కాబూల్: అగ్రరాజ్యంపై 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో దానికి కారకులైన అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడం లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా ప్రభుత్వం. అలా సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్‌ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో అఫ్గానిస్తాన్‌లో 2001లో సైనిక చర్యకు దిగింది. ఇక అనుకున్న పని పూర్తి చేసిన అగ్ర రాజ్యం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్ధాన్‌ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తక్షణమే తాలిబన్లు శరవేగంగా అఫ్గన్ ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా గతంలో చేసిన చారిత్రక తప్పిదాలను తెలుసుకుందాం.
ఆఫ్గన్ ప్రజలు పూర్తిగా పశుపోషణపై ఆధారపడి జీవించేవారు. అంతే కాదు మెజారిటీ జనాభా పాత కాలపు కట్టుబాట్ల మధ్య జీవనం గడిపే వారు. వారిలో లింగ సమానత్వం.. చట్టాల పట్ల గౌరవం.. మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల మార్పు తీసుకు రాలేకపోయారు. నెపోలియన్ విదేశీ మంత్రి చార్లెస్ మారైస్ డీ తల్లేర్యాండ్ పెరిగోడ్ మాటల్లో చెప్పాలంటే అఫ్గాన్‌లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం.. ఒక పెద్ద తప్పిదం...అని అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను కట్టడి కోసం పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. కాకపోతే అగ్రరాజ్యం చెప్పినట్లు పాక్ వ్యవహరించలేదు. అమెరికా డిమాండ్లపై పాకిస్థాన్ సైనిక జనరల్స్ తమ ద్వేషపూరిత ప్రణాళిక అమలు చేశారు. ఈ విషయాన్ని గ్రహించి కూడా యూఎస్ నోరు మెదపలేదు. . తమకు ఉగ్రవాదుల అండ అవసరమని అమెరికాను పాక్ నమ్మించగలిగింది. అఫ్గన్‌పై పట్టు కోసం పాకిస్థాన్ సాకులకు అమెరికా తలొగ్గాల్సి వచ్చింది. అమెరికా మిత్రదేశంగా ఉన్న పాక్... తన శక్తియుక్తులన్నీ అగ్ర రాజ్యం కోరిన విధంగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడటానికే ఉపయోగించింది. దీని ప్రభావం అఫ్గన్‌లో అమెరికా సేనలకు ప్రతికూల పరిణామాలకు దారి తీసిందనే చెప్పాలి. అఫ్గన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అమెరికా పాక్‌పైనే ఆధారపడింది.
తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా అమెరికా పని చేసిందే తప్ప.. దానికి పాక్‌లో మూలాలు ఉన్నాయన్న సంగతి తెలియకుండా ఉoటుందా. అయినా ఆ విషయాన్ని విస్మరించింది. తమ సైన్యంపై దాడుల్లో పాక్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని రుజువులు లభించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా ...పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అఫ్గన్‌లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం ఉన్న వారిని కాకుండా హమీద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీ వంటి నేతలను నాయకులుగా నిలబెట్టి మరో పెద్ద పొరపాటు చేసింది. అసలు వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనే విషయాన్ని కూడా గమనించలేదు. నిత్యం ఉగ్రవాదం అక్కడే దేశంలో పాలన ఎలా సాగించాలంటే నాయకుడి పాత్ర చాలా ముఖ్యం. ఇందులోను అమెరికా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇలా అమెరికా ఇన్నేళ్లుగా చేసిన ప్రణాళికలు, ప్లాన్లు అఫ్గానిస్తాన్‌కు పెద్దగా ఉపయోగపడక, అప్పట్లో చేసిన తప్పిదాలు నేటి పరిస్థితులకి ఓ రకంగా కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment