The Wall Street Journal
-
నిఘా ఆరోపణలతో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి అరెస్ట్
మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంతో బద్ధశత్రువులుగా తయారైన అమెరికా, రష్యాల సంబంధాలు మరింత క్షీణించే పరిణామం ఒకటి సంభవించింది. రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’కు చెందిన ఇవాన్ గెర్‡్షకోవిచ్ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ) అరెస్ట్‌చేసింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది. ‘అమెరికా ఆదేశాలతోనే నిషేధిత ప్రాంతంలోని తమ సైనిక పారిశ్రామికవాడలోని ఒక సంస్థకు చెందిన రహస్య పత్రాలను సేకరించడంలో ఇవాన్ బిజీగా ఉన్నాడు. అందుకే అరెస్ట్‌చేశాం’ అని ఎఫ్ఎస్బీ గురువారం ప్రకటించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా పనిచేసే ఇవాన్ ఉక్రెయిన్, రష్యా, ఇతర సోవియట్ యూనియన్ దేశాల్లో వార్తల కవరేజీ విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా మోపిన నేరం రుజువు అయితే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తమ విలేకరి అరెస్ట్‌ను వార్తాసంస్థ తీవ్రంగా ఖండించింది. కోల్డ్ వార్ తర్వాత అమెరికా రిపోర్టర్‌ను రష్యా అరెస్ట్చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇవాన్‌ను ఏ తేదీలో అరెస్ట్చేసిందీ ఎఫ్ఎస్బీ వెల్లడించలేదుగానీ ఉరాల్ పర్వతాల దగ్గర్లోని ఎకటిన్బర్గ్ నగరంలో అతడిని అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా జైళ్లలో ఉన్న రష్యా ఆయుధ మధ్యవర్తి విక్టర్ బౌట్‌ను, డబ్ల్యూఎన్బీఏ స్టార్ బ్రిట్నీ గ్రీనర్ను రష్యా, అమెరికాలు మార్చుకున్న విషయం విదితమే. -
అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!
China Monitoring US Military: చైనా కంబోడియాలో సైనిక స్థావరాలను ఏర్పరచుకుంటోంది. ఎప్పటి నుంచో ఇండో ఫసిపిక్‌లో ప్రాంతంలో తన అధిపత్యధోరణిని చూపించుకునేందుకు చైనా ఎంతగానో తాపత్రయపడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొదటిది అయినా కంబోడియాలో సైనిక ఉపయోగం కోసం నౌకదళ సదుపాయన్ని నిర్మిస్తోంది. అదీగాక ఇప్పటి వరకు చైనాకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలోనే ఏకైక విదేశీ సైనిక స్థావరం ఉంది. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనా ఆకాంక్ష మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సైనిక సౌకర్యాల నెట్వర్క్ ఉండేలా ఈ నౌకదళ స్థావారాలను నిర్మిస్తోందని అమెరికా చెబుతోంది. బీజింగ్ వ్యూహంలోనే భాగామే ఈ కంబోడియాలో నిర్మిస్తున్న కొత్త నావికా స్థావరం అని కూడా పేర్కొంది. అదీగాక చైనా నాయకులకు ఇండో పసిఫిక్ ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు. ఇది తమ చారిత్రాత్మక ప్రాభావాన్ని చూపించుకునే అతి ముఖ్యమైన ప్రాంతంగా వారు భావిస్తారు. అంతేకాదు 2019లోనే ది వాల్ స్ట్రీట్ జర్నల్ చైనా కంబోడియాతో తన మిలటరీ స్థావారాన్ని ఏర్పర్పచుకునేలా ఒప్పందం చేసుకుందని ప్రచురించింది కూడా. దీంతో అమెరికా దాని మిత్రదేశాలు ఆయా దేశాలను ప్రశ్నించింది కూడా. ఐతే అప్పుడు ఆ ఇరు దేశాలు ఆ విషయాన్ని తోసిపుచ్చాయి. కానీ కాలక్రమైణ అదే నిజమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు చైనా ఇలాంటి స్థావరాల్లో సైనిక బలగాలను మోహరింపచేయడమ కాకుండా యూఎస్ మిలటరీ పై నిఘా పెట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ అమెరికా దుమ్మెత్తిపోస్తోంది. (చదవండి: దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!) -
చిత్రమైన కేసు... ఏనుగుని వ్యక్తిగా పరిగణించాలంటూ పిటిషన్
The elephant is being imprisoned against her will: న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం ఓ చిత్రమైన కేసుని విచారిస్తోంది. 51 ఏళ్ల హ్యపీ అనే ఆసియా ఏనుగుని బ్రోంక్స్ జూలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ జంతుహక్కుల సంస్థ నాన్హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. నిజానికి హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తిని నిర్బంధించడం చట్టబద్ధమైనదో కాదో నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏనుగు తరుపు న్యాయవాది స్టీవెన్ వైస్.. ఏనుగు ఇష్టానికి వ్యతిరేకంగా జూలో ఖైదీగా నిర్బంధించబడిందని, ఏనుగు జ్ఞానపరంగా తెలివైన జంతువు కాబట్టి మనుషులకు ఉండే అన్ని రకాలు హక్కులు దీనికి ఉండాలని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఏనుగు 1977 నుంచి జూ లోనే నిర్బంధించి ఉంటుందని అందువల్ల దీనిని ఇప్పుడైనా ఏనుగుల అభయారణ్యంలోకి తరలించాలని అభ్యర్థించారు. కానీ బ్రోంక్స్ జూ మాత్రం ఏనుగుని బాగా చూసుకుంటున్నామని, ఏనుగు నిర్బంధం చట్టవిరుద్ధం కాదని వాదిస్తోంది. 2018 నుంచి దాఖలైన ఈ విచిత్రమైన కేసులో జంతు హక్కుల సంస్థ అనేక దిగువ కోర్టుల్లో ఓడిపోతూ వస్తోంది. అయితే ధర్మాసనం ఈ విచిత్రమైన కేసులో ఏనుగుని వ్యక్తిగా పరిగణిస్తుందా లేదా అనే దాని పైనే తీర్పు ఆధారపడి ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పర్కొంది. అంతేగాదు ఈ న్యూయార్క్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చేవరకు కూడా హ్యాపీ జూలోనే ఉండాల్సిందేనని తెలిపింది. Happy has spent 16 yrs in isolation at the Bronx Zoo: 2x longer than Kaavan, the “world’s loneliest elephant” before a Pakistan judge freed him from a zoo to a sanctuary. In his decision, he rightly called Happy an inmate. #FreeHappy https://t.co/YX9Mv22CHS pic.twitter.com/eHXZ5K0z4r — Nonhuman Rights (@NonhumanRights) May 17, 2022 -
వారి విడుదల.. పాక్‌పై అమెరికా ఆగ్రహం!
ఇస్లామాబాద్/వాషింగ్టన్: అమెరికా జర్నలిస్టు డేనియల్ పెరల్ అపహరణ, హత్య కేసులో దోషులను పాకిస్తాన్ కోర్టు విడుదల చేయడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పాశవికంగా డేనియల్ను హతమార్చిన వారికి విముక్తి కలిగించడం హేయమైన చర్య అని మండిపడింది. ఈ మేరకు‘‘ఇది బాధితులను అవమానించడమే. ఉగ్రవాదం ప్రతీ చోటా ఉంది’’అని దక్షిణాసియా వ్యవహారాల అమెరికా దౌత్యవేత్త ట్వీట్ చేశారు. కాగా అమెరికా వార్తా పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో డేనియల్(38) రిపోర్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో 2001 సెప్టెంబరు 11న అమెరికాపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి ఆయన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయన కదలికలపై నిఘా వేసిన ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ మరో ముగ్గురితో కలిసి 2002లో డేనియల్ను కిడ్నాప్ చేశాడు. బ్రిటన్‌లో జన్మించిన సయీద్... డేనియల్ తల నరుకుతూ.. ఆ క్రూర చర్యను వీడియో రూపంలో విడుదల చేయడంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో పాక్‌లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ అనంతరం స్థానిక కోర్టు సయీద్‌కు మరణ శిక్ష విధించడంతో పాటుగా అతడికి సహకరించిన వారికి కఠిన కారాగార శిక్ష వేసింది. ఈ క్రమంలో గురువారం ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టిన సింధ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నలుగురు దోషులను విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. నిందితులు నేరానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించని కారణంగా ఈ మేరకు తీర్పు వెలువరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో కోర్టు తీర్పును తప్పుబట్టిన అమెరికా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక డేనియల్‌కు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా ఈ విషయంపై స్పందించిన పాక్ విదేశాంగ కార్యాలయం... తీర్పుపై ఎగువ కోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ఇదిలా ఉండగా... స్థానిక లాయర్ ఒకరు మాట్లాడుతూ.. చట్టపరంగా సయీద్ విడుదలను అడ్డుకునే మార్గం లేదని స్పష్టం చేశారు. కాగా కశ్మీర్లో వేర్పాటువాదులకు సహకరించడం, విదేశీ టూరిస్టులను కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో సయీద్‌ను 1990లో భారత్‌లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో 1999లో ఉగ్రవాదులు భారత్ విమానాన్ని హైజాక్ చేయగా... తాలిబన్లతో జరిగిన చర్చల నేపథ్యంలో అతడిని విడుదల చేశారు. -
2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా
వాషింగ్టన్: తమ దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబేను బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. గత వారం కెనడాలో జరిగిన జీ–7 సమావేశం సందర్భంగా ట్రంప్ ఇలాంటి పలు వ్యాఖ్యలు చేశారని భేటీలో పాల్గొన్న యూరప్ దేశాల ప్రతినిధులు వెల్లడించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘యూరప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. షింజో, మీకు ఈ సమస్య లేదు. అందుకే మీ దేశానికి నేను 2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా. అప్పుడిక మీరు వెంటనే పదవి కోల్పోతారు’అని ట్రంప్ అనడంతో అబే సహా అక్కడున్న నేతలంతా అసహనానికి గురయ్యారు. ఇరాన్, ఉగ్రవాదం అంశంపై ట్రంప్ మాట్లాడుతూ..‘మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి ఇమ్మానుయేల్, ఎందుకంటే టెర్రరిస్టులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్నుద్దేశించి అన్నారు. అమెరికా దిగుమతులపై సుంకం పెంచిన చైనా బీజింగ్: అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా శనివారం సుంకాలు పెంచింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం పెంచిన మరుసటి రోజునే, గట్టి సమాధానమిచ్చేలా చైనా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది. -
పోర్న్‌స్టార్‌తో ఎఫైర్.. సీక్రెట్ ధర లక్షా,30,000 డాలర్లు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి తాజాగా ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఓ అశ్లీల చిత్రాల నటితోనూ శారీరక సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, అధ్యక్ష పదవిలోకి రాకముందే ఆ సంబంధం ఉందని, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు, దానిని ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో ఆ నటికి సొమ్ములు ముట్టజెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. స్టీపానీ క్లిఫార్డ్ అనే అమెరికన్ ఓ పోర్న్‌స్టార్. 2006లో ఆమె ఓ గోల్ఫ్ గేమ్ జరుగుతుండగా ట్రంప్‌ను కలిసింది. ఆ సమయంలోనే ట్రంప్ మూడో వివాహం (మెలానియా)ను చేసుకున్నారు. అయినప్పటికీ తనకు పరిచయం అయిన క్లిఫార్డ్తో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో దిగుతుండగా గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ట్రంప్‌తో తనకున్న సంబంధాలు మాట్లాడే ప్రయత్నం చేయగానే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చూసేలా మైఖెల్ కోహెన్ అనే న్యాయవాదికి ట్రంప్ బాధ్యతలు అప్పగించాడు. దాంతో మైఖెల్ మధ్యవర్తిగా ఉండి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు క్లిఫార్డ్‌కు ఏకంగా లక్షా ముప్పైవేల డాలర్లు చెల్లించాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వొద్దని ఆమె దగ్గర హామీ తీసుకున్నాడు. ఈ విషయాలన్నింటిని పూసగుచ్చినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, వీటన్నింటిని మైఖెల్ కొట్టిపారేయగా క్లిఫార్డ్ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ మాత్రం ట్రంప్‌పై చేసిన తాజా ఆరోపణలు అబద్ధాలని, కుట్రలని కొట్టి పారేసింది. గతంలో ట్రంప్‌పై ఇలాంటివి పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఇండియాలో ప్రేమించదగిన నేత ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఆమె మేటి రాజకీయ నేతగా అమెరికా వర్ణించింది. అమెరికాలోని ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని వెలువరించిన వ్యాసంలో భారతదేశంలోనే అత్యుత్తమంగా ప్రేమించదగిన రాజకీయ నేత సుష్మా స్వరాజ్ అంటూ ఆ మేగజిన్ అభివర్ణించింది. టుంకూ వరదరాజన్ అనే వ్యక్తి ఈ వ్యాసాన్ని వెలువరించారు. 'విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్విరామంగా అలసిపోకుండా తన బాధ్యతల మేరకు పనిచేస్తున్న నేత సుష్మాస్వరాజ్. అందుకే ఆమె భారతదేశంలోనే అత్యుత్తమ ప్రేమించదగిన నాయకురాలు' వరదరాజన్ పేర్కొన్నారు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. -
పాక్‌లో మళ్లీ డ్రోన్ దాడులు?
వాషింగ్టన్: ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడులు చేయడానికి కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలిచ్చినట్లు ది వాల్‌స్ట్రీట్ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పాకిస్తాన్‌పై అమెరికా మళ్లీ డ్రోన్ల దాడులను ముమ్మరం చేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం బబామా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉంది. అప్పుడు రక్షణ విభాగం డ్రోన్లతో దాడులు చేపడితే, సీఐఏ నిఘా సమాచార సేకరణకే వాటిని వినియోగించుకునేది. మరోవైపు, ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్కు చెందిన కంపెనీలోకి చైనా బీమా కంపెనీ అన్బాంగ్ నుంచి 4 బిలియన్ డాలర్ల (రూ.26310 కోట్లు) పెట్టుబడులు రానున్నట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. -
భారత్‌లో కోట్ల కొద్దీ లంచాలిచ్చిన వాల్‌మార్ట్
వాషింగ్టన్: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తమ వ్యాపార అవసరాల రీత్యా స్థానిక అధికారులకు భారీ ఎత్తున కోట్ల కొద్దీ లంచాలిచ్చి పనులు జరిపించుకుందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. రియల్ ఎస్టేట్ అనుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్ మొదలైన వాటి కోసం కింది స్థాయి సిబ్బందికి స్వల్ప మొత్తాలు చెల్లించిందని పేర్కొంది. సందేహాస్పద చెల్లింపుల్లో చాలా మటుకు 200 డాలర్ల కన్నా(సుమారు రూ. 13,000) తక్కువే ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో అత్యంత తక్కువగా 5 డాలర్ల(దాదాపు రూ. 350) చెల్లింపులు కూడా ఉన్నాయని పత్రిక తెలిపింది. ఇవన్నీ కలిపితే మిలియన్ల కొద్దీ డాలర్లవుతాయని, దర్యాప్తు సంస్థలకు ఇందుకు సంబంధించి ఆధారాలు లభించాయని వివరించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆయా సంస్థలు ఆర్జించిన లాభాలను బట్టి పెనాల్టీ ఉంటుందని పేర్కొంది. అయితే, భారత్‌లో వాల్‌మార్ట్‌కి ఇప్పటిదాకా లాభాలేమీ రానందున కంపెనీపై జరిమానా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సమాచారం. లంచాల వ్యవహారంపైనే 2012లో సంస్థ సీఎఫ్‌వో సహా అయిదుగురిపై వేటు పడిన సంగతి తెలి సిందే. మరోవైపు, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ చెప్పారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జాయింట్ వెంచర్ ద్వారా 2007లో వాల్‌మార్ట్ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత రిటైల్ స్టోర్స్ ఏర్పాటు యోచనను విరమించుకుని, హోల్సేలర్గానే కొనసాగాలని నిర్ణయించుకున్న వాల్‌మార్ట్.. 2013లో భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. అయితే, మెక్సికో, చైనా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ అక్కడి అధికారులకు లంచాలిచ్చి పనులు జరిపించుకుందని వాల్‌మార్ట్‌పై అభియోగాలు వచ్చాయి. -
భారతీయుడికి పులిట్జర్ బహుమతి
న్యూయార్క్: భారతీయ సాప్ట్వేర్ ఇంజనీర్ కు ప్రతిష్టాత్మక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ ఏడాది పులిట్జర్ బహుమతి ప్రకటించింది. తమిళనాడుకు చెందిన పలని కుమనన్ పరిశోధనాత్మక రిపోర్టింగ్‌కు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగంపై ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. పలని కుమనన్ స్వస్థలం కోయంబత్తూరు. కోయంబత్తూరు పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. -
నిద్రపోని నగరం..
విదేశాలలో! ఆధునికత మనిషి చేత 24 గంటలూ పనిచేయిస్తుంది. అందులో భాగంగానే నగరాలలో అర్థరాత్రి దాటినా ప్రజలు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారు. దీంతో పాటు క్లబ్బులు-పబ్బులలో ఆనందం ఉరకలేస్తూనే ఉంటోంది. ఈ విధంగా ప్రపంచంలో పేరొందిన మహానగరాలు రాత్రుళ్లు కూడా పగలను తలపిస్తున్నాయి. ఇటీవల ది వాల్‌స్ట్రీట్ జర్నల్ మహానగరాల మధ్యరాత్రుల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి ఆ విశేషాలను వెల్లడించింది. దీంట్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం అస్సలు నిద్రపోవడం లేదని తేల్చింది. న్యూయార్క్ నగరంలోని నైట్ క్లబ్బులు పాప్ మ్యూజిక్ హోర్తో దద్ధరిల్లిపోతుంటాయి. ఇక్కడి భూగర్భ బార్లు తెల్లవార్లూ బార్లా తెరుచుకునే ఉంటా యి. ఆకాశాన్నంటే భవనాలు.. థియేటర్లలో చిత్రాల సందడి, రోడ్ల మీద హుషారుగా తిరిగే ప్రజలు, దూసుకుపోయే వాహనాలు.. వీటిన్నింటినీ విశాలమైన రోడ్ల మీదుగా, లైట్ల వెలుతురులో చూసుకుంటూ అబ్బురపడవచ్చు. రాత్రుళ్లు నిద్రపోని న్యూయార్క్ నగరం అత్యంత సందడిగా ఉంటే, ఆస్ట్రేలియలోని మెల్బోర్న్ నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి విశ్రాంతికరమైన నగరాలలో మెల్బోర్న్కి వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటి స్థానాన్ని కట్టబెట్టింది.