military
-
సిరియా సంక్షోభం..ఆర్మీకి ట్రంప్ కీలక సూచన
వాషింగ్టన్:సిరియా సంక్షోభంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారానికి అమెరికా సైన్యం దూరంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో తాజాగా ఓ పోస్టు చేశారు.సిరియా అధ్యక్షుడు అసద్ అమెరికా సాయానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. తాజాగా సిరియాలో సంకక్షోభం ముదిరి రెబెల్స్ అక్కడి కీలక హోమ్స్ నగరాన్ని ఆక్రమించారు. ఈ పరిణామంతో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అసద్‌కు ఇరాన్, రష్యా మద్దతుండడం గమనార్హం.అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా సిరియా అంతర్యుద్ధంపై స్పందించారు. తమ ప్రభుత్వం సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శనివారం(డిసెంబర్ 8)నోట్రె డ్యామ్ చర్చి ప్రారంభానికి ప్యారిస్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సిరియాలో కల్లోలం దేశం వీడిన అధ్యక్షుడు -
ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. పశ్చిమాసియాలో సైనిక విస్తరణ
న్యూయార్క్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు హెచ్చరికగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ డెస్ట్రాయర్లు, దీర్ఘ-శ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా అదనపు సైనిక పరికరాలు మోహరిస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇదొక హెచ్చరిక అని పేర్కొంది."ఇరాన్.. ఆదేశ అనుబంధ మిలిటెంట్ గ్రూపులను అమెరికన్ సిబ్బంది లేదా మిత్రదేశాల ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తే అమెరికా సైతం మా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అదనపు సైనిక, రక్షణ వనరులను విస్తరిస్తాం. గత నెల చివరిలో మోహరించిన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా అమెరికా సైన్యం నిర్వహిస్తుంది. అదనపు సైన్యం.. రాబోయే నెలల్లో రావడం మొదలవుతుంది’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్టోబరు 26న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడింది. కీలకమైన సైనిక, ఆయిల్ స్థావరాల మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరాన్.. ఇజ్రాయెల్‌పై రెండుసార్లు మిసైల్స్‌తో దాడులకు దిగింది. ఏప్రిల్‌లో డమాస్కస్‌లోని తన కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ దాడి చేసింది. తమ దేశం మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూప్ నేతల హత్యకు ప్రతిస్పందనగా అక్టోబర్‌లో మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్.. ఇరాన్ ప్రతీకార దాడి చేస్తుందని అనుమానం -
భారత డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలు
భారత్ దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్‌లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యూఎస్‌లోని లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్‌కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు‘దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్స్‌లు కలిగిన 430 సంస్థలు మరో 16 వేల చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో రూ.46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21 శాతంగా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు..వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు’ అని అధికారులు పేర్కొన్నారు. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
యుద్ధం వస్తే.. ఏ దేశం ‘పవర్’ ఎంత?
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్‌లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?టర్కీ..మిడిల్‌ఈస్ట్‌లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.ఇరాన్..పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్ఈస్ట్లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.ఈజిప్టు..పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.ఇజ్రాయెల్..ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.సౌదీఅరేబియా..బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.ఇరాక్..పవర్ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.సిరియా..పవర్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.ఖతార్..ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.కువైట్..మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్‌లో కువైట్ పదవ ప్లేస్‌లో ఉంది.ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు 1.42611.అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి -
హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. శనివారం ఇజ్రాయెల్ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bangladesh: షేక్ హసీనా తండ్రి విషయంలోనూ..
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి సైన్యం ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.బంగ్లాదేశ్‌లో ఈ విధమైన తిరుగుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 1975లో కూడా ఇదేవిధంగా జరిగింది. నాటి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా తండ్రి, ఆమె సోదరులు హతమయ్యారు. అయితే షేక్ హసీనా ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె బంగ్లాదేశ్‌కు దూరంగా ఇతర దేశాలలో సుమారు ఆరేళ్ల పాటు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె భారతదేశంలో కూడా చాలా కాలంపాటు ఉన్నారు.అది 1975వ సంవత్సరం.. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్మీ యూనిట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. కొంతమంది సాయుధులు షేక్ హసీనా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులను, సోదరులను దారుణంగా హత్యచేశారు. అయితే ఆ సమయంలో షేక్ హసీనా తన భర్త వాజిద్ మియాన్, చెల్లెలు పాటు యూరప్‌లో ఉన్నందున ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.ఈ ఘటన అనంతరం షేక్ హసీనా కొంతకాలం జర్మనీలో ఉండి భారత్‌కు వచ్చారు. నాడు భారతదేశంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనా 1981లో బంగ్లాదేశ్‌కు తిరిగి చేరుకున్నారు. ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. దీని తరువాత షేక్ హసీనా 1986 సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే 1996 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2001 వరకూ ప్రధాని పదవి చేపట్టారు. అలాగే 2009 నుంచి 2004 వరకూ కూడా షేక్ హసీనా ప్రధాని పదవిలో ఉన్నారు. -
చైనా కవ్వింపు చర్య.. భారత్ భూభాగంలో వంతెన నిర్మాణం
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024 ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్‌కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది. -
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్‌ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
అగ్రరాజ్యాలు కళ్లు తెరుస్తాయా?
తెగేదాకా లాగితే ఏమవుతుందో అమెరికాతోపాటు యూరప్ దేశాలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించి ఆ దేశంతో సైనిక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ మర్నాడు వియత్నాం వెళ్లి డజను ఒప్పందాలు చేసుకున్నారు. అందులో అణు పరిశోధనలకు సంబంధించిన అంశం కూడా ఉంది. వియత్నాంతో రక్షణ, భద్రత సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం తమ లక్ష్యమని కూడా పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించిన నాటినుంచీ దాన్ని ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేయాలని అమెరికా, యూరప్ దేశాలు తలపోశాయి. ఉత్తర కొరియా ఏనాటినుంచో అలాంటి ఆంక్షల మధ్యే మనుగడ సాగిస్తోంది. ఇరాన్ సరేసరి. ఇలా ఏకాకుల్ని చేయాలన్న దేశాలన్నీ ఏకమవుతున్నాయని, అది ప్రమాద సంకేతమని అమెరికా, పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్న దాఖలా లేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడాలన్నదే తన ధ్యేయమని పుతిన్ అనటంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది. ఉత్తర కొరియా ఆవిర్భావానికీ, దాని మనుగడకూ నాటి సోవియెట్ యూనియనే కారణం. జపాన్ వలస పాలనతో సర్వస్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియా భూభాగంలోకి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో సోవియెట్ సైనిక దళాలు అడుగుపెట్టాయి. ఆ వెంటనే అమెరికా సైతం అప్పటికింకా సోవియెట్ సైన్యం అడుగుపెట్టని దక్షిణ ప్రాంతానికి తన సైన్యాన్ని తరలించింది. పర్యవసానంగా ఆ దేశం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. సోవియెట్ స్ఫూర్తితో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిందని మొదట్లో ఉత్తర కొరియా ప్రకటించినా అక్కడ అనువంశిక పాలనే నడుస్తోంది. ఆ దేశం గురించి పాశ్చాత్య మీడియా ప్రచారం చేసే వదంతులే తప్ప అక్కడ ఎలాంటి వ్యవస్థలున్నాయో, అవి ఏం సాధించాయో తెలుసుకునే మార్గం లేదు. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకున్న దక్షిణ కొరియా, అమెరికా అండదండలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక ఉత్తర కొరియాతో ఆ దేశానికున్న సంబంధాలు క్రమేపీ కొడిగట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ దశ అంతమైందని, ఇక ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు పేరాశకు పోనట్టయితే ఆ ఆశ సాకారమయ్యేది. అది లేకపోబట్టే ప్రపంచం మళ్లీ గతంలోకి తిరోగమిస్తున్న వైనం కనబడుతోంది. అనునిత్యం సమస్యలతో సతమతమయ్యే ఆ పరిస్థితులు తిరిగి తలెత్తటం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.కొన్నేళ్లక్రితం వరకూ ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న పాశ్చాత్య దేశాలను రష్యా పెద్దగా పట్టించుకునేది కాదు. పొరుగునున్న చైనానుంచే ఆ దేశానికి సమస్త సహకారం లభించేది. 1994లో తనకున్న ఒక అణు రియాక్టర్నూ మూసేయడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా నుంచి రెండు విద్యుదుత్పాదన అణు రియాక్టర్లు స్వీకరించటానికి సిద్ధపడింది. కానీ 2002లో జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలోకొచ్చాక ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేశారు. ఈ పరిణామాల సమయంలోకూడా రష్యా మౌనంగానే ఉంది. శత్రువు శత్రువు తన మిత్రుడని ఎంచి ఇప్పుడు అదే రష్యా తాజాగా ఉత్తర కొరియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. తన నేతృత్వంలోని వార్సా కూటమిని రద్దుచేసుకుని, నాటోలో చేరడానికి రష్యా సిద్ధపడినప్పుడు తిరస్కరించింది నాటోయే. తూర్పు దిశగా విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దాని సరిహద్దు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇచ్చిన ఆ సంస్థ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చలాయించాలన్న యావ రష్యాకుంటే దాన్ని ఎలా దారికి తేవాలో ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ వాటితో అంటకాగి రష్యాను చికాకు పర్చటమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రవర్తించాయి. ఈమధ్య ఇటలీలో జీ–7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా, చర్చలద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని సూచించారు. కానీ వినేదెవరు? విశ్వసనీయతగల అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగితే, ఒప్పందం కుదిరితే అది ఆ రెండు దేశాలకూ మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచి కబురవుతుంది. ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉంది. అమెరికా, దాని ప్రత్యర్థులు రష్యా, చైనాలు ప్రధాన అణ్వస్త్ర దేశాలు. అమెరికా వద్ద దాదాపు 1,700 అణ్వస్త్రాలున్నాయి. అందులో కనీసం సగం నిమిషాల్లో ప్రయోగించేందుకు వీలుగా నిరంతర సంసిద్ధతలో ఉంటాయంటారు. అమెరికాపై ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా క్షణాల్లో యూరప్, ఆసియా దేశాల్లోని దాని స్థావరాలనుంచి పెద్ద సంఖ్యలో అణ్వస్త్రాలు దూసుకెళ్లి శత్రు దేశాలను బూడిద చేస్తాయి. రష్యా, చైనాలపై దాడి జరిగినా ఇదే పరిస్థితి. చిత్రమేమంటే ఒకప్పుడు అణ్వాయుధాలపై బహిరంగ చర్చ జరిగేది. అది ఉద్రిక్తతల నివారణకు తోడ్పడేది. 80వ దశకంలో మధ్యతరహా అణ్వాయుధాల మోహరింపు యత్నాలు జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వాటి నిషేధానికి సంసిద్ధులయ్యారు. కానీ సాధారణ ప్రజలకు సైతం యుద్ధోన్మాదం అంటించారు. ఈ పరిస్థితులు మారాలి. అగ్రరాజ్యాలు వివేకంతో మెలిగి శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. -
పాక్‌ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
చైనా గత మూడేళ్లుగా పాకిస్తాన్‌కు రక్షణ సహకారాన్ని అందిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్‌కు రక్షణ సహాయాన్ని కల్పిస్తోంది. బంకర్ల నిర్మాణానికి, మానవరహిత యుద్ధ వైమానిక వాహనాల విస్తరణకు సాయం చేస్తోంది. ఇంతేకాకుండా ఎల్ఓసీలో రహస్య కమ్యూనికేషన్ టవర్‌ర్లను ఏర్పాటు చేయడం, భూగర్భ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేయడంలోనూ పాక్‌కు చైనా సహాయం చేస్తోంది.చైనాకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్‌లైన ‘జేవై’, జీహెచ్‌ఆర్‌ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎల్ఓసీలో ప్రయోగాలు చేస్తోంది. అలాగే పాక్ సైన్య, వైమానిక రక్షణ విభాగాలకు కీలకమైన ఇంటెలిజెన్స్ మద్దతును చైనా అందిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 155 మి.మీ. హోవిట్జర్ గన్ ఎస్‌హెచ్-15 ఉనికి నియంత్రణ రేఖ వెంబడిగల వివిధ ప్రదేశాలలో కనిపించింది.చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) సీనియర్ అధికారుల ఉనికి ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ, చైనా సైనికులు, ఇంజనీర్లు భూగర్భ బంకర్ల నిర్మాణంతో సహా నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారనడానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లిపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మిస్తున్నారని, ఇది కారకోరం హైవేకి అనుసంధానించే ఆల్-వెదర్ రోడ్డు నిర్మాణాన్ని సూచిస్తున్నదని కొందరు అధికారులు తెలిపారు.కారకోరం హైవే ద్వారా పాకిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవుతో చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసమే ప్రతిష్టాత్మక 46 బిలియన్ల డాలర్ల సీపీఈసీ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తోంది. 2007లో చైనాకు చెందిన ఒక టెలికం కంపెనీ పాక్‌కు చెందిన ఒక టెలికం కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో చైనా మొబైల్ కంపెనీ పాకిస్తాన్లో తన సేవలను అందిస్తోంది.చైనా ఇటీవలి కాలంలో పాక్‌కు అందిస్తున్న సహకారంపై భారత సైన్యం ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నప్పటికీ, ఈ పరిణామాలపై నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలలో చైనా కార్యకలాపాలపై భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపధ్యంలో భారతదేశం అప్రమత్తంగా ఉందని, సరిహద్దు ఆవల నుండి ఏదైనా ముప్పు ఏర్పడితే, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్య అధికారులు తెలిపారు. -
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు. -
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్‌పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్‌ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
సైన్యంలోని రక్షణ శునకాల శాలరీ ఎంత? పదవీ విరమణ తర్వాత పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని పలు దేశాల సైన్యాలలో శునకాలు సేవలు అందించడాన్ని మనం చూసేవుంటాం. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 25కి పైగా ఫుల్ డాగ్ యూనిట్లు ఉండగా, రెండు హాఫ్ యూనిట్లు కూడా ఉన్నాయి. సైన్యంలోని ఫుల్ యూనిట్లో 24 శునకాలు, ఉండగా, హాఫ్ యూనిట్‌లోని శునకాల సంఖ్య 12. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఈ శునకాల జీతం ఎంత? రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏమి చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీలో రిక్రూట్ అయిన శునకాలకు నెలవారీ జీతం ఉందడని అధికారిక సమాచారం. అయితే వాటి ఆహారం, నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత వహిస్తుంది. సైన్యంలో రిక్రూట్ అయిన శునకాన్ని సంరక్షించే బాధ్యత దాని హ్యాండ్లర్దే. శునకానికి ఆహారం ఇవ్వడం నుండి దాని శుభ్రత వరకు అన్నింటినీ హ్యాండ్లర్ చూసుకుంటారు. సైన్యంలోని ప్రతి శునకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన శునకాలు 10 నుంచి 12 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాయి. అలాగే హ్యాండ్లర్ మృతి చెందడం లేదా అవి గాయపడటం లాంటి సందర్భాల్లోనూ శునకాలు రిటైర్ అవుతాయి. ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి పదవీ విరమణ పొందిన శునకాలను కొందరు దత్తత తీసుకుంటారు. ఇందుకోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో అతను తన చివరి శ్వాస వరకు శునకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని హామీనివ్వాలి. సైన్యంలోని డాగ్ యూనిట్లో సేవలు అందిస్తున్న శునకాల ప్రధాన పని మాదక ద్రవ్యాల నుండి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడం. సైన్యంలోని శునకాలు ప్రమాదకర మిషన్లలో సైన్యానికి సాయం అందిస్తాయి. ఈ శునకాలకు గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, మందుపాతరలను గుర్తించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిధిలాలను స్కాన్ చేయడం, ఉగ్రవాదులు దాగున్న స్థలాలను కనిపెట్టడం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఈ శునకాల ప్రధాన శిక్షణ మీరట్‌లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో జరుగుతుంది. 1960లో ఇక్కడ శునకాల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. శునకాలను ఆర్మీ యూనిట్‌కు తరలించే ముందు వాటికి 10 నెలల పాటు శిక్షణ అందిస్తారు. -
మాల్దీవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు!
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం ‘భారత సైన్యం ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. కానీ దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది (విపక్షాలు) తప్పుడు విషయాలను వ్యాప్తిచేస్తున్నారు. కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ మిలిటరీ ఇక్కడి నుంచి వెళ్లడం లేదని.. వారు తమ యూనిఫామ్‌లను పౌర దుస్తులుగా మార్చుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవు. యూనిఫామ్‌లో అయినా లేదా సివిల్ దుస్తుల్లోనూ ఎవరిని ఉండనివ్వం’ అని స్పష్టం చేశారు. చదవండి: Melbourne: ‘డ్రాగన్’కు చెక్..! సింగపూర్ కీలక నిర్ణయం మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవులు విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఢిల్లీలో ఫిబ్రవరి 2న ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే మాల్దీవుల్లో బాధ్యతలు స్వీకరించడానికి భారత సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. -
Maldives Row: మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోండి!
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్‌ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్‌కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు. తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు. అయితే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్ మును మహవర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు మును మహవర్ తెలిపారు. ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. చదవండి: Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్‌కు ఫేవర్! -
భారత దౌత్యనీతికి సవాళ్లు
ఇరుదేశాల మిలిటరీ సంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనా తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు గతేడాది కొన్ని అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, రష్యాతో మన సంబంధాలు గాఢమైనవి. పైగా... తాజాగా భారత్, రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన భావన కలిగింది. రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు, సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంటుంది. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడి ఉంది. కానీ, అగ్రదేశాల సరసన నిలవాలన్న భారత ఆకాంక్ష నెరవేరాలంటే దేశ సైనిక సామర్థ్యం ఇతరులపై ఆధారపడేలా ఉండరాదు. భారతదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో 2024 లోకి అడుగుపెట్టింది. కొత్త ఏడాది తొలి వారంలోనే ఆదిత్య–ఎల్1 విజయవంతంగా సూర్యుడి హాలో కక్ష్యలో ప్రవేశించడం, ఉత్తర అరేబియా సముద్రంలో పైరేట్లను తరిమికొట్టేందుకు భారత నేవీ నాటకీయమైన తీరులో ఆపరేషన్లు చేపట్టడం, అన్నీ శుభసూచనలే. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరమైన రీతిలో దాదాపు 7.3 శాతం వరకూ ఉండవచ్చునని జాతీయ గణాంక శాఖ ప్రకటించిన విషయమూ సంతోషకరమైన సమాచారమే. అన్నింటికీ మించి భారత్ విజయాలను గుర్తిస్తూ, చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఒక కథనమూ ప్రచురించింది. భారత్ చాలా వేగంగా సామాజిక, ఆర్థిక వృద్ధి సాధిస్తోందని ఇందులో అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మక శక్తిగా భారత్ ఎదుగుతోందని కొనియాడింది. రెండూ ముఖ్యమే! అయితే, ఈ విజయాలను ఆస్వాదించే క్రమంలో మనం గత ఏడాది ఆఖరులో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల గురించి మరచిపోరాదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా... ప్రాంతీయంగానూ ఇతర దేశాలతో మన సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ముఖ్యమైన సంఘటనలు అవి. వ్యూహాత్మక లక్ష్యాలను కాపాడుకోవడంలో, సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సత్తాను ప్రశ్నించే అవకాశమూ వీటికి ఉంది. భారత విదేశీ వ్యవహారాల విధానాన్ని స్థూలంగా పరిశీలిస్తే... అమెరికాకు దగ్గరవడం... అదే సమయంలో రష్యాకు నెమ్మదిగా దూరంగా జరగడం అని అనిపిస్తుంది. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ మౌనం వహించడం ఈ భావనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే... భారత్ అటు రష్యాపైనా, ఇటు అమెరికాపైనా ఆధారపడిఉందీ అని. ఇరు దేశాలూ మన మిలిటరీకి అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీలు అందిస్తున్నాయి. ఈ పరిమితుల దృష్ట్యానే భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వ్యక్తం చేయలేకపోతోంది. మరీ ముఖ్యంగా పొరుగుదేశం చైనాను దృష్టిలో ఉంచుకున్నప్పుడు. అయితే 2023 చివరి నాటికి అంతర్జాతీయ వ్యవహారాల్లో పరిస్థితులు కొంచెం వేగంగా మారిపోయాయి. వాటి ప్రభావం ఈ ఏడాది మనపై కచ్చితంగా పడనుంది. నవంబరులో అమెరికా అధ్య క్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య శాన్ఫ్రాన్సిస్కోలో ‘ఏపీఈసీ’ సమావేశాల్లో కీలకమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన కొద్దిగా తొలగిన సూచనలు కనిపించాయి. ఇక డిసెంబరు చివరివారంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా వెళ్లి, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌తో సమావేశమయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం మాదిరిగానే రష్యాతో భారత్ తన సంబంధా లను దృఢతరం చేసుకునేందుకు నిబద్ధమై ఉందని జైశంకర్ రష్యా మంత్రి సెర్గీకి నొక్కి చెప్పినట్లు వార్తలొచ్చాయి. సంక్లిష్టం... బహుముఖం... రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు బహుముఖమైనవి మాత్రమే కాదు... చాలా సంక్లిష్టమైనవి కూడా. ఈ మూడింటి మధ్య సంబంధాల్లో వచ్చే మార్పుల ప్రభావం భారత్‌పై కచ్చితంగాఉంటుంది. ప్రపంచ స్థాయిలో మన ప్రస్థానాన్ని, దిశను మార్చేయగల శక్తి వీటి సొంతం. ఈ సంబంధాల్లోనూ అమెరికా– చైనా మధ్య ఉన్నవి మరింత కీలకం. బైడెన్, జిన్‌పింగ్ ఇటీవలి శిఖరాగ్ర సమావేశంసందర్భంగా కొన్ని అంశాలపై స్థూలంగా ఏకాభిప్రాయానికి రాగలి గారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇందుకు అడ్డు కాకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇరుదేశాల మిలిటరీల మధ్యసంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా, చైనారెండూ తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా యుద్ధాలకు సమీప భవిష్యత్తులో ఒక అర్థవంతమైన పరిష్కారం లభించగలదన్న ఆశ సమీప భవి ష్యత్తులో కనబడని నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశమిది. స్థానిక పరిస్థితులు, ఉన్న పరిమితు లను దృష్టిలో ఉంచుకుని ఇరువురు నేతలు తమ మధ్య అంతరాలను పక్కనబెట్టి ఈ రకమైన రాజీకి వచ్చి ఉండవచ్చు. చైనా–అమెరికా మధ్య మిలిటరీ స్థాయిలో యుద్ధం లేదా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నా దాని విపరిణామాలు తీవ్రంగా ఉండేవి. కాబట్టి తాత్కాలికంగానైనా ఈ ఉపశమనం దక్కడం ముఖ్యమైన విషయం అవుతుంది. తైవాన్ విషయంలో ఇరు దేశాలు మెత్తపడిందేమీ లేకున్నా భారత్ దృష్టిలో మాత్రం చైనా–అమెరికా మధ్య వైరం కొంతైనా తగ్గడం ఎంతో కీలకమైంది. సొంతంగా ఎదిగినప్పుడే... అమెరికా ఇండో–పసఫిక్ వ్యూహంలో భారత్ ప్రధాన భాగస్వామి అన్న అంచనా ఉంది. మరి చైనా– అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడటం భారత్‌కు ఏమైనా నష్టం చేకూరుస్తుందా? అవకాశమైతే ఉంది. పైగా ద్వైపాక్షిక స్థాయిలో ఇరు దేశాల మధ్య గత ఏడాది చివరిలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ పౌరుడు ఒకరిని చంపేందుకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించింది. ఈ కోణంలో చూస్తే భారత్ మీద అమెరికాకు కొంత అసంతృప్తి ఉన్నట్లు స్పష్టమవుతుంది. 1970లలో హెన్రీ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండగా, అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా భారత్, యునైటెడ్ సోవియట్ రిపబ్లిక్ మధ్య బంధాలు గట్టిపడేలా చేసింది. సోవియట్ వారసురాలిగా కొనసాగిన రష్యాతో ఆ సంబంధాలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. భారత త్రివిధ దళాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారింది. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు 2023లో కొన్ని అపోహలైతే ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా కూడా భారత్, రష్యా సంబంధాల్లో సరి కొత్త అధ్యాయం ఒకటి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తోంది. అలాగే అగ్రరాజ్యాల సరసన నిలవాలని కూడా ఆశిస్తోంది. అయితే మిలిటరీ విషయాల్లో విదేశాలపై ఆధారపడుతూంటే భారత్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కష్టం. అమెరికా, రష్యా, చైనా తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించినా ద్వైపాక్షిక స్థాయిలో దగ్గరి సంబంధాలు కలిగి ఉండటం మనకు అవసరం. మన రాజకీయ, దౌత్య చతురతకు ఇది నిజంగానే ఒక సవాలు! వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - కమడోర్ సి. ఉదయ భాస్కర్ -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
జమ్మూలో భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్ల కాల్పులు
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. -
అగ్నివీర్ అమృత్‌పాల్ అంత్యక్రియలపై వివాదం.. ఆర్మీ క్లారిటీ
ఢిల్లీ: అగ్నివీర్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రేగుతోంది. అగ్నివీర్ సైనికుని అంత్యక్రియల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీ స్పందించింది. అగ్నిపథ్ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి భేదం లేదని స్పష్టం చేసింది. ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రాదాయం లేదని వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా.. అగ్నిపథ్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోడంపై ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్‌లో రాజకీయ పార్టీలు సైన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభ్యర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని అధికార పార్టీ ఆప్ కూడా ప్రశ్నించింది. దీంతో ఆదివారం రాత్రి ఆర్మీ ఓ ప్రకటన వెలువరించింది. అమృత్ పాల్ సింగ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అంత్యక్రియల అంశంపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించింది. సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆర్మీ విధానాల ప్రకారమే స్వస్థలానికి చేర్చామని తెలిపింది. 1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఆత్మహత్య వంటి మరణాలకు సైనిక లాంఛనాలు ఉండబోవని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఈ విధానాలను పాటిస్తున్నామని పేర్కొంది. 2001 నుంచి ప్రతి ఏడాది సరాసరి 100-140 సైనికులు ఆత్మహత్యలతో మరణిస్తున్నారని తెలిపిన ఆర్మీ.. ఈ కేసుల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని వెల్లడించింది. నియమాల ప్రకారం అంత్యక్రియల ఖర్చులతో పాటు అందాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఆర్మీలో ఎలాంటి వివక్ష ఉండబోదని, ప్రోటోకాల్ ప్రకారమే అంతా జరుగుతుందని ప్రకటనలో వెల్లడించింది. అన్ని వర్గాల మద్దతును ఆర్మీ గౌరవిస్తూ ప్రోటోకాల్స్‌ను పాటిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం... సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. ► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది. ► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి! ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్‌డోమ్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం... ► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది. ► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది. ► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్‌డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది. ► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది. ► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!! ► అమెరికా తన 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయెల్‌కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! ► పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! రక్షణపై భారీ వ్యయం చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది. ► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023