China Building Naval Facility In Cambodia For Military Use - Sakshi
Sakshi News home page

అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్‌లో యూఎస్‌!

Published Tue, Jun 7 2022 4:25 PM | Last Updated on Tue, Jun 7 2022 5:35 PM

China Building Naval Facility In Cambodia For Military Use - Sakshi

China Monitoring US Military: చైనా కంబోడియాలో సైనిక స్థావరాలను ఏర్పరచుకుంటోంది. ఎప్పటి నుంచో ఇండో ఫసిపిక్‌లో ప్రాంతంలో తన అధిపత్యధోరణిని చూపించుకునేందుకు చైనా ఎంతగానో తాపత్రయపడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొదటిది అయినా కంబోడియాలో సైనిక ఉపయోగం కోసం నౌకదళ సదుపాయన్ని నిర్మిస్తోంది. అదీగాక ఇప్పటి వరకు చైనాకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలోనే ఏకైక విదేశీ సైనిక స్థావరం ఉంది.

ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనా ఆకాంక్ష మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సైనిక సౌకర్యాల నెట్‌వర్క్‌ ఉండేలా ఈ నౌకదళ స్థావారాలను నిర్మిస్తోందని అమెరికా చెబుతోంది. బీజింగ్‌ వ్యూహంలోనే భాగామే ఈ కంబోడియాలో నిర్మిస్తున్న కొత్త నావికా స్థావరం అని కూడా పేర్కొంది. అదీగాక చైనా నాయకులకు ఇండో పసిఫిక్‌ ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు. ఇది తమ చారిత్రాత్మక ప్రాభావాన్ని చూపించుకునే అతి ముఖ్యమైన ప్రాంతంగా వారు భావిస్తారు.

అంతేకాదు 2019లోనే ది వాల్ స్ట్రీట్‌ జర్నల్‌ చైనా కంబోడియాతో తన మిలటరీ స్థావారాన్ని ఏర్పర్పచుకునేలా ఒప్పందం చేసుకుందని ప్రచురించింది కూడా. దీంతో అమెరికా దాని మిత్రదేశాలు ఆయా దేశాలను ప్రశ్నించింది కూడా. ఐతే అప్పుడు ఆ ఇరు దేశాలు ఆ విషయాన్ని తోసిపుచ్చాయి. కానీ కాలక్రమైణ అదే నిజమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు చైనా ఇలాంటి స్థావరాల్లో సైనిక బలగాలను మోహరింపచేయడమ కాకుండా యూఎస్‌ మిలటరీ పై నిఘా పెట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ అమెరికా దుమ్మెత్తిపోస్తోంది.

(చదవండి: దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement