట్ ఈమెయిల్ ద్వారా లావాదీవీలు నెరిపిందనే వివాదం అక్కడ సంచలనం సృష్టించగా నేడు సీఐఏ డైరెక్టర్ ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురికావడం అమెరికా రక్షణ సంస్థలో వణుకుపుట్టిస్తోంది. సీఐఏ ఫైల్స్‌ను హ్యాక్ చేసిన వ్యక్తి తనను తాను ఓ అమెరికా విద్యార్థిగా చెప్పుకున్నాడు. మొత్తం 47 పేజీల్లో ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన వివరాలను తాను కొల్లగొట్టానని చెప్పాడు. అయితే, సీఐఏ వర్గాలు మాత్రం ఇది ఎవరో అమెరికా విదేశాంగ విధానం నచ్చని పాలస్తీనాకు చెందిన వ్యక్తులై ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అతడు ముస్లిం వ్యక్తి అయుండకపోవచ్చని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. -
'తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశాను'
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ కు తాను ఆయుధాలు సరఫరా చేశానని సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ వెల్లడించారు. తీహార్ జైల్లో జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ తనకు పరిచయం ఏర్పడిందని శోభరాజ్ తెలిపారు. అంతేకాకుండా అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో కూడా గతంలో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. 1999 డిసెంబర్ లో కాట్మండ్ నుంచి కాంధార్ వెళ్లే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత ప్రయాణికులను విడిపించేందుకు మసూద్ తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిచిపెట్టారని.. ఆతర్వాత తాను మసూద్ లు కలుసుకున్నామని.. ఆయుధాల కోసం తాలిబాన్లు మాదక ద్రవ్యాలను అమ్మేవారని శోభరాజ్ తెలిపారు. మసూద్ తో ఉన్న పరిచయంతో తాలిబాన్లకు చైనా నేరస్థులతో కలిసి ఆయుధాల డీలర్ గా పనిచేశానన్నారు. అరెస్ట్ అయ్యాక తనతో సీఐఏతో తెగతెంపులు చేసుకుందని, తనకు ఎలాంటి సహాయం చేయలేదని, ఉగ్రవాదంపై పోరాటానికి తాను తన ప్రాణాలను పణంగా పెట్టానని శోభరాజ్ అన్నారు. 2003లో ఇరాక్ యుద్ద సమయంలో సద్దాం హుస్సేన్ ఏజెంట్ ను తాను కలిశానని శోభరాజ్ అన్నారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చి 1986లో జైలు నుంచి పరారయ్యాడు. అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండ్ జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. శోభరాజ్ తన జీవిత కాలంలో 50 శాతం పలు నేరాల్లో శిక్ష అనుభవించాడు. తన జీవితంలో అనేక విషయాలను ఇటీవల మీడియాతో పంచుకున్నాడు. -
లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదుల కోసం తీవ్రగాలింపు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫరాబాద్ జిల్లాలో మతకల్లోలాల ఘటన తర్వాత కొత్త సభ్యుల నియామకం కోసం ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ మతకల్లోలాల ఘటనలో ఒక వర్గానికి చెందిన సుమారు 60 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం మేరకు గత డిసెంబర్లో లష్కరే తోయిబా కార్యకలాపాలపై కేసు నమోదు చేశారు. అనంతరం హర్యానా రాష్ట్రం మేవాట్ ప్రాంతంలో ఎండీ షాహిద్, ఎండీ రషీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని విచారించగా చాలా కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక పోలీస్ కమిషనర్ (ప్రత్యేక సెల్) ఎస్.ఎన్.శ్రీవాత్సవ కథనం మేరకు వివరాలు.. రషీద్, మరో సహచరుడితో దియోబంద్ వెళ్లి ముజఫర్‌నగర్‌లో నివసించే లియాఖత్ (58) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కలిశాడు. లియాఖత్ వారిద్దరిని ముజఫర్‌నగర్ జిల్లాలోని ఠాణాూ బహవన్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారు ముజఫర్‌నగర్‌కు చెందిన జమీర్, మరో ఇద్దరు వ్యక్తులతో భేటీ అయ్యారు. లియాఖత్, జమీర్ ముజఫర్వాసులే అయినా మతఘర్షణల్లో వారికి ఎటువంటి నష్టం జరగలేదు. స్థానికంగా సభలు నిర్వహించేందుకు కావాల్సిన సొమ్మును కిడ్నాప్‌లు చేయడం ద్వారా సంపాదించాలని పథకం పన్నినట్లు జమీర్‌కు వచ్చిన వారు చెప్పారు. అయితే జమీర్ వారితో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. అనంతరం రషీద్, మరో వ్యక్తి పల్వాల్ మీదుగా మేవాట్ వెళ్లిపోయారు. ఈ దశలో పోలీసులు లియాఖత్, జమీర్‌లను అరెస్టు చేసి వారినుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ సుభాన్,అఫ్తాబ్ అన్సారీ, ఆమిర్ రజాఖాన్, జావేద్ బలాచీ తదితరుల గురించి గాలిస్తున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు.