mistakes
-
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!
సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్. తన కొడుకు మైనర్ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే మొదటి పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఆధారంగా బోన్ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జువైనల్ జస్టిస్ యాక్ట్(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్ అని నిరూపించుకునేందుకు పిటిషన్ వేయొచ్చు. అందుకు సెక్షన్ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్‌సర్వీసెస్ అథారిటీకి ధర్మాసనం సూచించింది.1994లో ఏం జరిగిందంటే..డెహ్రాడూన్(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్ ఖన్నా అనే రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.ప్రతీక్ చాదా అనే లాయర్ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్ తరఫున పిటిషన్ వేయగా.. ఎస్ మురళీధర్ ఓం ప్రకాశ్ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, అడ్వొకేట్ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు. -
Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు
కొద్ది రోజుల్లో 2024 ముగిసి 2025 రాబోతుంది. 2024 మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వాటిని ఇప్పుడొకసారి గుర్తు చేసుకుంటే, భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడగలుగుతాం. 1. వాటర్ హీటర్ షాక్‌తో మహిళ మృతిఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్‌లో ఈ ఏడాది నవంబర్‌లో వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.తప్పు ఎక్కడ జరిగింది?కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో పాటు నీళ్లలో చేయి వేయడం ఆ మహిళ తప్పిదమే. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.గ్రహించాల్సిన విషయంవాటర్ హీటర్ వినియోగించాక స్విచ్ ఆఫ్ చేయాలి. హీటర్ రాడ్‌ను నీటిలో నుండి తీసివేయాలి. ఆ తర్వాతనే ఆ వేడి నీటిని వినియోగించాలి2. రూమ్ హీటర్ కారణంగా వృద్ధురాలు మృతి 2024, నవంబర్‌లో యూపీలోని మీరట్‌లోని ఒక ఇంటిలోని బెడ్రూమ్లో ఒక వృద్ధ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె రూమ్ హీటర్ ఆన్ చేసి పడుకుంది.జరిగిన తప్పిదం ఏమిటి?ఆ వృద్ధురాలు హీటర్ స్విచ్ ఆన్ చేసి, గది తలుపులు వేసుకుని పడుకుంది. రూమ్ హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడడంతో దానినే ఆమె పీల్చుకుంది. ఫలితంగా ఆమె మరణించింది.గ్రహించాల్సిన విషయంగదిలోని హీటర్ ఆన్‌చేసి, తలుపులు వేసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు. హీటర్‌ను రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకూడదు.3. ప్రెషర్ కుక్కర్ పేలి బాలికకు గాయాలుఈ ఏడాది జూలైలో యూపీలోని శ్రావస్తి జిల్లాలో ప్రెషర్ కుక్కర్ పేలడంతో 11 ఏళ్ల బాలిక గాయపడింది.ఏమి తప్పు జరిగింది?ప్రెషర్ కుక్కర్లో పేలుడు సంభవించడానికి కారణం రబ్బరు సరిగా అమర్చకపోవడం లేదా విజిల్ పాడైపోవడం కారణమై ఉంటుంది.నేర్చుకోవాల్సిన విషయంకుక్కర్ని ఉపయోగించే ముందు రబ్బరు, విజిల్, సేఫ్టీ వాల్వ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.4. గీజర్ కారణంగా నవ వివాహిత మృతి2024 నవంబర్‌లో యూపీలోని బరేలీలో కొత్తగా పెళ్లయిన ఓ మహిళ బాత్రూమ్లో గీజర్ ఆన్‌లో ఉంచి స్నానం చేస్తోంది. అదేసమయంలో ఉన్నట్టుండి గీజర్ పేలిపోయింది.ఏం తప్పు జరిగింది?చాలాకాలంగా ఆ గీజర్‌కు సర్వీస్ చేయించలేదు.నేర్చుకోవాల్సినదిగీజర్ను చాలాకాలంపాటు వినియోగించకుండా ఉంటే, దానిని సర్వీస్ చేయించిన తరువాతనే వినియోగించాలి.5. గ్యాస్ సిలిండర్ పేలుడు2024, మార్చిలో పట్నాలో ఓ పెళ్లి వేడుకలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి.ఏం తప్పు జరిగింది?గ్యాస్ సిలిండర్ పేలిన సందర్భాల్లో సరైన నిర్వహణ లేకపోవడమే కారణం.నేర్చుకోవలసినది ఏమిటి?సిలిండర్‌ను ఎప్పుడూ నిలబెట్టి ఉంచాలి. దానిని పడుకోబెట్టి ఉంచకూడదు. దాని వాల్వ్ ఎప్పుడూ పైకి ఉండాలి. అలాగే సిలిండర్‌ను గాలి తగిలే ప్రాంతంలో ఉంచాలి. కిటికీలు, తలుపులు మూసివున్న ప్రాంతంలో ఉంచకూడదు.6. మొబైల్ ఛార్జర్ కారణంగా బాలిక మృతితెలంగాణలో విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మొబైల్ ఛార్జర్‌ని ఆన్‌లో ఉంచి ఫోను వినియోగించింది. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌నకు గురయ్యింది.ఏం తప్పు జరిగింది?విద్యుత్ ఛార్జర్‌ను విద్యుత్ సాకెట్లో పెట్టి, ఫోను వినియోగించడం వలన అది విద్యుత్ షాక్‌కు దారితీస్తుంది.మనం నేర్చుకోవల్సినది ఏమిటి?ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి ఎప్పుడూ ఉపయోగించకూడదు.7. పవర్ బ్యాంక్ కారణంగా చెలరేగిన మంటలుఈ ఏడాది అమెరికాలోని ఒక ఇంటిలో ఒక శునకం పవర్ బ్యాంక్ నమలడంతో దాని నుంచి మంటలు చెలరేగాయి.ఏం తప్పు జరిగింది?చాలా పవర్ బ్యాంకులు ఓవర్ హీట్ అయినప్పుడు పేలే అవకాశం ఉంది.మనం నేర్చుకోవలసినదిపవర్ బ్యాంక్‌ను చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.8. డీజే సౌండ్‌కు చిన్నారి మృతిఈ ఏడాది భోపాల్‌లో డీజే శబ్దానికి ఓ చిన్నారి మృతి చెందింది.ఏం తప్పు జరిగింది?డీజే నుంచి వచ్చే ధ్వని మనిషి వినికిడి సామర్థ్యం కంటే 300 రెట్లు ఎక్కువ.దీని నుంచి నేర్చుకోవలసినదిఎల్లప్పుడూ లౌడ్ స్పీకర్లకు అత్యంత సమీపంలో నిలబడకూడదు. అటువంటి సందర్బాల్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్లను ఉపయోగించాలి.9. జాబ్ ఆఫర్ పేరుతో మోసంఈ ఏడాది నవంబర్‌లో పంజాబ్‌లోని మొహాలీలో టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్ పేరుతో ఒక ముఠా మోసానికి పాల్పడింది. ఓ యువకుడి నుంచి రూ.2.45 లక్షలకు పైగా మొత్తాన్ని వసూలు చేసింది.ఏం తప్పు జరిగింది?ఆ యువకుడు ఆ జాబ్ ఆఫర్‌ను గుడ్డిగా నమ్మాడు. వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించాడు.దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠంఉద్యోగం పేరుతో ఎవరైనా మీ నుండి డబ్బు డిమాండ్ చేస్తుంటే, అటువంటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.10. కారు లాక్ కావడంతో మూడేళ్ల బాలిక మృతి2024 నవంబర్‌లో యూపీలోని మీరట్‌కు చెందిన మూడేళ్ల బాలిక ఒక కారులో నాలుగు గంటలపాటు లాక్ అయిపోయింది. ఫలితంగా ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది.ఏం తప్పు జరిగింది?కారు డోరు లాక్ కావడంతో దానిలోని ఆక్సిజన్ లెవల్ తగ్గింది. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగింది. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందింది.నేర్చుకోవలసిన అంశంకారులో పిల్లలను ఉంచి బయటకు వెళ్ల కూడదని గుర్తించాలి.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
పోలవరంపై చారిత్రాత్మక తప్పిదం
-
దివ్యాంగులకు ఆరోగ్య బీమా.. ఈ 5 తప్పిదాలు చేయొద్దు
సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..కీలక వివరాలను పట్టించుకోకపోవడం: ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం: క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం: కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్‌ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం: ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్‌వర్క్‌లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్‌లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.ఇందుకోసం కంపారిజన్ వెబ్సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి. -
శ్రీవారి లడ్డూ విషయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న చంద్రబాబు తప్పులు
-
నోరు.. నాలుక... నిప్పురవ్వ
‘‘నోటిని, నాలుకను అదుపు చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును’’ (సామెతలు 21: 23)కొందరు అనవసర మాటల వల్ల తొందరపడి తప్పులు చేస్తున్నారు.. చిక్కుల్లో పడుతున్నారు. అవతలివారికి చిక్కి, జగడమాడుతున్నారు. అదుపులేని మాటలు, అసభ్యకర మాటలను పెద్దలు వింటున్నారని కూడా విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఎదుటివారికి కోపం వస్తుందని, వారి మనసుకు గాయమవుతుందని గ్రహించలేకపోతున్నారు. జంతువులు కేకలు వేస్తాయి, అరుపులు అరుస్తాయి. కానీ దేవుడు మనకు వాక్శక్తి అనుగ్రహించాడు. ఎంతమంది నాలుకను అదుపులో పెట్టుకుంటున్నారు... సద్వినియోగపర్చుకుంటున్నారు! నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారు కొందరు. కానీ ఎన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నారో తెలియదు. ఈ విషయంలో ఏసుక్రీస్తు శిష్యుడైన యాకోబు తాను రాసిన పత్రిక 3 :2 లో ఏమని రాశారో గమనిద్దాం. అనేక విషయాలలో మనమందరం తప్పి΄ోతున్నామని, ఎవరైనా మాట తప్పిన యెడల అట్టివాడు లోపం లేనివాడై, తన మొత్తం శరీరాన్ని కాపాడుకోగల శక్తి గలవాడవుతాడని గుర్రాలను, మనుషులు లోబరచుకోవడానికి నోటికి కళ్లెం పెట్టి త్రిప్పుతున్నారు కదా! ఓడలను కూడా చూడండి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొనిపొయినా ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున చాలా చిన్నదైన చుక్కాని చేత తిప్పబడుతుందికదా! ఆలాగున నాలుక కూడా చిన్ని అవయవమైనా బహుగా అదిరిపడుతుంది.ఎంతో చిన్నదైన నిప్పురవ్వ బహు విస్తారమైన అడవిని కూడా తగులబెడ్తుంది కదా! నాలుక కూడా అగ్ని వంటిదే. నాలుక కూడా చిన్నదైనను బహుగా అదిరిపడును. సర్వశరీరమును మాలిన్యం కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అది ప్రకృతి చక్రాన్నే తిప్పును. నరకంలోకి తీసుకొనిపోవును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతీ నరులకు సాధు కాజాలును కానీ మానవుడు నాలుకను సాధు చేసుకోలేక ΄ోతున్నాడు. మాటలు తక్కువగా మాట్లాడాలి. సక్రమంగా మాట్లాడాలి. ఇతరులను కించపరచకూడదు.దేహమును శిక్షకు లోనగునంత నోటివలన చేయకుము, అది ΄పాటున జరిగెనని దూతల యెదుటను చెప్పకూడదు. నీ నోటి మాటల వల్ల దేవునికి కోపము పుట్టింపనేల అని సెలవిచ్చాడు. మహరాజైన దావీదు నోటికి చిక్కము పెట్టుకుంటానన్నాడు. పంచాయితీలోను, ప్రజలలోను, సభలలోను అనాలోచితంగా మాట్లాడక ఆలోచించి యుక్తముగా మాట్లాడాలి. యేసుప్రభువు కూడా పిలాతు మాట్లామమన్నా మాట్లాడలేదు. పిలాతు యేసుక్రీస్తు వారితో నేను సహాయము చేసి శిక్షను పడకుండా చేస్తానన్నా ప్రభువు ఆయన నోటిని అదుపులో పెట్టుకొన్నాడు. మారుమాట పలకలేదు. కావున మానవమాత్రులమైన మనం నోటిని అదుపులో పెట్టుకొని మన ప్రాణాలను కాపాడుకోవాలి. సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని పోందాలి.– కోట బిపిన్ చంద్రపాల్ -
100% చంద్రబాబు చేసిన తప్పే..
-
బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
పోరాటం.. ఆరాటమే!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లోని ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల సంతోషంగా లేరని ఓ సర్వేలో వెల్లడైంది. వారి ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మానసికంగా, భావోద్వేగాల పరంగా, సామాజిక అంశాల పరంగా సంతోషంగా సంతృ›ప్తికరంగా సాగడం లేదని స్పష్టమైంది. దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో సాగుతున్నట్టుగా గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్– 2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్ని విధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావాహ దృక్పథంతో ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది.అధ్యయనం ఇలా... దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా..ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక స్థితి, శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ.. సంతృప్తి–పురోగతి, కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్), బాధ–కుంగుబాటు (సఫరింగ్) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరిస్తోంది. ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? అనే అంశంపై పది పాయింట్లకు గాను కనీసంగా ఏడు, ఆ పై స్థాయిలో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్’(సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కిస్తోంది. ఉద్యోగులు తమ జీవితం పట్ల అభధ్రతా భావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారి ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్’(కష్టాలు ఎదుర్కోవడం)గా పరిగణిస్తోంది. ‘సఫరింగ్’ (బాధ–ఇబ్బందులు) గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారి ప్రస్తుత జీవనం, భవిష్యత్ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధను అనుభవిస్తున్న వారిగా వర్గీకరిస్తోంది.ఏమిటీ గ్యాలప్ సంస్థ ? ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్’కృషి చేస్తోంది. ఉద్యోగులు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరు తెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఈ వర్గాల వారు ఎదుర్కుంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది.ఉద్యోగి చేస్తున్న ఉద్యోగం, నిర్వర్తిస్తున్న విధులు, పనిలో భాగంగా ఎదురయ్యే అనుభవాలు, ఇబ్బందులను మాత్రమే కాకుండా.. జీవితంలో త్రైవింగ్, స్ట్రగులింగ్, సఫరింగ్ను తాము పరిశీలించినపుడు రోజువారీ భావోద్వేగాలు, కెరీర్ ముందడుగు వంటివి ప్రాథమికంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా వెల్లడైందని గ్యాలప్ వరల్డ్ పోల్ గ్లోబర్ రీసెర్చ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీనివాసన్ చెబుతున్నారు. ఉద్యోగం చేసే చోట్ల, పని ప్రదేశాల్లో సవాళ్లను, కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే వారికి... ఆయా అంశాలు వారి ఆరోగ్యం, సంతోషాలను ప్రభావితం చేస్తున్నట్టు స్పష్టమైందని తెలిపారు. ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్’ నివేదికలో ఏముందంటే..?⇒ ప్రతీరోజు భావోద్వేగ పరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపానికి, ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం ⇒ భారత్‌లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియాలో చూస్తే... శ్రీలంకలో ఇది 62 శాతంగా, ఆఫ్గానిస్తాన్‌లో 58 శాతంగా ఉండగా, భారత్‌లో 32 శాతం ఉంది⇒ తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్‌లో మాత్రం 52 శాతంగా ఉన్నారు. -
అద్భుతమైన క్రెడిట్ స్కోర్.. ఈ ఆరు తప్పులు అస్సలు చేయొద్దు!
క్రెడిట్ స్కోర్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన అంశం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అధిక రుణాలు వేగంగా పొందవచ్చు. అలాగే అనుకూలమైన వడ్డీ రేట్లు కూడా లభిస్తాయి. అయితే మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి శ్రద్ధ, తెలివైన ఆర్థిక నిర్ణయాలు అవసరం. సాధారణంగా చేసే కొన్ని తప్పుల కారణంగా క్రెడిట్ తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్‌ను 700 కంటే ఎక్కువగా ఉండాలంటే సరిదిద్దుకోవాల్సిన ఆరు తప్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు క్రెడిట్ నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం. ఇందులో ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించుకోవడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకావశం ఉంటుంది. చెల్లింపులు విస్మరించడం ఆలస్యంగా చేసిన లేదా విస్మరించిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అది క్రెడిట్ కార్డ్ అయినా, తనఖా అయినా లేదా మరేదైనా రుణమైనా, సకాలంలో చెల్లింపులు చాలా కీలకం. గడువు తేదీలు దాటిపోకుండా రిమైండర్లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేసుకోండి. హైరిస్క్ లోన్లలో సహ సంతకం చేయడం తెలిసిన వారి ఎవరైనా రుణాలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది సహ సంతకాలు చేస్తుంటారు. ఇది సహాయకమైన చర్యగా అనిపించినా సహ సంతకం చేసిన వ్యక్తి చెల్లింపుల్లో విఫలమైతే అది మీ క్రెడిట్ స్కోర్ నేరుగా ప్రభావితమవుతుంది. సహ సంతకం చేయడానికి ముందు, రుణగ్రహీత ఆర్థిక బాధ్యత, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయండి. క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం లేదా అధిక బ్యాలెన్స్‌ని కలిగి ఉండటం మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగాన్ని ప్రదర్శించడానికి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను పరిమితి కంటే తక్కువగా ఉంచడం, ఆదర్శంగా 30% కంటే తక్కువగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు సానుకూలంగా దోహదపడుతుంది. ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు చేస్తే రుణదాతలు ఆర్థిక అస్థిరతగా భావించవచ్చు. ప్రతి అప్లికేషన్ కోసం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం అనేది వివేకవంతమైన చర్యగా అనిపించవచ్చు. అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. ఎక్కువ క్రెడిట్ హిస్టరీ ఉండటం అనేది క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో ఒక అంశం. పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ తగ్గిపోయే అవకాశం ఉంది. -
నెహ్రూ వల్లే కశ్మీర్లో కుంపట్లు
జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్‌ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అంతటితో ఆగకుండా కశ్మీర్ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశాయి. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్‌కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో తిరిగి భారత్‌లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్ దాటి కశ్మీర్‌కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు. ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతబ్ కోరగా అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్‌ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్ సర్కారుకు లేకపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. -
కేసీఆర్ బిగ్ మిస్టేక్స్
-
Aadhaar Special Camps: 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులుచేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్టు లక్ష్మీశ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు. -
ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పొరపాట్లు, తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తప్పులు ఆదాయపు పన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో జరిమానాలు, నోటీసులకు దారి తీయవచ్చు. ఐటీఆర్ దాఖలును విస్మరించడం, ఆదాయాన్ని తక్కువగా, తప్పుగా చూపించడం వంటి వాటికి పాల్పడిన సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలిపారు. అటువంటి నోటీసులకు, జరిమానాలకు గురికాకూడదంటే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ సూచన మేరకు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ శాఖ నోటీసులకు, జరిమానాలకు గురి చేసే అవకావం ఉన్న కొన్ని సాధారణ తప్పులు ఇక్కడ తెలియజేస్తున్నాం. వాటిని గుర్తించి ఆ తప్పులు లేకుండా ఐటీఆర్ దాఖలు చేయండి. సరికాని ఐటీఆర్ ఫారం ఎంపిక మీ ఆదాయ స్వభావం, పన్ను చెల్లింపుదారుల వర్గం ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి. తప్పు ఫారమ్‌ను ఉపయోగించడం వలన మీ రిటర్న్ లోపభూయిష్టంగా మారవచ్చు. ఉదాహరణకు, జీతం పొందే వ్యక్తులు ఐటీఆర్ ఫారం-1ని ఫైల్ చేయాలి. మూలధన లాభాల ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫారం-2ని ఉపయోగించాలి. ఫారమ్ 26AS, టీడీఎస్ సర్టిఫికేట్‌ను విస్మరించడం మీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఫారమ్ 26ASని పూర్తిగా ధ్రువీకరించండి. ఈ పత్రంలో ముఖ్యమైన ఆదాయ వివరాలు, పన్ను మినహాయింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ అసెస్మెంట్ పన్నుతోపాటు అర్హత కలిగిన పన్ను క్రెడిట్లు ఉంటాయి. ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఫారం 16తో సరిచూసుకోవడం అవసరం. దీంతోపాటు వార్షిక సమాచార ప్రకటన (AIS)తో కూడా చెక్ చేసుకోండి. ఐటీ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ రెండు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధిక విలువ లావాదేవీలను దాచడం మీరు ఆదాయ వివరాల్లో ఆస్తి కొనుగోళ్లు లేదా గణనీయమైన క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను దాచిపెడతే ఐటీ శాఖ నోటీసు జారీ చేయవచ్చు. ఈ లావాదేవీల కోసం ఉపయోగించిన నిధుల మూలానికి సంబంధించి వారు వివరణ కోరవచ్చు. వ్యత్యాసాలను నివారించడానికి, మీ ఖర్చు, నివేదించిన ఆదాయం మధ్య స్థిరత్వం ఉండేలా చూసుకోండి. బోగస్ తగ్గింపులు, క్లెయిమ్‌లు మీకు వర్తించని తగ్గింపులను క్లెయిమ్ చేయొద్దు. ఉదాహరణకు, మీరు పనిచేసే సంస్థ జారీ చేసిన ఫారమ్ 16లో పేర్కొన్నదానికి విరుద్ధంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేస్తే ఐటీ శాఖ కచ్చితంగా దృష్టి పెడుతుంది. వీటిపై విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. తప్పుడు వ్యక్తిగత సమాచారం మీ రిటర్న్‌లో పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పాన్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను అందించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వివరాలు వాస్తవ, తాజా సమాచారంతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. సరైన బ్యాంక్ వివరాలను అందించకపోతే అర్హమైన పన్ను రీఫండ్లను పొందడంలో జాప్యం జరుగుతుంది. గడువు తేదీని దాటిపోవడం జరిమానాలను నివారించడానికి గడువు తేదీ జూలై 31లోపు మీ ఐటీఆర్‌ని ఫైల్ చేయండి. ఒక వేళ గడువు మించిపోతే రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఆలస్య రుసుము, నెలకు 1 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం వలన ట్యాక్స్ రీఫండ్ పొందడం కూడా ఆలస్యమవుతుంది. ఆదాయ మార్గాలను దాచడం మీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఆదాయ మార్గాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. మీరు జీతం పొందే వ్యక్తి అయినప్పటికీ, పన్ను నుంచి మినహాయించిన వాటితో సహా ఏదైనా ఇతర ఆదాయాన్ని పొందుతుంటే తప్పనిసరిగా ప్రకటించాలి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అవగాహన లోపం కారణంగా మినహాయింపు ఆదాయ వివరాలను అనుకోకుండా వదిలేస్తుంటారు. అసెస్మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు ఆదాయాన్ని ఆర్జించిన ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించే తగిన అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకున్నారో లేదో నిర్ధారించుకోండి. ఈ సంవత్సరం అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ కోసం అసెస్మెంట్ ఇయర్ 2023-2024 అవుతుంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. -
Adipurush Movie: దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు గుర్తించారా? (ఫోటోలు)
-
ఆదిపురుష్ లో మేజర్ మిస్టేక్స్...ఇవే లేకుండా ఉండుంటే
-
Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్‌పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్‌తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు ) ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్‌పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే! 1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు. 2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు. 3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు. 5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్‌లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. 6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. (ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. -
రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. పరిష్కారం ఏమిటంటే..
ఇంటర్నెట్ అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అన్నిపనులు ఎంతో సులభం అయ్యాయి. గతంలో ఇటువంటి పనుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ముఖ్యంగా ట్రైన్ టిక్కెట్ బుకింగ్ విషయంలో అందరికీ భారీ ఉపశమనం లభించింది. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో వయసు, జండర్ మొదలైనవాటిని తప్పుగా నమోదు చేస్తే రైల్వే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పులు దొర్లుతుండటం అనేది అందరి విషయంలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం ప్రయాణంపై పడుతుంది. ఒకవేళ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో వయసు లేదా జండర్ తప్పుగా నమోదు చేస్తే ఆ టిక్కెట్ మార్చేందుకు అవకాశం ఉండదు. వీటిని సరిదిద్దే అవకాశం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదు. అయితే కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఈ పొరపాటును దిద్దుకోవచ్చా లేదా అనే విషయం కూడా వెబ్సైట్లో అందుబాటులో లేదు. అలాగే పేరును పొరపాటుగా రాసినా కూడా దానిని మార్చుకునేందుకు అవకాశం లేదు. దీని గురించి రైల్వే అధికారులను సంప్రదించగా అక్రమాలను, మోసపూరిత చర్యలను అరికట్టేందుకే ఐఆర్సీటీసీ ఈ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం ఒకరి టిక్కెట్‌పై మరొకరు ప్రయాణించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఐఆర్టీసీ విధించిన నిబంధనలను ఎవరూ అతిక్రమించలేరు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో పేరు, వయసు, జండర్ ఇలా ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా నమోదు చేస్తే, ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు. అలా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత సరైన రీతిలో తిరిగి టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వయసు ఒక్కటి తప్పుగా నమోదు చేసిన సందర్భాల్లో తమకు కేటాయించిన సీటును కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి రిజర్వేషన్ సూపర్వైజర్ను సంప్రదించి, జరిగిన పొరపాటు గురించి తెలియజేయాలి. అప్పడు అతను దానిపై అధికారికి స్టాంపు వేస్తారు. అప్పుడు ఈ టిక్కెట్‌కు వయసు నిర్ధారిత పత్రాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు టిక్కెట్ నమోదులో జరిగిన పొరపాటును గుర్తించిన 24 గంటల ముందుగానే ఈ పని చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేసినా సఫలం అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. రిజర్వేషన్ సూపర్వైజర్ నిర్ణయంపై ఇది ఆధారపడివుంటుంది. ఇదేవిధంగా సంబంధిత ట్రైన్ టీటీని సంప్రదించి, తగిన ఐడెంటిటీ చూపిస్తే, ఆయన మానవత్వ దృష్టితో మీ పొరపాటును గ్రహించి, ఆ టిక్కెట్‌తో ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించవచ్చు. ఇది కూడా చదవండి: రూ. 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోయింది! -
క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డు ఉండటం చాలా అవసరంగానూ సర్వసాధారణంగానూ మారిపోయింది. లావాదేవీల పరంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండూ దాదాపు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే వాటికి కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి ఖర్చు చేయడానికి డెబిట్ కార్డ్ ఉపయోగపడితే, ఖాతాలో డబ్బులేకపోయినా, లిమిట్ మేరకు తక్షణ అవసరాలకు వాడుకుని భవిష్యత్తు చెల్లింపు సూత్రంపై క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ స్కోర్. క్రెడిట్ కార్డ్‌ని షాపింగ్ చేయడానికి, అవుట్లెట్లలో చెల్లింపులకు, ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి, ఏటీఎం నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ నగదు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ లేదా బ్యాంకు క్రెడిట్ పరిమితి నుండి లోన్‌గా లభిస్తుంది. లావాదేవీ జరిగిన తేదీ నుండి గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిలో లోన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అయితే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే భారీ షాక్ తప్పదు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్లను సంపాదించవచ్చు. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆకర్షణీయమైన బహుమతులు, షాపింగ్ వోచర్ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో ఉపయోగించక పోతే క్రెడిట్ కార్డ్ తిప్పలు తప్పవు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నివారించాల్సిన అత్యంత సాధారణ తప్పులను చూద్దాం. సకాలంలో చెల్లింపులు క్రెడిట్ కార్డ్ గడువు తేదీని అస్సలు మిస్‌కాకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్లో మొత్తం ఖర్చులపై 48 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని అనుమతి ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి నెల నిర్దిష్ట తేదీలోపు బకాయిలను క్లియర్ చేయాలి. గడువు తర్వాత బకాయి మొత్తంపై వడ్డీ బాదుడు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో.. సకాలంలో బిల్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) చెల్లించాల్సిన కనీస మొత్తం, వడ్డీ వివరాలు పూర్తిగా చూడాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మొత్తం లోన్ అమౌంట్ చెల్లించలేక, ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ మెయిల్ ద్వారా అందించే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను పూర్తిగా చదవాలి. ఇందులో లోన్లపై వివరాలు, వడ్డీ, చెల్లించాల్సిన మినిమం నగదు లాంటి వివరాలు పరిశీలించాలి. ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో పేర్కొన్న అన్ని లావాదేవీలు ఖచ్చితమైనవేనా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పొరబాటు లేదా మోసపూరిత లావాదేవీ జరిగినట్లయితే క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లు వడ్డీ ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, వార్షిక రుసుములు మొదలైన అనేక ఛార్జీలుంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అలాంటి ఛార్జీలు ఏవైనా ఉంటే, అన్యాయమని భావిస్తే వాటిపై ప్రశ్నించవచ్చు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నగదు విత్‌డ్రా అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప దీన్ని వాడ కుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి నగదు అడ్వాన్సులపై అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. అంతేకాదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ షురూ అవుతుంది. అంతేకాకుండా, రుణ మొత్తం పెరుగుతూనే ఉండి చివరికి బిల్లును తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ లిమిట్ మించకుండా క్రెడిట్ కార్డ్ వాడేటపుడు మన లిమిట్‌ను ఖచ్చితంగా గమనించాలి. క్రెడిట్ రేషియోలో 50శాతం లేదా అంతకంటే తక్కువ వాడటం ఉత్తమం. ఇలాంటి వాటిల్లో తేడా వస్తే క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బ తింటుంది. అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డ్ భారతదేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, ఫీచర్లు, ప్రయోజనాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉదాహరణకు విమాన టిక్కెట్లు ,హోటల్స్బుక్ చేసుకోవడానికి అదనపు ప్రయోజనా లందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉన్న క్రెడిట్ కార్డ్ కోసం కూడా వెతకవచ్చు, తద్వారా ఇతర క్రెడిట్ కార్డ్‌ల నుండి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. చివరగా: క్రెడిట్ కార్డ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కానీ వాటిని తెలివిగా వాడితేనే ఫలితం. లేదంటే అనవసరమైన అప్పులు చిక్కులు తెచ్చిపెడతాయి. అన్నింటికంటే మించి, అవసరాలకు సరిపోయే సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. నిర్లక్ష్యంగా అవకాశం ఉంది కదా అని ఎలాంటి ప్లాన్స్ లేకుండా వాడేస్తే ఆ తరువాత వాటిని చెల్లించలేక నానా అగచాట్లు పడాలి. వడ్డీకి వడ్డీకి పెరిగి పెద్ద గుదిబండలాగా మెడకు చుట్టుకుంటుంది. (బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) -
ట్యాక్స్ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే..
ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నాం. ఈ దశలో ట్యాక్స్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యమైన అంశం. చివరి నిమిషంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పన్ను ఆదా చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇలా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి సమర్థవంతమైన ట్యాక్స్ ప్లానింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. అవగాహన ముఖ్యం ప్రస్తుత ఖర్చులపై అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం పొరపాటు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. బీమా ప్రీమియం రూ.5 లక్షలు మించకూడదు ఏడాదికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో బీమా పాలసీలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఉండదని 2023 బడ్జెట్ స్పష్టం చేసింది. కాబట్టి పన్ను మినహాయింపుల కోసం బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టేవారు దానికి చెల్లించే ప్రీమియం ఏడాదికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! క్రెడిట్ కార్డ్ వినియోగంలో జాగ్రత్త! పన్ను మినహాయింపుల కోసమని కొంతమంది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోస్తుంటారు. ఇలా చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది అప్పులు పెరిగేందుకు దారితీయవచ్చు. ముందుగానే ప్లానింగ్ మంచిది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి ఆఖరు నెల వరకు ఆగకుండా ముందుగానే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
తప్పు చేయొద్దు! అక్రమ వలసదారులకు రిషి సునాక్ స్ట్రాంగ్ వార్నింగ్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను అనుమతించమని ఖరాకండీగా చెప్పేశారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి అక్రమ వలసదారుడిని బహిష్కరించడమే గాక ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా అనుమతించమని స్పష్టం చేశారు. యూరప్ నుంచి సరిహద్దులు దాటి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పడవలపై అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక రువాండ లేదు సురక్షితమైన మూడో దేశం నుంచి పడవల ద్వారా అక్రమంగా వస్తున్న వలసదారులను బహిష్కరించి, శాశ్వతంగా రాకుండా నిషేధించేలా హోం సెంక్రటరీ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. తప్పు చేయొద్దు, చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే మీరు ఉండలేరు. అక్రమ వలసలు నేరమని, పైగా అక్రమంగా ప్రవేశించిన ముఠాలను అనైతిక వ్యాపారాలు కొనసాగించేలా అనుమతించడం సరికాదని బ్రిటీష్ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. అలాగే పడవలను ఆపేస్తానన్న నా వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సరిహద్దు దాటిని అక్రమ వలసదారులను అనుమతించడానికి, ఆశ్రయం పొందాలన్న యూకేలోని చట్టాలను అనుసరించాలని చెప్పారు. వలసదారుల కేసు విచారణ కోసం ఉన్నప్పుడూ అనుమతిస్తారని, కానీ కొత్త చట్టం ప్రకారం అటువంటి వలసదారులు మొదటి స్థాయిలో ఆశ్రయం పొందకుండా నిరోధిస్తుందని ప్రధాని రిషి సునాక్ చెప్పారు. కాగా, ఫ్రాన్స్ నుంచి యూకేకి ప్రమాదకర స్థాయిలో శరణార్థులు వలస రావడాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: పాక్‌లో ఆత్మాహుతి దాడి..తొమ్మిది మంది పోలీసులు మృతి) -
కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ పోర్షే భలే చిక్కుల్లో పడింది. కంపెనీ అతిపెద్ద మార్కెట్ చైనాలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే అక్కడి చైనా డీలర్ ఒకరు 148,000 డాలర్ల(రూ. 1.21 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల కంటే కొంచెం ఎక్కువ) అంటూ తప్పుగా లిస్ట్ చేశారు. వాస్తవ ధరలో ఎనిమిదో వంతు తగ్గేసరికి లగ్జరీ కార్ లవర్స్ ముందస్తు బుకింగ్‌కు ఎగబడ్డారు. చివరికి విషయం తెలిసి ..ఇదెక్కడి చోద్యం రా మామా అంటూ ఉసూరుమన్నారట.! బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం ప్రముఖ 2023 పనామెరా మోడల్ విక్రయంలో ఉత్తర చైనా పట్టణంలోని యిన్చువాన్లోని పోర్షే డీలర్ ఇచ్చిన ఆన్లైన్ ప్రకటన కంపెనీని పరుగులు పెట్టించింది. అతి తక్కువ ధరకే తమ ఫ్యావరెట్ కారు అనేసరికి ఊరుకుంటారా? వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు 911 యువాన్లను ముందుగానే చెల్లింపుతో కారును బుక్ చేసేశారు. ఈ బుకింగ్‌లు చూసి ఆశర్చర్యపోయిన కంపెనీ ఏం జరిగిందా? అని ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. దీంతో "లిస్టెడ్ రిటైల్ ధరలో తీవ్రమైన పొరపాటు జరిగింది" అని పోర్షే ప్రకటించాల్సి వచ్చింది. బుకింగ్‌లు చేసి, అడ్వాన్స్‌ను చెల్లించిన మిగతా వారందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 48 గంటల్లోగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది. దీంతో భంగపడిన కస్టమర్లు, ఇతర వినియోగదారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోర్షేను విపరీతంగా ట్రోల్ చేశారు. కాగా పోర్షే 2022 మొదటి అర్ధ భాగంలోనే చైనాలో 6.2 బిలియన్ డార్లు విలువైన సేల్స్ సాధించింది. 46,664 వాహనాలను విక్రయించింది. ప్రీమియం కార్ బ్రాండ్ పోర్షే ప్రపంచ విక్రయాలలో 30 శాతమట. -
మీ పాన్ కార్డ్‌లో తప్పులు ఉన్నాయా? ఇలా ఈజీగా మార్చుకోవచ్చు!
ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా వాడేవారు. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యాపార వేత్తలు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రమే పాన్ కార్డు వాడే వారు. కాల క్రమంలో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడంతో పాన్ కార్డు తప్పనిసరి. ఇలా పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కోసారి ఇంటి పేరులోనూ, అసలు పేరులోనూ, లేదా అడ్రస్ ఇలాంటి వివరాల్లో తప్పులు దొర్లవచ్చు. కొన్ని సందర్భాల్లో పెళ్లైన యువతులకు వారి ఇంటి పేరు మారుతుంది. అలాంటి సమయంలో వారు తమ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఇంటినుంచే తమ మొబైల్ ఫోన్లోనైనా, డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనైనా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇలా మార్పులు చేర్పులు మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్లో పాన్ అధికారిక అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న సర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కిందకు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data సెక్షన్లోకి వెళ్లి ఆప్లై ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నంబర్‌తోపాటు తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. ఆపై కింద బటన్ నొక్కి, తర్వాత ప్రక్రియలోకి వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ పేజీ కనిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఇంటి పేరు తదితర వివరాలన్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు పూర్తి అయ్యాక పాన్ కార్డు అప్డేట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకుని, దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్డీఎల్ కార్యాలయానికి పంపించేస్తే.. అక్కడి నుంచి అప్డేటెడ్ పాన్ కార్డు అందుకుంటారు. -
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
మంచి మాట: పాతుకుపోయినా... తప్పు తప్పే!
సంస్కరణలకూ, కచ్చితత్వానికీ మన జీవనవిధానంలోనూ సమాజంలోనూ, కళారంగంలోనూ వ్యతిరేకత ఎదురౌతూనే ఉంటుంది. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాతబృందం సంస్కరణలనూ, నిర్దుష్టతనూ స్వీకరించనూ లేదు, హర్షించనూ లేదు. పాతుకునిపోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. పాతది కాబట్టి అదంతా మంచిది కాదు; కొత్తదైనందువల్ల అది అధమమైనది లేదా పనికిమాలినది కాదు; తెలివైనవాళ్లు పలు పరిశీలనలు చేసి (విషయాన్ని) తీసుకుంటారు; మూఢులు పరులను అనుసరిస్తారు అన్న ఎరుకను కాళిదాసు ఎప్పుడో తెలియజెప్పారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. సంస్కరణలను, నిర్దుష్టత్వాన్ని ఎంత మాత్రమూ స్వీకరించలేని, హర్షించలేని పాత బృందానికి అతీతంగా నేటి తరమైనా సంస్కరణలతో కచ్చితత్వాన్ని సాధించగలగాలి. ‘పాత అడుగుజాడలు తొలగిపోయినప్పుడు అద్భుతాలతో కొత్తదేశం వ్యక్తమౌతుంది‘ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన దాన్ని మనం ఆలోచనల్లోకి తీసుకోవాలి. అలవాటయ్యాయి కదా అని తప్పుల్ని ఆచరించడం, కొనసాగించడం సరికాదు. అలవాట్ల ఏట్లో పడి కొట్టుకుపోతూ ఉండడం మనిషి జీవనానికి పరమార్థం కాదు. ‘మనం చూడం; ఎందుకంటే మనకు చూడడం గురించి అభిప్రాయాలున్నాయి‘ అని జిడ్డు కృష్ణమూర్తి ఉన్న లోపాన్ని చెప్పారు. అందుబాటులో ఉన్నవి సరైనవి అనే అభిప్రాయానికి అతీతంగా మనం కళ్లు తెరుచుకుని చూడాలి. తప్పుల్ని దాటుకుని కచ్చితత్వంలోకి వెళ్లడానికీ ఆపై సరిగ్గా ఉండడానికీ ధైర్యం, సాహసం ఈ రెండూ మనకు నిండుగా ఉండాలి. ఇవి లేకపోవడం వల్లే మనలో చాలమంది పాత తప్పుల్లో బతుకుతూ ఉంటారు. తప్పులకు అలవాటుపడి కొనసాగడం ఒకరకమైన బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి మనం ధైర్యసాహసాలతో విముక్తమవ్వాలి. సరిగ్గా ఉండడం కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనలో చలామణి అవుతున్న తప్పుల్ని మనం తెలుసుకోవాలి. వాటి నుంచి తప్పించుకోవాలి. వాటిని మనం తప్పించెయ్యాలి. తప్పులవల్ల గతంలో జరిగిన కీడును వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ జరగకుండా పరిశ్రమించాలి. నీళ్లవల్ల శరీరం శుభ్రపడుతుంది; సత్యంవల్ల మనస్సు శుభ్రపడుతుంది; జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది; విద్యవల్లా, తపస్సువల్లా స్వభావం శుభ్రపడుతుంది. నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. సత్యంతో మనస్సును శుభ్రంచేసుకోవడం మనం నేర్చుకోవాలి. జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది అన్న దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. విద్యవల్లా, తపస్సు(సాధన)వల్లా స్వభావం శుభ్రపడుతుందనడానికి మనమే ఋజువులుగా నిలవాలి. ముందటితరాల ద్వారా చింతన, చేష్టల పరంగా మనకు తప్పులు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు కొన్ని విషయాల్లో ఆ తప్పులే ఒప్పులుగా రూఢీ అయిపోయాయి. దానివల్ల జీవన, సామాజిక, కళల ప్రమాణాలు, ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ వాస్తవాన్ని ఇకనైనా అవగతం చేసుకోవాలి. ఈ అవాంఛనీయమైన పరిస్థితిని ఎదిరించి పోరాడి విజయం సాధించాలి. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాత వాళ్ల దగ్గర మేలు, మంచి ఈ రెండూ లేవు కాబట్టి వాళ్లు అవి జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జీవనవిధానంలోనూ, సామాజికంగానూ, కళలలోనూ నిర్దుష్టతను వీళ్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు సరైన దాన్ని స్వీకరిస్తే వాళ్లు తప్పుడు వాళ్లు అన్న నిజం స్థిరపడిపోతుంది కాబట్టి. చెడ్డవాళ్లకు సంస్కరణలతో శత్రుత్వం ఉంటుంది, ప్రతి సంస్కర్తా చెడ్డవాళ్లకు విరోధే! కల్మషమైన పాతనీరు బురద అవుతుంది. హానికరమైన పాత బురదను మినహాయించుకోవాలి. కొత్త నదులను ఆహ్వానించాలి. కొత్త సంస్కరణల్ని మిళితం చేసుకుంటూ మునుముందుకు సాగడమే మనిషికి మేలైన జీవితం అవుతుంది. మూర్ఖత్వాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందడానికి ప్రపంచంలోకి ప్రవహించాలి మనం. సంస్కరణలు మనతో మొదలవ్వాలి. ‘తమతో మొదలుపెట్టేవాళ్లే ఈ ప్రపంచం చూసిన ఉత్తమ సంస్కర్తలు‘ అని జార్జ్ బెర్నాడ్ షా అన్నారు. మనల్ని మనం సంస్కరించుకుంటూ కచ్చితత్వాన్ని సాధించుకుంటూ సరైన, ఉన్నతమైన మనుషులమౌదాం. పాతుకుని పోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. – రోచిష్మాన్ -
ఎలన్ మస్క్ చేసిన తప్పిదాలివే! మీకు తెలుసా?
ఎలన్ మస్క్.. విపరీతమైన ధోరణులతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న మల్టీబిలియనీర్. ప్రపంచంలోనే అంత్యంత ధనవంతుడిగా.. నిత్యం ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు. అయితే.. చరిత్రలోనే విజయవంతమైన వ్యాపారిగా పేరు దక్కించుకున్న ఎలన్ మస్క్.. గుడ్డిగా అనుసరించడం ఏమాత్రం సరికాదన్నది మేధావులు అభిప్రాయం. అందుకు ఆయన చుట్టూరా ముసురుకునే వివాదాలే కారణం. 1. అనవసరపు జోక్యాలు! వ్యాపారంలో ఓర్పు చాలా అవసరం. అది లేకుంటే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. ఈ సోషల్ మీడియా కాలంలో విమర్శలను సైతం తేలికగా తీసుకోవాలి. కానీ, ఎలన్ మస్క్ అలా కాదు. తనపై వచ్చే విమర్శలతో పాటు తనకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం ద్వారా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ వివాదాలతోనూ వ్యాపారాలను దారుణంగా దెబ్బ తీశాడు కూడా!. టెస్లాపై వివాదాస్పద కథనాలు ప్రచురిస్తున్న ఓ రైటర్‌కు.. స్వయంగా ఫోన్లు చేసిన మస్క్.. అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మీడియాలో టెస్లా ఆదాయం మీద వచ్చిన కథనాలపై అనుచితంగా కామెంట్లు చేయడంతో.. టెస్లా షేర్లు ఆరు శాతం ఢమాల్ అన్నాయి. ఇక.. 2018 థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన చిన్నారుల బృందాన్ని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ను ఉద్దేశించి మస్క్ చేసిన కామెంట్లు కలకలమే రేపాయి. బ్రిటిష్ డైవర్‌ను ఉద్దేశించి అనుచిత కామెంట్లు చేసి.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు మస్క్. అయితే.. ఆ దావాలో మస్క్‌దే పైచేయి అయినా వ్యక్తిగతంగా మాత్రం ఎంతో డ్యామేజ్ జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయ్ మస్క్ఖాతాలో.. సహనం ఎంతో అవసరం అనే పాఠం నేర్పిస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లో!. 2. ఆదాయవ్యయాలను కనిపెట్టాల్సిందే! ఆదాయం మాటొచ్చేసరికి ప్రముఖంగా వినిపించే పదం పొదుపు. అయితే.. అంతకు మించి ఆదాయవ్యయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. అంతా సవ్యంగా ఉంటుందని అనుకుంటున్న టైంలోనూ ఆర్థికవసరాలు.. నిల్వకన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. టెస్లా సీఈవో మస్క్.. నగదు ప్రవాహం అంచున ఉండడం అలవాటు చేసుకున్నాడు. బహుశా ఏ బిలీయనీర్ ఇలా డబ్బు రాకపోకల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడేమో!. ముఖ్యంగా టెస్లా మోడల్ 3 టైంలో.. కంపెనీని చావో రేవో అనే స్థితికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆర్థిక నిపుణులు పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టెస్లా ఇబ్బందులు ఎదుర్కొవచ్చని సలహా ఇచ్చారు. ఒకానొక సమయంలో టెస్లా దివాలా తీసే స్థాయికి వచ్చిందంటూ మస్క్ స్వయంగా అంగీకరించాడు. బహుశా ఈ అనుభంతోనే.. నష్టాల్లో కొనసాగుతున్న ట్విటర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టాడేమో. ఉద్యోగుల తొలగింపు అనే వివాదాస్పద నిర్ణయం ఇందులోనే భాగమేమో!. వ్యాపారాల్లో వచ్చేపోయే ఆదాయం కోసం ఒక ప్రణాళికను అభివృద్ధి చేయాలి. అంతా సవ్యంగా ఉన్న సమయాల్లో.. ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తే పరిస్థితి మరోలా మారవచ్చనే పాఠం ఎలన్ మస్క్ నేర్పించాడు కూడా. 3. తొందరపాటు వద్దు ట్విటర్‌తో సాగిన డీల్ ఇందుకు పెద్ద ఉదాహరణ. ఏప్రిల్ 2022లో.. ఓ ఇంటర్వ్యూలో ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆలోచన బయటపెట్టాడు. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాడు. అయితే.. ఫేక్ అకౌంట్ల తాకిడి మరీ ఎక్కువగా ఉందని గుర్తించి.. ఈ డీల్ గాడికి ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 40 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం.. అదీ అర్థాంతరంగా ఆగిపోయిందని జోరుగా చర్చ నడిచింది. ఆపై స్వయంగా మస్క్ ఒప్పంద రద్దు ప్రకటన చేయడంతో.. ట్విటర్ ఆయన మీద దావాకు కూడా సిద్ధమైంది. ఈ తరుణంలో గత్యంతరంగా లేనిస్థితిలోనే అనూహ్యంగా ట్విటర్ డీల్‌ను క్లోజ్ చేసి టేక్ఓవర్ చేశాడు మస్క్. ఎలన్ మస్క్-ట్విటర్ డీల్ నేర్పే పాఠం.. ఎలాంటి వ్యవహారాల్లోనైనా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం. ముఖ్యంగా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో. ఒకటికి పదిసార్లు అన్నీ కూలంకశంగా పరిశీలించుకున్నాకే ముందుకెళ్లాలి. 4. సోషల్ మీడియా వాడకం ఎలన్ మస్క్ విషయంలో అత్యంత చర్చనీయాంశం ఇదే. పదకొండున్నర కోట్ల మంది యూజర్లు ట్విటర్లో ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ సంగతి మాత్రం ఒక మిస్టరీ!. సోషల్ మీడియాలో ఆయన వైఖరి.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్. పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. విభిన్నంగా చేసే ప్రమోషన్లు, నర్మగర్భంగా నడిపించే వ్యవహారాలు.. ఎలన్ మస్క్ గురించి నెటిజన్స్‌లో ఒకరకమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. అయితే.. ఊహకందని చేష్టలతో ‘థగ్ లైఫ్’ ట్యాగ్ తగిలించుకున్న ఎలన్ మస్క్.. అదే సోషల్ మీడియా ద్వారా వివాదాల్లో నిలుస్తుంటాడు. మీమ్స్, కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు.. ఒక్కోసారి స్థాయిని దాటేసి విమర్శలకు దారి తీస్తుంటాయి కూడా. అయితే స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వంకతో సోషల్ మీడియాలో ఆయన చేసే పనులు.. ఆయన్ని చిక్కుల్లో పడేసిన సందర్భాలు కోకొల్లలు. తద్వారా ఆయనకి ఆర్థికంగా జరిగిన నష్టమే ఎక్కువ కూడా!. సోషల్ మీడియా పవర్ఫుల్ టూల్. ఆ విషయం తన ఫాలోయింగ్ ద్వారా మస్క్ ఏనాడో అర్థం చేసుకుని ఉండొచ్చు. అయితే అది సహేతుకంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలనే మంత్రాన్ని మస్క్ ఏనాడూ జపించింది లేదు. అందుకే ఏదైనా లిమిట్లో ఉండాలని పెద్దలు అంటుంటారు. అది సోషల్ మీడియా వాడకం అయినా కూడా!. 5. నిశిత పరిశీలన.. ముందు జాగ్రత్త ఓవర్కాన్ఫిడెన్స్.. జీవితంలో కొంప ముంచే ప్రధాన అంశం. విజయానికి ఇదొక అడ్డుపుల్లగా కూడా అభివర్ణించాడు తత్వవేత్త అరిస్టాటిల్. 2019లో టెస్లా సైబర్ ట్రక్‌ను ఆవిష్కరించే క్రమంలో.. ఇదొక బుల్లెట్ ప్రూఫ్ వాహనమని, కావాలంటే పరీక్షించుకోవాలని సవాల్ విసిరాడు మస్క్. అయితే.. పరీక్షలో ఓ పెద్ద బేరింగ్ రాయి విసరగా.. అది బద్ధలైంది. హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ దాదాపు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఎలన్ మస్క్‌కి. లక్ష్యాలు నిర్ధేశించుకోవడం తప్పేం కాదు. కానీ, నిశిత పరిశీలన తప్పనిసరి. సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవడంలో తప్పు జరిగితే అది విఫలం వైపు అడుగులు వేయిస్తుంది. భారీ ఎత్తున్న నష్టం కూడా కలగజేస్తుంది. పరిశీలన.. ముందుజాగ్రత్తలు లేకుంటే ఎలన్ మస్క్‌కు ఎదురైన నష్టం.. అవమానాలు ఎవరికైనా ఎదురుకావొచ్చు. ఎలన్ మస్క్.. ఓ అసాధారణ వ్యక్తి. ముమ్మాటికీ ఓ అపారమేధావే. లేకుంటే టెస్లా, స్పేస్ఎక్స్.. ఇలాంటివి ప్రపంచాన్ని శాసించేవా?. విచిత్రమైన ఆలోచనలు ఆచరణలోకి వచ్చేవా?.. సంపాదనలో అతన్ని కొట్టేవాళ్లు దరిదాపుల్లో లేరు కావొచ్చు. కానీ, ప్రతీ మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన ఎంత గొప్ప సాధించిన ఆయన జీవితం నుంచి లోపాలను మినహాయించుకోవడం.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగితే మిస్టర్ పర్ఫెక్ట్గా విజయాల్ని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
కెరీర్లో మనం చేసే అతిపెద్ద తప్పులు ఇవే .. హర్ష గోయెంకా పాఠాలు
తప్పులు చేయడం.. ఆ తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం కామన్. అందుకే తప్పులు చేయండి. వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకోండి’ అని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పాఠాలు చెబుతున్నారు. చేసిన తప్పుల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం గొప్ప అవకాశం. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో, మీకున్న అపారమైన తెలివితేటల్ని విస్తరించేందుకు సహాయ పడుతుందని హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుండగా.. మీరు తప్పు చేసి.. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోంటే అది తప్పు కాదని అన్నారు. Always learn from your mistakes: - See what went wrong - See what could have been done better - See what was not necessary - See what took most of your energy - See what knowledge you lacked If you learn from a mistake, a mistake isn't a mistake anymore! — Harsh Goenka (@hvgoenka) October 18, 2022 ఇక ముఖ్యంగా కెరీర్లో చేసే తప్పుల్ని ఈ సందర్భంగా హర్ష గోయెంకా హైలెట్ చేశారు. అందులో ఒకటి అన్నీ తమకు తెలుసని అనుకోవడం, రెండోది సరైన పరిచయాలు లేకపోవడం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
తెలంగాణ, ఏపీ, డిగ్రీ.. ఇవి అభ్యర్థుల పేర్లట!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శ్రీరాంపూర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎస్సెస్సీ, డిగ్రీ.. ఇవేంటో తెలుసా? ఇటీవల సింగరేణి జూనియర్ అసిస్టెంట్ హాల్టికెట్లలో అభ్యర్థుల పేర్లు. వినడానికి, చదవడానికి ఇవి నవ్వు పుట్టిస్తున్నా.. ఇది నిజమే. ఇటీవల సెప్టెంబర్ 4న జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 77,898 మంది హాజరయ్యారు. వీరిలో 49,328 మంది అనర్హులవగా 28,570 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆదివారం ఫలితాలను గమనించిన అభ్యర్థులు నిర్వహణతీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. హాల్‌టికెట్లపై అక్షరదోషాలకు బదులు అచ్చుతప్పులు ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. వి.శ్రీధర్ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 7709069) పేరు స్థానంలో ‘తెలంగాణ’అని ఉంది. బి.మణికంఠ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 2204302) పేరు స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని, బి.లలిత అనే అభ్యర్థి(హాల్‌టికెట్ నంబర్ 2218581) పేరు ‘డిగ్రీ’అని ఉంది. ఆంధ్రప్రదేశ్ అని ప్రచురించిన హాల్‌టికెట్ మరో అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 3308978) పేరుకు బదులుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది. అసలే పరీక్ష నిర్వహణపై ముందు నుంచీ పలు రకాల వదంతులు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హాల్టికెట్లలో తప్పులు దొర్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సింగరేణి తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. -
అదానీ రుణ మదింపులో సవరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ రుణాలపై ఫిచ్ గ్రూప్ కంపెనీ క్రెడిట్‌సైట్స్ తాజాగా మాట మార్చింది. అదానీ గ్రూప్ యాజమాన్యంతో చర్చల తదుపరి రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు కొత్తగా జారీ చేసిన నోట్లో పేర్కొంది. అయితే గ్రూప్ అధిక రుణ భారాన్ని మోస్తున్నట్లు తెలియజేసింది. దీంతో తొలుత ఇచ్చి న ఇన్వెస్ట్మెంట్ సిఫారసుల విషయంలో ఎలాంటి మార్పులనూ చేపట్టడంలేదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్‌పై ఆగస్ట్ 23న ప్రకటించిన నివేదికలో రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు క్రెడిట్‌సైట్స్ వెల్లడించింది. గ్రూప్ అత్యంత భారీగా రుణగ్రస్తమైనట్లు గతంలో పేర్కొంది. పరిస్థితులు వికటిస్తే రుణ ఊబిలో కూరుకుపోవడంతోపాటు డిఫాల్ట్ అయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. తాజా నోట్లో అదానీ గ్రూప్‌నకు అత్యధిక స్థాయిలో రుణాలున్నట్లు మాత్రమే పేర్కొంది. వీటిపై స్పందనగా అదానీ గ్రూప్ నిర్వహణ లాభ నిష్పత్తితో పోలిస్తే నికర రుణభారం మెరుగుపడినట్లు ప్రకటించింది. గ్రూప్‌లోని కంపెనీలు నిలకడగా రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు తెలియజేసింది. గత తొమ్మిదేళ్లలో ఇబిటాతో నికర రుణ నిష్పత్తి 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గినట్లు వివరించింది. పొరపాట్లు ఇలా అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ రుణాల విషయంలో లెక్కల్లో తప్పులు దొర్లినట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. అదానీ ట్రాన్స్మిషన్ ఇబిటా అంచనాలను తాజాగా రూ. 4,200 కోట్ల నుంచి రూ. 5,200 కోట్లకు సవరించింది. ఇక అదానీ పవర్ స్థూల రుణ అంచనాలను రూ. 58,200 కోట్ల నుంచి రూ. 48,900 కోట్లకు తగ్గించింది. అయితే ఈ సవరణలతో ఇన్వెస్ట్మెంట్ రికమండేషన్స్‌లో ఎలాంటి మార్పులనూ చేపట్టలేదని క్రెడిట్‌సైట్స్ తెలియజేసింది. -
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు
-
తెలియక ఈ తప్పులు చేశారో..బుక్కైపోతారు! బీ కేర్‌ఫుల్!!
ఒకప్పుడు తెలిసిన వారికే డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చేది. కానీ, నేడు చెల్లింపులన్నీ డిజిటల్ అయ్యాయి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. కూరగాయల దగ్గర్నుంచి ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. సినిమా, రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటళ్లలో బుకింగ్‌లు.. ఈ జాబితా చాలా పెద్దదే. కానీ, ఆన్లైన్ చెల్లింపుల్లో (యూపీఐ, ఇతరత్రా) ఎంత సౌకర్యం ఉందో, అంతకంటే ఎక్కువే రిస్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన, జాగ్రత్తలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి మోసపోతే కనుక దొంగ దొరికి, పోయిన మొత్తం వెనక్కి రావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను వివరించేదే ఈ కథనం. ►తెలియని వ్యక్తులతో లావాదేవీలు వద్దు ►తెలియని సంస్థలతోనూ ఇదే పాటించాలి ►యూపీఐకి బదులు , నెఫ్ట్, ఐఎంపీఎస్ మేలు ►ట్రూకాలర్ సాయం తీసుకోవచ్చు ►సామాజిక మాధ్యమాల తోడ్పాటు కూడా తీసుకోవాలి... ► పూర్తి నిర్ధారణ తర్వాతే చెల్లింపు అదేపనిగా కాల్స్ చేస్తే.. మోసగాళ్లు అయితే కాల్స్, మెస్సేజ్‌ల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. ఒకటికి నాలుగు సార్లు కాల్ చేయడం, ఎస్ఎంఎస్లు పంపిస్తుంటే ముందుగా అనుమానించాలి. వారితో మాట్లాడినప్పుడు ఈ ఆఫర్/అవకాశం మళ్లీ ఉండదని/రాదని చెప్పడం, వారి మాటల్లో ఏకరూపత లేకపోతే స్కామ్గానే సందేహించాలి. అలాగే, వాట్సాప్ చేస్తున్నా ఇలాగే అనుమానించాలి. కొందరు నేరస్థులు ఏ మాత్రం అనుమానం కలగనీయని రీతిలో సంప్రదింపులు చేస్తుంటారు. అటువంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కోరాలి. హోటల్ బుకింగ్ అయితే నేరుగా వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పాలి. మొదటగా తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫలానా ఆఫర్ అనో, ప్యాకేజీ అనో, లాటరీ వచ్చిందనో చెప్పే మాటలకు మెతకగా స్పందించడం, ఆసక్తి చూపడం, అయోమయంగా అనిపించేలా వ్యవహరించకండి. అవతలి వ్యక్తి మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని నంబర్, మెయిల్ ఐడీ నుంచి ఏదైనా ఆఫర్లు, సందేశాలు వస్తే, లింక్‌లు వస్తే వాటిని తెరవడం, అందులోని నంబర్లను సంప్రదించడం చేయవద్దు. పేరున్న సంస్థలు అయితే నేరుగా వాటి సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. అంతేకానీ, మొబైల్‌కు తెలియని మూలాల నుంచి ఎస్ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే వెబ్‌లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాల్ చేసి, తమది ఫలానా ఎన్జీవో, చిన్న పిల్లల ఆరోగ్య అవసరాల కోసం విరాళాలు సమీకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇలాంటివి అసలు నమ్మనే వద్దు. ఎవరికైనా సాయం చేయాలంటే ప్రత్యక్షంగా చేయడమే మంచిది. అవసరం లేని ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం... రిస్క్‌ను ఆహ్వానించడమే. యూపీఐ వద్దు.. యూపీఐ చెల్లింపులకు బదులు నెఫ్ట్/ఐఎంపీఎస్ నగదు బదిలీ మార్గాలను అనుసరించడం కొంచెం సురక్షితమైనది. యూపీఐ సాధనం సురక్షితమైనదే. కానీ, సరైన వ్యక్తికి పంపినప్పుడే. నగదు స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు ఇందులో తెలియవు. అదే నెఫ్ట్/ఐఎంపీఎస్‌లో డబ్బు పంపాలంటే పూర్తి వివరాలు కావాల్సిందే. అందుకే అవతలి వ్యక్తి మాటలు నమ్మదగినవిగా అనిపించకపోతే, సందేహం వస్తే ఖాతా వివరాలు ఇవ్వాలని కోరాలి. కంగారు పడొద్దు... పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటే వేగం ప్రదర్శించొద్దు. సమయం తీసుకోండి. తొందరపడితే ప్రాథమిక అంశాలను కూడా విస్మరిస్తుంటాం. తొందరపడి మోస పోయినట్టుగా ఉంటుంది. అది నిజమా, మోసమా అని గుర్తించేందుకు వ్యవధి ఇవ్వాలి. అవతలి వ్యక్తితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడాలి. కొన్ని రోజులు ఆగి చూడాలి. అప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఆధారంగా నిజా, నిజాలను గుర్తించే వెసులుబాటు ఉంటుంది. ముందే మొత్తం వద్దు.. ఇక నగదు పంపించేందుకు సిద్ధమైతే కనుక మొత్తం ఒకేసారి చెల్లించేయవద్దు. సాధారణంగా నమ్మకం ఏర్పడినప్పుడు ఎక్కువమంది ఒకే విడత డిస్కౌంట్ కోరి చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాయిదాలుగా చెల్లించడం అందరికీ నచ్చదు. ఆన్లైన్ మోసాలను నివారించాలంటే.. ఒకేసారి మొత్తం పంపకుండా ఉండడమే మంచి మార్గం. దీనివల్ల మోసం అయితే కొద్ది మొత్తంతోనే ఆగిపోతుంది. గూగుల్ సెర్చ్.. డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్, ఈమెయిల్‌ను ఆన్లైన్లో ఓసారి సెర్చ్ చేయాలి. అదే నంబర్, అదే ఈ మెయిల్ పేరిట అప్పటికే ఎవరైనా మోసపోయి ఉంటే, ఆ వివరాలు లభిస్తాయి. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే.. అదే నంబర్ పలు వ్యాపారాలకు సంబంధించి చూపించొచ్చు. గూగుల్‌లో ఒకటికి మించిన కంపెనీలకు ఆ నెంబర్ చూపిస్తే కచ్చితంగా మోసపూరితమైనదే. ట్రూకాలర్ అయితే, అన్ని ఫోన్ నంబర్ల వివరాలు గూగుల్‌లో కనిపించాలని లేదు కదా? మోసగాళ్లు ఒక్కో పెద్ద మోసానికి ఒక్కో ఫోన్ నంబర్ వాడుతున్న రోజులు ఇవి. కనుక గూగుల్‌లో వివరాలు లభించకపోతే అప్పుడు ఫోన్లో ట్రూకాలర్ యాప్ వేసుకుని అందులో సెర్చ్ చేయడమే మార్గం. సదరు నెంబర్‌తో ఎవరైనా మోసపోయి ఉంటే.. ఫ్రాడ్, స్కామ్, స్పామ్‌గా చూపిస్తుంది. కచ్చితంగా దాన్ని ఒక సంకేతంగానే చూడాలి. పూర్తి పేరుతో వస్తే అప్పుడు తదుపరి పరిశీలనకు వెళ్లాలి. తెలియని పోర్టళ్లు.. తెలియని సంస్థల సేవలకు దూరంగా ఉండడమే భద్రతా పరంగా మంచి విధానం అవుతుంది. ఉదాహరణకు మూవీ టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే బుక్‌మైషో, పేటీఎం ఇలాంటివి అందరికీ తెలుసు. ఇవి నిజమైన వ్యాపార వేదికలు. కానీ, ఎప్పుడూ వినని వెబ్సైట్ లేదా యాప్‌లో ఒకటి కొంటే ఒకటి ఉచితానికి ఆశపడొద్దు. ఉచితమేమో కానీ, మన కార్డు వివరాలు, ఇతర కీలక సమాచారం పక్కదారి పట్టొచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాలన్స్‌ను కొట్టేయవచ్చు. వేరే వారికి స్టీరింగ్ టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దు. చేశారంటే మీ స్క్రీన్‌ను వారితో షేర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మీ తరఫున అవతలి వ్యక్తి లావాదేవీలు నిర్వహిస్తాడు. ఫోన్, కంప్యూటర్లోని సమాచారం మొత్తాన్ని కొట్టేస్తారు. ఇటీవలే గచ్చిబౌలిలో పనిచేసే 28 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఒక కాల్ వచ్చింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్రెడిట్ కార్డుకు ఇచ్చిన చిరునామా వివరాల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపాడు. ఇందుకోసం ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫోన్ చేసింది బ్యాంకు ఉద్యోగేనని నమ్మి, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాడు. అదే సమయంలో క్రెడిట్ కార్డు నుంచి రూ.52,000 డెబిట్ అయినట్టు సందేశం వచ్చింది. ఇంకేముంది కాల్ కట్. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆత్మ పరిశీలన ముందు చెప్పుకున్నట్టు కొంత సమయం తీసుకుని, మనలో మనమే ఓ సారి అన్ని అంశాలను బేరీజు వేసుకుని, కచ్చితత్వాన్ని రూఢీ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా ఉందని అనిపిస్తే.. ఇక ఆ డీల్‌కు అంతటితో ముగింపు పలకాలి. -
వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్ అవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. సోమవారం అమరావతిలో చంద్రబాబు పలుమార్లు తడబడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బాబు ప్రసంగంలో పొరపాట్లను గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయిందని తప్పుగా వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఆయన మాటల్లో తప్పులను ఇంకా గమనిస్తే.. కరోనా వచ్చినపుడు అందరూ లాక్డౌన్ పెట్టారు. కానీ కరోనాను కూడా లెక్క పెట్టుకోకుండా అంటూ మరోసారి టంగ్‌స్లిప్ అయ్యారు. ఇక దైనందిన కార్యక్రమాలు అని పలకాల్సిన చోట దైనందిక అంటూ.. గోదావరి నదిలో నీళ్లు చెప్పాల్సిన చోట గంగానదిలో నీరు అని అన్నారు. తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పాల్సిన చోట తెలుగు జాతికి కారణం అంటూ ప్రసంగించారు. చివరికి చంద్రబాబు ప్రసంగం ముగిశాక తెలుగు తమ్ముళ్లు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు?) -
మీదైన స్టయిల్ ఉండాల్సిందే..
టీనేజీలోనే స్టాక్స్‌లో పెట్టుబడి ప్రారంభం. 30 ఏళ్ల అనుభవం. రూ.800 కోట్లకు పైగా నెట్‌వర్త్. ఇది ప్రముఖ ఇన్వెస్టర్, కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా ఈక్విటీ ప్రస్థానం. ఆయన పట్టిందల్లా బంగారం కాలేదు. కానీ, ఈక్విటీల్లో రాబడులు ఒడిసి పట్టడం ఎలాగన్నది ఆయనకు తెలుసు. స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసు. ఎంపిక చేసుకున్నది బెడిసి కొడితే తదుపరి ఏ అడుగు తీసుకోవాలో తెలుసు. అయినా సరే.. గత అనుభవాలు, గత విజయాలకు దోహదపడిన సూత్రాల ఆధారంగా ఒక స్టాక్‌లో పెట్టుబడి పెడితే.. రేపు అది 100 శాతం సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదంటారు. ఈక్విటీల్లో అటువంటి రిస్క్ఎప్పుడూ ఉంటుందన్నది ఆయన స్వీయ అనుభవం. అవును ఈక్విటీలంటే అంతే. ‘ఇన్నేళ్ల అనుభవం, ఇంత సంపద సృష్టి తర్వాత కూడా.. ‘నేను భయస్తుడిని. సామాన్యుడిని. అభద్రతా భావం ఉన్నవాడిని‘ అని తన గురించి కేడియా చెప్పుకోవడం వెనుక అంతరాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పెట్టుబడి సక్సెస్ ఇచ్చిందని ‘అంతా నాకే తెలుసు’ అనుకుంటే కష్టం. అనుభవం, అధ్యయనం, విశ్లేషణ, విజ్ఞానం అన్నింటినీ జోడించి జాగ్రత్తగా వెళితే ఈక్విటీ ప్రయాణం సక్సెస్‌ను ఇస్తుంది. విజయ్ కేడియా తరహా ఇన్వెస్టర్ల విజయానికి దోహదం చేసిన అంశాలను తెలుసుకోవడం వల్ల మన అవగాహన మరికొంత విస్తృతమవుతుంది. ∙ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, డాలీఖన్నా, విజయ్ కేడియా.. ఇలాంటి బడా ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు చాలా మందే మన మార్కెట్లో ఉన్నారు. వీరంతా ఈక్విటీల్లో నిలిచి గెలిచినవారు. నష్టాలను పాఠాలుగా చేసుకుని, అనుభవంతో సంపద సృష్టించుకున్నారు. వీరిని గమనిస్తే కొన్ని లక్షణాలు ఒకే రీతిలో కనిపిస్తాయి. కనీసం మూడు దశాబ్దాలకు పైగా అనుభవం, మార్కెట్ల ఎత్తు పల్లాలను చూసి, వాటికి ఎదురీది, అనిశ్చితుల్లో ఏమి చేయాలో తెలిసిన వారు. ఇలా విజయవంతమైన బడా ఇన్వెస్టర్లలో కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా కూడా ఒకరు. ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెట్టుబడులు, తాను అనుసరించే సూత్రాలు తదితర సమాచారాన్ని పంచుకున్నారు. ఈక్విటీ ప్రయాణం చేసే, కొత్తగా ఈక్విటీల్లోకి వచ్చే రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ సమాచారం ఎంతో కొంత మార్గదర్శనం చేస్తుంది. అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు.. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు చాలా మందే ఉన్నారు. స్టాక్స్ ఎంపికలో చేసే పొరపాట్లతో ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఏ ప్రయాణం అయినా కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడంపైనే గమ్యస్థానం చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. కనుక ఒకటి రెండు నష్టాలు ఇచ్చాయని కుదేలు కాకూడదు. ఆ అనుభవంతో తదుపరి పెట్టుబడుల్లో ఫెయిల్యూర్ అవకాశాలను తగ్గించుకోవాలి. విజయ్ కేడియా తన సక్సెస్ రేటు 50 శాతమే అని చెప్పారు. మరి ఆయనకేమైనా తక్కువ అనుభవం ఉందా..? 19 ఏళ్లకే ఈక్విటీ జర్నీ మొదలు పెట్టి, 30 ఏళ్లకు పైగా మార్కెట్‌తో కలసి నడుస్తున్న వ్యక్తి. రిటైల్ ఇన్వెస్టర్‌గా మనం ఎంపిక చేసుకునే ప్రతీ స్టాక్ మల్టీబ్యాగర్ కావాలని భావిస్తాం. దీంతో కళ్ల ముందు స్వల్ప వ్యవధిలోనే రెండు మూడు రెట్లు పెరిగిన స్టాక్‌ను చూసి ఆకర్షితులవుతాం. రిస్క్ తీసుకుని అధిక ధర వద్ద కొనుగోలు చేస్తాం. కానీ, వాటిని ఎక్కువ కాలం పాటు అట్టి పెట్టుకుంటామా..? లేదు. అసలు ఏ అంశాలను చూసి ఇన్వెస్ట్ చేశామన్నది ప్రశ్నించుకోము. అన్నీ మర్చిపోయి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తాం. ఎంపిక చేసుకునే 10 స్టాక్స్‌లో ఒకటి లేదా రెండు మాత్రమే మల్టీబ్యాగర్లు అవుతాయన్నది విజయ్ కేడియా అనుభవసారం. వైవిధ్యం.. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే 90 శాతం ఈక్విటీల్లోనే ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇక డెట్ సాధనాల్లో సున్నా. 8 శాతాన్ని రియల్ ఎస్టేట్‌పై పెట్టారు. మరో 2 శాతాన్ని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు అన్నీ ఒకే చోట పెట్టుకూడదన్నది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే ఒకే విభాగంలో పెట్టినప్పుడు.. ఏదైనా సంక్షోభం వచ్చి ఆయా విభాగంపై ప్రభావం పడితే..? అదే సమయంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాల్సి వస్తే..? అందుకుని ఈ రిస్క్‌ను తగ్గించుకునేందుకు కచ్చితంగా ఈక్విటీలతోపాటు డెట్, బంగారం ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో డెట్‌కు చోటు ఎందుకు లేదు...? అన్న సందేహం రావచ్చు. రాబడి, రిస్క్ కోణంలో ఆయనకు నచ్చని విభాగం అది. ‘‘నేను డెట్‌లో పెట్టుబడులు పెట్టను. నేను ఏవైనా షేర్లను విక్రయించాల్సి వస్తే ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో 10–30 రోజుల కాలానికి ఉంచుతాను. నగదు రూపంలో ఉంటే నాకు నిద్ర పట్టదు’’ అని విజయ్‌కేడియా చెప్పారు. డెట్ ఆయనకు ఉద్వేగాన్ని ఇవ్వదట. పైగా రిస్క్ తీసుకోవడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. అందుకే 90 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించారు. అదే సమయంలో 10 శాతాన్ని ఇతర సాధనాలకు కేటాయించడాన్ని గమనించాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. పెట్టుబడి విధానం స్నేహితుడో, సహచర ఉద్యోగి చెప్పాడనో.. లేదంటే అనలిస్ట్ సూచించాడనో బ్లైండ్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడికి సంబంధించి ఒక విధానం ఉండాలి. దీన్నే స్టయిల్ అనో, మరొకటో అనుకోవచ్చు. ఎంత రాబడి ఆశిస్తున్నారు, ఎంత కాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించగలరు? లేదంటే వారసులకు ఇవ్వడం కోసం స్టాక్స్‌ను పోగు చేస్తున్నారా..? ఏటా ఆయా కంపెనీల నుంచి ఎంత వృద్ధి ఆశిస్తున్నారు..? ఆయా కంపెనీలనే ఎందుకు ఇష్టపడుతున్నారు..? నష్టం వస్తే వెంటనే అమ్మేస్తారా..? లేదంటే దీర్ఘకాలం పాటు ఓపిక పడతారా..? ఇలా ఎన్నో అంశాలను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే స్టాక్స్ ఎంపిక ఉంటుంది. విజయ్ కేడియా స్టాక్స్ ఎంపికకు ‘స్మైల్’ (టఝజీ ్ఛ) అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఎంపిక చేసుకునే కంపెనీ చిన్నది అయి ఉండాలి. కంపెనీకి ఆయా వ్యాపారంలో మధ్యస్థ అనుభవం అయినా ఉండాలి. కంపెనీకి ఎంతో ఎత్తుకు ఎదగాలన్న బలమైన ఆకాంక్షలు ఉండాలి. దీనికి తగ్గట్టు మార్కెట్ అవకాశాలు అపారంగా ఉండాలి. వీటికి టిక్ పడితే ఆయన ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టేస్తారు. అందుకే విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్ స్టాక్స్, మిడ్‌క్యాప్ స్టాక్స్ కనిపిస్తాయి. తాను పెట్టుబడి పెట్టినప్పుడు చిన్నగా ఉండి.. ఆ తర్వాత మల్టీబ్యాగర్ రిటర్నులతో లార్జ్ క్యాప్‌గా మారిందనుకోండి. అప్పుడు విజయ్ కేడియా మళ్లీ స్మాల్‌క్యాప్ జెమ్స్ అన్వేషణలో పడతారు. తాను అనుకున్న క్వాలిటీలతో కంపెనీ కనిపించిందనుకోండి.. వెంటనే అందులోకి పెట్టుబడి బదిలీ చేస్తారు. ‘‘నేను స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో ఆసక్తికరమైన కంపెనీ ఉందేమో చూస్తున్నాను. అవకాశం గుర్తిస్తే వెంటనే అందులోకి పెట్టుబడులు మార్చేస్తా’’అని చెప్పారు. స్వల్ప కాలం ఫలితం ఇవ్వదు మన చుట్టూ ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లను గమనిస్తే.. ఒక్కటి గుర్తించొచ్చు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వెంటనే పెరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కొనుగోలు ధర నుంచి కిందకు పడిపోతే వారిలో ఆందోళన మొదలవుతుంది. నష్టాల్లోనే ఆ కంపెనీ కొంత కాలం పాటు కొనసాగితే ఇక ఉండబట్టలేక ఎంతో కొంతకు అమ్మేస్తారు. అందుకే పెట్టుబడికి ముందు అధ్యయనం అవసరం. కంపెనీ వ్యాపారం, పనితీరు తదితర అంశాల ఆధారంగానే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. స్టాక్ ధరను చూసి కాదు. ఇలా చేస్తే కనుక అది తప్పుడు మార్గమే అవుతుంది. పైగా, ఈక్విటీ పెట్టుబడికి స్వల్పకాలం ఫలితమివ్వదు. దీర్ఘకాలమే రాబడులకు మార్గం అవుతుంది. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభాన్ని ఇవ్వలేదు. గత ఏడాది కాలంలో ఆయనకు తేజాస్ నెట్వర్క్స్ షేరు మంచి రాబడినిచ్చింది. అదే సమయంలో అంబికా కాటన్ మిల్స్ ఫలితమివ్వలేదు. ‘‘నేను రాబడులను ఏటా చూసుకోను. నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ మంచి రాబడినిచ్చినవే. 2020లో నేను కొన్న కొన్ని స్టాక్స్ అయితే 10 రెట్లు పెరిగాయి. కానీ 2021 మే నుంచి మార్కెట్ పరిస్థితుల వల్ల స్టాక్స్ ఏ మాత్రం వృద్ధి లేకుండా అక్కడే ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి’’అని విజయ్ కేడియా తెలిపారు. రియల్ ఎస్టేట్ కూడా అంతే.. రియల్ ఎస్టేట్ రాబడులను కూడా కేడియా ఎప్పటికప్పుడు పరిశీలించుకోరు. ‘‘రియల్ ఎస్టేట్ పెట్టుబడి అన్నది దీర్ఘకాలం పాటు అంటే 10–40 ఏళ్ల కోసం. నేను అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిని సందర్భోచితంగా చేస్తుంటాను’’అని ఆయన చెప్పారు. పైగా రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక ప్లాట్ కొనుగోలు చేయడం కాదు. దానిపై రాబడి వచ్చేలా చూసుకుంటారు. నెలవారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టే రెండు గోదాములు ఆయన రియల్టీ పెట్టుబడిలో భాగం. కేవలం స్టాక్ మార్కెట్ రాబడినే ఆయన నమ్ముకోరు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం ఆయన రియల్ ఎస్టేట్‌లో 8% పెట్టుబడులు పెట్టారు. భవిష్యత్తు పెట్టుబడి ఆలోచనలు.. ఈక్విటీలకు పెట్టుబడులు పెంచుకునేందుకు విజయ్ కేడియా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకానీ, మార్కెట్లలో అస్థిరతలు ఉన్నాయని చెప్పి పెట్టుబడులను కొంత విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవాలని అనుకోవడం లేదు. 2022 స్తబ్ధుగా ఉండడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ల పతనాలను చూసి భయంతో విక్రయాలు చేస్తుంటారు. నిజానికి ఈ తరహా అనిశ్చితులు పెట్టుబడులు పెంచుకునేందుకు అను కూలం. ఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా భిన్న ప్రాంతాల మధ్య వైవిధ్యీకరించుకోవాలని చెబుతుంటారు. కానీ, విజయ్ కేడియా ఈక్విటీ పెట్టుబడులు అన్నీ కూడా మన మార్కెట్లలోనే ఉన్నాయి. కాకపోతే గూగుల్ (ఆల్ఫాబెట్)లో మొదటిసారి ఆయన ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మినహా అమెరికా మార్కెట్లో మరే ఇతర టెక్నాలజీ షేరులో ఇన్వెస్ట్ చేయాలని ఆయన అనుకోవడం లేదు. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 2,50,000 డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చు. తన పెట్టుబడులకు ఈ పరిమితి సరిపోతుందని, తన పోర్ట్‌ఫోలియోపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని కేడియా వివరించారు. అంతెందుకు హైనెట్వర్త్ ఇన్వెస్టర్లలో చాలా మందికి విదేశీ పెట్టుబడులు లేవనే చెప్పుకోవాలి. వారంతా మన ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉన్నారు. అత్యవసర నిధి అత్యవసర నిధి ఎవరికైనా ఉండాల్సిందే. అవసర సమయంలో రుణం కోసం పరుగెత్తే విధంగా ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను కూడా తాకకూడదు. అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా నిధిని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. విజయ్ కేడియా అయితే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోలేదు. దీన్ని కూడా ఆయన పెట్టుబడి మార్గంగా మలుచుకున్నారు. కంపెనీల నుంచి డివిడెండ్లు, గోదాముల రూపంలో రెంటల్ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయనకు తగినన్ని ఆదాయ మార్గాలున్నాయి. రిషికేశ్, గోవా, కేరళలో ఆయనకు యోగా, వెల్నెస్ కేంద్రాలు మూడున్నాయి. -
పడావు అంటే ‘పడవ’..!
సాక్షి, హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఉంది ధరణి పోర్టల్ పరిస్థితి. రాష్ట్ర రైతాంగానికి మింగుడు పడని ఈ ధరణి పోర్టల్ సిత్రాలకు అంతులేకుండా పోతోంది. తప్పుల మీద తప్పులు, అర్థం లేని ఆప్షన్లు, రెవెన్యూ వాడుకలో లేని పదాలకు ఈ పోర్టల్ నెలవుగా మారుతోంది. రైతుల పాస్‌బుక్కుల్లో తప్పుల సవరణల కోసం ప్రభుత్వం ఇచ్చిన తాజా మాడ్యూల్ అభాసు పాలవుతోంది. పాస్‌బుక్కులో నమోదైన మొత్తం 11 రకాల తప్పుల సవరణల కోసం ఇచ్చిన మాడ్యూల్‌లోని మూడు రకాల ఆప్షన్లను పరిశీలిస్తేనే 100కు పైగా తప్పులు తేలడం గమనార్హం. కాగా మిగిలిన 8 రకాల ఆప్షన్లు చూస్తే ఇంకెన్ని తప్పులు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొత్త మాడ్యూల్లో ఇచ్చిన ఆప్షన్లు, కేటగిరీలు చూసి రెవెన్యూ వర్గాలే విస్తుపోతుండటం గమనార్హం. హమ్మయ్యా అనుకునే లోపే.. పాస్‌బుక్కుల్లో నమోదైన తప్పులను సవరించుకునేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశమివ్వాలనే డిమాండ్ రైతుల నుంచి చాలా కాలంగా ఉంది. ఎట్టకేలకు దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవలే కొత్త మాడ్యూల్‌ను ధరణిలో ప్రవేశపెట్టింది. ఈ మాడ్యూల్ ప్రకారం పాస్‌బుక్‌లో నమోదైన 11 రకాల తప్పులను సరిచేసుకోవచ్చు. ఈ తప్పుల సవరణల కోసం ధరణి పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత సర్వే నంబర్, ఖాతా నంబర్, పాస్‌బుక్ నంబర్లను నమోదు చేస్తే.. ప్రస్తుతం ఆ పాస్‌బుక్‌లో ఉన్న వివరాలతో పాటు ఎక్కడ తప్పులు దొరా>్లయో సరిదిద్దుకునే ఆప్షన్లు ఉంటాయి. అయితే ఇందులో వ్యాకరణ, అనువాద, అక్షర దోషాలతో పాటు అర్థం లేని ఆప్షన్లు ఇవ్వడంతో రైతులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. అంతుబట్టని ఆప్షన్లు..కేటగిరీలు సర్వే..సరిహద్దుల చట్టం, ఆర్ఓఆర్ వంటి చట్టాలు, ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొన్న కేటగిరీలు, రెవెన్యూ పదాలను మాత్రమే పాస్‌పుస్తకాల్లో ఉపయోగించాలి. కానీ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో పెట్టిన ఈ ఆప్షన్లు, కేటగిరీలు, పదాలు మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనిపై రెవెన్యూలోని సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గ్రామాల్లో నాలుగైదేళ్లు వీఆర్వోగా పనిచేసిన వారిని అడిగినా ధరణి పోర్టల్‌లో పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ కోసం ఏం ఆప్షన్లు ఇవ్వాలో చెప్తాడని, తాజా మాడ్యూల్‌ను చూస్తే రెవెన్యూ వర్గాలపై కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆధారపడి రూపొందించినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పడావు అంటే పడవ అంట! ‘పడావు భూమి’అంటే సాగుచేయని భూమి అని అర్థం... దీన్ని ఇంగ్లిషులో రాయాలంటే ‘నాన్ కల్టివేటెడ్’అని రాయొచ్చు... కానీ ధరణి వెబ్సైట్లో మాత్రం ‘పడావు’అనే పదాన్ని పడవ అనుకుని ‘బోట్’అని రాశారు. స్కూల్ అంటే తెలుగులో పాఠశాల లేదా బడి అని రాయొచ్చు. కానీ ధరణిలో రెండు ఆప్షన్లు ఇచ్చి ఒకచోట బడి అని మరోచోట పాఠశాల అని రాశారు. –పో.పట్టా అనే పదం రెవెన్యూ భాషలోనే లేదు. కానీ ధరణి వెబ్సైట్లో మాత్రం ఇంగ్లిషు, తెలుగులో కనిపిస్తోంది. పాస్‌బుక్కులో ఎక్కడా అవసరం లేని మూసీ కాలువ అనే ఆప్షన్ కూడా కనిపిస్తోంది. –అటు సామాన్య రైతులకు కానీ, ఇటు మీసేవా ఆపరేటర్లకు కానీ అర్థం కాని ఎల్టీఆర్కేకే, ఎల్టీఆర్టీ, టీజీఎంఎస్, ఇన్హెరిటెడ్ ఇన్హెరిటెన్స్, పంజా, ప్ర.భూమి, టెనెన్సీపట్, గాయిరాన్, గెరాన్, చొత ఇనాం, దస్తగర్ద ఇనాం, దస్త్ గర్దా ఇనాం లాంటి పదాలకు ధరణి పోర్టల్‌లో కొదవే లేదు. భూదాన్ పట్టా అంటే భూటాన్ గ్రాడ్యుయేటెడ్ అంట! –ఆబాది అనే పదం ఎన్నిరకా>లుగా మారిందో తెలుసా... దీని కోసం ఆరు ఆప్షన్లు ఇచ్చి ఆబాది, అభి/అభి, అబి.దో.పస్లా, అబి.ఎక్.పస్లా, అబి/తాబి అని వెబ్సైట్లో పెట్టి మీ భూమి ఏ రకమో టిక్ పెట్టాలని అడగడం ధరణికి మాత్రమే చెల్లింది. – అసురఖన, తరి–తాభి, ఎక్ పస్లా, ఖరాజు ఖాతా, షికం ప్రాజెక్టు, బ.హీ.ఇండ్లు, బోనవాకన్సియా లాంటి అర్థం కాని భాషల్లో ఉన్న పదాలన్నీ ధరణి పోర్టల్‌లో పొందుపరిచారు. –మరిది కుమారుడు (అండ్ ద అదర్ సన్), పసుపు కుంకుమ (ఎల్లో శాఫ్రాన్), గుడి (డ్రింకింగ్), అధిగ్రహణ భూములు (ఎక్స్ట్రార్డినరీ ల్యాండ్స్), తమ్ముని భార్య (బ్రదర్స్ బ్రదర్), భూదాన్ పట్టా (భూటాన్ గ్రాడ్యుయేటెడ్), పెద్దనానా (బిగ్ నానా) అంటూ చేసిన అనువాదం చూసి రెవెన్యూ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. -
ఆ తప్పులు చేసి రెండు సార్లు జైలుకు వెళ్లాను: అజయ్ దేవగణ్
Ajay Devgn Says He Has Been In Jail Twice For His Mistakes: బాలీవుడ్లో మంచి స్టార్డమ్ ఉన్న హీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు. అటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించి మెప్పించాడు అజయ్ దేవగణ్. ఆయన తాజాగా హిందీలో చేస్తున్న చిత్రం 'రన్ వే 34'. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న ఈ మూవీకి అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేశాడు. 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'రన్ వే 34' చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు అజయ్ దేవగణ్. ఈ క్రమంలో తన చిన్నతనంలో అజయ్ చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. 'ఈ విషయాలు ఇప్పుడుల చెప్పకూడదు. కానీ ఇదివరకూ చాలాసార్లు వీటి గురించి చెప్పాను. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో చాలా తప్పులు చేస్తుంటారు. కానీ నేను అంతకన్నా ఎక్కువే చేశాను. ఫలితంగా ఒక్కసారి కాదు రెండుసార్లు జైలుకు కూడా వెళ్లాను. ఒకసారి మా నాన్న గన్ను ఆయనకు తెలియకుండా దొంగలించి జైలుకు వెళ్లాను. ఇంకోసారి తప్పు చేసి రెండోసారి కూడా వెళ్లాల్సి వచ్చింది. నేను కాలేజ్ రోజుల్లో గూండాలా ప్రవర్తించేవాన్ని. నేటి జనరేషన్‌కు తెలియదు కానీ ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేశాం.' అని తను చేసిన తప్పులు తెలిపాడు అజయ్ దేవగణ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ? చదవండి: అజయ్ దేవగన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎమోషనల్ అయిన సింగం -
వాళ్ల తప్పులపై ఎదుగుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాయని, వాటన్నింటినీ ఉపయోగించుకుని తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో నేతలు సఫలీకృతం అవుతున్నారని, మరోవైపు టీఆర్ఎస్పై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి మహేశ్వరం మండలంలోని మాక్ ప్రాజెక్ట్‌లో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో.. బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఇతర నాయకులను నడ్డా అభినందించారు. దూకుడు మరింత పెంచండి రాష్ట్రంలో బీజేపీ ఉద్యమ స్ఫూర్తిని నడ్డా ప్రశంసిం చారు. బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ బాగా పనిచేస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, అంశాలపై మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై పట్టుకోల్పోవడంతోపాటు హామీల అమల్లో వైఫల్యం చెందిందని, దీనిని జీర్ణించుకోలేకే ఆ పార్టీ పెద్దలు సంయమనం, గౌరవ మర్యాదలు కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇకముందు కూడా కలిసికట్టుగా: సంజయ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పార్టీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన జాతీయ పార్టీకి, ముఖ్యంగా జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గొప్ప ఉద్యమంలో రాష్ట్ర నాయకులు కూడా అండగా నిలిచారన్నారు. ఇకముందు కూడా టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు నడ్డాను, సంజయ్‌ను సన్మానించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం డాక్టర్ రమణ్‌సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
నేను తప్పు చేశాను, మరేం పర్లేదు: శిల్పాశెట్టి
Shilpa Shetty Admitted to Making a Mistake: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన తర్వాత ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవడంతో మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య ఇన్స్పిరేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ పుస్తకంలో మిస్టేక్స్ అని రాసున్న అధ్యాయంలోని పేజీని షేర్ చేసింది. "చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే- సోఫియా లారెన్. చిన్నపాటి తప్పులు కూడా చేయకుండా మన జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకోలేం. అయితే ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు. మిస్టేక్స్ ఎప్పుడూ ఉంటాయి. అవి మనకి సవాలు విసిరేలాగా, ఉత్తేజపరిచే అనుభవాలుగా, ఆసక్తికరంగా, లేదా వాటిని మర్చిపోయేదిగా ఉండాలి. చేసిన తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. 'కాబట్టి.. నేను తప్పులు చేయబోతున్నా.. అయితే ఆ తప్పుల నుంచి నన్ను నేను క్షమించుకుని, వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను" అని రాసున్న పేజీ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. నేను తప్పు చేశాను. అయినా ఏం పర్లేదు అని ఈ పోస్టుపై రాసుకొచ్చింది. మిస్టేక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన శిల్పాశెట్టి తను చేసిన తప్పేంటి? అన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. -
అమెరికా చేసిన పొరపాట్లే.. అఫ్గానిస్తాన్‌కు శాపమా?
కాబూల్: అగ్రరాజ్యంపై 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో దానికి కారకులైన అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడం లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా ప్రభుత్వం. అలా సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్‌ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో అఫ్గానిస్తాన్‌లో 2001లో సైనిక చర్యకు దిగింది. ఇక అనుకున్న పని పూర్తి చేసిన అగ్ర రాజ్యం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్ధాన్ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తక్షణమే తాలిబన్లు శరవేగంగా అఫ్గన్ ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా గతంలో చేసిన చారిత్రక తప్పిదాలను తెలుసుకుందాం. ఆఫ్గన్ ప్రజలు పూర్తిగా పశుపోషణపై ఆధారపడి జీవించేవారు. అంతే కాదు మెజారిటీ జనాభా పాత కాలపు కట్టుబాట్ల మధ్య జీవనం గడిపే వారు. వారిలో లింగ సమానత్వం.. చట్టాల పట్ల గౌరవం.. మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల మార్పు తీసుకు రాలేకపోయారు. నెపోలియన్ విదేశీ మంత్రి చార్లెస్ మారైస్ డీ తల్లేర్యాండ్ పెరిగోడ్ మాటల్లో చెప్పాలంటే అఫ్గాన్‌లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం.. ఒక పెద్ద తప్పిదం...అని అన్నారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను కట్టడి కోసం పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. కాకపోతే అగ్రరాజ్యం చెప్పినట్లు పాక్ వ్యవహరించలేదు. అమెరికా డిమాండ్లపై పాకిస్థాన్ సైనిక జనరల్స్ తమ ద్వేషపూరిత ప్రణాళిక అమలు చేశారు. ఈ విషయాన్ని గ్రహించి కూడా యూఎస్ నోరు మెదపలేదు. . తమకు ఉగ్రవాదుల అండ అవసరమని అమెరికాను పాక్ నమ్మించగలిగింది. అఫ్గన్‌పై పట్టు కోసం పాకిస్థాన్ సాకులకు అమెరికా తలొగ్గాల్సి వచ్చింది. అమెరికా మిత్రదేశంగా ఉన్న పాక్... తన శక్తియుక్తులన్నీ అగ్ర రాజ్యం కోరిన విధంగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడటానికే ఉపయోగించింది. దీని ప్రభావం అఫ్గన్‌లో అమెరికా సేనలకు ప్రతికూల పరిణామాలకు దారి తీసిందనే చెప్పాలి. అఫ్గన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అమెరికా పాక్‌పైనే ఆధారపడింది. తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా అమెరికా పని చేసిందే తప్ప.. దానికి పాక్‌లో మూలాలు ఉన్నాయన్న సంగతి తెలియకుండా ఉoటుందా. అయినా ఆ విషయాన్ని విస్మరించింది. తమ సైన్యంపై దాడుల్లో పాక్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని రుజువులు లభించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా ...పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అఫ్గన్‌లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం ఉన్న వారిని కాకుండా హమీద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీ వంటి నేతలను నాయకులుగా నిలబెట్టి మరో పెద్ద పొరపాటు చేసింది. అసలు వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనే విషయాన్ని కూడా గమనించలేదు. నిత్యం ఉగ్రవాదం అక్కడే దేశంలో పాలన ఎలా సాగించాలంటే నాయకుడి పాత్ర చాలా ముఖ్యం. ఇందులోను అమెరికా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇలా అమెరికా ఇన్నేళ్లుగా చేసిన ప్రణాళికలు, ప్లాన్లు అఫ్గానిస్తాన్‌కు పెద్దగా ఉపయోగపడక, అప్పట్లో చేసిన తప్పిదాలు నేటి పరిస్థితులకి ఓ రకంగా కారణమని తెలుస్తోంది. చదవండి: Afghanistan: తాలిబన్లపై ప్రారంభమైన తిరుగుబాటు హృదయ విదారకం: విమాన టైర్లలో మానవ శరీర భాగాలు, అవయవాలు -
కరోనా టెస్టులు లేకుండానే ఫలితాలొస్తున్నాయ్.. అదెలా
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చారు. వారికి ఆరోగ్య కేంద్ర సిబ్బంది టోకెన్లు అందజేసి మధ్యాహ్నం 12గంటలకు నమూనాలు సేకరిస్తామని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. అయితే కొంత ఆలస్యంగా మళ్లీ వారు ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం, అప్పటికే మిగితా వారికి పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ కిట్లు అయిపోయాయని, రేపు రమ్మని సిబ్బంది చెప్పడంతో మరోమారు వారు వెనుదిరిగారు. సాయంత్రం వారి సెల్ఫోన్లకు పరీక్ష ఫలితాలు నెగిటివ్ అని రావడంతో నివ్వెరపోయారు’. అసలు పరీక్ష చేసుకోకముందు ఫలితం ఎలా వచ్చిందని విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిర్ధారిత పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన గల శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కరోనా టెస్టుల్లో గందరగోళం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట వికలాంగుల కాలనీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిశాడు. కరోనా సోకిందనే అనుమానంతో టెస్టు చేయించేందుకు అక్కడికి వచ్చాడు. పరీక్ష చేసిన తర్వాత వైద్య సిబ్బంది ఆయనకు నెగిటివ్ అని చెప్పారు. అనంతరం రాత్రి సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో రాత్రంతా ఆయన భయాందోళనకు గురయ్యారు. ఉదయం శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్లో రికార్డు చూడగా ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. పరీక్షలు చేయించుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు ఒకే విధంగా ఉండడంతో రిపోర్టు మారినట్లు తెలిసింది. అయినప్పటికీ భయంతో మరోమారు అక్కడే పరీక్ష చేసుకుంటే కరోనా నెగిటివ్ వచ్చింది. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా పరీక్ష కోసం శాంతినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఉదయం 10గంటలకు 50 నుంచి 54 వరకు వీరికి టోకెన్లు అందజేశారు. మధ్యాహ్నం రావాలని సిబ్బంది చెప్పడంతో వారు ఒంటిగంటకు వెళ్లారు. ఆ సమయానికి కరోనా టెస్టులు నిలిపివేయడం, వీరి నమూనాలను తీసుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అయితే సాయంత్రం సమయంలో ఆ ఐదుగురికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పునరావృతమవుతున్న ఘటనలు... కరోనా పరీక్షల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. కొంతమంది పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫోన్‌కు మెస్సేజ్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతుండగా, మరికొంత మందికి మొదట నెగిటివ్ అని చెప్పి.. ఆ తర్వాత పాజిటివ్ అంటూ మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఏ సమాచారం నిజమో తెలియక బాధితులు తికతమక పడుతున్నారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ గర్భిణులు ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. అక్కడ సిబ్బంది ఆమెకు నెగిటివ్ అని చెప్పారు. ఫోన్‌కు మాత్రం కరోనా పాజిటివ్ అని మెస్సేజ్ వచ్చింది. దీంతో ఆ గర్భిణి ఆందోళనకు గురైంది. ఉదయం పూటనే భీంపూర్ పీహెచ్సీలో మరోమారు కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆమె గర్భిణి కావడంతో రిమ్స్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా అప్పుడు కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పర్యవేక్షణ కరువు... ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కరోనా పరీక్షలు చేయడం, కరోనా నివారణ టీకాలు వేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 12గంటలకు కరోనా పరీక్షలు ప్రారంభించి ఒంటిగంట లోపు ముగిస్తున్నారు. టీకాలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వేస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా, వీరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసమే నెగిటివ్ అని కరోనా నిర్ధారణ పరీక్ష కోసం సేకరించిన నమూనాల్లో 20శాతం ఆర్టీసీపీఆర్ కోసం పంపడం జరుగుతుంది. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని చూపించినప్పుడే ఆర్టీపీసీఆర్కు సంబంధించి ఆన్లైన్లో నమోదవుతోంది. అందుకోసమే నెగిటివ్ అనే రిపోర్టు పంపడం జరిగింది. – కిరణ్‌కుమార్, శాంతినగర్ యూపీఎహెచ్‌సీ వైద్యాధికారి ( చదవండి: రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి ) -
జాబ్ నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చిన ఐఐటీ!
సాక్షి, న్యూఢిల్లీ: నలభై ఐదు వేల రూపాయల జీతం అంటే తక్కువేమీ కాదు. వెన్ను విరిచే ప్రీ పెయిడ్ బాధ్యతలు ఏమీ లేకుంటే ఢిల్లీలోనైనా.. ‘వీధి వీధి నీదే బ్రదరూ.. ’ అని పాడుకోకుండా బతికేయొచ్చు. జీతం ఎంతో తెలిసింది కదా.. ఇప్పుడు పోస్ట్ ఏమిటో చూడండి. డాగ్ హ్యాండ్లర్. శునకం బాగోగులను చూసుకోవడం. ఒకటే శునకం. ఒకటే పోస్టు. ఢిల్లీ ఐ.ఐ.టి.లో పోస్టింగ్. బహుశా అది ఆ విద్యా ప్రాంగణంలోని ఓ అధికార నివాస గృహ జాగిలం అయి ఉండొచ్చు. వాక్–ఇన్ ఇంటర్వ్యూ కోసం ఐ.ఐ.టి. ప్రకటన ఇచ్చింది. 20–35 ఏళ్ల వయసు కలిగి, బి.ఎ. లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీటెక్ చేసిన వారెవరైనా నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. (ఇప్పుడు కాదులెండి. సెప్టెంబర్ 5 నే ఇంటర్వ్యూలు అయిపోయాయి). అయితే డాగ్ హ్యాండ్లర్ పోస్ట్‌కి ఈ డిగ్రీలు ఎందుకు అని పట్టభద్రులైన పిల్లలు ఆ నోటిఫికేషన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెటైర్ లు వెయ్యడం మొదలు పెట్టారు. ఓ సెటైర్ వి.రామగోపాల్ రావ్ గారికి కూడా తగిలింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆయన. వెంటనే ట్విట్టర్లోకి వెళ్లారు. ‘మనుషులన్నాక మిస్టేక్స్ జరుగుతుంటాయి. వెటెరినరీ సైన్సెస్‌లో డిగ్రీ చేసిన వాళ్లు.. అని ఇవ్వబోయి బై మిస్టేక్ బీటెక్ లు, మిగతా డిగ్రీలు ఇచ్చాము. ఈ సంగతిని ఇక్కడితో వదిలేయండి..’ అని ట్వీట్ చేశారు. అయితే ఆయన మాత్రం వదిలేయలేదు! ‘అయినా జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే తెలియట్లేదా.. వెటెరినరీ చదివిన వాళ్లు కావాలని.. అవన్నీ మీరే చూస్కోవాలి’ అని తిరుగు మాట ఒకటి వేశారు. తప్పును పూర్తిగా ఒప్పేసుకుంటే మళ్లీ అదొక తప్పు అవుతుందనుకున్నారో ఏమో ఐ.ఐ.టి.డైరెక్టర్. చదవండి: భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు -
ప్రైవేటు పరీక్షలు.. తప్పుల తడకలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. శాంపిల్స్‌లో ఉన్న వాస్తవ పరిస్థితికి భిన్నంగా రిపోర్టు లు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంటోంది. అటు వైరస్ లక్షణాలున్నట్లు భావించి శాంపిల్స్ ఇచ్చినవారికి.. ఇటు వివరాలు పరిశీలిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగానికి ఈ పరిస్థితి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లెక్కకు మించి పరీక్షలు నిర్వహిస్తుండగా.. వైరస్ లేనప్పటికీ పాజిటివ్ కేసులుగా పేర్కొంటూ రిపోర్టులు ఇస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకునేందుకు ఉపక్రమించిన వైద్య, ఆరోగ్య శాఖ.. ప్రైవేటు ల్యాబ్‌లలో వసతులు, సౌకర్యా లు, పరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీ తదితర అంశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు, వైద్య విద్య సంచాలక కార్యాలయ నిపుణులు, ఖాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం నిపుణులతో కూడిన నాలుగు బృందాలు ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అంశాలను వెలుగులోకి తెచ్చాయి. సరైన శిక్షణ లేకుండానే... రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణం గా ఈ పరీక్షలు నిర్వహించాలి. కానీ చాలాచోట్ల కనీస జాగ్రత్తలు పాటించడంలేదని తనిఖీ బృం దాలు గుర్తించాయి. పలు ల్యాబ్‌లలో శాంపిల్స్ తీసుకునే సిబ్బంది పీపీఈ కిట్లు కూడా ధరించడం లేదు. ల్యాబ్ వాతావరణం ఇబ్బందికరంగా ఉం డగా.. చాలామంది సిబ్బందికి కేబిన్లు కూడా లేవు. ప్రధానంగా పరీక్షలు నిర్వహించే సిబ్బంది సరైన అనుభవం లేకుండానే పరీక్షలు చేస్తుండటంతో ఎక్కువ కేసులు నెగిటివ్‌కు బదులు పాజి టివ్‌గా వస్తున్నట్లు తనిఖీ బృందం గుర్తించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పూల్డ్ టెస్టింగ్ విధానం పూర్తయిన తర్వాత వచ్చేవాటిలో పాజిటివ్ కేసులతో పాటు నెగిటివ్ కేసులను కూడా పాజిటివ్‌గా పే ర్కొంటున్నట్టు నిర్ధారించింది. జాగ్రత్తలు పాటిం చకపోడంతో శాంపిల్స్ కలుషితం కావడంతో పా టు నెగిటివ్ వచ్చే శాంపిల్స్ కూడా పాజిటివ్‌గా ని ర్ధారణయ్యే అవకాశముందని అంచనాకు వచ్చింది. కొన్ని ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించకుం డా ఇష్టానుసారంగా శాంపిల్స్ తీసుకుంటున్నట్లు గుర్తించింది. మరికొన్ని ల్యాబ్‌లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పరికరాలను శుభ్రం గా ఉంచకపోడంతో పరీక్షల ఫలితాలు ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉందని కమిటీ తేల్చింది. మరింత లోతైన అధ్యయనం... వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నిబంధనలకు విరుద్దంగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు లోబడి నడుచుకోని ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మరోవైపు ల్యాబ్‌లలో లోపాలపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను విశ్లేషించనున్నట్లు నివేదికలో పేర్కొంది. -
ఇంటర్ ఇంగ్లిష్–2 పరీక్షలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. మొత్తం 6 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తించారు. వాటివల్ల పరీక్ష కేంద్రాల్లో గందరగోళానికి గురి కావాల్సి వచ్చిందని అనేక మంది విద్యార్థులు వాపోయారు. 5, 7, 10, 12, 14, 17 నంబరు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని, దీంతో 15 మార్కుల వరకు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో 14వ ప్రశ్నను అసంపూర్తిగా ఇవ్వగా.. మిగతా ప్రశ్నల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రం ప్రింట్ చేసిన తరువాత ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం, తప్పులను సరిదిద్దడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని లెక్చరర్లు పేర్కొంటున్నారు. అయితే ఈ తప్పులకు బాధ్యత బోర్డుదే అయినందున విద్యార్థులు నష్టపోకుండా మార్కులు కలపాలని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీష్ డిమాండ్ చేశారు. ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే మార్కులిస్తాం: బోర్డు కార్యదర్శి ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పందించారు. 14వ ప్రశ్న అసంపూర్తిగా ఉన్నందున ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని వెల్లడించారు. అచ్చు తప్పుల విషయంలో ఉదయం 9:45 గంటలకే అన్ని పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి సరి చేయించామన్నారు. తప్పులతో ప్రశ్నపత్రాలను రూపొందించిన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఇవీ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులు.. ►14వ ప్రశ్నలో ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఫారం ఇచ్చారు. అందులో అకౌంట్ నంబరు, పేరు, అమౌంట్ ఇచ్చారు. అయితే అందులో డేట్, బ్రాంచి వివరాలు, మొబైల్ నంబరు ఆప్షన్, సంతకం లేకుండా అసంపూర్ణంగా ప్రశ్నను ఇచ్చారు. ఆ తరువాత బోర్డు నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇన్విజిలేటర్లు అది కోఠి బ్రాంచ్ అని చెప్పారు. దీంతో విద్యార్థులు మరింత గందరగోళానికి గురయ్యారు. ఇది 4 మార్కుల ప్రశ్న కాగా, జవాబులు రాయాల్సిన ఖాళీలు 10 ఇచ్చారు. కానీ ప్రశ్నకు పక్కన మాత్రం 8 రాయాలని, ఒక్కో ఖాళీ నింపితే అర మార్కు చొప్పున ఇస్తామని ఉంది. ►ఇక 4 మార్కులు కలిగిన 5వ ప్రశ్నకు why అని ఉండాల్సిన చోట What అని వచ్చింది. ►4 మార్కులు కలిగిన 17వ ప్రశ్నలో felicitationకి బదులుగా felicilation అని తప్పుగా పడింది. ►7వ ప్రశ్న రెండో పేరాలో discipline అని ఇవ్వడానికి బదులుగా disipline అని ఇచ్చారు. అదే తప్పు రిపీట్ కూడా అయ్యింది. ►10వ ప్రశ్నలో a book అనే పదం ఉండాల్సి ఉండగా.. అది లేకుండానే ఇచ్చారు. ►ఒక మార్కు కలిగిన 12వ ప్రశ్నలో turn a deaf ear అని ముద్రించాల్సి ఉండగా..turn a deaf year అని ముద్రించారు. -
ధోని దాదాగిరి
క్రికెట్లో అంపైరింగ్ పొరపాట్లు మొదటి సారేమీ కాదు... అంపైర్లు చేసిన తప్పుల వల్లే మ్యాచ్ ఫలితాలు తారుమారైన ఘటనలు కోకొల్లలు... అంపైర్ల నిర్ణయాలు కొన్ని సార్లు తమకు అనుకూలంగా, మరికొన్ని ప్రత్యర్థి జట్ల పక్షాన రావడం దేశవాళీనుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ప్రతీ జట్టుకు అనుభవమే. సాధారణంగానైతే ఆటగాళ్లు లేదా కెప్టెన్లు ‘తప్పులు మానవ సహజం’ అని లేదంటే ‘ఇదంతా ఆటలో భాగమే’ అని దానిని వదిలేస్తుంటారు. కాస్త ఆవేశపరులైతే తమ అసహనాన్ని, కోపాన్ని బయటకు ప్రదర్శిస్తారు. అంతే తప్ప ఔటై బౌండరీ బయట కూర్చున్న వ్యక్తి లోపలికి దూసుకుపోయి అంపైర్లతో గొడవ పెట్టుకోడు. కానీ దిగ్గజ క్రికెటర్, రెండు వరల్డ్ కప్‌లలో జట్టును విజేతగా నిలిపిన వ్యక్తి ఆ పని చేశాడు. కేవలం ఒక నోబాల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయే రీతిలో అతను ప్రవర్తించాడు. సాక్షి క్రీడా విభాగం సరిగ్గా రెండు వారాల క్రితం మలింగ వేసిన నోబాల్‌ను గుర్తించలేకపోయినందుకు ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి. మేం ఆడుతోంది ఐపీఎల్. క్లబ్ క్రికెట్ కాదు’... అని విరాట్ కోహ్లి అంపైర్లపై విరుచుకు పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అంపైర్లపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదు. కానీ కోహ్లికి ఐపీఎల్ నిర్వాహకులు కనీసం హెచ్చరిక కూడా జారీ చేయలేదు. ఇప్పుడు తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్లుగా ధోని అంపైర్లపై చెలరేగిపోయాడు. ఘటన జరిగిన తీరును చూస్తే కెప్టెన్‌గా అతను అసంతృప్తి చెందడం సహజమే అయినా దానిని వ్యక్తీకరించే విషయంలో ధోని గీత దాటాడనేది వాస్తవం. కోచ్ సమర్థన! నిబంధనల ప్రకారం అయితే ‘హైట్ నోబాల్’ను ఖరారు చేయాల్సింది లెగ్ అంపైర్ మాత్రమే. కానీ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఉల్హాస్ గంధే నోబాల్‌గా ప్రకటించాడు. విదర్భ తరఫున దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడిన 44 ఏళ్ల ఉల్హాస్ దేశవాళీ అంపైర్ మాత్రమే. పెద్ద అనుభవం లేని అతను నోబాల్ ఇవ్వడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ సాంట్నర్ షాట్ ఆడేందుకు ముందుకు రావడం, ఆడేటప్పుడు గాల్లోకి ఎగరడం వల్ల లెగ్ అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ దీనిని నోబాల్‌గా గుర్తించలేదు. దాంతో ఉల్హాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో ధోని మైదానంలోకి దూసుకుపోయి వాదనకు దిగాడు. అది నోబాల్ కాదంటూ చెప్పి ధోనిని సముదాయించి బయటకు పంపేందుకు ఆక్సెన్ఫోర్డ్కు తల ప్రాణం తోకకు వచ్చింది. మ్యాచ్ అనంతరం ధోని అయితే దీనిపై ఏం మాట్లాడలేదు కానీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేలవ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘నోబాల్‌పై నిర్ణయం తీసుకునే విషయంలో అంపైర్లు వ్యవహరించిన తీరుపై ధోనికి కోపం వచ్చింది. ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది అతనికి అర్థం కాలేదు. దాంతో మరింత స్పష్టత కోరేందుకే అతను మైదానంలోకి వెళ్లాడు. నిజానికి అతను చాలా సంయమనంతో ఉంటాడు. ఇది అసాధారణం. ఈ ఘటన గురించి రాబోయే రోజుల్లో అతడిని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తారని నాకు తెలుసు’ అని ఫ్లెమింగ్ అన్నాడు. లెక్కలేనితనమా... ధోని వీరాభిమానులు కూడా అతను చేసిన పనిని నమ్మలేకపోతున్నారు. నిజంగా నోబాల్‌పై అసంతృప్తి ఉంటే అన్ని తెలిసిన అతను నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సింది. అదేమీ జట్టు కోసం నిలబడాల్సినంత పెద్ద ఘటన కాదు. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీకి ఫిర్యాదు చేసే అవకాశం అతనికి ఉంది. లేదా టీమ్ మేనేజ్మెంట్ తరఫున ఘాటైన నివేదిక తయారు చేసి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అందజేస్తే వారే అంపైర్‌పై చర్య తీసుకుంటారు. కానీ అంపైర్ల అధికారాన్ని సవాల్ చేస్తూ వారిని బహిరంగంగా అవమానించాడు. ఒక రకంగా చూస్తే చొక్కా చేతులను పైకి మడిచి గొడవకు దిగే వ్యక్తుల తరహాలో ప్రవర్తించాడు. భారత క్రికెట్లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు. ఇకపై ప్రతీ క్రికెటర్ ఔటై బయట కూర్చొని కూడా అంపైరింగ్ నిర్ణయం తప్పని అనిపిస్తే అప్పటికప్పుడు ప్రశ్నించేందుకు సిద్ధమైపోతాడు. ఇటీవలి చెన్నై టీమ్ డాక్యుమెంటరీ ‘రోర్ ఆఫ్ ద లయన్’ తరహాలో కొన్నేళ్లకు మళ్లీ ఏమైనా ప్రత్యేక వీడియోను ధోని స్వయంగా నిర్మించి అందులో ఈ ఘటనపై తన ‘వివరణ’ ఇస్తే తప్ప ధోని స్పందన ఇప్పట్లో ఉండదు. కానీ తన ప్రవర్తనతో అతను కొంత మంది అభిమానులకైనా దూరమయ్యాడనేది వాస్తవం. జరిమానాతో సరి... ఒక వైపు ధోని చేసిన పనిపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తూ కనీసం మ్యాచ్ నిషేధమైనా ఉండాలని వినిపిస్తుండగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అతి స్వల్ప శిక్షతో సరిపెట్టింది. లెవల్ 2 తప్పిదం కింద గుర్తిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఐపీఎల్లో ఒక మ్యాచ్‌కు ధోని ఫీజు ఎంతనేదే స్పష్టత లేదు. ఎంత మొత్తమైనా ఎలాగూ ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది కాబట్టి ధోనికి శిక్ష పడనట్లే! -
వేలెత్తి చూపేలా...!
వినడానికి విచిత్రంగా... చెప్పుకోవడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఘటనలు ఇటీవల క్రికెట్లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి ఆటగాళ్ల మధ్యనో... మైదానంలోని ప్రేక్షకుల కారణంగానో అయితే పెద్దగా ప్రాధాన్యం ఉండకపోయేది. కానీ, ఆటకు ఆయువుపట్టయిన అంపైరింగ్ వ్యవస్థలో తలెత్తుతుండటంతో చర్చనీయాంశం అవుతున్నాయి. మ్యాచ్ ఫలితంపై అంతోఇంతో ప్రభావం చూపుతూనే... ఒక్కోసారి వివాదానికి సైతం దారితీస్తూ ‘జెంటిల్మన్’ గేమ్ స్ఫూర్తిని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ జట్ల మధ్య జరిగిన గత ఐదారు సిరీస్‌లను పరిశీలిస్తే అంపైరింగ్ పొర‘పాట్లు’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. సాక్షి క్రీడా విభాగం ఏదైనా అనుమానం వస్తే సంప్రదించేందుకు సహచర అంపైర్ ఉన్నాడు... అప్పటికీ సంశయం ఉంటే నివృత్తికి థర్డ్ అంపైర్‌కు నివేదించే వీలుంది... ఆపై తేల్చేందుకు టెక్నాలజీ తోడుంది! ఇన్ని పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నా ఇటీవల అంపైరింగ్‌లో పదేపదే పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇలాంటివి ఒకటీ, అరా అయితే చూసీచూడనట్లు వదిలేయొచ్చు. అప్పుడప్పుడు అంటే మానవ తప్పిదమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సిరీస్‌లలో తలెత్తుతుండటంతో ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓ దశలో సహనం కోల్పోయిన ఆటగాళ్లు నిలదీసే వరకు వెళ్తున్నాయి. ఈ ఆవేశంలో అనుకోకుండా హద్దు మీరితే మొదట చర్యలకు గురయ్యేది క్రికెటర్లే కావడం గమనార్హం. విచక్షణతో వదిలేశారు... ప్రతి అంశానికీ టెక్నాలజీ వైపు చూస్తున్న ఈ రోజుల్లోనూ అంపైరింగ్ దోషాలంటే అవి ఆటగాళ్ల పాలిట గ్రహపాట్లుగానే భావించాలి. ఓవైపు టెస్టుల్లో పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా వదిలేయాల్సిన ‘స్లో ఓవర్ రేట్’కే మ్యాచ్‌లకు మ్యాచ్‌లు నిషేధం విధిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... మైదానంలో అదుపు తప్పిన ఆటగాళ్లను అన్నిసార్లు ఊరకనే వదిలేస్తుందని అనుకోలేం. ఉదాహరణకు డిసెంబరులో బంగ్లాదేశ్‌పై మూడో టి20లో ఒషేన్ థామస్ వేసిన ఓ బంతిని ‘నో బాల్’గా ప్రకటించడంపై వెస్టిండీస్ కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వైట్ అంపైర్ తన్వీర్ అహ్మద్‌తో తీవ్రమైన వాదనకు దిగాడు. ఈ వివాదం కారణంగా మ్యాచ్ 8 నిమిషాలు ఆగింది. వాస్తవానికి థామస్‌ది ‘నో బాల్’ కాదు. దీంతో బ్రాత్‌వైట్‌పై చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఇదే సిరీస్ రెండో టి20లో స్లో ఓవర్ రేట్‌కు బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అక్కడ... ఇక్కడ... ఎక్కడైనా! సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో భారత్–అఫ్గానిస్తాన్ వన్డేలో, భారత్–న్యూజిలాండ్ రెండో టి20లో, ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టులో, ప్రస్తుత శ్రీలంక–దక్షిణాఫ్రికా టెస్టులో అంపైరింగ్ తప్పటడుగులు సాధారణమయ్యాయి. కొత్తవారంటే తడబడ్డారని అనుకున్నా, వందలకొద్దీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అలీమ్ దార్ వంటి సీనియర్ల నిర్ణయాలు సైతం వేలెత్తిచూపేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో చూపాల్సిన ‘సమయ’స్ఫూర్తి వారిలో కొరవడుతోంది. దీంతో పని భారం తగ్గింపు, నిర్ణయాల్లో కచ్చితత్వం కోసమంటూ తీసుకొచ్చిన సాంకేతికతకూ విలువ లేకుండా పోతోంది. ‘అంపైరింగ్ నిర్ణయాలను ప్రశ్నించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని మ్యాచ్ నిషేధాలను ఎదుర్కోవడం ఇష్టం లేదంటూ’ ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని వ్యాఖ్యానించాడు. ధోని మాటల అంతరార్థం... అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందరికీ తెలిసిపోయింది. సాఫ్ట్ సిగ్నల్ ఎత్తివేయండి... డీఆర్ఎస్లోనూ ఏమీ తేలని పక్షంలో... అంపైర్ తొలుత ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉండే సాఫ్ట్ సిగ్నల్‌ను ఎత్తివేయాలని క్రికెట్ ప్రముఖుల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. కొన్నిసార్లు మైదానంలో ఆటగాళ్ల సంబరాలకు ప్రభావితులై అంపైర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాంటపుడు తుది నిర్ణయాన్ని వారికే ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవీ... అంపైరాంగ్ ఘటనలు! ఇంగ్లండ్–వెస్టిండీస్ మూడో టెస్టు తొలి రోజు అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే అంపైర్ పరిశీలించి జోసెఫ్ ‘నో బాల్’ వేసినట్లు తేల్చి వెనక్కుపిల్చాడు. కానీ, అప్పటికే బెయిర్‌స్టో గ్రౌండ్లోకి వచ్చేశాడు. 2017 ఏప్రిల్ నుంచి మారిన రూల్ నంబర్ 31.7 ప్రకారం... ఔట్‌గా వెళ్లిపోయిన బ్యాట్స్‌మన్‌ను మరుసటి బంతి పడేవరకు వెనక్కు పిలిచే అధికారం అంపైర్లకు ఉంది. దీంతో స్టోక్స్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు అనుమతించారు. ►భారత్‌పై రెండో టి20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డరైల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూ వివాదం రేపింది. దీనిపై నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి వెళ్లగా హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టమైంది. అయితే, బంతి ట్రాకింగ్‌లో మూడు ఎరుపు గుర్తులు కనిపించడంతో మూడో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ►డిసెంబరులో బంగ్లాదేశ్–వెస్టిండీస్ టి20లో ఒషేన్ థామస్ కాలు క్రీజ్‌కు తగులుతున్నా అంపైర్ తన్వీర్ అహ్మద్ నోబాల్ ఇచ్చాడు. పెద్ద వివాదం రేగడంతో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తవాడినని, పొరపాటు చేశానని అతడు అంగీకరించాడు. ►శ్రీలంకతో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా స్పష్టంగా ఔటయినా అలీమ్ దార్ ఇవ్వలేదు. లంక కెప్టెన్ కరుణరత్నె డీఆర్ఎస్ కోరబోగా నిర్ణీత సమయం (15 సెకన్లు) అయిపోయిందంటూ దార్ తిరస్కరించాడు. కానీ, మరో రెండు సెకన్ల వ్యవధి మిగిలే ఉన్నట్లు తర్వాత తేలింది. -
‘డబుల్’ ట్రబుల్
కోల్‌బెల్ట్(భూపాలపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో కొంత కాలంగా విధులు నిర్వహించి పలు కారణాలతో దిగి పోయిన విశ్రాంత కార్మికుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. సింగరేణిలో ఉద్యోగం చేయాలంటే నాడు భయపడే రోజుల్లో కొంత మందిని బలవంతంగా అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. మరికొంత మంది తప్పని పరిస్థితుల్లో ఏ ఆధారం లేని వారు సింగరేణిలో బినామీ పేరుతో పనులు చేశారు. వివిధ హోదాల్లో సుమారు 30 ఏళ్లపాటు పనులు చేసి ఉద్యోగ విరమణ అనంతరం వారి పరిస్థితి అయోమయంగా మారింది. అసలు పేరు ఒకటి ఉండటం, సింగరేణిలో మరో పేరు ఉండటం మూలంగా ఉద్యోగ విరమణ అనంతరం సంస్థ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందక రెంటికి చెడ్డ రేవడిగా మారింది విశ్రాంత కార్మికుల పరిస్థితి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 500 పైగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సంస్థ నుంచి లభించని సహకారం.. రెండు పేర్లతో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి ఎటువంటి సహకారం లభించక పోవటం ఆయా కుటుంబాల పరిస్థితి అరణ్య రోదనగా మారింది. సింగరేణిలో డబుల్ నేమ్ కలిగిన వారు సమస్యను ఎదుర్కొంటున్నారు. సంస్థలో ఓ పేరు, బయట అసలు పేరు ఉండటం వారు ఇప్పటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక మదన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారు సంస్థలో ఉన్న పేరుతో మాత్రమే పెన్షన్ పొందుతుండగా వారి డిపెండెంట్లు అసలు పేరుతో ఉండటం మూలంగా వారసత్వఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో సైతం వీరు అనర్హులుగా మిగలటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ ఇంటిపేరు, పేరులో తప్పులు ఉంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. అదే మాదిరిగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద పేర్లు తదితర వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలని సింగరేణి వ్యాప్తంగా కోరుతున్నారు. ఇందుకు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సైతం చొరవ చూపాలని ప్రాధేయ పడుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో 2017లో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సైతం వన్‌టైం సెటిల్మెం ట్ కింద డబుల్ నేమ్ కలిగిన వారికి అవకాశం కల్పించాలని కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను కోరారు. సమస్యను సత్వరం పరిష్క రించాలని విశ్రాంత కార్మికులు కోరుతున్నారు. చిన్న తప్పిదంగా భావించాలి వాస్తవానికి సింగరేణిలో ఉద్యోగం చేసేందుకు భయపడిన రోజుల్లో జరిగిన చిన్న తప్పిదానికి జీవితాంతం విశ్రాంత కార్మికులు నష్ట పోతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఈ విషయంలో యాజమాన్యాన్ని ఒప్పించి సవరించాలి. – పసునూటి రాజేందర్, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సవరణకు అవకాశం ఇవ్వాలి అనుకోని పరిస్థితుల్లో ఇతర పేర్ల మీద పని చేస్తున్న కార్మికులు, విశ్రాంత కార్మికులకు తమ పేర్లను సవరించుకొనేందుకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే డబుల్ నేమ్ మూలంగా వందలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ నుంచి వచ్చే ప్రయోజనాలు సైతం కోల్పోతున్నందున మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. – ఎం.రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి -
ఐదేళ్ల బాలికకు ఓటు.. ఆమెకు భర్త కూడా..!
సాక్షి, అమరావతి: ఆ పాప పుట్టి ఇంకా ఏడాది కూడా నిండలేదు. కానీ ఓటు హక్కు వచ్చేసింది. ఇంకో పసిబిడ్డ వయసు ఏడాదే. కానీ, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు ఆ బిడ్డ పుట్టుకతోనే ఓటు హక్కుతో జన్మించింది. మరో బాలిక వయసు ఐదేళ్లే. ఆమెకు ఓటు హక్కుతోపాటు 50 ఏళ్ల భర్త కూడా ఉన్నాడట! రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో చిత్ర విచిత్రాలివీ. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడతాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, లక్షల సంఖ్యలో అక్రమ ఓట్లను నమోదు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 52.67 లక్షలకు పైగా నకిలీ ఓట్లున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదులందాయి. తప్పుడు వయసు సమాచారంతో ఎన్నో ఓట్లు నమోదైనట్లు తేలుతోంది. వివిధ రకాలుగా నకిలీ ఓట్లు 25 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరిస్తూ ఆ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. బొడ్డూడని చిన్నారులూ ఓటర్లే దేశంలో ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఓటు హక్కు కల్పించారు. నెల్లూరు నగరానికి చెందిన పేరూరి సాయికుమార్ వయసు కేవలం ఏడాదే కాగా ఆతడి పేరిట ‘జెడ్‌ఏఎఫ్1714971’ ఓటర్ ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు కల్పించారు. తూ.గో. జిల్లా తునికి చెందిన ఐదేళ్ల బాలిక టి.దివ్య ఓటరుగా నమోదైంది. కర్నూలు జిల్లా పాణ్యం పట్టణానికి చెందిన హుస్సేన్ సాహెబ్ వయసు 17 ఏళ్లు. ఆతడికి ‘ఎన్‌కేడీ0190108’ ఐడీ నెంబర్‌తో ఓటు ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాలికకు ఐదేళ్లు నిండకుండానే ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఆమెకు భర్త కూడా ఉన్నట్లు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని జె.రామలక్ష్మి అనే ఏడాది పసిపాపకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో పేరు చేర్చారు. కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది వయసున్న బెజవాడ జ్యోతి అనే పాపకు ఓటు హక్కు కల్పించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండేళ్ల వయసున్న భద్రప్ప, జీలకర్ర దొర అనే ఇద్దరు బాలురకు ఓటు హక్కు దక్కింది. తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో ఆచంట అంజనీకుమార్ అనే రెండేళ్ల బాబుకు కూడా ఓటు హక్కు కల్పించారు. 300 ఏళ్లు నిండిన వారున్నారా! ప్రపంచంలో వంద నుంచి నూటమూప్పై ఏళ్లు బతికినవారు ఉన్నారు. అయితే ఏపీలో ఏకంగా 352 ఏళ్లున్న వృద్ధులు కూడా ఉన్నారట! ఇది ఇక్కడి ఓటర్ల జాబితాలోని ప్రత్యేకత. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పెద్దిపాలేనికి చెందిన ఎర్రంశెట్టి నర్సింగరావు వయసు 352 ఏళ్లు అని ఉంది. ఈయన ఓటరు ఐడీ నెంబర్ ఎఫ్‌జెఎక్స్0992941. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వనం నారాయణమ్మ అనే మహిళ వయసు 351 ఏళ్లట! ఈమె ఓటరు ఐడీ ఏపీ052740594072. కృష్ణా జల్లా గన్నవరంలో ‘యూఓజీ0077859’ అనే ఓటర్ ఐడీ నెంబర్ ఉన్న ఎ.సూర్యనారాయణ వయసు 344 ఏళ్లు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పి.సుధారాణి అనే ఓటర్ వయసు 248 ఏళ్లు. ఈమె ఓటరు ఐడీ ఎస్జీఈ0247270. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్ఏఏ0237545 ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు ఉన్న వల్లభనేని జోజప్ప వయసు 225 ఏళ్లు. -
కశ్మీర్ తగలబడుతోంది
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన తప్పుల కారణంగా కశ్మీర్ తగలబడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపిం చారు. రెండురోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆయన పర్యటించారు. ముందు గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివభక్తుడైన రాహుల్ గాంధీ 2010లోనూ ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మాల్వా– నిమాడ్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ..ఒక ర్యాంకు– ఒక పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు గత కొద్దీ రోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తప్పిదాల కారణంగా జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు కశ్మీర్ తలుపులు బార్ల తీసిందని ఆరోపించారు. ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, ఆర్మీ, నేవీ గురించి మాట్లాడే మోదీ..సైనికుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరని విమర్శించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ వల్ల సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని మోదీని డిమాండ్ చేశారు. -
ఎన్నికలను వాయిదా వేయాలి: మర్రి
సాక్షి, హైదరాబాద్: తుది ఓటర్ల జాబి తాలో దాదాపు 25 లక్షలమంది ఓట్లు గల్లంతయ్యాయని, దీనిని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సవాల్ చేశారు. సాంకేతిక సమస్యలతో తుదిఓటర్ల జాబితాలో కేవలం 25 వేలమంది ఓటర్ల పేర్లు పునరావృతమయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పుడు ఓటరు జాబితాతో ఎన్నికలు సజావుగా జరగవని, ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేత నిరంజన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధంగా ఉన్నామని సీఈవో హైకోర్టును తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈసీ పనితీరు మారకపోతే జాతీయ, ప్రపంచ మీడియా ముందు అసమర్థతను బహిర్గతం చేస్తామని అల్టిమేటం జారీచేశారు. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయకుండా పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈసీ హైకోర్టుకు సమ ర్పించిన నివేదిక మేరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అమలు కావడం లేదన్నారు. పార్టీలకు తుది ఓటరు జాబితా ప్రతులను ఇంతవరకు అందజేయలేదని, కనీసం అధికారిక వెబ్సైట్లో సైతం ఓటర్ల జా బితాలను పొందుపరచలేద ని తప్పుబట్టారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్‌లో ఈవీఎంలు నిల్వ చేసిన గోదాంను అధికారులు తెరవడంపై అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నోడల్ ఆఫీసర్ సమక్షంలో ఈవీఎంల సీలు తీసి, మళ్లీ సీలు వేసే వరకు వీడియో తీయాల్సి ఉందని, కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం టీఆర్ఎస్తో కుమ్మక్కు అయిందని హైకోర్టులో న్యా యవాదులు సైతం వాదించారని గుర్తుచేశారు. అధికారుల తప్పుడు వ్యవహార శైలీతో ఎన్నికల ప్రక్రియ గందరగోళమైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
గ్రూప్–4 ప్రశ్నపత్రంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్–1 సెట్ బీలోని ప్రశ్నలు సెట్–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్– 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఏ సిరీస్ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్‌కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్‌కు బదులు మరో సిరీస్‌లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్పీఎస్సీని కోరారు. 65 శాతం హాజరు..: గ్రూప్–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
తప్పులతో ప్రచార బెలూన్లు...ఫ్లెక్సీలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న 72వ స్వాతంత్య్ర దినోత్సవంలో పలు లోపాలు బహిర్గతమయ్యాయి. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుక కోసం 20 రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని రకాలు సామగ్రిని గత స్వాతంత్య్ర వేడుకలో అనుభవం ఉన్న వారికే టెండర్లు ఇచ్చి అమరావతి నుంచి రప్పించారు. అయినప్పటికీ చివరికి తప్పులు తడకల బెలూన్లు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అందులో ప్రధానంగా వంశధార– నాగావళి అనే పేర్లకు బదులు (నాగవళి) అని, ఏకంగా జిల్లా పేరును శ్రీకాకుళంకి బదులుగా (శ్రీకాకులం) అని స్వాతంత్య్ర దినోత్సవం బదులుగా (దిననోత్సవ) వేడుకలు అని ముద్రించడం విశేషం. పరేడ్ మైదానంలో కుక్కల హడావిడి: ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి వచ్చే మీడియా ప్రతినిధులకు, సామాన్యులకు లోపలికి పంపించేందుకు పోలీసులు హడావిడి చేసి నానా ఇబ్బందులకు గురిచేశారు. ఎంతమంది పోలీసులు చుట్టూ కాపలా కాసిన వీధికుక్కలు మాత్రం నేరుగా పరేడ్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాయి. మనుషులను మాత్రం బెదిరించగలిగారే తప్పా వీటిని మాత్రం ఏమి చేయలేక చేతులెత్తేశారు. స్వాతంత్య్ర సమరయోధులను పట్టించుకోని వైనం స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను ఏటా పిలిచి గౌరవించడం జిల్లా సాంప్రదాయం. ఈ సారి సీఎం చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చిన సందర్భంగా వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం కొనసాగినంత సేపు ఓపికగా కూర్చున్నారు. సీఎం వెళ్లిన తక్షణమే ఎవరిమానాన వారు వారిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బయటివారిని తోడుగా పిలిచుకుని వెళ్లారు. ప్రేక్షకుల నిరుత్సాహం: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏటా కుటుంబ సభ్యులతో హాజరవ్వడం ఆనవాయితీ. అదేవిధంగా చాలా మంది జోరు వానను సైతం లెక్కచేయకుండా మైదానం వరకు వచ్చినా లోపలికి పంపించకుండా పోలీసులు తిరిగి పంపించేశారు. దీంతో వారంతా నిరుత్సాహం చెందారు. -
ఉపాధి పనుల్లో తప్పులు చేస్తే చర్యలు
పిట్లం(జుక్కల్) నిజామాబాద్ : ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న సిబ్బంది తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీడీ సాయన్న హెచ్చరించారు. శుక్రవారం నాడు పిట్లం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉపాధిహామి సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరై మాట్లాడారు. మండలంలో 2017–18 సంవత్సరానికి రూ.5.70 లక్షల పనులు జరగాయన్నారు. వీటికి సంబంధించి మండలంలోని గ్రామాల్లో వారం రోజులపాటు సామాజిక తనిఖీ చేశామన్నారు. గతంలో మండలంలో రూ.9 కోట్ల వరకు పనులు జరిగితే ఈసారి తక్కవగా జరగాయని, రానున్న రోజుల్లో ఇలా జరిగితే సహించేది లేదని, పని దినాలను పెంచాలన్నారు. ఈసారి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.61 లక్షల పని దినాలను కల్పించామన్నారు. ఉపాధి పనులు తక్కవగా జరిగితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, ఈ వర్షకాలం కాగానే పనులు జోరుగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక సామాజికి తనిఖీ బృందం వారు గ్రామాల్లో చేసిన ఆడిట్ నివేదికను చదివి వినిపించారు. అయితే సిబ్బంది చిన్న చిన్న తప్పులకు పాల్పడినట్లు తెలిసిందని, ఇటువంటి వాటిని మానుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, డీవీవో భూమేశ్వర్, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, నిజాంసాగర్ ఎంపీడీవో పర్బన్న, ఎస్ఆర్పీ రంజిత్ కుమార్, ఏపీవోలు శివ కుమార్, టీఏలు బల్రాం, హకీం, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అయినా మనిషి మారలేదు
‘‘ఇది చాలా పొరపాటు సుకుమార్’’. మనసులోని కోపాన్నీ, బాధనూ అణచుకుంటూ సుకుమార్‌ని మెత్తగా మందలించాను. సుకుమార్ నా ముందు ప్రశాంతంగా, ఏ భావం మొహంలో కనబడకుండా కూర్చున్నాడు. సుకుమార్ భార్య కోమలి రెండోసారి గర్భవతి అయ్యింది. ఏడో నెలతో ఉంది. అప్పుడే తనని పరీక్ష చేసి బయటకు పంపించి సుకుమార్‌తో ఏకాంతంగా మాట్లాడుతున్నాను. గుండె వైద్యుడిగా క్లినిక్‌లో నా రోగుల మీద, వారి బంధువుల మీద నాకు కోపం వచ్చే సందర్భాలు తక్కువే. నా కోపంతో కొద్దిగా వేడెక్కిన గదిలో కూర్చోటానికి కించిత్ ఇబ్బందిగా అనిపించింది. నాకు మాత్రమేనేమో! సుకుమార్ ప్రశాంతంగానే ఉన్నాడు. రెండు సంవత్సరాల క్రితం కోమలి మొదటి కాన్పులో బంగారం లాంటి ఒక ఆడబిడ్డని ఏ సమస్యా లేకుండా ప్రసవించింది. అయితే పిల్ల పుట్టిన నెల రోజుల నుండి కోమలికి విపరీతమైన ఆయాసం మొదలైంది. ఆయాసంతో పడుకోలేక రాత్రంతా కూర్చొని ఉండాల్సి వచ్చేది. ఆమె గైనకాలజిస్ట్ ఆమెను నా దగ్గరకు పంపించారు. ప్రాథమిక పరీక్షల తరువాత కోమలికి పెరీ పార్టం కార్డియొమయోపతి అనే వ్యాధి ఉందని నిర్ధారించాను. ఆ జబ్బులో అప్పటివరకూ ఏ సమస్యా లేని బాలింతలకు గుండె అకస్మాత్తుగా బలహీన పడుతుంది. గుండె బలహీనంగా ఉండడం ప్రమాదకరం. కొంతమందికి ఆయాసం ఎక్కువై ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. మరికొంతమంది ఏ హెచ్చరికా లేకుండా చనిపోవచ్చు కూడా. ఈ జబ్బు వున్న వారిలో కొందరు పూర్తిగా కోలుకుంటారు. కొందరికి గుండె కోలుకోక చనిపోయే అవకాశం ఉంది. కోమలికి ఈ జబ్బు తీవ్రంగా వచ్చింది. సుకుమార్ చిన్న బిడ్డతో, భార్య జబ్బుతో విపరీతంగా సతమతమయ్యాడు. రెండు రోజుల హాస్పిటల్ వైద్యం తరువాత కోమలి ఆరోగ్యం క్రమేణా మెరుగుపడింది. సుకుమార్ కొద్దిగా గాలి పీల్చుకున్నాడు. ఆరు నెలల వైద్యం తరువాత కోమలి గుండె దాదాపుగా పూర్తిగా కోలుకుంది. అయితే ఈ జబ్బు నుండి కోలుకున్న వారు ఒక్కటే జాగ్రత్త పాటించాలి. వాళ్ళు ఇంకెప్పుడూ గర్భం ధరించకూడదు. గర్భం ధరిస్తే గుండె మళ్ళీ బలహీన పడవచ్చు. రెండోసారి గుండె బలహీన పడితే ప్రాణానికి ప్రమాదం మరీ ఎక్కువ. అయితే ఎవరికి మళ్ళీ జబ్బు రావచ్చు, ఎవరికి రాదు అని చెప్పటం చాలా కష్టం. రెండో కాన్పుకి వెళ్ళటం అనేది విధితో పందెం కట్టటం లాంటిదే. భార్యను ప్రేమించే ఏ భర్తా ఆ పందెం కట్టకూడదు. మొదటి సంతానాన్ని ప్రేమించే ఏ తల్లీ ఆ పందెంలో భాగం కాకూడదు. అయితే విధి విచిత్రమయినదే కాదు. జాలి లేనిది కూడా. సుకుమార్‌కి భార్య అంటే ఇష్టమే కానీ మగసంతానం కావాలనేది అతని బలీయమైన కోరిక. కోమలికి తన కూతురంటే ప్రాణమే కానీ సుకుమార్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. రెండోసారి గర్భవతి అయితే గుండె జబ్బు రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా! భర్త కోరిక కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా? తీసుకుంటే తను అతనిని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి తెలుస్తుంది కదా! కొన్ని సమయాల్లో మనసు చేసే వితండ వాదానికి పరిధులుండవు. ప్రస్తుతానికొస్తే, రెండు సంవత్సరాల తరువాత, అందుకనే సుకుమార్‌పై కోపంగా ఉన్నాను. కోమలికి ఏడో నెల. రెండు సంవత్సరాల బంగారు తల్లి సంయన తన మొదటి కూతురు. కోమలి ఆరోగ్యం అప్పటికి బాగానే ఉంది. మళ్ళీ గుండె జబ్బు వస్తుందో లేదో వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు. భయంతో కోమలి. కోపంగా నేను. రాగ ద్వేషాలకతీతంగా సుకుమార్. వేచి చూడటం తప్ప చేసేది నిజంగానే లేదు. కోమలిని ప్రతి నెలా గుండె పరీక్షలకు రమ్మన్నాను. కాన్పు సక్రమంగానే అయిపోయింది. తీసుకున్న రిస్క్‌కు తగిన ఫలంగా మగబిడ్డ కావాలనుకున్న సుకుమార్‌కీ, భర్త కోరికను ప్రాణాలని పణంగా పెట్టితీర్చాలనుకున్న కోమలికీ ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోతున్న ఆడపిల్ల, అక్కర్లేని బహుమతిలా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇంగ్లిష్‌లో మర్ఫీస్ సిద్ధాంతం అని చెబుతుంటారు – ‘ఒక పరిస్థితిలో ఏమేమి ఉపద్రవాలు జరగటానికి అవకాశం ఉన్నదో, అన్నీ జరుగుతాయి’. కోమలి విషయంలో మర్ఫీస్ సిద్ధాంతం మరో మూడు నెలల తరువాత నిజమైంది. ఈసారి ఆమె గుండె పూర్తిగా బలహీనపడింది. ఆమెను ఐసీయూలో అడ్మిట్ చేశాం. ఇద్దరు ఆడపిల్లలతో బయట నిలబడ్డ సుకుమార్‌కి పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. తను గెలవలేని పందేనికి భార్య ప్రాణాన్ని పణంగా పెట్టానని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు సుకుమార్. అన్ని మానసిక స్థితులలోకీ భరించరాని, భరించలేని స్థితి పశ్చాత్తాపం. సుకుమార్‌ని ఓదార్చటానికి నాకు మాటలు మిగల్లేదు. అతను చేసింది తప్పే అయినా, తన తప్పు తను తెలుసుకున్నాడు. అయినా జాలితో బాధకి చికిత్స జరగదు. ఆరు రోజులు ఐసీయూలో ఉన్న తరువాత కొద్దిగా కోలుకున్న కోమలి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె గుండె బలం మెరుగుపడలేదు. విపరీతమైన ఆయాసంతో రోజూ కష్టపడుతూనే ఉంది. రెండో బిడ్డకు సాన్వితి అని పేరు పెట్టారు. కోమలి అనారోగ్యంతో సాన్వితికి పోషణా, సంయన పట్ల శ్రద్ధా తక్కువయింది. సుకుమార్‌కి తనపై తనకి అసహ్యం పెరిగింది. ఆయాసం పెరిగినప్పుడల్లా కోమలిని మళ్ళీ అడ్మిట్ చెయ్యవలసి వచ్చేది. ఆరు నెలలూ, నాలుగు అడ్మిషన్లూ, మూడు లక్షల ఖర్చు తరువాత కోమలి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఓ రోజు సుకుమార్ ఇంటికి వెళ్ళాను. కోమలి పరిస్థితి ఏమీ బాగుండలేదనీ, ఒకసారి ఇంటి దగ్గర చూసి వెళ్ళమని సుకుమార్ ప్రాధేయపడితే వెళ్ళక తప్పలేదు. వాళ్ళది ఒక మూడు బెడ్ రూముల అపార్ట్మెంట్. నన్ను సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు సుకుమార్. కోమలి నిస్త్రాణతతో ఒక గదిలో పడుకొని ఉంది. పసిబిడ్డ సాన్వితి తన పక్కనే పడుకుని నిద్రపోతోంది. నన్ను చూసి లేవబోయిన కోమలిని వారించి తనను క్లుప్తంగా పరీక్షించాను. తన పరిస్థితి బాగాలేదని స్పష్టంగా తెలిసింది. ఇలాగే ఉంటే తను ఎక్కువకాలం బతకదని అర్థమయ్యింది. కొన్ని మందులు మార్చి రాసిచ్చి బయలుదేరబోయాను. కాఫీ తాగి వెళ్ళమని సుకుమార్ బలవంతం చేయటంతో వేరే గదిలో అతనూ నేనూ కూర్చున్నాము. నిశ్శబ్దమైన గదిలో స్తబ్ధ్దమయిన మనసులతో మౌనంగా కూర్చున్నామిద్దరం. అక్కడినుంచి మాయమైతే బాగుండుననిపించింది. సుకుమార్ కాఫీ కొంచెం తాగి అన్నాడు – ‘‘నేను పెట్టిన కాఫీలానే ఉంది సార్ నా జీవితం. కోమలి లేకుండా నేను బతకలేను సార్. నా పిల్లల పరిస్థితి తలుచుకుంటే, నేనెంత తప్పు చేశానో నాకర్థమవుతోంది.’’ మింగుతున్న బాధతో ఇక మాట్లాడలేకపోయాడు సుకుమార్.మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని తట్టి లేపుతున్నట్లు సుకుమార్ కంట్లోంచి జారి కాఫీ కప్పు మీద ఒక్కొక్కటే పడుతున్న కన్నీటి బొట్లు. ‘‘ఒక మార్గం మాత్రమే ఉంది.’’ చెప్పాను. సుకుమార్ చటుక్కున తలెత్తి ఆశగా చూశాడు. ‘‘గుండెమార్పిడి ఆపరేషన్ చేయించొచ్చు. అయితే ఆపరేషన్‌కి ముప్పై లక్షల వరకూ అవుతుంది.’’ నా మాట విన్న సుకుమార్ మొహంలో ఆశ మెల్లగా మాయమైంది. ‘‘సార్! ఈ ఇంటి మీద నాకు ముప్పై అయిదు లక్షల అప్పుంది. ఇక నాకు అప్పిచ్చే వాళ్ళూ లేరు, తీర్చే స్థోమతా నాకు లేదు.’’ మళ్ళీ తలదించుకున్న సుకుమార్ భుజం మీద మెత్తగా తట్టి బయలుదేరాను. కోమలికి గుండె మార్పిడి తప్ప వేరే దారి లేదని తేలిపోయింది. సుకుమార్ పూర్తిగా కుంగిపోయాడు. విద్య నేర్పిన సంస్కారంతో పిల్లలను తను బాగానే చూసుకునేవాడు. కానీ గుండె మార్పిడికి తన దగ్గర డబ్బు లేదు. ప్రతిసారీ కాదుగాని, కొన్నిసార్లు డబ్బుకి ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. ఒకరోజు కోమలి, సుకుమార్ ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. బాగా ఆలోచిస్తే ఒక ఉపాయం దొరికింది. ఒక స్వచ్ఛంద సంస్థని నడిపే నా మిత్రులను, సినీ స్టార్స్‌ను సాయమడిగాను. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొంత సాయం అందింది. ఫేస్బుక్లో విరాళాలకై సుకుమార్, కోమలి ఇద్దరి పిల్లలతో ఉన్న ఫొటోని షేర్ చేశాను. మంచితనం ఇంకా మిగిలే ఉన్న సమాజం సుకుమార్ పశ్చాత్తాపంపై జాలి పడింది. మూడు నెలల తర్వాత మొత్తానికి డబ్బులు సమకూరాయి. ఆరు నెలల తరువాత బెంగళూరులో ఒక విద్యార్థి ప్రమాదంలో మరణిస్తే గుండె కూడా దొరికింది. గుండె మార్పిడి మామూలు విషయం కాదు. ఆపరేషన్ జరిగేటప్పుడూ, ఆ తరువాత రోగి మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. అదృష్టవశాత్తూ కోమలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిపోయింది. అత్యంత ఒడిదుడుకుల మధ్య మూడు నెలల తరువాత కోమలి చివరకు పూర్తిగా కోలుకుంది. సుకుమార్ ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. తను నా చేతులు పట్టుకొని ఆనందంతో ఏడుస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. సహాయం చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు భార్యాభర్తలు. వారి జీవితాన్ని ఆదర్శంగా చూపించిన చాలా టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు నమ్మే అందరు దేవుళ్ళకీ మొక్కులు సమర్పించుకున్నారు. కోమలికి రెండవ జీవితం మొదలైంది. సుకుమార్‌కి కోమలిపై ప్రేమ రెట్టింపైంది. ఇద్దరు పిల్లలతో, ప్రేమించే భర్తతో కలిసి ఒకరోజు కోమలి క్లినిక్‌కి వచ్చింది. కొంతసేపు మాట్లాడిన తరువాత కోమలినీ పిల్లలనూ బయటకు పంపించాడు సుకుమార్. తనిప్పుడెంతో ఆనందంగా కనిపించాడు. మనస్ఫూర్తిగా అభినందించాను. సంతృప్తిగా కూర్చున్న నేను ఆ తరువాత అతనడిగిన ప్రశ్నకి స్థాణువులా మిగిలిపోయాను. ‘‘మగ బిడ్డ కోసం ఇప్పుడు ప్రయత్నించవచ్చా సార్?’’ సుకుమార్ ప్రశాంతంగా మొహంలో ఏ భావం కనిపించకుండా ఉన్నాడు. నా మనసునే, బాధ సునామీలా ముంచెత్తింది. ఏసీ రిమోట్ ఎక్కడో? రూమ్ ఇంత వేడిగా ఉంది! -
జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్!
బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని ఆ మధ్య ఉవాచించిన ఒక ప్రజాప్రతినిధి ‘అపార’ పరిజ్ఞానంపై ప్రసార,సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లపాటు ఏకధాటిగా సెటైర్లే.. సెటైర్లు.. కానీ.. ఆయనగారి కంటే ముందు ఒక విద్యాసంస్థ ఆయన్ను తలదన్నే ఫీట్ ప్రదర్శించింది. సదరు ప్రజాప్రతినిధి ఒక్క సబ్జెక్టు విషయంలోనే తన అతి తెలివి ప్రదర్శిస్తే.. ఈ విద్యాసంస్థ మాత్రం ‘కుడి ఎడమైతే పొరపాటు లేదని..’ అనుకుందో ఏమో.. ఏకంగా బీఎస్సీ విద్యార్థికి బీకామ్ పట్టా ఇచ్చేసింది. అలా ఇచ్చిన సంస్థ ఊరూ పేరు లేనిదా.. అంటే.. ఎంతో విశిష్టత, ఉన్నత చరిత్ర కలిగిన మన ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఆ ఘనతను సొంతం చేసుకుంది.. పోనీ.. ఏదో పొరపాటు జరిగిపోయింది.. దాన్ని వెంటనే సరిదిద్దారా అంటే.. పట్టా మార్చకుండా మూడేళ్లుగా బాధిత విద్యార్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏయూ అధికారుల నిర్వాకంతో ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకుంటున్న ఆ కుర్రాడు చివరికి ‘సాక్షి’ని ఆశ్రయించాడు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం.. చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం.. కానీ తీరులో అంతా గందరగోళం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఉదంతం. ఆ జి ల్లాలోని నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన శ్రీహరి టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రది స్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆం ధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించా లని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాం లే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అది గో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అలా ఎలా జరిగిందో? వాస్తవానికి వర్సిటీలో బీఎస్సీ, బీకామ్లకు విడివిడిగా విభాగాలున్నాయి. ఒక విభాగానికి సం బంధించిన సర్టిఫికెట్ మరో విభాగంలో కలిసే అవకాశం లేదు. క్లర్క్, సూపరింటెండెంట్ పరిశీలించిన తర్వాతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం పెడతారు. ఒకవేళ ముద్రణ సమయంలో పొరపాటు జరిగినా సంబంధిత శాఖ ఉద్యోగులు గమనించాలి. కనీసం తప్పిదం జరిగిన తర్వాతైనా సరిదిద్దకుండా ఏయూ అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలపాలవుతోంది. నా వద్దకు వస్తే వెంటనే మార్పిస్తా ఎలా జరిగిందో తెలియదు.. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాదే.. ఆ యువకుడు నేరుగానన్ను కలిస్తే సర్టిఫికెట్ మార్పించి ఇస్తాను. – సుధాకర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ -
తెలిసే తప్పులు
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్) : విద్యాశాఖ లో ఓ జిల్లాస్థాయి అధికారి భార్య ఘన్పూర్ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల రెండేళ్ల క్రితం వరకు 20 శాతం హెచ్ఆర్ఏ పరిధిలో ఉండేది. తర్వాత జరిగిన హెచ్ఆర్ఏల మార్పిడిలో మూడో కేటగిరిలోకి పాఠశాల చేరింది. ఆమెకు ఏడేళ్లు 20 శాతం హెచ్ఆర్ఏ పాయింట్లు, రెండేళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏలో స్కూల్ కేటగిరి పాయింట్లు కేటాయించాలి. కానీ 9 ఏళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏ కేటగిరిలో ఉన్నట్లే చూపించి 27 పాయింట్లు వేశారు. దీంతో సీనియారిటీ జాబితాలో ఆమె వేలమంది టీచర్ల కంటే ముందు వరుసలో చేరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న బదిలీ ప్రక్రియ రచ్చకెక్కుతోంది. ప్రక్రియలో మొదటి నుంచీ చోటుచేసుకుంటున్న అవకతవకలు ఆ శాఖకే మచ్చతెస్తున్నాయి. శనివారం వెబ్సైట్లో ఉంచిన సీనియారిటీ జాబితానే అందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కూల్ కేటగిరి పాయిం ట్లు, ఎస్సెస్సీ కేటగిరి పాయింట్లలో జరిగిన లోపాలు విద్యాశాఖ అధికారులకు తెలియవా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. బదిలీల్లోభాగంగా మొన్న ప్రిఫరెన్సియల్ కేటగిరి అవకతవకలు జరగగా, నేడు సీనియారిటీ జాబితాలో అవే తప్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా కిందిస్థా యి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా మొదటగా ప్రిఫరెన్సియల్ కేటగిరి వారి కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వా త సర్వీస్, స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరి, సంఘం నాయకులు, ఇత రాత్ర కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరీల్లో అక్కడక్క డా అవకతవకలు చోటు చేసు కున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ కేటగిరి పాయింట్లలో నాలుగు రకాలుగా పాయింట్లను కేటాయి స్తారు. అందులో 20 శాతం హెచ్ఆర్ఏలో పని చేసిన, చేస్తున్న వారు తక్కువ కేటగిరీలో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. తద్వారా వారికి పాయింట్లు పెరిగే ఆస్కారం ఉంది. హెచ్ఆర్ఏల మార్పిడిలో సక్రమంగా పరిశీలన జరగలేదు. ఎస్సెస్సీ కేటగిరీలో పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ వద్ద పదోతరగతి రిజల్ట్స్ పూర్తిస్థాయిలో ఉంటాయి. అయినప్ప టికీ టీచర్లు ఇష్టానుసారంగా వేసుకున్న పాయింట్ల ఆధారంగానే సీనియారిటీ గుర్తించడం జరిగింది. అంటే జిల్లా కమిటీ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.స్పౌజ్ కేటగిరిలోనూ అవకతవకలు చోటుచేసుకున్నా యి. భార్యభర్తల్లో ఒకరికి 8 ఏళ్లల్లో ఒకరికి మాత్రమే 10 పాయింట్లు కేటాయిస్తారు. ఇద్ద రూ ఒకే శాఖలో పని చేస్తే తప్పు జరిగేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వేర్వే రు శాఖల్లో పనిచేసే వారైతే పాయింట్ల కోసం గతంలో స్పౌజ్ కేటగిరీని వినియోగించుకోలేదనే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ గుర్తిం పు పొందిన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తున్నారు. ఇటీవలే కొన్ని సం ఘాలకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే సంఘం బాధ్యులు మారిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు సంఘాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుం డా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పేర్లు జిల్లాపరిషత్ (లోకల్‌బాడీస్) జా బితాలో, జిల్లాపరిషత్ ఉపాధ్యాయుల పేర్లు ప్రభుత్వ పాఠశాలల జాబితాలో వచ్చా యి. డీఈఓపై కలెక్టర్ ఆగ్రహం..? ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలపై జిల్లా కలెక్టర్ డీఈఓపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలి సింది. మొన్న మెడికల్ సర్టిఫికెట్లలో ఎలా లోపాలు జరిగాయని ప్రశ్నించినట్లు సమాచా రం. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రిఫరెన్సియల్ కేటగిరి, సీనియారిటీ జాబితాలను హెచ్ఎంలు, ఎంఈఓల స్థాయిలో మండల కమిటీ, డీఈఓ స్థాయి లో జిల్లా కమిటీలు పరిశీలించిన తర్వాత కూడా ఎలా లోపాలు జరుగుతున్నాయన్నది ఎవరికీ అం దని ప్రశ్న. అన్నీ తప్పులు తెలిసే జరుగుతున్నాయని టీచర్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మెడికల్ సర్టిఫికెట్లలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. 19న ఫైనల్ జాబితా ఉంచుతాం సీనియారిటీ జాబితాలో ఒకటి,అర లోపాలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. 16, 17 తేదీల్లో లోపాలకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరిస్తాం.ఇప్పటికే ఎంఈఓలు ఆయా ఎమ్మార్సీల్లో అందుబాటులో ఉంటున్నారు. ఉపాధ్యాయులే ఆన్లైన్ అప్లికేషన్లో చేసిన పొరపాట్ల వల్లే లోపాలు జరిగాయి. వాటి కోసమే రెండ్రోజు లు సమయమిచ్చాం. ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. 19న ఫైనల్ జాబితాను వెబ్సైట్లో ఉంచుతాం. - నాంపల్లి రాజేష్, డీఈఓ -
‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’
న్యూఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల ప్రశ్న ప్రతంలో దొర్లిన తప్పుకుగాను విద్యార్థులకు 2 మార్కులు కలపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. మార్చి 12న జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రంలో తప్పుదొర్లిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది’ అని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
అబ్బాస్ అలీ ఎవరు..? : బాహుబలి నిర్మాత
నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో తప్పిదం చోటుచేసుకుంది. బాహుబలి 2 మూడు విభాగాల్లో అవార్డులు సాధించినట్టుగా జ్యూరీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక ట్విటర్లో వెల్లడించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, పోరాట సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. అంతా బాగానే ఉంది. కానీ బాహుబలి 2లో ఉత్తమ పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు గానూ అబ్బాస్ అలీ మొఘల్కు అవార్డు దక్కినట్టుగా ప్రకటించారు. బాహుబలి పోరాటలను రూపొందించింది ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. కానీ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టరీ ట్విటర్ ఖాతాలో అబ్బాస్ అలీ మొఘల్ అవార్డ్ వచ్చినట్టుగా ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటనపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ...‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? అతను బాహుబలి సిరీస్‌లో పనిచేయలేదు’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ.. తమ అధికారిక ఖాతాల్లోంచి దానికి సంబంధించిన ట్వీట్‌ను తొలగించారు. -
అవ్వ చేసిన పొరపాటు.. ఎయిర్‌పోర్టు హడల్
బ్రిస్బేన్ : ముంబైకి చెందిన ఓ బామ్మ చేసిన పొరపాటు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన వెంకట లక్ష్మి అనే బామ్మ తన పుట్టిన రోజు వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లింది. వెళ్తూ ఓ బ్యాగ్‌లో తన లగేజీని తీసుకెళ్లింది. అసలు సమస్య అక్కడే ప్రారంభం అయ్యింది. ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. అంతే కాకుండా లగేజీ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ బయట పడలేదు. కానీ అసలు విషయం ఏంటంటే.. బామ్మ తను తీసుకెళ్లే బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్ బదులు 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసుకుంది. అది చూసిన అధికారులు బ్యాగ్‌లో బాంబ్ ఉందేమోనన్న అనుమానంతో ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశారు. అనంతరం బామ్మను ప్రత్యేక గదిలో విచారించగా అసలు విషయం ఏంటో తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌పై తగిన ఖాళీ లేకపోవడం వల్ల బాంబే బదులు బాంబ్ అని రాసుకున్నానంటూ అధికారులకు తెలిపింది. ఈ సంఘటనపై బామ్మ కుమార్తె జోతిరాజ్ మాట్లాడుతూ తన తల్లికి ఇంగ్లీష్ పూర్తిగా రాదని, చదవడం రాయడం అరకొరగా తెలుసునంటూ అధికారులకు తెలిపింది. అందుచేతనే బ్యాగ్‌పై అలా రాసుకొచ్చిందని, బాంబ్ అని రాయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తన తల్లికి తెలియవంటూ అధికారులకు వివరించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. So, this caused a bit of an issue at #Brisbane airport. Police cordoned off part of the terminal after this bag popped out on the luggage belt. The passenger was coming from Mumbai, formerly Bombay. Airport code: BOM. #CommonwealthGames2018 pic.twitter.com/p7qgTFLMsX — Siobhan Heanue (@siobhanheanue) April 5, 2018 -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, మెదక్ : నిర్ణీత గడువులోగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరెట్లోని సమావేశ మందిరంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. ఈ పనితీరుతో తహసీల్దార్లు ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుందన్నారు. “డిజిటల్ సంతకాలు పూర్తయిన తర్వాత కూడా తప్పులు సరిచేస్తామంటే ఎలా ? అని మండిపడ్డారు. సంతకాలు చేసేటప్పుడు సరిచేసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. ఒకరిద్దరి అజాగ్రత్త వల్ల అందరికి సమస్యలు ఎదురవుతాయని, చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మండలం మొత్తంలో వంద సర్వే నంబర్లలో సమస్యలు ఉంటాయని, వాటినికూడా గుర్తించి పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. భుజరంపేట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాలు పార్ట్–బీలో పెట్టారని అక్కడ 150 ఎకరాలు మాత్రమే అసైన్డ్ భూమి ఉంటే మొత్తం పార్ట్–బీలో ఎందుకు పెట్టారని సంబంధిత తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమయం పూర్తి కాగానే ఇంటికి వెళ్దాం అనే ధోరణి మార్చుకొని అందుబాటులో ఉండి కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు నగేష్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కుమారుడి తప్పు..తండ్రికి శిక్ష
పశ్చిమ గోదావరి జిల్లా : అక్కడ ఒకటే చట్టం..తప్పు చేసిన వారిని ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి జరిమానా విధించడం..కాదంటే కొరడా దెబ్బలు. ఇది ఆ ఊరి కట్టుబాటు..ఎన్ని చట్టాలు, పోలీసులు ఉన్నా..భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ నడుస్తూనే ఉంది దానికి నిదర్శనమే నేటి టి.నర్సాపురం మండలం సాయంపాలెం సంఘటన. వివరాలు..సాయంపాలెం గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చింతపల్లి ప్రసాద్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఆమె తన భర్తకు చెప్పడంతో ఆయన పంచాయితీ పెట్టించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నాగేంద్ర పరారయ్యాడు. నాగేంద్ర తండ్రి సంజీవరావుని కుమారుడిని అప్పగించాలని రెండు రోజుల క్రితం గ్రామపెద్దలు ఆదేశించారు. కుమారుడు పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలియదని చెప్పడంతో ఆయన చెట్టుకు కట్టేసి పంచాయితీ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొరపాటు జరిగింది..సరిదిద్దుతున్నాం
-
తప్పు ఒప్పుకున్న జుకర్‌బర్గ్
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన డేటాబ్రీచ్‌పై ఎట్టకేలకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నోరు విప్పారు. సుమారు 5కోట్లమంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయిందన్న దుమారం రేగిన నాలుగు రోజుల తరువాత స్పందించారు. తన అధికారిక ఫేస్బుక్ పేజీలో జుకర్‌బర్గ్ ఒక పోస్ట్ పెట్టారు. డాటా లీక్ వ్యవహారంలో తప్పయిందంటూ ఆయన అంగీకరించారు. అయితే అదృష్టవశాత్తూ తాము ఇప్పటికే డేటా రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఇది కోగన్, కేంబ్రిడ్జ్ ఎనలిటికా , ఫేస్‌బుక్‌మధ్య విశ్వాస ఉల్లంఘన. అంతేకాదు ఇది ఫేస్‌బుక్‌కు, డేటాను సంస్థతో పంచుకున్న యూజర్లకూ మధ్య ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని పేర్కొన్నారు. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని జుకర్ బర్గ్ ఒప్పుకున్నారు. కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సంబంధించి కొంత అప్డేట్ ఇవ్వదల్చుకున్నానంటూ మొదలుపెట్టిన జుకర్‌బర్గ్ ..సంస్థ ఇప్పటికే తీసుకున్న వివిధ దశలతోపాటు ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి తదుపరి దశల గురించి ఇలా వివరించారు. ‘‘ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఘోరమైన తప్పిదం మళ్లీ జరదని హామీ ఇస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా నిరోధించడానికి అత్యంత ముఖ్యమైన చర్యలు మేము ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితమే తీసుకున్నాం. అయినా కొన్ని పొరపాట్లు జరిగాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాం. ఇంకా చేయాల్సి చాలా ఉంది. యూజర్ల డేటా రక్షించడం మా ప్రధాన బాధ్యత. అలా చేయని నాడు యూజర్లకు సేవ చేసే అర్హతను కోల్పోతాం. ఈ సంఘటనపై సంస్థద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నాం. రెగ్యులేటరీ, విచారణాధికారులతో కలిసి పనిచేస్తున్నాము. సంస్థ మీద విశ్వాసం ఉంచిన మీ అందరికీ ధన్యవాదాలు. కలసి పనిచేద్దాం. సమస్య పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టవచ్చు. కానీ ఇంతకంటే మెరుగైన సేవలతో మరింత ఎక్కువ కాలం మీకు సేవలందిస్తామని హామీ ఇస్తున్నాను.’’ దీంతో పాటు ఫేస్బుక్ ప్రారంభంనుంచి తీసుకున్న చర్యలపైకూడా జుకర్ బర్గ్ సవివరంగా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్న నేపథ్యంలో బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’ లో సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన తరువాత నిక్స్‌పై వేటు పడింది. -
ఉపాధి కష్టాలు
వారంతా శ్రమజీవులు.. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పల్లెల్లో పనులు లేక వారంతా ఉపాధి హామీ కూలీలుగా మారారు. పనులు చేస్తే వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఏకైక లక్ష్యం వారిది. రోజంతా మండుటెండలో పనిచేస్తున్నారు. అయితే కూలి చెల్లించాల్సిన అధికారులు వివిధ కారణలతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో శ్రమనే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి హామీ కూలీల దయనీయ స్థితి ఇది. అధికారులు ఆడిట్లో చేసిన తప్పుల ఫలితంగా కూలీలు ఆర్థిక కష్టాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. సక్రమంగా పనులు ఉండకపోవటంతో జిల్లాలో వలసలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తేనే వలసలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధికారుల బాధ్యతారాహిత్యం, ఉపాధి హామీ లో చోటుచేసుకుంటున్న అవినీతి వల్ల కూలీలు అంతిమంగా నష్టపోతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని ప్రభుత్వం ఆమోదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగం అభివృద్ధికి సంబంధించిన పనులు, కాలువలు, జంగిల్‌క్లియరెన్స్, చెరువుల్లో మట్టితీయడం, రోడ్లు, పంటకుంటలు, వర్మీకంపోస్టులు తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. అనుమతి ఇచ్చిన తరువాత గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పిస్తారు. జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏలు, మేట్లు, టీఏలు, టీటీఏలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీలను నియమించారు. ఉపాధి పనులు డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధిలో ప్రతి ఏటా కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఆడిట్ నిర్వహించారు. దాని వలన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. పర్యవసానంగా జిల్లాలోని ఉపాధి కూలీలకు నాలుగు నెలల్లో రూ.20 కోట్ల బకాయి పడ్డారు. బ్యాంక్‌లకు ఆధార్‌కార్డ్ లింకేజీ కాని కారణంగా మరో రూ.2.37 కోట్లు నిలిచిపోయింది. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా అందని వేతనం జిల్లాలో 5.85 లక్షల మందికి ప్రభుత్వం అధికారికంగా జాబ్ కార్డులు మంజూరు చేసింది. వీరికి నిబంధనల ప్రకారం ఏటా వంద పనిదినాలు కల్పించాలి. వీరికి రోజు కూలి రూ.140 తగ్గకుండా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గత డిసెంబర్ నుంచి జిల్లాలో సుమారు 85 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా 62 వేల మందికి ఉపాధి కూలి అందని పరిస్థితి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 55వేల నుంచి 61 వేల మంది ప్రస్తుతం పనుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో 2017 డిసెంబర్ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూలి మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు జరిగాయని తరచూ విచారణలు చేపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. అయితే కూలీల వేతనాల మంజూరుకు మాత్రం దీనిని సాకుగా చూపుతున్నారు. ∙ఉదాహరణకు వాకాడు మండలంలో 665 గ్రూపుల్లో 10,075 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రసుత్తం వీరిలో వెయ్యి మందికి మాత్రమే ఉపాధి పనులు దక్కాయి. వీరికి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూలీలకు రూ.3 లక్షలు వరకు ఉపాధి సొమ్ము రావాల్సి ఉంది. ఉపాధి కూలీలు మూడు నెలలుగా పనులు చేస్తున్నప్పటికీ కూలి సొమ్ము అందక పస్తులుంటున్నారు. కూలీలకు సంబంధించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నోడల్ బ్యాంక్‌లకు విడుదల చేసి అక్కడ నుంచి వివిధ బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న బ్రాంచ్‌ల్లో జమ అవుతుంది. కూలీలు తమ ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా అనుసంధానం చేసిన నంబర్లు ఎన్సీపీఐ(నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో సింక్ అయితే ఆయా వేతనాలు కూలీల ఖాతాలో జమ అవుతాయి. కూలీలకు సంబంధించిన ఆధార్, ఖాతా నంబర్లు ఎన్సీపీఐలో సింక్ చేయడంలో అధికార్లు జాప్యం, చేసిన పొరపాట్లు కారణంగా వేతనాలు జమకాకుండా రిజెక్ట్ అవుతున్నాయి. పూర్తిగా అధికారులు చేసిన తప్పులకు కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు వారాలుగా కూలీ అందక పస్తులుంటున్నాం ఐదు వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే బ్యాంక్‌లో జమ చేశామని, అక్కడ అడిగితే జమకాలేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. వారం రోజులుగా పనులు సైతం మానుకుని కూలి డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఇల్లు గడవక కుటుంబం పస్తులుండాల్సి వస్తోంది. –వేమాల మస్తానయ్య ఉపాధి కూలీ, వాకాడు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాం సెంటు భూమిలేని మా లాంటి పేదోళ్లంతా ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్నాం. 48 రోజులుగా పనులు చేస్తున్నా ఇంతవరకు డబ్బులు జమకాలేదు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. మాత్రలు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అల్లాడుతున్నాం. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప డబ్బులైతే ఇవ్వట్లేదు. పాస్ పుస్తకాలు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నాం. –వంజివాక పిచ్చమ్మ, ఉపాధి కూలీ, వాకాడు -
తప్పులతడక..
ఎవరైనా సున్నా శాతం మార్కులతో డిగ్రీ పాస్ అవుతారా..? అంటే కాదని ఎవరైనా సమాధానం చెబుతారు. అయితే, రాష్ట్ర ఉపాధి, శిక్షణశాఖ అధికారుల పనితీరు మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఆ శాఖ జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డులో ఈ తరహా ఘోర తప్పిదాలు దొర్లుతున్నాయి. ఇదొక్కటే కాదు.. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయాలు సైతం మారిపోతున్నాయి. ఒక జిల్లా నుంచి ఎంప్లాయిమెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. మరొక జిల్లా కార్యాలయం పేరుతో కార్డులు జారీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తప్పిదాలు నిరుద్యోగులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆన్లైన్ ద్వారా జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్ కార్డులో ఇబ్బడిముబ్బడిగా దొర్లుతున్న తప్పులు.. రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖను అభాసుపాలు చేస్తున్నాయి. కార్డులో తప్పుడు సమాచారం ముద్రితం కావడంతో నిరుద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటే సమయం వృథా అయ్యేది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉపాధి, శిక్షణ శాఖలో సంస్కరణలు చేపట్టింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్ కార్డు పొందేలా ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొత్తగా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్, అదనపు విద్యార్హతల నమోదు తదితర సేవలను పూర్తిగా ఆన్లైన్ ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ సేవలు ‘తెలంగాణ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ పోర్టల్’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందడం సులభతరం కావడంతో నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి, సాంకేతిక సమస్యల కారణంగా తప్పుల తడక వివరాలతో కార్డులు జారీ అవుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన తప్పిదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చాక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఈనెల 20న తన ఎంప్లాయిమెంట్ కార్డుని వెబ్‌పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఇతను.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో పొందిన ఉత్తీర్ణత శాతం, ఏ సంవత్సరంలో పాసయ్యాడో స్పష్టంగా పేర్కొన్నాడు. పైగా వాటిని ధ్రువీకరించే విద్యార్హత పత్రాలను సైతం అప్లోడ్ చేశాడు. అయితే, డిగ్రీ ఉత్తీర్ణత శాతం తప్పుగా నమోదైంది. సున్నా శాతంతో ఉత్తీర్ణుడైనట్లు అధికారులు కార్డులో పేర్కొన్నారు. అంతేగాక, అతడు 2007లోనే డిగ్రీ పాస్ అవగా.. 2010లో ఉత్తీర్ణుడైనట్లు కార్డులో నమోదు చేశారు. అదేవిధంగా, చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ జిల్లాగా పేర్కొన్నారు. నిరుద్యోగులు అందజేసిన అన్ని రకాల ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలించాకే జిల్లా ఉపాధి అధికారి సంతకంతో కూడిన కార్డు జారీ చేస్తారు. కానీ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతున్న తీరును చూస్తే ఎటువంటి పరిశీలన లేకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి తనకు ఎదురైన అనుభవాన్ని జిల్లా ఉపాధి అధికారిణి నంద పద్మ దృష్టికి తీసుకెళ్లగా.. హెల్ప్‌లైనుకు కాల్ చేయండి లేదా మీ–సేవ కేంద్రానికి వెళ్లి సరిచేసుకోండని ఉచిత సలహా ఇచ్చినట్లు సదరు నిరుద్యోగి ‘సాక్షి’కి వెల్లడించారు. -
నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్ వివరాల్లో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 3లోగా సవరించాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. విద్యార్థుల పేరు, తల్లిదండ్రుల పేరు, కమ్యూనిటీ, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను వెబ్సైట్లో ((www.bsetelangana.org) ఉంచామని పేర్కొంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని సరైన వివరాలతో ఫిబ్రవరి 3, సాయం త్రం 5లోగా డీఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని హెచ్ఎంలకు సూచించింది. -
ఆ కుటుంబంలో అందరిదీ 111 ఏళ్ళ వయసే!
పెద్దతిప్పసముద్రం: వారి పొరపాటు వీరికి గ్రహపాటుగా మారింది. ఓ కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో కుటుంబ యజమాని, భార్య, కుమారుడికి అందరికీ ఒకేలా 111 ఏళ్ళ వయసు నమోదు అయి ఉంది. ఇది ఎలా నమోదైంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ, పుట్టిన తేదీ ధ్రువపత్రాల కోసం వెళితే రేషన్ కార్డులో పేర్కొన్న వయసు అడ్డొస్తోంది. దీంతో కార్డులో వయసును మార్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుటుంబీకులు సతమతమవుతున్నారు. చిత్తూరుజిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలోని యంపార్లపల్లికి చెందిన గుట్టపాళ్యం వెంకట్రమణ పేరిట డబ్ల్యూఎపి 1004007ఏ0166 నంబర్ గల రేషన్ కార్డు ఉంది. వ్యవసాయ పనులే ఈయన జీవనాధారం. వాస్తవంగా వెంకట్రమణకు 55 ఏళ్లు, భార్య అమరమ్మకు 45ఏళ్లు, కుమారుడు మురళీధర్ రెడ్డికి 18 ఏళ్ళ వయసు. మురళీధర్‌రెడ్డి పుత్తూరులోని ఓ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం అతనికి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం అవసరం వచ్చింది. కాలేజీ అధికారులు వీరి రేషన్ కార్డు నంబర్‌ను ఆన్లైన్లో క్లిక్ చేయగా ఇతనికి 111 ఏళ్లు, అలాగే అతని తల్లిదండ్రులకూ 111 ఏళ్ళ వయసు నమోదై ఉండటాన్ని గమనించి అవాక్కయ్యారు. దీంతో కార్డులోని వయసును సవరించాలంటూ ఆ కుటుంబీకులు మీ-సేవ కేంద్రానికి వెళ్లారు. అయితే వయసు మార్పు చేసే ఆప్షన్ ఏదీ లేదని మీ-సేవ నిర్వాహకులు స్పష్టం చేశారని వెంకట్రమణ వాపోయాడు. అధికారుల తప్పిదాల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎక్కడికి వెళ్ళి సవరణ చేయించుకోవాలో పాలుపోవడం లేదని కార్డుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇతను నిజంగానే ఫిబ్రవరి 30న పుట్టాడంట!
ఛండీగఢ్ : అధికారుల నిర్లక్ష్యం ఓ పంజాబీ యువకుడిని కష్టాలపాలు చేస్తోంది. విద్యాపరంగానే కాదు.. వృత్తిపరంగానూ ఎదగకుండా ఆటంకాలు కలగజేస్తోంది. పొరపాటున అతని జన్మదిన తేదీని తప్పువేయటమే అందుకు కారణం. లూథియానాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో జన్మించాడు. 2012లో అతను చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత పంజాబ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎలాగోలా పదో తరగది పూర్తి చేసిన ఆ యువకుడు.. ఇప్పుడు 12వ తరగతి పరీక్షల కోసం సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో అతను బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు మాత్రం జనన ధృవీకరణ పత్రంలో ఫిబ్రవరి 30 అని తేదీని చేర్చారు. పైగా అది మ్యానువల్‌గా రాయటం కొసమెరుపు. అది గమనించకుండా సివిల్ సర్జన్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు దానిపై సంతకం చేశారు. ఇక దాని సవరణ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన హర్‌ప్రీత్ చివరకు.. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి కెనడా వెళ్లి పనులు చేసుకుంటూ బతుకుదామని నిర్ణయించుకున్నాడు. పాస్‌పోర్టు కోసం కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం కావటంతో అతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఏడాది నుంచి ఎందరిని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా.. ఎవరూ అతన్ని పట్టించుకోవటం లేదంట. దీంతో మీడియా దృష్టికి తన సమస్యను చెప్పుకొని హర్‌ప్రీత్ వాపోయాడు. -
తవ్వినకొద్దీ తప్పులు!
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా తవ్వినకొద్దీ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, అవకతవకలు బయటపడుతున్నాయి. ప్రక్షాళన కార్యక్రమం జరిగేకొద్దీ తప్పుల శాతం పెరిగిపోతుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. దీంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా అని రెవెన్యూ వర్గాలే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 20 రోజులపాటు జరిగిన ప్రక్షాళన కార్యక్రమంలో ఏకంగా 27.5 శాతం తప్పులున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరింతగా పెరుగుతూనే.. వాస్తవానికి భూరికార్డుల్లో 5 నుంచి 10% వరకే తప్పులు ఉంటాయని.. వాటిని గుర్తించి సరిచేయడం ద్వారా ఇబ్బంది లేకుండా రైతులకు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వం భావించిం ది. కానీ సరిచేయాల్సిన రికార్డుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సర్వే మొదలైన మూడు, నాలుగు రోజుల గణాంకాల వరకు 84% రికార్డులు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. పది రోజుల తర్వాత ఇది 78 శాతానికి తగ్గగా.. మంగళవారం నాటి లెక్కలు చూస్తే 72.5 % రికార్డులే సక్రమంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యా ప్తంగా 14,04,597 సర్వే నంబర్ల రికార్డులను పరిశీలించగా.. అందులో 10,17,907 సర్వే నంబర్ల రికార్డులే సక్రమంగా ఉన్నాయని, 3,86,690 నంబర్ల రికార్డులను సవ రించాల్సిందేనని వెల్లడైనట్లుగా తెలిపాయి. పట్టాదారుల పేర్ల తప్పులే లక్షన్నర! భూరికార్డుల్లో కీలకమైన పట్టాదారుల పేర్లలో తప్పులున్నట్లు గుర్తించారు. భూమి ఒకరిదైతే రికార్డుల్లో మరొకరి పేరు ఉండడం, పట్టాదారులు చనిపోయి ఏళ్లు గడుస్తు న్నా రికార్డులు ఫౌతి చేయకపోవడం, పేర్లలో క్లరికల్ తప్పిదాలు వంటి సమస్యలున్నాయి. మొత్తం తప్పుల్లో లక్షన్నర వరకు ఇవి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలను సరిచేయడం సులువే అయినా.. రికార్డుల్లో పట్టాదారుల పేర్లు మార్చడంలో, వారసుల పేరిట రికార్డులు మార్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భూవినియోగ మార్పిడి సమస్య కూడా మరో ముఖ్యమైన సమస్య నాలా భూములు. వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్న భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 26,414 సర్వే నంబర్లలోని భూములు ఈ విధంగా వినియోగంలో ఉన్నట్లు తేలింది. ఇప్పుడు వీటన్నింటినీ నాలా కన్వర్షన్ చేయడం తలనొప్పిగానే మారనుంది. ఇంకా ప్రక్షాళనలో 10 శాతం కూడా పూర్తికాకుండానే పరిస్థితి ఇలా ఉంటే.. చివరి వరకు ఎలాంటి సమస్యలు వస్తాయో.. సవరించాల్సిన రికార్డుల శాతం ఏ మేరకు పెరుగుతుందోనని రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భూరికార్డుల ప్రక్షాళనలో ముఖ్య గణాంకాలివే.. పరిశీలించిన సర్వే నంబర్లు - 14,04,597 సక్రమంగా ఉన్నవి - 10,17,907 సవరించాల్సినవి - 3,86,690 పట్టాదారులు సరిపోలనివి - 21,959 ఫౌతి చేయాల్సినవి - 56,202 క్లరికల్ తప్పిదాలున్నవి - 71,453 రికార్డుల కన్నా ఎక్కువ, తక్కువ భూములున్నవి - 36,399 నాలా భూములున్నవి - 26,414 -
అప్పట్లో తప్పులు చేశా... ఇప్పుడు చేయను!
అవునా! ఇలియానా తప్పులు చేశారా? అవేంటో అనుకుంటున్నారా? ఇలియానా మాటల్లోనే చెప్పాలంటే.... ‘‘గతంలో స్క్రిప్ట్ గురించి, అందులో నా పాత్రకున్న ప్రాముఖ్యత గురించి ఆలోచించకుండా కొన్ని తెలుగు, తమిళ సినిమాలు చేశా. అప్పట్లో నా తెలివితేటలను సరిగ్గా ఉపయోగించలేదేమో అనిపిస్తోంది. అవాయిడ్ చేయాల్సిన కొన్ని సిన్మాలను చేయలేదని ఫీలవుతున్నా. ఇకపై అటువంటి తప్పులు చేయను’’. అదీ సంగతి! ఇప్పట్నుంచి స్క్రిప్టులో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేయాలని ఇలియానా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట! ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క హిందీ సినిమా... అజయ్ దేవగన్ ‘రైడ్’ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే... వారం నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నారీ బ్యూటీ. అందులో బాయ్‌ఫ్రెండ్ ఆండ్యూ నీబోన్కి ముద్దుపెడుతున్న ఫొటోకి ‘ఎ మూమెంట్. ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ మ్యాడ్నెస్’ అని కోట్ చేయడం స్పెషల్. ఆండ్రూ, ఇలియానాలది అంత ప్రేమ పిచ్చి అనుకోవాలేమో!! -
ఇదేమి లెక్కో..?
– జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు – తెల్లకార్డులు 11.92 లక్షలు, గులాబీకార్డులు 62 వేలు - కుటుంబాల కంటే 1.11 లక్ష కార్డులు ఎక్కవ అనంతపురం అర్బన్ : జిల్లాలో రేషన్‌కార్డుల లెక్క అందరినీ తికమకపెడుతోంది. జిల్లాలో నివాస కుటుంబాలకు మించి తెల్లకార్డులు ఉన్నాయి. ఇవి కాకుండా గులాబీ కార్డులు ఉన్నాయి. కార్డుల లెక్కకు కుటుంబాల లెక్కకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అధికారిక లెక్క ప్రకారం జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు ఉంటే తెల్ల, గులాబీ కార్డులు 12.54 లక్షల ఉన్నాయి. మరో చిత్రం ఏమిటంటే జిల్లాలోని కుటుంబాల కంటే తెల్లకార్డులు ఎక్కువగా ఉన్నట్లు అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. లెక్క లేకుండా ఇచ్చేశారు... అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 11.92 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. అంటే జిల్లాలోని కుంబాలకంటే తెల్ల కార్డులు 43 వేల ఎకువగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. ఇక కాక 62 వేల గులాబీ కార్డుల ఉన్నాయి. అంటే జిల్లాలో తెల్ల, గులాబీ కార్డులు కలిగిన కుటుంబాలు 12.54 లక్షలు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే 1.11 లక్షలు కార్డులు జనాభా లెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారుల జారీ చేసిన కార్డుల ప్రకారం చూస్తే జిల్లాలో ప్రతి కుటుంబానికి తెల్లకార్డు ఉండడమే కాదు... అంతకు మించి కూడా ఉన్నాయి. జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు జిల్లాలో 2011 జానాభాల లెక్కల ప్రకారం 40,81,148 జనాభా ఉండగా, 10.22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనికి 12.10 శాతం వృద్ధి రేటుగా తీసుకుని 2017 జనాభా, కుటుంబాల సంఖ్యని అంచనా వేశారు. ఆ ప్రకారం జిల్లాలో 45,74,967 మంది జనాభా ఉండగా, కుటుంబాల సంఖ్య 11,43,742 కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశారు. లక్ష కార్డులెవరివో..? కుటుంబాల కంటే ఎక్కువగా ఉన్న 1.11 లక్షల రేషన్‌కార్డులను అధికారులు ఎవరికి ఇచ్చారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తే కొందరు కుటుంబాలను వేరుగా చూపి తెల్లకార్డులు తీసుకున్నారని చెబుతున్నారు. -
‘పొర’పాట్లు
అన్నవరం దేవస్థానం...సక్రమ నిర్వహణకు పాలకవర్గం ... అధికార గణం ... వీరు తీసుకున్న నిర్ణయాలపైనా ఆలయ ఆదాయం ... ప్రగతి ఆధారపడి ఉంటాయి. కానీ ఆ నిర్ణయాలే శాపాలుగా మారి అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. భక్తులపై భారం మోపుతు న్నాయి. సౌకర్యాలు కల్పించాలి్సందిపోయి సమస్యలు సృష్టిస్తున్నాయి. సమన్వయం కొరవడడంతో విభేదాలు బుసకొడుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు అందినకాడికి దోచుకుంటున్నారు. వరుస వైఫల్యాలతో విమర్శలు చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి దూరంగా... అసలు వాటిపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం అక్రమాలను అరికట్టడంలోనూ ప్రేక్షకపాత్రే సమన్వయ లోపంతో భక్తులకు ఇబ్బందులు అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చోటుచేసుకున్న అక్రమాలు ... తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోంది. దేవాదాయ శాఖ అధికారులు ఈఓలుగా ఉంటే అవినీతి అధికమవుతుందని భావించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును ఇక్కడ ఈఓగా రెండేళ్ల కిందట నియమించింది. దేవస్థానం నిర్వహణపై పెద్దగా అవగాహన లేకపోవడం, ఎవరి సలహా కూడా పాటించకపోవడం, తనే ‘సుప్రీం’ అనే రీతిలో పరిపాలన కొనసాగించడంతో దేవస్థానంలో అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందన్న విమర్శలున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో సిబ్బందిలో కూడా సమన్వయం కొరవడింది. l చక్కదిద్దాల్సిందిపోయి అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడంతో వివాదాలు తలెత్తాయి. ప్రధానంగా దేవస్థానంలో పనిచేసే వ్రత పురోహితులకు పిలకలున్నాయా? ఉంటే అవి ఎంత పొడుగు ఉన్నాయంటూ ఆరా తీయడంతో సంబంధిత పురోహితులు అవమానంగా భావించారు. ఆ విషయం పరిశీలించడానికి సంబంధిత విభాగ అధికారులుంటుండగా నేరుగా ఈయన ప్రశ్నించడం... ఫొటోలు తీయించడమేమిటని గొంతు పెంచడంతో దూరం పెరిగింది. వ్రత పురోహితుల పిలకపై పితలాటకం... దేవస్థానంలో కీలకమైన విభాగాలను ప్రతి రోజూ పర్యవేక్షించి అక్కడ వ్యవహారాలను l చక్కదిద్దాల్సిందిపోయి అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడంతో వివాదాలు తలెత్తాయి. ప్రధానంగా దేవస్థానంలో పనిచేసే వ్రత పురోహితులకు పిలకలున్నాయా? ఉంటే అవి ఎంత పొడుగు ఉన్నాయంటూ ఆరా తీయడంతో సంబంధిత పురోహితులు అవమానంగా భావించారు. ఆ విషయం పరిశీలించడానికి సంబంధిత విభాగ అధికారులుంటుండగా నేరుగా ఈయన ప్రశ్నించడం... ఫొటోలు తీయించడమేమిటని గొంతు పెంచడంతో దూరం పెరిగింది. అక్రమాలపై ఏదీ దృష్టి... వ్రత పురోహితులపై చూపిన శ్రద్ధలో పదో వంతు కేశ ఖండనశాలపై చూపించి ఉంటే అక్కడ రూ.ఏడు లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యేవి కాదు. కేశ ఖండన టిక్కెట్ల స్కాం జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి దేవస్థానంలోని ఏ పాటదారుడైనా పాట సొమ్ము కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప వ్యాపారం నిర్వహణకు అనుమతించరు. అటువంటిది మూడు నెలల సొమ్ము కూడా పూర్తిగా చెల్లించని పాటదారుడిని ఎలా అనుమతించారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. నిబంధనలు ఉల్లంఘించి పాటదారునికి సహకారం అందించడం వల్లనే అలుసుగా తీసుకుని తలనీలాలు మాయం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది నుంచి అక్రమాలు సాగుతున్నా... కేశఖండనశాలలో ఏడాది నుంచి టిక్కెట్ల స్కాం, ఆరు నెలల క్రితం నంచీ తలనీలాలు మాయమవుతున్నా పసిగట్టలేని దుస్థితి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయంటే అది అధికారుల నిర్లక్ష్యమేనని పలువురు ధ్వజమెత్తుతున్నారు. సత్రాల్లో గదులు ఖాళీ అయ్యాక రశీదులు ఇవ్వకుండానే కొంతమంది సిబ్బంది గదులు కేటాయిస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై ఈఓ ఏనాడూ సత్రాల విభాగంపై దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. కేశఖండన స్కాం బయట పడ్డాక మాత్రమే విష్ణుసద¯ŒSను పరిశీలించి అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్ట్ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించారు. సామాన్య భక్తులకు నరకమే... సామాన్య భక్తులు ఎక్కువగా రూ.200 వ్రతాలనే చేయిస్తుంటారు. ఈ వ్రతాలు జరిగే వ్రత మండపాలు మూడే ఉన్నాయి. ఈ మండపాల్లో వ్రతాలు ఆచరించాలంటే సుమారు రెండు గంటలు క్యూలో నిల్చోవాలి. ఆ క్యూ లైన్ల మీద ఎటువంటి పందిరి కాని, షెల్టర్ కాని ఉండదు. పశ్చిమ రాజగోపురం వద్ద గల వ్రతాల కౌంటర్లో ఈ టిక్కెట్లు అమ్మరు. ఆ భక్తులు మెయి¯ŒS కౌంటర్ వద్దకు వెళ్లాల్సిందే. భక్తులు ఎక్కువ ఉన్నా అక్కడ కూడా ఈ వ్రతాలకు టిక్కెట్లు ఇవ్వరు. ఇదేమి అన్యాయమని భక్తులు ప్రశ్నిస్తే రూ.400 వ్రతం టిక్కెట్టు తీసుకోండని సిబ్బంది చెబుతుంటారు. ఎందుకిలా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆలయ ఆదాయం పెంచడానికేనన్న సమాధానం వచ్చేది. దీంతో భక్తులు అటు రూ. 200 టిక్కెట్ దొరక్క ... అటు రూ.400 ఇచ్చి వ్రతం చేసుకోలేక ఇబ్బందులు పడేవారు. కుంటి నడకన ఆదాయం 2016–17లో సత్యదేవుని ఆదాయం రూ.122.59 కోట్లు. గత ఏడాది అంటే 2015–16లో వచ్చిన రూ.118.95 కోట్లతో పోల్చితే ఆదాయం పెరుగుదల కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే. 2013–14లో రూ.72.05 కోట్లు, 2014–15లో రూ.92.93 కోట్లు వచ్చింది. అంటే వరుసగా గత మూడేళ్లలో పెరిగిన ఆదాయం రూ.20 కోట్లు, రూ.25 కోట్లు, రూ.3.5 కోట్లు మాత్రమే. ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు... దేవస్థానంలో గత రెండేళ్లలో ఈఓ తీసుకున్న నిర్ణయాల్లో మెజార్టీ వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు రామాలయం ఆర్చీలకు నల్లరంగు పులిమారు. అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో మళ్లీ తెలపు రంగు వేశారు. అన్ని దేవాలయాల్లో తెల్ల అద్దాలతో పవళింపు మందిరాలు నిర్మిస్తే ఇక్క నల్ల అద్దాలతో నిర్మించారు. ఇక సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో ప్రతిసారీ పొరపాట్లు దొర్లడం కూడా ఇబ్బందికరంగానే తయారైంది. ఇక భక్తులు కొండవీుదకు వచ్చేందుకు తగినన్ని బస్సులు నడపకపోవడం, ఆటోలను అనుమతించకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితి. ఈఓను సాగనంపే యత్నాలు... సత్యదేవుని కల్యాణ ఉత్సవాల వైఫల్యం, దేవస్థానంలో వెలుగు చూస్తున్న అవకతవకలతో దేవస్థానం ఈఓ నాగేశ్వరరావును ఇక్కడ నుంచి సాగనంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ కల్లా కొత్త ఈఓ వస్తారనే ప్రచారం ఊపందుకుంది. -
బాహుబలి 2లో ఐదు తప్పులు..!
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థాయిలో యూనిట్ ప్రసంశల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాహుబలి 2పై తమ అభిప్రాయాలు వెల్లడించగా. యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఆసక్తికరంగా స్పందిచాడు. బాహుబలి 2లో ఐదు తప్పులున్నాయంటూ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకీ విఘ్నేష్ చెపుతున్న ఆ తప్పులేంటంటే. '1. కేవలం 120 రూపాయలకే సినిమా చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం, నిర్మాత కోసం థియేటర్ల ముందు కలెక్షన్ బాక్స్ లు పెట్టాలి. 2. సినిమా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 3. అత్యంత డీటెయిల్డ్ గా సినిమాను చిత్రీకరించటం.. దీని వల్ల ఇన్నాళ్లు తాము పర్ఫెక్ట్ గా సినిమా చేస్తున్నామనుకునే చాలా మంది దర్శకుల తల పొగరు తగ్గుతుంది. 4. ఇది కన్‌క్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ సీరీస్ లో మరో పది సినిమాలు త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాం. 5. భవిష్యత్తు ఎంతో కష్టంగా ఉండనుంది. ఎందుకంటే ఈ స్థాయి రికార్డ్ లను బద్ధలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లు పడుతుంది.' అంటూ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్, రాజమౌళి, ప్రభాస్, రమ్యకృష్ణ, సత్యరాజ్ రానాలకు శుబాకాంక్షలు తెలిపాడు. 5 Mistakes in #Baahubali2 Frm Legend @ssrajamouli sir's Masterpiece! TakeABow@meramyakrishnan #prabas #satyaraj @RanaDaggubati &team pic.twitter.com/GRPD3HLnVH — Vignesh ShivN (@VigneshShivN) 1 May 2017 -
తప్పులు.. తిప్పలు
– డిగ్రీ రెండో సెమిస్టర్ హిందీ ప్రశ్నాపత్రంలో సిలబస్‌లో లేని ప్రశ్నలు – పరీక్షను వాయిదా వేసిన పరీక్షల విభాగం అధికారులు ఎస్కేయూ : డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రశ్న పత్రాల్లో తరచూ తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిందీ పరీక్ష వాయిదా : డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. పోయిట్రీ మూడో సెమిస్టర్‌లోనూ, ప్రోసన్ రెండో సెమిస్టర్లో సిలబస్‌ను ఖరారు చేశారు. అయితే రెండూ కలిపిన సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రాన్ని తాజాగా మంగళవారం జరిగిన పరీక్షలో విద్యార్థులకు అందజేయడంతో గందరగోళం నెలకొంది. పాఠ్యాంశాలకు విరుద్ధంగా ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు దిక్కుతోచలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షను మే 6న నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గతంలోనూ ఇదే తంతు ఇయర్లీ ఎగ్జామ్స్ (సాంవత్సరిక పరీక్షలు)ల్లోనూ ఇవే తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10న జరిగిన డిగ్రీ ఫైనలియర్ స్టాటిస్టిక్స్ ప్రశ్నప్రతంలో పూర్తీగా గణితం సిలబస్‌ను ఇచ్చారు. ఈ నెల 12న జరిగిన పేపర్–4 ప్రశ్నాపత్రం బదులు, మూడో పేపర్‌ను ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన కూడా నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షల్లో అయినా .. ఈ తప్పిదాలకు చోటు చేసుకోకుండా సజావుగా జరుగుతాయని భావించిన నేపథ్యంలో మళ్లీ తప్పులు పునరావృతం అయ్యాయి. సెమిస్టర్ పరీక్ష ప్రారంభంలోనే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో (ఈ నెల 15న జరిగిన పరీక్ష) 15 మార్కులు సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. దీంతో విద్యార్థులు పూర్తీగా నష్టపోతున్నారు. కాలం చెల్లిన విధానాలు ప్రశ్నాపత్రం రూపకల్పనలో కాలం చెల్లిన విధానాలు అనుసరిస్తుండడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశ్నాప్రతం రూపకల్పన అనంతరం సంబంధిత సబ్జెక్టు బోర్డ్ ఆఫ్ స్టడీస్ , పరీక్షల డీన్ సమక్షంలో పరిశీలన జరగాలి. అనంతరం ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్‌కు పంపాలి. ఇలాంటి సాంప్రదాయం కొన్ని వర్సిటీలలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ అధ్యాపకుడు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని నేరుగా ప్రెస్‌కు పంపుతుండటంతో ప్రశ్నాపత్రాల్లో తప్పులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్నాపత్రం తయారు చేసిన వారిదే తప్పు సెమిస్టర్ పరీక్షలో సాంవత్సరిక సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. ఇది పూర్తీగా ప్రశ్నాపత్రం తయారు చేసిన వారి తప్పిదమే. అందుకే పరీక్షను వాయిదా వేశాము. తిరిగి 6న హిందీ పరీక్ష నిర్వహిస్తాం. – ఆచార్య రెడ్డివెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ -
నవ్విపోదురు గాక..
- టీడీపీ సభ్యత్వంలో తిరకాసులెన్నో.. - వైఎస్సార్సీపీ కీలక నేతలూ ‘తమ్ముళ్లేనట’! - ఓటరు జాబితా ఆధారంగా సభ్యత్వ కార్డుల ముద్రణ – అందరికీ అవే పంపిణీ – ససాక్ష్యాలతో బయటపడుతున్న ‘సభ్యత్వ నమోదు’ డొల్లతనం – తీవ్రంగా తప్పుబడుతున్న విపక్షాలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) - ఇది టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో జారీ చేసిన ఆ పార్టీ సభ్యత్వ కార్డు. దీన్ని ఇచ్చింది మాత్రం టీడీపీ కార్యకర్తకు కాదు. ఈ కార్డులో సభ్యత్వం తీసుకున్నట్లు ఉన్న వ్యక్తి పేరు బండి పరుశురాం. ఈయన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు. ప్రతిపక్ష పార్టీలో కీలక అనుబంధ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే టీడీపీ సభ్యత్వ కార్డు జారీ చేయడాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. - ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మంగల అనిల్ కుమార్. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి. ఈయనకూ టీడీపీ సభ్యత్వ కార్డు ఇచ్చేశారు. ఎవరో వచ్చి ఇంట్లోకి ఓ కవర్ విసిరేశారు. దాన్ని చూస్తే టీడీపీ సభ్యత్వ కార్డు. దీంతో అవాక్కవడం అనిల్ వంతైంది. ఈ రెండు ఉదాహరణలను పరిశీలిస్తే టీడీపీ సభ్యత్వ నమోదులో డొల్లతనం బట్టబయలవుతోంది. కనీసం ఎవరు టీడీపీ కార్యకర్తో, ఎవరికి సభ్యత్వం ఉందో.. లేదో? తెలుసుకోకుండానే కేవలం ‘సంఖ్య’ను చూపించుకోవడం కోసం ఇష్టానుసారంగా సభ్యత్వ కార్డులు జారీ చేశారు. ఏదీ పారదర్శకత?! ఏ రాజకీయ పార్టీ అయినా సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్టీ విధివిధానాలు నచ్చి అందులో చేరిన వ్యక్తి సభ్యత్వ నమోదు రుసుం చెల్లించి గుర్తింపు కార్డు తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీల్లో సాధారణంగా జరిగే తంతు ఇది. కొన్ని పార్టీల నాయకులు గ్రామాలు, వార్డుల వారీగా ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో జాబితాను పరిశీలించి వారి తరఫున రుసుం చెల్లిస్తున్నారు. ఇది మరో పద్ధతి! కానీ తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కృతిని తెరపైకి తెచ్చింది. ఎవరు టీడీపీలో ఉన్నారు? ఎవరు సభ్యత్వం తీసుకున్నారనే అంశాలను పట్టించుకోలేదు. వార్డుల వారీగా ఓటరు జాబితాలు తెప్పించుకుని, అందులో 30–40 శాతం మంది సభ్యత్వం తీసుకున్నట్లు చూపించి.. వారి పేరుతో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. కనీసం కార్డుల పంపిణీ ముందైనా టీడీపీ స్థానిక నాయకులు ఇందులో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంకు చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నాయా అనేది పరిశీలించడం లేదు. కార్డులు రాగానే కొంతమంది బాయ్స్‌కు కూలి ఇచ్చి డోర్ నంబర్ల వారీగా ఇళ్లలో ఇచ్చేయాలని చెబుతున్నారు. డెలివరీ బాయ్స్‌కు ఏ కార్డు ఎవరిదో? వారు ఏ పార్టీలో ఉంటారో? వారి స్థాయి ఏమిటో కూడా తెలీదు. దీంతో వారు డోర్ నంబర్ల ఆధారంగా పంపిణీ చేసేస్తున్నారు. ఈ కార్డులు అందుకున్న వైఎస్సార్సీపీ నేతలు అవాక్కవుతున్నారు. ‘సంఖ్య’ కోసమే చేశారా? టీడీపీ అధిష్టానం జిల్లాకు 4,12,290 మందితో సభ్యత్వ నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. కానీ జిల్లా పార్టీ 1,07,147 సభ్యత్వాలు అధికంగా చేసి.. 5,19,437 మందితో సభ్యత్వం చేయించినట్లు లెక్కలు చూపించింది. సభ్యత్వ నమోదులో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద కదిరి 187.97 శాతంతో అగ్రస్థానం, గుంతకల్లు 98.14 శాతంతో చిట్టచివరన ఉన్నట్లు లెక్క చూపారు. వాస్తవ పరిస్థితిని చూస్తే టీడీపీ సభ్యత్వ నమోదు వాస్తవాలకు దూరంగా ఉందని విపక్షాలు తప్పుబడుతున్నాయి. సిగ్గుచేటు : బండిపరుశురాం, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టీడీపీ ఓ సిగ్గులేని పార్టీ. సభ్యత్వ నమోదు చూస్తేనే డొల్లతనం బయటపడుతోంది. లెక్కలన్నీ తప్పుల తడకే. ఓటరు జాబితా ఆధారంగా నమోదు చేస్తే 5లక్షలు కాదు.. జిల్లాలోని ఓటర్లందరికీ టీడీపీ సభ్యత్వ కార్డులే ఇవ్వొచ్చు. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. -
‘పోలీసు’ పరీక్షా ఫలితాల్లో తప్పులు
సరిచేసుకునేందుకు అభ్యర్థుల తిప్పలు ఆందోళన వద్దంటున్న అధికారులు కాకినాడ క్రైం : సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, జైల్ వార్డర్ పోస్టులకు పోలీస్‌శాఖ నియామక మండలి ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీన నిర్వహించిన ఫైనల్ రాత పరీక్షలో ఉత్తీర్ణుల వివరాల్లో అచ్చుతప్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నెల ఆరో తేదీన ఆన్లైన్లో విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో అభ్యర్థుల వివరాలు, కులం, మార్కుల వివరాల్లో ఏమైనా తేడాలుంటే వాటిని సరిచేసుకునేందుకు ఈనెల 7 నుంచి 13వ తేదీ దాకా అవకాశం కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. జాబితాలను డౌ¯ŒSలోడ్ చేసుకున్న దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో అచ్చుతప్పులు ఉండటం చూసి అభ్యర్థులు కంగు తిన్నారు. అభ్యర్థి పేరు దగ్గర పాఠశాలలో చదివిన సంవత్సరం, పదో తరగతి పాసైన సంవత్సరం, పాఠశాల పేరు, అభ్యర్థుల ఇంటి పేర్ల దాకా అన్నింటా అచ్చుతప్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సరిచేసుకునేందుకు మూడు రోజులుగా అధిక సంఖ్యలో అభ్యర్థులు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్న దగ్గర నుంచి ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలు దాకా రెండు సార్లు తమ ఒరిజినల్ సరిఫికెట్లతో సమాచారాన్ని ఇచ్చామని, అయినా సరే దరఖాస్తులో తప్పులు దొర్లడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. ఈ విషయమై అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను వివరణ కోరగా ప్రిలిమినరీ, దేహదారుఢ్య, ఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కుల్లో ఏమైనా తేడాలుంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అభ్యర్థుల పేర్లలో అక్షర దోషాలు, దరఖాస్తుల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఎటువంటి ఆందోళనకు గురికానవసరం లేదని తెలిపారు. -
తప్పుల తడకగా డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
గుత్తి : గత గురువారం ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ సంప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయి. బాగా రాసిన విద్యార్థులకు కూడా 0,1,2,3 చొప్పున మార్కులు వేశారు. అంతేకాకుండా నూరు మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు 70 మార్కులు, 70 మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు వంద మార్కులు చూపించారు. సబ్జెక్ట్ పేర్లు కూడా తప్పుగా వచ్చాయి. దీంతో విద్యార్థు«లు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థులు మార్కుల జాబితా తప్పుల తడకపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఫస్టియర్, సెకెండియర్ విద్యార్థులు ఎస్.సాయి యశ్వంత్, రోషన్, మల్లికార్జున, నవీన్, నరేష్, జిలాన్, మధుమతి, రేణుక తదితరులు మాట్లాడుతూ బాగా రాసిన సబ్జెక్టుల్లో కూడా 0, 1, 2 ,3 మార్కుల చొప్పున వేయడం దారుణమన్నారు. సెకెండియర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్‌కు మాగ్జిమమ్ 70 మార్కులయితే మార్కుల జాబితాలో 100 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మాగ్జిమమ్ మార్కులు 100 ఉండాలని, 70 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా ప్రోగ్రామింగ్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్టుకు మాగ్జిమమ్ మార్కులు 70 ఉండాల్సి ఉండగా 100 మార్కులుగా చూపించారన్నారు. ఇలా ప్రతి పాయింట్ తప్పుగా మార్కుల జాబితా రూపొందించారన్నారు. ఽఅదేవిధంగా ఇంప్రూవ్ మెంట్ రాసిన విద్యార్థులకు కూడా వంద మార్కులకు గాను 0, 1, 2, 12,13, 14 మార్కుల చొప్పున వేశారన్నారు. ఈ విషయంపై శ్రీసాయి డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ శివారెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ ఫస్టియర్, సెకెకండియర్ ఫరీక్షా ఫలితాలు పూర్తి తప్పుల తడకగా ఉన్నాయన్నారు. -
అయ్యా...వీళ్లెవరు?
– ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాలోనూ తప్పులు – టీచర్ల జాబితాలో 88 మంది, పట్టభద్రుల్లో 1,715 మంది ‘థర్డ్ జెండర్లు’ ఉన్నట్లు ధ్రువీకరణ – విద్యాశాఖలో ‘వాళ్లు’ లేనేలేరంటున్న అధికారులు - గుణపాఠం నేర్వని అధికారులు! అనంతపురం ఎడ్యుకేషన్ : అదే జాబితా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు.. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాను పరిశీలిస్తే జిల్లాలో 31 మంది టీచర్లు (స్కూల్ అసిస్టెంట్లు) పురుషకాదు.. మహిళ కాని థర్డ్ జెండర్స్ ఉన్నారు. అనంతపురం నగరంలోని మూడు పోలింగ్ బూత్‌ల్లో పది మంది ఉన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారు చేసిన అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతుండగా.. జిల్లా విద్యాధికారి మాత్రం ‘రికార్డుల ప్రకారం జిల్లాలో ఒక్క టీచరూ థర్డ్ జెండర్కింద లేరు. ఉన్న వారంతా మహిళ, పురుష టీచర్లే.. జాబితాలో అలా ఎందుకొచ్చిందో తెలియద’ని చెప్తున్నారు. పట్టభద్రుల్లో 17,15 థర్డ్ జెండర్లు అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,53,515 మంది ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో పురుషులు 61,081 మంది, మహిళలు 27,402 మంది ఉండగా 777 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో 54,643 మంది పురుషులు, 24,339 మంది మహిళలు ఉండగా 519 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 59,410 మంది పురుషులు, 24,925 మంది మహిళా ఓటర్లు ఉండగా 419 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. మొత్తం మీద 1,75,134 మంది పురుషులు, 76,666 మంది మహిళలు, 1715 మంది థర్డ్ జెండర్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. టీచర్లలో 88 మంది థర్డ్ జండర్లు : మూడు జిల్లాల్లోనూ ఉపాధ్యాయ ఓటర్లు 20,644 మంది ఉన్నారు. జిల్లాల వారిగా చూస్తే అనంతపురంలో 5,149 పురుష టీచర్లు, 2,637 మహిళా టీచర్లు ఉండగా 31 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 3,949 మంది పురుష టీచర్లు, 1,898 మంది మహిళా టీచర్లు ఉండగా 30 మంది టీచర్లు థర్డ్ జెండర్స్ ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 4,499 మంది పురుష టీచర్లు, 2,424 మహిళా టీచర్లుండగా 27 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. మొత్తం మీద 13,597 మంది పురుష టీచర్లు, 6,959 మంది మహిళా టీచర్లు 88 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. మళ్లీ మళ్లీ అవే తప్పులు నవంబరులో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ ఇవే తప్పులు దొర్లితే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అయితే అధికారులు స్పందించి ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని తుది జాబితా విడుదల చేసే నాటికి చిన్నచిన్న తప్పులను సరిదిద్దుతామంటూ సర్ది చెప్పుకున్నారు. అయితే అదే నిర్లక్ష్యం...అవే తప్పులు దొర్లాయనేది తుది జాబితాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.తప్పును సరిదిద్దుకోకుండా మళ్లీమళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే... ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముసాయిదా జాబితా విడుదల చేసిన సమయంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి మల్లీశ్వరదేవిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పైగా తుది జాబితా కూడా తప్పుల తడకగా మారింది. కొన్నిచోట్ల కేజీబీవీ టీచర్ల పేర్లను తొలిగిస్తే.. మరికొన్ని చోట్ల అలానే ఉంచారు. కొందరి టీచర్లు పేర్లు ఉన్నా, స్కూళ్ల పేర్లు కనిపించలేదు. – ఉపాధ్యాయ సంఘాలు జాబితాలోకి వాళ్లెలా వచ్చారో తెలియదు రికార్డుల మేరకు జిల్లాలో ఒక్క ఉపాధ్యాయుడూ థర్డ్ జెండర్ కింద లేరు. ఉన్న ఉపాధ్యాయులంతా పురుష, మహిళలే. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల టీచర్ల తుది జాబితాలో మరి అలా వాళ్లెలావచ్చారో తెలియదు. - శామ్యూల్, జిల్లా విద్యాధికారి, అనంతపురం -
ఉత్తరప్రదేశ్‌లో దారి తప్పుతున్న యువత
-
అన్నీ తప్పులే
– తప్పులు తడకగా వెబ్‌ల్యాండ్ – కంప్యూటీకరణలో తప్పుగా నమోదు చేసిన సిబ్బంది – సరిచేసేందుకు డబ్బుల డిమాండ్ – పట్టించుకోని ఉన్నతాధికారులు – ఇబ్బందుల్లో అన్నదాతలు రైతు కొమ్మెర సుబ్బరాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 2 ఎకరాల పొలం ఉంది. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఏటీపీ 622384. పట్టా నెంబరు 574. సర్వే నెంబరు 18 లో 20 సెంట్లు ఉంది. 2010లో 1–బి తీసుకున్నప్పుడు భూమి విస్తీర్ణం సక్రమంగానే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 18లో అతనికి ఐదు సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదయ్యింది. ––––––––– రైతు కోటకొండ రామప్పనాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 4.44 ఎకరాల భూమి ఉంది. 2015, జూన్ 3న మీ సేవలో 1–బి తీసుకుంటే విస్తీర్ణం సక్రమంగానే ఉంది. తరువాత ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 483లో 39 సెంట్లు, సర్వే నెంబరు 389లో 72 సెంట్ల భూమి నమోదు కాలేదు. వీరిద్దరిలాగే 1–బిలో తప్పుల తడకగా భూములు నమోదు కావడంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుల్ని సరిచేయించుకునేందుకు అగచాట్లు పడుతున్నారు అనంతపురం అర్బన్ : రైతుల భూములకు సంబంధించి 1–బి అత్యంత కీలకమైన ఆధారం. ఇలాంటి కీలక ఆధారానికి సంబంధించి వెబ్‌ల్యాండ్ తప్పుల తడకగా తయారైంది. కంప్యూటీకరణ చేసే క్రమంలో తప్పుగా నమోదు చేశారు. ఈ విషయంలో దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. తప్పులు సరిజేసే విషయంలో ముడుపుల దందాకు శ్రీకారం చుట్టడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. పైకి మాత్రం వెబ్‌ల్యాండ్ పక్కా ఉందంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముడుపుల దందా జిల్లాలోని 7.60 లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటికి సంబంధించి భూ విస్తీర్ణాన్ని వెబ్‌ల్యాండ్‌లో సక్రమంగా నమోదు చేయాలేదు. కొందరి 1–బిలో అదనంగా చేరిస్తే, మరికొందరి 1–బిలో ఉన్న భూమిని తొలగించారు. 1–బిలో వివరాలను సరిచేసేందుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వని వారిని పదేపదే తిప్పుకోవడం, గట్టిగా అడిగితే మీ ఇష్టమొచ్చినచోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇబ్బంది పెడతున్నారు మా నాన్న కొమ్మెర సుబ్బరాయుడుకి సంబంధించి సర్వే నెంబర్ 18లో 20 సెంట్ల స్థలం ఉంటే కేవలం 5 సెంట్లు ఉన్నట్లు 1–బిలో చూపించారు. పట్టాదారు పాసు పుస్తకం తీసుకెళ్లి చూపించినా సరిచేయడం లేదు. ఇదేమని నిలదీస్తే దిక్కున్న చోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు. – కె.రమణ, తలుపుల -
ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఈ తప్పులు చేయొద్దు
అనంతపురం: ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు లావాదేవీలు ఖాతాదారుల ఇళ్ల వద్ద నుంచే అతి సునాయసంగా జరిగిపోతున్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే అసలుకే మోసం వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొట్టే ముఠాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఇలా డబ్బులు పోగొట్టుకున్న బాధితులను వార్తలు నిత్యం చూస్తుంటాం. లాగిన్ అయ్యే సమయంలో ఏమరపాటు అస్సలు పనికిరాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించే ఖాతాదారులు ముఖ్యంగా ఈ 7 అంశాలు గుర్తుంచుకోవాలి. 1. ముఖ్యంగా ఆకర్షణీయ హెడ్లైన్ పెట్టగానే క్లిక్ చేస్తుంటాం. అది పెద్ద ప్రమాదానికే దారి తీస్తుంది. ఈ విషయం మనకు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక్కడ కొన్ని లింక్‌లు ఉంటాయి. ఒక లింక్‌తో మరో లింక్ అంటిపెట్టుకుని ఉండటం వల్ల వైరస్ వ్యాపిస్తుంది. అది మీ వ్యక్తిగత విషయాలను సంఘ విద్రోహక శక్తులకు చేర వేస్తుంది. ముఖ్యంగా మీ పాస్‌వర్డ్‌ను ఇతరులకు తెలియనివ్వకూడదు. 2. సిమ్ స్వాప్ అనేది ఆధునాతన పద్ధతి. ఈ సాంకేతికత వల్ల మీ పేరు, సంప్రదించాల్సిన నంబరు వివరాలు మీకు సంబంధించిన అన్ని బ్యాంకుల్లో నమోదు చేయిస్తే ఏదేని మోసం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. మొబైల్‌కు వెంటనే మెసేజ్ వస్తుంది. 3. ప్రస్తుతం వైఫై సేవలు ఎక్కడ చూసినా సౌలభ్యంగా లభిస్తున్నాయి. మీ వివరాలు మరొకరు తెలుసుకోకుండా ఉండాలంటే తరచూ పాస్వర్డ్ మార్చాలి. అప్పుడు మోసం జరగడానికి వీలుండదు. 4. సోషల్‌మీడియాలో సమాచారాన్ని షేర్ చేసుకోకూడదు. ఫేస్బుక్ ద్వారా హాకర్స్ సమాచారాన్ని సేకరిస్తుంటారు. తర్వాత మోసానికి పాల్పడుతారు. అందువల్ల పూర్తి పేరు, ఫోన్ నంబరు, పుట్టినతేదీ తదితర వివరాలను రహస్యంగా ఉంచడం మంచిది. ఈ సమాచారమే మోసగాళ్లకు ఆయువుపట్టు. 5. చాలావరకూ యాంటీవైరస్‌ను ఎవరూ అప్డేట్ చేయరు. దీనివలన సాఫ్ట్వేర్ వైరస్‌కు గురవుతుంది. యాంటీ వైరస్లు సాఫ్ట్వేర్లు కుండా అడ్డుకుంటాయి. 6. చాలామంది పాస్‌వర్డ్‌ను మర్చిపోకుండా ఉంటామని తమ పుట్టిన తేదీనో, సెల్ నంబరునో పెట్టుకుంటారు. అందువలన మోసగాళ్లు ఇలాంటి సమాచారంతో డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోక పోవడం మంచిది. 7. హాకర్స్‌కి సమాచారం ఇచ్చే నెట్ వ్యవస్థతో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కంప్యూటర్ లాగవుట్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. -
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'