వాషింగ్టన్: ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడులు చేయడానికి కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలిచ్చినట్లు ది వాల్‌స్ట్రీట్ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పాకిస్తాన్‌పై అమెరికా మళ్లీ డ్రోన్ల దాడులను ముమ్మరం చేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ట్రంప్ తాజా నిర్ణయం బబామా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉంది. అప్పుడు రక్షణ విభాగం డ్రోన్లతో దాడులు చేపడితే, సీఐఏ నిఘా సమాచార సేకరణకే వాటిని వినియోగించుకునేది. మరోవైపు, ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్‌కు చెందిన కంపెనీలోకి చైనా బీమా కంపెనీ అన్‌బాంగ్ నుంచి 4 బిలియన్ డాలర్ల (రూ.26310 కోట్లు) పెట్టుబడులు రానున్నట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది.
పాక్‌లో మళ్లీ డ్రోన్ దాడులు?
Published Wed, Mar 15 2017 1:48 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement
Advertisement